Wednesday, September 30, 2015

ధనుర్వాతము-Tetanus

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- ధనుర్వాతము-Tetanus-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
 •  


 •  ధనుర్వాతము (Tetanus) ప్రాణాంతకమైన వ్యాధులలో ఒకటి. ఈ వ్యాధి 'క్లాస్ట్రీడియం టెటని' (Claustridium tetani) అనే బాక్టీరియా వలన కలుగుతుంది. దవడలు బిగిసే ప్రధాన లక్షణం గల వ్యాధి కనుక దీనిని 'లాక్-జా' (Lock-jaw) అని వ్యవహరిస్తారు. తీవ్రస్థాయిలో వ్యాధిగ్రస్తులు ధనుస్సు లేదా విల్లు లాగా వంగిపోతారు. అందువల్లనే ఈ వ్యాధికి ధనుర్వాతము అనే పేరు వచ్చింది.

వ్యాధికారక సూక్ష్మక్రిములు గడ్డిమేసే జంతువుల పేడ ద్వారా వెలువడి, వీటి స్పోర్లు మట్టిలోను, దుమ్ములోను చాలా కాలం బ్రతికి ఉంటాయి. చర్మం పగుళ్ళు, గాయాలు, జంతువుల కాట్లద్వారా మన శరీరంలో ప్రవేశిస్తాయి. బొడ్డును కోసే పరికరాలు, కట్టే దారం అపరిశుభ్రమైనవైతే, కోసిన బొడ్డుకు బూడిద, పేడ పూయడం ద్వార పురిటి బిడ్డలలో దనుర్వాతం కలుగుతుంది.

సూక్ష్మక్రిములు శరీరంలో ప్రవేశించిన చోటనే, ఆమ్లజని రహిత పరిస్థితులలో వృద్ధిచెంది ఎక్సోటాక్సిన్ (Exotoxin) ను ఉత్పత్తి చేసి అవి రక్తంద్వారా నాడీ మండలాన్ని చేరి వ్యాధి లక్షణాలను కలుగజేస్తాయి. మొదటి సాదారణ లక్షణాలు దవడలు బిగిసి, నోరు సరిగా తెరవ లేకపోవడం, మెడ బిగియడం, శరీరం వంకరలు పోవడం. చంటిపిల్లలు పాలు త్రాగరు. కొద్దిపాటి వెలుతురు, శబ్దం లేక రోగిని ముట్టుకున్నా శరీరం వంకరలు తిరిగిపోరుంది. ఛాతీ కండరాలు దెబ్బతిని మరణం సంభవించవచ్చును. ఈ వ్యాధి అంతర్గతకాలం (Incubation period) సాధారణంగా 3 నుండి 21 రోజులు.

చికిత్స

    గాయాన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్ తో శుభ్రపరచాలి.
    రోగిని వెలుతురు, శబ్దం లేని గదిలో ఉంచాలి. అనవసంగా ముట్టుకోవద్దు.
    వైద్యసలహాతో Anti-Tetanus Serum (ATS) వాడాలి.
    గొట్టం ద్వారా ఆహారం మరియు శ్వాస అవసరం.

ముందు జాగ్రత్త చర్యలు

    గర్భవతులకు టి.టి. మరియు పిల్లలకు డి.పి.టి, డి.టి., టి.టి. టీకాలు షెడ్యూలు ప్రకారం ఇప్పించాలి.

ధనుర్వాతంతో జాగ్రత్త!
వానకాలం మొదలయ్యిందంటే పెరట్లో పాదులు తీయటం, మొక్కలు నాటటం వంటివి మామూలే. చాలామంది కాళ్లకు చెప్పులు వేసుకోకుండానే మట్టిలోకి దిగి ఇలాంటి పనులన్నీ చేసేస్తుంటారు. ఇలాంటి పనులకు దిగేముందు ధనుర్వాతం.. అదే టెటనస్‌ (టీటీ) టీకా ఎప్పుడు వేయించుకున్నారో కూడా గుర్తుకుతెచ్చుకోండి. ఎందుకంటే చేతులకు, కాళ్లకు ఏవైనా గీరుకుపోవటం, చిన్నపాటి గాయాలు సైతం ధనుర్వాతానికి దారితీయొచ్చు. చాలామంది తుప్పుపట్టిన మేకులు గుచ్చుకోవటం, పెద్దపెద్ద గాయాలతోనే ధనుర్వాతం వస్తుందని అనుకుంటుంటారు. నిజానికి ధనుర్వాతాన్ని తెచ్చిపెట్టే బ్యాక్టీరియా సిద్ధబీజాలు మట్టి, దుమ్ము, జంతువుల వ్యర్థాలు.. ఇలా వేటిలోనైనా, ఎక్కడైనా ఉండొచ్చు. ఇవి సాధారణంగా చర్మం మీద గాటు పడినచోటు నుంచి రక్తం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. అనంతరం వృద్ధి చెందుతూ కొన్ని విషతుల్యాలను విడుదల చేస్తాయి. ఈ విషతుల్యాలు ముందుగా గాయానికి చుట్టుపక్కల చర్మంలోని నాడులను దెబ్బతీస్తాయి. క్రమంగా విస్తరిస్తూ వెన్నుపాముకు, మెదడుకు వ్యాపిస్తాయి. ఇలా చూస్తుండగా కొన్నిరోజుల్లోనే ధనుర్వాతం తీవ్రమవుతూ వస్తుంది. మెడ బిగుసుకుపోవటం, మింగటంలో ఇబ్బంది, కడుపు బల్లలాగా గట్టిపడటం వంటి లక్షణాలు మొదలవుతాయి. విషతుల్యాలు విస్తరిస్తున్నకొద్దీ కండరాలు గట్టిగా కుంచించుకుపోవటం.. చివరికి దవడ పూర్తిగా బిగుసుకుపోవటం సంభవిస్తుంది. ఒకసారి ధనుర్వాతం ఆరంభమైతే ఇక ఆగటమనేది ఉండదు. ధనుర్వాతాన్ని నియంత్రించటం తప్ప పూర్తిగా నయం చేయలేం. అయితే మంచి విషయం ఏంటంటే.. దీన్ని టీకాతో సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ప్రతి పదేళ్లకు ఒకసారి టీకా తీసుకుంటే ధనుర్వాతం బారినపడకుండా చూసుకోవచ్చు. పెద్ద గాయాలే కాదు. కీటకాలు, జంతువులు కరవటం.. చర్మం గీసుకుపోవటం ద్వారా కూడా ధనుర్వాతం వచ్చే అవకాశముంది. కాబట్టి ముందే టీటీ టీకా తీసుకోవటం మంచిది.

 • ==========================

Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, September 22, 2015

Phymosis and ParaPhymosis-ఫైమోసిస్ మరియు పేరాపైమోసిస్

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Phymosis and ParaPhymosis-ఫైమోసిస్ మరియు పేరాపైమోసిస్ -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...ప్
 •  

 • Phymosis and ParaPhymosis-ఫైమోసిస్ మరియు పేరాపైమోసిస్

జననాంగాలకు సంబంధించిన విషయాల గురించి మన సమాజంలో చక్కటి ఆరోగ్యకరమైన సమాచారం, చర్చ జరిగేదే తక్కువ. అందులో పురుషాంగం చివ్వర ఉండే ముందోలు వంటి చిన్నచిన్న నిర్మాణాల గురించి ఎవరూ పెద్దగా మాట్లాడరు, అందుకు ఇష్టపడరు కూడా. కానీ నిజానికి వీటికి సంబంధించిన విజ్ఞానం తెలిసి ఉండటం ప్రతి ఒక్కరికీ అవసరం. పురుషాంగం చివ్వర ఉండే ఈ సున్నితమైన చర్మాన్ని.. 'ముందోలు' అనీ, 'పూర్వచర్మం' అనీ (ఇంగ్లీషులో ప్రొప్యూజ్‌, ఫోర్‌స్కిన్‌).. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. మగబిడ్డ పుట్టిన దగ్గరి నుంచీ పురుషుడికి మలివయసు వచ్చే వరకూ జీవితంలోని ప్రతి దశలోనూ దీనికి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు. చిన్న పిల్లల్లో ముందోలు బిగుతుగా ఉండి, మూత్ర విసర్జనలో ఇబ్బందులు రావటమన్నది తరచుగా చూసేదే. అలాగే పెళ్త్లెన కొత్తలో తలెత్తేవి, శృంగార జీవితాన్ని ఉన్నట్టుండి ఇబ్బందిపెట్టే సమస్యలూ కొన్ని ఉంటాయి. ఈ నేపథ్యంలో ముందోలు గురించి, దీనికి వచ్చే సమస్యల గురించి కొంత తెలుసుకోవటం మంచిది.

