Showing posts with label వెన్నునొప్పి ఉంటే బల్లపైనే పడుకోవాలా?. Show all posts
Showing posts with label వెన్నునొప్పి ఉంటే బల్లపైనే పడుకోవాలా?. Show all posts

Wednesday, April 6, 2011

వెన్నునొప్పి ఉంటే బల్లపైనే పడుకోవాలా?,Do we sleep on a bench in backbone pain?


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -వెన్నునొప్పి ఉంటే బల్లపైనే పడుకోవాలా?(Do we sleep on a bench in backbone pain?)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



చాలామంది వెన్ను నొప్పి ఉన్నప్పుడు కేవలం చెక్కబల్ల పైనే పడుకోవాలేమోనని అనుకుంటారు. అయితే అలా చేయడంవలన కండరాలు, ఎముకలు ఒరుసుకు పోయి అసౌకర్యం మరింత పెరుగుతుంది. మరికొంతమంది పరుపు లేకుండా పడుకోవాలనే ఉద్దేశ్యంతో నేలమీద పడుకుంటారు.

అయితే పడుకున్న తరువాత నేలమీద నుంచి లేవా ల్సివస్తే వంగాల్సి వస్తుంది. దీనివల్ల నడుము నొప్పి మరింత పెరిగే అవకాశాలున్నాయి. పైగా నేలనుంచి చల్లదనం, తేమవంటివి శరీరానికి చేరి నడుము కండరా లను మరింత బిగుసుకునేలా చేస్తాయి. వాస్తవానికి మంచం బేస్‌ అనేది కుంగిపోకుండా, స్థిరంగా ఉంటే చాలు.

మంచి మందపాటి ప్లైవుడ్‌ షీట్‌ను మంచం బేస్‌గా ఉపయోగిస్తూ పరుపును రెండు అంగుళాల మందం ఉండేలా అమర్చుకుంటే సరిపోతుంది.
వాటర్‌ బెడ్స్‌, ఆర్థోపెడిక్‌ బెడ్స్‌ వంటి వాటి వలన ఉపయోగం ఉంటుంది కానీ అవిచాలా ఖరీదుతో కూడి నవి.

జీవితంలో చేసుకోవాల్సిన మార్పులు
వెన్ను నొప్పి దీర్ఘకాలంనుంచి బాధిస్తున్నప్పుడు రోజు వారీ కార్యక్రమాలన్నింటినీ గమనించండి. ఎక్కడ, ఏ భంగిమలో, ఏ సందర్భంలో నొప్పి వస్తున్నదో కని పెట్టండి. వృత్తిపరంగా లేదా రోజువారీగా వాడే వస్తు వుల వలన నొప్పి వస్తుంటే ప్రత్యా మ్నాయ పద్ధతుల గురించి ఆలోచించండి.

నిలబడి పని చేయాల్సి వచ్చినప్పుడు కూర్చుని పని చేయడం, బరువులను మోయాల్సి వస్తే హ్యాండ్సిల్స్‌ అమర్చుకోవడం వంటి చిన్నపాటి మార్పులు చేర్పులతో రోజువారీ కార్యకలాపాలను సౌకర్యవంతంగా నిర్వర్తించ వచ్చు.

పథ్యాపథ్యాలు
మీరు అధిక బరువును కలిగి ఉంటే తేలికపాటి ఆహారం తీసుకుంటూ బరువు తగ్గే ప్రయత్నం చేయండి.
స్థూలకాయం వలన వెన్నుపూసల మీద అదనంగా బరువు పడి నొప్పి తీవ్రతరమవుతుంది.
అధిక బరువును తగ్గించుకోవాలంటే తీపి వస్తువులు, వేపుడు పదార్థాలు, నూనెల వంటివి బాగా తగ్గించాలి.
తగిన వ్యాయామాన్ని చేయాలి. సూచనల మేరకు మందులు వాడాలి.
ఉదరంలో గ్యాస్‌ అధికంగా తయారైతే వెన్ను మీద వత్తిడి ఎక్కువ అవుతుంది.
అందుకే గుడ్డు, శనగపిండి వంటకాలు, ఉల్లి, చిక్కుళ్లు, క్యాబేజీ, కాలీఫ్లవర్‌, దోస కాయ, మసాలాలు, పచ్చి సలాడ్స్‌ వంటి గ్యాస్‌ను తయారు చేసే వాతకర ఆహారాలను తగ్గించాలి.


  • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/