Saturday, October 30, 2010

నలుపు మచ్చల జ్వరము , Kalazaar fever • కాలాఅజార్ జ్వరము - నలుపు మచ్చల జ్వరము

నలుపు మచ్చల జ్వరము అంటే ఏమిటి ?

* ఇలా చాలా మెల్లగా వ్యాపించే లేక వృద్ధి చెందే దేశీయ జబ్బు. దీనికి కారణం ప్రోటోజోవాకు చెందిన లీప్యానియా అను (కొత్తి మెర పురుగు) (చిన్న దోమ) పరాన్నజీవి
* మన దేశంలో లీష్మానియా అను ఒకే ఒక పరాన్నజీవి ఈ కాలా అజార్ జ్వరానికి కారణం అవుతుంది
* ఈ పరాన్న జీవి ముఖ్యంగా శరీర రక్షణ వ్యవస్ధ మీద ప్రభావం చూపుతుంది. తరువాత అస్ధిరమజ్జు
* (బోన్ మారో) , కాలేయము, మహాభక్షక వ్యవస్ధలలో ఎక్కువ మోతాదులో కనబడుతుంది
* కాలా జ్వరము లేక నల్ల మచ్చల జ్వరము. తదుపరి వచ్చే చర్మవ్యాధి లో లీప్యానియా డోనవాని అను పరాన్నజీవి చర్మం ఉపరితలంలోని కణాలలో చొచ్చుకొని పోయి అక్కడ వృద్ధి చెందుతూ వ్యాధి లక్షణాలకు కారణం అవుతుంది. కొందరు వ్యాధిగ్రస్థులలో ఈ చర్మ సమస్య చికిత్సానంతరం కొన్ని సంవత్సరాల తరువాత బయటపడవచ్చును
* కొన్ని సార్లు ఈ పరాన్నజీవి జీర్ణ వ్యవస్థ లో ప్రవేశించకుండానే చర్మంలోనే వృద్ధి చెంది అక్కడే లక్షణాలను వృద్ధి చేయవచ్చును. దీని గురించి ఇంకా విపులంగా పరిశోధనలు జరగవలసి వున్నవి

పూర్తి వివరాలకోసం తెలుగులో - కాలాజ్వరము

 • ================================
Visit my website - > Dr.Seshagirirao.com/

మానసిక సమస్యలతో దెబ్బ తినే జీర్ణవ్యవస్థ, , Psychological Digestive Troublesశరీరంలోని ఇతర వ్యవస్థలలాగానే మనస్సు, జీర్ణ వ్యవస్థ ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతాయి. అనేక రకాల జీర్ణకోశ సమస్యలు (గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ డిజార్డర్స్‌-జిఐ డిజార్డర్స్‌) మానసిక సమస్యల కారణంగా కలగడం, అధికం కావడం జరుగుతుంటాయి. మన మానసిక స్థితి, భావోద్రేకాలు, వ్యక్తిత్వం, మనం ఒత్తిడిని తట్టుకునే తీరు, మన అలవాట్లు మొదలైనవి మన జీర్ణకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి.విలియమ్‌ బీమౌంట్‌ అనే శాస్త్రవేత్త 19 శతాబ్దంలో ఒక రోగికి తుపాకీ గుండు వల్ల కడుపులో గాయం కలిగినప్పుడు ఫిస్టులా ఏర్పడి జీర్ణకోశ వ్యవస్థను ప్రత్యక్షంగా చూసే అవకాశం కలిగింది. అనేక రకాల మానసిక స్థితులు, భావోద్రేకాలు జీర్ణ వ్యవస్థకు చెందిన స్రావాల కదలికలను, మ్యూకోసా రంగుల్లో మార్పులను కలిగిస్తున్నట్లు ఆయన తెలుసుకోగలిగాడు.

ఇవే అంశాలను జార్జ్‌ ఎంగెల్‌ అనే మరొక శాస్త్రవేత్త 20వ శతాబ్దంలో జీర్ణ వ్యవస్థనుంచి చార్మనికి ఏర్పడిన ఒక నాళం (గ్యాస్ట్రిక్‌ ఫిస్టులా) కలిగిన అమ్మాయిని చిన్న వయస్సునుంచి పరిశీలించి తిరిగి రూఢి చేశాడు.ఆందోళన, వ్యాకులత, కోపం మొదైలన మానసిక స్థితులన్నీ జీర్ణవ్యవస్థలో అనేక మార్పులను కలిగిస్తున్నట్లు కనుగొన్నాడు.'భావోద్రేకాలలో మార్పులు మన జీర్ణ వ్యవస్థ పని చేసే తీరును, తద్వారా మన జీర్ణ వ్యవస్థ లక్షణాలను ప్రభావితం చేస్తాయి.జీర్ణ వ్యవస్థలో కనిపించే పలు రకాల హార్మోన్లు, న్యూరోట్రాన్స్‌మిటర్స్‌ మెదడులో కూడా ఉండటం (ఉదాహరణకు - సెరటోనిన్‌) ఈ రెండు వ్యవస్థలు మరింతగా ఒకదానిపై మరొకటి ప్రభావితం చేసుకోవడానికి దోహదపడుతున్నాయి. జీర్ణ వ్యవస్థ తాలూకు సమస్యలను రెండు రకాలుగా విభజింవచ్చు. అవి - ఫంక్షనల్‌ డిజార్డర్స్‌, గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ డిసీజెస్‌ (జిఐ డిసీజెస్‌).

ఫంక్షనల్‌ డిజార్డర్స్‌ : వీటిలో జీర్ణ వ్యవస్థలో మార్పులు కనిపిస్తాయి. కానీ ఎటువంటి నిర్మాణపరమైన లోపమూ కనిపించదు.ఉదాహరణకు కడుపులో మంట, విరేచనాల వంటి లక్షణాలు కలిగినా వీటికి కార ణమిది అని చూపగల ఎటువంటి నిర్మాణపరమైన మార్పూ ఎండోస్కోపీ, ఎక్స్‌రే వంటి పరీక్షలు చేసినప్పుడు జీర్ణకోశంలో కనిపించదు. జిఐ డిసీజెస్‌ : వీటిలో జీర్ణ వ్యవస్థలో వ్యాధి తాలూకు లక్షణాలు కనిపించిన్పుడు వాటికి సంబంధిం చిన మార్పులను మనం గుర్తించగలుగుతాము. ఉదాహర ణకు పెప్టిక్‌ అల్సర్‌ను ఎండోస్కోపీ ద్వారా గుర్తించగలం. అలాగే దీనికి కారణమయ్యే హెలికోబాక్టర్‌ పైలోరి అనే బాక్టీరియాను పరీక్షల ద్వారా గుర్తించగలం.

ముందుగా ఫంక్షనల్‌ జిఐ వ్యాధుల గురించి తెలుసుకుందాం.ఫంక్షనల్‌ జిఐ వ్యాధులు ఫంక్షనల్‌ ఈసోఫేజియల్‌ డిజార్డర్స్‌ గ్లోబస్‌ (గొంతులో కంతి / గడ్డ ఉందనే భావన) , రూమినేషన్‌ : ఒకసారి తిన్న పదార్థాలను తిరిగి మళ్లీ మళ్లీ నెమరు వేయడం , హృద్రోగం కాని ఛాతీ నొప్పి : ఆహారనాళం కండరాలు బిగుసుకుపోవడం వల్ల కలిగే బాధ. ఎటువంటి లోపం కనిపించదు.

హార్ట్‌బర్న్‌ : ఎటువంటి లోపం లేకపోయినా గొంతులోకి ఆమ్లాలు ఎగదన్నుకు రావడం (యాసిడ్‌ రిఫ్లక్స్‌)
డిస్‌ఫేజియా : ఏ లోపం లేకపోయినప్పటికీ, ఆహారాన్ని మింగడం కష్టంగా ఉంటుంది.

ఆహార నాళానికి సంబంధించిన అనేక రకాల ఇతర సమస్యలు-

ఫంక్షనల్‌ గ్యాస్ట్రో డుయోడినల్‌ డిజార్డర్స్‌

- డిస్పెప్సియా : ఏ లోపం లేకపోయినా ఎపిగ్యాస్ట్రిక్‌ భాగంలో మంట, నొప్పి, వికారం, వాంతులు, కడుపు ఉబ్బరించినట్లు ఉండటం, త్వరగా కడుపు నిండిన భావ, ఆకలి కలుగకపోవడం మొదలైనవి.
- ఆక్రోఫేజియా : గాలి ఎక్కువగా మింగడం, తరువాత అధికంగా త్రేన్పులు రావడం

ఫంక్షనల్‌ బొవెల్‌ డిజార్డర్స్‌
- ఇరిటబుల్‌ బొవెల్‌ సిండ్రోమ్‌
- బర్బులెన్స్‌ : ఉబ్బరం, అపాన వాయువు పోవడం
- మలబద్ధకం : వారానికి మూడుసార్ల కంటే తక్కువగా విరేచనం కావడం లేదా గట్టిగా ఉన్న మలం, మల విసర్జన సమయంలో నొప్పి/బాధ
- డయేరియా : నీళ్లలాంటి విరేచనాలు కావడం, ఇతర సమస్యలు

ఫంక్షనల్‌ అబ్డామినల్‌ పెయిన్‌
- కడుపు నొప్పి : ఒక చోటికి పరిమితం కాని కడుపులో నొప్పి
- బైలియరీ పెయిన్‌ : కుడివైపున ప్రక్కటెముకల కింద నొప్పి

ఫంక్షనల్‌ యానోరెక్టల్‌ డిజార్డర్స్‌
ఇన్‌కాంటినెన్స్‌ : తెలియకుండానే విరేచనం కావడం. ఎలాంటి లోపమూ కనిపించదు.
యానోరెక్టల్‌ పెయిన్‌ : మలద్వార భాగంలో ఏ కారణం లేకుండానే తీవ్రమైన నొప్పి
అబ్‌స్ట్రక్టివ్‌ డిఫెక్షన్స్‌ : మల విసర్జన సమయంలో పెల్విక్‌ కింది భాగంలోని కండరాలు బిగుసుకుపోవడం వల్ల కలిగే బాధ.

ఫంక్షనల్‌ జిఐ డిజార్డర్స్‌తో బాధపడే వారిలో జీర్ణ వ్యవస్థలో నోటినుంచి మల ద్వారం వరకూ ఎక్కడైనా లక్షణాలు కనిపించవచ్చు. కానీ వాటికి కారణభూతమైన లోపం మాత్రం గుర్తించలేము. ఈ రకమైన జిఐ డిజార్డర్స్‌ కలవారిలో మానసిక సమస్యలు అధికంగా ఉంటాయి.మానసిక సమస్యలు ఫంక్షనల్‌ జిఐ డిజార్డర్స్‌తో బాధపడే వారిలో లక్షణాలను, వాటి వల్ల కలిగే ఇబ్బందిని అధికం చేయడం, వాటినుంచి బైటపడే తీరును ప్రభావితం చేయడం జరుగుతుంది.ఈ సమస్యలు కలవారికి వీటితోపాటుగా మానసిక సమస్యలకు కూడా చికిత్స జరిగినప్పుడు వాటి తీవ్రత తగ్గి, ఉపశమనం లభిస్తుంది.ఫంక్షనల్‌ డిజార్డర్స్‌ను అధికంగా స్త్రీలలో, ఆర్థికంగా వెనుకబడిన, మూడవ ప్రపంచ దేశాలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడి సంస్కృతిలో మానసిక సమస్యలను వ్యక్తం చేయడం వీలుపడదు. వీరు తమ మానసిక సమస్యను మరొక రూపంలో శారీరక లక్షణంగా వ్యక్తపరుస్తారు.

ఫంక్షనల్‌ జిఐ రుగ్మతలు ఉన్నవారిలో మానసిక సమస్యలు - ముఖ్యంగా ఆందోళన, వ్యాకులత, ఒత్తిళ్లు, సొమటైజేషన్‌ డిజార్డర్స్‌, భయాలు, ప్రవర్తనాపరమైన లోపాలు మొదలైనవి ఇతరులకంటే అధికంగా కనిపిస్తాయి.గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ డిజార్డర్స్‌లో రెండవ రకం గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ డిసీజెస్‌. వీటిలో నిర్మాణాత్మకమైన లోపాలను చూస్తాము. వీటికి ఉదాహరణలుగా - పెప్టిక్‌ అల్సర్‌, క్రోన్స్‌ డిసీజ్‌, అల్సరేటివ్‌ కొలైటిస్‌, పాంక్రియాటైటిస్‌, జీర్ణకోశం, పెద్దపేగులకు సోకే కేన్సర్‌, కాలేయం, గాల్‌బ్లాడర్‌లకు సంబంధించిన వ్యాధులు, మొలల వ్యాధి మొదలైనవి చెప్పుకోవచ్చు. వీటికి మానసిక సమస్యలు ప్రత్యక్షంగా కారణం కాకపోయినా మానసిక సమస్యలు అధికమైనప్పుడు ఈ సమస్యలు మరింత ఎక్కువ కావడం జరుగుతుంది.అంతేకాక, అనేక మానసిక సమస్యల్లో ఉండే ప్రమాద కరమైన ప్రవర్తనలు ఈ సమస్యలకు దారి తీస్తాయి. ఉదాహరణకు మానసిక సమస్యలు ఉన్నవారిలో నిద్రలేమి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, మద్యపానం, ధూమపానం, మాదక ద్రవ్యాల విని యోగం మొదలైనవి అధికంగా ఉంటాయి. వీటి కార ణంగా ఆందోళన, గ్యాస్ట్రయిటిస్‌, పాంక్రియాటైటిస్‌, కేన్సర్లు, హెపటైటిస్‌ మొదలైన అనేక జీర్ణకోశ వ్యాధులు కలుగుతాయి.

ఎలా కలుగుతాయి?
ఆందోళన, ఒత్తిడి తదితర మానసిక సమస్యలు కలిగినప్పుడు సింఫథిటిక్‌, పారాసింపథిటిక్‌ నాడీ వ్యవస్థలు ఉత్తేజితమవుతాయి. వీటి కారణంగా జీర్ణకోశ వ్యవస్థలో అనేక మార్పులు కలుగుతాయి. ఉదాహరణకు ఆందోళన / ఒత్తిడి కలిగినప్పుడు జీర్ణకోశంలోని అప్పర్‌ స్పింక్టర్‌ ముడుచుకునిపోతుంది. ఫలితంగా ఆహారం మింగడానికి ఇబ్బంది కలుగుతుంది. గొంతులో ఏదో అడ్డుపడిన భావన కలుగుతుంది.ఆందోళన కలిగినప్పుడు జీర్ణకోశం తొలిభాగం కదలిక తగ్గుతుంది. దీని వల్ల వికారం, వాంతులు కలిగే అవకాశం ఉంది. ఒత్తిడి కారణంగా చిన్న ప్రేవుల కదలిక తగ్గుతుంది, పెద్ద పేగు కదలిక పెరుగుతుంది. ఈ కారణంగా విరేచనాలు, మలబద్ధకం మొదలైన అనేక రకాలైన లక్షణాలు కనిపిస్తాయి.

గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ డిజార్డర్స్‌లో వాడే కొన్ని రకాల మందులు మానసిక సమస్యలకు కారణం కావచ్చు. ఉదాహరణకు - హెపటైటిస్‌ వ్యాధిలో వాడే ఇంటర్‌ఫెరాన్స్‌ వ్యాకులతకు కారణమవుతాయి. సిమిటిడిన్‌ అనే మందు డెలీరియంకు, మెట్రోనిడజోల్‌ అనే మందు లిథియంతో కలిపి వాడిన ప్పుడు మూత్రపిండాలు దెబ్బ తినడానికి కారణమవుతాయి. అలాగే మానసిక వ్యాధుల్లో వాడే కొన్ని యాంటిడిప్రె సెంట్స్‌, క్లోర్‌ప్రొమజైన్‌ వంటివి ఎసిడిటీకి, మలబద్ధ కానికి కారణమవుతాయి.

లక్షణాలు
మానసిక సమస్యల్లో కనిపించే జీర్ణ వ్యవస్థ రుగ్మతల లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి.డిప్రెషన్‌లో ఆకలి తగ్గడం, పానిక్‌ అటాక్‌ కలిగినప్పుడు వికారం కలగడం సంభవిస్తాయి. ఈటింగ్‌ డిజార్డర్స్‌లో అధి కంగా తినడం, తరువాత వాంతి చేసుకోవడం వంటి లక్ష ణాలు కనిపిస్తాయి. సొమటైజేషన్‌ డిజార్డర్స్‌లో వికారం, కడుపు ఉబ్బరం, వాంతులు మొదలైనవి కనిపిస్తాయి. ఇటు వంటి అనేక లక్షణాలు ఈ సమస్యలో కనిపిస్తాయి.గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ సమస్యలు, ముఖ్యంగా ఫంక్షనల్‌ జిఐ సమస్యలు కలిగినప్పుడు వాటికి కారణమైన లేదా వాటికి కూడి ఉన్న మానసిక సమస్యలకు చికిత్స చేయడం ద్వారా ఈ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.

-డాక్టర్‌ ఎస్‌.ఆర్‌.ఆర్‌.వై. శ్రీనివాస్‌, న్యూరోసైకియాట్రిస్ట్‌, హైదరాబాద్‌

 • ===================================
Visit my website - > Dr.Seshagirirao.com/

అసిడిటీ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు , Acidity and treatment


"ఇదివరకు ఏం తిన్నా అరాయించుకునే వాళ్లం".." ప్రస్తుతం పరిస్థితి అలా లేదు". " ఏ ఆహారం తీసుకోవాలంటే భయమేస్తుందని" చెప్పే వారి సంఖ్య నానాటికి అధికమవుతోంది. ఏదైనా ఆహారం తీసుకోగానే తేన్పులు, చిరాకు, గుండెలో మంట వంటివి వస్తే.. ఈ పరిస్థితినే అసిడిటీ అంటారు .ఎసిడిటీ అనేది జబ్బు కాదు. జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోతే కడుపులో మంట అన్పిస్తుంది. పొట్టలో ఆమ్లాలు ఉత్పన్నమవుతాయి. రక్తంలో ఆమ్ల, క్షార సమతుల్యత సమపాళ్లలో ఉంటే ఈ సమస్య రాదు.

జీర్ణాశయంలోని జఠర గ్రంధులు జఠర రసాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ జఠర రసంలో హైడ్రో క్లోరిక్ ఆమ్లం ఉంటుంది. ఇది జీర్ణాశయంలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఒక్కోసారి ఇది అధికంగా తయారవుతుంది. అలా అధిక ఉత్పత్తి కావడాన్నే ‘ఎసిడిటీ’ అంటారు.

సాధారణంగా మనం తినే ఆహారంవలన, మన జీవన గమనం వలన ఎసిటిడీ వచ్చే వీలుంది. జిహ్వ చాపల్యం అధికంగా వుండేవారికి ఇది దగ్గరి చుట్టం. దొరికింది కదాని.. ఎక్కడపడితే అక్కడ.. ఏది పడితే అది తినేవారికి ఎసిడిటీ సమస్య అందుబాటులో ఉంటుంది.

ఎసిడిటీ వున్నవారికి చాతీలోను, గొంతులోను, గుండెల్లోనూ, జీర్ణాశయంలోనూ మంటగా వుంటుంది. పుల్లటి తేపులతో ఆహారం నోటిలోకి వచ్చినట్లుంది. కడుపు ఉబ్బరించి వాంతి వచ్చినట్లుంటుంది. మలబద్ధకం, అజీర్ణం పెరిగి ఆకలి మందగిస్తుంది.

జీవన విధానం.. మన దైనందిన జీవన విధానం కూడా ఎసిడిటీకి దారితీస్తున్నాయి. ఉద్యోగం, పిల్లలు, పిల్లల చదువులు.. సమాజంలో అవతలవారితో పోటీపడటం, ఉరుకులపరుగుల జీవనం తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ఈ మానసిక ఒత్తిడి ఆరోగ్యంమీద పనిచేసి ఎసిడిటీనీ కలిగిస్తున్నాయి. దీనినే ఈ విదంగా చెప్పవచ్చును ... Hurry , worry , curry ....... leads to Acidity .

ఉపశమనం.. జీవన విధానంలో మార్పులు తీసుకోవటం ద్వారా కొంతమేరకు దీని ఉపశమనం పొందవచ్చు.
 • ఆల్కహాల్, పొగ త్రాగుడు, గుట్కాలు లాంటి పదార్థాలను పూర్తిగా మానివేయాలి.
 • మానసిక ఆందోళనను తగ్గించుకోవాలి.
 • ఎక్కడపడితే అక్కడ ఫాస్ట్ఫుడ్స్ తినకూడదు.
 • మసాలాలతో కూడిన ఆహార పదార్థాలు తినటం తగ్గించుకోవాలి. ప్రతిరోజూ నియమిత సమయంలో, ఆహారాన్ని ఆదరా బాదరాగా కాక ప్రశాంతంగా.. బాగా నమిలి తినాలి.
 • తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
కాబట్టి ఎసిడిటీనీ పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ.. మన అలవాట్లు, ఆహార నియమాలలో వుంది. ప్రతివారూ కాస్త శ్రద్ధ తీసుకొని వీటిని పాటిస్తే.. ఎసిడిటీని తరిమేయవచ్చు.

ఈ అసిడిటీతో బాధపడేవారు తినవల్సిన /తినకూడని పదార్ధములు ...
పులుపు గా ఉన్న పదార్ధాలు తినికూడదు . ,
పచ్చిగా ఉన్న కాయలు , పండ్లు తినకూడదు ,
మసాలా వస్తువులు ఎక్కువగా తినకూడదు .,
తేలికగా జీర్ణం అయ్యే పదార్ధములే తినాలి ,
కొబ్బరి కోరుతో తయారయ్యే పదార్ధములు తక్కువగా తినాలి ,
నూనే వంటకాలు మితము గా తీసుకోవాలి (ఫ్రై ఫుడ్స్ ),


అసిడిటీని తగ్గించాలంటే...
ఆయుర్వేదము :
 ఆవకూర, మెంతి కూర, పాలకూర, క్యాబేజీ, ముల్లంగి ఆకులు, ఉల్లి కాడలు, తోటకూరలను తరిగి ఒకటిన్నర లీటరు నీళ్లలో వేసి బాగా మరిగించాలి. తరువాత అందులో ఉప్పు, అల్లం రసం, నిమ్మరసం, రెండు వెల్లుల్లి రెబ్బలు నలిపి కలియబెట్టాలి. అసిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సూప్ తాగితే ఒంట్లో తేలిగ్గా ఉంటుంది.

అల్లోపతి:
 • యాంటాసిడ్ మాత్రలు గాని , సిరప్ గాని ఉదా: tab . gelusil mps or sy.Divol --3-4 times for 4 days
 • యాసిడ్ ను తగ్గించే మాత్రలు : cap. Ocid -D.. 2 cap / day 3-4 days.
 • -----------------------Or. cap.Rabest-D.. 1 cap three time /day 3-4 days. వాడాలి .


