- జ్వరం :వర్షాకాలం సహజంగానే జ్వరాలు ఎక్కువ. ఈ సమయంలో రకరకాల వైరస్‌లు కొత్త శక్తితో విజృంభిస్తాయి. అలాగే నీళ్లు కలుషితం కావటం వల్ల ఇతరత్రా జ్వరాలూ వ్యాపిస్తుంటాయి.
మన శరరంలో ఉష్ణోగ్రతను సమ స్థితిలో వుంచే వ్యవస్థ ఉంటుంది. అది దెబ్బతినడంవల్లనే జ్వరం వస్తుందన్న మాట ! జ్వరానికి కారణమైన జబ్బుల గురించి ముందుగా మనం తెలుసు కుందాం !
- సాధారణ కారణాలు
* మలేరియా, టైఫాయిడ్ , క్షయ, రుమాటిక్ జ్వరము, ఆటలమ్మ, గవదలమ్మ, ఊపిరితిత్తులు ఇన్ పెక్షన్, జలుబు, టాన్సిలైటిస్ , బ్రాంకైటిస్ మూత్రనాళాల ఇన్ ఫెక్షన్ మొదలైనవి. బ్యాక్టీయా & వైరస్ వలన ఇంఫెక్షన్ వస్తూఉంటాయి ..ఫ్లూ జ్వరం, , ఫైలేరియా, మెనింజైటిస్ , ఎన్‌సెఫలైటిస్ .... మున్నగునవి .
మలేరియా : ఇది అకస్మాత్తుగా వస్తుంది. శరీరం ముట్టుకుంటే కాలిపోతున్నట్లుగా వుంటుంది. జ్వరంతోబాటు చలీ, వణుకూ వస్తుంటాయి. జ్వరం కొద్ది గంటలే ఉంటుంది. ఆ తరువాత తగ్గి పోతుంది. ఇలా తరచూ జరుగుతుంది. జ్వరం తగ్గినట్లు అనిపించగానే చెమటలు పడతాయి. రోజు విడచి రోజు జ్వరం వస్తుంది. లేదా రెండు- మూడు రోజులకు జ్వరం వస్తుంది. జ్వరంలేని రోజున రోగి బాగానే ఉన్నట్లు కనిపి స్తాడు. వస్తూ తగ్గుతూ ఉండే జ్వరాన్ని మలేరియాగా అనుమానించాలి.
టైఫాయిడ్: ఇది రొంపతో మొదలవు తుంది. జ్వరం రోజు రోజుకూ పెరుగు తుంది. నాడి నెమ్మదిగా కొట్టుకుం టుంది. ఒక్కోసారి విరేచనాలు ఎక్కువగా అవుతాయి. దాంతో శరీరంలో నీరు ఎక్కువగా బయటకు పోతుంది. నీరసం, నిస్సత్తువ ఆవహిస్తాయి. ఒణుకు, సంధి ఉంటుంటాయి. చాలా జబ్బుగా ఉన్నట్లు కనిపిస్తారు. ఇటువంటి పరిస్థితిలో టైఫా యిడ్‌గా అనుమానించి వైద్యుడిని సంప్ర దించాలి. టైఫాయిడ్ ప్రమాదకారి సుమా!
కాలేయానికి చీము : జ్వర తీవ్రత తక్కువగా వుంటుంది. ఆకలి మంద గిస్తుంది. ఏమీ తినబుద్థికాదు. వాంతులు అవుతుంటాయి. కళ్ళు, చర్మం పచ్చబడ తాయి. మూత్రం పచ్చగా, లేక నారింజ రంగులో వస్తుంది. మలం తెల్లగా వస్తుంది. కాలేయం ఉన్నచోట నెప్పిగా ఉంటుంది. కాలేయం పెద్దదవుతుంది. రోగికి చాలా నీరసం వస్తుంది.
న్యుమోనియా: ఊపిరితిత్తులలో నిమ్ము చేర డాన్నే న్యూమోనియాగా వ్యవహరిస్తాం! ఒక్కోసారి ఊపిరి వేగంగా తీసుకుంటాడు. మరోసారి చాలా తేలిగ్గా తీసుకుంటాడు. ఉన్నట్టుండి జ్వరం త్వరత్వరగా పెరిగి పోతుంటుంది. దగ్గుతుంటాడు. శ్లేష్మం ఆకుపచ్చగా, పసుపు పచ్చగా ఉండవచ్చు. ఛాతీలో నెప్పికూడా వస్తూ వుంటుంది.
