Tuesday, July 26, 2011

సౌందర్య సాధనాలు సమస్యలు-అవగాహన , Cosmetic and side-effects awareness


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -సౌందర్య సాధనాలు సమస్యలు-అవగాహన , (Cosmetic and side-effects awareness)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మనం ఏ సౌందర్య సాధనం తీసుకున్నా దానిలో- నీరు, ఆయిల్స్‌తో పాటు తప్పనిసరిగా మరికొన్ని పదార్ధాలుంటాయి. అవి:
* ఎమల్సిఫయర్స్‌: నీరు, నూనెలను కలిపే పదార్ధాలివి. వీటిని జోడిస్తే ఆ రెండూ చక్కగా కలిసి, క్రీములా తయారవుతాయి.
* ప్రిజర్వేటివ్స్‌: బ్యాక్టీరియా, ఫంగస్‌ చేరకుండా చూసేందుకు.
* థికెనర్స్‌: క్రీము చిక్కగా ఉండేందుకు.
* ఫ్రాగ్రెన్సెస్‌: సువాసన కోసం. జంతువుల నుంచి, మొక్కల నుంచి తీసినవి లేదా రసాయనికంగా తయారైన సింథటిక్‌ పదార్ధాలివి.
* స్టెబిలైజర్స్‌: పాడైపోకుండా చాలా రోజులు నిల్వ ఉండేందుకు.
* కలరింగ్‌ ఏజెంట్స్‌: ఆకర్షణీయమైన రంగు కోసం. పింక్‌, వైలెట్‌ వంటి రకరకాల రంగు రసాయనాలు వాడతారు.

వీటిలో మొట్టమొదటగా చర్మ సమస్యలు తెచ్చిపెట్టేది ఫ్రాగ్రెన్సెస్‌! ఆ తర్వాత ప్రిజర్వేటివ్స్‌. మూడోది రంగు రసాయనాలు. ప్రతి సౌందర్య సాధనంలోనూ సువాసన కోసం, చెడకుండా ఉండటం కోసం, ఆకర్షణీయమైన రంగు కోసం ఈ మూడింటినీ తప్పనిసరిగా కలుపుతారు..ఈ మూడే చాలా చర్మ సమస్యలకు మూలం!
ఏయే సమస్యలు ఎక్కువ?
* కాంటాక్ట్‌ ఇరిటెంట్‌ డెర్మటైటిస్‌: కాస్మెటిక్స్‌లోని ఏదైనా పదార్థం పడకపోయినా.. దాన్ని పూసుకున్న వెంటనే వచ్చే సమస్య ఇది. వెంటనే చర్మం ఎర్రగాకందిపోయి, వాచి దురద మొదలవుతుంది. నీరూ కారొచ్చు.
* కాంటాక్ట్‌ అలర్జిక్‌ డెర్మటైటిస్‌: రాసుకున్న పదార్థం లోపలికి వెళ్లి, అక్కడ అలర్జీ కలిగించటం వల్ల వచ్చే సమస్య ఇది. కాబట్టి సాధారణంగా రాసుకున్న 3, 4 రోజులకు బాధలు మొదలవుతాయి.
* ఫోటో సెన్సిటివిటీ: కొన్ని కాస్మెటిక్స్‌ రాసుకుని ఎండలోకి వెళితే.. అవి సూర్యరశ్మితో చర్య జరిపి.. ముఖం, ఎండ సోకిన భాగాలన్నీ నల్లగా మారేలా చేస్తాయి.
* అర్టికేరియా: కొన్ని కాస్మెటిక్స్‌ రాసుకున్న తర్వాత ఒళ్లంతా దద్దుర్లు వచ్చేస్తాయి. ఇది 'కాంటాక్ట్‌ అర్టికేరియా'.
* ఫాలిక్యులైటిస్‌: ముఖమంతా సూక్ష్మంగా ఉండే వెంట్రుకల కుదుళ్ల నుంచి చీముపొక్కులు వస్తాయి.
* గ్రాన్యులోమా: ముఖ్యంగా డియోడరెంట్‌ల వంటివి వాడినప్పుడు తీవ్రమైన దురదతో చర్మం మీద గడ్డలు వస్తాయి.
* మొటిమలు, మచ్చలు: కొన్ని కాస్మెటిక్స్‌తో మొటిమలు, బొల్లి వంటి తెల్ల మచ్చలు వస్తాయి.
* క్యాన్సర్లు: డియోడరెంట్‌ లాంటి కొన్ని కాస్మెటిక్స్‌లో వాడే 'ప్యారాబెన్స్‌' రకం ప్రిజర్వేటివ్‌లతో రొమ్ము క్యాన్సర్ల వంటివీ పెరుగుతున్నాయని ఇటీవల గుర్తించారు.
* కొందరికి అసలు ఏదైనా కాస్మెటిక్‌ రాస్తూనే.. వెంటనే భరించలేనంత మంట, ఎర్రబారటం, దురద వంటివన్నీ వచ్చేస్తాయి. దీన్ని 'కాస్మెటిక్‌ ఇన్‌టాలరెన్స్‌ సిండ్రోమ్‌' అంటారు. వీరు అసలా కాస్మెటిక్స్‌ జోలికి వెళ్లకపోవటం ఉత్తమం. లేదంటే ముందే అది పడుతుందా? లేదా? 'ప్యాచ్‌ టెస్ట్‌' చేసుకోవాలి.
-ఏం చెయ్యచ్చు?
* కాస్మెటిక్స్‌ కొనేటప్పుడు.. కొన్నేళ్లుగా మార్కెట్లో ఆదరణ ఉన్న ఉత్పత్తులను ఎంచుకోవటం, మంచి పేరున్న కంపెనీ ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వటం కొంత మేలు.
* దానిలో వాడిన పదార్ధాలేమిటో రాసినవే చూసి కొనుక్కోవటం మంచిది.
* గాఢమైన వాసనలున్న, ఆల్కహాల్‌ ఎక్కువున్న ఉత్పత్తులు ఎంచుకోవద్దు.
* వాస్తవానికి 'హెర్బల్‌' ఉత్పత్తులు మంచివే అయినా.. ఏ నియంత్రణా లేకుండా వీటిని ఎవరెవరో రకరకాలుగా తయారు చేస్తున్న నేపథ్యంలో వీటినీ విశ్వసించే పరిస్థితి లేదు.
* అందానికి కాస్మెటిక్స్‌ మీద ఆధారపడటం కంటే కూడా.. నీరు ఎక్కువగా తాగటం, కంటి నిండా నిద్ర, పండ్లు-కాయగూరలు ఎక్కువగా తినటం ముఖ్యమని గుర్తించాలి!
సహజ సౌందర్యం
సౌందర్య పోషణ మనకు కొత్తేం కాదు. ప్రాచీన కాలం నుంచీ మనకు సౌందర్య సాధనాల వాడకం తెలిసిందే కాబట్టి మనం సాధ్యమైనంత వరకూ సహజమైన ప్రకృతి వనరుల మీద ఆధారపడటం ఉత్తమం. ప్రకృతి సిద్ధంగా లభించే కుంకుళ్లు, శీకాకాయి, సున్నిపిండి వంటివి మంచివి. వీటితో అలర్జీలు, రియాక్షన్లకు ఆస్కారం తక్కువ. అలాగే కొబ్బరి నూనె, నువ్వుల నూనె వంటివి సహజమైన మాయిశ్చరైజర్లు. ఇక పొడి చర్మానికి ఆలివ్‌ ఆయిల్‌, పర్‌ఫ్యూమ్‌ కలపని పెట్రోలియం జెల్లీ(వాజ్‌లైన్‌) రాసుకోవచ్చు. మనం సాధ్యమైనంత వరకూ సహజంగా ఉండేందుకు, సౌందర్య పోషణకు కూడా సహజమైనవి ఎంచుకునేందుకు ప్రయత్నించటం మంచిది.  
--అందరికీనా..?

ఈ సమస్యలు అందరికీ రాకపోవచ్చు. కానీ కొన్నికొన్ని పదార్ధాలు కొందరికి సరిపడవు కాబట్టి కాస్మెటిక్స్‌ విషయంలో జాగ్రత్తలు మాత్రం అందరికీ తప్పవు. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ఈ బాధలు ఎక్కువ. అలాగే అలర్జీ స్వభావం, ఆస్థమా, బ్రాంకైటిస్‌ వంటి సమస్యలున్న వారికి కూడా ఈ రియాక్షన్లు ఎక్కువ. కాబట్టి వీరు మరింత జాగ్రత్తగా ఉండాలి.
మధుమేహం, థైరాయిడ్‌ సమస్యలున్న వారికీ, కిడ్నీ వ్యాధులున్న వారికీ, రకరకాల కారణాల వల్ల రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికీ ఈ బాధలు అధికం. కాబట్టి వీరు మరింత జాగ్రత్తగా ఉండాలి.  
కళ్లు
మస్కారా, లైనర్స్‌, షేడ్స్‌.
వీటితో కొందరికి కళ్ల నుంచి నీరు, దురద, ఎర్రబటం, ఉబ్బటం వంటివి రావచ్చు.
  
జుట్టు
హెయిర్‌ డై, హెయిర్‌ స్ట్రెయిట్‌నర్స్‌, హెయిర్‌ కర్లర్స్‌, హెయిర్‌ రిమూవర్లు, షాంపూలు, హెయిర్‌ ఆయిల్స్‌.
* హెయిర్‌ డై: జుట్టుకు వేసుకునే ఈ రంగుల్లో 'పారా ఫినిలిన్‌ డయామిన్‌(పీపీడీ)' అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇది 2% కంటే తక్కువుండాలి. కానీ కొన్నింటిలో 3-4% కూడా ఉంటోంది. చాలామందిలో 'కాంటాక్ట్‌ ఎలర్జిక్‌ డెర్మటైటిస్‌'కు ఇదే కారణం. దీనివల్ల డై వేసుకున్న తర్వాత.. ముందు సున్నితమైన కనురెప్పల మీదా, కణతల దగ్గరా, చెవుల మీదా, చెవుల వెనకా, తల మీదా ఎర్రగా వాచినట్లు, బొబ్బలు పుండ్లు వస్తాయి. విపరీతమైన దురద. అరుదుగా ఒళ్లంతా రావచ్చు. హెయిర్‌డైలతో ఉన్న అతి పెద్ద సమస్య ఇది. కాబట్టి డై వేసుకునే ముందే.. చెవి వెనక చిన్న చుక్క పెట్టుకుని 24-48 గంటలు గమనించాలి. అక్కడ ఎరుపు, వాపు, దురద.. ఏమీ లేకపోతేనే ఆ డై వేసుకోవాలి. డై వాడుతున్నప్పుడు కూడా ఎప్పుడన్నా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇక మెరుస్తుండే మెటాలిక్‌ రంగు హెయిర్‌డైల వల్ల జుట్టు చిట్లిపోతుంది. డై పడనివారు హెన్నా వంటి సహజ ఉత్పత్తులు వాడుకోవచ్చు.
* హెయిర్‌ రిమూవర్స్‌: సాధారణంగా ఈ 'డిపైలేటర్స్‌'తో పెద్దగా సమస్యలుండవుగానీ.. ఈ క్రీములు నిర్దేశిత సమయం కంటే ఎక్కువ సేపు మన చర్మం మీద ఉంటే మాత్రం తీవ్రమైన 'అలర్జిక్‌ డెర్మటైటిస్‌' రావచ్చు. ముఖ్యంగా సున్నిత జననాంగాల వద్ద ఈ క్రీములను ఎక్కువ సేపు ఉండనిస్తే దురద, వాపు వంటి రియాక్షన్లు తీవ్రంగా ఉంటాయి.
* షాంపూలు: నురుగుతో తల మీది జిడ్డును తేలికగా వదిలించాలి కాబట్టి వీటిలో 'సోడియం లారైల్‌ సల్ఫేట్‌', 'ఫార్మాల్డిహైడ్‌' వంటి 'సర్ఫాక్టెంట్స్‌' ఉంటాయి. ఒకరకంగా ఇవి మన డిటర్జెంట్‌ సబ్బుల్లాంటివి. వీటివల్ల అరుదుగా తల మీద 'ఇరిటెంట్‌ డెర్మటైటిస్‌' రావచ్చు. ఇక షాంపూల్లో వాడే రంగుల వల్ల- జుట్టు గడ్డిలా పొడిగా తయారవ్వటం, చిట్లిపోవటం, రంగు మారిపోవటం వంటి దుష్ప్రభావాలూ ఉంటాయి.  
ముఖం
ఫౌండేషన్‌ క్రీమ్స్‌, బ్లీచింగ్‌ ఏజెంట్స్‌, కలర్‌ మాస్కర్స్‌, ఫెయిర్‌నెస్‌ క్రీమ్స్‌.
* బ్లీచింగ్‌ ఏజెంట్స్‌: ఫేషియల్స్‌, బ్లీచ్‌ చేసిన ప్రతిసారీ చర్మం పైన ఉండే మృతకణాలు (స్ట్రేటమ్‌ కార్నియమ్‌) ఊడిపోయి.. ముఖం తేటగా, అందంగా మెరుస్తుండే మాట వాస్తవమే. అయితే ఇది కేవలం తాత్కాలికం. ఇలా మరీ తరచూ బ్లీచ్‌ చేస్తుంటే ముఖానికి ఏం రాసినా మంటగా అనిపించే 'కాస్మొటిక్‌ ఇన్‌టాలరెన్స్‌ సిండ్రోమ్‌' వస్తుంది. అలాగే చర్మం సహజత్వం, స్వభావం మారిపోయి ముఖం కాస్త వికృతంగా కూడా తయారవుతుంది.
* బ్లీచ్‌ కోసం.. రకరకాల ఫ్రూట్‌ పీల్స్‌, ఫ్రూట్‌ యాసిడ్స్‌ వాడటం వల్ల మొటిమలు, చీము పొక్కులు చాలా ఎక్కువగా వస్తుంటాయి. పీల్స్‌ గాఢంగా ఉంటే చర్మం నలుపు తిరిగే అవకాశమూ ఉంటుంది. అలాగే పీల్స్‌ చేయించుకోగానే ఎండలోకి వెళితే చర్మం నల్లబారే అవకాశం ఎక్కువ.
* ఫెయిర్‌నెస్‌ క్రీములు: వీటితో ముఖం మీద వెంట్రుకలు దట్టంగా పెరిగే అవకాశాలుంటాయి.
* బిందీ: కుంకుమ, తిలకం వంటి వాటిలో 'ఫ్లోర్‌సిన్‌ డై'లు వాడతారు.ఇవి సూర్యరశ్మితో చర్య జరిపి.. ముందు నల్లటి మచ్చలు, కొంత కాలానికి బొల్లిలా తెల్లటి మచ్చలు వస్తాయి. కాబట్టి తేడాగా అనిపిస్తే వెంటనే బొట్టు మార్చాలి. ఆ ప్రదేశంలో చర్మం మీద జింక్‌ ఆక్సైడ్‌ వంటి క్రీములు మందంగా రాసుకుని, దాని మీద నల్లతిలకం వంటివి పెట్టుకోవచ్చు. లేదంటే విభూతి వంటివి దట్టంగా పెట్టుకుని, దాని మీద చిన్న బొట్టు పెట్టుకుని చూడొచ్చు. స్టిక్కర్ల వెనక ఉండే జిగురు కారణంగా 'కాంటాక్ట్‌ అలర్జీ'లూ ఎక్కువే.
* లిప్‌స్టిక్‌: లిప్‌స్టిక్‌లలో సాధారణంగా తేనె మైనం, ఫ్లోర్‌సిన్‌ డైలు, ఆల్కహాల్‌ ఉంటాయి. ఎర్రదనం కోసం వాడే ఈ ఫ్లోర్‌సిన్‌ డైలలో ఎక్కువగా వాడే రంగు చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. ముందు కొద్దిగా దురద రావచ్చు. దాన్ని నిర్లక్ష్యం చేస్తే పెదాలు ఎర్రగా మారి.. దురద వస్తుంది. రంగులో రంగు కలిసి పోతుంది కాబట్టి ఈ ఎర్రదనాన్ని చాలామంది గుర్తించరు. అక్కడి నుంచి పెదాలు పొడిబారిపోయి పగుళ్లు, నీరుగారటం మొదలవుతుంది. దీన్ని తగ్గించాలంటే చాలాకాలం పడుతుంది. దురద వస్తే వెంటనే లిప్‌స్టిక్‌ మానేసి.. కేవలం పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి.  
గోళ్లు
నెయిల్‌ పాలీష్‌, పాలీష్‌ రిమూవర్లు, ఆర్టిఫీషియల్‌ నెయిల్స్‌
* పాలీష్‌: చిక్కగా ఉండి, త్వరగా గట్టిపడటానికి పాలీష్‌లలో 'ఫార్మాల్డిహైడ్‌' తప్పనిసరిగా వాడతారు. దీనివల్ల కొన్నిసార్లు అసలుకే మోసం వచ్చి గోరు ఊడిపోయే ప్రమాదం ఉంది. గోరుచుట్లు, గోరుపైని చర్మం వాచి నొప్పి, చీముకూడా పట్టొచ్చు. గోరు రూపమే మారిపోవచ్చు. మందంగా అవ్వచ్చు, లేదా పల్చబడిపోవచ్చు. ఎప్పుడన్నా ఒకసారి పాలీష్‌ వేసుకుంటే పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. కానీ వరసగా వేసుకుంటుంటే ఈ రసాయనాలు గోరులో పేరుకుపోయి.. కొంత కాలానికి సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంటుంది.
రెండోది- నెయిల్‌పాలీష్‌ వేసుకున్న వారు ఆ చేతితో ఏదో ఒక సమయంలో కళ్లు నులుముకోవటం, మెడ మీద గోకటం వంటివి చేస్తారు. దీంతో సున్నితమైన కంటి చర్మం దగ్గర, మెడ మీద రియాక్షన్లు వస్తాయి. కొన్నిసార్లు ఆడపిల్లలు క్లాసుల్లో బుగ్గన చెయ్యిపెట్టుకుని కూర్చుంటారు. అప్పుడు గోళ్ల రంగులోని రసాయనాలు చాలాసేపు చెంపలకు అంటుకుంటాయి. వాళ్లు బయట ఎండలోకి వచ్చినప్పుడు అవి సూర్యరశ్మితో చర్య జరిపి.. చెంపల మీద అలర్జీ రియాక్షన్లకు కారణమవుతుంటాయి. ముందు ఎర్రగా ఉబ్బినట్టు వచ్చి.. నల్లగా తయారయ్యే ఈ రకం మచ్చలు అంత త్వరగా తగ్గవు కూడా!
* పాలీష్‌ రిమూవర్స్‌: దీనిలో ప్రధానంగా రంగును కరిగించే సాల్వెంట్‌ రసాయనం 'అసిటోన్‌' ఉంటుంది. దీనివల్ల గోరుచుట్టూతా ఎర్రగా వచ్చి దురదలూ, మచ్చలు, నీరు కారటం వంటి దుష్ప్రభావాలన్నీ ఉంటాయి. ఈ సమస్యలు అందరికీ రాకపోవచ్చు. కానీ అవి మొదలైనప్పుడు వెంటనే గుర్తించటం చాలా అవసరం.  
ఒళ్లు
మాయిశ్చరైజర్లు, యాంటీపర్‌స్పిరెంట్లు, డియోడరెంట్లు, పెర్‌ఫ్యూములు, సన్‌స్క్రీన్లు
* యాంటీ పర్‌స్పిరెంట్స్‌: చెమటను నిరోధించే వీటిలో అల్యూమినియం క్లోర్‌హైడ్రేట్‌, అల్యూమినియం క్లోరైడ్‌, 'క్వాటనరీ అమ్మోనియం కాంపౌండ్లు' ఉంటాయి. ఇవి చెమట తగ్గిస్తాయి. కానీ నేరుగా చర్మానికి తగలటం వల్ల చంకల్లో విపరీతమైన అలర్జీ దురదలు, బొబ్బలు, కొందరిలో గడ్డల వంటివీ వస్తాయి.
* డియోడరెంట్స్‌: వాస్తవానికి వీటిని నేరుగా చర్మం మీద స్ప్రే చేసుకోకూడదు. బట్టల మీదో, దూరం నుంచో స్ప్రే చెయ్యాలి. కానీ చాలామంది నేరుగా వాడతారు. వీటిలో బిథియొనాల్‌ వంటి 'క్లోరినేటెడ్‌ ఫినాల్స్‌' ఉంటాయి. వీటిని స్ప్రే చేసుకుని, సూర్యరశ్మిలోకి వెళితే 'ఫోటో సెన్సిటైజేషన్‌' వచ్చి, నల్లగా అయిపోవచ్చు. చంకల్లో చర్మం నల్లగా, దళసరిగా మారటం, దురద, అక్కడి చర్మం బాగా పల్చబడి నీరుగారుతుండటం వంటి సమస్యలన్నీ వస్తాయి.
* పర్‌ఫ్యూమ్‌: కేవలం అత్తర్లు, సెంటు, పర్‌ఫ్యూములే కాదు.. ప్రతి సౌందర్య సాధనంలోనూ సువాసన కోసం వీటిని ఎంతోకొంత కలుపుతారు. ఇవి చర్మానికి తగిలినప్పుడు అలర్జీ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. వీటివల్ల చర్మం మీద రకరకాల అలర్జీలు, నలుపు లేదా తెలుపు మచ్చలు వస్తాయి. కాబట్టి పర్‌ఫ్యూములను దుస్తుల మీదే స్ప్రే చేసుకోవాలి. నేరుగా చర్మం మీద తగలనివ్వకుండా చూసుకోవటం చాలా అవసరం.
* మాయిశ్చరైజర్స్‌: పొడి చర్మం వారికి వీటి అవసరం ఎక్కువ. వీటిలో రెండు రకాలుంటాయి. చర్మం నుంచి నీరు ఆవిరైపోకుండా అడ్డుకునే 'అక్లూసివ్స్‌' కొన్నైతే.. నీరును చర్మానికి అందించే 'హ్యుమాక్టిన్స్‌' కొన్ని. ఎక్కువగా వాడితే ఇవి చర్మం మీద ఉండే సూక్ష్మమైన రంధ్రాలను మూసివేస్తాయి. దీనివల్ల మొటిమలు విపరీతంగా పెరిగిపోతాయి. చీముపొక్కులూ వస్తాయి. కాబట్టి వీటిని మితంగా వాడాలి. కొద్దిమందిలో ఇరిటేషన్‌ కూడా రావచ్చు.
* సన్‌స్కీన్‌ లోషన్లు: రాసుకుంటే బయటకు కనబడకుండా ఉండే రసాయనిక స్క్రీన్‌లలో 'ప్యారాఅమినో బెంజాయిక్‌ యాసిడ్‌' వల్ల చాలా మందికి, 'సినమేట్స్‌'తో కొద్దిమందికి రియాక్షన్లు వస్తాయి. ఇక పైకి కనిపిస్తుండే స్క్రీన్స్‌లో (క్రీడాకారులు ముఖానికి రాసుకునేలాంటివి) జింక్‌ ఆక్సైడ్‌, టైటానియం డై ఆక్సైడ్‌ వంటివాటితో రియాక్షన్లు తక్కువ. కాబట్టి ఈ రెండూ కలిసి ఉండే ఉత్పత్తులు వాడుకోవటం మంచిది. అలాగే లోషన్‌ను ముందు ఒకరోజు రాసుకుని.. 24 గంటలు చూసి.. ఏ సమస్యా లేకపోతేనే కొనసాగించాలి.  
ఆహారం-కాస్మెటిక్స్‌-మందులు
మనం తీసుకునే ఆహారం, మందులు.. మనం వాడే కాస్మెటిక్స్‌.. మధ్య చాలా సంబంధం ఉంటుంది. అందుకు ఈ కింది సందర్భాలే ఉదాహరణ.
* 'అమినోఫిలిన్‌' ఉబ్బసానికి వాడే మందు. కొన్ని రకాల కాస్మెటిక్స్‌లో 'ఇథలీన్‌ డయామిన్‌' వంటి స్టెబిలైజర్స్‌ ఉంటాయి. ఈ కాస్మెటిక్స్‌ వాడి, అమినోఫిలిన్‌ మందు తీసుకునే వారిలో తీవ్రమైన రియాక్షన్లు రావచ్చు. ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి.
* హెయిర్‌ డైలో 'పారా ఫినిలిన్‌ డయామిన్‌' ఉంటుంది. అలాగే కొన్ని ఆహార పదార్ధాల్లో వాడే రంగుల్లో కూడా ఇదే రంగు ఉంటుంది. ఆ హెయిర్‌డై వేసుకున్నవాళ్లు ఆ రకం ఆహారపదార్ధాలు తింటే 'క్రాస్‌ సెన్సిటివిటీ'తో కూడా కొన్నిసార్లు అలర్జీలు వస్తాయి.