అసిడిటీ మందులు దీర్ఘకాలం వాడొద్దు!
 • అజీర్ణం, పుల్లటి త్రేన్పులు, ఛాతీలో మంట వంటివి తరచుగా కనిపించే సమస్యలే. ముఖ్యంగా వృద్ధుల్లో ఎంతోమంది వీటితో బాధపడుతుండటం చూస్తూనే ఉంటాం. వీటి నుంచి తప్పించుకోవటానికి చాలామంది ఒమెప్రొజాల్‌ వంటి ప్రోటాన్‌ పంప్‌ ఇన్‌హిబిటార్స్‌ (పీపీఐ) మాత్రలు వేసుకుంటూ ఉంటారు. డాక్టర్లు సిఫారసు చేయకపోయినా సొంతంగా కొనుక్కొని వాడేవాళ్లూ లేకపోలేదు. అయితే వీటిని ముట్లుడిగిన మహిళలు దీర్ఘకాలం వాడటం మంచిది కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ఎముకల పటిష్ఠం తగ్గి.. తుంటి ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు. బోస్టన్‌లోని మసాచుసెట్స్‌ జనరల్‌ ఆసుపత్రికి చెందిన డాక్టర్‌ హమీద్‌ ఖలీల్‌ బృందం ఇటీవల ఒక అధ్యయనం చేసింది. నెలసరి నిలిచిపోయిన 80 వేల మంది మహిళలను పరిశీలించింది. మొత్తం ఎనిమిదేళ్ల పాటు చేసిన ఈ అధ్యయనంలో.. పీపీఐలు వాడేవారిలో తుంటిఎముక విరిగే ముప్పు 35% పెరిగినట్టు గుర్తించారు. ఇక పొగతాగే అలవాటుంటే ఇది మరింత ఎక్కువవుతుండటం గమనార్హం. ఈ మందులను ఆపేస్తే ఎముక విరిగే ముప్పు రెండేళ్లలోనే మామూలు స్థాయికి చేరుకుంటోంది కూడా. బరువు, వయసు, వ్యాయామం, పొగ తాగటం, ఆహారంలో క్యాల్షియం మోతాదు, క్యాల్షియం మాత్రల వాడకం వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఈ ముప్పును లెక్కించారు. ఆహారం ద్వారా నియంత్రించ గలిగే సమస్యలకూ డాక్టర్లు చాలాసార్లు పీపీఐలను సిఫారసు చేస్తున్నారని ఖలీల్‌ చెబుతున్నారు. వీటిని కొన్నాళ్లు వాడాక ఆపేయటమే మంచిదని.. అయితే వెంటనే మానేస్తే త్రేన్పులు, ఛాతీలో మంట వంటివి తిరగబెట్టే అవకాశం ఉన్నందువల్ల నెమ్మదిగా తగ్గించుకుంటూ రావాలని సూచిస్తున్నారు. సాధారణంగా ముట్లుడిగిన వారికి క్యాల్షియం మాత్రలనూ సిఫారసు చేస్తుంటారు. అయితే పీపీఐలు మన శరీరం క్యాల్షియాన్ని గ్రహించే ప్రక్రియను అడ్డుకుంటాయి. దీంతో క్యాల్షియం మాత్రలు వేసుకున్నా ప్రయోజనం కనబడటం లేదు. అందువల్లే క్యాల్షియం మాత్రలు వేసుకుంటున్న వారిలోనూ తుంటిఎముక విరిగే ముప్పు అలాగే ఉంటోందని ఖలీల్‌ పేర్కొంటున్నారు.

 • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, October 28, 2010

గుండెజబ్బులు , Heart diseasesమానవ దేహంలోని గుండె

మీకు సుపరిచితమైన లబ్ డబ్ శబ్దం సిరలు(veins)నుంచి గుండెకు మరియు ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే పనిలో మీ గుండె నిమగ్నమై ఉందని సూచిస్తుంది, అలా సరఫరా కాబడిన రక్తాన్ని ఆమ్లజనితో శుద్ధి చేసిన అనంతరం ధమనులు(arteries)ద్వారా శరీరానికి తిరిగి పంపిణీ చేస్తుంది.

గుండె ఎలా పని చేస్తుంది?
మానవ దేహంలోని గుండె అచ్చమైన పంపులాంటిది, మీ పిడికిలి పరిమాణంలో ఉండే గుండె శరీరంలోని మిలియన్ల సంఖ్యలో గల కణాల నుంచి రక్తాన్ని పంపిణీ మరియు స్వీకరించే కార్యకలాపాలను చేపడుతుంది. ఇది నాలుగు గదులుగా నిర్మితమై ఉంటుంది. చెరోవైపు గల రెండు గదులను పటిగా పిలవబడే గోడ కుడివైపును ఎడమవైపును విభజిస్తుంది.

ఈ రెండు స్వీకరించే గదులు కవాటములుగా(valves) పిలువబడే రెండు మార్గాలను కలిగి ఉంటాయి. గుండెకు చెరోవైపున ఉండే రెండు కవాటాలు గుండె ద్వారా రక్తం ప్రవహించేందుకు సహకరిస్తాయి. కుడివైపున గల త్రిపత్ర కవాటము(Tricuspid valve)మరియు ఎడమవైపున గల ద్విపత్రకవాటము(Mitral valve)చెరోవైపున కర్ణిక(Atrium)మరియు జఠరిక(Ventricle) మధ్య రక్త ప్రసారాన్ని నియంత్రిస్తాయి.

ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసేందుకు ఉద్దేశించిన పుపుస కవాటముగా(Pulmonary valve) పిలవబడే కుడి కవాటము కుడి జఠరిక నుంచి పుపుస ధమనులకు రక్త ప్రసరణను అనుమతిస్తుంది. బృహద్ధమన కవాటముగా(Aorta valve)పిలవబడే ఎడమ కవాటము, ఎడమ జఠరిక నుంచి బృహద్ధమనికి(Aorta) రక్త ప్రసరణను నియంత్రిస్తుంది.

ఆరోగ్యవంతమైన దేహంలో నిరంతరాయంగా ప్రవహించే దిశగా ఐదు లీటర్ల రక్తాన్ని గుండె పంపు చేస్తుంది. గుండె నుంచి బయలుదేరిన రక్తం ధమనులుగా పిలవబడే నాళాల ద్వారా కేశనాళికలుగా(capillaries) పిలవబడే రక్త నాళములలో అతి సూక్ష్మమైన నాళికల ద్వారా ప్రవహించి చివరకు గుండెకు చేరవేసే సిరలలోకి ప్రవేశిస్తుంది.

ఈ కార్య చక్రం 60 సెకండ్లలో పూర్తి అవుతుంది, అదే సమయంలో దేహం యొక్క కణాలలోని ధాతువులు, అంగాలు, కండరాలు మరియు ఎముకలకు ఆమ్లజనితో పాటు బలవర్థకాన్ని రక్తం అందిస్తుంది.


గుండెజబ్బులు

గుండెజబ్బులు రావటానికి ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయి. మధుమేహం, రక్తపోటు, పొగత్రాగటం, అధిక కొవ్వు, అధిక బరువు, ఒత్తిడి, వ్యాయామం చేయకపోవటం వంటి కారణాలు ప్రధానమైనవి. ఇదివరకు పురుషులు మాత్రమే ఎక్కువగా గుండె జబ్బులకు గురయ్యేవారు. అయితే ఇప్పుడు మహిళలలో కూడా గుండె జబ్బులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.సహజంగా చిన్నపిల్లల్లో తలెత్తే హృదయ సంబంధిత వ్యాధులు వంశపారంపర్యంగా సంక్రమించేవిగా ఉంటున్నాయి. అదేవిధంగా పుట్టుకతో వచ్చే వ్యాధులు కూడా ఉంటున్నాయి. గుండెజబ్బులు తలెత్తే వారిలో కేవలం 20 శాతం మందికి మాత్రమే శస్త్ర చికిత్సలు అవసరమవుతాయి. నిజానికి గుండె జబ్బు ఉన్నట్లు ముందుగా గుర్తించినట్లయితే మందులతోనే వ్యాధిని నయం చేయవచ్చు. అయితే కొందరు వ్యాధిని గుర్తించినప్పటికీ సత్వర చికిత్సను అశ్రద్ధ చేస్తారు. ఫలితంగా మందులతో నయమయ్యే వ్యాధి కాస్తా శస్త్ర చికిత్సకు దారి తీస్తుంది. నిపుణులైన వైద్యులు ఒకసారి వ్యాధి పరిస్థితిని వివరించిన తర్వాత దానికి తగ్గట్లుగా స్పందిస్తే రోగి ప్రాణాలను కాపాడినవారవుతారు.

లక్షణాలు
ఉదర సంబంధిత నొప్పి రావటం, అసాధారణమైన నాడీ స్పందన, గుండెపోటు, ఆయాసం, ఆకలి మందగించటం, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తటం, ఛాతీ నొప్పి, చర్మం నీలి వర్ణంలోకి మారటం, మానసిక వ్యాకులత, కళ్లు తిరగటం, శ్వాసావరోధం, వంటికి నీరు చేరటం, మూర్చిల్లటం, వేగమైన హృదయ స్పందన, జ్వరం, దగ్గుతోపాటు రక్తం పడటం, కండరాలు బిగుతుగా మారటం, బరువు పెరగటం, బరువు తగ్గటం వంటివి వాటిని మనం హృదయ సంబంధిత సమస్యలకు సంబంధించి లక్షణాలుగా చెప్పుకోవచ్చు.

జాగ్రత్తలు
ధూమపానం అలవాటును మానుకోవాలి. ప్రతి రోజూ అర గంటసేపు నడక అలవాటును తప్పక పాటించాలి. రక్తపోటు మరియు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. టెన్షన్‌ను విడనాడాలి. ఎల్లప్పుడూ సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. ఆశావహ దృక్పథాన్ని అలవరుచుకోవాలి.

ఆహారాన్ని
ప్రధానంగా అధికంగా నూనెల వాడటాన్ని తగ్గించుకోవాలి. దీంతోపాటు తాజా పండ్లను, కూరగాయలను తీసుకుంటుండాలి.

క్లిష్టమైన శస్త్ర చికిత్సలు
పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత వ్యాధులు, గుండెకు కొవ్వు చేరటం, హార్ట్ ఫెయిల్యూర్ విషయంలో శస్త్ర చికిత్సలు క్లిష్టతరంగా ఉంటాయి.

Updates : Heat diseases ->

ఐక్యూ (తెలివితేటలు) తక్కువగా వున్న వ్యక్తులకు సగటున గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయని ఇటీవల ఒక సర్వేలో పరిశోధకులు నిర్ధారించారు. దాదాపు నాలుగు వేల మందిపై నిర్వహించిన ఈ సర్వే వివరాలను యూరోపియన్‌ హార్ట్‌ జర్నల్‌ తాజా సంచికలో ప్రచురించారు. ఇందులో ఉన్నత, దిగువ స్థాయి సామాజిక, ఆర్థిక వర్గాలలో మరణాల వ్యత్యాసం దాదాపు 20 శాతానికి పైగా వుందని వీరు నిర్ధారించారు. సామాజిక, ఆర్థిక వెనుకబాటు తనానికి గురైన వర్గాల వారు గుండెజబ్బులు, క్యాన్సర్‌, ప్రమాదాల వంటి వాటితో త్వరగా మరణించేందుకు అవకాశం వున్నట్లు తమకు తెలుసని ఈ సర్వే బృందానికి నేతృత్వం వహించిన డా.డేవిట్‌ బట్టి చెప్పారు. వాతావరణ పరిస్థితుల ప్రభావం, ధూమపానం, భోజనం, భౌతిక కార్యకలాపాల వంటి ఆరోగ్యపరమైన ప్రవర్తన వంటి అంశాలు ఈ వ్యత్యాసానికి కారణాలని, అయితే ఇందులో అన్నీ ఇందుకు కారణం కాబోవని వివరించారు. తెలివితేటల పెరుగుదలకు దోహదపడే అంచనాకు అందని మానసిక కారణాల వల్ల గుండెజబ్బుల పెరుగుదలకు అవకాశం వుందని ఆయన వివరించారు.

విటమిన్‌ బితో పక్షవాతం, గుండెజబ్బులు దూరం

ఆరోగ్యానికి 'బి విటమిన్లు చేసే మేలు గురించి అందరికీ తెలిసిందే అయితే మరోసారి ఈ 'బి విటమిన్లలోని ఫోలేట్‌, బి6 ఉన్న ఆహారాన్ని తీసుకుంటే పక్షవాతం, గుండెజబ్బుల వల్ల కలిగే మరణాల ముప్పు తగ్గుతుందని జపాన్‌ పరిశోధ కుల అధ్యయనంలో తేలింది.

జపాన్‌ కొలాబరేటివ్‌ కోహార్ట్‌ స్టడీలో భాగంగా 40-79 ఏళ్ళ మధ్యగల 23, 119 మంది పురుషులు, 35, 611 మంది మహిళల మీద అధ్యయనం చేశారు. వారి ఆహార అలవాట్లను నమోదు చేసుకుని, 14 సంవత్సరాల పాటు గమనించారు.

అనంతరం చనిపోయిన వారి వివరాలను సునిశితంగా పరిశీలించారు. వీరిలో ఫోలేట్‌, బి6 ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్న పురుషుల్లో గుండె వైఫల్యం కారణంగా వచ్చే మరణాలు తక్కువ సంఖ్యలో నమోదైనట్టు గుర్తించారు. అదే మహిళల్లో గుండెజబ్బులు, పక్షవాతం వల్ల కలిగే మరణాలు తక్కువగా ఉన్నాయి.

మనం తినే ఆహారంలో ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, పొట్టుతీయని ధాన్యాలు, బీన్స్‌, ఆకుకూరల్లో ఫొలేట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇక బి6 చేపలు, కాలేయం, ముడిధాన్యాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇవేకాక నూనెలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే పక్షవాతం, గుండె జబ్బులకు చెక్‌ చెప్పడమే కాకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు. అంతేకాదు ఈ ఆహారాన్ని తీసుకోవడం శరీరానికి పీచుపదార్థం (ఫైబర్‌) ఎక్కువగా అందుతాయి. స్థూలకాయులు కూడా ఈ ఆహారాన్ని మితంగా తినడం వల్ల స్థూలకాయాన్ని తగ్గించుకోవ్ఞ్చ.

వయస్సుతోపాటు వచ్చే గుండెజబ్బులు
మన దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ గుండె జబ్బుల శాతం రోజురోజుకూ అంచనాలను మించి పెరుగుతూనే ఉంది.
ఈ జబ్బులు పుట్టుకతోనూ, కౌమార, యవ్వన దశలల్లోనూ, ఇంకా వయస్సు మీద పడుతున్న వారిలోనూ వస్తూనే ఉన్నాయి. అయితే పుట్టుకతో వచ్చేవి, తరువాత దశల్లో అవి ఇంకా పెరిగి ప్రాణాం తకంగా మారుతున్నాయి.
ఈనాడు యుక్త వయస్కులు వారు చేసే ఉద్యోగ, జీవన విధానాలు, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటివాటి వల్ల తరచుగా ఈ గుండెజబ్బులకు గురవుతున్నారు.

వయస్సు పెరిగిన కొద్దీ శరీరంలోని ధమనుల లోనూ, గుండెలోనూ అనేక మార్పులు సంభవిస్తాయి. ఇటీవల వరకూ ఈ మార్పులు వయస్స పెరగడం వల్లనే సంభవిస్తున్నాయని భావించేవారు.
అయితే ప్రస్తుతం లభిస్తున్న గణాంకాల ప్రకారం ఈ మార్పులు జీవన విధానం వల్ల కరొనరీ ధమనుల్లో పేరుకున్న పీచు, కొవ్వు పదార్థాల మిశ్రమం అని నిర్ధారిస్తున్నారు.

ఈ కరొనరీ ధమనులు గుండెకు పోషకాలను ఆక్సిజన్‌ ద్వారా అందజేస్తాయి. వీటి ప్రసరణకు అడ్డంకి ఏర్పడితే గుండె పని తీరు సహజత్వాన్ని కోల్పోయి గుండె కండరానికి రుగ్మత ఏర్పడుతుంది.
శరీరంలో రక్త పీడనం అంటే బ్లడ్‌ ప్రెషర్‌ సాధారణ స్థితిని దాటినప్పుడు గుండెజబ్బులు వస్తాయి. సాధారణంగా సిస్టోలిక్‌, డయాస్టోలిక్‌తో నిర్ధారిస్తారు. ఈ రీడింగు 130/80 ఎంఎంహెచ్‌జిగా ఉండాలి. శరీరంలో మిలియన్ల కొద్దీ జీవకణాల్లో ప్రతి ఒక్క కణానికి పోషణ నిమిత్తం రక్త ప్రసరణ జరగడానికి తగినంత ఒత్తిడి అవసరం. ఈ ఒత్తిడినే బిపిగా కొలుస్తారు.
పెద్దలలో సాధారణంగా రక్త ప్రసరణం 140/90 కంటే ఎక్కువ ఉండకూడదు. తీవ్రంగా వ్యాయామం చేసినప్పుడు, ఉద్రిక్తదశలోనూ పీడనం పెరుగుతుంది.

అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు కొన్ని ముఖ్యమైన పరీక్షలు జరుపవలసి ఉంటుంది. లిపిడ్స్‌ శాతం పరీక్షించినప్పుడు ఉండవలసిన స్థాయికంటే ఎక్కువగా ట్రైగ్లిజరేట్లు, ఇతర కొవ్వు పదార్థాలు ఎక్కువవయితే హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మనవారిలో ముఖ్యంగా హెచ్‌డిఎల్‌ అనే మంచి కొలస్ట్రాల్‌ తక్కువగా ఉండటం గమనార్హం. ఈ కొవ్వు పదార్థాలు వయస్సుతోపాటు పెరిగి రక్త ప్రసరణ సాఫీగా జరుగకుండా ఆటంకపరుస్తాయి.

బాల్యం నుంచే పేరుకునే ఈ కొవ్వు ప్రక్రియనే Atherosclerosis అంటారు. దీని ఫలితంగా ధమనులు వ్యాకో చించకుండా గట్టిగా అయి కఠినంగా మారుతాయి. ధమని అంతర వ్యాసం తగ్గిపోయి గుండె శరీరంలోని చివరి భాగానికి రక్త సరఫరా జరుగదు. గుండె కండరం సాధారణ స్థాయి కంటే ఎక్కువ శ్రమపడవలసి వస్తుంది. దీని వల్ల గుండెకు అలసట కలిగి గుండెనొప్పి ప్రారంభమవుతుంది.

వయస్సు పెరిగి రక్తపోటు, మధుమే హంతో బాధపడే వారిలో గుండెజబ్బు వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ. చాలామందికి వయ స్సు మీదపడిన తరువాత డయాబెటిస్‌ వస్తుంది.స్థూలకాయం, వార సత్వం, వయోభారం, కుటుంబ చరిత్రలో గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటివి ప్రమాదకరంగా పరిణ మిస్తాయి.
నిద్ర మాత్రలకు అలవాటుపడిన స్త్రీల లోనూ, వయసుతో కొంతమార్పు వచ్చిన, జీవన శైలి వల్లను, ధూమపానం వల్ల కూడా గుండెజబబ్బులు వచ్చే అవకాశాలు పెరుగు తాయి. ఆందోళన, ఒత్తిడి, రెండు ప్రధాన కారణాలు. ఇవి ఎక్కువకాలం ఉంటే ఇతర జబ్బులతో గుండెజబ్బులు కూడా వస్తాయి.

తీసుకోవలసిన జాగ్రత్తలు
మనం వయస్సు పెరుగుతున్న కొద్దీ అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్‌గా ఫిజిషి యన్‌ను లేదా కార్డియాలజిస్తును సంప్రదిం చాలి. బాల్యంలోనూ, పాఠశాలలోనూ గుండె జబ్బుల నిరోధానికి కృషి చేయాలి. అలా చేస్తే హృద్రోగం దరి చేరదు. దానికి సంబంధించిన మార్గదర్శక సూత్రాలు పాటించాలి.
అవి ఆహార నియమాలు, మితమైన ఆల్క హాల్‌, ధూమపానం మానడం, వ్యాయామం చేయడం, ఒత్తిడి తగ్గించుకోవడం వంటివి. బి.పి. డయాబెటిస్‌ అదుపులో ఉంచుకోవాలి.

ఎకోకార్డియోగ్రామ్‌ ఒక జిరాక్స్‌ కాపీని ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలి. కామినేని ఆసుపత్రిలో దీనికి సంబంధించిన ప్యాకేజీలు మనకు ఎంతోకాలంగా అందుబాటులో ఉన్నాయి. గుండెకు సంబంధించిన పరీక్షలు అతి తక్కువ ఖర్చుతో చేయించుకుని ఇంట ర్‌వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ సలహా పొందవచ్చు.

వ్యాధి వచ్చిన తరువాత ఆందోళన, ఆదుర్దా పడేకంటే, రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసు కోవాలో, అవి తీసుకుంటే మంచిది.

-
స్త్రీలలో గుండెజబ్బులు : చికిత్సలు(డాక్టర్‌ ప్రమోదక్‌ కుమార్‌ కె. ఇంటర్‌వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌, వొకార్డు హార్ట్)

గుండెజబ్బులు స్త్రీలను నేడు ఎక్కువగా కబళి స్తున్నాయి. ఇవి ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారికి కరొనరీ ధమనులు కుంచించుకు పోవడం ఆ ప్రదేశంలో కొవ్వు శాతం ప్రోగవడం క్రమంగా ఈ స్థితి గుండెపోటుకు దారి తీస్తుంది. దీనికి అనేక కారణాలు చెప్పబడుతున్నాయి. ఈ ప్రమాదం కలిగించే కారణాలలో కొన్నింటిని మనం తగ్గించుకోవచ్చు. అంటే మన జీవనశైలిని మార్చుకోవడం ద్వారా, ఉదాహ రణకు - రక్తపోటు నియంత్రణలో ఉంచడం, మధుమేహం అదుపు, వ్యాయామం వంటివి అవసరమైన మేర చేయడం, కొవ్వు పదార్థాలు తినకపోవడం వంటివి. అయితే మనం కొన్నింటిని మార్చలేము. ఉదాహరణకు వయస్సు, రేసు, కుటుంబ చరిత్ర వంటివి.

ప్రమాదం ఎలా కనిపెట్టాలి?
ఫ్రామింగ్‌హమ్‌ హార్ట్‌ స్టడీ పరిచయం చేసిన పట్టిక ప్రకారం గుండె జబ్బు తీవ్రత, దాని హెచ్చుతగ్గులు స్థాయిలు రాబోయే 10 సంవత్సరాల వరకూ అంచనా వేయవచ్చు. ఈ స్థాయి 20 శాతం ఉంటే చాలా ఎక్కువ. 10 నుంచి 20 శాతం అయితే మధ్యస్థం, 10 శాతం కంటే తక్కువ అయితే ప్రమాదం చాలా తక్కువ. అవసరాన్నిబట్టి వైద్య సహాయం పొందాల్సి ఉంటుంది.

ఎలా కాపాడుకోవాలి?
(జబ్బు తాలూకు సంఘటనను తెలుసుకొను శాస్త్రం) ఎపిడమలాజికల్‌ స్టడీస్‌ సహాయంతో 80 శాతం ప్రమాదాలు చిన్న చిన్న జీవన విధానాలు మార్చుకోవడం ద్వారా తగ్గించవచ్చు.

పొగ తాగవద్దు : ప్రమాదం రెట్టింపు అవడానికి మీరు రోజూ తాగే 1 నుంచి 4 సిగరెట్లు చాలు. పొగ తాగడం ఆపివేస్తే 50 శాతం రిస్కు మొదటి సంవత్సరంలో తగ్గించుకోవచ్చు. 5 సంవత్సరాల తరువాత పొగ అసలు తాగనివారితో సమానంగా ఉంటారు.
శారీరక ఆరోగ్యం : కనీస వ్యాయామం చేయాలి. ఏరోబిక్స్‌, బ్రిస్క్‌వాక్‌ వంటివి చేయడం ద్వారా రాబోయే ప్రమాదాన్ని 30 నుంచి 40 శాతం తగ్గించుకోవచ్చు.

ఆహారపు అలవాట్లు : ఆహారంలో పండ్లు, కూరగాయలు, కొవ్వు పదార్థాలు లేనివి, చేప, దినుసులు, పౌల్ట్రీ వంటివి తీసుకోవడం
బరువు సమతూకం : బి.ఎం.ఐ. సూచిక, ఇది 18.5 నుంచి 24.9 మధ్య ఉండేట్లు చూసుకోవాలి. నడుము కొలత 35 కంటే తగ్గించుకోవాలి. తీపి, కొవ్వు పదార్థాలు మానడం, స్నాక్స్‌ తినకపోవడం వంటి అలవాట్లతో సరైన బరువు ఉంచుకోవచ్చు.
గర్భధారణ సమయంలో గుండె జబ్బులు వస్తే?
గర్భం ధరించిన తరువాత గుండె వ్యవస్థలో అనేక మార్పులు వస్తాయి. గుండె మోయవల సిన బరువు ఎక్కువ అవుతుంది. ఏదేమైనా గుండెజబ్బుతో బాధపడేవారు గర్భం దాలిస్తే దుష్ఫలితాలు పిండం మీద, తల్లి మీద ఉంటాయి.