రుమాటిక్ ఫీవర్: దీనినే మనం కీళ్ళ వాతరోగ జ్వరం అంటాం ! పిల్లలకు, యవ్వనంలోకి అడుగుపెడుతున్న వారికీ ఈ వ్యాధి సాధారణంగా వస్తూంటుంది. కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటాయి. విప రీతమైన జ్వరం వస్తుంది. గొంతులో నెప్పి గా వుంటుంది. ఊపిరి తీసుకుంటున్న ప్పుడు ఛాతీలో నెప్పి వస్తుంది. కాళ్ళు, చేతులు కదల్చాలంటే ఇబ్బందిగా వుంటుంది. అవి స్వాధీనంలో ఉండవు.
క్షయ : ప్రధమంలో రోగికి చాలా అల సటగా ఉంటుంది. మనిషి చిక్కిపోతుం టాడు. సాయంత్రం వేళల్లో తరచుగా జ్వరం వస్తూంటుంది. ఉదయం జ్వరం వుండదు. దగ్గు ఎక్కువగానే ఉంటుంది. ఆకలి ఉండదు. ఏమీ తినబుద్థికాదు. రాత్రివేళల్లో ఉన్నట్టుండి చెమటలు పడుతూవుంటాయి. ఈ లక్షణాలు కొద్ది రోజులు ఉండి తగ్గిపోదు ! నెలల తరబడి ఇదే విధంగా ఉంటాయి.
ప్రసవ జ్వరం : దీనినే సూతికా జ్వరం అనికూడా అంటాం! ప్రసవానంతరం ఒకటి రెండు రోజులు పోయాక జ్వరం వస్తుంది. ఇది చాలా తక్కువ స్థాయిలో వుంటుంది. క్రమంగా పెరుగుతుంది. యోనిలో నుంచి వచ్చే ద్రవం దుర్వాసన పూరితంగా ఉంటుంది. యోనిలో నొప్పి వస్తూంటుంది. ఒక్కోసారి రక్తస్రావం కూడా కావచ్చు.
జ్వరానికి యితర కారణాలు: ఇంతే కాకుండా జ్వరం రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. గొంతువ్యాధి, చర్మంలో వచ్చే చీముగడ్డలు కూడా జ్వరా నికి కారణమౌతాయి. ఒక్కమాటలో చెప్పా లంటే మన శరీరంలో వచ్చే అనేక వ్యాధు లకు జ్వరం ప్రథమలక్షణం! అందుకే జ్వరం ఏ స్థాయిలో ఉన్నా అశ్రద్ధచేయ కూడదు. అశ్రద్ధ చేస్తే ప్రమాదకరంగా పరిణమించవచ్చు. అలాగే-కొన్ని రకాల జ్వరాలు ముదిరితే-మరికొన్ని జబ్బులకు దారి తీయవచ్చు. మలేరియా వంటి వ్యాధి ముదిరితే రక్తహీనత వస్తుంది. పచ్చ కామెర్లుగా దారితీయవచ్చు. యూరిన్ ఇనెఫెక్షన్, ఛెస్ట్ ఇన్‌ఫెక్షన్ వంటివి రాగల ప్రమాదం వుంది.