పుట్టుకతో అతుక్కునే!
సాధారణంగా మగబిడ్డ పుట్టినపుడు- శిశువు అంగం ముందు భాగానికి (శిశ్నానికి), పైచర్మం అతుక్కొనే ఉంటుంది. మన వేలికి గోరు అతుక్కుని ఉన్నట్టు.. ఇంకా తేలికగా చెప్పుకోవాలంటే పుట్టగానే పిల్లిపిల్ల కనురెప్పలు అతుక్కుని ఉన్నట్టు.. శిశ్నం, దాని మీద చర్మం రెండూ అతుక్కుపోయే ఉంటాయి. పుట్టినపుడు కేవలం 4% మగ పిల్లల్లోనే ఈ ముందోలు చర్మం విడివడి కదులుతుంటుందని, సాధారణంగా మిగతా వారందరిలోనూ ఇవి అతక్కుపోయే ఉంటోందని వైద్యులు గుర్తించారు. బిడ్డ వయసు పెరుగుతున్నకొద్దీ నెమ్మదిగా శిశ్నం, దాని మీదుండే చర్మం క్రమేపీ విడివడతాయి. ఈ రెండూ పూర్తిగా విడివడితేనే.. పూర్వచర్మాన్ని వెనక్కిలాగటమన్నది (రిట్రాక్షన్‌) సాధ్యమవుతుంది. ఇవి పూర్తిగా విడివడటమన్నది 8-9 ఏళ్లకు గానీ పూర్తవదు. కొందరిలో మరి కొంతకాలం కూడా పట్టొచ్చు. కాబట్టి పూర్వచర్మానికి సంబంధించి ఏదైనా సమస్య తలెత్తితే తప్పించి.. 8-10 ఏళ్లు వచ్చే వరకూ కూడా బలవంతంగా ఈ ముందోలును వెనక్కి లాగే ప్రయత్నం చెయ్యకూడదు. అలాంటి అవసరమేమీ ఉండదు. ఒకసారి ఈ రెండూ విడిపోతే శిశ్నం మీద పూర్వచర్మం ముందుకూ, వెనక్కూ తేలికగా కదులుతూ ఉంటుంది.

పూర్వచర్మం అనేది నిజానికి రెండు పొరల కలయిక. దీనిలో పైపొర పొడిగా, పైనుంచి వచ్చే పురుషాంగ చర్మంలాగే ఉంటుంది, లోపలి వైపు మాత్రం ఇది మృదువుగా మన కనురెప్పల్లోని, నోటిలోని జిగురుపొరల్లా ఉంటుంది. దీని నుంచి నిరంతరం కొన్ని స్రావాలు ఊరుతుంటాయి. లోపల ఎప్పటికప్పుడు ఊడి, రాలి పోతుండే మృత చర్మ కణాలూ, ఈ స్రావాలూ కలిసి.. శిశ్నం మీద తెల్లటి ముద్దలా, పెరుగు మీది తరకల్లా ఏర్పడుతుంటాయి. దీన్నే 'స్మెగ్మా' అంటారు. ఒకసారి పూర్వచర్మం విడివడి, దాన్ని వెనక్కి లాగటం సాధ్యమవుతున్న తర్వాత.. తరచుగా దాన్ని వెనక్కి తీసి, ఈ స్మెగ్మాను శుభ్రం చేసుకోవటం అవసరం. మన నాలుక కింద ఉండే కుట్టులా.. పూర్వచర్మాన్ని పురుషాంగానికి అనుసంధానిస్తూ- కిందివైపు చిన్న కుట్టు లాంటిది (ఫ్రెన్యులం) ఉంటుంది. ఈ చర్మం అవసరమైతే సాగేలా, మళ్లీ దగ్గరకు ముడుచుకునేలా ప్రత్యేక నిర్మాణాలూ ఉంటాయి. శిశ్నాన్ని కప్పుకొని ఉండే ఈ పూర్వచర్మం ముందువెనకలకు కదులుతూ.. పురుషాంగం స్తంభించినప్పుడు వెనక్కి వెళుతుంటుంది. ఇది బిగుతుగా ఉంటే సమస్యే.

పిల్లల్లో ఫైమోసిస్‌!
కొందరు పిల్లల్లో పురుషాంగం మీద ఉండే ముందోలు చాలా బిగుతుగా ఉండటం వల్ల సమస్యలు తలెత్తుతుంటాయి. దీన్నే 'ఫైమోసిస్‌' అంటారు. ఈ చర్మం బిగుతుగా ఉండటం వల్ల మూత్రం పోసుకునేటప్పుడు సమస్యలు రావచ్చు. ఈ బిగుతువల్ల మూత్రం పూర్తిగా బయటకు రాకుండా కొంత లోపలే ఉండిపోతుంటుంది. కొన్నిసార్లు మూత్రమార్గ రంధ్రాన్ని కూడా ఇది కప్పుకొని ఉండటం వల్ల మూత్రం ఈ చర్మం కిందకు వెళ్లిపోయి.. మూత్రవిసర్జన సమయంలో పురుషాంగం చివర బెలూన్‌లాగా ఉబ్బుతుంటుంది. అలాగే ముందోలు బిగువుగా ఉన్నవాళ్లు మూత్ర విసర్జనకు ఎక్కువ సమయం తీసుకుంటారు. మూత్రం ధార కూడా చిన్నగా ఉంటుంది. వీళ్లు బాగా కష్టపడి విసర్జన చేస్తుంటారు. కొన్నిసార్లు ఈ పూర్వచర్మం, శిశ్నం మధ్య మూత్రం చేరటం వల్ల ఇన్ఫెక్షన్లూ తలెత్తుతాయి. శిశ్నం వాచిపోయి 'బెలనోపాస్టయిటిస్‌' సమస్యకు దారితీయొచ్చు. అరుదుగా ఈ ఇన్ఫెక్షన్‌ మూత్ర నాళం ద్వారా పైకి పాకి మూత్రాశయం, కిడ్నీలకూ వ్యాపించొచ్చు. అందుకే పిల్లలకు పూర్వచర్మం బిగువుగా ఉండి, మూత్రవిసర్జనలో సమస్యలు ఎదురవుతుంటే సత్వరమే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లటం అసవరం.

ఇలా మూత్ర విసర్జన సమయంలో అంగం ముందు భాగంలోని చర్మం ఉబ్బుతున్నపుడు, తరచుగా ఇన్ఫెక్షన్లు, జ్వరం వేధిస్తున్నప్పుడు, మూత్రం ధార సన్నగా వస్తున్నప్పుడు.. వైద్యులు సాధారణంగా సున్తీ చెయ్యటం అవసరమని సిఫార్సు చేస్తారు. దీనికి ముందు కొంతకాలం స్టిరాయిడ్‌ ఆయింట్‌మెంట్ల వంటివి రాసి చూడొచ్చుగానీ దీనికి సున్తీ శాశ్వత పరిష్కారం. సున్తీ ఇష్టం లేనివారికి ముందు చర్మాన్ని కొంత కత్తిరించే (స్లిట్‌) సర్జరీ విధానాలూ అందుబాటులో ఉన్నాయి.

సున్తీ అనేది చిన్నపాటి సర్జరీ ప్రక్రియేగానీ దీన్ని శాస్త్రీయ పద్ధతిలో చేయించటం మంచిది. ఈ సర్జరీకి ముందు కొన్ని రక్తపరీక్షలు, ముఖ్యంగా రక్తం గడ్డకట్టే సమయం (బ్లీడింగ్‌, క్లాటింగ్‌ టైమ్‌) వంటి పరీక్షలు చేయటం అవసరం. రక్త సమస్యలేవైనా ఉంటే సున్తీ చెయ్యకూడదు. అలాగే పిల్లలకు నొప్పి, బాధ తెలియకుండా మత్తుమందు ఇచ్చి, ముందుగా ధనుర్వాతం రాకుండా టీటీ ఇంజక్షన్‌ ఇచ్చి సున్తీ చెయ్యాలి.