చికిత్స
కార్డియాలజిస్టు పర్యవేక్షణలో రోగి ఉండాలి. తరచూ పరిస్థితిని అంచనా వేయాలి. ఉదా హరణకు - ఎక్స్‌రే, ఇసిజి, స్కానింగ్‌ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అవసరమైన వైద్యం చేయడం వల్ల ప్రసూతి వైద్యునిపు ణులకు వెసలుబాటుగా ఉంటుంది. తల్లి గుండె పరిస్థితి తెలుస్తుంది.

ప్రెగ్నెన్సీ సమయమంతా మందులు వాడాలా?
కార్డియాలజిస్టు లోతుగా ఆలోచించి, పరీ క్షించి మందులురాస్తారు. మధ్యమధ్యలో మార్చ వలసి ఉంటుంది. వాల్వ్‌రిప్లేస్‌మెంట్‌ అయిన వారు వాడే యాంటికోయాగ్యులేషన్‌ మందులు అవరోధం. వీటి గురంచి రోగితో చర్చించి ఏం వాడాలో, ఎలా వాడాలో శరీర ధర్మశాస్త్రం ప్రకారం వివరిస్తారు. ఈ అవసరం గుండె జబ్బులు ఉండి ప్రెగ్నెన్సీ ధరించదలచుకున్న వారికి అవసరం. వారి శరీర ధర్మశాస్త్ర ప్రకారం నిర్ణయిస్తారు. గుండె జబ్బులు ఉన్నవారు గర్భం ధరిస్తే వచ్చే ప్రమాదాలు లేనివారు ధరిస్తే వచ్చే ప్రమాదాల కంటే 10 శాతం ఎక్కువ.ఇంకా విడమర్చి చెప్పా లంటే తల్లిదండ్రులకు ఇద్దరికీ గుండె జబ్బులు ఉంటే పిల్లలకు ఇది ఇంకా ఎక్కువ శాతం స్కానింగ్‌ ద్వారా గుండెకు సంబంధించిన సమస్య బిడ్డలో ఏమైనా ఉందేమో తెలుసు కోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు గర్భం తొలగించాల్సి ఉంటుంది.

గర్భధారణ చివరి మూడు నెలల్లో గుండె 20 సార్లు ఎక్కువగా కొట్టుకుంటుంది. రక్తహీనత ఏర్పడి హీమోగ్లోబిన్‌ లెవెల్స్‌ తగ్గుతాయి. ప్రసవ సమయంలో ఆక్సిజన్‌ ఎక్కువగా అవసరమవుతుంది. తద్వాఆర బి.పి. గుండె రేటు ఎక్కువవుతుంది. ప్రసవం తరువాత 12 - 24 వారాలు గుండె రక్త ప్రసరణ సాధారణ స్థితికి చేరుకోవటానికి పడుతుంది.ఏదేమైనా స్త్రీలలో గుండెజబ్బులు సాధారణమైపోయాయి. 45 సంవత్సరాలు పైబడిన తరువాత ప్రతి సంవత్సరం రెగ్యులర్‌ చెకప్‌ చేయించుకోవాలి. వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాలి. గర్భంలో ఉండి గుండె జబ్బులు వస్తే ముందు జాగ్రత్త పడటం కార్డియాలజిస్టు పర్యవేక్షణలో ఉంచడం చేయాలి. రిస్క్‌లు గణాంకపరంగా చెప్పలేము. సిహెచ్‌డి ఉన్న స్త్రీలలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టే అవకాశం ఉంది.
-------------------------------------------------------------------------------------------------
పుట్టుకతో వచ్చే గుండె రంధ్రాలను మూయటానికి ఇప్పుడొక కొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది. బయోస్టార్‌ అనే ఇది ఆర్నెళ్ల తర్వాత శరీరంలో కలిసిపోతూ చిన్న, మధ్య రకం రంధ్రాలను సమర్థవంతంగా మూసివేస్తోంది కూడా. బయోస్టార్‌ అమర్చిన 10 మంది పిల్లలపై ఇటీవల అధ్యయనం చేశారు. దీనిని అమర్చిన వారిలో 24 గంటల్లో 90 శాతం వరకు రంధ్రాలు మూసుకుపోగా.. ఆరు నెలల తర్వాత పూర్తిగా మూసుకుపోయాయి. గొడుగులాంటి ఈ పరికరాన్ని ఆపరేషన్‌తో పనిలేకుండానే గుండెలో అమరుస్తారు. ఇది లోహాలతో తయారుచేసే ఇతర పరికరాలతో సమానంగా పనిచేస్తున్నట్టు టొరంటోలోని ఓ పిల్లల ఆసుపత్రి ఎండీ లీ బెన్సన్‌ అంటున్నారు. ఆరునెలల తర్వాత ఈ పరికరం పూర్తిగా కరిగిపోయి దాని మీద కొత్త కండరం వస్తోంది. కేవలం దీనికి దన్నుగా ఉండే సన్నటి తీగలు మాత్రమే మిగిలాయి. ఇందులో చాలా కొద్ది మొత్తంలోనే లోహాలు ఉంటాయి కాబట్టి గుండె లయ దెబ్బతినే వారికి చికిత్స చేయటంలోనూ ఇది బాగా ఉపయోగపడొచ్చని లీ బెన్సన్‌ భావిస్తున్నారు. ఇప్పటివరకు వినియోగిస్తున్న పరికరాలనీన లోహంతో తయారైనవే. దీంతో మున్ముందు ఆ లోహాలు అరగటం, గుండె గదులతో రాపిడి మూలంగా తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లకు దారి తీయటం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొత్త పరికరంతో ఇలాంటి ఇబ్బందుల బెడద తప్పుతుంది. ఈ బయోస్టార్‌ని అమర్చినవారిలో ఒకరికి మాత్రమే రంధ్రం సరిగా మూతపడలేదు. అయినప్పటికీ ఎలాంటి రక్తస్రావం జరగకపోవటం గమనార్హం.

గుండెకు యోగా..
గుండె గుప్పెడంతే.. కానీ శరీర ఆరోగ్యంలో దాని పాత్ర కొండంత.అందుకే గుండెని పదిలంగా ఉంచుకొంటూ ఎప్పటికప్పుడు దాని పరిరక్షణకి శ్రద్ధ తీసుకోవడం అత్యవసరం అంటున్నారు యోగ నిపుణురాలు అరుణ. యో్గా వలన గుండెజబ్బులు నివారించవచ్చును.

పవన ముక్తాసనం

వెల్లకిలా పడుకొని కాళ్లు రెండింటిని దగ్గరగా ఉంచాలి. గాలిని తీసుకొంటూ కుడికాలిని పైకి మడిచి మోకాలిని పొట్ట వైపునకు రెండు చేతులతో నొక్కిపట్టి ఉంచాలి. తర్వాత మెల్లగా గాలిని వదులుతూ తలని పైకి లేపి మోకాలిని పెదవులకు ఆనించాలి. పది నుంచి ఇరవై సెకన్ల పాటు అలా ఉంచి తలని యథాస్థానానికి తీసుకురావాలి. తర్వాత గాలిని వదులుతూ కాలిని కిందికి పెట్టాలి. ఇదే విధంగా ఎడమ కాలితో కూడా చెయ్యాలి. మార్చిమార్చి ఆరు సార్లుచెయ్యాలి.
శశాంకాసనం
వజ్రాసనంలో కూర్చుని రెండు చేతులు వెనుకకు పెట్టాలి. చేతులను ఒకదానితో ఒకటి అంటే ఎడమచేతి మణికట్టుని కుడిచేతితో పట్టుకొని నెమ్మదిగా గాలి తీసుకొని ఆ గాలిని వదిలేస్తూ మెల్లగా ముందుకు వంగాలి. నుదుటిని నేలకు ఆనించి గాలిని పీలుస్తూ వదులుతూ అలా పది సెకన్లు ఉండి మెల్లగా గాలిని పీల్చుకొంటూ పైకి రావాలి. ఇలా మూడు సార్లు చెయ్యాలి.
ఓంకార ప్రాణాయామం
ప్రశాంతంగా కూర్చొని రెండు చేతులు సూర్యముద్రలో మోకాళ్లమీద పెట్టి నెమ్మదిగా గాలిని తీసుకోవాలి. తిరిగి గాలి వదిలేటప్పుడు ఓంకార శబ్దం చెయ్యాలి. ఓమ్‌ ఎలా అనాలంటే ముందుగా నాభి నుంచి అ కార శబ్దాన్ని చేస్తున్నట్లు వూహించుకోవాలి. పెదాలని సున్నాలా చుట్టి ఉకార శబ్దాన్ని చెయ్యాలి. తర్వాత పెదాలని మూసి 'మ్‌' శబ్దం చెయ్యాలి. ఇలా చేస్తే ఓంకారం వినబడుతుంది. నేరుగా ఓం అనడం కన్నా ఇలా చెయ్యడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

 • సూర్యముద్ర: ఉంగరం వేలు మడిచి గోరువైపు నుంచి మొదటి కణుపు మీద బొటనవేలు ఉంచాలి. మిగిలిన
వేలు నిటారుగా ఉంచాలి. ఈ ముద్ర వల్ల కొవ్వు బాగా తగ్గుతుంది. గుండె సంబంధిత ఇబ్బందులు ఉన్నవాళ్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
అనులోమ విలోమ ప్రాణాయామం
సుఖాసనంలో కూర్చొని ఎడమ చెయ్యి ఎడమ మోకాలు మీద చిన్‌ముద్ర (బొటన వేలు, చూపుడు వేలును కలిపి మిగిలిన వేళ్లను నిటారుగా ఉంచాలి)లో ఉంచి కుడి చెయ్యి నాసికాముద్రలో అంటే చూపుడు వేలు మధ్యవేలు మడిచి చిటికెన వేలు, ఉంగరం వేలు నిటారుగా ఉంచాలి. ముందుగా కుడిముక్కు మూసి ఎడమ ముక్కుతో గాలిని తీసుకొని కుడిముక్కుతో గాలిని వదిలి మరల అదే ముక్కుతో గాలి తీసుకొని ఎడమ ముక్కు నుంచి వదలాలి. ఇది ఒక రౌండు అంటారు. ఇలా ఐదు నుంచి పదినిమిషాలు చెయ్యాలి.
గమనిక: గుండె శస్త్రచికిత్సలు జరిగిన వాళ్లు... సంబంధిత ఇబ్బందులున్నవారు తప్పనిసరిగా వైద్యుల సలహాతో.. నిపుణుల ఆధ్వర్యంలో వీటిని చేయాల్సి ఉంటుంది.
కటి ఆసనం
నేలపై వెల్లకిలా పడుకొని కాళ్లని తొంభై డిగ్రీల కోణంలో పెట్టాలి. నెమ్మదిగా మోకాళ్లు కొద్దిగా పైకి మడిచి ఉంచి.. రెండు చేతులతో రెండు కాళ్ల బొటనవేళ్లు పట్టుకొని కాళ్లు కాస్త ఎడంగా పెట్టాలి. ఇలా చేసేటప్పుడు తలని పైకి ఎత్తకూడదు. ఈ ఆసనం వల్ల గుండెకు రక్తం బాగా సరఫరా అవుతుంది.

గుండెకు 'కొలి'మి--updated 25-12-2010
మీరు తాగుతున్న నీరు సురక్షితమైనదేనా? అందులో ఇ.కొలి బ్యాక్టీరియా ఉందేమో ఓసారి పరీక్షించుకోండి. ఈ బ్యాక్టీరియాతో కలుషితమైన నీటిని తాగితే మున్ముందు అధిక రక్తపోటు, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యల బారిన పడే ప్రమాదముంది. 2000 సంవత్సరంలో ఇ.కొలి బ్యాక్టీరియాతో కలుషితమైన నీటిని తాగి జబ్బుపడిన వారిపై కెనడా పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు. ఎనిమిదేళ్ల తర్వాత వీరిని పరిశీలించగా తీవ్రంగా జబ్బుపడిన వారిలో అధిక రక్తపోటు, కిడ్నీ సమస్యలు, గుండెజబ్బులు, పక్షవాతం వంటివి ఇతరుల కన్నా ఎక్కువగా కనిపించాయి. పలుదేశాల్లో చాపకింద నీరులా విస్తరిస్తున్న గుండెజబ్బుల నివారణకు సురక్షిత నీటి సరఫరా కీలకమైన అంశమని తాజా పరిశోధన సూచిస్తోంది.

హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన , Heart diseases Awareness

- డాక్టరు బుడుమూరు అన్నాజీరావు,కార్డియాలజిస్ట్‌, కిమ్స్‌ సాయి శేషాద్రి ఆసుపత్రి--గుండె సంబంధ ఇబ్బందులపై డాక్టరు అన్నాజీరావు చెప్పిన వివరాలివి...


'హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన లేదు. అందుకే గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. స్వల్ప జాగ్రత్తలు తీసుకుంటే.. తేలిగ్గా అధిగమించవచ్చు. ఆహార నియమాల్లో జీవనశైలి మారిపోవడమే హృద్రోగాలకు కారణం. దేశంలో 26 లక్షల మంది ఈ వ్యాధులతో బాధపడుతున్నారు. 54 శాతం పల్మనరీ హార్ట్‌ పీడితులున్నారు. మన జిల్లాలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. శారీరక శ్రమ, వ్యాయామం చేయకపోవడం, మితిమీరి భుజించడం, వంట నూనెల వాడకంలో జాగ్రత్తలు తీసుకోకపోవటం శరీరంలో కొవ్వు పెరిగి
గుండెపోటుకు దారితీస్తోంది. పని ఒత్తిడి వల్ల కనీసం ఆరోగ్య పరీక్షలు చేయించుకోలేకపోతున్నాం. పిల్లల్లోనూ గుండెపోటు కనిపిస్తోంది. అందుకే ప్రభుత్వం అంటురోగాలు కానివాటి కోసం ప్రతీ ఆసుపత్రిలో ప్రత్యేక క్లినిక్‌ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది.

- జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డాక్టరు ఎన్‌.ప్రసాద్‌--భయమెందుకు..?
గుండె పోటుతో భయపడాల్సిన పని లేదు. పిండం వృద్ధి చెందిన 21 రోజుల నుంచి తుది శ్వాస విడిచే వరకూ గుండె నిరంతరాయంగా పని చేస్తుంది. చాలామంది గుండెపై కనీస శ్రద్ధ కూడా చూపరు. అందుకే హృద్రోగానికి గురైన కొన్ని సందర్భాల్లో క్షణాల్లోనే మరణం సంభవిస్తోంది. చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మన హృదయం పదిలంగానే ఉంటుంది. రెస్టారెంట్లు, దాబాల్లో ఆహార పదార్థాలకు యువత దూరంగా ఉండడమే మేలు. పిజ్జాలు, బర్గర్లను తినటం వల్ల గుండె రక్తనాళాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి.

- డాక్టరు బుడుమూరు అన్నాజీరావు,కార్డియాలజిస్ట్‌, కిమ్స్‌ సాయి శేషాద్రి ఆసుపత్రి-గుండె సంబంధ ఇబ్బందులపై డాక్టరు అన్నాజీరావు చెప్పిన వివరాలివి...

ఇరవై ఏళ్ల నుంచే సమస్యలు-- గతంలో యాభై ఏళ్లు దాటితే గుండెనొప్పి గురించి ఆలోచించేవాళ్లు. ఇపుడు 20 ఏళ్లు దాటిన వారిలో ఇది కనిపిస్తోంది. జన్యు లోపాల వల్ల చిన్నారుల్లోనూ గుండె జబ్బులు పెరుగుతున్నాయి. చిన్న పిల్లల్లో పక్కటెముకలు ఎగిరితే.. చిన్నపిల్లల వ్యాధి లక్షణాలుగా భావిస్తుంటాం. ఇది గుండెజబ్బుకు సూచిక.

గుండె నొప్పి లక్షణాలు
గుండెకు రక్తం అందించే రక్తనాళాల లోపల గోడలకు కొవ్వు పేరుకుపోయి రక్తప్రసరణ తగ్గుతుంది. గుండె కండరానికి రక్తం సరఫరా తగ్గి నొప్పి మొదలవుతుంది.గుండెకు అసౌకర్యంగా ఉండి.. నొప్పి క్రమేపీ ఎడమ చేతికి, కొన్నిసార్లు కుడి చేతికి.. గొంతు, దవడలు, నడుము, ఉదరం ఇలా వివిధ ప్రాంతాలకు విస్తరిస్తుంది.శ్వాస కష్టమవుతుంది. శరీరమంతా చెమటలు పట్టడం, కళ్లు తిరగం గమనించవచ్చు. ఈ లక్షణాలను తేలిగ్గా తీసుకోకూడదు.వంశపారంపర్యంగా వచ్చే జన్యూపరమైన కారణాల వల్ల గుండెనొప్పి వస్తుంది. వీటిని గుర్తించడం కష్టం. మధుమేహం, రక్తపోటు, హైకొలస్ట్రాల్‌, ఊబకాయం, పొగతాగడం, వ్యాయామం లేకపోవడం గుండెపోటుకు కారణాలు.మహిళలకూ గుండెపోటు వస్తుంది.

యాంజీయోప్లాస్టీతో అదుపు
రక్తనాళాల గోడలకు ఏర్పడిన కొవ్వును తొలగించడమే యాంజియోప్లాస్టీ. గతంలో బైపాస్‌ సర్జరీతో తొలగించేవారు. ఛాతీని తెరచి.. శస్త్రచికిత్స చేసేవారు. పూర్తిగా తగ్గేందుకు మూడు నెలలు పట్టేది. యాంజియోప్లాస్టీ వల్ల ఒకట్రెండు రోజుల్లోనే పూర్తి స్థాయిలో పని చేసుకోవచ్చు.

ఈ విధానంలో కోత లేకుండా సన్నటి బెలూన్‌ను ముంజేతి లేదా తొడ నుంచి రక్తనాళాల ద్వారా పంపి సరిగ్గా కొవ్వు పేరుకుపోయి ఉన్నచోట ఉంచి బెలూన్‌ ఉబ్బించడం ద్వారా పూడిక తొలగేలా చేస్తారు. ఆ ప్రాంతంలో ఇబ్బంది తలెత్తకుండా సన్నటి స్ప్రింగ్‌ వంటి 'స్టెంట్‌'ను అమరుస్తారు. చికిత్స తరువాత రెండ్రోజుల్లో ఇంటికెళ్లిపోవచ్చు.

యాంజియోప్లాస్టీ స్టెంట్‌ల గురించి భయం వద్దు.
కొవ్వు గట్టిపడిపోతే.. తేలిగ్గా డ్రిల్‌ చేసి తొలగించేందుకు రోటాబ్లేటర్‌ పరికరం, సున్నితమైన బ్లేడు అమర్చిన కటింగ్‌ బెలూన్లు అందుబాటులోకొచ్చాయి. ఎక్కడ తొలగించాలో కచ్చితంగా అంచనా వేసే ప్రెషర్‌ ట్రాన్స్‌డ్యూసర్‌ వైర్లు అందుబాటులోకొచ్చాయి. రక్తనాళాల ద్వారానే లోపలికి పంపి కొవ్వు ఎంతమేర పేరుకుపోయిందో పరిశీలించేందుకు వీలైన సన్నటి 'ఇంట్రావాస్కులర్‌ అల్ట్రాసౌండ్‌ ప్రోబ్‌లు' అందుబాటులో ఉన్నాయి.

ఎలాంటి పరీక్షలు అవసరం?
గుండెనొప్పితో బాధపడేవారు... 40 ఏళ్లపైబడిన వారు తక్షణం, ఏడాదికోసారి తప్పనిసరిగా ఈ దిగువ పరీక్షలు చేయించుకోవాలి.
ఇ.సి.జి; టి.ఎం.టి.; యాంజియోగ్రాం

సదస్సుకు హాజరైన పలువురు గుండె సంబంధిత ఇబ్బందులపై సందేహాలు వెలుబుచ్చారు. వీటికి కార్డియాలజిస్ట్‌ బుడుమూరు అన్నాజీరావు సమాధానాలిచ్చారు.

పశ్న: గుండెపోటు లక్షణాలు కనిపించగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?- చల్లా జగదీష్‌, వ్యాయామ ఉపాధ్యాయుడు.
జవాబు: ముందుజాగ్రత్తగా జేబులో సార్బిట్రేట్‌, ఇకోస్ప్రిన్‌ మాత్రలు ఉంచుకోవాలి. ప్రయాణాలు, ఇతర పనుల్లో ఉన్నపుడు నొప్పి తీవ్రంగా ఉందనిపిస్తే వెంటనే ఈ మాత్రల్లో ఒకటి నాలిక

కింద ఉంచుకోవాలి. తరువాత వైద్యుడిని సంప్రదించాలి.

ప్ర: కవాటాల సమస్యలో పక్షవాతం ఎందుకు వస్తుంది? టి.ఎం.టి పరీక్షలో పాజిటీవ్‌ ఉండీ యాంజియోగ్రాంలో నార్మల్‌గా ఉండవచ్చా?--డాక్టర్‌ పి.రవీంద్రనాధ్‌, గుజరాతీపేట
జ: కవాటాలు ముసుకుపోవడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతుంది. పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. థ్రెడ్‌మిల్‌ పరీక్ష (టి.ఎం.టి)లో వ్యాధి లక్షణాలు ఉండీ యాంజియోగ్రామ్‌లో

లేనట్టు తేలితే మైక్రోవాస్కూలర్‌ ఇస్కీమియా అంటారు. ఈ స్థితిలో హృద్రోగ నిపుణుల సూచనలపై మందులు వాడాలి.

ప్ర: గుండె సంబంధ వ్యాధులకు చికిత్స ఖరీదైన వ్యవహారం. రాయితీ ఏమైనా ఉంటుందా?--- బొడ్డేపల్లి మోహనరావు
జ: గుండె పరీక్షలకు రూ. 3 వేలవుతుంది. కిమ్స్‌ సాయిశేషాద్రి ఆసుపత్రిలో రూ. 1800కే చేస్తున్నారు. రోగి ఆర్థిక పరిస్థితి బట్టి ఇంకా రాయితీ ఇచ్చే అవకాశం ఉంది.

ప్ర: 2007లో గుండెపోటు వచ్చింది. క్రమం తప్పకుండా మందులు వాడుతున్నా. ఎప్పుడెప్పుడు పరీక్షలు చేయించుకోవాలి? - ఎస్‌.వెంకటరావు
జ: గుండెపోటు వచ్చిన తరువాత ప్రతీ ఆరు నెలలకోసారి ఇకో పరీక్ష చేయించుకోవాలి. నిర్లక్ష్యం వద్దు.

ప్ర: 2010 డిసెంబరులో నాకు ఎ.ఎస్‌.డి. డివైస్‌ అమార్చరు. ఇటీవల ఆయాసం, కాళ్ల వాపులు వస్తున్నాయి. వివాహమై మూడునెలలయింది. గర్భం ధరిస్తే సమస్య వస్తుందా?--- మజ్జిచంద్రకళ. శ్రీకాకుళం
జ: ఏట్రియల్‌ స్టెప్టల్‌ డిఫాల్ట్‌ (ఎ.ఎస్‌.డి) అమర్చిన తరువాత అన్ని పనులూ చేసుకోవచ్చు. గర్భం ధరించినా ఇబ్బందేమీ ఉండదు. కాళ్ల వాపు అనేది వేరే సమస్య కావచ్చు. ఫిజీషియన్‌ను సంప్రదించండి.

ప్ర: నాకు 61 సంవత్సరాలు. గుండె నొప్పితో బాధపడుతున్నాను. విశాఖపట్నంలో పరీక్ష చేయించుకుంటే ఏమీ లేదన్నారు. మూడు రకాల మందులిచ్చి వాడమన్నారు. ఎందుకు అలా సూచించారు.- కె.తాయారమ్మ, శ్రీకాకుళం

జ: సాధారణంగా 40 ఏళ్లు దాటిన వారు తప్పనిసరిగా ఏడాదికి, రెండేళ్లకు ఒకసారి హృదయ సంబంధ పరీక్షలు చేయించుకోవాలి. మీ విషయంలో పరీక్షల్లో ఏమీ లేదని తేలినందున ముందుజాగ్రత్తగా ఎలాంటి సమస్య రాకుండా మూడు రకాల మందులు రాశారు. క్రమం తప్పకుండా వేసుకోవాలి.