- జలుబు జ్వరం
* లక్షణాలు: తుమ్ములు, ముక్కు కారటం, ముక్కు పట్టేయటం, తలనొప్పి, కొద్దిగా జ్వరం.. ఇవన్నీ ఉండొచ్చు. కొందరిలో జ్వరం ఉండకపోవచ్చు కూడా. మొదట్లో 1, 2 రోజులు ముక్కు నుంచి స్వచ్ఛమైన నీరులాంటి ద్రవం వస్తుంది. కొద్దిమందిలో దగ్గు, గొంతు నొప్పి కూడా రావచ్చు. మరీ తీవ్రమైన జ్వరం ఉండదు. ఒళ్లు నొప్పులు అంతగా ఉండవు. ఈ సమస్య సాధారణంగా 2-5 రోజుల్లో తగ్గిపోతుంది. ఈ బాధలు వేధిస్తుంటే- 'యాంటీ హిస్టమిన్', 'డీకంజెస్టెంట్' మందులు వాడితే మంచి ఉపశమనం ఉంటుంది. ఇవి ముక్కు నుంచి స్రావాలను తగ్గించేస్తాయి. ఇక జలుబుకంటూ ప్రత్యేకంగా 'యాంటీ వైరల్' మందు లేదు. కొంచెం ఒళ్లు నొప్పులు, జ్వరం ఉంటే ప్యారాసెటమాల్ బిళ్లలు వేసుకోవచ్చు. సాధారణ జలుబు మందుల్లో (డీకోల్డ్ వంటివి) ఇవన్నీ కలిసే ఉంటాయి. వీటితోనే జలుబు తగ్గిపోతుంది. చిన్నపిల్లలు ముక్కు బిగిసిపోయి ఏడుస్తుంటే వారికి నేసోక్లియర్ వంటి చుక్కల మందులు ముక్కులో వేస్తే రంధ్రాలు తెరుచుకుని హాయిగా గాలి పీల్చుకుంటారు.
జలుబు సమయంలో తీసుకోవాల్సిన ఆహారంలో మార్పులేం ఉండవుగానీ చాలామంది మిరియాల కషాయం, చికెన్ పులుసు, మషాలా సూపుల వంటివి ఇష్టపడుతుంటారు, వీటితో ముక్కులు తెరుచుకున్నట్త్లె హాయిగా ఉంటుంది. ఈ సమయంలో ద్రవాహారం, విశ్రాంతి.. ఈ రెండూ ముఖ్యం. ఇలా చేస్తే నాలుగైదు రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది.
* ఇక చాలా కొద్దిమందిలోనే జలుబు ముదిరి.. సైనుసైటిస్, చిన్నపిల్లల్లో చెవిపోటు వంటివి సమస్యలు రావచ్చు. ప్రారంభ దశలో అవసరం లేకపోయినా.. రెండు మూడు రోజుల తర్వాత ముక్కు స్రావాలు పసుపు లేదా ఆకు పచ్చగా వస్తుండటం, తలభారం ఉంటే వైద్యుల సలహా మేరకు అమోక్సిలిన్, అజిత్రోమైసిన్, సెఫలెక్సిన్ వంటి యాంటీబయాటిక్స్ వాడితే తగ్గిపోతుంది. చాలామంది జలుబు రాగానే యాంటీబయాటిక్స్ మొదలుపెడుతుంటారు, అది
అవసరం లేదు. ముక్కు నుంచి నీరులాంటి స్రావం కారుతున్న తొలి దశలో యాంటీబయాటిక్స్ అవసరం అస్సలుండదు. స్రావాల రంగు మారితే అప్పుడు వైద్యుల పర్యవేక్షణలో యాంటీబయాటిక్స్ వాడటం మంచిది.
* చాలా కొద్దిమందిలో జలుబు తగ్గినట్లే తగ్గి మళ్లీ ద్రవాలు పచ్చరంగులోకి మారి, జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటివి రావచ్చు. వీరికి వైద్యుల సలహా మేరకు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది.
* ప్రతి సీజన్లోనూ ఈ వైరస్ లక్షణాలు మారిపోతుంటాయి కాబట్టి ఇది రాకుండా చూసే టీకాలేం లేవు.
- డెంగీ జ్వరం
* మొత్తమ్మీద డెంగీ జ్వరంలో విపరీతమైన ఒళ్లు నొప్పులు (ఫ్లూ కంటే కూడా ఎక్కువగా) ఉంటాయి. అందుకే దీన్ని 'బ్రేక్ బోన్ ఫీవర్' అంటారు. కొందరికి తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. జ్వరం కూడా చాలా తీవ్రంగా 102-104 కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల్లో వాంతులు, లేదా విరేచనాలు, పలవరింతల వంటివి ఉండొచ్చు. కొద్దిమందిలో ఒంటి మీద ఎర్రగా కందినట్లు ర్యాష్ రావచ్చు.
