Showing posts with label సొరియాటిక్ ఆర్థరైటిస్‌. Show all posts
Showing posts with label సొరియాటిక్ ఆర్థరైటిస్‌. Show all posts

Wednesday, September 4, 2013

Psoriatic Arthritis,సొరియాటిక్ ఆర్థరైటిస్‌

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- Psoriatic Arthritis-సొరియాటిక్ ఆర్థరైటిస్‌-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



సొరియాసిస్ ఒక తీవ్రమైన ఆటోఇమ్యూన్ వ్యాధి. అంటే రోగనిరోధక శక్తికి తప్పుడు సంకేతాలు వెళ్లడం వల్ల మిత్ర కణాలనే శత్రుకణాలుగా పొరబడి దాడి చేయడం వల్ల జరిగే పరిణామాల వల్లనే సొరియాసిస్ వస్తుంది. ఆ తర్వాత తెల్లటి పొలుసుల మాదిరిగా చర్మం రాలిపోతూ ఉంటుంది. ఇది అంటువ్యాధి కాదు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. ఏ వయసు వారికైనా వచ్చే అవకాశం ఉంది.

మన చర్మం రెండు పొరలతో నిర్మితమై ఉంటుంది. బయటి పొరను ఎపిడెర్మిస్ అని, లోపలి పొరను డెర్మిస్ అని అంటారు. కణాలు డెర్మిస్ పొరలో పుట్టి ఎపిడెర్మిస్‌లోకి వస్తుంటాయి. ప్రతి 20-30 రోజులకొక సారి ఎపిడెర్మిస్‌లోని కణాలు డెర్మిస్‌లో తయారయిన కొత్త కణాలతో రీప్లేస్ చేయబడుతాయి. సొరియాసిస్ వ్యాధిలో కణాలు తయారయ్యే ప్రక్రియ వేగంగా జరుగుతుంది. కొత్త కణాలు తయారయి చర్మం పై భాగానికి వచ్చేస్తుంటాయి. అధికంగా వచ్చేసిన ఆ కణాలు పేరుకుపోయి బిళ్లల మాదిరిగా తయారవుతాయి. ఇది కొన్ని వాతావరణ పరిస్థితుల్లో పెరగడం, తగ్గడం జరుగుతుంది. చర్మం పొలుసుల మాదిరిగా రాలిపోతుండటంతో నలుగురిలో తిరగలేకపోతారు. ఉద్యోగం చేసుకోలేకపోతారు. మెల్లగా డిప్రెషన్ లోకి వెళతారు. దీని వల్ల వ్యాధి మరింత తీవ్రమవుతుందే తప్ప ఫలితం ఉండదు. సొరియాసిస్ చర్మానికి సంబంధించిన వ్యాధిగా మాత్రమే పరిగణించి పైపూత మందుల ద్వారా తగ్గించే ప్రయత్నం చేస్తారు చాలా మంది. కానీ తిరిగి అదే ప్రదేశంలో లేక వేరే ప్రాంతంలో మరింత తీవ్రస్థాయిలో ఆ వ్యాధి బయటపడుతుంది. సొరియాసిస్ ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు భాగాలలో కనిపిస్తుంది. అంతేకాదు కాలిగోళ్లలోకి విస్తరిస్తుంది. సొరియాసిస్‌తో బాధపడుతున్న 15 శాతం మందిలో ఆర్థరైటిస్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీన్ని సొరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు.