ప్ర: హృదయ సంబంధ వ్యాధులు రాకుండా ఏం చేయాలి? ఎలాంటి వంట నూనె వినియోగించాలి.- సి.రంగారావు, ఉపాధ్యాయుడు
జ: కొవ్వు శాతం తక్కువగా ఉండే ఏ నూనె అయినా వాడొచ్చు. రిఫైన్డ్‌ సన్‌ఫ్లవర్‌ అయిల్‌ వినియోగిస్తే మంచిది. వేపుడు, మసాలా కూరలు ఎక్కువగా తినొద్దు. నూనె వాడకం తగ్గించాలి.

ప్ర: 2004లో స్టెంట్‌ వేశారు.మందులు వాడుతున్నా.రెండో వాల్వుకు స్టెంట్‌ వేయాల్సి ఉంది.ప్రతీక్షణం భయంతో బతుకుతున్నా.ప్రమాదం ఉందా?- పి.వి.తేజేశ్వరరావు,ఆమదాలవలస
జ: ఒక వాల్వ్‌కు స్టెంట్‌ ఉంది. రెండో వాల్వుకు స్టెంట్‌ అవసరమని వైద్యులు సూచించారుకాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆరు నెలలకోసారి ఈసీజీ, ఇకో పరీక్షలు చేయించుకోవాలి.


 • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Self Medication , సొంత వైద్యముతిండి తింటారా? మాత్రలేసుకుంటారా?

ఆలస్యం అమృతం విషయం అంటారు. కానీ దాన్ని ‘అలక్ష్యం ఔషధం విషం’ అని మార్చుకోవచ్చు. వైద్యుల సిఫార్సుతో వాడితే అద్భుతంగా పనిచేసే దివ్యౌషధాలు సైతం... ఇష్టం వచ్చినట్టు వాడితే తీవ్ర పరిణామాలే కలిగిస్తాయ్.
అస్సలు వైద్యుల ప్రమేయం లేకుండానే తలనొప్పికి అనాల్జిన్, ఆస్పిరిన్, జ్వరానికి పారాసెట్‌మాల్... గుండె నొప్పి, క్యాన్సర్లకు ఆస్పిరిన్... ఇలా సొంత వైద్యంతో మందులు మితిమీరి వాడుతున్నారు. ఆధునిక మందులన్నీ రసాయనాలే. వైద్యుల సలహాలు లేకుండా ఇవి మింగితే విషంతో సమానం.
ప్రొద్దుట్నుంచి కడుపులో బాగా నొప్పిగా ఉంది. మంచి టాబ్లెట్ ఇవ్వండి. ‘గొంతు బాగా వాచింది. నీళ్ళు కూడా మింగుడు పడట్లేదు. రెండు ఎరిత్రో మైసిన్ టాబ్లెట్స్ ఇవ్వండి’ ఏ మందుల షాపులకెళ్లినా కనబడే దృశ్యాలివి. వినబడే మాటలివి.
ఇరుగింట్లోనో, పొరుగింట్లోనో ఎవరికో మలేరియా వచ్చిందని తెలియగానే అందరికన్నా ముందుగా వాలిపోయి ముందుజాగ్రత్త అంటూ మందులు మింగేసే సొంత డాక్టరు బాబాయిలకు సంగం నుంచి సిలికాన్ దాకా కొదవలేదు.
చాలాసార్లు ఆ సలహాలు బాగానే పనిచేస్తాయి. కానీ ఒక్కోసారి విపరిణామాలకూ దారితీస్తాయి. ఎందుకంటే ఒకరికి సరిపోయిన డోసు మరొకరి శరీరతత్వానికి ఎక్కువ అవుతుంది. కొంతమంది కయితే అసలు పడదు.
అసలు సొంత వైద్యానికి అనేక కారణాలున్నాయి. ప్రజల అమాయకత్వం, అన్నీ తెలిసిన వారి నిర్లక్ష్యం, ఎంతో రోగమైన ఇట్టే తగ్గాలనే తత్వం, ప్రభుత్వ వైద్యసేవల్లో లోపం, చిన్నా చితకా అనారోగ్యానికి ప్రైవేట్ డాక్టర్స్ చేతిలో పోసే స్థోమత లేకపోవడం కారణాలుగా చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మందుల షాపులను ఆశ్రయించాల్సివస్తుంది. సొంత వైద్యాన్ని తీసుకోవాల్సి వస్తుంది.
అసలు ఆధునిక మందులన్నీ విషంతో సమానం. కావాలంటే చూడండి... ఏ మందు తీసుకున్నా అందులో అతి తక్కువ మోతాదులోనే అయినా రసాయనాలు ఉంటాయి. అలాంటి మందులను వైద్యులు సిఫారసుతో వాడినప్పుడే రోగుల విభిన్న శరీరతత్వాలను బట్టి ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో చెప్పడం కష్టం. మరలాంటి వాటిని సొంతంగా వాడటం ఎంత ప్రమాదకరం. అలాగని చిన్నచిన్న తలనొప్పులకుకూడా వైద్యుణ్ణి సంప్రదించాల్సిన అవసరం లేదు. నిజానికి మామూలు తలనొప్పి, జ్వరం లాంటి తేలికపాటి అనారోగ్యాలు ఏ మందూ తీసుకోక పోయినా కాస్త విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతాయి. కానీ ఎంతటి రోగమైనా మంత్రించినట్టు మాయమవ్వాలన్న కోరికలతో మందులు వాడతారు.
చిన్నపాటి అనారోగ్యాలను ఒకటి, రెండు టాబ్లెట్లు వాడటం తప్పుకాదు. కానీ తగ్గకపోతే మాత్రం తప్పనిసరిగా డాక్టరును సంప్రదించాల్సిందే. చిన్నపాటి అనారోగ్యాలకు అల్లోపతి వైద్యం కన్నా వంటింటి వైద్యమే మిన్న. ఉదాహరణకు చంటిపిల్లలకు కడుపునొప్పి వస్తే తమలపాకుకు ఆముదం రాసి దాన్ని వెచ్చబెట్టి పొట్టమీద పెట్టండి. పెద్దవాళ్లకు కడుపు నొప్పి వస్తే కాస్త వామూ, ఉప్పూ కలిపి నమిలి వేడినీళ్ళు తాగాలి. గొంతు ఇన్‌ఫెక్షన్‌కి గోరు వెచ్చటి నీళ్లలో ఉప్పు కలిపి పుక్కిలించడం, విరోచనాలు తగ్గడానికి పెరుగులో మెంతులు నానబెట్టి తినడం, అరుగుదలకు కరివేపాకు, పసుపు, ఉప్పు కలిపి నూరి ముద్దలా చేసి పరగడుపునే కుంకుడు గింజ పరిణామంలో తీసుకోవడం ఉత్తమం.
ఇలా ఎన్నో వున్నాయి. పైగా వీటివల్ల మన అనారోగ్యం తగ్గినా, తగ్గకపోయినా దుష్ప్రభావాలైతే ఉండవు. వాటికీ తగ్గకపోతే మాత్రం ఒకటి, రెండు మాత్రలు వేసుకోవచ్చు. అయినప్పటికీ ఉపశమనం లభించకపోతే మాత్ర తప్పనిసరిగా డాక్టరు దగ్గరకు వెళ్లాలి తప్ప తగ్గేదాకా చూద్దాం అనుకుంటూ అదే పనిగా సొంత వైద్యం తీసుకుంటూ, లేనిపోని మందులు వాడి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదు.
అలాగే ఆయుర్వేద మందులు వాడేవారు వైద్యులు అనుమతి లేకుండా అల్లోపతి మందులు అస్సలు వేసుకోకూడదు. వైద్యల్ని సంప్రదించకుండా గర్భిణీలు, చిన్నపిల్లలు, బాలింతలు, వృద్దులు స్వంత వైద్యం చేయనేకూడదు. అది ఎన్నో విపత్కర పరిణామాలకు దారితీస్తుంది. తస్మాత్ జాగ్రత్త!

మాత్రలు మింగడంలో మెలకువలు

సాధారణ జబ్బులకు సైతం వైద్యులు మాత్రలు రాసివ్వటం అతి సహజం. అయితే మాత్రలు మింగటానికి మనం వాడుతున్న ద్రవపదార్ధాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని తాజా పరిశోధనల రీత్యా వైదులు సెలివిస్తున్నారు. మాత్రలు మింగేందుకు తొలి నుంచి చేసుకున్న అలవాట్లు రీత్యా కాఫీ, టీ, పాలు, పళ్ళరసాలు లేదా నీళ్లు వాడుతుంటారు.

అయితే వీటన్నటిల్లో నీళ్ళతో మాత్రం తీసుకోవడం క్షేమకరమని డాక్టర్లు చెబుతున్నారు. నీళ్లు కాక ఇతర ద్రవపదార్దాలు వాడటం మాత్రలు చేసే ప్రక్రియకు భంగం కల్గిస్తాయని వీరు సృష్టం చేస్తున్నారు.

కాఫీ, టీలతో మాత్రల్ని తీసుకుంటే పలు సమస్యలను మనకు మనమే ఆహ్వానించినట్లు అవుతుంది. ఎందుకంటే ఉబ్బసం వంటి వాటికి వాడే మందుల గుణాన్ని కాఫీలోని కెఫీన్‌ దెబ్బతీస్తుంది. పైగా సైడ్‌ ఎఫెక్టులు అధికం కావచ్చు. అంతే కాదు కెఫీన్‌ కడుపులో మంటను పెంచుతుంది. పాలల్లోని కాల్షియం యాంటీబయోటీస్‌ మందుల ప్రభావాన్ని బాగా తగ్గిస్తుంది. మామిడిపండు పీచుతో కూడిన పళ్ళరసాలు, లేదా కాయగూరల రసాలతో మాత్రలు తీసుకుంటే కొన్ని మందుల ప్రభావం తగ్గిపోతుంది.

ద్రాక్షరసం తీసుకుంటే అందులోని ఎంజైములు కొన్ని మాత్రల ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.గుండె జబ్బులకు ఉపయోగించే కొన్ని రకాల మందులు, యాంటీ ఫంగల్‌ మందులు పనిచేయక పోగా సైడ్‌ ఎఫెక్టులకు దారి తీయొచ్చు. పైకారణాల చేత మాత్రలు మింగటానికి అన్నిటి కంటే మంచి నీళ్ళే శ్రేష్టమైన మార్గం.

చాలామంది వైద్యుల సలహా లేకుండానే విటమిన్లు, ఇనుము, క్యాల్షియం వంటి మాత్రలను వేసుకుంటూ ఉంటారు. ఇది ఎంత మాత్రమూ మంచిది కాదు. నిజానికి ఇలాంటి సూక్ష్మపోషకాలు ఆహారం ద్వారా లభిస్తేనే శరీరం బాగా గ్రహిస్తుంది. పోషకాహార లోపానికి మాత్రలు ప్రత్యామ్నాయం కావని గుర్తించటం ఎంతో అవసరం. కానీ కొందరికి మాత్రం తప్పకుండా మాత్రల రూపంలో పోషకాలను అందించాల్సిన అవసరం ఉంటుంది. వారికివి శక్తిని అందించి మేలు చేస్తాయి.

ఇలాంటివి ఉంటే..
* రోజురోజుకీ మీ బలం క్షీణిస్తోందా?
* మీకు పొగ, మద్యం అలవాట్లున్నాయా?
* సరిగా నిద్ర పట్టటం లేదా?
* తరచుగా తీపి పదార్థాలు తినాలనో.. రోజుకి మూడు కప్పుల కన్నా ఎక్కువ టీ, కాఫీ తాగాలని అనిపిస్తోందా?
* బరువు తగ్గేందుకు చాలాకాలంగా డైటింగ్‌ చేస్తున్నారా?

- వీటికి సమాధానాలు 'అవును' అయితే మీరు రోజూ తీసుకునే ఆహారంతో శరీరానికి కావాల్సిన పోషకాలు సరిగా అందటం లేదనే అర్థం. అంటే వీరు జీవనశైలి మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట.

సాధారణంగా మనకు రోజుకి సుమారు 80 మి.గ్రా. 'విటమిన్‌ సి' సరిపోతుంది. కానీ పొగ తాగే అలవాటున్నా.. తరచుగా ఒత్తిడికి గురవుతున్నా రోజుకి 1,000 మి.గ్రా. అదనంగా కావాలి. స్వీట్లు ఎక్కువగా తింటే అధికమొత్తంలో 'విటమిన్‌ బి' ఖర్చయిపోతుంది. ఇది అలసట, నిస్సత్తువకు దారితీస్తుంది. మామూలు జీవనశైలి గలవారికి రోజుకి 'విటమిన్‌ ఇ' 30 ఐయూ సరిపోతుంది. అదే ఒత్తిడితో కూడిన జీవనం గడిపేవారికి మాత్రం 400 ఐయూ కావాలి. తక్కువ కొవ్వుగల ఆహారాన్ని దీర్ఘకాలం తీసుకుంటున్నా శరీరంలో విటమిన్‌ ఇ నిల్వ తగ్గిపోతుంది.

ప్రస్తుతం ఒత్తిడితో కూడిన జీవనశైలి పెరుగుతున్న నేపథ్యంలో.. పోషకాల అవసరమూ గణనీయంగా పెరుగుతోంది. అదనంగా పోషకాలు తీసుకోవాల్సిన అవసరమూ ఏర్పడుతోంది. కానీ వీటిని సహజమైన పద్ధతుల్లోనే భర్తీ చేసుకోవటానికి ప్రయత్నించాలి. విటమిన్లు, ఖనిజాల లోపం మరీ ఎక్కువైతేనే మాత్రల రూపంలో తీసుకోవాలి. వీటిల్లో పెద్ద మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. అయితే వీటిని ఎవరెవరు, ఎప్పుడు తీసుకోవాలన్నది తెలుసుకోవటం అవసరం.

ప్రోటీన్ల బలం
మీరు శాకాహారం తీసుకుంటుంటే రోజుకి 20-30 గ్రా. మాంసకృత్తులు లభిస్తాయి. కానీ రోజుకి మహిళలకు 55 గ్రా., పురుషులకు 65 గ్రా. ప్రోటీన్లు అవసరమని ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫారసు చేస్తోంది. ఒకవేళ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటే మరిన్ని అంటే.. శరీర బరువులో ప్రతికిలోకి 1 గ్రా. అదనపు ప్రోటీన్లు అవసరం. రోగనిరోధకశక్తి తక్కువగా ఉండటం, వెంట్రుకలు రాలిపోతుండటం, గోళ్లు పెళుసుబారటం, నిద్ర సరిగా పట్టకపోవటం, వ్యాయామం చేయాలంటే భారంగా అనిపించటం వంటి లక్షణాలు కనిపిస్తుంటే ప్రోటీన్లు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించాలి. ఇలాంటి సమయాల్లో ముందుగా ప్రోటీన్లు దండిగా ఉండే గుడ్లు, పనీర్‌, సోయాతో చేసిన పదార్థాలు తీసుకోవాలి. అప్పటికీ ఈ లక్షణాలు తగ్గకపోతేనే ప్రోటీన్లు అందించే మాత్రల వైపు దృష్టి సారించాలి.

విటమిన్‌ సి రక్షణ
పొగ తాగే అలవాటు, తీవ్రమైన మానసిక ఒత్తిడి, వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివాసం, తరచుగా జలుబు చేస్తుండటం, తేలికగా చర్మం కమిలిపోవటం, పొడి చర్మం, కొలెస్ట్రాల్‌ మోతాదు ఎక్కువగా ఉండటం, మధుమేహం, గుండెజబ్బు.. ఇలాంటివి ఉన్నవారికి రోజుకి 500 మి.గ్రా. విటమిన్‌ సి కావాలి. విటమిన్‌ సి ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలతో పాటు దీనిని అదనంగా తీసుకోవాలి.

విటమిన్‌ బి తోడు
స్వీట్లు ఎక్కువగా కూరగాయలు తక్కువగా తినటం, మరీ మెత్తగా ఉడికించిన కూరగాయలు, నిద్రమాత్రలు, ఆస్ప్రిన్‌, యాంటీ బయాటిక్స్‌, టీ, కాఫీలు, బిస్కట్లు, త్వరగా ఉడికే నూడిల్స్‌ వంటివి తీసుకోవటం వల్ల ఒంట్లో బి విటమిన్లు తగ్గిపోతాయి. విటమిన్‌ బి లోపం ఉన్నట్టు గుర్తిస్తే ముందు పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. టీ, కాఫీ, బిస్కట్లను తగ్గించాలి. అయినప్పటికీ అలసట, చిరాకు, ఏకాగ్రత లోపించటం, ఆకలి తగ్గిపోవటం.. చర్మం, వెంట్రుకల నిగారింపు తగ్గటం, కీళ్ల నొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుల సలహా మేరకు విటమిన్‌ బి కాంప్లెక్స్‌ మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది.

క్యాల్షియం బాసట
ఎముకలు పెళుసుగా ఉన్నవారికి, బరువు పెరగాలని అనుకుంటున్నవారికి, 40 ఏళ్లు దాటిన మహిళలకు, అధిక రక్తపోటు గలవారికి, థైరాయిడ్‌ సమస్యలతో బాధపడేవారికి అదనపు క్యాల్షియం అవసరమవుతుంది. ఇలాంటివారు పాలు, బాదంపప్పు, పొద్దు తిరుగుడు గింజలు, నువ్వులు ఎక్కువగా తీసుకోవాలి. అప్పటికీ ఫలితం కనిపించకపోతే రోజుకి 500 మి.గ్రా. క్యాల్షియం మాత్రలు వేసుకోవచ్చు. అయితే వీటిని పాలతో పాటు తీసుకోవాలి. ఎందుకంటే క్యాల్షియాన్ని శరీరం బాగా గ్రహించాలంటే కొంత కొవ్వు కూడా కావాలి మరి.

 • ===============================================
Visit my website -> dr.seshagirirao.com/

Wednesday, October 27, 2010

సూది మందు ప్రమాదాలు , Dangers of Injection medicine • సూది పిచ్చికి గుడ్‌బై చెప్పండి. సూది ప్రమాదాల నుండి రక్షణ పొందండి.

అఫ్పుడే పుట్టిన చిన్నారి నుండి, ఆఖరికి క్షణంలో ప్రాణాలు పోయే ముసలివారివరకు అన్ని వైద్య సమస్యలకు ఎడాపెడా సూది వేయించుకోవాలనుకుంటున్నారు.
ఇంజెక్షను లేనిదే ఏ జబ్బుకు వైద్యం లేదు. ఇంజక్షను వాడకంవల్ల జబ్బులు తొందరగా నయమవుతాయి. ఇలా చాలామంది రోగులు అనుకొంటున్నారు.

జలుబుకు సూది, దగ్గుకు సూది, తలనొప్పికి సూది, కడుపు నొప్పికి సూది, విరేచనాలకు సూది, విరేచనాలు కాకున్నా సూది, పిల్లలు ఏడ్చినా సూది, ... కావాలంటున్నారు ప్రజలు. అసలు ఈ సూది పిచ్చిం ఏంటో తెలుసా...?

ఇంజక్షను లేనిదే ఏ జబ్బుకు వైద్యం లేదన్నది నేటి సమాజ పోకడ. రోగులు కావాలంటున్నారు, కాబట్టి మేం వేస్తున్నామంటున్నారు డాక్టర్లు. డాక్టర్లు సూదులు వేస్తున్నారు కాబట్టే మేం వేయించుకుంటున్నామని అంటున్నారు ప్రజలు. 'ఇప్పుడు మనం వేయించుకునే సూదుల్లో 90 శాతం అవసరం లేదు' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది.

నోటిద్వారా తీసుకునే మందు పనిచెయ్యడానికి ఎక్కువ సమ్యము పడుతుంది . ఇంజక్షన్‌ అయితే వెంటనే తక్కువ సమయములో పనితనము కనిపిస్తుంది .ఎక్కువగా కడుపునొప్పి , తీవ్రమైన జ్వరము ,వాంతులతో కూడుకున్న ఏ బాధకయినా సూదిమందు తప్పనిసరి . చిన్నపిల్లల అనారోగ్యం విషయం లో వారు నోటిద్వారా మందులు తీసుకోరు కాబట్టి ఇంజక్షన్‌ మందు తప్పనిసరి .

* జబ్బు ఒకటే అయినా - పేదలు ఎక్కువ సూదులు వేయించుకుంటున్నారు ! ధనవంతులు తక్కువ సూదులు వేయించుకుంటున్నారు.

* ప్రజలలో 'సూది పిచ్చి' పెరగడానికి కారణం వైద్యం చేసే వారే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది.

* సూదుల వల్ల గాయాలు, జబ్బులు, మరణాలు సంభవించొచ్చు.

* 'సూది పిచ్చి' మన దేశానికే పరిమితం కాలేదు. అన్ని దేశాల్లోనూ ఉంది.

* బడుగు దేశాల్లో, గ్రామాల్లో, మురికి వాడల్లోని ప్రజల్లో, పేదవారిలో సూది పిచ్చి ఎక్కువట !

* డాక్టర్లు సూది వేస్తానంటే - ఒక సారి వీలైతే సూది లేకుండా వైద్యం చేయాలని కోరాలి.

* సూది వేయని డాక్టరు అసమర్ధుడు అనుకోకూడదు.

సూది ద్వారా మందులు ఎప్పుడు వాడాలి?
 • 1.రోగికి అవసరమైన మందులు సూదిమందు రూపంలో మాత్రమే లభించినప్పుడు.
 • 2. రోగి అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు
 • 3. రోగి నోటి ద్వారా మందులు తీసుకోలేనప్పుడు
 • 4. రోగికి విపరీతంగా వాంతులు అవుతున్నప్పుడు
 • 5. కొన్ని వ్యాధి నిరోధక టీకా మందులు వేయునపుడు.

సూది ద్వారా మందులు ఎప్పుడు వాడరాదు?
 • 1. చిన్న చిన్న జబ్బులకు
 • 2. సాధారణంగా వచ్చే దగ్గు, జలుబుకు
 • 3.సమాజంలో పోలియో వ్యాధి ఎక్కువగా ఉన్నప్పుడు

సూది ద్వారా ఏ మందులు ఎక్కువగా ఇవ్వరాదు?
 • 1. సాధారణంగా వాడే విటమిను మందులు
 • 2. కాల్షియం మందు
 • 3. రక్తహీనతకు వాడే బి12, లివర్ ఎక్స్‌ట్రాక్ట్, ఇన్‌ఫెర్రాన్ లాంటివి.
విటమిను మందులు నోటి ద్వారా తీసుకుంటే మంచిది. ఇంకా చెప్పాలంటే విటమినులు, మందుల రూపంలోకన్నా ఆహారం ద్వారా పొందుట అన్ని విధాలా క్షేమదాయకం.రక్తహీనతకు ఇంజెక్షనులకన్నా నోటిద్వారా తీసుకునే ఫెర్రసు సల్ఫేట్ మరియు ఫోలిక్ యాసిడ్ మాత్రలు మంచివి.

సూదులవల్ల జరిగే ప్రమాదాలు
 • 1. బాగా శుభంచేయని సూదులు, సిరంజిలవల్ల ఇంజెక్షను వేసినచోట చీము గడ్డ రావచ్చు.
 • 2. అపరిశుభ్రమైన సూదుల ద్వారా ఎయిడ్స్, హెపటైటిస్ ‘బి’ లాంటి భయంకర వ్యాధులు రావచ్చు.
 • 3. సూదుల ద్వారా అప్పుడప్పుడు నరాలకు, రక్తనాళాలకు గాయాలు కావచ్చు.
 • 4. సూదిమందు వికటించి ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.