మూలము : తెలుగు పల్లకి / Sathyaram.ch 
 • ===========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, July 25, 2011

వైద్యనీతి , Medical moralityఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు వైద్యనీతి , Medical morality- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


* ప్రతి వైద్య విధానం కొన్ని నీతి నియమాలతో నడుస్తుంది.

* వైద్య పరిశోధనల ఫలితాలు హక్కుల చట్రంలో లేకుండడం. జీవన్మరణాలను లాభసాటి అంశంగా భావించకుండా ఉండే ప్రపంచం నా దృష్టిలో సరైన ప్రపంచం అని మాజీ ప్రధాని 1981 ప్రపంచ ఆరోగ్య సభలో చెప్పారు.

* ఇటీవల వైద్యం వ్యాపారమయం అయ్యిందని చాలా మంది అంటున్నారు.

* 2008 ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వైద్య వ్యాపారాన్ని గురించి తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది.

* ఈ నేపథ్యంలో ఈ వారం, వచ్చేవారం వైద్యనీతి గురించి హెల్త్‌ బోర్డు ద్వారా తెలుసుకుందాం. అల్లోపతి వైద్య విధానానికి పరిమితమవుదాం.

* అల్లోపతి వైద్య విధానానికి పితామహుడు హిపోక్రటిస్‌.

* సాధారణంగా హిపోక్రటిస్‌ ప్రతిజ్ఞను ఎంబిబిఎస్‌లో చేరిన విద్యా ర్థులతో చేయిస్తారు.

* హిపోక్రటిస్‌ ప్రతిజ్ఞ గతంలో ప్రతి ఆసుపత్రి గోడలపై కనపడేది.

* ఇటీవల కాలంలో ఇది ఆసుపత్రు లలో కనిపించడం లేదు.

* మన దేశంలో అల్లోపతి వైద్య విధానంలో వైద్యనీతి ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ చట్టాల పరిధిలో నియంత్రిస్తారు.

* వైద్య వృత్తిలో సహాయం చేయడం ప్రధాన అంశం. డబ్బు సంపాదన తర్వాత అంశం.

* మన దేశ ప్రజలు దయగలవారు. ఉదార స్వభావులు. ఎలాంటి గడ్డు పరిస్థితుల్లోనైనా వైద్యులను కాపాడుకుంటారు. కాబట్టి వైద్యులు నీతి నియమాలు పాటించాలి.


source : ప్రజాశక్తి :రక్ష డెస్క్ /డాక్టర్‌ ఆరవీటి రామయోగయ్య-ఆర్గనైజేషన్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ సోషల్‌ డైమెన్షన్స్‌ ఆఫ్‌ హెల్త్‌ .
 • ========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

ఎనర్జి డ్రింక్స్‌ శక్తి ఎంత,Energy of Energy drinksఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఎనర్జి డ్రింక్స్‌ శక్తి ఎంత(Energy of Energy drinks)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఎనర్జి డ్రింక్స్‌. ఈ పేరు వినగానే స్టామినా పేరిట, ఎనర్జీ పేరిట క్రీడాకారుల దగ్గర్నుండి సామాన్య యువతీ యువకుల దాకా క్రేజ్‌తో తాగుతున్న ఆకర్షణీయమైన రంగురంగుల లేబుల్స్‌ ఉన్న బాటిల్స్‌ గుర్తుకొస్తున్నాయి . ఈ ఎనర్జి డ్రింక్స్‌ నిజంగా మనకి శక్తినియాస్తాయా లేక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయా తెలీకుండానే చాలా మంది తాగేస్తున్నారు. మరి అలాంటి ఎనర్జి డ్రింక్స్‌ ఆరోగ్యంపై నిజంగా ఎలాంటి ప్రభావం చూపుతాయో కొన్ని వాస్తవాలు పరిశీలిద్దాం.

మన దేశంలో ప్రస్తుతం ప్రతి గల్లీలో, సిగరెట్‌ షాపుల్లో, డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌లో, పబ్స్‌లో, జిమ్స్‌లో క్రీడా ప్రాంగణాల్లో లభిస్తూ బహుళ ప్రాచుర్యం పొందిన ఈ ఎనర్జీ డ్రింక్స్‌ యువతీ యువకుల్లో ఉత్సాహాన్ని నింపి, స్టామినా పెంచి కొత్త ఎనర్జిని అందించి మరింత డైనమిక్‌గా క్రీడలు వంటి పలు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునేందుకు ఉపయోపడతాయని వీటి గురించి చెబుతుంటారు. క్రీడాకారులే కాకుండా త్వరగా నిద్రపోకుండా ఎక్కువసేపు పనిచేయాలనుకునే పలు వృత్తుల్లోని యువతీయువకులు, నైట్‌ స్టడీ చేసే విద్యార్థులు కూడా ఈ డ్రింక్స్‌పట్ల విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. మన దేశంలో 250మిల్లీ లీటర్ల ఎనర్జి డ్రింక్‌ ఖరీదు సుమారుగా 75 రూపాయలు.

ఇందులో ఏముంటాయి?

బి-కాంప్లెక్స్‌ మిటమిన్స్‌, కెఫీన్‌, అమినో ఆమ్లాలు (టారిన్‌ వంటివి), కార్నిటిన్‌, ఇనోసిటాల్‌, గ్లూకురొనోలాక్టోన్‌, హెర్బల్‌ సప్లిమెంట్స్‌, గ్లూకోజ్‌ మొదలైనవి ఈ ఎనర్జి డ్రింక్స్‌లో ఉంటాయి. కొన్ని డ్రింక్స్‌లో జిన్సెంగ్‌ లాంటి ఉత్తేజకర పదార్థాలు కూడా ఉంటున్నాయి.

ఎన్ని రకాలు

1990 దశకంలో కొకొకోలా 'షాక్‌' పేరుతో ఎనర్జి డ్రింక్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు 'బర్న్‌' అనే పేరుతో మరో డ్రింక్‌ను ప్రవేశపెట్టింది. రెడ్‌ బుల్‌, క్లౌడ్‌నైన్‌, మాన్‌ స్టర్‌, రాక్‌ స్టార్‌, నో ఫియర్‌, టాబ్‌ ఎనర్జి, వైర్‌డ్‌, ఫిక్స్‌, సోబె, ఎక్స్‌ఎల్‌ వంటి పాపులర్‌ బ్రాండ్‌లు మన దేశంలో చలామణిలో ఉన్నాయి.

అధ్యయనాలు ఏం చెబుతున్నాయి ?

ఆగస్ట్‌ 2008లో ఆస్ట్రేలియాలోని రాయల్‌ అడిలైడ్‌ హాస్పిటల్‌లోని కార్డియోవాస్క్యులర్‌ రిసెర్చ్‌ సెంటర్‌ జరిపిన అధ్యయనంలో ఎనర్జి డ్రింక్స్‌లో ఉంటున్న అధిక మోతాదు కెఫిన్‌ వల్ల గుండెపోటు, స్ట్రోక్‌ (పక్షవాతం) వంటి ప్రమాదాలు సంభవిస్తాయి. ఇవేకాక రక్తంలో చిక్కదనం పెరిగి పర్యవసాన పరిణామాలకు దారితీయగలదని వెల్లడైంది. జాన్‌హాప్‌కిన్స్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన 100 మంది శాస్త్రవేత్తలు, ఫిజిషియన్ల బృందం కూడా ఈ ఎనర్జి డ్రింక్స్‌లో ఉండే రసాయనాల వాడకంపై మరింత కఠినమైన, నిర్దిష్ట నియమాలు విధించి అమలుచేయాలని అమెరికన్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌కు సూచించింది.

మన దేశంలో ఇటీవల మే, జూన్‌ నెలల్లో ఢిల్లీలో సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సిఎస్‌ఇ) అనే సంస్థ నిర్వహించి కొద్దిరోజుల క్రితమే వెలువరించిన శాస్త్రీయ అధ్యయనాల ఫలితాల ప్రకారం 44 శాతం శాంపిల్స్‌లో కెఫీన్‌ 145 పిపిఎంలకంటే ఎక్కువగా అనారోగ్యానికి దారితీయగల మోతాదులో ఉన్నట్టు వెల్లడైంది. 38 శాతం శాంపిల్స్‌లో లేబుల్స్‌పై పేర్కొన్న శాతం కంటే ఎక్కువ శాతం కెఫీన్‌ సదరు డ్రింక్స్‌లో ఉన్నట్లు తెలిసింది. 25శాతం శాంపిల్స్‌లో లేబుల్స్‌పై కెఫీన్‌ మోతాదు గురించి ఎటువంటి కనీస సమాచారం ఇవ్వడం లేదు. ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్స్‌ అథారిటి ఆఫ్‌ ఇండియా రూపొందించిన నియామవళి లోపభూయిష్టంగా ఉన్నందునే ఇటువంటి అవకతవకలకు ఎనర్జి డ్రింక్స్‌ తయారీదారులైన కంపెనీలు పాల్పడగల్గుతున్నాయి.

ఆరోగ్యంపై ప్రభావాలు ఏమిటి?

కెఫీన్‌ అనేది కేంద్ర నాడీవ్యవస్థని ఉత్తేజపరచడం ద్వారా పనిచేసే రసాయనం. నిద్రమత్తుని వదిలించుకోవడానికి సాధారణంగా తాగే కాఫీలో ఉండే ప్రధాన రసాయనం ఇదే. కానీ ఇది నిర్దిష్ట పరిమాణాన్ని మించి ఇటువంటి ఎనర్జి డ్రింక్స్‌లో తీసుకున్నప్పుడు ఆరోగ్యంపై దుష్ఫలితాలను చూపుతుంది. నిద్రలేమి, అధిక రక్తపోటు, గుండె రిథమ్‌లో అసాధారణ మార్పులు, హార్ట్‌అటాక్‌, స్ట్రోక్‌ (పక్షవాతం), ఫిట్స్‌, హైపోకెలీమియా (రక్తంలో పొటాషియం తక్కువ అవడం వల్ల కలిగే పరిణామాలు), రాబ్డోమయోలైసిస్‌ (ఒక రకమైన కండరాల బలహీతన), మూత్రం ఎక్కువగా పోవడం వల్ల డీహైడ్రేషన్‌ వంటి దుష్ఫలితాలు కలుగుతాయని అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేకాక నాడీవ్యవస్థను ఉత్తేజపరిచే గుణం కలిగిన కెఫీన్‌ వాడడం వల్ల క్రమంగా అలవాటు మారి వ్యసనానికి దారితీస్తుంది.

ఎనర్జి డ్రింక్స్‌ -స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ ఒకటేనా?

ఎనర్జి డ్రింక్స్‌ని స్పోర్ట్స్‌ డ్రింక్స్‌గా భ్రమపడి సేవిస్తున్న వ్యక్తులు అధికంగా ఉంటున్నారు. స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ వాస్తవానికి తగిన పాళల్లో గ్లూకోజ్‌, ఎలక్ట్రోలైట్స్‌ కలుపబడి డస్సిపోయిన శరీరానికి శక్తిని, నీటినందించి రీహైడ్రేషన్‌కు ఉపయోగపడతాయి. కానీ ఎనర్జి డ్రింక్స్‌ని కూడా స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ అనే భ్రమలో యువత నేడు విచ్చల విడిగా వాడడం వల్ల అర్థికంగానే గాక, ఆరోగ్యపరంగా కూడా నష్టానికి గురవతున్నారు.

మనం ఏం చేయాలి?

ఆరోగ్యానికి హానిచేసే ఈ రకమైన ఎనర్జి డ్రింక్‌లలో ఉండాల్సిన రసాయన పదార్థాల సురక్షిత మోతాదులపై నిర్దిష్టమైన సూచనలతో నియంత్రణా విధానాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని ఫుడ్‌ సేఫ్టి అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా వెంటనే అమలు చేయాలి.

ప్రజల్లో ముఖ్యంగా స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ పేరిట మభ్యపెట్టి ప్రచార పటోపంతో మార్కెట్‌ అవుతున్న ఈ హానికరమైన ఎనర్జి డ్రింక్స్‌ గురించి ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు, ప్రజారోగ్య పక్షపాతులందరూ విస్తృతంగా ప్రచారం చేయాలి. ఖరీదైన, హానికరమైన ఎనర్జి డ్రింక్స్‌ స్థానే తక్కువ ఖర్చుతో, స్థానికంగా లభించే తాజా, సహజ పానీయాల్ని సేవించడం పట్ల యువతీయువకుల్లో అవగాహన పెంపొందించాలి.

 • మూలము : ప్రజాశక్తి న్యూస్ పేపర్ / డాక్టర్‌ కె.శివబాబు, రాష్ట్రకమిటీ సభ్యులు--జనవిజ్ఞాన వేదిక, జహీరాబాద్‌, మెదక్‌ జిల్లా.
 • ========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

శ్రావ్యమైన స్వరం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు , care to preserve good voiceఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -శ్రావ్యమైన స్వరం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు (care to preserve good voice)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...మనిషికి జంతువుకున్న తేడా మాట్లాడటమే. తల్లిగర్భం నుంచి బయటపడిన శిశువు ఏడుపుతో మాట్లాడతాడు. తర్వాత ఒక్కో అక్షరం, పదాలు నేర్చుకుంటాడు. ఎదుటివారు చెప్పేదానికి స్పందించి సమాధానమిస్తారు. దీనికంతటికి కారణం గొంతులో ఉండే స్వరపేటిక. దీన్ని జాగ్రత్తగా ఉపయోగిస్తే శ్రావ్యమైన గొంతు మన సొంతమవుతుంది. స్వరపేటికకు వచ్చే వ్యాధులు, చికిత్స, జాగ్రత్తల గురించి .

ఎదుటివారి చెప్పిన మాటను విన్న తర్వాత శబ్దతరంగాలు చెవి ద్వారా మెదడుకు చేరతాయి. వీటిని మెదడు విశ్లేషిస్తుంది. మనం ఏం చెప్పాలనుకున్న దాన్ని మెదడు సందేశం ద్వారా స్వరపేటికకు పంపిస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా మనం మాట్లాడుతున్నాం. మనం మాట్లాడాలంటే కీలకమైంది స్వరపేటిక (లారింగ్స్‌). స్వరపేటికలో కంపించే (వైబ్రేటింగ్‌) నిర్మాణం ఉంటుంది. వీటిని వొకల్‌కార్డ్స్‌ అంటారు. వొకల్‌కార్డ్స్‌కు సంబంధించిన కండరాలు, వీటిని నియంత్రించే నరాలుంటాయి. ఇదంతా మెదడు నియంత్రణలో ఉంటుంది. మాట్లాడటానికి మెదడు ఆదేశం ఇచ్చే క్రమంలో మనం శ్వాసలోపలికి పీల్చుకుని గాలిని బయటికి వదిలినప్పుడు వొకల్‌కార్డ్స్‌ కంపిస్తాయి (వైబ్రేట్‌). దీని వల్ల బేసిక్‌ వాయిస్‌ 'ఆ...' పుడుతుంది. ఈ శబ్దం నోట్లో నుంచి వచ్చినప్పుడు నాలుక, నాలుక చుట్టున్న కండరాలు దీనికి శబ్దరూపాన్నిస్తాయి. శబ్దానికి గాలిగదుల్లాంటి సైనస్‌లు, దాని నిర్మాణం ఒక టోన్‌ని ఇస్తాయి. కొంత మంది పాడితే శ్రావ్యంగా ఉంటుంది. వీరికి పుట్టుకతో ఏర్పడిన సైనస్‌లే కారణం. అందుకే కొంత మంది గాయకులకు మధురమైన గొంతు ఉంటుంది. పుట్టుకతోనే మంచి టోన్‌ ఉంటుంది. గాయకులు లతామంగేష్కర్‌, బాలసుబ్రమణ్యం ఈ కోవకు చెందినవారే.

ఎలా బయటపడతాయి ?

గొంతు తొందరగా అలసిపోవడం మొదటి లక్షణం. అంటే ఎక్కువసేపు మాట్లాడలేకపోవడం. స్వరం తారాస్థాయికి వెళ్లినప్పుడు, బిగ్గరగా మాట్లాడినప్పుడు స్వరం విడిపోతుంది. రెండుగా వినిపిస్తుంది. అప్పుడు స్వరాన్ని నియంత్రించుకోవాలి. మృదురూపంలోకి తెచ్చుకోవాలి.

మసాల పదార్థాలు, కారం ఎక్కువున్న పదార్థాలు తినేవారిలో, సమయానికి ఆహారం తీసుకోని వారిలో ఎసిడిటి పెరుగుతుంది. దీని వల్ల 'లారింగో ఇసోఫేగల్‌ రిఫ్లక్స్‌' వస్తుంది. కడుపులోని ఆమ్లాలు పైకి వచ్చి స్వరపేటికకు వ్యాపించడం వల్ల కూడా స్వరం మారే అవకాశముంది. ఈ సమస్య తగ్గడానికి ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. గొంతుబొంగురపోయినప్పుడు ఇన్‌ఎన్‌టి డాక్టర్‌ను కలవాలి. ల్యారింగోస్కొప్‌/ఎండొస్కోప్‌/ఫ్లెక్సిబుల్‌ ల్యారింగొస్కోప్‌ ద్వారా పరీక్షిస్తారు. వీటి వల్ల స్వరపేటికలో కలిగే మార్పులను గుర్తిస్తారు. దీనికి ఎలాంటి చికిత్స చేయాలో వైద్యులు నిర్ణయిస్తారు. ఈ సమస్యలన్నీ మనం తొలిదశలోనే గుర్తించే వీలుంది. అంటే గొంతు మారడాన్ని గొంతుబొంగరు పోవడాన్ని చాలా సులభంగా గుర్తించొచ్చు. నిర్లక్ష్యం చేయకుండా ఇఎన్‌టి వైద్యున్ని సంప్రదించాలి. కొన్ని జబ్బులు ముదరకుండా చికిత్స చేసేవీలుంది. కొన్ని క్యాన్సర్లను తొలిదశలోనే నయం చేసుకోవచ్చు.