* మన రాష్ట్రంలో అంతా ప్లేట్‌లెట్లు చూసుకుంటున్నారుగానీ వాస్తవానికి ప్లేట్‌లెట్లు తగ్గటమన్నది చాలా సమస్యల్లో రావచ్చు. కాబట్టి ఈ సీజన్లో, దోమలు బాగా ఉన్నచోట ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం, తీవ్రమైన ఒళ్లునొప్పులు లేదా తలనొప్పి వచ్చి, రక్తపరీక్షలో తెల్లరక్తకణాలు తగ్గటం, ప్లేట్‌లెట్లు తగ్గటం వంటి లక్షణాలు కనబడినప్పుడు దాన్ని డెంగీగా అనుమానించటం మంచిది.
* ఇప్పుడు 'ఎన్‌ఎస్1 యాంటీజెన్' అనే పరీక్ష అందుబాటులో ఉంది. జ్వరం వచ్చిన 1-5 రోజుల్లో ఎప్పుడు చేసినా ఇది డెంగీ జ్వరమా? కాదా? అన్నది చాలావరకూ తెలుస్తుంది. వారం తర్వాత 'ఐజీఎం యాంటీబోడీ' పరీక్షలో, ఆ తర్వాత ఐజీజీ యాంటీబోడీ పరీక్షలో కూడా తెలుస్తుంది. ఇలా నిర్ధారణ అయ్యిన తర్వాత.. ఇతరత్రా ఇబ్బందులేమీ లేని సాధారణ డెంగీ జ్వరమే అయితే ప్యారాసెటమాల్ మాత్రలు తీసుకుంటూ ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటుంటే సరిపోతుంది. విశ్రాంతిగా ఉండాలి. ముఖ్యంగా డైక్లోఫెనాక్, ఐబూప్రోఫెన్, ఆస్పిరిన్ వంటి నొప్పినివారిణి మాత్రలు మాత్రం పొరపాటున కూడా తీసుకోకూడదు. ఇస్తే ప్లేట్‌లెట్లు దెబ్బతిని, రక్తస్రావం అయ్యే అవకాశాలు పెరుగుతాయి.
* డెంగీ జ్వరం 5-7 రోజుల్లో తగ్గిపోతుంది, కొందరికి వచ్చి, తగ్గి, మళ్లీ రావచ్చు. కొంతమందికి కొద్ది రోజులు ఇలా ఊపేసిన జ్వరం.. ఉన్నట్టుంది ఒక్కసారిగా తగ్గిపోతుంది. చాలామంది జ్వరం తగ్గిపోయిందని నిర్లక్ష్యంగా ఉండిపోతారుగానీ వాస్తవానికి డెంగీలో ఇదే కీలక సమయం. ఇప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలా జ్వరం తగ్గిన తర్వాత.. బీపీ పడిపోవటం, రక్తం చిక్కబడటం, నాడి తగ్గటం, ఒంట్లో చిగుళ్ల వంటి రకరకాల ప్రాంతాల నుంచి రక్తస్రావం, మలం నల్లగా రావటం లేదా మూత్రంలో రక్తం పడటం.. ఇటువంటి లక్షణాలు ఆరంభమవుతాయి. ఇది ప్రమాదకరమైన దశ.
* మన రక్తంలో ఎర్రకణాలు, తెల్లకణాలు, ప్లేట్‌లెట్లు ఉంటాయి. వీటికి తోడు ప్లాస్మా అనే ద్రవం ఉంటుంది. డెంగీ జ్వరంలో ఈ ప్లాస్మా లోపల్లోపలే లీక్ అవుతూ.. రక్తం చిక్కబడుతుంది. దీంతో ఇటు రక్తం చిక్కబడటం, అదే సమయంలో బీపీ పడిపోవటం.. ఈ రెండూ జరుగుతాయి. ప్లేట్‌లెట్ కణాల సంఖ్య తగ్గటం కంటే కూడా ఇది ప్రమాదకరమైన స్థితి. దీన్ని మనం గుర్తించాలి.