సూదులు - జాగ్రత్తలు
 • 1. సూదిమందు వేయించుకొనేముందు, ఆ మందు పడుతుందా లేదా పరీక్ష చేయించుకొని వేయించుకోండి.
 • 2. శాస్ర్తియంగా శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్త చేతే సూదులు వేయించుకోండి.
 • 3. డాక్టర్లు వద్దంటే ఇంజెక్షను వేయమని ఒత్తిడి చేయకండి.
 • 4. సూదివేయని డాక్టరు అసమర్థుడు అనుకోకండి.
 • 5. బాగా శుభ్రపరచిన సూదులు - సిరంజిలతోనే సూదులు వేయించుకోండి.
 • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Exercise , వ్యాయామంవ్యాయామం (Exercise) మంచి ఆరోగ్య పరిరక్షణ కోసం చాలా అవసరం. శరీరములో శక్తి (energy) వినియోగించుకొని కేలరీలను ఖర్చు చేసే పని ఏదైనా సరే వ్యాయామమే . ఇది ఎక్కువగా కండరాలను, రక్త ప్రసరణ వ్యవస్థను ధృఢపరచడానికి, క్రీడలలో మంచి ప్రావీణ్యత సాధించడానికి ఉపయోగిస్తారు. దైనందిక వ్యాయామం వలన మన శరీరపు వ్యాధినిరోధక శక్తి వృద్ధిచెందుతుంది, గుండెకు సంబంధించిన వ్యాధులు, స్థూలకాయం, మధుమేహం వంటి వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది. కొన్ని రకాల మానసిక వ్యాధుల నివారణ కు తోడ్పడుతుంది.

రకాలు

వ్యాయామాన్ని మూడు రకాలుగా విభజించవచ్చును.


1. Aerobic వ్యాయామాలు: సైక్లింగ్, నడవడం, పరుగెత్తడం మొదలైనవి.
2. Anaerobic వ్యాయామాలు: కసరత్తులు, బరువుతగ్గడానికి యంత్రాల సహాయంతో చేసే వ్యాయామాలు.
3. Flexibility exercises: such as stretching improve the range of motion of muscles and joints.

4.యోగాసనాలు : యోగా విధానములో శరీర వ్యాయామ విధానాలనే యోగాసనాలు అని వ్యవహరిస్తాము. యోగాసనాలు అంటే శారీరక వ్యాయామ విధాన క్రియలు. ఈ ఆసనాల ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మిక రంగాల్లో మనిషి శుద్ధి అవుతాడు.

5.యోగా : అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. ఇది హిందూత్వ అధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. మోక్షసాధనలో భాగమైన ధ్యానం అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి అధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది. ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుంది. హఠయోగములో భాగమైన శారీరకమైన ఆసనాలు శరీరారోగ్యానికి తోడ్పడి ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహధారుడ్యాన్ని, ముఖ వర్చస్సుని ఇనుమడింప చేస్తుంది. బుద్ధమతం, జైనమతం, సిక్కుమతం మొదలైన ధార్మిక మతాలలోనూ, ఇతర ఆధ్యాత్మిక సాధనలలోను దీని ప్రాధాన్యత కనిపిస్తుంది.
వ్యాయామం ఉపయోగాలు

 • వ్యాయామం సంపూర్ణ ఆరోగ్యానికి చాల అవసరం.
 • మన శరీరపు బరువును నియంత్రించడానికి,
 • కండరాలను ధృఢంగా శక్తివంతంగా ఉంచడానికి,
 • ఎముకలను బలంగా చేయడానికి ,
 • వ్యాధి నిరోధక శక్తిని వృద్ధి చెందడానికి............ తోడ్పడుతుంది.
 • అధిక కొవ్వును వదిలించుకోవడానికి తోడ్పడుతుంది .
 • శరీర నొప్పులలనుండి నివారణకు ఉపయోగపడుతుంది .
 • బి.పి.(రక్తపోటును ) అదుపులో ఉంచడానికి బాగా సహకరిస్తుంది ,
 • మదుమేహ వ్యాధి (డయబిటీస్ ) ని నియంత్రిస్తుంది ... కాంప్లికేషన్లు రాకుండా ఉపయోగపడుతుంది .

దైనందిక వ్యాయామం వలన
 • అధిక రక్తపోటు,
 • స్థూలకాయం,
 • గుండె జబ్బులు,
 • మధుమేహం,
 • నిద్రలేమి,
 • మానసిక రోగాల ...............వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా నివారించవచ్చును.
శరీరంలో ఒత్తిడివలన ఎడ్రినలిన్, కార్టిసోర్ వంటివి ఉత్పత్తి కాబడి మనిషిలో ఆందోళన, చికాకు, వ్యాకులత ఏర్పడతాయి. వీటికి చక్కని విరుగుడు నడక. వీటిని శరీరంనుండి నడక తరిమివేసి మనిషిని ఆహ్లాదకరంగా ఉంచుతుంది.

విశిష్ట వ్యాయామం నడక

ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపటానికి చేపట్టే వ్యాయామ ప్రక్రియల్లో నడక ఒక విశిష్టమైన ప్రక్రియ. దీనిని మన శరీర స్థితిగతులనుబట్టి అనేక విధాలుగా నిర్వహించి, ఆశించిన ఫలితాలను పొందవచ్చు. నడకకు చెందిన ప్రక్రియల్లో పవర్‌ వాకింగ్‌ అనే పద్ధతిని ఒక ప్రత్యేక ప్రక్రియగా పేర్కొనవచ్చు. పవర్‌ వాకింగ్‌ వలన శరీరంలో నడుము పైభాగంలోని కండర సముదాయాలకు ఎయిరోబిక్‌ ప్రక్రియల సౌలభ్యం కలుగుతుంది.

ఒక వ్యక్తి పరుగు పెట్టే ప్రక్రియలు నిర్వహించిన ప్పుడు వినిమయమయ్యే కేలరీల శక్తికి సమానంగా పవర్‌ వాకింగ్‌లో శక్తి వినియోగమవుతుంది. మరొక ముఖ్యమైన అంశమేమిటంటే పవర్‌ వాకింగ్‌ను పరుగు ప్రక్రియ కంటే తేలికగా నిర్వహించవచ్చు.
అతిజోరుగాసాగే నడక కంటే పవర్‌ వాకింగ్‌లో అత్యధిక పరిమాణంలో కండరాలు వ్యాయామ ప్రక్రియలకు గురవుతాయి. తద్వారా కేలరీల వినిమయ శక్తి కూడా అధికంగానే ఉంటుంది.

పవర్‌ వాకింగ్‌ చేసే వ్యక్తులు 12 నిముషాల్లో ఒక మైలు దూరాన్ని అంటే 1.6 కిలోమీటర్ల దూరాన్ని నడ వగల సామర్థ్యం కలిగి ఉంటారు. సాధారణంగా ఈ సామర్థ్యాన్ని ఒక వారం రోజుల్లో సాధించవచ్చు.

పవర్‌ వాకింగ్‌కు సూచనలు
నడిచేప్పుడు శరీరాన్ని నిటారుగా ఉంచాలి. నడు స్తున్నప్పుడు సూటిగా 20 అడుగుల దూరం వరకూ చూస్తూ నడక కొనసాగించాలి. అంతేకాని, కిందకు, ప్రక్కలకు చూస్తూనడువరాదు. గడ్డం భాగం నిటారుగా ఉండటం, తల నిటారుగా ఉండటం అవసరం. భుజాలు రెండూ సరి సమానంగా ఎగుడు దిగుడు లేకుండా ఉండాలి. వీపు భాగం నిటారుగా, వదులుగా ఉండాలి. వీపు భాగంలోని కండరాలను బిగబట్టి నడువకూడదు.

ఛాతి భాగం నిటారుగా సాగి ఉండాలి. పిరుదులు, నడుముభాగం బిగబట్టి గట్టిగా ఉంచుతూ నడక కొనసాగించాలి. వెనుక నడుము భాగాన్ని సమంగా ఉంచి, పొత్తి కడుపు చుట్టూ ఉండే కండరాలను కొంచెం ముందుకు వంచి నడకను సాగించాలి. నడిచేప్పుడు భూమి మీద ఒక గీతను ఊహించుకుని, ఆ గీతపై తిన్నగా నడుస్తున్నట్లు ఉండాలి.

చేతులను 90 డిగ్రీల కంటే తక్కువగా వంచుతూ, వదులుగా పిడికిలి బిగించి నడవాలి. చేతులను ముందుకు వెనుకకు నిటారుగా ఊపుతూ నడవాలి. మోచేయి ఛెస్ట్‌ బోన్‌ను దాటి పైకి రాకూడదు. నడిచే ప్పుడు చేతులనుముందుకు, వెనుకకు వేగంగా ఊపడం వలన పాదాలు దానికి అనుగుణంగా సాగుతాయి.

అడుగులు వేసేప్పుడు ముందు కాలి మడమను భూమిని తాకించి, తరువాత పాదం ముందు భాగం భూమిని తాకేలా వేయాలి.
అడుగులను దూరదూరంగా వేస్తూ నడక సాగించి, త్వరగా ముగించాలనే ఆలోచనను మనస్సులోనికి రానీయకూడదు. వేగంగా నడకను కొనసాగించడానికి చిన్న చిన్న అడుగులను ఎక్కువగా వేయడం మంచిది.

ఊపిరిని మామూలు స్థాయిలోనే తీసుకోవాలి. బాగా అలసిపోయేంత తీవ్రస్థాయిలో వ్యాయామం చేయకూ డదు. ఈ ప్రక్రియ చేపట్టే సమయంలో చేతుల్లో ఎలాంటి బరువులు ఉండకూడదు. ఈ జాగ్రత్తలను పాటిస్తే పవర్‌ వాకింగ్‌ వలన ఆశించిన ఫలితాలను సాధించడం ఎంతో సులభమవుతుంది.

మెదడుకు వ్యాయామం:

'చాలామంది అనుకుంటుంటారు మెదడుకి వ్యాయామమా? అదెలా సాధ్యం?' అని! మన శరీరానికి అయితే వ్యాయామాలు ఉన్నాయి. మెదడుకి వ్యాయామం అంటూ ఏదీ లేదని కొంతమంది అంటుంటారు! ఏపనీ చెప్పకపోతే ఏ అవయవమైనా కొంతకాలానికి తనపని అది మర్చిపోతుంది. మన ఇంట్లో ఉన్న సైకిలో, స్కూటరో, మిక్సీనో, వాషింగ్‌మెషిన్నో - ఏ వస్తువు నైనా తీసుకోండి. ఆ వస్తువును కొద్దికాలం ఉప యోగించి, ఆ తర్వాత దాన్ని ఉపయోగించ కుండా ఓ మూలన పెట్టేస్తే - ఓ ఆర్నెల్ల తర్వాత ఓ ఏడాది తర్వాత పనిచేయించాలనుకుంటే అది పని చెయ్యదు. మొరాయిస్తుంది. కారణంలోపల గ్రీజు అంతా ఆరిపోయి బిగిసిపోతుంది. అలాగే మన శరీర అవయవాలు కూడా! అందుకనే ప్రతిరోజూ మనల్ని ఎక్స్‌ర్‌సైజ్‌లు చెయ్యమంటూ డాక్టర్లు సూచిస్తుంటారు. చిన్నపిల్లలకి ఏ విధమైన వ్యాయా మాలూ పెద్దగా అవసరపడవు. ఎందుకంటేవాళ్లు ఎక్కువగా ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ, అటూ ఇటూ పరిగెత్తుతూ సందడి చేస్తుంటారు. అదే వారికి వ్యాయామం. నడివయసు దాటిన దగ్గర నుంచి మనిషికి వ్యాయామం అవసరం పడుతుంది. ఎందుకంటే తన ఉద్యోగ ధర్మంలో ఎక్కువగా కూర్చుని పనిచేసే మనిషికి కండరాలు పట్టేసే ప్రమాదం ఉంటుంది. ఇంట్లో పొద్దస్తమానూ టీవీకే అతుక్కుపోయే మహిళలకు కండరాలు పట్టేయడం, ఊబవళ్ళు రావడం జరుగుతుంటుంది. అలాగే ఏ విధమైన ఆలోచనలూ లేకుండా ఒక యంత్రంలా జీవించే మనిషికి మెదడు సరిగా పనిచెయ్యటం లేదనీ, అతని జ్ఞాపకశక్తి సన్నగిల్లిందనీ, ఏం చది వినా, లేక ఏది విన్నా కొద్దిసేపటికే అవి మర్చి పోతుంటాడనీ అంటుంటారు. అన్ని అవయవాల పనితీరు బాగున్న వ్యక్తికి మెదడు పనితీరు కూడా బాగానే ఉంటుంది. అయితే- అది ఆ మనిషి తన మెదడుకు ఇచ్చే పనితీరుపైనే ఆధారపడి ఉంటుందని గమనించాలి.

మెదడుకు వ్యాయామం అంటే ఎలా?

మెదడుకి వ్యాయామం అంటే ఎలా? అన్ని ప్రశ్నలకు జవాబు మనం ఒక క్రమపద్ధతిలో జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నించడమే. ఉదయం నిద్రలేచినది మొదలు మధ్యాహ్నం భోజనం చేసేంత వరకు మనం చేసిన పనులన్నింటినీ ఓ కాగితం మీద రాసుకోవాలి. అలాగే- మధ్యాహ్నం భోజనం చేసిన దగ్గర్నుంచి రాత్రి నిద్రపోయేంతవరకు చేసిన పనులన్నింటినీ వరుసగా ఓ కాగితం మీద రాసు కోవాలి. ఈ విధంగా చేయడం ఓ చిన్న వ్యాయామమే!

నిన్న మధ్యాహ్నం మనం భోజనంలో ఏఏ అయిటమ్స్‌ వేసుకున్నామో ఓ కాగితం మీద రాయాలి. అలాగే మొన్న మధ్యాహ్నం భోజనంలో ఏ ఏ అయిటమ్స్‌ వేసుకున్నామో రాయాలి. ఇలా గుర్తుకు తెచ్చుకోవడం మరో చిన్న వ్యాయామం.

నిన్న కిరాణా కొట్టునుంచి ఏఏ సామాన్లు కొనుక్కున్నామో గుర్తు తెచ్చుకుని పేపర్‌ మీద రాయడం కూడా వ్యాయామమే.

అలాగే- మనం రోజూ టీవీలకు అతుక్కు పోతుంటాం. టీవీలు చూడటం వల్ల మనలో నిద్రాణంగా ఉండే కల్పనాశక్తిని మనం కోల్పో తుంటాం. అలా కాకుండా మనం ప్రతిరోజూ కథల పుస్తకాలు చదవడం ఒక అలవాటుగా చేసుకోవాలి. కథలు చదవడం వల్ల మనలో నిద్రాణంగా ఉండే కల్పనా శక్తి మేల్కొంటుంది. నిన్న చదివిన కథను గుర్తు తెచ్చుకుని ఓ పేపర్‌ మీద రాయడం ప్రాక్టీసు చేస్తే జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు మనలో ఇమాజినేషన్‌ పవర్‌ బాగా అభివృద్ధి చెందుతుంది.

చాలామంది అంటుంటారు- మాకు అంత తీరిక లేదని! ఉదయం నిద్రలేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్దరపోయేంత వరకూ మనకు 16 గంటల సమయం ఉంటుంది(నిద్రకి 8 గంటలు మినహాయిస్తే). ఆఫీసు పనులు, కాక నిత్యకృత్యాలు, భోజనం వగైరాలు వంటి వాటికి సయయం తీసేస్తే కనీసం ఓ రెండు మూడు గంటలన్నా మిగులుతుంది. ఈ సమయం పనికీ పనికీ మధ్యలో ఉండే గ్యాప్‌గా అంతర్లీనమై ఉంటుంది. అటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగినవాడే విజయం సాధిస్తారు. చాలా మంది చదువుకునే పిల్లలు అంటుంటారు. ఉదయం కాలేజీకి వెళ్తే మళ్లీ రాత్రి రావడమే! చదువుకోవడానికే సమయం సరిపోవటం లేదు. ఇంకా ఇటువంటి ఎక్స్‌ర్‌ సైజులు చెయ్యాలంటే ఎలా కుదురుతుంది? అని, అయితే నిజం చెప్పండి- మీరు చదువులో అంత ఇరగదీస్తుంటే-మార్కులు అలా ఎందుకు తక్కువ వస్తున్నాయి? మాస్టారు సరిగా చెప్పలేదనీ, పాఠం అర్థం కావటం లేదనీ- ఇలా కుంటిసాకులతో మనల్ని మనం మభ్యపెట్టుకోవాలని చూస్తాం. మనకు ఇక్కడ కొరవడింది ఆసక్తి! ఆసక్తి ఉంటే- అన్నీ సాధ్యమే. మెదడుకు చిన్నచిన్న కథలు చదవడం, చిన్న చిన్న ఆటలు ఆడటం ఒక్క వ్యాయామంగానే పనిచేస్తాయి. మీరు చదువుకునే చదువుకూడా ఓ ఆటే! అలాగే దాన్ని భావించడం. ఆటో మేటిగ్గా- ఆ పాఠం మెగాస్టార్‌ సిన్మా కథకన్నా త్వరగా గుర్తొస్తుంది. చదవడం కన్నా మీ మెదడుకు మంచి వ్యాయామం మరొకటి ఉండదు. గుర్తుంచుకోండి.(-మల్లాది కామేశ్వరరావు)

వ్యాయామంతో ఎముక పుష్టి
వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇది పిల్లలకూ ఎంతగానో మేలు చేస్తుందని మీకు తెలుసా? 7-8 ఏళ్ల పిల్లలు ఎక్కువ సమయం వ్యాయామం చేస్తే వారి ఎముకల పరిమాణం,
సాంద్రత బాగా పెరుగుతున్నట్టు తాజాగా స్వీడన్‌ అధ్యయనంలో వెల్లడైంది. గతంలో పిల్లలు అధికంగా వ్యాయామం చేస్తే ఎముకలు విరిగే ప్రమాదముందని భావించేవారు. కానీ ఇది నిజం కాదని నాలుగేళ్లుగా చేసిన ఈ అధ్యయనంలో తేలింది. ఇందులో భాగంగా ఒక స్కూలులోని విద్యార్థులకు వారానికి 200 నిమిషాల పాటు పరుగెత్తటం, గెంతటం, తాడుతో పైకి ఎగబాకటం, బాల్‌ గేమ్స్‌ వంటివి ఆడటం చేయాలని సూచించారు. అలాగే మరికొన్ని స్కూళ్లల్లో చదివేవారికి వారానికి 60 నిమిషాల పాటు సాధారణ వ్యాయామం చేయమని చెప్పారు. నాలుగేళ్ల అనంతరం పరిశీలించగా.. ఎక్కువ సమయం వ్యాయామం చేసినవారిలో వెన్నెముక, మెడ తదితర భాగాల్లో ఎముక పరిమాణం పెరిగినట్టు గుర్తించారు. ఇది మున్ముందు అంటే ఎముక సాంద్రత అధికంగా పెరిగే 25-30 ఏళ్ల వయసులో వారికి చాలా ఉపయోగపడుతుందని స్వీడన్‌లోని లుంద్‌ విశ్వవిద్యాలయానికి చెందిన లాఫ్‌గ్రెన్‌ వివరించారు. అందుకే చిన్నతనంలోనే పిల్లలకు వ్యాయామం చేయటాన్ని తప్పకుండా అలవాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

వ్యాయామంలో కార్డియోవాస్క్యులార్‌ జోన్‌ అంటే?

గుండె, రక్తనాళాల పనితీరు మెరుగుపరిచే వ్యాయామ ప్రక్రియ లను సాధారణంగా కార్డియోవాస్క్యులార్‌ కండిషనింగ్‌ అని వ్యవ హరిస్తారు. ఈ వ్యాయామ ప్రక్రియల్లో కాలపరిమితి, వ్యవధి, ప్రక్రియ తీవ్రతవంటి అంశాలపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి.వ్యాయామం చేస్తున్నప్పుడు గుండె కొట్టుకునే స్థాయి ఆధారంగా వ్యాయామ ప్రక్రియ తీవ్రతను నిర్ధారించవచ్చు.చాలామంది వ్యాయామ తీవ్రతను, కాలవ్యవధిని విస్మరి స్తుంటారు. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సాధారణ సామర్థ్యం కంటే అప్పుడప్పుడూ కొంచెం అధిక శ్రమను కల్పిస్తుండాలి.

ఉదాహరణకు వ్యాయామం చేసేప్పుడు గుండె సాధారణ స్థాయికంటే ఎక్కువగా కొట్టుకుని, ఎక్కువ రక్తాన్ని ఇతర అవయవాలకు పంప్‌ చేసే అవకాశం ఏర్పడుతుంది. అయితే ఇలా ఎంత ఎక్కువ రక్తాన్ని పంప్‌ చేయాలనే ప్రశ్న ఉదయిస్తుంది. గుండె, రక్తనాళాల పనితీరు మెరుగుపడటానికి అత్య ధికంగా గుండె కొట్టుకునే స్థాయినుంచి విశ్రాంతి సమయంలో గుండె కొట్టుకునే సాధారణ స్థాయి వరకూ వ్యాయామం చేయాలి. ఈ తీవ్రతల మధ్య వ్యత్యాసాన్ని గుండె, రక్తనాళాల వికాసమని పేర్కొనవచ్చు. శారీరకంగా కొంచెం చురుకుగా లేనివారు వ్యాయామం ప్రారం భించే మొదటి వారంలోనే వ్యాయామ ప్రక్రియ తీవ్రతను 60 శాతం వరకూ కొనసాగించి లెక్కించాలంటే పైన పేర్కొన్న విధంగా లెక్కించాలి. వ్యాయామ ప్రక్రియ ప్రారంభమైన కొన్ని వారాల తరువాత గుండె కొట్టుకునేస్థాయిలో జరిగే వ్యత్యాసాన్ని అనుభవ పూర్వకంగా గుర్తించవచ్చు.

వ్యాయామ ప్రక్రియ స్థాయి 60 నుంచి 85 శాతం వరకూ ఉన్నప్పుడు దానిని సాధారణంగా కార్డియోవాస్క్యులార్‌ జోన్‌ అని వ్యవహరిస్తారు. ఈ జోన్‌ నిర్ణయం జరిగినప్పుడు ఏదో ఒక నచ్చిన వ్యాయామాన్ని ఎన్నుకుని, స్థాయిని మించకుండా, పరిమి తితో కొనసాగించాలి. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.వ్యాయామ తీవ్రతకు అనుగుణంగా గుండె కొట్టుకోవడం అలవాటు పడటాన్ని ట్రెయినింగ్‌ ఇంటెన్సిటీ అంటారు. వ్యాయామం పూర్తి చేసిన తరువాత గుండె కొట్టుకునే స్థాయిని బట్టి (మాక్సిమల్‌ హార్ట్‌రేట్‌) వ్యాయామం ప్రారంభించక ముందు సాధారణ పరిస్థితుల్లో గుండె కొట్టుకునే స్థాయి (నార్మల్‌ రెస్టింగ్‌ హార్ట్‌రేట్‌)ను ఎవరికి వారే తమ నాడి ద్వారా పరిశీలించి ట్రెయినింగ్‌ ఇంటెన్సిటీని తెలుసుకోవచ్చు.

మరి కొన్ని వ్యాయామాలు ... వివరాలు ->
Swimming as exercise

Walking as exercise
Exercises to increase height

Exercises for Back-ach

cycling as exercise -సైకిల్ తొక్కడము
Skipping as exercise

Primary Exercises-ప్రాధమిక వ్యాయామము ,

వ్యాయామం ఎందుకు?!

ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి! అప్పుడే శరీరం మన చెప్పుచేతల్లో వుంటుంది. లేకపోతే అద్దంలో పట్టం. ఆ తర్వాత అన్నీ ఆటంకాలే. ఆరోగ్య సమస్యలే. కానీ వ్యాయామాన్ని బద్ధకించేవారు సాధారణంగా 7 సాకులు చెప్తుంటారు. అవేంటో...వాటిని వదిలించుకోవాల్సిన ఆవశ్యకత ఏంటో చెప్పుకుందాం....

1. రోజూ చేయాలంటే టైమ్‌ ఎక్కడిదీ...