ఐదు రకాల సమస్యలు

సాధారణంగా స్వరపేటికకు సంబంధించి వచ్చే సమస్యలు...వొకల్‌కార్డ్‌ ఎపిథీలియంపై నీటిపొర ఉంటుంది. ఇది ఎండిపోవడం వల్ల స్వరానికి సంబంధించిన సమస్యలు వస్తాయి.

వొకల్‌ నాడ్యుల్స్‌ : రోజులో ఎక్కువ సమయం మాట్లాడేవారిలో, అకస్మాత్తుగా స్వరాన్ని పెంచేవారి (రాక్‌ సింగర్స్‌ వాయిస్‌)లో ఈ సమస్య వస్తుంది. వొకల్‌కార్డ్‌లో మూడు భాగాలుంటాయి. మొదటి, చివరి భాగాల మధ్య ఉన్న భాగంలోని పొర చిన్న చిన్నగా చిట్లడం మొదలువుతుంది. తొలిదశలో చిట్లి తర్వాత మానుతుంది. కానీ ఇలా చిట్లడం మళ్లీ మళ్లీ జరిగినప్పుడు చిట్లిన చోట కండ తయారవుతుంది. దీంతో తరంగ ధైర్ఘ్యం (వేవ్‌లెంత్‌) మారుతుంది. నెమ్మదిగా కండలోకి రక్తప్రసరణ పెరుగుతుంది. తొలిదశలో దీన్ని మైక్రోస్కోప్‌ ద్వారా గుర్తించి పరీక్షించాలి. వాయిస్‌ స్పీచ్‌ మాడ్యులేషన్‌తో చికిత్స చేయొచ్చు. ఈ దశలో కూడా నియంత్రించకుండా నిర్లక్ష్యం చేస్తే వోకల్‌ నాడ్యుల్స్‌ పరిమాణం పెరిగి శస్త్రచికిత్స వరకు వెళ్లే అవకాశముంది. ఒక నాడ్యుల్‌కు ఒకసారి మాత్రమే ఆపరేషన్‌ చేస్తారు. ఇది మానిన తర్వాతే ఇంకో నాడ్యుల్‌కు ఆపరేషన్‌ చేస్తారు.

వొకల్‌ పాలిప్స్‌ : స్వరపేటికలోని పొరలో నీరు చేరి ఉబ్బుతాయి. దీన్ని పాలిప్స్‌ అంటాం. ఉబ్బిన తర్వాత చిన్న కణతిలాగా మారుతుంది. ఇది క్రమంగా పెరుగుతుంది. దీన్ని మందులతో నయం చేయలేం. మైక్రోలారింగ్‌ సర్జరీ, లేజర్‌ సర్జరీ ద్వారా చికిత్స చేసి తొలగిస్తారు.

వొకల్‌కార్డ్‌ ఎడిమ: వొకల్‌కార్డ్‌ కింద ఉన్న పొరపై నీరుచేరి వాపు వస్తుంది. దీంతో స్వరంలో తేడా కనిపిస్తుంది. దీన్ని మైక్రోలారింగ్‌ సర్జరీ, లేజర్‌ సర్జరీ, మైక్రోఫ్లాప్‌ టెక్నిక్‌ సర్జరీతో చికిత్స చేస్తారు.

స్వరపేటిక క్యాన్సర్‌ : ధూమపానం, మద్యపానం వల్ల స్వరపేటిక క్యాన్సర్‌ వస్తుంది. తొలిదశలో గొంతుబొంగురుపోతుంది. దీన్ని గుర్తించి క్యాన్సరా? కాదా? అనేది నిర్ధారించాలి. మొదటి దశలోనే దీన్ని గుర్తించి రేడియేషన్‌ ద్వారా చికిత్స చేస్తే 99 నుంచి 100 శాతం వరకు క్యాన్సర్‌ నయమవుతుంది.

వొకల్‌కార్డ్‌ పెరాలసిస్‌ : స్వరపేటికలో కదలిక ఉండదు. స్తబ్దుగా ఉంటుంది. ఒక్కోసారి రాత్రి పడుకుని ఉదయం లేచేసరికి గొంతు బొంగురుపోతుంది. ఏమైందని పరీక్షిస్తే స్వరపేటికి పనిచేయడం లేదని అర్థమవుతుంది. ఇన్‌ఫెక్షన్‌ వల్ల కూడా ఇది రావొచ్చు. ఈ సమస్య వచ్చినప్పుడు చికిత్స చేయడానికి ముందు 6 నుంచి 18 నెలలు ఆగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో స్వరపేటిక తనంతట తాను సవరించుకుని, స్వరం మామూలు స్థాయికి చేరుకుంటుంది. అప్పటికీ ఇంకా సమస్య ఉంటే 'టైప్‌-1 థైరోప్లాస్టీ' అనే ఆపరేషన్‌ ద్వారా చికిత్స చేస్తారు. వొకల్‌కార్డ్‌ పెరాలసిస్‌ ఎడమవైపు ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఛాతిలో ఏర్పడిన గడ్డ వొకల్‌కార్డ్‌కు వెళ్లే నరాన్ని వత్తుతుంది. అందుకే పెరాలసిస్‌ వచ్చినప్పుడు ఛాతి ఎక్స్‌రే తీసి, గడ్డలున్నాయో చూస్తారు. కొన్నిసార్లు మెదడు, మెడ భాగం సిటి స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. గుండె వాచి నరం ఒత్తిడికి గురైనప్పుడు కూడా పెరాలసిస్‌ వచ్చే అవకాశముంది. దీన్ని హార్ట్‌నెస్‌ సిండ్రోం అంటాం. థైరాయిడ్‌ సర్జరీ, గుండె శస్త్రచికిత్స తర్వాత నరానికి గాయమై సమస్య కలగొచ్చు.

స్వర సంరక్షణ

కొంతకాలం వరకు కేవలం గాయకులు మాత్రమే స్వరాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు టీవీలు, ఎఫ్‌ఎం రేడియో కార్యక్రమాల వల్ల యాంకర్ల పాత్ర పెరిగింది. అనర్గలంగా మాట్లాడాల్సి వస్తోంది. మంచి స్వరంతో ఆకట్టుకునే విధంగా హవభావాలతో మాట్లాడాలి. ఇలాంటి వారిని 'ప్రొఫెషనల్స్‌ వాయిస్‌ యుజర్స్‌' అని పిలుస్తున్నారు. ఈ క్రమంలో తమ స్వరాన్ని ఎలా సంరక్షించుకోవాలనే సందేహం వీరిలో కలుగుతుంది. స్వరం సంరక్షణలో వాయిస్‌ హైజీన్‌ కీలకపాత్ర పోషిస్తుంది.

ప్రతి ఒక్కరూ తమ స్వరం 'పిచ్‌ రేంజ్‌'ను తెలుసుకోవాలి. దీన్ని డైనమిక్‌ రేంజ్‌ అంటాం. ఇది తెలుసుకున్న తర్వాత ఈ రేంజ్‌కు మించి పాడటం, మాట్లాడడం చేయకూడదు. తమకు లేని స్వరాన్ని అంటే ఇతరుల స్వరాన్ని అనుకరిస్తూ ఎక్కువసేపు మట్లాడడం, అదనపు ఒత్తిడిని ఉపయోగించి మాట్లాడడం వల్ల సమస్యలు వస్తాయి. ప్రాక్టీస్‌ వల్ల అనుకరణ చేయొచ్చు. అదికూడా ఎక్కువ సమయం చేయకూడదు.

ఈ మధ్య టీవీల్లో రియాల్టీ షోలు పెరుగుతున్నాయి. ఇందులో పాటల కార్యక్రమాల్లో పిల్లలతో పాడిస్తున్నారు. పాడించడానికి ముందు వీరితో గంటల కొద్దీ రీహాల్స్‌ చేయించడం వల్ల స్వరపేటికపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది. నాలుగైదు ఎపిసోడ్స్‌ ఐదారు రోజుల్లో రికార్డు చేస్తారు. దీనికి ముందు 3,4 రోజులు 10 నుంచి 12 గంటలు పిల్లలతో పాటలు పాడడం ప్రాక్టీసు చేస్తారు. ఇలా చేయడానికి పిల్లల శరీరం, స్వరం పరివర్తన చెందిఉండదు. పాట సందర్భాన్ని బట్టి వారికి లేని స్వరంతో పాడటానికి ప్రయత్నం చేస్తుంటారు.

ఫలితంగా మానిసిక సంఘర్షణకు గురవుతుంటారు. పాట పాడేసమయంలో లయకు అనుగుణంగా శ్వాసతీసుకోవాల్సి ఉంటుంది. వందలో ఒకరిద్దరికే ఈ సామర్థ్యం ఉండే అవకాశముంది. కానీ కొంత మంది పిల్లల్లో ఊపిరితిత్తులకు ఆ సామర్థ్యం ఉండదు. ఈ సమస్యను గుర్తించి పిల్లలతో ప్రాక్టీస్‌ చేసేటప్పుడు ఎక్కువ విరామాలు తీసుకునేలా జాగ్రత్తపడాలి. పిల్లల పిచ్‌రేంజ్‌కు అనుగుణంగా వారికి తగ్గ పాటను ఎంపికచేయాలి. దీని వల్ల అనవసరంగా కలిగే ఒత్తిడినుంచి ఉపశమనం పొందొచ్చు.

శ్రావ్యమైన స్వరానికి నీళ్లు ఎక్కువ తాగాలి. మసాల, కారం ఎక్కువ ఉండే పదార్థాలు మానాలి. పోషకాలుండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. సమాయానికి ఆహారం తీసుకోవడం వల్ల ల్యారింగో ఈసొఫెగల్‌ రిఫ్లక్స్‌ సమస్య రాకుండా జాగ్రత్తపడొచ్చు. ధూమపానం, మద్యపానం మానాలి.

ఎక్కువ సమయం తరగతుల్లో పాఠాలు చెప్పేవారు ప్రతి 10 నిమిషాలకు కొద్దిపేపు విరామం తీసుకోవాలి. కాల్‌సెంటర్లో పనిచేసేవారు రిలాక్స్‌ అవుతుండాలి. ప్రాణాయామం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగే అవకాశముంది.

పిచ్‌ రేంజ్‌ తెలుసుకోవడం ఎలా ?

పిచ్‌ రేంజ్‌ తెలుసుకుని పాటలు పాడడం, ప్రసంగించడం వల్ల స్వరానికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నం కావు. దీన్ని తెలుసుకోవడానికి 'వాయిస్‌ సాఫ్ట్‌వేర్‌' ఉపయోగపడుతుంది. పిచ్‌ రేంజ్‌ కనుక్కోవడే కాక నిమిషానికి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఎంతసేపు పిచ్‌మేయిన్‌టేన్‌ అవుతుందో తెలుసుకోవచ్చు. స్ట్రొమోట్రొఫి అనే పరికరం ద్వారా తెల్లటి కాంతిని వేగంగా స్వరపేటికలోకి పంపించి, 'ఆ' అనే శబాన్ని పలికిస్తారు. అప్పుడు శబ్దానికి సంబంధించిన తరంగధైర్ఘ్యం (వేవ్‌లెంత్‌) తెలుస్తుంది. ఎక్కడ సమస్య ఉందో, స్వరానికి సంబంధించిన సమస్యలను తొలిదశలోనే గుర్తించేవీలుంది.

అటు-ఇటు

మగవాళ్లు ఆడపిల్లల గొంతుతో, ఆడవాళ్లు మగవారి గొంతుతో మాట్లాడడం మనం చూస్తుంటాం. ఇవి రెండుకాక ఒక్కోసారి కీచు గొంతుతో మాట్లాడతారు. దీన్ని 'వాయిస్‌ మ్యుటేషన్లు' అంటాం. అబ్బాయిలు, అమ్మాయిల్లో 10 నుంచి 11 ఏళ్ల వరకు ఒకే రకం గొంతు ఉంటుంది. తర్వాత హార్మోనుల ప్రభావం వల్ల అమ్మాయిల గొంతు శ్రావ్యంగా మారుతుంది. అబ్బాయిల గొంతు మగవారిలా మారుతుంది. 16 ఏళ్లయినా కూడా ఈ గొంతు మారకుంటే దీన్ని ప్యుమోఫోనియా అంటారు. ఈ సమస్య ఉన్నవారికి థైరొప్లాస్టీ సర్జరీ ద్వారా స్వరపేటికను సరిచేస్తారు.

-------------------------------------------------------------------------
source : prajasakti news paper>Raksha desk byడా|| కెవిఎస్‌ఎస్‌ఆర్‌కె శాస్త్రి,--కన్సల్టెంట్‌ ఇఎన్‌టి సర్జన్‌--యశోద హాస్పిటల్‌ సోమాజిగూడ, హైదరాబాద్‌.
 • =============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, July 24, 2011

Hair Dyeing , జుట్టు కు రంగు వేయడం
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Hair Dyeing , జుట్టు కు రంగు వేయడం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

అందమైన కురుల కోసం ఆరాటపడని అతివ ఉండదంటే అతిశయోక్తి కాదు. నల్లని నిగనిగలాడే పొడవాటి కురులతో మరింత సొగసును సంతరించుకోవాలని ప్రతి యువతి ఆశపడుతుంటుంది. అయితే, పిరుదులు దాటి చకచకలాడే అందమైన జడ ఇప్పుడు ఎక్కడో కాని కనిపించడం లేదు. అన్ని బాబ్డ్‌ హెయిర్‌ స్టైల్సే! సరే, ఆధునిక సమాజంలో అటువంటి జడలను యువతులు ఇష్టపడకపోయినా, కనీసం పట్టువలె మెత్తగా ఉండాలని కోరుకుంటారు. కాని, రెండు పదుల వయసు వచ్చేసరికే కొందరి కురులు తెల్లబడిపోతున్నాయి. దీంతో రకరకాల పద్ధతుల ద్వారా వెంట్రుకలను రకరకాల రంగుల్లోకి మార్చేసుకుని తృప్తి పడుతున్నారు. మొట్టమొదటి తెల్ల వెంట్రుక కంటపడగానే విలవిలలాడిపోతారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తమ కురులను కాపాడుకోవాలని పరి తపిస్తుంటారు. ఎంత వ్యయం కైనా వెనుకాడకుండా వాటిని నల్లబరిచేందుకు ప్రయత్నిస్తారు. వయసు పెరిగే కొద్దీ తెల్ల వెంట్రుకల బారి నంచి తప్పించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. అయితే, జీవితాంతం తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండే 'డై' ఏదైనా ఉంటే బాగుండునని ఆశపడుతుంటారు. కాని, సైన్స్‌ ఫిక్షన్‌లో మాత్రమే అది సాధ్యమనుకుంటారు. ఒకవేళ అదే నిజమైతే?!

అవును! ఇప్పుడు జీవితాంతం తెల్ల వెంట్రుకల బాధ లేకుండా చూసేందుకు శాస్త్రజ్ఞులు తమ పరిశోధనల ద్వారా కృషి చేస్తున్నారు. మరో పదేళ్లలో అది సుపాధ్యం చేస్తామంటున్నారు. అప్పుడిక అతివలకు హెన్నా, 'డై'ల బాధ తప్పిపోతుందని ఘంటాపథంగా చెబుతున్నారు. ఐరోపా దేశాల్లో అతివలకు సాధారణంగా 34 సంవత్సరాల వయసులో మొట్టమొదటి తెల్ల వెంట్రుక వస్తోంది. అలాగే, ఆసియాలో ఆసియాలో 39 ఏళ్లకు, ఆఫ్రికాలో 44 ఏళ్లకు తెల్లవెంట్రుకలు రావడం మొదలవుతోంది. వెంట్రుకలు కూడా ఒక పీచు పదార్ధం వంటిదే. భౌతిక పదార్ధాలతోనే ఇవి నిర్మాణమై ఉంటాయి. వీటికి జీవం ఉంటుంది. వయసును బట్టే పెరుగుతాయి. కొన్నాళ్లకు తెల్లబడతాయి. ఆ తర్వాత రాలిపోతాయి. దీన్ని ఎలా ఎదుర్కొనాలి? భౌతికంగానా? లేక జీవరసాయనాలతోనా? ఇదే టాపిక్‌పై పారిస్‌లో కొన్నేళ్లుగా శాస్త్రజ్ఞులు పరిశోధనలు సాగిస్తున్నారు. 'లారియల్స్‌' అనే పరిశోధనా సంస్థ గత ఏడాది 581 మిలియన్‌ పౌండ్లను ఖర్చు పెట్టింది.

చర్మం వలెనే వెంట్రుకలు కూడా మెలనొసైట్స్‌ అనే కణాలను కలిగి ఉంటాయి. ఇవే వెంట్రుకల రంగును నిర్ణయిస్తాయి. వయసు పెరిగే కొద్దీ ఈ కణాలు వెంట్రుకల్లో తగ్గిపోతాయి. అందువల్లే తెల్లరంగుకు వచ్చేస్తాయి. అయితే, వెంట్రుకల్లో ఏ కొద్ది మొత్తంలో మెలనొసైట్స్‌ మిగిలి ఉన్నా తిరిగి వాటిని వృద్ధి చెందించడం ద్వారా మళ్లిd వెంట్రుకలు నల్లబారేట్టు చేయవచ్చునని లారియల్స్‌ సంస్థ పరిశోధనా సంబంధాల సంచాలకులు పాట్రీసియా పినే చెబుతున్నారు. నోటి ద్వారా తీసుకునే మందుతో పాటు హెయిర్‌ కేర్‌కు సంబంధించిన పలు ఉత్పత్తులను త్వరలోనే విడుదల చేస్తామని అంటున్నారు.

నడి వయసు దాటిన తర్వాత ఇక వెంట్రుకలకు రంగు ఎందుకులే అని అతివలు హెయిర్‌ కేర్‌లను వాడడం మానేస్తే కోట్లాది రూపాయిల వ్యాపార సామ్రాజ్యాలు ఏం కావాలి? అందుకే లారియల్స్‌ భారీ వ్యయంతో దీనిపై పరిశోధనలు చేస్తోంది. అలాగే, పదేపదే హెయిర్‌ డైయింగ్‌ వల్ల కురులు దెబ్బతింటున్నాయి. దీన్ని అరికట్టేందుకు మరో పరిశోధనలో లారియల్స్‌ విజయం సాధించింది. అమ్మోనియా కలిసిన డైల వల్ల కురులు దెబ్బ తినడమే కాకుండా పెళుసుగా తయారవుతాయి. అలాగే, ఘాటైన వాసన కూడా ఇబ్బంది కలిగిస్తుంటుంది. 'డై' పనిచేసేముందు వెంట్రుకల సహజ రంగును అమ్మోనియా తొలగిస్తుంది. ఇది అద్భుతంగా పనిచేస్తున్నప్పటికీ, వెంట్రుకల సహజత్వన్ని దెబ్బతీస్తోంది. దీన్ని నివారించేందుకు లారియల్‌ అమ్మోనియా లేని హెయిర్‌ డైని కనిపెట్టింది. దీనికి ఐఎన్‌ఒఎ (ఇన్నోవేషన్‌ నో అమ్మోనియా' అని పేరు పెట్టింది. దీన్ని వినియోగించడం వల్ల వెంట్రుకలు సహజత్వాన్ని కోల్పోవని, పైగా మరింత పటుత్వాన్ని పెంచుకుంటాయని సంస్థ చెబుతోంది. ఈ తాజా డైని ఇటీవలే మార్కెట్‌కు విడుదల చేసింది కూడా. అమ్మోనియా కలిసిన డైల వల్ల కొంత కాలానికి చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. తాజాగా కనిపెట్టిన డై వల్ల అటువంటి ప్రమాదం ఉండదు. హాలీవుడ్‌లో సెలబ్రిటీలు అందరూ ఇప్పుడీ తాజా డైని విరివిగా చేయించుకుంటున్నారు. బ్రిటన్‌లోని బ్యూటీపార్లర్లు కిటకిటలాడుతున్నాయి.