సంశయం అక్కర్లేదు..
నిజానికి మగపిల్లలకు పుట్టగానే లేదా చిన్నవయసులోనే చిన్నపాటి సర్జరీ వంటి ప్రక్రియతో ముందోలు తొలగించటమన్నది (సున్తీ) మతాచార కారణాలరీత్యా చాలా సమూహాల్లో, చాలా సమాజాల్లో పరంపరాగతంగా వస్తోంది. సున్తీ వల్ల హెచ్‌ఐవీ వంటి వ్యాధుల వ్యాప్తి కూడా తగ్గుతోందని, పురుషాంగ క్యాన్సర్లూ రావటం లేదని వైద్యరంగం గుర్తించింది. ఈ నేపథ్యంలో ముందోలు గురించి, అసలు దీనికేదైనా ప్రాధాన్యం ఉందా? లేదా? అన్నదాని గురించీ వైద్య పరిశోధనా రంగంలోనూ, బయటా కూడా ఎన్నో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కొందరు దీనికి ఎలాంటి ప్రత్యేక ప్రాధాన్యం లేదంటే మరికొందరు జీవపరిణామంలో ప్రాధాన్యం లేని అవయవమేదీ కొనసాగదంటూ రకరకాలుగా విశ్లేషిస్తుంటారు. మరి దేనిమీదా లేనంతటి విస్తృత చర్చ ఈ చిన్న చర్మం పొర మీద జరుగుతోందంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ పూర్వచర్మం బిగుతుగా ఉండి ఇబ్బందిపెట్టటం వంటి సమస్య ఏదైనా తలెత్తినప్పుడు ముందోలును తొలగించటానికి సందేహించాల్సిన అవసరం లేదని వైద్యరంగం స్పష్టంగా సిఫార్సు చేస్తోంది.

పెద్దయ్యాకా రావచ్చు
పెద్దవయసులో ముందోలు బిగుతుగా మారి, అది ఫైమోసిస్‌ సమస్యగా తయారవటమన్నది సాధారణంగా మూడు దశల్లో ఎక్కువగా చూస్తుంటాం.

1. పెళ్త్లెన కొత్తలో. ఇది చాలా వరకూ పూర్వచర్మం బిగుతుగా ఉండటం వల్ల సంభోగ సమయంలో నొప్పి, బాధ, గట్టిగా ప్రయత్నిస్తే చర్మం చినిగి, చిట్లినట్లవటం వంటి కారణాల వల్ల వస్తుంది.

2. నడి వయసులో, అంటే 35-40 ఏళ్ల వయసులో పూర్వచర్మం ముందుకూ వెనక్కూ కదలకుండా బిగిసినట్త్లె, వాచి ఫైమోసిస్‌ రావచ్చు. ఈ వయసులో ఇలా వచ్చిందంటే చాలా వరకూ మధుమేహం వచ్చి, దాన్ని గుర్తించకపోవటమే కారణమవుతుంటుంది.

3. వృద్ధాప్యంలో. ఉన్నట్టుండి పూర్వచర్మం వాచి, బిగిసిపోయి 'ఫైమోసిస్‌' రావచ్చు. ఈ వయసులో ఇలా వస్తే అంగం చివరి నుంచి రక్తం, చీము వంటి స్రావాలు వస్తున్నాయేమో చూడటం అవసరం. ఎందుకంటే కొన్నిసార్లు పురుషాంగ క్యాన్సర్‌లో కూడా ఇలాంటి లక్షణాలు కనబడతాయి. కాబట్టి ఏ వయసులోనైనా పూర్వచర్మం కదలటం కష్టంగా తయారై, బాధలు మొదలైతే దాన్ని వైద్యుల దృష్టికి తీసుకువెళ్లటం ఉత్తమం.

యుక్తవయసులో
కొందరికి యుక్తవయసు వచ్చిన తర్వాత కూడా పూర్వచర్మం, అది తెరుచుకునే మార్గం సన్నగా ఉంటుంది. దీంతో పెళ్లయ్యాక శృంగారంలో పాల్గొన్నప్పుడు.. చర్మం బలంగా వెనక్కి లాగినట్త్లె.. ఆ సున్నితమైన చర్మం చిరిగి, గాట్లు పడుతుంది. కొందరికి అంగం మామూలుగా ఉన్నప్పుడు చర్మం తేలికగానే వెనక్కి వస్తున్నప్పటికీ.. స్తంభించినప్పుడు అంగం పరిమాణం పెరిగి చర్మం వెనక్కి రావటం కష్టమవుతుంటుంది. దీంతో చర్మం చిరిగినట్త్లె రక్తస్రావం అవుతుంది. క్రమేపీ ఇది మానిపోవచ్చుగానీ ఆ మానిన చోట చర్మం కొంత బిగువుగా ఉంటుంది. దీంతో ఆ తర్వాత మళ్లీ వెనక్కిలాగినప్పుడు అదే ప్రదేశంలో మళ్లీ చినుగుతుంటుంది. ఇలా తరచూ చిట్లటం, మానటం జరుగుతూ.. ఇదో ఇబ్బందికర వ్యవహారంగా తయారవుతుంది. యుక్తవయసులో, ముఖ్యంగా పెళ్త్లెన కొత్తలో, శృంగారంలో పాల్గొన్నపుడు ఈ సమస్య బాగా బాధిస్తుంటుంది. కొందరికి అసలు ముందోలు వెనక్కే రాకపోవచ్చు, మరికొందరికి కొంత భాగమే వెనక్కి వచ్చి, తరచూ చిరుగుతుండొచ్చు.

చికిత్స: పూర్వచర్మం బిగుతుగా ఉంటే.. రోజూ దాన్ని నెమ్మదిగా, కొద్దికొద్దిగా వెనక్కిలాగేందుకు ప్రయత్నించటం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది. కొందరికి వైద్యులు స్టిరాయిడ్‌ క్రీములు ఇచ్చి.. రోజూ రెండుమూడుసార్లు పూర్వచర్మం మీద రాస్తుండమని చెబుతారు. దీనివల్ల చర్మం పల్చబడి, మృదువుగా వెనక్కిలాగటం తేలికయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే అందరి విషయంలోనూ ఈ క్రీములతో అంత ఉపయోగం ఉండకపోవచ్చు. వీరికి చిన్న సర్జరీ చేసి, పూర్వచర్మాన్ని తీసెయ్యటం (సున్తీ) తేలికైన పరిష్కారం. పాశ్చాత్య దేశాల్లో కొందరు పూర్వచర్మాన్ని తీసేయించుకోవటానికి ఇష్టపడరు. ఇలాంటి వారికి 'ప్రొప్యూజియోప్లాస్టీ' లేదా 'వై-వీ ప్లాస్టీ' వంటివి చేసే అవకాశం ఉంటుందిగానీ వీటితో ఫలితాలు అంత సహజంగా కనిపించకపోవచ్చు. సున్తీ అనేది సాధారణంగా అక్కడే మత్తు ఇచ్చి చేసేస్తారు, చాలా తేలికైన సురక్షితమైన పద్ధతి, కొద్ది గంటల్లోనే ఇంటికి వెళ్లిపోవచ్చు. కాకపోతే దీనితో ఉండే ఒకే సమస్య ఒకట్రొండు రోజులు కొంత నొప్పి ఉండొచ్చు. ముఖ్యంగా అప్పటి వరకూ పూర్వచర్మం కింద ఉండిపోయిన శిశ్నం- ఒక్కసారిగా బయటపడినట్లయ్యే సరికి కొద్దిరోజులు అది సున్నితంగా అనిపిస్తూ, ఏది తగిలినా జివ్వుమనటం, బట్టలు వేసుకోవటం కష్టం కావటం వంటి ఇబ్బందులుండొచ్చు. ఇది 5-7 రోజుల్లో దానంతట తగ్గిపోతుంది. ఈ లోపు శిశ్నం మరీ సున్నితంగా అనిపించకుండా, కాస్త మొద్దుబారినట్లయ్యేందుకు దాని పైనరాసే క్రీముల వంటివి ఇస్తారు.