* అందుకే వైద్యులు రోగికి జ్వరం తగ్గినా కూడా రోజూ పరీక్షలు చేయిస్తుంటారు. ప్లేట్‌లెట్లు లక్ష కంటే తగ్గటం, రక్తం 20% కంటే ఎక్కువగా చిక్కబడటం.. ఈ రెండూ ఉంటే దాన్ని 'డెంగీ హెమరేజిక్ ఫీవర్' అంటారు. అందుకే ప్లేట్‌లెట్ల పరీక్షతో పాటు రక్తం ఎంత చిక్కగా ఉందన్నది చెప్పే 'హెమటోక్రిట్' అనే పరీక్ష కూడా కీలకమే.
ఇక జ్వరం తగ్గిపోయే దశలో- వాంతులు తగ్గకపోవటం, బీపీ తగ్గిపోవటం, చేతులు కాళ్లు సాధారణ స్థితి కంటే చల్లబడుతుండటం, హెమటోక్రిట్ పెరగటం, ప్లేట్‌లెట్లు తగ్గటం, మన సోయి లేకపోవటం, ఒంటి మీద ఎక్కడన్నా తేలికగా రక్తస్రావం లేదా రక్తపు మచ్చలు కనబడుతుండటం, మలం నల్లగా రావటం, మూత్రంలో రక్తంపడుతూ ముదురురంగులో వస్తుండటం, 4-6 గంటల నుంచీ మూత్రం రాకపోవటం.. ఇలాంటి లక్షణాలు కనబడుతుంటే మాత్రం తక్షణం ఆసుపత్రిలో చేర్చి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లేట్‌లెట్ల కంటే కూడా 'హెమటోక్రిట్' ముఖ్యం. దీన్నే 'ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ (పీసీవీ)' అంటారు. దీన్ని బట్టి రక్తం
చిక్కబడకుండా సాధారణ సెలైన్ ఇస్తుండాలి. ఇక ప్లేట్‌లెట్లు 1 లక్ష కంటే తగ్గినప్పుడు ఆసుపత్రిలో చేర్చాలి. రోగి స్థితిని బట్టి ఒకట్రొండు సార్లు ప్లేట్‌లెట్ల పరీక్ష చేస్తుంటారు. ప్లేట్‌లెట్లు 20,000 కంటే తగ్గినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మూత్రం వంటివాటిలో రక్తస్రావం, మలం నల్లగా రావటం వంటివి జరుగుతున్నాయేమో గమనిస్తుండాలి. ప్లేట్‌లెట్ కణాల సంఖ్య 10,000 (పదివేలకు) తగ్గితే.. ఇతరత్రా ఏ లక్షణాలూ లేకున్నా ప్లేట్‌లెట్లు ఎక్కించాలి.
అరుదుగా ప్లేట్‌లెట్లు బాగానే ఉన్నా, రక్తం గడ్డకట్టే వ్యవస్థ దెబ్బతిని రక్తస్రావం అవుతుంటుంది.. దీన్ని పీటీ, ఏపీటీటీ పరీక్షల ద్వారా గుర్తించి, అప్పుడు 'ప్లాస్మా' ఎక్కించాలి. పొట్టలో, ఊపిరితిత్తుల్లో నీరు లీక్ అయ్యిందేమో గమనిస్తూ బీపీ తగ్గిపోతుంటే వెంటనే సెలైన్ ఇవ్వటం, దానితో బీపీ పెరగకపోతే ప్లాస్మా ఇవ్వటం అవసరం. చాలా వరకూ వీటితో పరిస్థితి చక్కబడుతుంది. అప్పటికీ మెరుగవ్వకపోతే రోగి 'డెంగీ షాక్ సిండ్రోమ్' లోకి వెళుతున్నారని అర్థం, ఇది ప్రమాదకర దశ. ఇందులో ప్రాణ ప్రమాదం కూడా ఉంటుంది. అన్నీ బాగుండి కొందరికి కామెర్లు ఉండొచ్చు, ఫిట్స్ రావచ్చు, కిడ్నీలు దెబ్బతినొచ్చు. దీన్ని 'ఎక్స్‌పాండెడ్ డెంగీ సిండ్రోమ్' అంటారు. అంటే ప్రధాన అవయవాలు దెబ్బతింటున్నాయని అర్థం. వీరిని ఐసీయూలో ఉంచి జాగ్రత్తగా కాపాడాల్సి ఉంటుంది. * డెంగీ దోమల ద్వారా వ్యాపించే జ్వరం. కాబట్టి దోమలు కుట్టకుండా చూసుకోవటం అత్యుత్తమమైన నివారణ చర్య.