- గుళ్లపల్లి మాధవి
Hair dye side effects :

రంగులను వాడటం వల్ల అప్పటికి చూడటానికి అందంగా వున్నా తరువాత జుట్టుకు భవిష్యత్తు లేకుండా పోతుంది. హెయిర్‌డైలో కొన్ని హానికారకాలైన రసాయనాలను వాడుతుంటారు. వీటివలన ఆరోగ్యానికి కీడే తప్ప మేలు అంటూ ఏదీ లేదు. పర్మనెంట్ హెయిర్ కలర్ లేదా డై‌లలో పైరాఫినిలేటిడ్ పిపిడి అనబడే రసాయనాన్ని వీటిలో కలుపుతుంటారు. ఈ పిపిడి వలన వెంట్రుకలపై రంగు చాలా రోజులవరకు ఉంటుందనేది వాస్తవం. కాని మీ వెంట్రుకల పరిస్థితిని కూడా దృష్టిలో వుంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతే కాకుండా వీటివలన చర్మంపై ప్రభావం పడుతుంది .
పిపిడికి సంబంధించిన వ్యాధులబారిన పడక తప్పడంలేదు. వెంట్రుకలు రాలిపోవడం, కళ్ళు, చెవులు, తలపైనున్న చర్మం, ముఖంపైనున్న చర్మంపై దీని ప్రభావం వుంటుంది . కొన్నిసందర్భాలలో పిపిడి రియాక్షన్‌కు కూడా దారితీస్తుంది. దీంతో రియాక్షన్ బారిన పడినవారిని ఆసుపత్రిలో చేర్పించిన సందర్భాలుకూడావున్నాయి.

ఓవైపు హైయిర్ కలర్, హెయిర్ డై తయారు చేసే కంపెనీలు హెచ్చరికల ప్రకటన వారిచ్చే ప్రిస్క్రిప్షన్‌లో పొందుపరిచేవుంటారు. కాని చాలవరకు దీనిని వాడేవారు పెద్దగా పట్టించుకోరు. అలాగే టాటూ లేక కాలీ మెహిందీలో పిపిడి కలిసివుంటుంది. ఇది చాలా హానికారకమైంది.

Visit my website - > Dr.Seshagirirao.com/

నిద్రలేమి నుండి బయటపడడానికి కొన్ని చిట్కాలు, Tips to avoid Insomnia


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -నిద్రలేమి (Sleeplessness(Insomnia)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

ఏ కారణము చేతనైనా నిద్ర పట్టకపోవడం , సరిగా నిద్రపట్టకపోవడం ను నిద్రలేమి అంటాము . దీనివలన ఆరోగ్యము చెడిపోతుంది .
నిర్వచనము : నిద్ర రావడం లేదని చెప్పే వారిలో కనిపించే ప్రధాన సమస్య నిద్రలేమి (ఇన్‌సోమ్నియా). దాదాపు 15 నుంచి 30 శాతం మందిలో ఈ సమస్య ఉంటుంది. 'వారానికి కనీసం మూడు రోజులు, కనీసం ఒక నెలపాటు నిద్రపట్టడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, మధ్యలో మెలకువ రావడం, రోజూ నిద్రలేవడానికంటే ముందుగా మెలకువరావడం' జరిగితే వాళ్లు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు. పడుకున్న తర్వాత 20 నిమిషాల్లో నిద్రపోవడం సాధారణం. కానీ 30 నిమిషాలు గడిచినా నిద్ర రాకుంటే సమస్య ఉన్నట్లు గమనించాలి.
కారణాలు :

* దైనందిన జీవితం లో పని వత్తిడి ,
* మానషిక వత్తిడి ,
* టీవీ చూడడం ,
* కంప్యుటర్ పై పనిచేయడం ,
* కుటుంబ సమస్యలు ,
* ఆర్ధిక సమస్యలు ,
* ఆహార నియమాలు ,
* చెడ్డ అలవాట్లు ,


నిద్రలేమి నుండి బయటపడడానికి కొన్ని చిట్కాలు :

* రాత్రి 9 గంటలు దాటిన తరువాత ఆల్కహాలు తీసుకోడదు . ఆల్కహాలు మధ్యలో నిద్రను చెడగొడుతుంది .
* రాత్రి 7 గంటలు తరువాత తీ , కాఫీ , కెఫీన్ ఉన్న పానీయాలు తీసుకోకూడదు ,
* రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత ఆహారం కూడదు.
* రాత్రులు ఎక్కువగా ఆహారము (full meal) తినకూడదు ,డిన్నర్‌లో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి.
* పడుకునే ముందు వ్యాయామము చేయకూడదు ,
* పడక గదిని ... పనిచేసే ఆఫీస్ గది గా మార్చకూడదు ,
* పడుకునే ముందు వేడిపాలు తాగితే మంచి నిద్ర వస్తుంది .
* నిద్ర రానపుడు ఏదైనా మంచి పుస్తమును చదవాలి ,
* నిద్రపోయేముందు వేడినీళ్ళ స్నానము చేస్తే మంచి నిద్ర పడుతుంది ,

* సుఖ నిద్ర పోవటానికి ఆహారం, పానీయాలు తోడ్పడతాయి . మంచి ఆహారం, సుఖనిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం.

o * శరీరంలో షుగర్‌ సమస్థితిలో ఉండేలా చూసుకోవాలి. బ్లడ్‌షుగర్‌ తక్కువగా ఉన్నట్లయితే నిద్రపట్టదు. కలత నిద్ర కలుగుతుంది.
o * ఆహారం తీసుకున్న వెంటనే మత్తుగా అనిపించి కునుకు పట్టొచ్చు. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోవటం ఆరోగ్యకరం కాదు కొంతసేపటికి నిద్రా భంగం కలిగి, తర్వాత నిద్ర పట్టకపోవచ్చు. ఆహారం తీసుకున్నాక కొంత సమయం తర్వాతనే పడకచేరాలి.

o * పడక చేరబోయేముందు ఎక్కువ నీరు తాగకూడదు.

o * మూత్ర విసర్జన చేసి పడకచేరాలి.


ట్రీట్మెంట్ :

* అవసరమైతే డాక్టర్ సలహాపై నిద్రమాత్రలు తీసుకోవాలి .

నిద్రలేమి ... కంటికింద నల్లటి వలయాలు -- ముఖసౌన్దర్యం :

నిద్రలేమి, దిగులు, ఆందోళన... ఇలా కారణమేదైనా కావొచ్చు, దీర్ఘకాలంలో అవి కంటికింద నల్లటి వలయాలను ఏర్పరచడం ద్వారా ముఖసౌందర్యం మీద ప్రభావం చూపిస్తాయి. వాటిని తొలగించుకోవడానికి బోలెడన్ని చిట్కాలు ఉన్నాయి. ఉదాహరణకు బంగాళా దుంపలిో చర్మాన్ని తేటపరిచే(స్కిన్‌ లైటెనింగ్‌) తత్వం ఉంది. అది ఈ సమస్యకు చక్కటి విరుగుడు. బంగాళాదుంప రసాన్ని కంటి కింద రాసి పదినిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే నలుపు క్రమంగా విరుగుతుంది. ఇలాంటి సౌందర్య చిట్కాలతోనే కాదు, ఆహారంలో మార్పులతోనూ ఇదే ఫలితాన్ని పొందొచ్చు. ఉదాహరణకు విటమిన్లలో కె విటమిన్‌కు కూడా ఇదే తత్వం(స్కిన్‌ లైటెనింగ్‌) ఉంది. కంటికింద మచ్చలతో బాధపడేవారు సౌందర్య చిట్కాలను పాటించడంతో పాటు కె విటమిన్‌ అధికంగా లభ్యమయ్యే ఆహారం తీసుకుంటే మెరుగైన ఫలితాలు త్వరగా కనిపిస్తాయి. ఇంతకీ కె విటమిన్‌ి పుష్కలంగా దొరికే ఆహారం ఏంటంటారా, ఇదుగో ఆ జాబితా... క్యాలీఫ్లవర్‌, క్యాబేజీ, బ్రాకోలి, క్యారెట్‌, బీన్స్‌, దోసకాయ, సోయాబీన్స్‌, పచ్చిబఠాణీలు, కాలేయం(బీఫ్‌, పోర్క్‌), చేపనూనె, పెరుగు, పాలు, అన్నిరకాల ఆకుకూరలు(పాలకూరలో అత్యధికం).

నిద్ర వయస్సు ను తెలియనివ్వదు :

వయసుకు తగినట్టుగా శరీరము మారుతుంది . అది సహజము . ఐతే కొందరి ముఖాలు వయసును తెలియనివ్వవు . వారి అసలు వయసుకన్నా ఐదారేళ్ళు చిన్నగా కనిపిస్తారు . వారి యవ్వన రహస్యము వారు క్రమము తప్పక తీసే నిద్రలో ఉంటుంది. నిద్ర వల్ల వచ్చే లాభాలు ఒకటి రెండు కాదు . సుఖనిద్రపోవడం ఒక వరము .
నిద్రలో శరీర లోపాలు సరిదిద్దబడాతాఇ. ఆరోగ్యము కుదుటపడుతుంది . తగినంత నిద్ర , విశ్రాంతి కలవారిలో రక్తపోటు , మధుమేహము అదుపులో ఉంటుంది . రక్తపోటుతో పాటే మిగిలిన అంతర్గత అవయవాల పనితీరు సక్రమముగా ఉంటుంది . సరిగా నిద్రలేనివారి కళ్ళలో వెలుగు ఉండదు . . చర్మము ఆరోగ్యముగా కనిపించదు . ముఖము మీద ముడతలు వస్తాయి. అసలు వయసు కన్నా పదేళ్ళు అదనపు వయసు కనిపిస్తుంది . నిద్ర ఉన్నప్పుడే వయసు ముదిరు నట్లు కనపడకుండా ఉంటుందన్నది తాజా నిర్ధారణ అయిన విషయము .

నిద్ర పట్టేదెట్లా?
పురుషుల కన్నా స్త్రీలకు సగటున 20 నిమిషాల నిద్ర ఎక్కువ అవసరమని బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. మరీ ముఖ్యంగా... తెలివితేటలు, భాషా నైపుణ్యం, జ్ఞాపకశక్తి వంటి కీలకమైన విధులను నిర్వర్తించే సెరిబ్రల్‌ కార్టెక్స్‌ బాగా పనిచేయాలంటే తగినంత నిద్ర తప్పనిసరి అని వారు చెబుతున్నారు. అలా చక్కగా నిద్రపట్టడానికి కొన్ని చిట్కాలు కూడా చెబుతున్నారు వారు...

* రోజూ ఒకే సమయానికి పడుకోవడానికి ప్రయత్నించండి. కొన్నాళ్లకు అది అలవాటైపోయి ఆ సమయానికి నిద్ర వస్తుంది.
* పడుకోవడానికి అరగంట ముందు... పుస్తకం చదువుకోవడం, మంద్రమైన సంగీతం వినడం, గోరువెచ్చటి పాలు తాగడం లాంటి ఏదో ఒక అలవాటు చేసుకోండి. ఆ పని చేయగానే నిద్రపోవాలని మెదడు సంకేతాలు పంపుతుంది.
* పడుకునేటప్పుడు బిగుతు దుస్తులు కాకుండా శరీరానికి సౌకర్యంగా వదులుగా ఉండే కాటన్‌ దుస్తుల్ని ధరిస్తే మంచిది.
* కాఫీ, టీలలో ఉండే కొన్ని పదార్థాలు మెదడును ఉత్తేజితం చేసి నిద్రపట్టనివ్వవు. అంచేత రాత్రి ఎనిమిది దాటాక వాటి జోలికి పోవద్దు.

 • ========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

మందులతో వృద్ధుల్లో కాన్సర్‌ చికిత్స, Cancer Treatment in Old ageఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -వృద్ధుల్లో కాన్సర్‌ చికిత్స- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


కాన్సరు లేదా కాన్సరు వ్యాధి, శరీరంలో ఏ భాగంలోనైనా ఏర్పడే గడ్డ... ఈ పదాలు ఒకే అర్థాన్ని ఇచ్చేవి. వృద్ధుల్లో సాధారణంగా వచ్చే కాన్సర్లలో ఊపిరితిత్తుల కాన్సరు, జీర్ణకోశ - పేగుల కాన్సరు, రొమ్ము కాన్సరు, గర్భాశయముఖ కాన్సరు, తల, మెడ కాన్సరు, ప్రోస్టేలు, రక్త సంబంధిత కాన్సరులు ముఖ్యమైనవి. సాధారణంగా 50, 60 ఏళ్ల వయసులో కాన్సరు వ్యాధి వచ్చే అవకాశంవుంది. కాన్సరు అభివృద్ధి చెందడానికి వృద్ధాప్యం ఒక కారణం కావచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా (1999) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అంటు వ్యాధులు, గుండె జబ్బలు, నాడీ మండల, మానసిక జబ్బుల తరువాత కాన్సరు వ్యాధి ప్రబలమైనదిగా తేలింది. గణాంకాల ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 65 ఏళ్లు పైబడ్డ వారి జనాభా పెరుగుదల 113 శాతం గానూ, అభివృద్ది చెందిన దేశాల్లో 65 ఏళ్లు మించిన వారి పెరుగుదల 43 శాతం గానూ (1985-2010 మధ్య కాలంలో) వున్నది. పాశ్చాత్యాదేశాల్లో 65 ఏళ్లు దాటిన స్త్రీ, పురుషుల్లో కాన్సరుకు గురయ్యే ప్రమాదం వుంది. 1985 -2010 మధ్య 99 శాతం కాన్సరు కేసులు పెరుగినట్లు అంచనా. వృద్ధుల్లో పాశ్చాత్యదేశాల్లో 50 నుంచి 60 శాతం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 20 శాతం వారికి కాన్సరు వచ్చే అవకాశముంది. అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధుల్లో వచ్చే సాధారణ కాన్సరు జబ్బులు.. ఊపిరితిత్తుల, ప్రోస్టేటు గ్రంథి, రొమ్ము, పెద్దపేగు, గుదమ, గర్భాశయం, లింఫ్‌గడ్డలు క్లోమ గ్రంథి కాన్సర్లు.

భారతదేశంలో ఎక్కువగా వృద్ధులు తల, మెడ, ఊపిరితిత్తులు, గర్భకోశముఖద్వారం, అన్నవాహిక కాన్సర్ల వల్ల మరణిస్తున్నారు.

లక్షణాలు

వృద్ధుల్లో వచ్చే కాన్సర్‌ వల్ల నొప్పి నీరసం, ఆకలి లేకపోవటం, ఆయాసమే కాక ప్రదేశాన్ని బట్టి లక్షణాలు ఇలా ఉంటాయి.

తల, మెడ కాన్సరు : మాననిగాయం, గొంతుల్లో, నోటిలో నొప్పి. ఆహారం మింగటంలో కష్టం. స్వరంలో మార్పు, మెడపై వాపు.

ఊపిరితిత్తుల కాన్సరు : దగ్గు, కళ్లెలో రక్తం, ఊపిరితిత్తుల చికాకు, ఛాతీ నొప్పి తరచుగా శ్వాసకోశ వ్యాధి గ్రస్థత.

అన్న వాహిక, జీర్ణకోశ కాన్సరు : మింగటంలో కష్టం. ఆకలి లేకపోవటం, బరువును కోల్పోవటం, రక్తాన్ని వాంతి చేసుకోవటం, వాంతులు కావటం, యాస్పిరేషన్‌ న్యూమోనియా.

పెద్దపేగు-గుదము-ఆసనం కాన్సరు : జీర్ణకోశ పేగుల కింది మార్గం - (పెద్దపేవు-గుదం- అసనం) పేగుల అలవాట్లలో మార్పులు, మల బద్ధకం/విరేచనాలు, గుదము నుండి రక్తస్రావం లేక రక్తంతో కూడిన స్రావం స్రవించడం, ఆసనంలో నొప్పి, గాలిపోవుట, ఉదరంలో గడ్డ, పేగుల్లో ఆటంకం.

జననాంగ, మూత్రాశయం కాన్సరు : రక్తహీనత, జ్వరం, బరువును కోల్పోవడం.

గర్భకోశ ముఖద్వారం కాన్సరు : యోని నుండి రక్తస్రావం నడుంనొప్పి, ఉదరంలో నొప్పి.

ప్రోస్టేటు కాన్సరు : త్వరగా మూత్రం విసర్జించాలన్న భావన ఎక్కువ కావటం, మూత్రం పోసేటప్పుడు మంట, మూత్రం చుక్కలు, చుక్కలుగా రావటం, ధారతగ్గటం మొదలగునవి.

మూత్రాశయ కాన్సరు : నొప్పి లేకుండా మూత్రంలో రక్తం రావటం, ఉదరంలో నొప్పి, మూత్రం నిలచి పోవటం.

రొమ్ము కాన్సరు : రొమ్ములో చేతితో తాకి గుర్తించగల గడ్డ, చనుమొనల నుండి రక్తంస్రావం, చంకలో గడ్డ.

రక్త కాన్సరు : రక్తహీనత, బలహీనత, జ్వరం, బరువు కోల్పోవటం, తరచుగా ఛాతీ, మూత్ర సంబంధ వ్యాధి గ్రస్తత, చర్మం కింద చిన్న చిన్న రక్త స్రావాలు, ముక్కు నుండి చిగుళ్ళ నుండి రక్తం కారటం, కీళ్ళనొప్పులు, నొప్పిలేని తాకి తెలుసుకోగల లింఫ్‌ గ్రంథులు, కాలేయం ప్లీహము వాచుట.

కేంద్రనాడీ మండల కాన్సరు : తలనొప్పి వాంతులు, మూర్ఛలు, చూపుతగ్గుట, స్వర్శ కోల్పోవుట లేక కండరాల బలహీనత, మూత్ర కోశ ప్రేవుల ధర్మాల్లో మార్పులు, స్పృహలో మార్పులు.

వ్యాధి నిర్ధారణ పద్ధతులు

కాన్సరు వ్యాధి నిర్ధారణకు.. భౌతిక శరీరపరీక్ష, వ్యాధి సంబంధిత పరీక్షలు జరపాలి. ఎండోస్కోపీ, లారింగోస్కోపీ, బ్రోంకోస్కోపీ, కోలోస్కోపే పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. వాటితో పాటు ఎక్స్‌-రే, అల్ట్రా సౌండ్‌, సిటీస్కాన్‌, మామోగ్రఫీ, రక్త సంబంధ, జీవ రసాయనశాస్త్ర పరీక్షలు, ఎముక స్కాన్‌, ఎముకల అధ్యయనం చేస్తారు. కాన్సరు దశలను నిర్ణయించి దానిని నయం చేయడానికి విధానాలను రూపొందించుకోవాలి. కాన్సరు దశను నిర్ణయించుకోవటంవల్ల జబ్బు ఏ దశలో వుంది? దాని పెరుగుదల ఎలా వుంటుంది? వ్యాధిని నయం చేయడానికి ఏ విధానాలను రూపొందిచాలి. చికిత్సకు ఎటువంటి ఫలితం వుంటుందనే విషయాలు తెలుస్తాయి.

చికిత్స

చికిత్సకు సంబంధించి నిర్ణయాలు మూడు విషయాలపై ఆధారపడి వుంటాయి. శరీర సాధారణ స్థితి, ఇతర జబ్బులు, కాన్సరుదశ, రోగి కోరిక, సమ్మతి. తొలిదశలో వున్న కాన్సర్లలో 70 నుంచి 90 శాతం కేసుల్లో నయం అయ్యే అవకాశం వుంది. కాన్సరు చికిత్సలో 19వ శతాబ్దం చివరిదశలో కాన్సరుకు శస్త్ర చికిత్స ప్రారంభమైంది. అయితే కాన్సరుకు శస్త్ర చికిత్స రానురాను వయస్సు పెరిగిన కొద్దీ తగ్గిపోతున్నది. రేడియేషన్‌ చికిత్స ఎక్స్‌రేను కనుగొన్న 1895 నుండి జరుపబడుతున్నది. వృద్ధుల్లో కాన్సరు జబ్బుకు రేడియేషన్‌ చికిత్సను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాన్సరుకు మందులతో చికిత్స 1950 నుండి ప్రారంభమైంది. వృద్ధుల్లో కాన్సరు చికిత్సకు మందులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

నివారణ

ఆరోగ్యపు అలవాట్లను, ఆహారపు అలవాట్లను 30 నుంని 40 ఏళ్ల వయస్సు నుంచే ప్రారంభించాలి. తొలిదశలోనే కాన్సరును గుర్తించి చికిత్స పొందాలి. ధూమపానం, సురాపానం, గుల్కా, జర్దాకిల్లీలు మానాలి. పండ్లు, కూరగాయలు పీచు పదార్థం ఎక్కువగానూ, కొవ్వు తక్కువగానూ వుండే ఆహారాన్ని తీసుకోవాలి. కాన్సరు బారినుండి శరీరాన్ని రక్షించుకోవాలి. దీనికి స్క్రీనింగ్‌ పరీక్షలు జరపాలి.

