Monday, July 11, 2011

మహిళల్లో సంతాన లేమి ముప్పు తెచ్చే అంశాలు,Factors effecting reproductivity in woman

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మహిళల్లో సంతాన లేమి ముప్పు తెచ్చే అంశాలు(Factors effecting reproductivity in woman)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...మహిళల్లో సంతానలేమికి ఎన్నో కారణాలున్నాయి. వీటిలో కొన్ని రకాల అంశాలు పరోక్షంగా ఈ సమస్యకు కారణమవుతాయి. అవి అండం, వీర్యం నాణ్యతను ప్రభావితం చేస్తాయి. వీటిలో చాలా అంశాలను నియంత్రించుకునే వీలుంది. ఇలా చేయడం ద్వారా సంతాన భాగ్యం పొందడం మాత్రమే గాకుండా మొత్తంమీద శరీర ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చుకోవచ్చు.

ప్రవర్తనకు సంబంధించినవి:
1.భోజనం, వ్యాయామం:
- ప్రత్యుత్పత్తి వ్యవస్థ పని తీరు సక్రమంగా ఉండాలంటే సరైన ఆహారంతో పాటు సరైన స్థాయిలో వ్యాయామం కూడా ఉం డాలి. బరువు ఎక్కువగా ఉన్నా, బరువు తక్కువ గా ఉన్నా కూడా గర్భం దాల్చడం కష్టమవుతుం ది. బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ) 18.5 నుంచి 25 వరకు ఉండడం మంచిది. శరీర బరువును (కిలోల్లో) రెట్టింపు చేసిన ఎత్తు (మీటర్లలో)తో భాగించడం ద్వారా బీఎంఐ తెలుసుకోవచ్చు.

2.ధూమపానం: మగవారు పొగ తాగడం వల్ల స్మెర్ప్‌ కౌంట్‌ తగ్గిపోయే అవకాశం ఉన్నట్లు అధ్య యనాల్లో తేలింది. అంతేగాకుండా గర్భస్రావం, నెలలు నిండకముందే
పుట్టడం, తక్కువ బరువు ఉన్న పిల్లలు పుట్టడం లాంటివి చోటు చేసు కు నేందుకు అవకాశాలు అధికం అవుతాయి. భా ర్యాభర్తల్లో ఎవరికి పొగ తాగే అలవాటు ఉన్నా సహజ / కృత్రిమ గర్భధారణ అవకాశాలను మూడింట ఒక వంతు తగ్గించే అవకాశముంది.

3. ఆల్కహాల్‌: మహిళలు మద్యం తీసుకోవడం గర్భస్థలోపాలతో శిశువులు పుట్టే అవకాశాన్ని అధికం చేస్తుంది. తల్లిరక్తంలో ఆల్కహాల్‌ సంబంధిత స్థాయి అధికంగా ఉంటే పుట్టిన శిశువుల్లో ఫీటల్‌ ఆల్కహాల్‌ సిండ్రోమ్‌ (ఎదుగుదలలో లోపాలు / ఇతరత్రా సమస్యలు) కు దారితీస్తుంది. ఆల్కహాల్‌ తీసుకోవడం మగ వారిలో స్పెర్మ్‌కౌంట్‌ను తగ్గిస్తుంది.

4. మాదకద్రవ్యాలు: మార్జువానా, అనబోలిక్‌ స్టెరాయిడ్స్‌ లాంటి వాటి వాడకం మగవారిలో స్పెర్మ్‌ కౌంట్‌ను తగ్గిస్తుంది. గర్భవతులు గనుక కొకైన్‌ను ఉప యోగిస్తే అది పుట్టబోయే శిశువుకు కిడ్నీ సమస్యలు కలిగిస్తుంది. గర్భం దాల్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో, గర్భవతిగా ఉన్న కాలంలో మాద ద్రవ్యాలు లాంటివాటికి దూరంగా ఉండాలి.

5. పర్యావరణం, వృత్తిపరమైన అంశాలు: పని చేసే చోట వివిధ విషతుల్యాల లకు, రసాయనాలకు గురి కావడం, చుట్టూ ఉండే వాతావరణం కూడా గర్భ ధారణపై ప్రభావం కనబరుస్తుంది. ఉత్పరివర్తనం, పుట్టుకతో లోపాలు, గర్భస్రావం, సంతానలేమిలకు కారణమయ్యే ఈ విషతుల్యాల్లాంటి వాటిని రిప్రొడక్టివ్‌ టాక్సిన్స్‌గా వ్యవహరిస్తుంటారు.