- సాధారణ జ్వరం లక్షణాలు
* 37.5 డిగ్రీలు C లేదా 1000 డిగ్రీలు F ఆ పైన జ్వరం నమోదు
* తలనొప్పి
* చలితో కూడిన జ్వరం
* కీళ్ళనొప్పులు
* నోరు చేదుగా ఉండుట
* అకలి తగ్గడం, మలబద్దకం
* కొన్ని ప్రత్యేక సమయాలలో కలవరింతలు మొదలైనవి
జ్వరం వచ్చినప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు
* జ్వరం వచ్చిన వ్యక్తి వున్న వాతావరణం చల్లగా ఉండేటట్లు చూడాలి
* సాధారణ ఫ్యాన్ క్రింద పరుండబెడితే కొంత ఉపశమనముంటుంది
* పలుచటి దుస్తులు వాడాలి
* పలుచటి దుప్పట్లు వాడాలి
* గోరువెచ్చని నీళ్ళతో శరీరమంతా తుడవాలి
* నీళ్ళు ద్రవ పదార్దాలు అధికంగా తీసుకోవాలి
* చల్లని నీళ్ళ తో శరీరము తుడవరాదు. నుదుటి మీద తడిగుడ్డ వేయడం వలన ఉపయోగం లేదు
* జ్వరం వచినపుడు తీసుకోవలిసిన ఆహారము
* ఎక్కువ విశ్రాంతి తీసుకొని అధికంగా నీరు త్రాగాలి
* జ్వరం ఉన్నప్పుడు శరీరానికి అధిక కేలరీలు అవసరము అవుతాయి కనుక గ్లూకోజ్ ,హార్లిక్స్ లాంటి ద్రవ పదార్దాలు, పండ్ల రసాలు వంటివి ఆధికంగా తీసుకోవాలి
* బియ్యం గంజి,సగ్గుబియ్యం గంజి,జావ, బార్లీ నీళ్ళు సులభంగా జీర్ణమై య్యే పదార్దాలు ఇవ్వాలి
* కాఫీ , టీ లాంటి ద్రవ పదార్దాలు సాధారణ వేడి తో తీసుకోవాలి
* పాలు , రొట్టె లాంటి పదార్దాలు తీసుకోవచ్చును
* మాంసం ,గుడ్డు, వెన్న , పెరుగు ,నూనె పదార్దాలు తీసుకోరాదు
జ్వరం-చికిత్స :
జ్వరానికి ప్రత్యేకంగా ఫలానా చికిత్స అంటూ లేదు. జ్వరానికి కారణమైన జబ్బేమిటో తెలుసుకుని చికిత్స పొందాలి. సాధారణమైన జ్వరం రెండు మూడు రోజుల్లోనే తగ్గిపోతుంది. మూడు నాలుగు రోజులకు మించి జ్వరం ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. సత్వర వైద్య సహాయం పొందాలి. లక్షణాలను బట్టి మనకు మనమే జబ్బును నిర్ధారించుకో కూడదు. చిన్నపాటి జ్వరమే కదా అని స్వంత వైద్యం చేసుకోకూడదు. మన తెలియనితనం చాలాసార్లు ప్రాణాల మీదకు తెస్తుంది. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా పెరిగినప్పుడు గోరువెచ్చని నీళ్ళలోని గుడ్డతో శరీరం తుడవాలి. అలా వేడి తగ్గేందుకు ప్రయత్నించాలి. ఆలస్యం చేయకుండా వైద్య సహాయం పొందాలి. స్వంత వైద్యం, నాటువైద్యం పనికిరాదు. కాబట్టి జ్వరం అనేది ఒక జబ్బు కాదు. మరొక వ్యాధికి లక్షణం. దీనిని గమనించి అవసరాన్ని బట్టి తక్షణం చికిత్స పొందాలి.
tab calpal 500 mg 3 times / day for 3- 5 days
for children :
calpal syrup 2.5 ml 3 times /day 3-5 రోజులు .