డా|| నాగినేని భాస్కరరావు-వృద్ధుల వైద్యనిపుణులు--ఎంఎన్‌ఆర్‌ వైద్య కళాశాల ,ఆసుపత్రి సంగారెడ్డి.
 • =========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, July 23, 2011

జుట్టుకు సౌందర్య పోషణ చిట్కాలు,Home remidies for Hair beauty careఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -జుట్టుకు సౌందర్య పోషణ చిట్కాలు(Home remidies for Hair beauty care)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


• వెంట్రుకలు తెల్లబడకుండా ఉండాలంటే ఉసిరికాయ రసం, నువ్వుల నూనె సమపాళ్ళలో కలిపి, కాచి తలకు రాసుకోవాలి.

• ఒక కోడిగుడ్డులోని సొనను చిన్న గిన్నెలో వేసి బాగా చిలకరించి అందులో ఒక నిమ్మపండు రసం కలపండి. నాలుగు చెంచాల పెరుగును కూడా ఈ సొనకు కలిపి తలకు పట్టించి అరగంటసేపు వుండండి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మీ వెంట్రుకలు మృదువుగా, కాంతివంతంగా వుంటాయి.

• కొబ్బరినూనెలో వెల్లుల్లిపాయలను ఉడికించి, వడకట్టి ప్రతిరోజూ తలకు రాస్తే తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి

• ఉసిరి పొడిని ఇనప పాత్రలో రాత్రిపూట నానవేసి ఉదయాన్నే ఆ మిశ్రమాన్ని బ్రష్‌తో వెంట్రుకలకు పట్టించండి. అనంతరం తలకు షవర్ క్యాప్ పెట్టుకోవడం వల్ల మిశ్రమం ఒంటి మీద పడదు. గంట తర్వాత స్నానం చేస్తే సరి.

• ఎండలో బయటకి వెళ్ళినపుడు సన్‌స్క్రీన్‌ని చర్మ సంరక్షణ కోసం వాడుతుంటారు. అలాగే ఎక్కువ సేపు ఎండలో తిరగాల్సి ఉన్నప్పు డు సన్‌స్క్రీన్ ఉన్న జుట్టు ఉత్పత్తులను వాడవచ్చు.

• ఎక్కువగా జుట్టు రాలుతోందా ఒక ఉల్లిపాయను మెత్తగా పేస్టులా చేసుకోవాలి. దానికి చెంచాడు తేనె కలపాలి. తలకు పట్టించి గంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.

• ఒక కప్పు దంపుడు బియ్యానికి మూడు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. అన్నం ఉడికిన తర్వాత బియ్యాన్ని విడిగా తీయగా వచ్చిన గంజిని చల్లారబెట్టాలి. ఈ గంజిని ఆరంగ ఆరంగా కనీసం మూడుసార్లు జుట్టుకు పట్టించాలి. తర్వాత చల్లని నీటితో శిరోజాలను శుభ్రపరుచుకోవాలి. ఇది జొన్న పీచులా పలుచగా ఉండే జుట్టును ఒత్తుగా చేస్తుంది.

• ఒక టీ స్పూను నెయ్యి, టీ స్పూను చక్కెర, టీ స్పూను మిరియాల పొడి కలిపి మాడుకు అంటేలా తలకు మర్దనా చేసి ఒక పదినిమిషాల తరువాత తలస్నానము చేయాలి. ఇది చుండ్రును నివారించడమే కాకుండా జుట్టును మెరిపించడానికి తోడ్పడుతుంది.

• ఒక్కోసారి తలంతా దురద పుడుతుంది. అలాగని ఊరికే గోకుతుంటే మాడు పుండు పడుతుంది తప్ప దురద మానదు. ఇందుకు బీట్ రూట్ రసం మంచి చికిత్స. అందుకు ఏం చేయాలంటే తాజా బీట్ రూట్‌ను చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో చిక్కటి రసం తీయాలి. దీనిని నేరుగా తలకు పట్టించుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. జుట్టు పట్టులా మెరుస్తుంది.

• కొంతమంది జుట్టు జిడ్డుగా, నూనె కారుతూ ఉంటుంది. తలస్నానం చేసిన కొద్దిసేపటికే జుట్టు జిడ్డుగా తయారై రాలిపోతుంటుంది. ఇటువంటివారు ఒకవేళ కండీషనర్ వాడదలుచుకుంటే పెరుగును మాత్రం వాడుకోవాలి. కండీషనర్‌ను తలకు కాకుండా వెంట్రుకల కొసలకు ప్రయోగించాలి. స్నానానికి ఉపయోగించే నీళ్లకు కొద్దిగా నిమ్మరసాన్ని చేర్చితే జిడ్డు వదులుతుంది.

• శీకాకాయ, పెసలు, ఉసిరి, కరివేపాకు, నిమ్మతొక్కలు, మెంతులు వీటిన్నిటిని గాలికి ఆరబెట్టి, ఎండిపోసిన తరువాత విడివిడిగా పొడిచేసుకొని ఒకటిగా కలిపి తలస్నానచూర్ణంగా వాడుకుంటే తలకు పట్టిన జిడ్డు వదిలిపోయి కేశాలు ప్రకాశవంతంగా తయారవుతాయి.

• గాలి తగిలేలా మూడు రోజులు నిల్వ ఉంచిన పెరుగును తలకి మర్దన చేసి తలస్నానం చేస్తే చుండ్రు పోతుంది.

• చిన్న గిన్నెలో నీళ్లు పోసి అందులో వాడేసిన టీపొడి కానీ కాఫీ పొడిని కాని వేయాలి. ఉసిరిపొడితో పాటు ఉల్లి తొక్కల్ని అందులో వేసి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి. ఆ మిశ్రమాన్ని శిరోజాలకు పట్టించి మూడు గంటలు ఆగితే జుట్టుకు కావలసిన బలంతో పాటు మెరుపుని అందిస్తుంది.

• జుట్టు ఆరోగ్యవంతంగా పెరగాలంటే మంచి పోషకాహరం తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పొడవాటి జుట్టుని ఇష్టపడేవారు, జుట్టు మరింత పొడవు అయితే బాగుండు అనుకునేవారు, ప్రొటీన్లు ఎక్కువ ఉన్న ఆహరం తీసుకోవాలి. పప్పు, మజ్జిగ, గుడ్లు, పప్పు ధాన్యాలు, చికెన్, పన్నీర్ ఇవన్నీ జుట్టు పెరిగేందుకు కావలసిన పోషకాలు అందిస్తాయి.

• జుట్టుకి మంచి షాంపూ, కండీషనర్‌లు రాస్తూ శ్రద్ద తీసుకుంటున్నా చుండ్రు, జుట్టు ఊడిపోవటం మొదలైన సమస్యలు వెంటాడుతుంటాయి కొంతమందిని. వీరు గుర్తించాల్సింది ఏమిటంటే జుట్టు సంరక్షణ అంటే షాంపూ కండీషనర్ల వాడకమే కాదు. మంచి సమతులాహారం తీసుకోవాలి.

• తడిగా ఉన్న జుట్టును దువ్వటం వల్ల జుట్టు పగిలిపోయి పీచులాగా తయారవుతుంది. దీనివల్ల జుట్టు కుదుళ్ళు కూడా దెబ్బతింటాయి. ఆరిన తరువాత చిక్కు తీసుకోవటం వల్ల సులువుగా వస్తుంది. జుట్టు ఆరోగ్యానికి ఎలాంటి చిక్కూరాదు.

• తల స్నానానికి ముందు తలకు నూనె పెట్టుకుని, మృదువైన షాంపూ తో తలస్నానం చేయండి. జుట్టు పొడిబారటం తగ్గుతుంది.

• తలకు గోరింటాకు పెట్టుకునే ముందుదానిలో కొద్దిగా బీట్ రూట్ రసాన్ని కలిపితే జుట్టుకు మంచి మెరుపుతో పాటు రాగిరంగు ఛాయ వస్తుంది.

• నల్లటి మీ కురులు రంగు మారుతున్నట్లనిపిస్తే వెంటనే గుప్పెడు ఎండు ఉసిరి ముక్కల్ని కొబ్బరినూనెలో వేసి రెండు రోజుల పాటు నానపెట్టండి ఆ తర్వాత నూనె పైకి తేటగా తేరుతుంది. అప్పుడు చక్కగా ప్రతిరోజూ ఆ నూనెని తలకు పట్టించండి. మీ సమస్య తీరుతుంది.

• నిమ్మకాయ చెక్కతో తల రుద్దుకొని వేడి నీళ్ళతో స్నానం చేస్తే చుండ్రు పోతుంది.

• నీళ్ళలో కలిపిన ఆపిల్ జూస్ ను తరచూ తలకి రుద్దుకుంటే చుండ్రు పోతుంది.

• పలుచని జుట్టు తరచూ రాలిపోయే జుట్టుతో బాధపడేవారు గోరువెచ్చటి ఆలివ్ లేదా బాదం నూనెతో మర్దన చేసుకుంటే సరి.

• పారిజాతం గింజల్లోని పప్పును వేరు చేసి బాగా దంచి తలకు పట్టించాలి. పావు గంట తర్వాత కుంకుడు రసంతో తలస్నానం చేస్తే చుండ్రుతగ్గిపోతుంది.

• పెరుగు తలకు మర్దనా చేసుకుని తలస్నానం చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది. కళ్ళ మంటలు తగ్గి నిద్ర బాగా పడుతుంది.

• పేలు మిమ్మల్ని చికాకు పెడుతున్నాయా వాటిని వదిలించుకోవడం చాల తేలిక. ఎలా అంటే ఉసిరి విత్తనాల్ని పొడి చేసి దాన్ని నిమ్మరసంలో కలపాలి. వెంట్రుకల మొదళ్లకు ఆ మిశ్రమాన్ని పట్టించి అరగంట తర్వాత స్నానం చేయండి. పేల బెడద మిమ్మల్ని వీడుతుంది.

• పొడిబారిన కురులకు కొబ్బరినూనె, కొబ్బరిపాలు, పెరుగు తలా పావుకప్పు, ఒక గుడ్డులోని తెల్లసొన తీసుకుని, అన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ళకు ఇంకేలా పట్టించాలి. 20 నిమిషాల తర్వాత కడగేయాలి.

• పొడిబారిపోయి కాంతిహీనంగా తయారైన జుట్టుతో బాధపడుతున్నట్లయితే, తాజా మెంతికూరను తీసికొని మెత్తగా రుబ్బుకోవాలి. దానికి చిక్కటిపెరుగు కలిపి తలకు పట్టించండి. అరగంట తర్వాత మంచి షాంపుతో తలస్నానం చేయండి. జుట్టు ఎంతో కోమలంగా తయారౌతుంది.

• బలహీనంగా పల్చగా కనిపించే జుట్టు విషయంలో మరింత శ్రద్ద తప్పనిసరి. అందుకు బొప్పాయి, అరటిపండు ముక్కలు ఒక్కోకప్పు చొప్పున అరకప్పు యాపిల్ ముక్కలు తీసుకోవాలి. వీటన్నిటిని మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళుపోసి మెత్తగా రుబ్బాలి. ఈ గుజ్జును బాగా వడకట్టాలి. అలా వడకట్టగా వచ్చిన రసాన్ని తలంతా పట్టించండి. తర్వాత వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

• బి కాంప్లెక్స్‌లో బయోటిన్, ఫోలిక్ యాసిడ్, సమృద్దిగా ఉంటాయి. ఇక బి6 జుట్టు పెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. మెగ్నీషియం, జింక్, సల్ఫర్‌లు జుట్టు ఎదుగుదలకు తోడ్పడుతాయి.

• మీ జీవనశైలికూడా జుట్టుమీద ప్రభావం చూపుతుంది. శరీరానికి వ్యాయామాన్ని ఇచ్చేలా ఉండాలి. ఒక వేళ జుట్టు విపరీతంగా ఊడుతుంటే వాటి కుదుళ్ళను బలోపేతం చేసే ట్రీట్‌మెంట్‌ని బ్యూటీపార్లర్‌లో చేయించుకోవాలి.

• మెంతికూర ఆకుల్ని మెత్తగా నూరి దానిని తలకు పట్టిస్తుంటే జుట్టు బాగా పెరుగుతుంది. నల్లటి రంగు నిలబడుతుంది.

• రెండు టీ స్పూన్‌ల కుంకుడుకాయ పొడిని రెండు స్పూన్‌ల ఉసిరి పొడిని మరో రెండు స్పూన్‌ల తేనెతో కలిపి ఆ పేస్ట్‌ని తల మొత్తానికి పట్టించాలి. అరగంట తర్వాత మైల్డ్ షాంపుతో స్నానం చేయండి. తేడా మీకే తెలుస్తుంది.

• వారానికి ఒకసారి తలకు పుదీనా పేస్ట్ రాసుకుని ఇరవై నిముషాల పాటు ఉంచుకుని కడిగేస్తే చుండ్రు పోతుంది.

• వెంట్రుకలు ఊడకుండా ఉండడానికి మెంతులను నీళ్ళతో సహా మెత్తగా రుబ్బి తలకు పట్టించి 40 నిమిషాల తరువాత కడిగేయాలి. దీనిని ప్రతిరోజు ఉదయం చేస్తే మంచిది. కనీసం మండలం (40 రోజులు) పాటు కొనసాగిస్తే చక్కని ప్రయోజనం కనిపిస్తుంది.

• సీకాయ పొడిలో కాస్త మజ్జిగ కలిపి తలంటుకుంటే జుట్టుకు మంచిది.

• స్నానం చేసే నీటిలో కొద్దిగా నిమ్మరసాన్ని చేర్చితే జుట్టుకున్న జిడ్డు వదులుతుంది


---Vijay Kumar
 • ===========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, July 15, 2011

ఊపిరితిత్తుల క్యాన్సర్‌,Lung cancer

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్(Lung cancer) గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...-ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రతిఏటా 12 లక్షల మంది గురవుతున్నారు. ఈ వ్యాధి కారణంగా ప్రతి 30 సెకన్లకు ఒకరు మరణిస్తున్నారు. అభివృద్ది చెందిన దేశాల్లోనే కాకుండా భారతదేశం వంటి అభివృద్ది చెందుతున్న దేశాల్లో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ సోకే వారి సంఖ్య ఆందోళన కలిగించే రీతిలో పెరుగుతుండడం విచారకరం.ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో రెండు ప్రధాన రూపాలున్నాయి. మొదటిది స్మాల్‌ సెల్‌ లంగ్‌ క్యాన్సర్‌ (ఎస్‌సిఎల్‌సి), రెండవది నాన్‌ స్మాల్‌ సెల్‌ లంగ్‌ క్యాన్సర్‌ (ఎన్‌ఎస్‌సిఎల్‌సి). ఊపిరితిత్తులకు సోకే క్యాన్సర్లన్నింటిలో 80 శాతం కేసులు ఎన్‌ఎస్‌సిఎల్‌సి రకానికి చెందినవి. అవి ఎడినో కార్సినోమా, స్క్వామాసెల్‌ కార్సినోమా, లార్జ్‌సెల్‌ కార్సినోమా, బ్రాంకో అల్వియోలార్‌ కార్సినోమా.

లక్షణాలు...
వ్యాధి తీవ్రమయ్యే వరకూ లక్షణాలు స్పష్టం కావు కనుక ఈ వ్యాధికి చికిత్స చేయడం కష్టమైన పని. ఈ వ్యాధితో బాధపడేవారిలో కనిపించే కొన్ని లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.


* ఎడతెగని దగ్గు
* గొంతు బొంగురు పోవడం
* దగ్గుతున్నప్పుడు నోటి నుంచి రక్తం పడడం
* బరువు కోల్పోవడం
* సరైన కారణం లేకుండా ఆకలి తగ్గిపోవడం
* హ్రస్వ శ్వాస
* కారణమేమీ లేకుండా జ్వరం రావడం
* శ్వాసలో పిల్లికూతలు
* శ్వాస నాళాల వాపు లేదా న్యుమోనియా పదేపదే వస్తుండడం
* ఛాతి నొప్పి

ఊపిరితిత్తుల కణాలు విపరీతమైన స్థాయిలో పెరిగి ఊపిరితిత్తులను విధ్వసంసం చేసే వ్యాధి ఇది. ఈ కణాలు మామూలు కణాల కంటే మరింత త్వరగా పునరుత్పత్తి అయి ఒక కంతిగా ఏర్పడుతుంది. ఊపిరితిత్తుల్లో మొదట ఒక కంతి మాత్రమే ఏర్పడితే దానిని ప్రాథమిక కంతి అంటారు. విపరీతమైన కణాలు ఈ కంతిని విచ్ఛిన్నమయ్యేలా చేసి రక్త ప్రసరణ ద్వారా శరీరంలోని ఇతర భాగాల్లోకి వ్యాపిస్తే అక్కడి అవయవాల్లో కూడా పెరగడం ఆరంభమవుతుంది.

ఈ ప్రక్రియను మెటాస్టేసిస్‌ అని అంటారు. అక్కడ ఏర్పడే కంతిని రెండవ కంతి అంటారు. రోగి జీవించి ఉండే తీరు వ్యాధి ఏ దశలో ఉందనే అంశాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే ఏ రకమైన చికిత్స ఇస్తున్నారనే అంశంపై కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే ఏ రకమైన చికిత్స ఇస్తున్నారనే అంశంపై కూడా ఆధారపడి ఉంటుంది. క్యాన్సర్‌ తొలిదశలోనే వ్యాధిని నిర్ధారించి చికిత్స ఆరంభిస్తే రోగులు కనీసం అయిదేళ్లు జీవించి ఉంటారు. దురదృష్టవశాత్తు చాలా మందిలో వ్యాధిని తొలి దశలోనే గుర్తించడం సాధ్యం కాదు.

వ్యాధిని గుర్తించే సరికే అది మరొక భాగానికి వ్యాపించి ఉంటుంది. ఈ దశలో అయినా గుర్తించి చికిత్స చేస్తే 5 శాతం మంది రోగులు అయిదేళ్ల వరకూ జీవించి ఉండగలుగుతారు. 15 నుంచి 35 శాతం మంది ఒక ఏడాది పాటు జీవిస్తారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను వృద్ధి చేయగల అత్యంత పెద్ద ప్రమాదకర అంశం ధూమపానం. ప్రతి 10 ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కేసుల్లో 9 కేసులు ఈ కోవలోకి చెందినవే. ఎన్నాళ్ల నుంచి పొగ తాగుతున్నారు... ఎన్ని సిగరెట్లు కాలుస్తున్నారు...అనే పలు అంశాలపై వ్యాధి తీవ్రత ఆధారపడి ఉంటుంది.

- డాక్టర్‌ బి.శ్యామ్‌సుందర్‌రాజ్‌-- ఎండి, డి.ఎం.(పి.జి.ఐ), డి.ఎన్‌.బి.,-- పల్మనాలజిస్ట్‌.

చికిత్స :
ఊపిరి తిత్తుల క్యాన్సర్ ని
surgery ,
radiation ,
chemotherapy ,
palliative care

అనే నాలుగు విధాల్లో ఒకదానిని ఎంచుకోని గాని రెండు , మూడు విధానాలు కలిపి గాని చేస్తుంటారు . పూర్తిగా నయము అయ్యే అవకాశాలు చలా తక్కువా ఉంటాయి. ముఖ్యము గా భాద నివారణ , వ్యాధి పెరుగుదల ఆపడము , కొద్దిగా జీవితకాలము పొడిగింపు కోసమో ప్రయత్నాలు చేస్తూఉంటారు .

ఊపిరితిత్తుల క్యాన్సర్‌ రోగి రక్తంలోని కణతి కణాలు లెక్కించడం వల్ల వ్యాధి తీవ్రత నిర్ధారించొచ్చు. దీని వల్ల మెరుగైన చికిత్స అందించే వీలుందని బ్రిటీష్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. లెక్కించడానికి కొత్త సులభమైన పరిజ్ఞానం తోడ్పడుతుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న నిర్ధారణ ప్రక్రియ 'బ్రాంకోస్కొపి'. ఇది ఒక్కసారే చేసే వీలుండడం. దీనికన్నా మెరుగైన పద్ధతిలో కొత్త పరిజ్ఞానాన్ని ఛారిటీ క్యాన్సర్‌ రీసెర్చ్‌, యుకె పరిశోధకులు అభివృద్ధి చేశారు. కణితి కణాలను లెక్కించి వాటిని విశ్లేషించడం వల్ల వ్యాధి ఎలా వృద్ధి చెందుతుందో తెలుసుకునే అవకాశాలున్నాయి మరణానికి దారితీసే వాటిలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ప్రముఖమైంది. ఈ వ్యాధి చికిత్సకు కొత్త వైద్య విధానాల అవసరం ఉందని ఛారిటి డైరెక్టర్‌ డాక్టర్‌ లెస్లి వాకర్‌ చెప్పారు. రక్తంలో ప్రవహించే అరుదైన కణతి కణాలను గుర్తించి లెక్కించడం, వ్యాధి అభివృద్ధిని తెలుసుకోవడం కొత్త పరిశోధనకు నాంది అని' వాకర్‌ పేర్కొన్నారు. 'ఇప్పుడు మేం వ్యాధికి సంబంధించి రహస్యంగా ఉన్న జన్యులోపాలను పరిశీలిస్తున్నాం. దీని లక్ష్యంగా కొత్త మందులను వృద్ధి చేసి చికిత్స చేసే ప్రయత్నంలో ఉన్నాం' అని వాకర్‌ తెలిపారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 12 లక్షల మంది చనిపోతున్నారు. ఈ క్యాన్సర్‌ వచ్చినవారు బతికి బయటపడే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే చాలా మందిలో వ్యాధిని ఆలస్యంగా గుర్తిస్తున్నారు. చివరి దశలో చికిత్స అంతగా ఫలితాలను ఇవ్వడం లేదు.