చాలా మంది సర్వసా ధారణంగా చెప్పే సాకు ఇది. నిజానికి ప్రతి ఒక్కరికీ వుండేది 24 గంటలే. కాకపోతే అందులో ప్రాధమ్యాలను పెట్టుకోవాల్సింది మనమే. రోజుకు ఓ అర్థగంట సమయాన్ని వ్యాయామానికి వెచ్చించలేమా! అయినా ఆరోగ్యం కన్నా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? టీవీ చూస్తాం. పని చేస్తాం. కానీ వ్యాయామం అనేసరికి ఎక్కడ లేని వంకలు చెప్పేస్తాం. ఏదైనా మన సంకల్పాన్ని బట్టే వుంటుంది.

2.అయినా ఎందుకు ఉపయోగపడుతుంది?

వ్యాయామం నుంచి తప్పించు కోవడానికి చెప్పే రెండవ సాకు ఇది. కానీ మనసులో మాత్రం సన్నగా కావాలనే కోరిక వుంటుంది. ఎలా సాధ్యం చెప్పండి? ఏళ్ల తరబడి తిని కూర్చుని ఒక్కసారిగా శరీరం నాజూగ్గా అవ్వాలంటే అవ్వదు కదా. అదీ వ్యాయామం చేయకుండా. ఎంత జిమ్ములకెళ్లినా ఒక్కసారిగా సైజు తగ్గం కదా. క్రమం తప్పని వ్యాయామం మన ఆకృతిని రూపుదిద్దుకోవడానికే కాదు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికీ పనికొస్తుంది. గుండెపోటు, పక్షవాతం, డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి.

3. మరీ బోర్‌...

వ్యాయామం అంటే గంటల కొద్దీ యంత్రాల దగ్గర గడపడం కాదు. ఏదైనా మనకు నచ్చింది చేస్తే చాలు. మనకు ఏదైతే బాగున్నట్టనిపిస్తే దాన్నే క్రమం తప్పకుండా చేస్తే సరి. పైగా వ్యాయామం అంటే ఫలానా మాదిరిగానే చేయాలనే రూలేం లేదు. టెన్నిస్‌, గోల్ఫ్‌, డాన్స్‌, యోగా...ఏదైనా సరే ఉత్సాహాన్నిచ్చేదాన్ని ఎంచుకుంటే సరి.

4. అంత ఓపికేది!

అయినా వ్యాయామం చేసేంత ఓపిక ఎక్కడుందీ! అనుకుంటాం. కాని వ్యాయామాల్లో నడక అత్యుత్తమమైంది. దీనికి ప్రత్యేకమైన ప్రదేశం అవసరం లేదు. ఎక్కడైనా చేయొచ్చు. ఎలాంటి బట్టలైనా వేసుకోవచ్చు. అయితే సౌకర్యంగా మాత్రం వుండేలా చూసుకోవాలి. అలాగే నడకకు వీలైన పాదరక్షలు వేసుకోవాలి.


5.వయసైపోయింది కదా..
నడవడానికి వయసు ఆటంకమే కాదు. నడక వంటి మిత వ్యాయామం వల్ల అన్ని వయసుల వారూ పెద్ద పెద్ద జబ్బులు రాకుండా నివారించవచ్చని వైద్య అధ్యయనాలు చెప్తున్నాయి. నడక అలవాటున్నవారు ఎక్కువకాలం జీవిస్తారని కూడా అంటారు. క్రమం తప్పకుండా నడవడం వల్ల శరీరం వారి స్వాధీనంలో వుంటుంది. వార్ధక్యంలో కూడా మనసు ఉల్లాసంగా ఆహ్లాదంగా వుంటుంది.

6. దాని బాధ పడలేం

ఏదైనా వ్యాయామం మనకి బాధ కలిగిస్తే దాన్ని వదిలేయడం మంచిది. శరీరానికి అనువైన వ్యాయామాన్నే ఎంచుకోవాలి. మితిమీరి వ్యాయామం చేస్తే అది మనల్ని గాయపరవచ్చు. నెమ్మదిగా మృదువుగా మాత్రమే శరీర సౌష్టవాన్ని తీర్చిదిద్దుకోవాలి

7. అలసిపోయా!

నిజానికి వ్యాయామం శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది. కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. క్రమంగా చైతన్యాన్ని పెంచుతుంది. కొత్త ఉత్సాహాన్నిస్తుంది. అదే విధంగా క్రమంగా వ్యాయామం చేయడం వల్ల సాధారణ శక్తి స్థాయి కూడా పెరుగుతుంది.

పావుగంట వ్యాయామంతో లాభాలు :
పిండి కొద్దీ రొట్టెలా 'వ్యాయామం కొద్దీ జీవితకాలం' అంటున్నారు వైద్యులు. రోజూ 15 నిమిషాలు వ్యాయామంచేస్తే జీవితకాలాన్ని కనీసం మూడేళ్లు పెంచుకోవచ్చట. మనంచేసే వెుదటి పావుగంట వ్యాయామం 14 శాతం మేరకు మరణాన్ని దరిచేరనీయదు. ఆపై అదనంగా చేసే పావుగంట మరో నాలుగు శాతం మేరకు ప్రాణహానిని దూరం చేస్తుంది. 20 ఏళ్లు పైబడిన నాలుగు లక్షలమందిపై తైవాన్‌కు చెందిన జాతీయ ఆరోగ్య పరిశోధనా కేంద్రం ఈ పరిశోధన చేసింది. 'వ్యాయామం అస్సలు చేయనివారితో పోల్చితే రోజూ కనీసం 15 నిమిషాలు చేసేవారు ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు పొందుతారు' అని చెబుతున్నారు పరిశోధన బృందం నాయకుడు చి-పాంగ్‌. వ్యాయామం చేసే సమయం పెరిగేకొద్దీ ఈ లాభం కూడా పెరుగుతుందట. అయితే రోజూ 100 నిమిషాలకు మించి వ్యాయామం చేసినా దానివల్ల ఎలాంటి అదనపు లాభాలూ ఉండవని వీరు అంటున్నారు. నగరజీవితంలో వ్యాయామం చేయనివారు ప్రధానంగా క్యాన్సర్‌బారిన పడుతున్నట్లు పరిశోధనలో తేలింది.

ట్రెడ్‌మిల్‌ ఎంత సేపు చెయ్యాలి , How long do we on Thread mill :

శరీర సామర్థ్యం (ఫిట్‌నెస్‌) విషయంలో ఇప్పుడు ఎంతోమంది దృష్టి పెడుతున్నారు. ఇందుకోసం వ్యాయామశాలల (జిమ్‌) వైపు అడుగులేస్తున్నవారి సంఖ్యా పెరుగుతోంది. అయితే వ్యాయామం చేయటమే కాదు.. దాన్ని ఎంత సేపు చెయ్యాలో, ఎప్పుడు ఆపాలో కూడా తెలిసి ఉండటం అవసరం. దాదాపు అన్ని వ్యాయామశాలల్లోనూ ట్రెడ్‌మిల్‌ తప్పకుండా ఉంటుంది. కేలరీలు ఖర్చు కావటానికి, గుండె ఆరోగ్యానికి, కండరాలు బలం పుంజుకోవటానికి ఇదెంతగానో తోడ్పడుతుంది. చక్కటి వ్యాయామం కావటంతో చాలామంది దీనిపై ఆసక్తి పెంచుకుంటున్నారు. కానీ కొద్దిమంది మాత్రం దీనిపై ఎంత ఎక్కువ నడిస్తే అంత మంచిదని భ్రమపడుతూ గంటల తరబడి దీనిమీదే గడుపుతున్నారు. నిజానికి ఎవరైనా తమ సామర్థ్యాన్ని బట్టి 30-45 నిమిషాల్లోనే ట్రెడ్‌మిల్‌ మీద నడక ఆపేయటం మంచిది. ఎక్కువసేపు చేస్తే కేలరీలు అధికంగా ఖర్చవటం నిజమే కానీ.. దీర్ఘకాలంలో మోకాళ్లు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ట్రెడ్‌మిల్‌ మీద నడుస్తున్నప్పుడు కళ్లు బైర్లు కమ్మటం, కండరాలు పట్టేయటం, శ్వాస తీసుకోవటంలో కష్టం వంటి లక్షణాలు కనిపించినపుడు వెంటనే వేగాన్ని తగ్గించటం అవసరమని గుర్తించాలి. 30-45 నిమిషాల్లోనే ట్రెడ్‌మిల్‌ నడక ముగించటం ఉత్తమం. కొన్నిసార్లు జిమ్‌లో శిక్షకులు మరింత ఎక్కువసేపు వ్యాయామం చేయాలని ఒత్తిడి చేస్తుంటారు. కానీ ఈ విషయంలో మన శరీరం అందించే సంకేతాలే మనకు ప్రధానం. ముఖ్యంగా- శ్వాస తీసుకోవటం చాలా కష్టంగా ఉండటం, తల తేలిపోతున్నట్టుగా అనిపించటం, కండరాలు పట్టేయటం, మగత, వికారం, ఛాతీనొప్పి, హఠాత్తుగా తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వ్యాయామం మానేయటం మంచిది.

Why do oldpeople need exercise?,వృద్ధులకు వ్యాయామమెందుకు?

వృద్ధాప్యంలో కండరాలు క్షీణించటం సహజమే అయినప్పటికీ కండరాలను బలోపేతం చేసుకోవటం వృద్ధులకూ అవసరమే. ఇతరుల సాయం లేకుండా సొంతంగా రోజువారీ పనులు చేసుకోగలగటానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. బరువులను ఎత్తటం, బిగుతైన పట్టీలను లాగటం వంటి వ్యాయామాలు కండరాలు బలం పుంజుకోవటానికి తోడ్పడతాయి. శరీరం కిందిభాగాన్ని బలోపేతం చేసే వ్యాయామాలతో నియంత్రణ మెరుగుపడుతుంది. దీంతో తూలి కింద పడిపోకుండా కాపాడుకోవచ్చు. ఇలా కండరాలను బలంగా ఉంచుకోవటం మూలంగా ..
* మెట్లు ఎక్కటం
* సరుకులు మోయటం
* సీసాల మూతలు తీయటం
* బాత్‌రూమ్‌లో బకెట్లు ఎత్తి మరోచోటుకి తీసుకెళ్లటం
* చిన్నపిల్లలను ఎత్తుకోవటం
* కింది నుంచి సంచులను పైకెత్తటం
..వంటి రకరకాల పనులు చేసుకోవటానికి అవసరమైన సామర్థ్యం అబ్బుతుంది.
 • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, October 23, 2010

ఎండోమెట్రియాసిస్‌ , Endometriosis • http://4.bp.blogspot.com/_7a_3fHz2BHY/TJGHj_-9oUI/AAAAAAAAA1I/qp8NC1CQzHA/s1600/Cervix.jpg

ఎందుకొస్తుందో ఇదమిత్థమైన కారణం తెలీదు. నియంత్రించటం కష్టం. నివారించటం మరీ కష్టం. అందుకే ఎండోమెట్రియాసిస్‌ ఎంతోమంది బాధితుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని తాజాగా ఓ అధ్యయనం గుర్తించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 15-49 ఏళ్ల మధ్య వయసు స్త్రీలలో దాదాపు 17.6 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని అంచనా వేస్తున్నారు. చాలామంది ఈ వ్యాధి లక్షణాలైన పొత్తికడుపులో నొప్పి వంటి బాధలు అనుభవిస్తూనే ఉంటారుగానీ నిర్ధారణ పరీక్షలకు మాత్రం దూరంగానే ఉంటున్నారు. లేకుంటే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాధి లక్షణాలు ఆరంభమైన తర్వాత సగటున 11 ఏళ్లకుగానీ వీరు చికిత్స కోసం ముందుకు రావటం లేదని, అన్నేళ్లపాటు మౌనంగానే బాధలు అనుభవిస్తున్నారని గుర్తించారు.

గర్భాశయం లోపల.. పిండం కుదురుకోవటానికి వీలుగా ఎండోమెట్రియం పొర నెలనెలా పెరుగుతూ ఉంటుంది. గర్భాశయం లోపల వైపుననే పరిమితమవ్వాల్సిన ఈ పొర కొందరిలో వెలుపలి వైపు, చుట్టుపక్కల కూడా పెరుగుతూ పొత్తికడుపులో తీవ్ర అసౌకర్యం, నొప్పి తెచ్చిపెడుతుంటుంది. ఇదే ఈ సమస్యకు మూలం. దీనివల్ల స్త్రీలలో సంతాన రాహిత్యమూ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలకు ఇంతపెద్ద శాపంగా పరిణమిస్తున్నా ఇప్పటికీ దీనికి సంబంధించినపూర్వాపరాలు, చికిత్సా మార్గాలు అంతగా తెలియవు. పైగా ఇది నెలసరి రుతుక్రమం, నొప్పి, లైంగిక సమస్యల వంటివాటితో ముడిపడినదైనందున చాలామంది స్త్రీలు దీని గురించి బయటకు చెప్పుకోవటానికి కూడా వెనకాడుతున్నారు. అందుకే అమెరికాలో 'ఎండోమెట్రియోసిస్‌ ఫౌండేషన్‌' దీనిపై పరిశోధనల కోసం ప్రత్యేకంగా కృషి చేస్తోంది.

ఎండోమెట్రియోసిస్‌పై ఇటీవల తాజాగా రెండు పరిశోధనలు జరిగాయి. అమెరికాలోని ఒక ఔషధ సంస్థ ఎనిమిది దేశాలకు చెందిన 21,746 మందిపై అధ్యయనం చేసింది. వీరిలో సుమారు 10% మందిలో ఎండోమెట్రియోసిస్‌ ఉన్నట్టు తేలింది. ఇక రెండోది.. ప్రపంచ ఎండోమెట్రియోసిస్‌ పరిశోధన సంస్థ సహకారంతో చేసిన గ్లోబల్‌ హెల్త్‌ స్టడీ ఆఫ్‌ వుమెన్స్‌ హెల్త్‌ (జీఎస్‌డబ్ల్యూహెచ్‌) అధ్యయనం. ఇందులో పది దేశాల నుంచి ఎండోమెట్రియోసిస్‌ లక్షణాలు గల 1,405 మందిని పరిశీలించారు. వీరిలో 62% మంది సగటున 23 ఏళ్ల వయసులోనే వ్యాధి సంబంధిత లక్షణాలు కనబడటం ప్రారంభించాయని వెల్లడైంది. చాలామంది లక్షణాలు కనిపించిన మూడేళ్ల తర్వాత గానీ వైద్యుల సలహా తీసుకోవటం లేదు. వ్యాధి నిర్ధారణ, చికిత్స కోసం మరో ఎనిమిదేళ్లు జాప్యం అవుతోంది. అంటే దాదాపు 11 ఏళ్ల పాటు తమకు తెలియకుండానే దీనితో బాధపడుతున్నారని అర్థమవుతోంది. ఎండోమెట్రియోసిస్‌ కారణంగా బాధల తీవ్రత కూడా ఎక్కువే. కండరాలు పట్టేయటం, నెలసరి సమయంలోనూ మధ్యలోనూ తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, రతిలో బాధ, మూత్రాశయం మీద ఒత్తిడి, మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు నొప్పి వంటివాటితో చాలామంది సతమతమవుతున్నారు. చికిత్సలో వైద్యులు నొప్పి నివారణ మందులు ఇస్తున్నా పెద్దగా ఫలితం కనబడటం లేదు. ఆపరేషన్‌తో మంచి ఫలితాలుంటున్నప్పటికీ అది వైద్యుల నైపుణ్యంతో సహా ఎన్నో అంశాల మీద ఆధారపడి ఉంటోంది.

ఎండోమెట్రియోసిస్‌ మనం వూహించినదానికంటే ఎక్కువగానే దైనందిన జీవితాన్ని దెబ్బతీస్తోందని వెల్లడించటం ఈ అధ్యయనాల ప్రత్యేకత. 50% మంది బాధితుల్లో లైంగిక జీవితం, 36% మందిలో లైంగిక, కుటుంబ సంబంధాలు, సంతాన సామర్థ్యం దెబ్బతింటున్నాయి. మూడింట ఒకరు ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులూ ఎదుర్కొంటున్నారు. అంతేకాదు నొప్పి, ఇబ్బందులు, వైద్యుల దగ్గరకు వెళ్లటం వంటి వాటివల్ల ఎంతోమంది ఉద్యోగిణులు వారంలో 10 పని గంటలు నష్టపోతున్నారు. వ్యక్తిగతంగానే కాకుండా సామాజికంగానూ ఎండోమెట్రియోసిస్‌ ప్రభావం చూపుతున్నందున దీనిపై తక్షణం దృష్టి సారించటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. వీలైనంత త్వరగా వ్యాధిని గుర్తించగలిగితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలతో చాలావరకూ ఇబ్బందులను తొలగించే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఎండోమెట్రియోసిస్‌ / డా|| పి.బాలాంబ -రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ (గైనకాలజీ)-ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌-హైదరాబాద్‌ .

నొప్పి. నొప్పి. నొప్పి. ఎండోమెట్రియోసిస్‌ను ఒక్క ముక్కలో చెప్పమంటే బాధితులు ఇంతకు మించి వర్ణించలేరు. నెలసరిలో నొప్పి. దానికి ముందు నొప్పి. ఆ తర్వాతా నొప్పి. ముదిరిన కొద్దీ రోజంతా నొప్పి. నెలంతా.. నిరంతరం.. అంతూదరీ లేని నొప్పి. ఆధునిక మహిళ ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఎండోమెట్రియోసిస్‌. గుర్తించటం తేలిక కాదు. గుర్తించినా పూర్తిగా నయం కాదు. చికిత్స అంత సులభం కాదు. యుక్తవయస్సు ఆడపిల్లల నుంచి మధ్య వయసు స్త్రీల వరకూ ఎంతోమంది అనుభవిస్తున్న ఈ తీవ్ర వేదనకు అంతులేదు. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది. చికిత్సల్లోనూ కొంత పురోగతి వస్తోంది. ముఖ్యంగా ఈ సమస్యను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలు. దీనిపై ఎంత అవగాహన పెంచుకుంటే అంత మంచిది.

యంత్రం చక్కగా పనిచేస్తుండాలంటే ఎక్కడ ఉండాల్సిన బోల్టు, ఎక్కడ ఉండాల్సిన నట్టు అక్కడుండాలి. అవి వూడి యంత్రంలో పడిపోయినా.. జారి వేర్వేరు చోట్ల ఇరుక్కుపోయినా ఇక ఆ యంత్రం పరిస్థితి అయోమయమే. అష్టకష్టాలూ తప్పవు. సరిగ్గా స్త్రీశరీరంలో ఎండోమెట్రియం పొర పరిస్థితీ ఇంతే!

స్త్రీగర్భాశయం లోపల ఉండే అద్భుత నిర్మాణం ఎండోమెట్రియం పొర!

నెలనెలా హార్మోన్ల ప్రేరణకు స్పందిస్తూ.. గర్భాశయం గోడలకు ఆనుకుని.. ఈ పొర మందంగా పెరుగుతుంది. ఒకవేళ మహిళ గర్భం ధరిస్తే.. చిన్ని నలుసుకు స్వాగతం పలికేందుకు, అది గర్భంలో కుదురుకునేందుకు సిద్ధమయ్యే చక్కటి పాన్పు ఇది. ఒకవేళ మహిళ గర్భం ధరించకపోతే.. ఇది విడివడి.. రుతుస్రావం రూపంలో బయటకు వచ్చేస్తుంది. రుతుక్రమంలో భాగంగా మళ్లీ ఈ పొర పెరగటం ఆరంభమవుతుంది. స్త్రీ శరీరంలో ఇది నెలనెలా, నిరంతరాయంగా జరుగుతుండే సహజసిద్ధమైన ప్రక్రియ. కానీ కొందరు స్త్రీలలో ఈ ఎండోమెట్రియం పొర.. గర్భాశయం లోపలే కాదు... దాని బయట కూడా పొత్తికడుపులో అక్కడక్కడ, ఇతరత్రా చోట్ల పెరుగుతూ.. నొప్పితో తీవ్ర సమస్యలు తెచ్చిపెడుతుంది. దీని పేరే ఎండోమెట్రియోసిస్‌! దీని ప్రధాన లక్షణం నొప్పి. ఎందుకు వస్తుందో ఇప్పటి వరకూ కచ్చితమైన అవగాహన లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది స్త్రీలు దీనితోనిత్యం నరకం అనుభవిస్తున్నారు.

 • [Dysmenorrhoea.jpg]
ఎందుకొస్తుంది?
గర్భాశయం లోపలే ఉండాల్సిన ఎండోమెట్రియం పొర.. దాని వెలుపలకు ఎందుకు వస్తుందో... ఇతరత్రా అవయవాలపై ఎందుకు అతుక్కుని ఉంటుందో కచ్చితంగా తెలియదు. దీనికి ఎన్నో సిద్ధాంతాలున్నాయి.
* వెనక్కి మళ్లే సమస్య: బహిష్టు సమయంలో వెలువడే స్రావం ఫలోపియన్‌ ట్యూబుల ద్వారా కొంత వెనక్కి వెళ్లి, (రెట్రోగ్రేడ్‌ మెన్‌స్ట్రుయేషన్‌) పొత్తికడుపులో చేరచ్చు. అందులోని ఎండోమెట్రియల్‌ కణజాలం పొత్తికడుపులోని పొరలపై చేరి అక్కడే అతుక్కుని పెరుగుతుండొచ్చన్నది ఒక సిద్ధాంతం. ఇలా వెనక్కివెళ్లటానికి గర్భాశయంలో నిర్మాణ లోపాల నుంచి అవరోధాల వరకూ ఎన్నో అంశాలు కారణం కావచ్చు. రుతుస్రావం బయటకు వచ్చే మార్గం సరిగా లేక లోపలే గూడు కట్టుకుపోయి అది ఫలోపియన్‌ ట్యూబుల ద్వారా వెనక్కు వెళ్లి అక్కడ అతుక్కుని ఎండోమెట్రియంగా మారొచ్చు. ఇది కూడా ఎండోమెట్రియోసిస్‌కు దారి తీయొచ్చు. అలాగే గర్భాశయం తయారయ్యేటప్పుడే అక్కడి పొరల్లో తెలత్తే లోపాల వల్ల (మెటాప్లేసియా) కూడా ఇటువంటి పరిస్థితి తలెత్తవచ్చన్నది మరో అవగాహన. ఎండోమెట్రియం పొర దగ్గర్నుంచి వెళ్లే రక్త/లింఫ్‌ నాళాలు ఎండోమెట్రియం కణజాలాన్ని మోసుకెళ్లి ఇతరత్రా భాగాల్లోకి వ్యాప్తి చేయటం, ఎండోమెట్రియం పొర బహిష్టు సమయంలో బయటకు వచ్చి పరిసర భాగాలకు అతుక్కోవటం, షిగెల్లా తరహా సూక్ష్మక్రిముల కారణంగా కూడా ఎండోమెట్రియోసిస్‌ వచ్చే అవకాశం ఉందని ప్రస్తుతం భావిస్తున్నారు.

ఇలా కారణాలేమైనా.. అంతిమంగా ఈ పొర గర్భాశయంలోనే కాకుండా పొత్తికడుపులో ఎక్కడ అతుక్కుని ఉన్నా.. అక్కడే నెలనెలా శరీరంలోని స్త్రీహార్మోన్లతో ప్రేరణ పొందుతుంటుంది. ఫలితంగా దీని నుంచి అక్కడే రక్తస్రావం అవుతుంటుంది. గర్భాశయంలోని ఎండోమెట్రియం పొర నుంచి వచ్చే స్రావాలు సహజ మార్గం ద్వారా రుతుస్రావం రూపంలో బయటకు వచ్చేస్తాయిగానీ.. ఇతరత్రా ప్రాంతాల్లో పెరిగే ఈ పొర నుంచి వచ్చే స్రావాలు బయటకు పోయే మార్గం లేక పొత్తికడుపులోనే చేరిపోయి.. పేరుకుపోతూ.. రకరకాల సమస్యలు సృష్టించటం మొదలుపెడతాయి. ఎండోమెట్రియోసిస్‌ బాధలకు ఇదే మూలం. ఈ సమస్య వంశపారపర్యంగా కుటుంబంలో ఒకరికి ఉంటే ఇతరులకూ ఉండే అవకాశం ఎక్కువ.