పెళ్త్లెన కొత్తలో కుట్టు తెగితే...
* పెళ్త్లెన కొత్తలో తరచుగా చూసే సమస్య ముందోలుకు కిందగా ఉండే చిన్న కుట్టు తెగిపోవటం. కొందరికి ఇది మరీ చిన్నగా, బిగుతుగా ఉండి.. పెళ్త్లెన కొత్తలో సంభోగానికి ప్రయత్నించగానే అది చినిగినట్త్లె నొప్పి బాధతో పాటు దాన్నుంచి కొద్దిగా రక్తం కూడా వస్తుంటుంది. ఇలా ఫ్రెన్యులం చినిగి, ఇబ్బందిగా ఉన్నవాళ్లు సంభోగ సమయంలో కదలికలు మృదువుగా ఉండేందుకు లూబ్రికెంట్ల వంటివి (కేవై జెల్లీ, లూబిజెల్‌ లేదంటే మామూలు కొబ్బరినూనె అయినా సరే) వాడటం మంచిది. ఫ్రెన్యులం పొట్టిగా ఉండి, సరైన స్రావాలు లేకుండా సంభోగానికి ప్రయత్నిస్తే అదిచినిగే, తెగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తెగినది దానంతట అదే మానుతుంది, అప్పటి వరకూ సంభోగానికి దూరంగా ఉండటం మంచిది. ఒక వారం పది రోజులకు అది మానిపోతుంది, అప్పుడు లూబ్రికెంట్‌ వాడుకుంటూ మళ్లీ సంభోగానికి ప్రయత్నించొచ్చు. మళ్లీ ఇదే పరిస్థితి తలెత్తి.. కుట్టు దగ్గర తరచూ చినుగుతుంటే మాత్రం- వీరికి ఇతరత్రా ముందోలు బిగువుగా ఉండటం వంటి సమస్యలేమీ లేకపోతే వైద్యులు 'ఫ్రెన్యులోప్లాస్టీ' అనే చిన్న సర్జరీ చేసి, ఆ కుట్టును తిరిగి దగ్గరకు లాగి సరిచేస్తారు.

బిగిసిపోతే...
* కొత్తగా పెళ్త్లెన వారిలో చాలా తరచుగా చూసే మరో సమస్య... ముందోలు కొంత బిగువుగా ఉండి, సంభోగ సమయంలో అది వెనక్కివచ్చి అక్కడే ఒక రింగులా బిగిసిపోవటం! దీన్నే 'పారా ఫైమోసిస్‌' అంటారు. ఇలా బిగిసిన దాన్ని ముందుకు లాగటం చాలా బాధాకరంగా, కష్టంగా తయారవుతుంది. దీంతో చాలామంది నొప్పికి భయపడి, దాన్ని రెండు-మూడు రోజుల పాటు అలాగే వదిలేస్తారు. ఇది చాలా ఇబ్బందిపెట్టే సమస్య. దీన్ని సాధ్యమైనంత త్వరగా.. అంటే సంభోగం తర్వాత అరగంట లోపైనా మెల్లగా ముందుకు తేవటం మంచిది. అలా చెయ్యకుండా వదిలేస్తే ఆ చర్మం వాచిపోతుంది. ఆ స్థితిలో దాన్ని ముందుకు లాగటం మరీ కష్టం, వదిలేస్తేనేమో వాపు ఇంకా పెరుగుతుంటుంది. రింగులా తయారై ఈ చర్మం వాచినకొద్దీ శిశ్నం మీదా ఒత్తిడి పెరిగి, అదీ వాచిపోవటం ఆరంభమవుతుంది. కొన్నిసార్లు ఆ రింగులాంటి చర్మానికి రక్తసరఫరా తగ్గిపోయి, అది పుండులా తయారవటం వంటివీ జరుగుతాయి. ఈ స్థితిలో సాధ్యమైనంత త్వరగా పూర్వచర్మాన్ని ముందుకు లాగటం ముఖ్యం. అవసరమైతే వైద్యులు ఆ కాస్త ప్రదేశానికీ మత్తు ఇచ్చి అయినా.. దాన్ని ముందుకు తెస్తారు. మరీ ఇబ్బందిగా ఉంటే చిన్న కోతబెట్టి దాన్ని వదులు చెయ్యాల్సి వస్తుంటుంది. సమస్య మరీ తీవ్రంగా ఉన్నవారికి అవసరమైతే ఆ వాపు, బాధలన్నీ తగ్గిన తర్వాత సున్తీ చేస్తారు.

మధ్యవయసులో..
35-40 ఏళ్ల వయసులో ఈ ముందోలు వాపు, నొప్పి, బిగిసిపోవటం వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే 'బెలనోపాస్టయిటిస్‌' అంటారు. ఇలా వస్తే మనం తక్షణం చెయ్యాల్సిన పని- మధుమేహం ఉందేమో పరీక్ష చేయించుకోవటం! ఎందుకంటే మధుమేహుల్లో ఈ సమస్య చాలా ఎక్కువ. చాలామందిలో మధుమేహం తొలిసారిగా ఇలాగే బయటపడుతుంటుంది కూడా. మధుమేహుల మూత్రంలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ మూత్రం పూర్తిగా బయటకు వెళ్లకుండా కొంత లోపలే చేరటం వల్ల ఈ ప్రాంతంలో ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ అయితే నొప్పి, ఎర్రగా వాచిపోవటం వంటి లక్షణాలుంటాయి. యాంటీబయోటిక్స్‌ చికిత్సతో ఇది తగ్గుతుంది. కొందరిలో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు కూడా ఉండొచ్చు. ముఖ్యంగా క్యాండిడ్‌ వల్ల వచ్చేవే ఎక్కువ. దీని లక్షణం ప్రధానంగా దురద. పెరుగు తరకల్లా తెల్లటి స్రావం వెలువడుతుంటుంది. పెళ్త్లెన వారిలో, ముఖ్యంగా మధుమేహులకు ఈ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి ఎవరికైనా సరే, మధ్య వయసులో 'ఫైమోసిస్‌' వస్తే ముందుగా గ్లూకోజు పరీక్ష చేయించుకొని, మధుమేహం ఉందేమో చూసుకోవాలి. వైద్యులు యాంటీబయాటిక్స్‌ లేదా యాంటీఫంగల్‌ మందులు సిఫార్సు చేస్తారు, వీటితో సమస్య తగ్గిపోతుంది. ఆ తర్వాత మధుమేహాన్ని కచ్చితంగా నియంత్రణలో ఉంచుకుని, రోజూ పురుషాంగ శుభ్రత పాటిస్తే ఇబ్బంది మళ్లీ రాకపోవచ్చు. వీరికి చాలావరకూ సున్తీ అవసరం కూడా ఉండదు. అలా కాకుండా తరచూ ఈ సమస్య ఎదురవుతూ, యాంటీబయాటిక్స్‌ వాడాల్సి వస్తుండటం, మధుమేహం నియంత్రణలో ఉన్నా కూడా ఇన్ఫెక్ఫన్లు రావటం వంటి సందర్భాల్లో వీరికీ సున్తీ చెయ్యటం మంచిది.

తెల్లబడిపోవటం
ముందోలు విషయంలో తరచుగా చూసే మరో సమస్య 'బెలనైటిస్‌ జెరోటికా ఒబ్లిటరాన్స్‌ (బీఎక్స్‌వో)'. ముందోలు చర్మమంతా తెల్లగా తయారై ఇబ్బంది మొదలవుతుంది. మూత్రంలో ఉండే అమ్మోనియా ఎప్పుడూ తగులుతుండటం వల్ల ఈ చర్మం చికాకుకు గురై, ముందోలు, శిశ్నం తెల్లగా తయారవుతాయి. దీనివల్ల పూర్వచర్మం బిగుతుగా కూడా తయారై ఫైమోసిస్‌ రావచ్చు. ముఖ్యంగా తరచూ అమ్మోనియా తగలటం వల్ల మూత్రమార్గం సన్నబడిపోవచ్చు. ఇలాంటివారికి సున్తీ చేసి ముందోలు తీసేస్తేనే అయిపోదు, సన్నబడిన మూత్రమార్గాన్ని కొద్దిగా వెడల్పు కూడా చెయ్యాల్సి (డైలేషన్‌) రావచ్చు.