సొరియాటిక్ ఆర్థరైటిస్ - సొరియాటిక్ ఆర్థరైటిస్ మూలంగా కీళ్లు బిగుసుకుపోవడం, నొప్పి కలగడం జరుగుతుంటుంది. సొరియాసిస్‌తో దీర్ఘకాలంగా బాధపడుతున్న వారిలో సొరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సొరియాటిక్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వారిలో 80 శాతం మందిలో గోళ్లలో సొరియాసిస్ కనిపిస్తుంది. సిమ్మెట్రికల్ సొరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్న వారిలో శరీరంలో రెండు వైపులా ఒకే ప్రదేశంలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. మల్టిపుల్ జాయింట్స్‌పై ప్రభావం ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ మాదిరిగా ఉంటుంది. వెన్నులో ఉన్నపుడు నడుము బిగుసుకుపోవడం, మెడపై మంటగా ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి. సొరియాసిస్ వ్యాధి ప్రభావం శారీరకంగానే కాకుండా మానసికంగానూ తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

కారణాలు - ఆటో ఇమ్యూన్... సొరియాసిస్‌కు కారణమవుతుంది. శరీరంలో ఇమ్యూన్‌సెల్స్ పొరపాటున సొంతకణాలపై దాడి చేయడం వల్ల ఈ అసాధారణంగా కణాలు తయారవుతాయి. వంశపారంపర్యంగా కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. స్ట్రెప్టొకాకల్ ఇన్‌ఫెక్షన్, మానసిక ఒత్తిడి కూడా సొరియాసిస్‌కు కారణమవుతాయి. రోగనిరోధక వ్యవస్థతోనే ఈ అవకాశం ఉందని ఇటీవలి పరిశోధనలో వెల్లడయింది.

సొరియాసిస్ రకాలు - ప్లేక్స్ సొరియాసిస్, గటెడ్ సొరియాసిస్, నెయిల్ సొరియాసిస్, ఫస్టులార్ సొరియాసిస్, జంబుష్ సొరియాసిస్.

సొరియాసిస్ లక్షణాలు - వ్యక్తికి, వ్యక్తికి లక్షణాలు మారుతుంటాయి. సొరియాసిస్ విస్తరించిన ప్రదేశం, వ్యాధి ఉన్న కాలాన్ని బట్టి లక్షణాలు మారుతుంటాయి. ఎర్రని ప్యాచ్‌ల మాదిరిగా ప్లేక్స్ చర్మం పై ఏర్పడతాయి. గోకినపుడు దురద, మంటగా ఉంటుంది. చర్మం పొడిబారినపుడు చర్మంపై పగుళ్ల ఏర్పడటంతో పాటు రక్తస్రావం అవుతుంది. కీళ్లపై ప్రభావం పడినపుడు కీళ్ల దగ్గర వాపు, నొప్పి ఉంటుంది.

చికిత్స - సొరియాసిస్‌కు  చక్కని చికత్స అందుబాటులో ఉంది. రోగనిరోధక శక్తిని పెంపొందించే గ్రంథులను ఉత్తేజపరిచి, వ్యాధి కారకాలను తగ్గించే విధంగా చికిత్స అందించడం ద్వారా సొరియాసిస్‌ను సమూలంగా తగ్గించవచ్చు. ఈ చికిత్స కణజాల స్థాయిలో పనిచేసి వ్యాధి నిరోధక శక్తిని సాధారణ స్థాయికి తీసుకువస్తుంది.స్

Non steroidal anti-inflamatory drugs :
ఇక్కడ ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గడానికే చికిత్స  చేస్తారు. నాన్‌ స్టిరాయిడల్ యాంటి ఇన్‌ఫ్లమేటరీ మందులు అనగా -- ihurofen , naproxen  వంటివి వాడాలి. గాస్ట్రిక్ ప్రోబ్లం రాకుండా పరగడుపు మాత్ర వాడాలి. 

Disease -modifying antirhematic drugs:
Methotrexate  of Leflunomide.

Biological response modifiers :
infliximab , Etanecept , golimumab , certolizumab Etc.

స్వంతంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి .
కస్టముగా ఉన్న సీసా ,కుండీ మూతలు తీయడము , బరువైన వస్తువులు ఎత్తడము చేయకూడదు.
ఆరోగ్యకరమైన కీళ్ళ స్థితిని పాతించాలి. అంటే కీళ్ళ పై భారము పడేటట్లు ఉండకూడదు.
క్రమము తప్పకుండా వ్యాయామము 


  • ====================
 Visit my website - > Dr.Seshagirirao.com/