 • ===========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

నిద్రలేమి , Insomnia,sleeplessness


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -నిద్రలేమి , Insomnia(sleeplessness)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


 • నిద్రలేమి ఆరోగ్యానికి హానికరం - నిద్రకు సంబంధించిన సమస్యలన్నింటినీ నిద్రలేమి (ఇన్‌సోమ్నియా)గా పరిగణించడం తరచూ జరుగుతుంటుంది. ఈ పదానికి అర్థం నిద్రలేమి అయినప్పటికీ ఇది మూడు సమస్యలను సూచిస్తుంది:

 • * నిద్రలోకి వెళ్ళడం కష్టం కావడం
 • * నిద్రావస్థలో ఎక్కువ సేపు ఉండలేకపోవడం.
 • * నిద్ర లేచిన తరువాత తాజాగా అనిపించకపోవడం.
నిద్రలోకి జారుకోలేకపోవడం, ఒకవేళ నిద్రపోయినప్పటికీ తెల్లవారుఝామునే లేవడం, రాత్రిళ్ళు మధ్య మధ్యలో మెలకువ రావడం, ప్రశాంతమైన నిద్రలేక పోవడంలో అన్న వాటిలో ఒకటి రెండు లక్షణాలు కానీ లేదా అన్నీ కానీ ఉండటమే స్లీప్‌ డిజార్డర్‌ లేదా ఇన్‌సోమ్నియా అని ఆధునిక వైద్యం అభివర్ణిస్తోంది.

 • ఇన్‌సోమ్నియాలో రకాలు... ఇన్‌సోమ్నియాను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.

1. మెడికల్‌ ఇన్‌సోమ్నియా:
 • * జ్వరం వంటి వ్యాధులునొప్పి,
 • * ఆసుపత్రి వాతావరణం,
 • * గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు,
 • * రక్తప్రసరణ స్తంభించి గుండెకు సమస్య వచ్చినప్పుడు,

2. సైకియాట్రిక్‌ ఇన్‌సోమ్నియా:
 • * ఆంగ్జైటీ (ఆందోళన)డిప్రెషన్‌ (నిరాశానిస్పృహలతో కూడిన స్థితి),
 • * మనో దౌర్బల్యం (అబ్సెషనల్‌ న్యూరోసిస్‌) మానిక్‌ డిప్రెసివ్‌ సండ్రోమ్‌,

కారణాలు...
 • * తెలియని ఆందోళన కారణంగా నిద్రపోలేకపోవడం,
 • * తెల్లవారు ఝామునే మెలకువ రావడానికి ప్రధానంగా డిప్రెషన్‌ కారణం,
 • * ఒత్తిడి కారణంగా ఆయా సమయాల్లో ఇన్‌సోమ్నియా రావచ్చు.,
 • * పర్యావరణంలో మార్పులు భౌతిక కార్యకలాపాలు తగ్గినప్పుడు,
 • * జ్వరం లేదా నొప్పులు ఉన్నప్పుడు సాంస్కృతిక కారణాలు,
 • * భారీగా తిన్న వెంటనే నిద్రపోయే ప్రయత్నం చేయడం వంటి అలవాట్లు.,
 • * మద్యం, నిద్రమాత్రల వంటివి హఠాత్తుగా మానివేయడం,
 • * వృద్ధాప్యం.,

లక్షణాలు...
 • * నిద్రలోకి జారుకునేందుకు యుద్ధం చేయాల్సి రావడం.
 • * తెల్లవారు జామునే మెలకువ వచ్చి తిరిగి నిద్రపోలేకపోవడం.
 • * నిద్రపట్టినా మధ్య మధ్యలో మెలకువ వస్తూ ఉండడం.
 • * నిద్రలేచిన తరువాత విశ్రాంతిగా, తాజాగా అనిపించకపోవడం.
 • * డిప్రెషన్‌, ఆంగ్జైటీ, మద్యం అలవాటు వంటి అనుబంధ లక్షణాలు ఉండడం,
 • * నిద్రలో నడవడం, పక్క తడపడం వంటి అనుబంధ లక్షణాలు.
 • * మాదక ద్రవ్యాలకు అలవాటుపడడం.

రోగనిర్ధారణ...
 • * ఆయా వ్యక్తుల వ్యక్తిగత అలవాట్లు, వ్యాధి లక్షణాల చరిత్రను బట్టి చేస్తారు.

చికిత్స...
 • * నొప్పి లేదా బాధ వంటి అంతర్గత లక్షణానికి చికిత్స,
 • * రాత్రి వేళ మద్యం, కాఫీ, టీ వంటి వాటికి దూరంగా ఉండాలి.,
 • * నిద్రకు ఉపక్రమించే ముందు సిగరెట్లు తాగడం, తినడం, వ్యాయామం చేయడం తగ్గించాలి.,
 • * అలాగే రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌, సైకలాజికల్‌ కౌన్సెలింగ్‌ వంటి వాటి సాయంతో ప్రవర్తనా సరళిలో మార్పు తేవడం.,
 • * ఒకవేళ మందులు ఇచ్చినప్పటికీ కారణాన్ని బట్టి మందులు మారుతాయి.,

సుఖనిద్రకు కొన్ని సూచనలు...
 • * నిద్రపోయే ముందు బ్రష్‌ చేసుకొని, ముఖం, కాళ్ళూ, చేతులూ కడుక్కోవాలి.
 • * నిద్రపోయే రెండు గంటల ముందు ఏమీ తినడం కానీ తాగడం కానీ చేయకూడదు.
 • * నిద్రకు ముందు మద్యం సేవించరాదు.
 • * ప్రశాంతంగా, చల్లగా, గాలీ వెలుతురు వచ్చే ప్రదేశంలో నిద్రించాలి.
 • * మంచి నిద్ర కోసం కుడివైపు తిరిగి పడుకోవడం మంచిది.
 • * నిద్రించే సమయంలో వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించాలి.
 • * నిద్రకు ముందు గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడం మంచిది.,
 • * నిద్రపోయే ముందు మాడుకు, అరికాళ్ళను నువ్వుల నూనెతో మృదువుగా మసాజ్‌ చేసుకుంటే ఉపయుక్తం.,
 • * నిద్రకు ముందు ఒక కప్పు వెచ్చటి పాలు తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది.
 • * పడకపై చేరిన తరువాత చదవడం, టివి చూడడం, రాయడం లేదా ఆలోచించడం వంటివి చూయవద్దు.
 • * చక్కటి సంగీతాన్ని వినడం వల్ల త్వరగా నిద్రలోకి జారుకోగలం.
 • * పడుకోవటానికి 2 గంటల ముందు నుంచి ఇంట్లో తక్కువ కాంతినిచ్చే దీపాలు వాడుకోవాలి.

Medicines :
 • 1 . Tab . Alprox 0.25 mg daily one , for 2-3 days
 • 2. Tab . Inzofresh 5mg daily one before bed.

నిద్రలేమితో ఒళ్లు నొప్పులు
 • తరచూ నిద్రలేమితో బాధపడేవారికి ఒంట్లో ఎప్పుడూ ఏదో ఒకచోట నొప్పుల (ఫైబ్రోమయాల్జియా) ముప్పు ఎక్కువని తాజాగా వెల్లడైంది. ఇది చిన్న వయసు మహిళల్లో కన్నా మధ్యవయసు, వృద్ధుల్లో అధికంగా ఉంటోంది. నిద్ర సమస్యలు ఎక్కువవుతున్నకొద్దీ ఇది దాడి చేసే అవకాశమూ పెరుగుతుండటం గమనార్హం.

నిద్ర గురించి పతంజలి యోగశాస్త్రం ఏం చెప్తోంది?

గాలీనీరూ తిండీతిప్పల్లాగే నిద్ర కూడా చాలా అవసరం. నిద్ర కరువైతే ముఖం తోటకూర కాదలా వాలిపోతుంది. కళ్ళలో కాంతి కరువౌతుంది. ఉత్సాహం అనేది వెతికి చూసినా కనిపించదు. నిద్రలేమి అలసట, ఆందోళన కలిగించడమే కాకుండా అనేక రోగాలకు కారణమౌతుంది.

అయిదేళ్ళ లోపు చిన్నారులకు సుమారుగా 12 గంటల నిద్ర కావాలి. యౌవనంలో, వృద్ధాప్యంలో 9 గంటల నిద్ర అవసరం. ఇక నడివయసు వారికి నాలుగైదు గంటల నిద్ర సరిపోతుంది.

ఇంతకీ ఇంత ముఖ్యమైన నిద్ర గురించి పతంజలి యోగశాస్త్రం ఏం చెప్తోందో తెలుసుకుందాం.

కలతనిద్రవల్ల అంతగా ప్రయోజనం లేదు. కలతల్లేని ప్రశాంతమైన నిద్ర అవసరం. ఇలాంటి మంచి నిద్రలో కలలు రావు. ఈ నిద్రాస్థితినే గాఢ సుషుప్తి అంటారు. (ఇంగ్లీషులో sound sleep అంటారు) గాఢ నిద్ర గనుక అయితే రోజుకు నాలుగ్గంటలు సరిపోతుందని చెప్పాడు పతంజలి మహర్షి. గాఢ సుషుప్తావస్థలో మానసికంగా, శారీరకంగా సేదతీరతాం. అనేక గంటలపాటు కలత నిద్ర పోయేకంటే గాఢ నిద్ర నాలుగ్గంటలు సరిపోతుందని ఆనాడు పతంజలి మహర్షి చెప్పిన మాటే ఈనాటి డాక్టర్లు, సైంటిస్టులు కూడా చెప్తున్నారు.

మానసిక ఒత్తిడి, ఆందోళన, శరీరంలో వచ్చే మార్పులు, దీర్ఘకాలిక వ్యాధులు, వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలు - మొదలైన కారణాలతో కొందరికి నిద్ర పట్టదు. నిద్ర పోయినప్పటికీ కొద్దిసేపట్లోనే అర్ధాంతరంగా మెలకువ వచ్చేస్తుంది. ఈ నిద్రలేమి అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది.
మన పూరాణాల్లో నిద్రలేమి నుంచి బయటపడటానికి చిట్కాలు కూడా సూచించారు. అవి అందరికీ అందుబాటులో ఉన్నవి, అతి సులభమైనవి.
 • * రోజులో కనీసం గంటసేపు ధ్యానం చేస్తే నిద్ర పట్టకపోవడం అనే సమస్య తలెత్తదు. ఎక్కువసేపు ధ్యానం చేయలేనివారు కనీసం రాత్రి పవళించే ముందు అయినా కొంతసేపు ధ్యానం చేస్తే నిద్ర పడుతుంది.
 • * సాయంత్రం వేళ లేదా పడుకునేముందు స్నానం చేస్తే హాయిగా నిద్ర పడుతుంది.
 • * మెంతికూరను మెత్తగా నూరి రసం తీసి, అందులో తేనె వేసుకుని తాగితే వెంటనే నిద్రాదేవి ఒడిలో సేదతీరవచ్చు. ఒక నెల రోజులపాటు ఇలా చేస్తే అసలు నిద్రలేమి సమస్య ఉండనే ఉండదు. రోజూ సమయానికి నిద్ర పడుతుంది.
 • * పడుకునేముందు గోరువెచ్చని పాలు ఒక గ్లాసుడు తాగితే వెంటనే నిద్ర వస్తుంది.
 • * వెచ్చని పాలల్లో కొంత తేనె కలుపుకుని తాగితే నిద్ర పడుతుంది. ఆరోగ్యానికి అన్నివిధాలా మంచిది.
 • * శరీరాన్ని కొంతసేపు మర్దనా చేసుకుని తర్వాత నిద్రకు ఉపక్రమిస్తే వెంటనే మగత వస్తుంది. ముఖ్యంగా తల, అరికాళ్ళు, అరచేతులను మర్దనా చేయాలి.
చక్కటి నిద్ర సప్త మార్గాలు!

సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర చాలా కీలకం. నిద్రలో శరీరం తిరిగి శక్తిని కూడగట్టుకుంటుంది. దీంతో కొత్త ఉత్సాహం వస్తుంది. నిద్ర సరిగా పట్టకపోతే అలసట, నిస్సత్తువే కాదు.. ఏకాగ్రత కూడా లోపిస్తుంది. ఫలితంగా పని మీద శ్రద్ధ తగ్గిపోతుంది. కానీ ప్రస్తుతం చాలామందికి నిద్ర బంగారమైపోతోంది. పడక మీదికి చేరుకుని గంటలు గడిచినా నిద్రపట్టక సతమతమయ్యేవారు ఎందరో. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, సంబంధ బాంధవ్యాలు, జబ్బులు.. ఇలా చాలా అంశాలు నిద్రను దెబ్బతీయొచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర సరిగా పట్టేలా చూసుకోవచ్చు.

* వేళకు పడక: రోజూ ఒకే సమయానికి పడుకోవటం, నిద్రపోవటం అలవాటు చేసుకోవాలి. సెలవురోజుల్లోనూ దీన్ని మానరాదు. దీంతో శరీరంలోని నిద్ర, మెలకువ చక్రం సర్దుకుని రాత్రిపూట నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. పడక మీదికి చేరుకున్నాక 15 నిమిషాలైనా నిద్రపట్టకపోతే వెంటనే లేచి, పుస్తకం చదవటం వంటివి చేయాలి. అలసట అనిపించినపుడు పడక మీదికి చేరుకోవాలి.

* తిండిపై కన్ను: కడుపు నిండుగా తిన్నవెంటనే గానీ ఆకలిగా ఉన్నప్పుడు గానీ మంచం ఎక్కొద్దు. ఇవి నిద్రను దెబ్బతీస్తాయి. ఇక ద్రవాలను ఎక్కువగా తీసుకుంటే మధ్యలో లేవాల్సి రావొచ్చు. అలాగే నిద్రపోవటానికి ముందు సిగరెట్లు, కాఫీల జోలికి అసలే వెళ్లరాదు. వీటిల్లోని నికొటిన్‌, కెఫీన్‌ చాలాసేపు మెలకువ ఉండేలా చేస్తాయి. మద్యం తాగితే మొదట్లో నిద్రమత్తు ముంచుకొస్తుంది గానీ మధ్యలో చాలాసార్లు మెలకువ వచ్చేలా చేస్తుంది.

* సన్నద్ధ అలవాట్లు: రోజూ పడక మీదికి చేరటానికి ముందు ఒకేకరకమైన పనులు.. అంటే స్నానం చేయటం, పుస్తకం చదవటం, సంగీతం వినటం వంటివి.. చేస్తే శరీరం నిద్రకు సన్నద్ధమయ్యేలా తయారవుతుంది. కానీ టీవీ, కంప్యూటర్ల వంటి వాటికి దూరంగా ఉండటం మేలు.

* మంచి గది: పడకగది చల్లగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ వెలుగునిచ్చే లైట్లు ఆర్పేయాలి. అలాగే మంచం, పరుపు వంటివి సౌకర్యవంతంగా ఉండేవి ఎంచుకోవాలి. పిల్లలు, పెంపుడు జంతువులు నిద్ర మధ్యలో లేపకుండా చూసుకోవాలి.

* పగటినిద్ర వద్దు: పగటిపూట ఎక్కువసేపు నిద్రపోతే రాత్రుళ్లు నిద్రపట్టటం కష్టం. ఒకవేళ పగటిపూట కునుకుతీయాలనుకుంటే 10-30 నిమిషాల కన్నా ఎక్కువసేపు పడుకోకూడదు. అయితే రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవారు పగటిపూట తగినంత సేపు నిద్రపోయేలా చూసుకోవాలి. ఇలాంటివారు బయటి నుంచి ఎండ లోపలికి పడకుండా కిటికీలకు పరదాలు వేసుకోవాలి.

* వ్యాయామం: రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే త్వరగా నిద్రపట్టటానికే కాదు.. గాఢ నిద్రకూ దోహదం చేస్తుంది. అయితే కాసేపట్లో నిద్రపోతామనగా వ్యాయామం చేయరాదు. ఉదయం పూట వ్యాయామం చేయటం ఉత్తమం.

* ఒత్తిడికి దూరం: పని ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడీ నిద్రకు భంగం కలిగిస్తుంది. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలపై దృష్టి సారించటం మంచిది. చేయాల్సిన పనులను వర్గీకరించుకోవటం, ప్రాధామ్యాలను గుర్తించటం, లక్ష్యాలను నిర్దేశించుకోవటం వంటివి ప్రశాంతతకు బీజం వేస్తాయి. అవసరమైనప్పుడు తమకు తాముగానే పని నుంచి విశ్రాంతి తీసుకోవటం, స్నేహితులతో సరదాగా గడపటం వంటివి మేలు చేస్తాయి.

 • ===============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, July 11, 2011

మహిళల్లో సంతాన లేమి ముప్పు తెచ్చే అంశాలు,Factors effecting reproductivity in woman

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మహిళల్లో సంతాన లేమి ముప్పు తెచ్చే అంశాలు(Factors effecting reproductivity in woman)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...మహిళల్లో సంతానలేమికి ఎన్నో కారణాలున్నాయి. వీటిలో కొన్ని రకాల అంశాలు పరోక్షంగా ఈ సమస్యకు కారణమవుతాయి. అవి అండం, వీర్యం నాణ్యతను ప్రభావితం చేస్తాయి. వీటిలో చాలా అంశాలను నియంత్రించుకునే వీలుంది. ఇలా చేయడం ద్వారా సంతాన భాగ్యం పొందడం మాత్రమే గాకుండా మొత్తంమీద శరీర ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చుకోవచ్చు.

ప్రవర్తనకు సంబంధించినవి:
1.భోజనం, వ్యాయామం:
- ప్రత్యుత్పత్తి వ్యవస్థ పని తీరు సక్రమంగా ఉండాలంటే సరైన ఆహారంతో పాటు సరైన స్థాయిలో వ్యాయామం కూడా ఉం డాలి. బరువు ఎక్కువగా ఉన్నా, బరువు తక్కువ గా ఉన్నా కూడా గర్భం దాల్చడం కష్టమవుతుం ది. బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ) 18.5 నుంచి 25 వరకు ఉండడం మంచిది. శరీర బరువును (కిలోల్లో) రెట్టింపు చేసిన ఎత్తు (మీటర్లలో)తో భాగించడం ద్వారా బీఎంఐ తెలుసుకోవచ్చు.

2.ధూమపానం: మగవారు పొగ తాగడం వల్ల స్మెర్ప్‌ కౌంట్‌ తగ్గిపోయే అవకాశం ఉన్నట్లు అధ్య యనాల్లో తేలింది. అంతేగాకుండా గర్భస్రావం, నెలలు నిండకముందే
పుట్టడం, తక్కువ బరువు ఉన్న పిల్లలు పుట్టడం లాంటివి చోటు చేసు కు నేందుకు అవకాశాలు అధికం అవుతాయి. భా ర్యాభర్తల్లో ఎవరికి పొగ తాగే అలవాటు ఉన్నా సహజ / కృత్రిమ గర్భధారణ అవకాశాలను మూడింట ఒక వంతు తగ్గించే అవకాశముంది.

3. ఆల్కహాల్‌: మహిళలు మద్యం తీసుకోవడం గర్భస్థలోపాలతో శిశువులు పుట్టే అవకాశాన్ని అధికం చేస్తుంది. తల్లిరక్తంలో ఆల్కహాల్‌ సంబంధిత స్థాయి అధికంగా ఉంటే పుట్టిన శిశువుల్లో ఫీటల్‌ ఆల్కహాల్‌ సిండ్రోమ్‌ (ఎదుగుదలలో లోపాలు / ఇతరత్రా సమస్యలు) కు దారితీస్తుంది. ఆల్కహాల్‌ తీసుకోవడం మగ వారిలో స్పెర్మ్‌కౌంట్‌ను తగ్గిస్తుంది.

4. మాదకద్రవ్యాలు: మార్జువానా, అనబోలిక్‌ స్టెరాయిడ్స్‌ లాంటి వాటి వాడకం మగవారిలో స్పెర్మ్‌ కౌంట్‌ను తగ్గిస్తుంది. గర్భవతులు గనుక కొకైన్‌ను ఉప యోగిస్తే అది పుట్టబోయే శిశువుకు కిడ్నీ సమస్యలు కలిగిస్తుంది. గర్భం దాల్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో, గర్భవతిగా ఉన్న కాలంలో మాద ద్రవ్యాలు లాంటివాటికి దూరంగా ఉండాలి.