- ఉష్ణమాపి ,Thermometer
జ్వరము కొలిచే సాధనము ను ధర్మామీటరు .ఉష్ణమాపి (Thermometer) , సాధారణంగా ఇందులో పాదరసము ను ఉపయోగిస్తారు. పాదరసం సంకోచ వ్యాకోచాలను ఆధారంగా చేసుకొని ఉష్ణోగ్రతను నిర్ణయిస్తారు. ఈ పరికరమును ముఖ్యముగా రెండు భాగములుగా విభజించవచ్చును, ఒకటి ఉష్ణోగ్రత Sensor (స్పర్శేంద్రియము) (పాదరస ఉష్ణమాపిలో ఉండే బల్బు), రెండవది కొలబద్ద. ఉష్ణోగ్రతను మనము సాధారణము గా entigrade(C) లోగాని Foren(F) లో గాని కొలుస్తాము. ధర్మామీటర్లలో అనేక రకాలు ఉన్నాయి.
"జరుగుబాటుంటే జ్వరమంత సుఖం లేద"న్నారు మన పెద్దవాళ్ళు....అప్పట్లో అంటే, సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో ఓసారి అలా వచ్చి పలకరించి ఇలా వెళ్ళిపోయేవి జ్వరాలు...రోజూ కాయకష్టం చేసే వాళ్ళకి, అలా రెండ్రోజులు మంచం మీద పడుకుని, వేళకింత తింటూ(రోజూలా అదరాబాదరాగా కాకుండా) ఉంటే ప్రాణానికి కాసింత సుఖంగానే అనిపించేదేమో! కాని మన రోజులకి అది అంత సరిపడదేమో! ఒక్కరోజు ఆఫీసుకి వెళ్ళకపోయినా జీతంలో కోత! productivity తగ్గిపోతుందిగా మరి! పైగా నెలకోసారి వచ్చే జ్వరాలతో ఎలా?.......మరి ఇలాంటి జ్వరాలకి జరుగుబాటు ఎలా ఉంటే, మనసుకి,శరీరానికి కాస్త హాయిగా ఉంటుందో
అసలు ఈ జ్వరం అంటే ఏంటి? ఎందుకు వస్తుందో ముందు టూకీగా తెలుసుకుందాం........మన శరీరం యొక్క ఉష్ణోగ్రత (core body temperature) మామూలుగా రోజువారీ ఉండేతేడాలకన్నా(diurnal variations అంటే మన శరీర ఉష్ణోగ్రత ఉదయం పూట,రాత్రి పూట వేరువేరుగా ఉంటుంది) పెరిగితే దాన్ని జ్వరం అనొచ్చు....... అంటే శరీర సాధారణ ఉష్ణోగ్రత 37'c or 98.4'F అనుకుంటే, ఒక డిగ్రీ ఎక్కువ వరకూ నార్మల్ గా తీసుకోవచ్చు.(100'F వరకూ).........ఈ జ్వరం అనేది ప్రత్యేకమైన వ్యాధి కాదు...అంతర్గతంగా ఉన్న ఒక వ్యాధి యొక్క బాహ్య లక్షణం(DISEASE SYMPTOM) మాత్రమే.కాబట్టి జ్వరానికి కారణాలు ఏదైనా కావచ్చు.మామూలు వైరల్ ఫీవర్స్ దగ్గరనుంచి విషజ్వరాలు,క్యాన్సర్లు కూడా కావచ్చు...ఒక్కొక వ్యాధికి జ్వరలక్షణం ఒక్కోరకంగా ఉంటుంది.....అంటే, fever periodicity,high or low grade, associated with chills and rigors, other associated symptoms ఇలాంటివి అన్నమాట.
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మన వాళ్ళు సాధారణంగా ఒక అపోహ పడుతుంటారు..."జ్వరం బైటకి కనపడట్లేదు, ’లో జ్వరం’ ఉంది" అని....అలాంటిది ఏమీ ఉండదు..జ్వరం అంటే బయటికి కనిపించేది మాత్రమే....ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది "లోజ్వరం" ఉంది అని టాబ్లెట్లు మింగేస్తుంటారు..దాని వల్ల ఉపయోగం ఏమీ లేకపోగా, లివర్ దెబ్బతినే అవకాశం ఉంది......