వృద్ధుల్లో..
ఎవరికైనా- అప్పటి వరకూ ఎలాంటి సమస్యా లేకుండా అంతా బానే ఉండి, వృద్ధాప్యంలో ఉన్నట్టుండి పూర్వచర్మం బిగిసిపోయిందంటే వెంటనే మేలుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాశ్చాత్య దేశాలతో పోలిస్తే.. మన దేశంలో పురుషాంగ క్యాన్సర్‌ ఎక్కువ. వృద్ధాప్యంలో పూర్వచర్మం బిగిసిపోవటంతో పాటు పురుషాంగం నుంచి రక్తం లేదా చీములాంటిది వస్తుంటే ముందుగా క్యాన్సర్‌ను అనుమానించాలి. శిశ్నం మీద కణితి ఏర్పడితే సైజు పెరుగుతుంది కాబట్టి ముందోలు వెనక్కి రావటం కష్టమవుతుంది. చిన్నప్పుడు సున్తీ చేయించుకున్నవారికి పురుషాంగ క్యాన్సర్‌ రావటం అరుదు. కానీ ఇలాంటి ఆచారం లేనివారిలో సరైన పరిశుభ్రత పాటించకపోవటం, హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్ల వంటివి పురుషాంగ క్యాన్సర్‌కు దోహదం చేస్తాయి. ఇది ప్రధానంగా అంగ శుభ్రతతో కూడా ముడిపడిన వ్యవహారం కాబట్టి మన దేశంలో ఇది కొంత ఎక్కువగానే కనబడుతోంది. అందువల్ల వృద్ధాప్యంలో హఠాత్తుగా ముందోలు బిగుసుకుపోతే క్యాన్సర్‌ను అనుమానించాలి. ఇలాంటివారిలో శిశ్నాన్ని పట్టుకొని చూస్తే చేతికి గట్టిగా తగలటం గమనించొచ్చు. అనుమానం వస్తే బయాప్సీ చేసి క్యాన్సర్‌ను నిర్ధరిస్తారు. వీరికి సున్తీ చేస్తే పుండు మానటం వంటివన్నీ కష్టమవుతాయి కాబట్టి పూర్వచర్మం మీద 'డోర్సల్‌ స్లిట్‌' అనే పద్ధతిలో చిన్న కోత పెట్టి లోపల ఏముందో చూస్తే కణుతుల వంటివి ఉంటే కనబడతాయి. వాటి నుంచి అవసరమైతే ముక్క తియ్యటం, లేకుంటే కొన్నిసార్లు సున్తీ చేసి, ఆ పూర్వ చర్మాన్ని పరీక్షకు పంపించటం వంటివి చెయ్యాల్సి ఉంటుంది.
శుభ్రత ప్రధానం
చిన్నపిల్లల్లో ముందోలును బలవంతంగా వెనక్కి లాగాల్సిన పనిలేదు. వయసుతో పాటు దానంతట అదే వదులవుతుంది. అది వెనక్కి వస్తున్న పిల్లలు, పెద్దలంతా కూడా ప్రతిరోజూ స్నానం చేసేటప్పుడు ఒక్కసారి పూర్వచర్మాన్ని వెనక్కి తీసి, శిశ్నాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవటం అవసరం. పిల్లలకు చిన్నతనం నుంచే దీన్ని అలవాటుచెయ్యటం మంచిది. దానివల్ల సమస్యలు చాలా వరకూ రావు.


--డా .హనుమంతరావు , పిడియాట్రిక్ సర్జెన్‌ ,జనరల్ హాస్పిటల్ , కర్నూల్ .
--డా.కె.సుభ్రమణ్యం ,యూరోలజిస్ట్ ,అపోలో హాస్పిటల్ , హైదరాబాద్ 
 •  ==================================

Wednesday, September 16, 2015

stress in humans- మనుషులలో ఒత్తిడి

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు ---stress in humans- మనుషులలో ఒత్తిడి -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

కాలంతోపాటు మానవజీవితంలో ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయి. కొత్త కొత్త విషయాలు ఆవిష్క రింపబడుతూ ఎన్నో జబ్బులకి పరిష్కారం అందించ బడుతున్నా రకరకాల రోగాలు మనుషుల పాలిట శత్రువుల వుతున్నాయి. బి.పి, షుగర్‌, గుండెపోటు లాంటివి మనిషిని నిర్వీర్యం చేస్తున్నాయి. కాలంలో వచ్చే మార్పుల్లో ఇప్పుడు వేగం ఒకటి. ఈ స్పీడు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ మనుగడ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయ త్నంలో ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఉరుకులు, పరుగులతో మరబొమ్మల్లా బతికే మనుషులకు వచ్చే అనేకరకమున మానసిక జబ్బుల్లో  డిఫ్రెషన్‌ ఒకటి.
 • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, September 15, 2015

Raach.affordability.quality of medical services-వైద్యసేవల లభ్యత.స్థోమత.నాణ్యత

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Raach.affordability.quality of medical services-వైద్యసేవల లభ్యత.స్థోమత.నాణ్యత--  గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...జనాభా లో సగటున వెయ్యిమందికి ఒక డాక్టర్ ఉండాలని ప్రపంచ ఆరోగ్యసంష్థ చెబుతుండగా మనదేశములో 1700 మందికి ఒకరు చొప్పున్న డాక్టర్లు అందుబాటులో ఉన్నారు.

దేశము లో ప్రభుత్వకళాశాలలు 181, ప్రవేటు రంగములో 206 , కలిపి మొత్తము 387 వైద్యకళాశాలు ఉన్నాయి.

సంవత్సరానికి మనదేశములో ....
30 వేల మంది డాక్టర్లు ,
18 వేల మంది స్పెసలిస్టులు ,
30 వేల మంది ఆయుష్ వైద్యులు ,
54 వేల మంది నర్సులు ,
15 వేల మంది ఎ.ఎన్‌.ఎం.లు ,
36 వేల మంది పార్మశిస్టులు , ............ పట్టాలు పొందుతున్నారు.

ప్రస్తుతం మనదేశములో ఉన్న డాక్టర్లు  సంఖ్య : 6.5 లక్షలు .

ఇంతమంది ఆరోగ్య సేవకులు ఉన్నా సామాన్య ప్రజలకు వైద్యము అందడములేదు . కార్పొరేట్ హాస్పిటల్ వచ్చి వైద్య ఖర్చులు మోయలేని భారముగా తయారైనవి. వైద్యము వ్యాపారము గా మారినది. రోగులను రిఫర్ చేస్తున్న RMP లకు పర్సెంటేజ్ ఇవ్వడము తప్పనిసరి అయినది. లేబు బిల్ లో 30%, ఆపరేషన్‌ బిల్లు లో 30%-40% , డెలివరీ బిల్లులోనూ 30%  p.c లు గా ఫిక్ష్ అయినది. ఈ విధముగా రోగి ఆనారోగ్యము తో వ్యాపారము చేస్తూ ఉన్నారు.

ఇక మందులు కంపెనీలు లక్షలకొద్దీ పుట్తగొడుగులు గా పుట్టుకొస్తూ ఉన్నాయి. మందుల MRP  రేట్లు పెంచేసి ... మందుల షాపులకు 10 కి 10 ఫ్రీ ఆఫర్లు ఇస్తూ రోగి మందుల బిల్లులు చెల్లించలేని బారము గా తయారైనవి.

డయాగ్నోస్టిక్ ... లేబరిటరీలు పరీక్షలు , ఎక్సురే , స్కానింగ్ లు అవసరము లేకపోయినా చేస్తూ రోగి ఖర్చు విపరీతముగా పెరిగేటట్లు దోహదం చేస్తూ ఉన్నాయి. జ్వరం అని వచ్చిన పేసెంట్ కి సుమారు 600- 800 రూపాయిల రక్తపరీక్షలు అవుతున్నాయంటే .. ఏ ష్థాయిలో వైద్య-వ్యాపారము జరుగుతుందో ఊహించవచ్చును. ఇక ఎక్స్ రేలు , స్కానింగ్ లు , ఇ,సి.జి లు , ఎండోస్కోపులు , ఎం.ఆర్.ఐ లు ఖరీదులు ఎలా ఉంటాయో ఊహించగలరు.