5. పర్యావరణం, వృత్తిపరమైన అంశాలు: పని చేసే చోట వివిధ విషతుల్యాల లకు, రసాయనాలకు గురి కావడం, చుట్టూ ఉండే వాతావరణం కూడా గర్భ ధారణపై ప్రభావం కనబరుస్తుంది. ఉత్పరివర్తనం, పుట్టుకతో లోపాలు, గర్భస్రావం, సంతానలేమిలకు కారణమయ్యే ఈ విషతుల్యాల్లాంటి వాటిని రిప్రొడక్టివ్‌ టాక్సిన్స్‌గా వ్యవహరిస్తుంటారు.

6. లెడ్‌: లెడ్‌ కలిగి ఉండే పదార్థాలు మను ష్యుల్లో ప్రత్యుత్పత్తిపై ప్రతికూల ప్రభావం కనబరుస్తాయని అధ్యయనాల్లో వెల్లడైంది. ఇది అసాధారణ వీర్యం ఉత్పత్తి అయ్యేం దుకు కారణమవుతుందని, ఫలితంగా గర్భస్రావాలు కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

7. వైద్య చికిత్సలు, ఉపకరణాలు: రేడియే షన్‌ (సాధారణ ఎక్స్‌రేలు మొదలుకొని కేమోథెరపీ వరకు)కు బాగా గురి కావడం వీర్య ఉత్పత్తిని మారుస్తుందని వెల్లడైంది. వివిధ గర్భాశయ సమస్యలకూ ఇది దారి తీస్తుంది.

8. ఇథలెన్‌ ఆకై్సడ్‌: సర్జికల్‌ ఉపకరణాల స్టెరిలైజేషన్‌లో, కొన్ని రకాల క్రిమి సంహారకాల తయారీలో ఇథలెన్‌ ఆకై్సడ్‌ను ఉపయోగిస్తారు. పుట్టుకతో లోపా లకు, అబార్షన్లకు ఇది కారణం కాగలదు.

9. డిబ్రొమొక్లోరోప్రొపేన్‌ (డీబీసీపీ): క్రిమిసంహారకాల్లో ఉండే డీబీసీపీ లాంటి వాటికి గురికావడం అండాశయ సమస్యలకు దారి తీయగలదు. త్వరిత మెనోపాజ్‌ లాంటి వివిధ రకాల ఆరోగ్యసమస్యలూ తలెత్తుతాయి. ఇవన్నీ కూడా సంతానోత్పత్తి శక్తిపై ప్రత్యక్ష ప్రభావం కనబరుస్తాయి.

ఈ అంశాలూ కీలకమే!
- ఓ మహిళ గర్భం దాల్చాలంటే అండం విడుదలయ్యే సమయంలో ఆ జంట కలుసుకోవాలి. అండం, వీర్యం ఉత్పత్తి స్థాయిలో గరిష్ఠస్థాయిలో ఉండాలి. మహిళ
శరీరంలో హార్మోన్ల సమతుల్యత ఉండాలి. కొంతమంది మహిళల్లో అండాశయాలు పరిపక్వం చెందవు. దీని వల్ల అండాలు విడుదల కావు. ఇలాంటి సందర్భాల్లో సింథటిక్‌ ఎఫ్‌ఎస్‌హెచ్‌ (ఇంజెక్షన్‌) లేదా క్లోమిడ్‌ (పిల్‌) ద్వారా తగు చికిత్సను అందించే అవకాశం ఉంది. ఎండోమెట్రియోసిస్‌ (గర్భాశాయనికి చెందిన కణజాలాన్ని పోలిన కణజాలం శరీరంలోని ఇతర భాగాల్లో వృద్ధి చెందడం) లేదా వివిధ రకాల ఇన్‌ఫెక్షన్‌ల వల్ల ఫాలోపియన్‌ ట్యూబ్‌లు (అండాలను గర్భాశయానికి రవాణా చేసేవి) దెబ్బ తినడం లాంటివి కూడా మహిళ సంతానోత్పత్తి శక్తిని ప్రభావితం చేస్తాయి.

మహిళల్లో సంతానలేమి: నిర్ధారణ పరీక్షలు
కొన్ని రకాల పరీక్షలు చేయడం ద్వారా మహిళల్లో సంతానలేమి సమస్యను గుర్తించవచ్చు. ఈ విధమైన పరీక్షలేంటో చూద్దాం.

 • ఇటీవలి కాలంలో సెర్వికల్‌ స్మియర్‌ టెస్ట్‌ చేయించుకోకపోయి ఉంటే ఆ టెస్ట్‌ చేయించుకోవాలి.
 • జర్మన్‌ మీజిల్స్‌ (రుబెల్లా) వ్యాధి నిర్ధారణ కోసం రక్తపరీక్ష చేయించుకోవాలి. గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో గనుక ఈ వ్యాధి సోకితే పుట్టబోయే బిడ్డకు హాని కలిగే అవకాశం ఉంది. రోగిని వైద్యుడు పరిక్షించడం ద్వారా--వ్యాధి విర్ధారణ ముఖ్యంగా రోగి వ్యాధి లక్షణాలు, కనిపించే రోగి చర్మము పై దద్దుర్లు (రాష్)ద్వారా చేస్తారు. వైరస్ వల్ల కలిగే అన్ని వ్యాధులలొ రాష మరియు జ్వరం కనిపిస్తుంది. మిగతా వైరల్ జ్వరాలనుండి మీజిల్స్ లేదా తట్టు ని పైన పేర్కొన్న ముఖ్యమైన లక్షణాల ద్వారా వేరు చేస్తారు. లాబ్ పరిక్షలు---రోగ పరిక్షించడం ద్వారా నిర్ధారణ రాక పోతే లాబ్ పరిక్షలు చేయవచ్చు.లాలాజలాన్ని వైరస్ పరిక్షకి పంపి తట్టు ఉందో లేదో నిర్థారిస్తారు. మీజిల్స్ వైరస్ దాడి చేత మానవ శరీరం వ్యాధి నిరోధక ఆంటీబాడీస్ తయారు చేస్తుంది. వాటిని రక్త పరీక్ష ద్వారా పరీక్షించి వ్యాధి ని నిర్థారించవచ్చు. ఈ వ్యాధి నిరోధకా ఆంటీబాడీస్ రెండు రకాలు IgM IgG. మీజిల్స్ IgM రక్తములొ కనిపిస్తే మీజిల్స్ ఉన్నట్లు అర్థం. అదే మీజిల్స్ IgG రక్తం లొ కనిపడితే పూర్వం మీజిల్స్ గ్రస్తమయ్యినట్లు లేదా పూర్వము మీజిల్స్ కి సంబంధించిన టీకా తిసుకొన్నట్లు అర్థము.
 • హార్మోన్ల సమతుల్యత ఎలా ఉందో తెలుసుకునేందుకు పీరియడ్స్‌ (బహిష్టు) సమయంలో రక్తపరీక్ష చేయించుకోవాలి. త్వరిత మెనోపాజ్‌ను గుర్తించేందు కు కూడా ఈ పరీక్ష తోడ్పడుతుంది. ఇతర హార్మోన్ల అసమతుల్యత లేదని నిర్ధా రించుకునేందుకు టీఎస్‌హెచ్‌ (థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌), పీఆర్‌ఎల్‌ (ప్రోలాక్టిన్‌) వంటి పరీక్షలు కూడా చేయించుకోవాలి. అప్పటికే రుతుచక్రం సరిగా లేకపోవడం, చర్మంపై వెంట్రుకలు అధికంగా పెరగడం లాంటి సమస్యలు ఉంటే తదుపరి హార్మోన్‌ సంబంధిత పరీక్షలు అవసరమవుతాయి.

 • వీడీఆర్‌ఎల్‌, హెచ్‌ఐవీ, హెచ్‌బీఎస్‌ఏజీ, హెచ్‌సీవీ లాంటి ఇన్‌ఫెక్షియస్‌ వ్యాధుల నిర్ధారణ కోసం భాగస్వాములిద్దరీకీ బేస్‌లైన్‌ వైరల్‌ పరీక్ష చేయించాల్సి ఉంటుంది. ఒక్కోసారి గర్భాశయం ఎండోమెట్రియల్‌ లైనింగ్‌ కణజాలం నమూనా సేకరించి విశ్లేషించాల్సి ఉంటుంది.

ఇతర పరీక్షలు
1. పెల్విక్‌ అల్ట్రాసౌండ్‌: రిప్రొడక్టివ్‌ ట్రాక్ట్‌ సంబంధిత కాన్‌జెనిటల్‌ అనమలీస్‌, యుటెరిన్‌ ఫైబ్రాయిడ్స్‌ (గర్భాశయ కంతులు), హైడ్రోసాల్‌పిన్స్‌ (ఏదేని ద్రవం లాంటి పదార్థంతో ఫా లోపియన్‌ ట్యూబు లు -బీజవాహికలు- మూసుకు పోవడం), ఓవరియన్‌ సిస్ట్‌‌స (అండాశయంలో దవంతో నిండిన కంతు లు లాంటివి), ఎండోమెట్రిమాస్‌, పోలిసిస్టిక్‌ ఓవరీస్‌ లాంటి వాటి నిర్ధారణకు ఈ పరీక్ష తోడ్పడుతుంది.

2. హిస్టెరొసాల్‌పింగోగ్రఫీ (హెచ్‌ఎస్‌జీ): యుటెరిన్‌ కేవిటీ, ఫాలోపియన్‌ ట్యూ బ్‌ (బీజవాహిక) ఓపెనింగ్‌ పరిస్థితిని అంచనా వేసేందుకు నేటికీ అత్యంత సాధారణంగా ఉపయోగిస్తున్న పరీక్ష హిస్టెరొసాల్‌పింగోగ్రఫీ (హెచ్‌ఎస్‌జీ). ఫైబ్రాయిడ్స్‌ (గర్భాశయ కంతులు), పోలిప్స్‌, సైనికె లాంటి యుటెరిన్‌ కేవిటీ లోపాలు ఈ పరీక్ష ద్వారా వెల్లడవుతాయి. బహిష్టు పూర్తయిన తరువాత ఈ పరీక్ష చేయించుకోవాలి. బహిష్టు నుంచి పరీక్ష జరిగే వరకు కూడా దంపతులు కలుసుకోకూడదు. గర్భం దాల్చడానికి
సంబంధించిన అంశాలు, లోపాలు కల సిపోకూడదని ఈ విధంగా సూచిస్తారు.

3. హిస్టెరోస్కోపీ: సెర్వికల్‌ కెనాల్‌, గర్భాశయాన్ని అత్యంత సన్నిహితంగా పరీక్షించేందుకు ఇది ఉపయోగపడుతుంది. సన్నటి, తేలికపాటి, సరళమైన ట్యూబ్‌ను ఈ పరీక్షకు ఉపయోగిస్తారు. వ్యాధినిర్ధారణ, చికిత్సను అందించే ఉపకరణంగా ఇది తోడ్పడుతుంది. లోకల్‌ అనస్తీషియా ఇచ్చి లేదా ఇవ్వకుండా కూడా ఈ పరీక్ష చేస్తారు.

కేవలం వ్యాధినిర్ధారణకు మాత్రమే అయితే లోకల్‌ అనస్తేషియా ఇవ్వకుండానే చేస్తారు. కంతులు లాంటి వాటిని తొలగించేందుకు లేదా నమూనా సేకరణకోసమైతే జనరల్‌ అనస్తీషియా ఇస్తారు.

4. లాప్రోస్కోపీ : జనరల్‌ అనస్తేషియా ద్వారా ఈ పరీక్షను నిర్వహిస్తారు. ట్యూ బల్‌ పేటెన్సీ, అడ్‌నెక్సల్‌ అడ్హెసన్స్‌, ఓవరియన్‌ మాస్‌ లాంటివి తెలుసుకునేం దుకు ఈ
పరీక్ష చేస్తారు. పరీక్ష సందర్భంగా బయటపడే చిన్న చిన్న లోపాలను (లైసిస్‌ ఆఫ్‌ అడ్‌హెసిన్స్‌, సాల్‌పింగెక్టో మీ, ఓవరియన్‌ సిస్టెక్టోమీ, కేటరైజేషన్‌ లేదా వెపరైజేషన్‌ ఆఫ్‌ ఎండో మెట్రి యాటిక్‌ ఇంప్లాంట్స్‌) అప్పటికప్పుడే సవ రించే అవకాశం కూడా ఉంది.

డా.దుర్గ -- మెడికల్ డైరెక్టర్ -ఒయాసిస్ సెంటర్ ఫర్ రిప్రొడక్టివ్ మెడిసిన్‌ - హైదరాబాద్ .
 • =====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

గర్భస్థ శిశువుల్లోని గుండెలో రంధ్రాలు,Septal Defects in Babiesఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -గర్భస్థ శిశువుల్లోని గుండెలో రంధ్రాలు(Septal Defects in Babies)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...చిన్న పిల్ల గుండెలో ఏర్పడే రంధ్రాలను సెప్టల్‌ డిఫెక్ట్స్‌ అంటారు. పైన ఉండే కర్నికల మధ్య ఉండే రంధ్రాల్ని ఏట్రియల్‌ సెప్టల్‌ డిఫెక్ట్స్‌ అని, కింద ఉండే రెండు గదులను జఠిరికలు అంటారు. వీటిలో ఉండే రంధ్రాలను వెంట్రిక్యులార్‌ సెప్టల్‌ డిఫెక్ట్స్‌ అంటారు. గర్భంలో ఉన్నప్పుడు గుండె మొదటి నాలుగు నుంచి ఎనిమిది వారాల్లో తయారవుతుంది. నాలుగు గదులు ఏర్పడటం.. రక్తనాళాలు అభివృద్ధి చెందడం.. గదుల మధ్య గోడలు ఏర్పడటం ..అన్నీ నాలుగు నుంచి ఎనిమిది వారాల్లో జరుగుతుంది. ఎనిమిది నుంచి 12 వారాల్లో మిగిలిన రక్తనాళాల విభజన పూర్తిగా జరుగుతుంది. కవాటాల మధ్య గోడ పూర్తిగా కలిసి, నాలుగు గదులు ఏర్పడతాయి. ఈ సమయంలో గర్భిణి స్త్రీకి, గర్భస్థ శిశువుకు అనారోగ్య సమస్య, జన్యుపరమైన సమస్య కలిగినప్పుడు గుండెలో రంధ్రాలు ఏర్పడతాయి. జన్యులోపాలు కలగడం, మేనరికపు పెళ్లీల వల్ల కలిగే షేరింగ్‌ ఆఫ్‌ జీన్స్‌ వల్ల మ్యూటేషన్లు ఏర్పడతాయి. మొదటి శిశువు, 30 ఏళ్ల తర్వాత పుట్టే పిల్లల్లో ఒక్కోసారి 'డౌన్‌ సిండ్రోం' కనిపిస్తుంది. మనం తినే పోషక పదార్థాలలో ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌-బి12 చాలా ముఖ్యమైనవి. ఈ ఫోలిక్‌యాసిడ్‌, విటమిన్‌-బి12 మన రాష్ట్రంలో తీసుకోవడం చాలా తక్కువ. మనం తినే బియ్యాన్ని డబుల్‌ పాలిష్‌ చేస్తుంటారు. దీని వల్ల బియ్యంపైన ఉండే బి-కాంప్లెక్స్‌ కోటింగ్‌ వెళ్లిపోతుంది. కొన్ని పళ్లు, కూరగాయల్లో ఫోలిక్‌ యాసిడ్‌ ఉంటుంది. కానీ ఇప్పుడు పెరిగిన ధరల వల్ల పళ్లు కొనడానికి ఎవరూ సాహసించడం లేదు. ఈ పోషకాలు సరైన పద్ధతిలో అందక పిండం వృద్ధి చెందడం లేదు. దీని వల్ల గుండెలో రంధ్రాలు ఏర్పడుతున్నాయి. గర్భిణులు పొలాల్లో పనిచేసేటప్పుడు క్రిమి రసాయన మందులకు ప్రభావితం అవడం, వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల వల్ల, రుబెల్ల వైరస్‌ వల్ల, పాసివ్‌ స్మోకింగ్‌ వల్ల గర్భస్థ శిశువుల్లోని గుండెలో రంధ్రాలు ఏర్పడతాయి.

ఎలా గుర్తిస్తారు ?

గుండెలో రంధ్రాలు ఉన్నాయని ఐదు లక్షణాల ద్వారా గుర్తించొచ్చు. అవి....వెంట్రిక్యులార్‌ సెప్టాల్‌ డిఫెక్ట్‌ ఉండే పిల్లలు ఎప్పుడూ రొప్పుతూ ఉంటారు. ఊపిరితిత్తుల్లో గాలి సరిగ్గా పోనట్టు డొక్కలు ఎగిరేస్తారు. దీన్నే రెస్పిరేటరీ డిస్‌ట్రస్‌ అంటాం. డొక్కలెగిరేయడం గుండెకు సంబంధించిన సమస్యగా ఉండొచ్చు. గుండెలో రంధ్రాలు ఉన్నప్పుడు ఊపిరితిత్తుల్లో చాలా ఎక్కువ రక్తం పోతుంది. ఒక డ్యాం తెగి వరదలు ఏ విధంగా వస్తాయో అలాగే ఊపిరితిత్తులకు ఎక్కువ రక్తం వెళ్లి ఊపిరితిత్తులు తడిగా అవుతాయి. అందువల్ల ఎక్కువ రొప్పుతారు. తల్లిపాలు తాగలేరు. మొదటి బిడ్డతో పోలిస్తే రెండో బిడ్డ చాలా ఎక్కువసేపు తాగడం, కొంచెం కొంచెం తాగడం, కొంచెం తాగగానే ఆయాసం రావడం, పాలు తాగలేకపోవడం, తాగేటప్పుడుపొరపోవడం, కొంచెం తాగగానే నిద్రపోవడం... వీటిన్నంటినీ కలిపి ఫీీడింగ్‌ డిఫికల్టీస్‌ అంటారు. బిడ్డ పాలు తాగకపోవడం వల్ల ఎదుగుదల సరిగ్గా ఉండదు. ఒక్కోసారి ఎన్ని పాలిచ్చినా పాపలో ఎదుగుదల ఉండదు. ఆరు నెలలు వయసులో ఉండాల్సిన బరువు మిగతా పిల్లలతో పోలిస్తే సగం కంటే ఇంకా తక్కువుంటుంది. కొన్నిసందర్భాల్లో పాలు తాగేటప్పుడు పాపకు చాలా విపరీతంగా చెమటలు పడతాయి. దీని అర్థం హార్ట్‌ ఫెయిల్యూర్‌ అని. ఒక్కోసారి అరుదుగా ఊపిరితిత్తుల్లో నెమ్ము రావడం జరుగుతుంది. నెలకు రెండు సార్లు, మూడు నెలలకు మూడు, నాలుగు సార్లు నిమోనియా రావడం. ఈ లక్షణాలన్నీ పోలిస్తే పాపకు గుండెలో రంధ్రాలున్నాయని తెలుస్తుంది.

రుబెల్లా ఒక కారణం మాత్రమే

రుబెల్లా ఎంఎంఆర్‌ అనే వ్యాక్సిన్‌ ప్రతి ఒక్కరికి చిన్న వయసులో వేస్తారు. 9 నెలల నుంచి వేస్తారు. అందరికీ వేయాలి. ఇవ్వకుంటే రుబెల్లా సిండ్రోంతో పుట్టే బేబీస్‌లో బ్లైండ్‌నెస్‌, మెంటల్‌ రిటార్డ్‌నెస్‌, గుండెలో రంధ్రాలు రావడం, వాల్వ్‌బ్లాక్స్‌ ఏర్పడే అవకాశముంది. అందుకని కచ్చితంగా అమ్మాయిలకు తప్పనిసరిగా రుబెల్లా వ్యాక్సిన్‌ ఇప్పించాలి. పిల్లల్లో గుండె రంధ్రాలకు రుబెల్లా ఒక కారణం మాత్రమే. చాలా వరకు తెలియని కారణాలు ఉంటాయి.

అన్ని రంధ్రాలు మూసుకుపోవు

గుండెలో రంధ్రం దానికదే మూసుకుపోతుంది, మందులతో నయం అవుతుందనే అపోహ చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంది. అయితే అన్ని రంధ్రాలు మూసుకుపోవు. మీకో ఉదాహరణ చెబుతాను. వారం కిందట ఒక పాపను తీసుకొచ్చారు. పాప వయసు ఇప్పుడు ఎనిమిదేళ్లు. చిన్నప్పుడు గుండెలో రంధ్రాలున్నాయని డాక్టర్లు చెప్పారు. మందులిచ్చారు. ఆయాసం తగ్గింది గుండెలో రంధ్రాలు తగ్గాయని తల్లిదండ్రులు అనుకున్నారు. డాక్టర్‌ కూడా అనుకున్నారు. రంధ్రం మూసుకోలేదు. ఇప్పుడు చెడు రక్తం వచ్చి మంచి రక్తంలో కలుస్తోంది. పాప మూర్చ తిరిగి పడిపోతున్నది. దానికి కారణం ఊపిరితిత్తుల్లో ఒత్తిడి బాగా పెరిగి, కార్డియాక్‌ అవుట్‌పుట్‌ మెయింటేన్‌ కాకపోవడం. గుండెలో రంధ్రాలు సహజంగా మూసుకుంటాయని చాలావరకు అనుకుంటారు. కానీ కేవలం 60 శాతం మాత్రమే మూసుకుంటాయి. ఒక సారి గుండెలో రంధ్రం ఉందని తెలిస్తే కచ్చితంగా నిర్ధారణ చేయాలి. అది మూసుకునే వరకు డాక్టర్‌ పర్యవేక్షణలో ఉండాలి.