ఇక ఫీవర్ ఎంత ఉందో, కరెక్ట్ గా ఎలా చూడాలో చూద్దాం......ఈ రోజుల్లో రకరకాల థర్మామీటర్స్ దొరుకుతున్నాయి....డిజిటల్, ఊరక చేత్తో పట్టుకుని చూసేవి ఇలా......కాని అన్నిటికన్నా బెస్ట్ ఒన్, మన పాత గ్లాస్ థర్మామీటర్(దీన్నే CLINICAL THERMOMETER అంటారు).......body temperature is best measured when it is done per rectally.కాని అలా చెయ్యటం ప్రాక్టికల్ గా కుదరదు కాబట్టి, నాలుక కింద పెట్టి చూడటం(ఒక నిమిషం పాటు) ఉత్తమం....(చేతికింద అంటే చంకలో పెట్టి చూసిన రీడింగుకి ఎప్పుడూ ఒక డిగ్రీ ఎక్కవ కలపాలి.)......చూసే ముందు,తర్వాత థర్మామీటర్ ని శుభ్రంగా తుడవాలి....మరీ చల్లటి నీళ్ళని కాని, మరీ వేడి నీళ్ళని కాని ఉపయోగించవద్దు...దీనివల్ల తప్పు రీడింగు రావటమే కాకుండా, థర్మామీటర్ పగిలిపోయే అవకాశం కూడా ఉంది....చూసేప్పుడు థర్మామీటర్ టిప్ ని పట్టుకోవద్దు..దీనివల్ల చూసినవాళ్ళ బాడీ టెంపరేచర్ ట్రాన్స్మిట్ అయ్యి రీడింగు తప్పు వచ్చే అవకాశం ఉంది.
ధర్మామీటర్లలో అనేక రకాలు ఉన్నాయి
మౌత్ ధర్మామీటరు : ఒక చివర్ పాదరము బల్బ్ ఉంటుంది . ఈ బల్బ్ ను నోటిలో నాలుక కిందను పెట్టి ఉష్ణోగ్రతను కొలుస్తారు . చిన్నపిల్ల విషయము లో దీనిని వాడరు . కొరికే ప్రమాదము ఉన్నందున .
రెక్టల్ ధర్మామీటరు : పిల్లలకు మూడేళ్ళు వచ్చేవరకు ఈ ధర్మామీటరు ఉత్తమమైనది . పిల్లలను బోర్లా పడుకోపెట్టి థర్మామీటరు చివరిభాగములో పెట్రోలియం జెల్లీ రాసి అసనము లోకి అంగుళము మేర చొప్పించి ఉష్ణోగ్రత చూసే సమ్యము పూర్తయ్యే వరకు కాళ్ళు ఒక చేతితోపైకి పట్టుకోని , మరోచేతితో థర్మామీటరునూ పడిపోకుండా పట్టుకొని జ్వరము కొలుస్తారు .
చెవి థర్మామీటరు : ఈ రకమైన థర్మామీటరును అన్ని వయసులవారికి వాడవచ్చును . రెండు నిముషాలపాటు చెవిలో ఉంచి జ్వరము కొలుస్తారు . ఇది కూడా ఖచ్చితమైన ఉష్ణోగ్రతను తెలియజేస్తుంది .
నోటిద్వారా చూసే డిజిటల్ థర్మామీటరు .: ఐదేళ్ళు .. ఆపైబడ్డవారికి దీనిని ఉపయోగిస్తారు . ఇది బేటరీ పై పనిచేస్తుంది . బేటరీ శక్తి తగ్గితే ఇది తప్పు రీడింగు చూపే ఆస్కారము ఉంది .
స్ట్రిప్ థర్మామీటరు : ముఖము ఫాలభాగము పైన ఈ థర్మామీటరు ఉంచి ఉష్ణోగ్రతను కొలుస్తారు . నోటిలో పెట్టడానికి వీలు పడనపుడు దీనిని వాడుతారు . ఇది ఖచ్చితమైన రీడింగ్ ఇవ్వక పోవచ్చును.
- ============================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.