లక్షణాలేమిటి?
* నెలసరి నొప్పి: సాధారణంగా చాలామందిలో నెలసరి తొలిరోజున ఎంతోకొంత నొప్పి ఉంటుంది. ఇది కొన్ని గంటల తర్వాత తగ్గిపోతుంది. దీన్ని 'ప్రైమరీ డిస్‌మెనోరియా' అంటారు. అయితే ఎండోమెట్రియోసిస్‌ బాధితుల్లో నెలసరికి రెండు మూడు రోజుల ముందు నుంచే నొప్పి ఆరంభమవుతుంది. అదీ చాలా తీవ్రంగా. కొందరిలో ఇది భరించలేనంత తీవ్రంగా ఉంటుంది. రుతుస్రావం అవుతున్న రోజుల్లోనే కాదు, ఆగిన తర్వాత కూడా రెండు మూడు రోజులు ఈ నొప్పి ఉంటుంది. క్రమేపీ ఎండోమెట్రియాసిస్‌ ముదిరినకొద్దీ ఈ నొప్పి మరింత తీవ్రమవుతూ.. చివరకు నెలంతా, నిరంతరం వేధిస్తుంటుంది.
* సంభోగంలో నొప్పి: సంభోగంలో నొప్పి మరో ముఖ్య లక్షణం. ముఖ్యంగా ఎండోమెట్రియోసిస్‌ తీవ్రమైతే అండాశయాల్లో పెద్దపెద్ద తిత్తుల వంటివి ఏర్పడతాయి. వీటినే 'చాక్లెట్‌ సిస్ట్‌'లంటారు. ఇవి పొత్తికడుపులో కొందికి జారి స్థిరపడతాయి. దీంతో సంభోగం సమయంలో నొప్పి మరింత తీవ్రతరంగా ఉంటుంది. దీంతో కొందరు సంభోగం పట్ల విముఖత కూడా పెంచుకుంటారు.
* సంతాన రాహిత్యం: నొప్పితో పాటు ఎండోమెట్రియోసిస్‌తో మరో ముఖ్య సమస్య పిల్లలు పుట్టకపోవటం. వీరికి పిల్లలు పుట్టటం కష్టం. వీరిలో కృత్రిమ గర్భధారణ చికిత్సలతోనూ ఫలితాలు కొంత తక్కువగా ఉంటాయి.
* మూత్ర విసర్జనలో నొప్పి: మూత్రాశయం సమీపంలోని పొరల్లో ఎండోమెట్రియాసిస్‌ ఏర్పడితే మూత్ర విసర్జన సమయంలోనూ నొప్పి రావొచ్చు. అరుదుగా కొందరికి నెలసరి సమయంలో మూత్రంలో రక్తం కూడా పడొచ్చు.
* మల విసర్జనలో నొప్పి: కొందరిలో మలద్వారం, గర్భాశయం మధ్య ఎండోమెట్రియోసిస్‌ పొర పెరుగుతుంటుంది. వీరికి నెలసరి సమయంలో మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. దీంతో మల విసర్జన అంటే భయపడటం ఆరంభిస్తారు, ఇది మలబద్ధకానికి దారితీస్తుంది.
* దీర్ఘకాలిక నొప్పి: కొందరికి పొత్తికడుపులో నొప్పి నెలసరి సమయంలోనే కాదు.. ఎప్పుడూ వేధిస్తుంటుంది. నెలసరి ఆరంభం కావటానికి ముందు రోజుల్లో గర్భాశయం, ట్యూబుల భాగాలకు రక్త ప్రవాహం పెరుగుతుంది. ఆ భాగాలన్నీ ఉబ్బుతాయి. దీంతో పెరిటోనియం సాగి నొప్పికి దారి తీస్తుంది. ఇక నెలసరి సమయంలో లోపల్లోపలే రక్తస్రావం కావటం వల్ల నొప్పి. నెలసరి తర్వాత అక్కడ రక్తం గూడు కడుతుంది. అందులోని సీరమ్‌ వంటి ద్రవస్రావాలు ఒంట్లో కలిసిపోయినా లోపల గూడుకట్టుకున్న రక్తం అలాగే అట్టకట్టినట్టు ఉండిపోతుంది. మళ్లీ నెలసరి వచ్చినప్పుడు ఇది మరికాస్త పెరుగుతుంది. అండాశయాల్లో అయితే అది గూడుకట్టుకుని 'చాక్లెట్‌ సిస్ట్‌'లా తయారవుతాయి. మిగతా చోట్ల అలా కాదు కాబట్టి అక్కడ రక్తస్రావం అయినప్పుడల్లా క్రమేపీ పెరుగుతూ చాక్లెట్‌ రంగులో 'బ్రౌన్‌ స్పాట్స్‌'గా ఏర్పడతాయి. నెలనెలా రక్తస్రావమవుతూ చుట్టుపక్కల ఉండే కణజాలం, పేగులు, కొవ్వుపొర(ఒమెంటమ్‌) వంటివన్నీ వచ్చి అక్కడ అతుక్కుపోతుంటాయి. దీంతో అవన్నీ అతుక్కుపోయి పేగుల్లో అవరోధాలు ఏర్పడతాయి. ఇలా గర్భాశయం, అండాశయాలు, పెద్దపేగు, మూత్రాశయం.. ఇలా కింద అవయవాలన్నీ అతుక్కుపోయినప్పుడు.. పొత్తికడుపు మొత్తం గడ్డకట్టినట్టుగా.. పరిస్థితి 'ఫ్రోజెన్‌ పెల్విస్‌'కు దారి తీస్తుంది. అన్నీ అతుక్కుపోయి పరిస్థితి సంక్లిష్టంగా మారుతుంది.అందుకే ఎండోమెట్రియోసిస్‌ను ముందుగానే గుర్తించి పరిస్థితి ముదరకుండా.. ఇటువంటి తీవ్ర సమస్యలు తలెత్తకుండా చూసుకోవటం అవసరం.

ల్యాప్రోస్కోపీతోనే కచ్చిత నిర్ధారణ
ఎండోమెట్రియం పొర పొత్తికడుపులో రకరకాల చోట్ల పెరుగుతూ నొప్పి వేధిస్తున్నా సాధారణ పరీక్షల ద్వారా దీన్ని కచ్చితంగా నిర్ధారించటం కష్టం. పైగా ఇదే తరహా నొప్పి లక్షణాలు ఇతరత్రా సమస్యల్లోనూ ఉంటాయి. ముఖ్యంగా పొత్తికడుపులో నొప్పి, సంభోగంలో నొప్పి వంటివి కూడా ఇన్ఫెక్షన్లతో రావచ్చు, నాళాల్లో నీరు, చీము వంటివి ఉన్నా నొప్పి రావచ్చు. ఈ అవయవాల్లో ఎక్కడన్నా క్షయ ఉన్నా రావచ్చు. అండాశయాల్లో క్యాన్సర్‌, 'క్రానిక్‌ ఎక్టోపిక్‌' వంటి సమస్యల్లో కూడా ఈ తరహా లక్షణాలే ఉండొచ్చు. కాబట్టి వీటిని సరిగా గుర్తించాల్సి ఉంటుంది. సాధారణంగా లక్షణాల ఆధారంగా బలంగా అనుమానించినా ఎండోమెట్రియాసిస్‌కు కచ్చితమైన నిర్ధారణ మాత్రం- ల్యాప్రోస్కోపీ విధానంలో పొట్టలోకి కెమేరా గొట్టాన్ని పంపి.. లోపల అవయవాలను టీవీ తెరపై క్షుణ్ణంగా పరిశీలించటం ద్వారా మాత్రమే సాధ్యం. ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌లో చాక్లెట్‌ సిస్ట్‌ల వంటివి కొంత వరకూ గుర్తించే అవకాశం ఉంటుంది.

 • [Dysmenorrhoea.jpg2.jpg]
చికిత్స ఏమిటి?
లక్షణాలు ఎంత బాధాకరంగా ఉంటాయో చికిత్స కూడా అంత కష్టమని చెప్పక తప్పదు. ప్రధానంగా ఎండోమెట్రియం ముక్కలు ఎక్కడ అతుక్కుని ఉన్నా.. నెలనెలా హార్మోన్ల ప్రేరణతో అవి పెరుగుతుంటాయి కాబట్టి ప్రధానంగా హార్మోన్లను నిరోధించే దిశగా చికిత్స చేస్తారు.
* మందులు: నొప్పి తగ్గే మందులతో పాటు.. నెలనెలా వచ్చే ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ అందుతుంటేనే ఎండోమెట్రియం పెరుగుతుంది కాబట్టి దాన్ని ఆపేందుకు ఆర్నెల్ల పాటు ప్రొజెస్ట్రాన్‌ హార్మోను ఇస్తారు. అంటే నెలసరి రాకుండా చూస్తారు. దాంతో ఎండోమెట్రియం పొరలు కుచించుకుపోతాయి. అయితే ఈ మందులతో లావు కావటం, మానసికంగా కుంగుబాటు, మూడ్‌ మారిపోతుండటం వంటి దుష్ప్రభావాలుంటాయి. డేనజాల్‌ అనే పురుష హార్మోను కూడా ఇచ్చేవారుగానీ దీనితో గడ్డాలుమీసాలు పెరగటం వంటి పురుష లక్షణాలు, దుష్ప్రభావాలు ఎక్కువగా ఉండటంతో దీన్ని చాలా వరకూ మానేశారు.
* లూప్రైడ్‌: 'గొనడోట్రోఫిన్‌ రిలీజింగ్‌ హార్మోన్లు (జీఎన్‌ఆర్‌హెచ్‌)' కాస్త ఖరీదైన ఇంజక్షన్లు. నెలకొకసారి, లేదా మూడు నెలలకు ఒకసారి ఇస్తే వీటితో తాత్కాలికంగా నెలసరి నిలిచిపోయి, ముట్లుడిగిన దశ వంటిది వస్తుంది. దీనివల్ల ఎండోమెట్రియం బాగా సంకోచిస్తుంది. ఇది మంచిదేగానీ ఈ మందుల వల్ల ఒళ్లంతా వేడి ఆవిర్లు, ఉన్నట్టుండి గుండెదడ, చెమటలు రావటం వంటివి వచ్చి, కొద్దిసేపటి తర్వాత సర్దుకోవటం, కొద్దిగా జుట్టూడటం, హార్మోన్లు లోపిస్తాయి కాబట్టి యోని పొడిబారి సంభోగంలో ఇబ్బంది వంటి ఇబ్బందులుంటాయి. కానీ ఎండోమెట్రియాసిస్‌ను అడ్డుకోవటానికి ఈ దుష్ప్రభావాలను ఎదుర్కొనక తప్పదు.
* ల్యాప్రోస్కోపీ: ఆపరేషన్‌ చేసి ల్యాప్రోస్కోపీ ద్వారా చూస్తూ పొత్తికడుపులో ఎండోమెట్రియం ముక్కలు ఎక్కడెక్కడున్నాయో అవన్నీ తొలగిస్తారు. దీనిలో 'సర్జికల్‌ అబ్లేషన్‌' అన్నది ముఖ్యమైన ప్రక్రియ. అలాగే అవయవాలు అతుక్కుని ఉంటే వాటిని విడదీస్తారు. ఇలా ల్యాప్రోస్కోపీ చేసినా ఇంకా లోపల ఎక్కడన్నా ముక్కలు మిగిలిపోవచ్చు. అవి తర్వాత మళ్లీ బాధించటం మొదలుపెట్టచ్చు. కాబట్టిమూడు నెలల పాటు జీఎన్‌ఆర్‌హెచ్‌ తరహా ఇంజెక్షన్లు ఇస్తారు. వీటిని కూడా ఆర్నెల్లకు మించి మరీ ఎక్కువకాలం ఇవ్వటం కష్టం. మొత్తానికి వీటితో మంచి ఫలితం ఉంటుంది. చాలామందిలో సంతానం కోసం ఇవన్నీ అవసరం. ల్యాప్రోస్కోపీలో తొలగించిన తర్వాత కొంతకాలం బాగానే ఉండొచ్చుగానీ తర్వాత మళ్లీ బాధలు రావని చెప్పటం మాత్రం కష్టం.

గర్భం వస్తే నెమ్మదిస్తుంది
గర్భం వచ్చినప్పుడు ఎండోమెట్రియోసిస్‌ బాగా తగ్గిపోతుంది. గర్భధారణ సమయంలో ఒంట్లో బోలెడు హార్మోన్లు చురుకుగా ఉంటాయి, నెలసరి కూడా ఉండదు కాబట్టి ఈ సమయంలో నొప్పి బాధలు ఉండవు. ఎండోమెట్రియాసిస్‌ కూడా బాగా తగ్గుతుంది, ప్రసవానంతరం నెలసరి మొదలైన తర్వాత కొంత ఉండొచ్చు గానీ మొత్తానికి చాలామందిలో అంత తీవ్రంగా ఉండకపోవచ్చు.

హిస్ట్రెక్టమీ
నిరంతరం నొప్పి, బాధల మూలంగా విసిగిపోయి చాలామంది గర్భసంచీ తొలగించే హిస్ట్రెక్టమీ ఆపరేషన్‌ చేయమంటుంటారుగానీ దాన్ని తొలగించటంలో కూడా చాలా సమస్యలుంటాయి. యుక్తవయస్సులోనే అండాశయాలు తొలగిస్తే హార్మోన్ల లోపం రావటం, బయటి నుంచి హార్మోన్లు ఇస్తే ఎక్కడన్నా మిగిలిపోయిన ఎండోమెట్రియం పొర మళ్లీ పెరగటం వంటి బాధలు ఉంటాయి. ఇప్పటికే పిల్లలుండి, మధ్యవయసులో ఉన్న వారికి గర్భసంచీ తొలగించే ఆపరేషన్‌ గురించి ఆలోచించవచ్చు.

మొత్తమ్మీద..
* ఓ మోస్తరు నొప్పి ఉన్న వారికి గర్భనిరోధక మాత్రలు, హార్మోన్‌ చికిత్సలతో చాలా వరకూ నియంత్రించవచ్చు.
* నొప్పి కాస్త ఎక్కువగా ఉంటే ల్యాప్రోస్కోపీ చేసి నిర్ధారించి, ఆ ఎండోమెట్రియం పొరలన్నింటినీ సాధ్యమైనంత వరకూ తొలగిస్తారు. అతుక్కున్న అవయవాలను విడదీస్తారు. ఆపరేషన్‌ తర్వాత కొంతకాలం 'జీఎన్‌ఆర్‌హెచ్‌' ఇంజక్షన్లు, మందులు ఇస్తారు. మళ్లీ వస్తే ఇదే చికిత్స మళ్లీ చెయ్యాల్సి ఉంటుంది.
* ఇప్పటికే పిల్లలుండి, మధ్యవయసులో ఉంటే బాధల తీవ్రతను బట్టి గర్భాశయాన్ని తొలగించే ఆపరేషన్‌ గురించి కూడా ఆలోచించవచ్చు.
* ల్యాప్రోస్కోపీలో అవయవాలను విడదీసే సమయంలో చాలా జాగ్రత్త వహిస్తారు. ఎందుకంటే గర్భాశయం మలాశయం, మూత్రాశయం వంటివాటికి అతుక్కుపోయి ఉంటే విడదీయటానికి చేసే ప్రయత్నంలో వాటికి రంధ్రాలు పడే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ల్యాప్రోస్కోపీలో కొన్నిసార్లు అన్నింటినీ విడదీయటం కూడా సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి వీటి గురించి కౌన్సెలింగ్‌ ముఖ్యం.
* లేటు వయసు పెళ్లిళ్లు, గర్భాలను వాయిదా వేయటం, ఒకటి రెండు గర్భాలే ధరించటం.. వీటన్నింటి వల్లా ఏళ్ల తరబడి నెలనెలా నిరంతరాయంగా నెలసరి వస్తూనే ఉండటం వల్ల వీరిలో ఎండోమెట్రియాసిస్‌ ముప్పు పెరుగుతోంది.
* కుటుంబంలో ఈ సమస్య ఉన్నవారు ముందు నుంచే జాగ్రత్తపడటం, పెళ్లి కాగానే గర్భం ధరించటం వంటి చర్యలు ఉపయోగపడతాయి.
* ముందే గుర్తిస్తే దీన్ని చాలా వరకూ నివారించుకునే అవకాశం ఉంటుంది. లక్షణాలుంటే త్వరగా వైద్యులను సంప్రదించటం, వాళ్లు ల్యాప్రోస్కోపీ వంటివి చేస్తామంటే అంగీకరించటం ముఖ్యం.
* క్యాన్సర్‌ లాగానే ఎండోమెట్రియోసిస్‌ కూడా చుట్టుపక్కల ఉండే ఇతర భాగాలకూ వ్యాపిస్తుంది. అంతమాత్రాన ఇది క్యాన్సర్‌ కాదు. అందుకే దీనిని 'బినైన్‌ డిసీజ్‌ విచ్‌ స్ప్రెడ్స్‌ లైక్‌ క్యాన్సర్‌' అని అంటుంటారు.
* చాలామంది ఎండోమెట్రియోసిస్‌, చాక్లెట్‌ సిస్ట్‌ల వంటివన్నీ మధ్యవయసు వారిలోనే వస్తాయని భావిస్తుంటారుగానీ ఇటీవలి కాలంలో ఇవి యుక్తవయసు ఆడపిల్లల్లోనూ ఎక్కువగానే కనబడుతున్నాయి.
ఎండోమెట్రియోసిస్‌ లక్షణాలు అందరిలోనూ కనిపించాలనేం లేదు. ఎండోమెట్రియం పొర బయటపెరుగుతున్నా ఇందుకు సంబంధించిన బాధలు కొంతమందిలోనే కనిపిస్తాయి. సిజేరియన్‌ కోసం పొత్తికడుపు తెరిచినప్పుడు చాలామందిలో గర్భాశయం వెనక, చుట్టుపక్కల ఎండోమెట్రియం పొరలు అతుక్కుని కనిపిస్తుంటాయి. కానీ వారికి నొప్పి వంటి బాధలుండవు, పిల్లలు బాగానే పుడతారు. కానీ మరికొందరిలో ఏ కొంచెం ఎండోమెట్రియం పొర బయట పెరుగుతున్నా నొప్పి, తదితర లక్షణాలు ఉంటాయి. వీరికి గర్భధారణ సమస్యలు కూడా ఉండొచ్చు.
ఎడినోమయోసిస్‌
ఎండోమెట్రియం పొర గర్భాశయం గోడల్లోకి వెళ్లి.. అక్కడ ఉండిపోతే తీవ్రమైన బాధలు మొదలవుతాయి. దీనికి చికిత్స చేయటం చాలా కష్టం. నిరంతరం తీవ్రమైన నొప్పి ఉంటుంది. దీంతో ఎంతోమంది గర్భాశయమే వద్దనే స్థితికి చేరుకుంటారు. వీరికి కృత్రిమ గర్భధారణ పద్ధతులతోనూ పిల్లలు కలగటం కష్టం. ల్యాప్రోస్కోపీలో దీన్ని తొలగించవచ్చుగానీ గోడల్లో ఉంటుంది కాబట్టి పూర్తిగా తొలగించటం సాధ్యం కాదు. వీరికి ఇప్పటికే పిల్లలు ఉంటే ఒక వయసు వచ్చాక గర్భాశయాన్ని తొలగించొచ్చు. పిల్లలు లేకపోతే మాత్రం చికిత్స కష్టంగా మారుతుంది. వీరికి కొత్తగా 'మిరీనా' అని హార్మోన్లుండే 'కాపర్‌ టీ' వంటిది అందుబాటులోకి వచ్చింది. దీన్ని అమరిస్తే ఐదేళ్ల పాటు లోపలే ఉండి హార్మోన్లు విడుదల చేస్తూ ఎడినోమయోసిస్‌ కొంత తగ్గేలా చేస్తుంది. ఆ తర్వాత పిల్లల కోసం ప్రయత్నం చెయ్యచ్చు.

 • source : Eenadu sukhibhava 26/04/2011


 • ============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, October 22, 2010

పాల సీసా.. గుండెకు చేటు , Plastic feeding bottle..bad to heartపిల్లలకు వాడుతున్న ప్లాస్టిక్‌ పాలసీసాలు ఎంత వరకూ సురక్షితం? దీనిపై అంతర్జాతీయంగా చాలా కాలంగా పెద్ద చర్చే జరుగుతోంది. ఎందుకంటే ఈ తరహా ప్లాస్టిక్‌ సీసాల తయారీలో 'బిస్ఫెనోల్‌ ఎ (బీపీఏ)' అనే రసాయనం వాడతారు. ఈ రసాయనం ప్రమాదకరమైనదని పరిశోధకులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. తాజాగా దీని కారణంగా గుండె జబ్బుల ముప్పు పెరుగుతోందని తాజాగా జరిపిన విస్తృత అధ్యయనంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. హార్మోన్ల పనితీరుపై తీవ్ర దుష్ప్రభావం చూపే రసాయనం ఇది. ఇది కేవలం ప్లాస్టిక్‌ సీసాల్లోనే కాదు, డ్రింకుల సీసాలు, ఆహారం పార్సిల్‌ చేసేందుకు వాడే ప్లాస్టిక్‌ వస్తువుల వంటివాటన్నింటిలోనూ ఉంటుంది. అమెరికా వంటి దేశాల్లో నూటికి 90 మంది ఏదో రూపంలో ఈ రసాయనం ఉన్న వస్తువులను వాడుతూనే ఉన్నారు. మూత్రంలో ఈ రసాయనం అధికంగా గలవారికి గుండె జబ్బుల ముప్పు 33 శాతం ఎక్కువగా ఉంటోందని 'నేషనల్‌ హెల్త్‌ అండ్‌ న్యూట్రిషన్‌ ఎగ్జామినేషన్‌ సర్వే' సమాచారం ఆధారంగా గుర్తించారు. గతంలో ఈ బీపీఏ రసాయనం మధుమేహం, లివర్‌ ఎంజైమ్‌ల వంటివాటి పైనా ప్రభావం చూపుతోందని భావించేవారు. అయితే తాజా అధ్యయనంలో వాటికి సంబంధించిన దుష్ప్రభావాలు కొంత తక్కువేగానీ గుండె జబ్బులు ముప్పును మాత్రం నిర్లక్ష్యం చేయటానికి లేదని తేలటం విశేషం.

బీపీఏ అనేది ఒంట్లో హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తుంది. అందుకే దీన్ని 'ఎండోక్రైన్‌ డిజ్రప్టర్‌' అనీ అంటున్నారు. ఇది శరీరంలోని స్త్రీహార్మోన్‌ అయిన ఈస్ట్రోజెన్‌తో పాటు పురుష హార్మోన్లను కూడా అస్తవ్యస్తం చేస్తుంది. ఈ రసాయనం సృష్టించే దుష్ప్రభావాలపై ప్రజల్లోనూ, ప్లాస్టిక్‌ వస్తువుల తయారీదారుల్లో కూడా చైతన్యం పెరగాల్సిన అవసరం ఉందని... వీలైంత వరకూ ఆహార పదార్ధాల కోసం ఈ తరహా ప్లాస్టిక్‌ సీసాలు, డబ్బాలు, ప్లాస్టిక్‌ ప్యాకేజింగ్‌ పేపర్లు వాడకపోవటమే మేలని నిపుణులు సూచిస్తున్నారు.

source : Eenadu Sukhibhava
 • =================================
Visit my website - > Dr.Seshagirirao.com/

పసిబిడ్డ సంరక్షణ ,Infant care and protection


 • పసిబిడ్డను సంరక్షించుకోవడం ,Infant care and protection

కానీ మన దేశంలో పుడుతున్న ప్రతి 1000 మంది పిల్లల్లో... 57 మంది మొదటి పుట్టిన రోజు జరుపుకోకుండానే చనిపోతున్నారు. ఈ 57 మందిలో 40 మంది మొదటి నెలలోనే చనిపోతున్నారు. ఈ 40 మందిలో 20 మంది మొదటి వారంలోనే చనిపోతున్నారు. ఈ 20 మందిలో ఎక్కువ మంది పుట్టిన ఒకటిరెండు రోజుల్లోనే చనిపోతున్నారు. ఇదో కఠోర సత్యం!