ఇన్ని జరిగినా పేసెంటుకు నాణ్యమైన వైద్యము దొరకదు. నాసిరకం మందులే ... కంపెనీలు ఇచ్చే గిఫ్ట్ ల కోసము .. చెలామని అవుతూ ఉన్నాయి.
 •  ========================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, September 11, 2015

Medical problems in oldage-వృద్ధాప్యంలో వే్ధించే రకరకాల రుగ్మతలు

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -  Medical problems in oldage-వృద్ధాప్యంలో వే్ధించే రకరకాల రుగ్మతలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
 •  

 •  

   
నేటి బాలలే రేపటి పౌరులు. అలాగే నేటి పౌరులే రేపటి పెద్దలు, వృద్ధులు! మనం విస్మరించటానికి వీల్లేని జీవన సత్యం ఇది. వయసును ఆపలేంగానీ వయసుతో పాటు మొదలయ్యే

రకరకాల వ్యాధుల నుంచి.. ఆ బాధల నుంచి తప్పించుకోవటం మాత్రం చాలా వరకూ మన చేతులో ఉన్న వ్యవహారమే. చాలామంది ముసలితనంలో జబ్బులు సహజమని నమ్ముతుంటారుగానీ నిజానికి యుక్తవయసు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకుంటే మలివయసు కూడా చక్కటి ఆరోగ్యంతో ఎంతో ఆహ్లాదంగా, హాయిగా గడచిపోతుంది. అందుకే యుక్తవయసులో చక్కటి జీవన సరళిని అలవరచుకోవటమంటే ఒక రకంగా మలివయసుకు మనం చేసే 'జీవిత బీమా' అది. అలాగే మలివయసుకు వచ్చేసరికి చాలామంది 'ఈ వయసులో వ్యాధులు సహజమే' అనుకుంటారు గానీ అది సరికాదు. నేడు మనకు అందుబాటులో ఉన్న వైద్య పరిజ్ఞానం, సదుపాయాలతో ఏ వయసులోనైనా వ్యాధులతో ఇక్కట్లు పడాల్సిన అవసరం లేదు. దీనికి కావాల్సిందల్లా.. కాస్త ముందుగా మేల్కొనటం. అందుకే మలివయసులో తరచుగా

పలకరించే సమస్యలేమిటో, వీటికి నేటి వైద్యరంగం అందించే వివరాలేమిటో క్లుప్తంగా చూద్దాం.

మోకాళ్ల నొప్పులు
 
ఒక వయసుకు వచ్చే సరికి ఎంతోమందికి జీవితంలో నరకం చూపిస్తున్న పెద్ద సమస్య మోకాళ్ల నొప్పులు. దీనికి ప్రధానంగా మోకాలిలోని కీలు,ఎముకలు, వాటి మధ్య కదలికలు మృదువుగా ఉండేలా చూస్తుండే సున్నితమైన మృదులాస్థి పొరలు అరిగిపోవటం ముఖ్యకారణం. 55-60 ఏళ్ల వయసు తర్వాత దాదాపుగా సగానికి సగం మంది ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్య ఇది. తీవ్రమైన మోకాళ్ల నొప్పి వల్ల నడక నరకంగా తయారై కదల్లేకపోతుంటారు. దీనివల్ల శారీరక శ్రమ తగ్గి మరింత బరువు పెరగుతారు. బరువు పెరిగినకొద్దీ మోకాళ్ల నొప్పులు మరింత సతాయిస్తాయి. ఇలా ఇదో విషవలయంగా తయారవుతుంది. అందుకని పెద్దవయసులో సాధ్యమైనంత వరకూ బరువు పెరగకుండా చూసుకోవటం మంచిది.

అలాగే బరువు ఎక్కువగా ఉంటే తగ్గాలి. బరువు తగ్గితే మోకాళ్లు అరిగిపోయే ముప్పు కూడా తగ్గుతోందని 'ఫ్రేమింగ్‌హ్యామ్‌ ఆస్టియోఆర్త్థ్రెటిస్‌' అధ్యయనంలో స్పష్టంగా గుర్తించారు. కొద్దిగా మోకాళ్ల నొప్పులున్నా కదలికలు మానెయ్యకూడదు, రోజువారీ ఓ మోస్తరు నడక, వ్యాయామాలు కొనసాగించాలి. ఇప్పుడు మోకాళ్ల నొప్పులకు మంచి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. వైద్యులను సంప్రదిస్తే పరీక్షలు చేసి, సమస్య ఏ స్థాయిలో ఉంది, దీనికి ఏం చెయ్యొచ్చన్నది వివరిస్తారు. యుక్తవయసు నుంచీ చక్కటి వ్యాయామాలు చేస్తుండటం వల్ల చాలా వరకూ ఈ సమస్య దరిజేరకుండా చూసుకోవచ్చు. ఎప్పుడో వారాంతాల్లో ఒక్కసారిగా, విపరీతంగా వ్యాయామం చెయ్యటం కాకుండా.. రోజూ విడవకుండా, నిలకడగా నడక వంటి వ్యాయామాలు చెయ్యటం వల్ల మోకీలు చుట్టూ ఉండే కండరాలు బాగా బలపడతాయి. దానివల్ల భారం మొత్తం కీలే మొయ్యాల్సిన పరిస్థితి ఉండదు. ఫలితంగా కీలు అరుగుదలా తగ్గుతుంది. ఎక్కువగా గొంతిక్కూర్చోకుండా ఉండటం, ఎత్తు మడమ చెప్పులు (హైహీల్స్‌) వాడకుండా ఉండటం కూడా మోకీళ్లకు మంచిది.

 • ఎముకలు విరగటం
యవ్వనంలో తెలియకుండా తిరిగేస్తాంగానీ ఒక వయసుకు వచ్చేసరికి ఎముక క్షీణత ఎక్కువగా ఉంటుంది. 45-50 ఏళ్లు దాటిన వారిలో ఎముకలు ఎండుపుల్లల్లా పెళుసుగా, బోలుగా తయారవ్వటమన్నది చాలా ఎక్కువ. ఈ ముప్పు స్త్రీలలో మరీ ఎక్కువ. దీనివల్ల చీటికీమాటికీ పడిపోవటం, ఏ చిన్న దెబ్బ తగిలినా ఎముకలు విరిగిపోవటం చాలా తరచుగా చూస్తుంటాం. పైగా ఒకసారి విరిగితే వీరిలో అంత త్వరగా అతకవు కూడా. దీంతో మొత్తానికి కదలికలు తగ్గిపోవటం, తన పని తాను చేసుకునే పరిస్థితి కూడా లేకపోవటం వంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఎముక సాంద్రత తగ్గటం వల్ల వెన్నుపూసలు విరిగిపోవటం కూడా వీరిలో ఎక్కువే. అసలీ ఎముక బోలు సమస్య (ఆస్టియోపొరోసిస్‌) వృద్ధాప్యంలో చాలా సహజమని అంతా నమ్ముతుంటారుగానీ ఇది నిజం కాదు. ముందు నుంచీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీని బారిన పడాల్సిన అసరమే లేదు. పొగ తాగకుండా ఉండటం,

క్యాల్షియం దండిగా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవటంఅవసరం. మన జీవక్రియలకు తగినంత క్యాల్షియం అవసరం. మన ఆహారంలో క్యాల్షియం తగినంత లేకపోతే మన శరీరం దాన్ని ఎముకల నుంచి వెనక్కి తెచ్చుకుంటుంది. దీంతో ఎముకలు బలహీనపడతాయి. అలాగే కడుపులో బిడ్డ ఎదిగేటప్పుడు, బిడ్డకు పాలిచ్చేటప్పుడు స్త్రీ శరీరం నుంచి చాలా క్యాల్షియం బిడ్డకు వెళ్లిపోతుంది. దీంతో స్త్రీలు ఆస్టియోపొరోసిస్‌ బారినపడే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి క్యాల్షియం ఎక్కువగా ఉండే పాల పదార్థాలు, ఆకుకూరలు, సోయా, గోబీ, చేపల వంటివి తీసుకోవాలి. ఈ తీసుకున్న క్యాల్షియం ఎముకలకు పట్టేందుకు వ్యాయామం చెయ్యటం కూడా అవసరం. అలాగే కాస్త ఎండలో తిరిగితే విటమిన్‌-డి దక్కుతుంది, ఎముక బలానికి ఇదీ ముఖ్యమే. ఒక వయసు రాగానే అందరూ వైద్యులను సంప్రదించి ఎముక సాంద్రత పరీక్ష చేయించుకుని, ఆస్టియోపొరోసిస్‌ ఉంటే తగు జాగ్రత్తలు, చికిత్స తీసుకోవటం అవసరం. అలాగే బాత్రూముల్లో పడిపోకుండా నేల నునుపుగా జారిపోయేలా లేకుండా చూసుకోవటం, ఇంట్లో నడిచేటప్పుడు పరిస్థితిని బట్టి నాలుగుకోళ్ల కర్ర సాయం తీసుకోవటం, తల తిప్పు, తూలు రావటం వంటి లక్షణాలు కనబడుతుంటే తక్షణం వైద్యులకు చూపించుకుని, చికిత్స తీసుకోవటం కూడా చాలా అవసరం.