ఆధునిక చికిత్స

లక్షణాలు కనుక్కుని పాపను స్థానిక డాక్టర్‌ పరీక్షిస్తే గుండె నుంచి శబ్దాలు వస్తాయి. వీటిని మర్మర్స్‌ అంటారు. అప్పుడు పిల్లల హృద్రోగ నిపుణులను సంప్రదిస్తారు. మర్మర్స్‌ను బట్టి గుండెలో రంధ్రాలు ఉన్నాయని ఒక అవగాహనకు వస్తారు. తర్వాత ఎక్స్‌రే, ఇసిజి, స్కానింగ్‌ కచ్చితంగా తీస్తారు. స్కానింగ్‌ అల్ట్రాసౌండ్‌ తరంగాలు గుండెకు పంపించి ఆ గుండెను ఎకోమిషన్‌లో చూస్తారు. గుండె పనితీరు ఎలా ఉంది? గుండెలో ఎన్ని రంధ్రాలున్నాయి? అవి పెద్దవా? చిన్నవా? చిన్న రంధ్రాలు అయితే వాటికవే మూసుకుపోతాయా? మూసుకుపోయే శక్తి ఉందా? అనే అంశాలు గమనించి విశ్లేషిస్తాం. ఒక వేళ పుట్టగానే పెద్ద రంధ్రాలు ఉంటే ముందుగా కొన్ని మందులు ఇచ్చి హార్ట్‌ఫెయిల్యూర్‌ని నియంత్రిస్తారు. మందులిచ్చినా హార్ట్‌ఫెయిల్యూర్‌ నియంత్రణ కాకుండా, పాప పాలు తాగకున్నా ఊపిరితిత్తుల్లో నెమ్ము వస్తే మూడు నెలలు వయసులోనే రంధ్రాలను ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ ద్వారా సరిచేస్తారు. దీని ద్వారా రంధ్రాలు మూస్తారు. ఒక్కోసారి రంధ్రాలు మధ్యస్థంగా ఉన్నప్పుడు 10, 12 నెలలు తర్వాత వీటిని గుర్తిస్తే ఆపరేషన్‌ లేకుండా తొడలోని రక్తనాళం నుంచి క్యాథటర్‌ ద్వారా రంధ్రాలను క్లోజ్‌ చేస్తారు. దీన్నే 'అంబ్రెల్లా థెరప'ీ అంటారు. ఇది గొడుగును పోలి ఉంటుంది.ఇది మన దేశంలో రెండేళ్లుగా చేస్తున్నారు. ఈ ప్రక్రియలో కొత్త మార్పులు వస్తున్నాయి. పరిశోధన ద్వారా కొత్త పరికరాలు కనుగొంటున్నారు. 6 నెలల వయసు నుంచి ఈ ప్రక్రియ ద్వారా గుండెలో రంధ్రాలు మూసెయ్యవచ్చు. 'అంబ్రెల్లా' పరికరాన్ని నిటినాల్‌ మెటిరీయల్‌తో తయారు చేస్తారు. క్యాథటర్‌ ద్వారా గుండెలోకి తీసుకెళ్లి రంధ్రం ఎక్కడుందో ఎకో కార్డియోగ్రాం, యాంజి కార్డియోగ్రాం ద్వారా చూస్తూ రంధ్రంలో అమరుస్తారు. అప్పుడు మంచి రక్తం వచ్చి చెడు రక్తంలో కలవడం తగ్గుతుంది. ఈ ప్రక్రియ గంట సమయంలో చేయచ్చు. ఉదయం అడ్మిట్‌ అయితే తర్వాత రోజు డిశ్చార్జి చేస్తారు. దీని వల్ల దుష్ఫ్రభావాలు చాలా తక్కువ. ఈ మధ్య కాలంలో అంబ్రెల్లా విధానం అభివృద్ధి వల్ల ఆపరేషన్‌కు ఎంత ఖర్చు అవుతుందో అంబ్రెల్లాకు కూడా అంతే ఖర్చు అవుతోంది. అంబ్రెల్లా పద్ధతిలో కాంప్లికేషన్‌ రేటు తక్కువ. ఆపరేషన్‌లో కాంప్లికేషన్‌ రేటు ఎక్కువ. ఎవరికైనా రంధ్రాలు ఉండి అంబ్రెల్లా పద్ధతి సరిపోతుందని నిర్ధారిస్తే ఈ పద్ధతే మేలని ప్రపంచ వ్యాప్తంగా వైద్యనిపుణులు సిఫార్సు చేస్తున్నారు.


డా|| నాగేశ్వరరావు కోనేటి--చిన్న పిల్లల గుండె వైద్యనిపుణులు--కేర్‌ హాస్పిటల్‌, బంజారాహిల్స్‌,--హైదరాబాద్‌.
 • ===================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, July 9, 2011

Knee joint pain , మోకాలినొప్పిఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Knee joint pain , మోకాలినొప్పి- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
మోకాలు ఒక అద్భుతమైన అమరిక. శరీరం బరువును ఎక్కువగా తీసుకుని మనిషి నిలబడటానికి అవసరమైన అవయవం. అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం కూడా. రోజువారీ కార్యక్రమాల్లో మనకు తెలియకుండానే దాన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తుంటాం. శరీరం బరువులో అత్యధిక భాగం దానిపై పడటం, విచక్షణ రహితంగా దాన్ని ఉపయోగించడం వల్ల దానిపై పడే భారం కూడా ఎక్కువే. ఇటీవల పెరుగుతున్న స్థూలకాయం, బహుళ అంతస్తులలో నివాసం, ఎగుడుదిగుడు ప్రాంతాల్లో నడక వంటి కారణాలతో మోకాలిలో నొప్పి సమస్య పెరుగుతోంది. మోకాలి సమస్యలకు కారణాలు, వాటి నివారణకు అవసరమైన చర్యలను తెలుసుకుందాం .

సాధారణంగా మోకాలినొప్పి అనగానే వయసును బట్టి ఆ సమస్యను విశ్లేషించాలి. మోకాలి నొప్పికి వేరు వేరు వయసుల్లో వేర్వేరు అంశాలు కారణమవుతాయి.

కారణాలు: మోకాలి నొప్పులకు పిల్లల్లో, పెద్దల్లో కారణాలు వేరుగా ఉండవచ్చు.

చిన్నవారిలో--మూడు నుంచి పదిహేనేళ్ల వరకు పిల్లల్లో మోకాలి నొప్పికి ఇవీ కారణాలు…

పటెల్లార్ సబ్‌లాక్సేషన్(patellar sublaxation): దీన్నే పటెల్లార్ డిజ్‌లొకేషన్‌గా కూడా చెప్పవచ్చు. మోకాలిచిప్పను పటెల్లా అంటారు. చాలామంది చిన్నపిల్లలు మోకాలి చిప్పను అటూ, ఇటూ జరపడం చూస్తుంటాం. ఇలాంటప్పుడు ఒక్కోసారి మోకాలి ఎముక స్థానభ్రంశం చెందుతుంది. కొన్ని సందర్భాల్లో మోకాలికి బలమైన గాయం తగలడం వల్ల కూడా ఈ మోకాలి చిప్ప తన స్థానం నుంచి తొలగిపోతుంది. దీనితో నొప్పి రావచ్చు.

టిబియల్ అపోఫైసిటిస్(Tibial Apophysities): చాలా చురుగ్గా ఆటలాడే పిల్లల్లో, వేగంగా పరుగెత్తే పిల్లల్లో మోకాలికి ముందు భాగంలో నొప్పి వస్తుంది. మోకాలి చిప్ప కంటే కిందన, కాలి కండరం మోకాలికి అంటుకునే ప్రాంతంలో ఈ నొప్పి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దీనికి నిర్దిష్టంగా కారణం తెలియదు.

జంపర్స్ నీ(Jumper knee): ఈ సమస్య కూడా ఇంచుమించు టిబియల్ అపోఫైసిటిస్‌లాగే ఉంటుంది. చాలా చురుగ్గా ఆటలాడే పిల్లల్లోనే ఇది వస్తుంటుంది. సాధారణంగా లాంగ్‌జంప్ చేసే ఆటగాళ్లలో ఈ తరహా నొప్పి ఎక్కువ. ఇది కూడా మోకాలిచిప్ప ఎముక స్థానభ్రంశం వల్లనే వస్తుందిగానీ, ఈ నొప్పి మోకాలి ముందుభాగంలో ఉంటుంది.

రిఫర్‌డ్ పెయిన్(Reffered pain): తొడ ఎముక తుంటి దగ్గర కలిసే ప్రదేశం (గ్రోత్ ప్లేట్)లో ఎముకలు స్థానభ్రంశం కావడం వల్ల ఈ నొప్పి వస్తుంది. సాధారణంగా కాస్త స్థూలకాయం ఉండే పిల్లల్లో ఇది ఎక్కువ. ఆడపిల్లల్లో కంటే మగపిల్లల్లో ఈ నొప్పి ఎక్కువగా కనిపిస్తుంది. నొప్పి వస్తుండటంతో పిల్లలు మోకాలిపై భారం పడకుండా నడిచే ప్రయత్నం చేస్తుంటారు. దాంతో కుంటుతున్నట్లుగా కనిపిస్తుంటారు. సమస్య తొడ ఎముక తుంటి వద్ద కలిసే ప్రదేశంలో వచ్చినా ఈ నొప్పి మాత్రం మోకాలి వద్ద ఉంటుంది. అందుకే దీన్ని రిఫర్‌డ్ పెయిన్ అంటారు.

ఆస్టియోకాండ్రయిటిస్(Osteo chondritis): ఎముకల్లోని మృదులాస్థి (కార్టిలేజ్)లో పగుళ్ల కారణంగా ఈ నొప్పి వస్తుంది. దీనికి పోషకాహారం లోపం కూడా ఒక కారణం. ఇక మితిమీరి ఆటలాడే పిల్లల్లోనూ ఇది కనిపిస్తుంది.

యువకులు, పెద్దవారిలో
సాధారణంగా పిల్లలు, వృద్ధులతో పోల్చి చూస్తే యుక్తవయస్కులు మొదలు పెద్దవారి వరకు మోకాలి నొప్పికి కారణాలు వేర్వేరుగా ఉంటాయి.

పటెల్లో ఫీమోరల్ పెయిన్ సిండ్రోమ్(patella-Femoral pain syndrome): ఇది ఒకరకంగా చూస్తే పెద్దల్లో వచ్చే ఆస్టియోకాండ్రయిటిస్ అనుకోవచ్చు. దీనిలో మోకాలి ముందు భాగంలో ఈనొప్పి వస్తుంది.

మీడియల్ ప్లైకా(Medial plica): ఇది పుట్టుకతో (కంజెనిటల్) వచ్చే సమస్య. మోకాలిలో ఉండే కండరాలు బిగుసుకుపోవడం వల్ల ఈ నొప్పి వస్తుంది.

పీస్ అన్సిరైటిస్ బర్సైటిస్(Pes anserine bursitis): ఈ సమస్యలో మోకాలి కింది భాగంలో లోపలివైపున నొప్పి ఉంటుంది. దీనికి ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల సమతౌల్యంలో తేడాలు (ఎండోక్రైనల్ డిజార్డర్స్) కారణాలు. ఎక్కువగా ఆటలాడటం కూడా ఈ సమస్యకు ఒక కారణమే.

మెనిస్కల్ టేర్(Meniscal tear): మోకాలి ఎముకలో ఒక కుషన్ లాంటిది ఉంటుంది. ఈ కుషన్ చిరిగిపోవడం వల్ల వచ్చే సమస్యను మెనిస్కల్ టేర్ అంటారు. ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్ ఆటలు ఆడేవారిలో, జిమ్నాస్టిక్స్ చేసేవారిలో ఈ తరహా సమస్య ఎక్కువ.

మైక్రో ట్రామా(Micro Trauma): అదేపనిగా ఒకే చోట గాయం కావడం, ఆ గాయంపై మాటిమాటికీ ఒత్తిడి పడి నొప్పి తిరగబెట్టడం వల్ల ఈ నొప్పి వస్తుంది. మోకాలు తిప్పడం వల్ల కూడా ఈ నొప్పి రావచ్చు.

యాంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్ సమస్య(Anterior crucial ligament problem): ఎముకనూ కండరాన్నీ కలిపే నిర్మాణాన్ని లిగమెంట్ అంటారు. యాంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్ మోకాలికి స్థిరంగా ఉండేలా దోహదపడుతుంది. ఆటల్లో లేదా

వృద్ధుల్లో--ప్రమాదాల్లో గాయపడటం వల్ల ఈ లిగమెంట్ దెబ్బతిని ఈ తరహా నొప్పి వస్తుంది.
చిన్నపిల్లల్లో, యుక్తవయస్కుల్లో ఉండే కారణాల కంటే కాలక్రమంలో ఎముకల అరుగుదల వల్లనే ఈ వయసువారిలో మోకాలినొప్పి సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది.

అర్థరైటిస్: ఎముకల అరుగుదల వల్ల వచ్చే మోకాలి నొప్పి ఇది.

క్రిస్టల్ ఇండ్యూస్‌డ్ ఇన్‌ఫ్లమేటరీ ఆర్థోపతి:రక్తంలో యూరిక్‌యాసిడ్ మోకాలి చిప్ప ప్రాంతంలో తయారవుతుంది. మోకాలిచిప్ప దగ్గర ఈ రాళ్లు కంకరలా అడ్డుపడుతుండటం వల్ల ఎముక ఒరుసుకుపోయి ఈ నొప్పి వస్తుంది.

గౌట్ : ఈ సమస్య కూడా రక్తంలో యూరిక్ యాసిడ్ పాళ్లు పెరగడం వల్లనే వస్తుంది. అయితే రాళ్లు ఏర్పడటం కాకుండా కండరాలు బిగుసుకుపోయి నొప్పి, మంట (ఇన్‌ఫ్లమేటరీ కండిషన్స్) వల్ల ఈ నొప్పి వస్తుంది.

సూడో గౌట్ : దీనిలోనూ గౌట్ వ్యాధిలో ఉండే లక్షణాలే కనిపిస్తుంటాయి. కానీ… రక్తపరీక్షలో మాత్రం యూరిక్ యాసిడ్ పాళ్లు పెరిగినట్లుగా ఉండదు. ఆ పరీక్షలో నార్మల్‌గా ఉంటుంది. అయితే దీనికి కూడా గౌట్ వ్యాధికి ఉపయోగించే మందులే వాడతారు.

పాప్లీటియర్ సిస్ట్స్: కండరాల మధ్య వచ్చే నీటి బుడగల వల్ల వచ్చే నొప్పి ఇది. మోకాలి కింది భాగంలో ఈ నొప్పి వస్తుంది. ఇన్ఫెక్షన్ ఉండటం వల్లకూడా ఇది రావచ్చు.

మోకాలి నొప్పి కంటిన్యువస్‌గా వారం రోజులకు పైనే కొనసాగుతూ ఉంటే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. సమస్యను బట్టి నిపుణులు చికిత్స చేస్తారు. ఒకవేళ పెద్ద వయసువారిలో అయితే అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స, మోకాలి మార్పిడి ఆపరేషన్ అవసరం కావచ్చు.

అది మోకాలిపైన తొడ ఎముక (ఫీమర్), కాలి ఎముక (టిబియా)లు కలిసే ప్రాంతంలో ఉండి పైన మోకాలి చిప్ప (పటెల్లా) అనేక ఎముకలతో సంక్లిష్టమైన కండరాల బంధంతో ఉంటుంది. నిర్మాణంలో సంక్లిష్టతలు ఎక్కువ కాబట్టి అక్కడి నొప్పి ఎప్పుడూ అలక్ష్యం కూడదు.

నివారణ ఇలా…

ఏదైనా పని మొదలు పెట్టే ముందర అకస్మాత్తుగా మోకాలిని కదిలించవద్దు. గబుక్కున లేవడం / కూర్చోవడం చేయవద్దు.

జాగింగ్ లేదా రన్నింగ్ చేసే ముందు కాసేపు నడవండి.

సమతలంగా ఉండే ప్రదేశంలోనే జాగింగ్‌గానీ, రన్నింగ్‌గానీ చేయండి. ఎగుడుదిగుడుగా ఉండే ప్రాంతాల్లో వద్దు.

మట్టి మృదువుగా ఉండే ప్రాంతంలోనే వాకింగ్, జాగింగ్ చేయాలి. కఠినంగా ఉండే బండల (హార్డ్ సర్ఫేస్)పై అలాంటి వ్యాయామాలు చేయడం సరికాదు.

వ్యాయామం చేసే ముందర తగినంత వార్మప్ చేయండి.

మోకాళ్లకు శ్రమ కలిగించే వృత్తుల్లో ఉన్నవారు, దానికి తగినంత విశ్రాంతిని ఇవ్వడం కూడా అవసరం. మోకాళ్లు మడిచి కూర్చోవడం సాధ్యమైనంతగా తగ్గించండి.

కాలికి సౌకర్యంగా ఉండే పాదరక్షణలను ధరించండి. మహిళలు అయితే ఎక్కువగా హీల్ ఉండే పాదరక్షలను వేసుకోకపోవడమే మంచిది. మీ బరువును ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోండి. బరువు పెరుగుతున్నకొద్దీ మోకాలిపై భారం పెరుగుతుంటుందని గుర్తుంచుకోండి

చికిత్స : కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది .
నొప్పి తగ్గడానికి :
Aceclofenac 100 mg 3 time / day ,లేదా
Diclofenac 50 mg 3 times / day ,లేదా
Brufen 400 mg 2-3 time /day , తీసుకోవాలి .


మోకాళ్ల నొప్పులు స్త్రీలకే ఎక్కువెందుకు?
మోకాళ్ల నొప్పులతో బాధపడేవారిలో 90 శాతం మంది స్త్రీలే. అయితే మనదేశంలో చాలామంది మహిళలు నొప్పిని పట్టించుకోకుండా తిరుగుతుండటంతో తొలిదశలోనే చికిత్స తీసుకోవటం సాధ్యం కావటం లేదు. పైగా వయసుతో పాటే కీళ్ల నొప్పులూ వస్తాయని, వీటిని తప్పించుకోవటం అసాధ్యమనీ భావిస్తుంటారు. మెనోపాజ్‌ కూడా ఆ సమయంలోనే మొదలై ఎముకలు గుళ్ల బారటం ఎక్కువవుతుంది. ఇలాంటి సమస్యలెన్నో మోకాళ్ల నొప్పులను మరింత తీవ్రం చేస్తున్నాయి. అంతేకాదు శరీర నిర్మాణ పరంగానూ చిక్కులు ఎదురవుతున్నాయి.

* స్త్రీలకు తుంటి భాగం విశాలంగా ఉండటంతో కీలు దగ్గర తుంటి ఎముక లోనికి వంగి ఉంటుంది. దీంతో మోకాలుపై ఎక్కువగా ఒత్తిడి పడుతుంది. మోకాలి చిప్ప మృదులాస్థిని ఒరుసుకుంటూ పక్కలకు కదులుతుంది. తుంటి విశాలంగా ఉండటం వల్ల తొడ కండరాలు సాగి మోకాలి కండర బంధనాల్లో నొప్పి కలగజేస్తుంది.

* పురుషులతో పోలిస్తే స్త్రీలల్లో కండ శాతమూ తక్కువే. అందువల్ల వీరి మోకాళ్లకు కండరం దన్ను కూడా అంతగా ఉండదు. అలాగే స్త్రీలల్లో వదులుగా ఉండే కండరం ఎక్కువగా ఉంటుంది. ఇది త్వరగా గాయాల బారినపడేలా చేస్తుంది.

* మోకాలి కండర బంధనాలు కూడా వీరిలో చిన్నగా ఉంటాయి. దీంతో కీలు స్థిరంగా ఉండటమూ తగ్గుతుంది.

* సాధారణంగా కాన్పు తర్వాత స్త్రీలు బరువు పెరుగుతారు. ఒక కిలో బరువు పెరిగినా మోకాలు మీద అంతకు ఆరు రెట్ల భారం పడుతుంది. స్థూలకాయుల్లో తుంటి వద్ద కొవ్వు పేరుకుపోవటం వల్ల ఆ భాగం విశాలమై మోకాళ్ల మీద అదనపు ఒత్తిడి పడుతుంది.

* మెనోపాజ్‌ తర్వాత ఎముకలు గుళ్ల బారటం మోకాళ్ల నొప్పికి ప్రధానంగా దోహదం చేస్తుంది.

 • ===================================
Visit my website - > Dr.Seshagirirao.com/