అందుకే మనందరం పసిబిడ్డ సంరక్షణలో మొదటి వారం రోజులూ అత్యంత కీలకమైనవని గుర్తించాలి. బిడ్డ పుట్టగానే ఏం చెయ్యాలి..? ఏం చెయ్యకూడదు..? అన్న అవగాహన పెంచుకుని.. పురిటి బిడ్డని.. పుట్టిన మరుక్షణం నుంచీ జాగ్రత్తగా సంరక్షించుకోవటం అవసరం.


తొమ్మిది నెలల పాటు వెచ్చగా.. హాయిగా.. శుభ్రంగా.. ఎటువంటి రణగొణ ధ్వనులూ లేకుండా.. అమ్మ కడుపులో సౌకర్యవంతంగా పెరిగిన బిడ్డ..
'' ముందు సూక్ష్మక్రిముల బారి నుంచి రక్షించండి. అమ్మో, బాగా చలి నుంచి నన్ను కాపాడండి.. పొడిగా తుడిచి.. బట్ట చుట్టి.. కాస్త వెచ్చగా పెట్టండి.. ఏడ్వనివ్వండి..

పసిబిడ్డ సంరక్షణలో అత్యంత కీలకమైనవేవి? పుట్టగానే ఏడ్చేలా చూడాలి, బిడ్డను వెచ్చగా పెట్టాలి, తల్లిపాలు పట్టాలి, ముట్టుకునేటప్పుడు చేతులు కడుక్కోవాలి! ఇంతకు మించి పెద్దగా చెయ్యాల్సిందేం లేదు. ఈ ప్రకృతిలో జీవితం ఎంతో సహజంగా, చాలా సులభంగా ఉంటుంది. తెలిసీతెలియక దాన్ని మనమే గందరగోళం చేసుకుంటున్నాం! ఎందుకంటే చాలా జంతువులకు కూడా ఉండే ఈ కనీస అవగాహన.. కొన్నిసార్లు మనకు కరవు అవుతుండటం వల్ల ఎంతోమంది పసిబిడ్డలను దక్కించుకోలేకపోతున్నాం. ఇందుకు చిన్న ఉదాహరణ చూద్దాం. చేతుల్లేకపోయినా.. ఆవు, గేదె, గొర్రె ఇలా చాలా జంతువులు పుడుతూనే తన దూడను తాకటానికి ప్రయత్నిస్తాయి. నాలుకతో తల నుంచి తోక దాకా ఒళ్లంతా శుభ్రంగా నాకుతూ.. ఆ ఆత్మీయ స్పర్శతో బిడ్డకు నేనున్నానే భరోసా కల్పిస్తాయి. పుట్టిన రోజే పాలివ్వటం మొదలు పెట్టేస్తాయి. అది చాలు, దూడ చెంగున ఎగురుతూ, హాయిగా పెరగటానికి! ఇక చాలా చిన్న మెదడు ఉన్న కోడి కూడా.. తన పిల్లలను రెక్కల కింద కప్పుతూ వెచ్చగా ఉంచుతుంది. పసిగుడ్డుకు ఆ వెచ్చదనమే పెద్ద బలం. ఇక కుక్కల్లాంటి జంతువులు కూడా ఈనిన తర్వాత.. తన పిల్లల వైపు ఎవరూ రాకుండా భయంకరమైన కాపలా కాస్తాయి. ఎవరైనా అటుపోతే చీరేస్తాయి.

బిడ్డను తల్లి పక్కనే పడుకోబెట్టటం, వెచ్చగా ఉంచటం, కొద్దిమందే ముట్టుకోవటం, వాళ్లు కూడా శుభ్రంగా చేతులు కడుక్కున్న తర్వాతే ముట్టుకోవటం.. ఇవన్నీ ప్రకృతిలో ఉన్న సూత్రాలే! వాటిని మనం విస్మరించకూడదు!

* పుట్టిన మొదటి అరగంట లోపే... బిడ్డకు తల్లిరొమ్ము పట్టాలి. ఈ పని చెయ్యగలిగితే మనం ఒక్క మన దేశంలోనే 2.5 లక్షల బిడ్డలను రక్షించుకోగలుగుతాం.

* చాలామంది కాన్పుకాగానే పాలు రావని భావిస్తుంటారు, అది సరికాదు.. బిడ్డ చీకుతుంటే పాలు అవే వస్తాయి. పట్టకపోతే రావు. తల్లికి సిజేరియన్‌ ఆపరేషన్‌ చేసినా కూడా తొలిగంటలో పాలు ఇవ్వటానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక రకంగా బిడ్డకు పాలివ్వటం ఆ సమయంలో తల్లికీ మేలు చేస్తుంది. ఎందుకంటే తల్లిపాలివ్వటాన్ని కాన్పులో 'నాలుగో దశ'గా కూడా పిలుస్తారు. ఎందుకంటే తొమ్మిదినెలలుగా పెద్దగా సాగిన బిడ్డసంచీ.. కాన్పు తర్వాత తిరిగి చిన్నగా మరాలంటే అది బాగా సంకోచించాలి. అందుకు 'ఆక్సిటోసిన్‌' అనే హార్మోను చాలా అవసరం. బిడ్డ తల్లి రొమ్ము పట్టుకుని చీకటం మొదలుపెట్టిన వెంటనే ఆ హార్మోను విడుదలై... గర్భసంచీ సంకోచించటం మొదలుపెడుతుంది, వెంటనే రక్తస్రావం కూడా ఆగిపోతుంది. కాన్పు తర్వాత ఇలా రక్తస్రావం సత్వరమే ఆగటం చాలా అవసరం. కాబట్టి బిడ్డకు వెంటనే పాలు పట్టటమన్నది బిడ్డకే కాదు.. తల్లికి కూడా మేలు చేస్తుందని గుర్తించాలి.

* బిడ్డ పుట్టగానే పాలు అవే పడతాయిలే అని వదిలేస్తూ.. రెండుమూడు రోజుల పాటు తేనె నాకించటం, పంచదార నీళ్లు, గ్లూకోజు నీళ్ల వంటివి పట్టటం చెయ్యకూడదు. తల్లిపాలు తప్పించి బిడ్డకు మరేమీ ఇవ్వకూడదు. తొలిగా వచ్చే ముర్రుపాలు ఎంతో శ్రేష్ఠమైనవి, అవి బిడ్డ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముర్రుపాలను పిండెయ్యటం సరికాదు.. వాటిని బిడ్డకే పట్టాలి.

* పాప పుట్టగానే తల్లికి దూరం చేసి ఉయ్యాల్లో పడుకోబెట్టటానికి బదులు.. తల్లి దగ్గరే, తల్లి పక్కనే ఉంచాలి. తల్లికి సిజేరియన్‌ చేసినా కూడా తల్లి దగ్గరనేపడుకోబెట్టాలి. తల్లీపిల్లల మధ్య ఈ స్పర్శ ముఖ్యం. ఇలా ఉంచితే బిడ్డ ఎప్పుడు పాలు కావాలంటే అప్పుడు ఇవ్వటం సాధ్యపడుతుంది. ఎప్పుడు ఆహారం కావాలన్నది బిడ్డకు తెలుసు. బిడ్డ కోరినప్పుడల్లా తల్లి పాలిచ్చేలా అనుకూల వాతావరణం, ప్రోత్సాహం ఇవ్వాలి.

* బిడ్డ ఏడుస్తుంటే నోట్లో తేనెపీక వంటివి పెట్టటం మంచిది కానేకాదు. సీసా పాలు పట్టటం అసలు మంచిది కాదు. దీనివల్ల బిడ్డకు కావాల్సిన పోషకాలు అందవు, పైగా విరేచనాల వంటి సమస్యలు పట్టుకుంటాయి. సీసా- తల్లీ బిడ్డల మధ్య అది ఎడాన్ని కూడా పెంచుతుంది.

* బిడ్డకు ఆర్నెల్ల పాటు పూర్తిగా తల్లిపాలే పట్టాలి. ఈ సమయంలో మంచినీళ్లు కూడా పట్టాల్సిన పనిలేదు, వాటి బదులు కూడా తల్లిపాలే ఇవ్వాలి! ఇక ఆర్నెల్ల తర్వాత అదనపు ఆహారంతో కనీసం రెండేళ్లపాటు తల్లిపాలు ఇవ్వచ్చు.

* తల్లులు అనవసరంగా గాభరా పడకుండా ఈ చర్యలన్నీ తీసుకుంటే పుట్టిన పిల్లలు గట్టెక్కుతారు, బరువు పెరుగుతారు, సంతోషంగా ప్రేమపూర్వకంగా ఎదుగుతారు. వాళ్ల తెలివితేటలు (ఐక్యూ), సామాజిక జ్ఞానం (ఎస్‌క్యూ), భావోద్వేగ సమతౌల్యం (ఈక్యూ) అన్నీ పెరుగుతాయి.

పసిబిడ్డ జననం..(!డా|| పి.సుదర్శన్‌రెడ్డిసూపరింటెండెంట్‌-నీలొఫర్‌ హాస్పిటల్‌,హైదరాబాద్‌)

* పుట్టగానే బిడ్డ శ్వాస పీల్చాలి. అంటే ఏడ్వాలి! ఇది చాలా అవసరం. సాధారణంగా పిల్లలంతా కూడా పుడుతూనే తమకు తాముగా ఏడ్వటం, గాలి పీల్చటం మొదలుపెడతారు. కానీ కొంతమంది పిల్లలు ఇలా శ్వాస పీల్చుకోకపోవటం వల్ల.. మెదడుకు రక్తం, ఆక్సిజన్‌ సరిగా అందక మెదడు దెబ్బతిని జీవితాంతం బుద్ధిమాంద్యంతో, అంగవైకల్యంలో జీవించాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. ఈ స్థితినే 'హైపాక్సిక్‌ ఇస్ఖీమిక్‌ ఎన్‌సెఫలోపతీ' అంటారు. గాలి పీల్చుకోక, మెదడుకు సరిగా ఆక్సిజన్‌ అందక తలెత్తే సమస్య ఇది. కాబట్టి పుట్టగానే బిడ్డ ఏడ్వకుండా, తనకు తానుగా శ్వాస తీసుకోకపోతుంటే.. మనం తక్షణం కల్పించుకుని తను శ్వాస తీసుకోవటం మొదలుపెట్టేలా సహకరించాలి. ముందు 'మ్యూకస్‌ సక్కర్‌'తో నోటిలో, ముక్కు రంధ్రాల్లో స్రావాలను తీసేసి శుభ్రం చెయ్యాలి. దీంతో గాలి పీల్చుకోవటానికి మార్గం ఏర్పడుతుంది. ఒకటిరెండు నిమిషాల పాటు బిడ్డ గాలి తీసుకోలేదంటే నీలంగా మారిపోతుంటుంది. కాబట్టి ఈ పరిస్థితి తలెత్తకుండా మనం వెంటనే 'ఆంబూ బ్యాగ్‌'ను సున్నితంగా నొక్కుతూ.. బిడ్డకు ఒక్క శ్వాస అందిస్తే చాలు.. వెంటనే అందుకుంటుంది! ఈ ఆంబూ బ్యాగ్‌ లేకపోతే నోటి మాస్కు ద్వారా, అదీ లేకపోతే కనీసం నోటితో ఒక్కసారి శ్వాస తీసుకునేలా వూదటం చాలా అవసరం.

* చాలామంది పుట్టగానే బిడ్డ ఏడ్వక, శ్వాస తీసుకోకపోతుంటే తిరగేసి పట్టుకుని వీపు మీద కొట్టటం, ముఖం మీద చల్లటి నీరు పొయ్యటం, ఉల్లిపాయలు ముక్కు దగ్గర పెట్టటం, స్పిరిట్‌ చల్లటం.. ఇలా రకరకాల పనులు చేస్తుంటారు. ఇవన్నీ చెయ్యకూడదు. తప్పు! కేవలం బిడ్డ వీపు మీద, అరికాళ్లలో కొద్దిగా రుద్ది, మర్దన చేస్తూ.. బిడ్డ స్పందించేలా చేస్తే చాలు.

* అలాగే కొన్నిసార్లు కాన్పు కష్టమైనప్పుడు ఉక్కిరిబిక్కిరై బిడ్డ లోపలే మలవిసర్జన చేసేస్తుంది. ఆ మలం ముక్కు ద్వారా లోపలకు పోయి శ్వాస ఇబ్బంది రావచ్చు. కాబట్టి ఉమ్మ నీరు మామూలుగానే ఉందా? లేక ఆకుపచ్చగా, నల్లగా రంగు మారిందా? అన్నది చూడటం మంచిది. ఒకవేళ రంగు మారితే.. బిడ్డకు లోపలే ఏదో కష్టమైందని గుర్తించి వెంటనే ప్రత్యేక వైద్య సంరక్షణ కల్పించాలి.

* బిడ్డ ఏడ్చి, శ్వాస పీల్చుకోవటం మొదలుపెట్టగానే.. బిడ్డను శుభ్రంగా తుడిచి, పొడిగా చెయ్యాలి. బిడ్డ నీళ్లతో ఉంటే చల్లగా అయిపోతుంది. అందుకే ఇప్పుడే స్నానాల వంటివి చేయించకుండా శుభ్రంగా తుడిచి, వెచ్చటి బట్ట చుట్టాలి. పుట్టగానే ఈ వెచ్చదనం చాలా ముఖ్యం!

* కొందరు సంప్రదాయంగా పసిబిడ్డలను పాత బట్టలు, దుమ్ము పట్టిన గుడ్డల వంటి వాటిలో చుడుతుంటారు. అవి ఏ బట్టలైనా సరే, శుభ్రంగా ఉతికినవే పసిబిడ్డ కోసం ఉపయోగించాలి.

* బట్ట చుట్టిన తర్వాత.. బిడ్డను తల్లి దగ్గరే, తల్లి శరీరం మీదనే ఉంచాలి. ఒకవేళ తల్లికి సిజేరియన్‌ సర్జరీల వంటివి పూర్తి చెయ్యాల్సి ఉంటే.. అప్పటి వరకూ బిడ్డను వెచ్చగా లైట్‌ కింద ఉంచి.. అది పూర్తవుతూనే బిడ్డను తల్లి పక్కకు చేర్చాలి. తల్లి 'ప్రకృతి సహజమైన ఇంక్యుబేటర్‌' అన్న విషయం మర్చిపోవద్దు. తల్లి ఇచ్చే వెచ్చదనం ఎవరూ ఇవ్వలేరు. తల్లీబిడ్డలను వేరు చెయ్యకూడదు. ఒకవేళ బిడ్డ చాలా బరువు తక్కువగా పుడితే.. బిడ్డను తల్లి రెండు రొమ్ముల మధ్యా ఉంచి.. పైన బట్ట చుట్టాలి. దీన్నే 'కంగారూ మదర్‌ కేర్‌' అంటారు. ఇది ఇంక్యుబేటర్‌లో పెట్టటంతో సమానం!

* ఇలా వెచ్చదనంలో పెరిగే బిడ్డల ఎదుగుదల కూడా చక్కగా ఉంటుందని గుర్తించాలి. లేకపోతే తాగిన పాల శక్తి అంతా బిడ్డ తన శరీరాన్ని వెచ్చగా పెట్టుకోవటానికే ఖర్చయిపోతుంది. దీంతో పెరుగుదలా దెబ్బతింటుంది. కనీసం ఆర్నెల్ల వరకూ బిడ్డలను వెచ్చగా ఉంచటం అవసరం.

* మన చుట్టూ ఎన్నో కనిపించని సూక్ష్మక్రిములు ఉంటాయి. అప్పుడే పుట్టిన బిడ్డకు రోగనిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి బిడ్డ ఈ సూక్ష్మక్రిముల బారినపడకుండా మనం పూర్తి శుభ్రత, సురక్షిత చర్యలు తీసుకోవాలి. కాన్పు చేసేవారు చేతులు సబ్బుతో రుద్దిరుద్ది కడుక్కోవాలి, గ్లౌజులు వేసుకోవాలి. ఎవరైనా సరే... చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కున్న తర్వాతే పసిబిడ్డను ఎత్తుకోవాలి. అంతా 'తలో చెయ్యీ వెయ్యటం' కాకుండా.. బిడ్డను ఒకరిద్దరే ఎత్తుకోవటం, పట్టుకోవటం మంచిది.

* బిడ్డ పుట్టిన అర గంటలోపే తల్లిపాలు పట్టించటం ప్రారంభించాలి. దీనివల్ల బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరగటం మొదలవుతుంది. అందుకే తల్లిపాలను వ్యాధులు రాకుండా మనం ఇచ్చే 'తొలి టీకా' అంటారు.

* ఆసుపత్రుల్లో కాన్పు చేస్తే మరో ప్రయోజనమేమంటే వైద్యులు- బిడ్డ పుట్టగానే వైద్యులు కండ్లు, ముక్కు, చెవులు, నోరు, మలద్వారం, మూత్రద్వారం వంటివన్నీ చక్కగా ఉన్నాయా? లేదా? పుట్టుకతో ఏదైనా లోపాలున్నాయా? శ్వాస సరిగా తీసుకుంటోందా? లేదా? గుండె తక్కువ కొట్టుకుంటోందా? ఇవన్నీ చూస్తారు. ఎందుకంటే కొందరిలో మలద్వారం సరిగా ఉండదు. దాని మీద ఒక పొర ఉంటుంది. దాన్ని గుర్తిస్తే వెంటనే చికిత్స లేదంటే సర్జరీ చేసి సరిచెయ్యచ్చు.

* పుట్టగానే బిడ్డ బరువు చూడటం, టీకాలు ఇవ్వటం తప్పనిసరి

హైరిస్క్‌ పిల్లలు
కొందరు పుడుతూనే కొన్ని ఇబ్బందులతో పుడతారు.. వీరిని 'రిస్కు ఎక్కువగా ఉన్న పిల్లలుగా' గుర్తించి మరిన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్లను గుర్తించేదెలా?

* 1800 గ్రాముల కంటే తక్కువ బరువుతో పుట్టినా.
* 34 వారాల కంటే ముందే పుట్టిన బిడ్డలు
* రొమ్ములు చీకాలన్న స్పందనల్లేక, పాలు తాగలేకపోతున్న బిడ్డలు
* నిరంతరం ఏడుస్తూనే ఉన్న పిల్లలు
* ఎటువంటి కదలికలూ లేకుండా మొద్దులా ఉండిపోతున్న పిల్లలు
* చర్మం రంగు నీలంగా, లేదా పాలిపోయినట్లున్న పిల్లలు, లేదా పుట్టిన 24 గంటల్లో చర్మం పసుపుపచ్చగా మారుతున్న పిల్లలు
* బాగా చల్లగా ఉన్న బిడ్డలు
* మొదటి 48-72 గంటల్లోపు జ్వరం వచ్చిన బిడ్డలు...
* పాలు తీసుకున్న ప్రతిసారీ మొత్తం వాంతి చేసుకుంటున్న పిల్లలు
* కడుపు బాగా ఉబ్బి ఉన్న బిడ్డలు
* శ్వాస వేగంగా తీసుకుంటూ.. ఎగశ్వాస వస్తున్న బిడ్డలు..
* మొదటి 48 గంటల్లోపు కళ్లు పుసులు కడుతుండటం, లేదా బొడ్డు చీము పడుతున్నట్టుండటం, చర్మం మీద చీము పొక్కుల వంటివి కనబడిన పిల్లలు..
* ఫిట్స్‌ వచ్చిన బిడ్డలు..
* ఎక్కడి నుంచైనా రక్తస్రావం అవుతున్న పిల్లలు..
* పుట్టిన 24 గంటల్లోపు మల విసర్జన చెయ్యకపోయినా.. 48 గంటల్లోపు మూత్ర విసర్జన చెయ్యకపోయినా..

వీరందరినీ హైరిస్క్‌ బిడ్డలుగా గుర్తించి.. తప్పనిసరిగా సత్వరమే వైద్యులవద్దకు తీసుకువెళ్లాలి. ముందీ లక్షణాలను గుర్తించి వెంటనే స్పందించటం చాలా ముఖ్యం.

* బిడ్డ కడుపు ఉబ్బితే.. 'సహజమేలే' అని వదిలెయ్యటం;
* పాలు తాగలేకపోతుంటే 'ఆ.. అలవాటైతే అదే తాగుతుందిలే' అని నిర్లక్ష్యం వహించటం;
* ఫిట్స్‌ వస్తుంటే 'ఒక్కసారే గదా వచ్చింది, మళ్లీ వస్తే చూద్దాం' అనుకోవటం;
* బిడ్డ చాలా చిన్నగా పుడితే 'అదే పెరుగుతుందిలే, బక్కవాళ్లు బతకటం లేదా' అని వదిలెయ్యటం.. ..ఇలా సర్దుకుపోతూ తాత్సారం చెయ్యటం ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇవన్నీ ప్రమాద సూచికలని గుర్తించి తక్షణం వైద్యుల వద్దకు తీసుకువెళ్లాలి.

Updates :
శిశువుకు.. వెచ్చని తోడు


అప్పుడే పుట్టిన పిల్లలు వెచ్చగా ఉండేలా చూడటం ఎంతో అవసరం. ఎందుకంటే పెద్దవారిలాగా శిశువులు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోలేరు. కాబట్టి సరైన ఉష్ణోగ్రతలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ముఖ్యంగా నెలలు నిండకముందే పుట్టే పిల్లలు, బరువు తక్కువ పిల్లలను సరైన ఉష్ణోగ్రతలో ఉంచకపోతే కొన్నిసార్లు చనిపోయే ప్రమాదమూ ఉంది. ఆధునిక సౌకర్యాలు లేని గ్రామాల్లో ఈ ప్రమాదం ఎక్కువ. మనదేశంలో జన్మిస్తున్న ప్రతి వెయ్యిమంది శిశువుల్లో ఏటా సుమారు 50 మంది చనిపోతున్నారని అంచనా. దీన్ని దృష్టిలో పెట్టుకునే చవకైన 'ఇన్‌ఫాంట్‌ వార్మర్‌'లను సరఫరా చేయాలని జీఈ హెల్త్‌కేర్‌, ఎంబ్రేస్‌ స్వచ్ఛందసంస్థలు సంకల్పించాయి. చిన్నపాటి పడుకునే సంచీలా ఉండే వీటిని వచ్చే సంవత్సరం నుంచి పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

సంప్రదాయ ఇంక్యుబేటర్లతో పోలిస్తే ఈ 'ఎంబ్రేస్‌ ఇన్‌ఫాంట్‌ వార్మర్‌' ధర ఒక శాతం కన్నా తక్కువే కావటం గమనార్హం. ఇది విద్యుత్తు సరఫరా లేకపోయినా గంటల కొద్దీ శిశువు వేడిగా ఉండేలా చూస్తుంది. శిశు సంరక్షణను మెరుగుపరచేందుకు ముందుగా వీటిని గ్రామాల్లో పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ఇన్‌ఫాంట్‌ వార్మర్‌లో.. వేడి చేసే పరికరం లేదా వేడి నీటి బ్యాగు, లక్కతో కూడిన సంచీ, పడుకునే సంచీ ఉంటాయి. ముందు వేడి పరికరాన్ని విద్యుత్తుతో వేడిచేస్తారు. విద్యుత్తు సౌకర్యం లేనిచోట వేడినీటిని నింపే రకాలు కూడా ఉన్నాయి. వేడి చేసిన పరికరాన్ని లక్కతో కూడిన సంచీలో వేసి దానిపై శిశువును పడుకోబెడతారు. అనంతరం పడుకునే సంచీని చుట్టూ చుడతారు. దీంతో శిశువుకు అవసరమైన వేడి నిరంతరం అందుతుంటుంది. పిల్లలను సరైన ఉష్ణోగ్రతలో ఉంచితే త్వరగా పెరిగే అవకాశమూ ఉంది. కాబట్టి ఇంక్యుబేటర్‌ సదుపాయం లేని ప్రాంతాల్లో ఇది శిశువులకు సంజీవనిలా ఉపయోగపడగలదని నిపుణులు చెబుతున్నారు.
 • ---------------------------------------------------------
source : Eenadu sukheebhava
 • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/