 • మనసు కుదురు
పెద్దలు సరిగా వినలేకపోతున్నా, సరిగా గుర్తుపెట్టుకోలేకపోతున్నా, విషయాలను సరిగా గ్రహించలేకపోతున్నా ఇంట్లోవాళ్లు చాలామంది- 'ఈ ముసలితనంలో ఇంతేలే!, చాదస్తం పెరిగింది, మతిమరుపు వచ్చేసింది..' ఇలా అనుకుని సర్దిచెప్పేసుకుంటుంటారు. కానీ ఈ ధోరణి సరికాదు. ఎందుకంటే వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి తగ్గేమాట కొంత వాస్తవమే అయినా ఇది అందరికీ రావాలనేం లేదు. ముఖ్యంగా తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యల్లో కూడా ఇలాంటి లక్షణాలు కనబడే అవకాశం లేకపోలేదు. వృద్ధాప్యంలో కుంగుబాటు (డిప్రెషన్‌) చాలా ఎక్కువ కూడా. కాబట్టి ఇలాంటివేమైనా ఉన్నాయేమో వైద్యులకు చూపించుకోవచ్చు. ఎంత వయసు వచ్చినా శరీరాన్నీ, మెదడునూ చురుకుగా ఉంచుకోవటం అవసరం. నిత్యం వ్యాయామం చెయ్యటం ఎంత అవసరమో మెదడుకు పదును పెడుతుండటం కూడా అంతే అవసరం. ఇందుకోసం ఎప్పుడూ ఏదో ఒక కొత్త పని, కొత్త విద్య నేర్చుకోవటానికి ప్రయత్నించటం, కొత్త పుస్తకాలు చదవటం, చదరంగం-పదకేళి-చిన్నచిన్న లెక్కలు చెయ్యటం వంటి పనుల్లో తలమునకలు కావటం మంచిది. సామాజిక సంబంధాలు చురుకుగా ఉంచుకోవటం, తమ వయసు వారితో కలిసి గడపటం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండటమూ అవసరం. అలాగే ఒకేసారి చాలా పనులు చేసెయ్యాలని తాపత్రయపడటం మాత్రం మంచిది కాదు. బిడ్డలు దూరంగా ఉండటం, ఆరోగ్య సమస్యలు వేధిస్తుండటం, ఇష్టమైన వారు మరణిస్తుండటం, శరీరం సరిగా సహకరించకపోవటం, అనుకోని ఒంటరితనం.. ఇవన్నీ మానసికంగా ఒత్తిడిని పెంచేవే. కాబట్టి ఇటువంటి నిజ జీవన సందర్భాలను స్త్థెర్యంగా ఎదుర్కొనటం, అవసరమైతే వైద్యుల సహాయం తీసుకోవటం మంచిది. సాంత్వన, ఏకాగ్రత పెంచే యోగ వంటి వాటిని ఆశ్రయించొచ్చు. ముఖ్యంగా- అల్జీమర్స్‌ వంటి కొన్నికొన్ని తీవ్ర సమస్యల్లో కనబడే మొదటి లక్షణం కూడా మతిమరుపే కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఇలా అనిపించినప్పుడు ఒక్కసారి వైద్యులతో చర్చించటం అవసరం.


 • మలం రాదు, మూత్రం ఆగదు
మలివయసు వారిని ప్రతి నిత్యం ఇబ్బందికి గురిచేసే ముఖ్యమైన సమస్య మలబద్ధకం. తగినంత శారీరక శ్రమ లేకపోవటం, దానికి తోడు సరిగా నమల లేక పీచు పదార్థాలు-కూరగాయల వంటివి బాగా తగ్గించి, నమలాల్సిన అవసరం అంతగా లేని తేలిగ్గా తినటానికి వీలైన శుద్ధి చేసిన (రిఫైన్డ్‌) పదార్థాలనే ఎక్కువగా తీసుకోవటం వల్ల ఈ సమస్య మరింతగా ముదురుతుంది. కాబట్టి దీనికి పరిష్కారమేమిటో మనకు తేలిగానే అర్థమవుతోంది. పీచు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు, ముడి ధాన్యాల వంటివి ఎక్కువగా తినాలి. నీరు సమృద్ధిగా తాగాలి. పీచులేని, బాగా శుద్ధి చేసిన పదార్థాలు తగ్గించాలి. ముఖ్యంగా ప్రతిరోజూ మలవిసర్జన జరిగితేనే హాయిగా ఉంటుందన్న భావన నుంచి బయటపడటం అవసరం. మలవిసర్జన- రోజుకు మూడు సార్ల నుంచీ వారానికి మూడు సార్ల వరకూ... సహజమే. కాబట్టి ప్రతి రోజూ విసర్జన జరగాల్సిందేనన్న భావనతో ఆలోచనలన్నీ దానిచుట్టూనే తిప్పుకోవటం అనవసరం. మలబద్ధకం ఇబ్బంది పెడుతున్నప్పుడు వైద్యులను సంప్రదిస్తే- ఆహారపరమైన మార్పులతో పాటు అవసరాన్ని బట్టి సబ్జాగింజల పొట్టు వంటి సహజమైన, నీటిలో కలుపుకొని తాగే పొడి వంటివాటినీ సిఫార్సు చేస్తారు, వీటితో తేలికగానే బయటపడొచ్చు.

ఇక కారణాలు వేరైనా- మలివయసులో స్త్రీపురుషులు ఇవరువురినీ కూడా మూత్రం ఆపుకోలేని సమస్య ఇబ్బంది పెట్టొచ్చు. 50-55 ఏళ్లు దాటిన స్త్రీలకు కటి కండరాలు బలహీనపడటం వల్ల మూత్రం లీకవటం, ఆపుకోలేకపోవటం, తరచూ వెళ్లాల్సి వస్తుండటం వంటి బాధలు చాలా ఇబ్బంది పెడతాయి. అలాగే పురుషుల్లో ఈ వయసుకు వచ్చేసరికి- ప్రోస్ట్రేటు గ్రంథి ఉబ్బటం వల్ల మూత్రం ఆపుకోలేకపోవటం, బొట్టుబొట్లుగా రావటం, ఎంత వెళ్లినా ఇంకా పూర్తి విసర్జనకాని భావన కలగటం వంటి లక్షణాలు వేధిస్తుంటాయి. వీరు ఒక్కసారి వైద్యులకు చూపించుకుని సమస్యేమిటన్నది కచ్చితంగా నిర్ధారణ చేయించుకోవటం ముఖ్యం. ఎందుకంటే ఈ వయసులో కొన్నిరకాల క్యాన్సర్లలో కూడా ఇలాంటి లక్షణాలే కనబడొచ్చు. కాబట్టి వీటిని నిర్లక్ష్యం చెయ్యరాదు. మూత్రం ఆపుకోలేని సమస్యకు ఇప్పుడు స్త్రీపురుషులకు ఇరువురికీ కూడా చాలా రకాల చికిత్సా మార్గాలు, పరిష్కారాలున్నాయి. కాబట్టి వీటి గురించి వైద్యులతో చర్చించటం ఉత్తమం.

వేధించే రుగ్మతలు
మలివయసుకు వచ్చేసరికి చాలామందిలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. యుక్తవయసు నుంచీ ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించటం ద్వారా వీటిని సాధ్యమైనంత వరకూ దరిజేరకుండా చూసుకోవచ్చుగానీ అన్నిసార్లూ వీటిని పూర్తిగా తప్పించుకోలేకపోవచ్చు. వీటిని నిర్లక్ష్యం చేస్తే గుండెజబ్బులు, పక్షవాతం వంటి రకరకాల సమస్యలు వెంటాడతాయి. కాబట్టి తరచూ పరీక్షలు చేయించుకుంటూ, చికిత్స కొనసాగిస్తూ వీటిని కచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. అలాగే మలివయసులో ఎదురయ్యే మరో పెద్ద సమస్య క్యాన్సర్‌. స్త్రీలలో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు, పురుషుల్లో ప్రోస్ట్రేటు గ్రంథి క్యాన్సర్ల వంటివి ఎక్కువ. వూపిరితిత్తులు, పెద్దపేగు క్యాన్సర్ల వంటివి ఇద్దరిలోనూ కనబడుతుంటాయి. కాబట్టి ఒంట్లో ఎక్కడైనా గడ్డలు రావటం, వీడకుండా దగ్గు వేధించటం, మలవిసర్జన అలవాట్లు మారిపోవటం, రక్తం కనబడటం, బరువు తగ్గిపోవటం, పుండ్లు మానకపోవటం వంటి లక్షణాలేవైనా కనబడితే వాటిని ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి. యుక్తవయసు నుంచీ పండ్లు, ఆకుకూరలు, కూరగాయల వంటి సహసిద్ధమైన ఆహారం ఎక్కువగా తీసుకోవటం, బరువు పెరగకుండా చూసుకోవటం, నిత్యం వ్యాయామం చెయ్యటం- వీటితో క్యాన్సర్‌తో సహా చాలా రుగ్మతలు, వ్యాధులు దరిజేరకుండా వృద్ధాప్యాన్ని హాయిగా ఆస్వాదించే అవకాశం ఉంటుందని గుర్తించాలి.

 • బోసినోటి బాధలు
ఇప్పటికీ మన సమాజంలో చాలామంది నమ్మే విషయం- ఒక వయసు రాగానే అందరికీ దంతాలు వూడిపోతాయనీ, నోరు బోసిపోవటం తథ్యమనీ! ఇది చాలా తప్పు. చిన్న వయసు నుంచీ చక్కటి నోటి ఆరోగ్య పద్ధతులు పాటిస్తూ ఉన్న వారికి వృద్ధాప్యంలో పళ్లు వూడిపోవటమన్నది ఉండదు. నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవటం, చక్కటి ఆహారం తీసుకోవటం- ఈ రెండూ పాటిస్తే జీవితాంతం మన దంతాలు మనతోనే ఉంటాయని వైద్యరంగం ఎప్పటి నుంచో చెబుతోంది. రోజూ రెండుపూట్లా బ్రషింగ్‌ చేసుకోవటం, చక్కగా నములుతూ ఆహారం తీసుకోవటం, ఆహారం తీసుకోగానే నోటిని శుభ్రపరచుకోవటం, అప్పుడప్పుడు దంత వైద్యులకు చూపించుకుని దంతాల మీద గార పేరుకుంటే దాన్ని తొగించేందుకు స్కేలింగ్‌ చేయించుకోవటం.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు! చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం చిమురుస్తుండటం వంటి సమస్యలు తలెత్తితే వెంటనే దంతవైద్యులకు చూపించుకుని చికిత్స తీసుకోవటం చాలా అవసరం. చిగుళ్ల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే దంత మూలం బలహీనపడి, దంతాలు వూడిపోయే అవకాశాలు పెరుగుతాయి. దంతాలు వూడితే- ఆహారం తీసుకోవటం కష్టంగా తయారై, పోషకాహారం తినలేని పరిస్థితులూ తలెత్తుతాయి. దీనివల్ల మొత్తం ఆరోగ్యమే దెబ్బతింటుంది. అలాగే వయసు పెరిగిన కొద్దీ నోరు పొడిబారటం ఎక్కువ అవుతుంది, దీనివల్ల దంతాల మీద రంధ్రాలు పడటం, చిగుళ్ల బాధల వంటివీ పెరుగుతాయి. కాబట్టి చిగుళ్ల సమస్యలు, దంతాలు పుచ్చిపోవటం, జివ్వుమనటం వంటి సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే వైద్యులను చూపించుకుని, వాటిని చక్కదిద్దుకోవాలి. ఒకవేళ దంతాలు వూడినా ఇప్పుడు- సమర్థమైన, శాశ్వతమైన కృత్రిమ దంతాలు (ఇంప్లాంట్స్‌) అమర్చే అవకాశం ఉంది కాబట్టి వృద్ధాప్యంలో దంత సమస్యలతో ఇబ్బందులు పడాల్సిన అవసరమే లేదని గుర్తించాలి. సాధారణ ఆరోగ్యం బాగుండేందుకు కూడా ఇది కీలకం!

 • తగ్గే చూపు, వినికిడి
వయసుతో పాటు చూపు కొద్దిగా తగ్గటం సహజం కాబట్టి 35-40 ఏళ్ల నుంచీ దృష్టి పరీక్షలు చేయించుకుని అవసరమైతే కళ్ల అద్దాలు తీసుకోవటం మంచిది. ఒక వయసుకు రాగానే కంటిలోని కార్నియా పొర దళసరిగా తయారై, శుక్లాలు రావటం కూడా సహజం. దీనికి ఇప్పుడు- శుక్లాన్ని తొలగించి కంటిలోనే లెన్సును అమర్చే సమర్థమైన సర్జరీ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా.. వయసుతో పాటు కంటిలో నీటికాసులు పెరగటం, దృష్టికి కీలకమైన మాక్యులా పొరక్షీణించటం, మధుమేహం ఉంటే దాని కారణంగా రెటీనా పొర మీద రక్తం కమ్మటం వంటి రకరకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. సమస్యేమంటే ఈ సమస్యలు కొంత తీవ్రమైనవి, వీటివల్ల దృష్టి దెబ్బతినే అవకాశాలు చాలా ఎక్కువ. వీటికి ముందస్తు సంకేతాలు కూడా ఏమీ ఉండవు. వీటిని ముందే గుర్తిస్తే కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవటం ద్వారా చూపు దెబ్బతినకుండా చూసుకోవచ్చు. కాబట్టి ఒక వయసు వచ్చిన తర్వాత క్రమం తప్పకుండా తరచూ కంటి పరీక్ష, అదీ 'సంపూర్ణ నేత్ర పరీక్ష' చేయించుకుంటూ ఉండటం ఉత్తమం. ఈ పరీక్ష కోసం కంటిలో చుక్కల మందు వేసి, కనుపాప పెద్దదైన తర్వాత పరికరాలతో లోపలంతా క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఈ పరీక్షే ముఖ్యమని గుర్తించాలి.

 • వినికిడి
అలాగే ఒక వయసుకు వచ్చేసరికి వినికిడి కూడా తగ్గుతుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో అధిక పౌనఃపున్యం ఉండే ధ్వనులు సరిగా వినపడవు. చాలామంది వినికిడి తగ్గిందన్న విషయాన్ని అంగీకరించటానికే ఇష్టపడరు. ఒకవేళ దాన్ని అంగీకరించినా, వైద్యులకు చూపించుకోవటానికి ఇష్టపడరు. కానీ దీనివల్ల నలుగురిలో కలవలేకపోవటం, ఎవరేమంటారోనని చిన్నతనంగా భావిస్తుండటం, సమాజానికి దూరం కావటం, క్రమేపీ కుంగుబాటులోకి జారిపోవటం వంటి సమస్యలన్నీ బయల్దేరతాయి. కాబట్టి వినికిడి తగ్గుతోందనిపిస్తే తోసేసుకుని తిరగటం కాకుండా.. వైద్యులకు చూపించుకుని అవసరమైతే తేలికపాటి వినికిడి యంత్రాల వంటివి తీసుకోవటం ద్వారా చక్కటి సామాజిక జీవితాన్ని గడపొచ్చని గుర్తించాలి. యుక్తవయసు నుంచీ పెద్దపెద్ద ధ్వనులు వినకుండా ఉండటం, చెవుల్లో ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకుని అతిగా ధ్వని పెంచుకోకుండా ఉండటం చెవి ఆరోగ్యానికి ముఖ్యం. 

 • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/