6. లెడ్‌: లెడ్‌ కలిగి ఉండే పదార్థాలు మను ష్యుల్లో ప్రత్యుత్పత్తిపై ప్రతికూల ప్రభావం కనబరుస్తాయని అధ్యయనాల్లో వెల్లడైంది. ఇది అసాధారణ వీర్యం ఉత్పత్తి అయ్యేం దుకు కారణమవుతుందని, ఫలితంగా గర్భస్రావాలు కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

7. వైద్య చికిత్సలు, ఉపకరణాలు: రేడియే షన్‌ (సాధారణ ఎక్స్‌రేలు మొదలుకొని కేమోథెరపీ వరకు)కు బాగా గురి కావడం వీర్య ఉత్పత్తిని మారుస్తుందని వెల్లడైంది. వివిధ గర్భాశయ సమస్యలకూ ఇది దారి తీస్తుంది.

8. ఇథలెన్‌ ఆకై్సడ్‌: సర్జికల్‌ ఉపకరణాల స్టెరిలైజేషన్‌లో, కొన్ని రకాల క్రిమి సంహారకాల తయారీలో ఇథలెన్‌ ఆకై్సడ్‌ను ఉపయోగిస్తారు. పుట్టుకతో లోపా లకు, అబార్షన్లకు ఇది కారణం కాగలదు.

9. డిబ్రొమొక్లోరోప్రొపేన్‌ (డీబీసీపీ): క్రిమిసంహారకాల్లో ఉండే డీబీసీపీ లాంటి వాటికి గురికావడం అండాశయ సమస్యలకు దారి తీయగలదు. త్వరిత మెనోపాజ్‌ లాంటి వివిధ రకాల ఆరోగ్యసమస్యలూ తలెత్తుతాయి. ఇవన్నీ కూడా సంతానోత్పత్తి శక్తిపై ప్రత్యక్ష ప్రభావం కనబరుస్తాయి.

ఈ అంశాలూ కీలకమే!
- ఓ మహిళ గర్భం దాల్చాలంటే అండం విడుదలయ్యే సమయంలో ఆ జంట కలుసుకోవాలి. అండం, వీర్యం ఉత్పత్తి స్థాయిలో గరిష్ఠస్థాయిలో ఉండాలి. మహిళ
శరీరంలో హార్మోన్ల సమతుల్యత ఉండాలి. కొంతమంది మహిళల్లో అండాశయాలు పరిపక్వం చెందవు. దీని వల్ల అండాలు విడుదల కావు. ఇలాంటి సందర్భాల్లో సింథటిక్‌ ఎఫ్‌ఎస్‌హెచ్‌ (ఇంజెక్షన్‌) లేదా క్లోమిడ్‌ (పిల్‌) ద్వారా తగు చికిత్సను అందించే అవకాశం ఉంది. ఎండోమెట్రియోసిస్‌ (గర్భాశాయనికి చెందిన కణజాలాన్ని పోలిన కణజాలం శరీరంలోని ఇతర భాగాల్లో వృద్ధి చెందడం) లేదా వివిధ రకాల ఇన్‌ఫెక్షన్‌ల వల్ల ఫాలోపియన్‌ ట్యూబ్‌లు (అండాలను గర్భాశయానికి రవాణా చేసేవి) దెబ్బ తినడం లాంటివి కూడా మహిళ సంతానోత్పత్తి శక్తిని ప్రభావితం చేస్తాయి.

మహిళల్లో సంతానలేమి: నిర్ధారణ పరీక్షలు
కొన్ని రకాల పరీక్షలు చేయడం ద్వారా మహిళల్లో సంతానలేమి సమస్యను గుర్తించవచ్చు. ఈ విధమైన పరీక్షలేంటో చూద్దాం.

  • ఇటీవలి కాలంలో సెర్వికల్‌ స్మియర్‌ టెస్ట్‌ చేయించుకోకపోయి ఉంటే ఆ టెస్ట్‌ చేయించుకోవాలి.
  • జర్మన్‌ మీజిల్స్‌ (రుబెల్లా) వ్యాధి నిర్ధారణ కోసం రక్తపరీక్ష చేయించుకోవాలి. గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో గనుక ఈ వ్యాధి సోకితే పుట్టబోయే బిడ్డకు హాని కలిగే అవకాశం ఉంది. రోగిని వైద్యుడు పరిక్షించడం ద్వారా--వ్యాధి విర్ధారణ ముఖ్యంగా రోగి వ్యాధి లక్షణాలు, కనిపించే రోగి చర్మము పై దద్దుర్లు (రాష్)ద్వారా చేస్తారు. వైరస్ వల్ల కలిగే అన్ని వ్యాధులలొ రాష మరియు జ్వరం కనిపిస్తుంది. మిగతా వైరల్ జ్వరాలనుండి మీజిల్స్ లేదా తట్టు ని పైన పేర్కొన్న ముఖ్యమైన లక్షణాల ద్వారా వేరు చేస్తారు. లాబ్ పరిక్షలు---రోగ పరిక్షించడం ద్వారా నిర్ధారణ రాక పోతే లాబ్ పరిక్షలు చేయవచ్చు.లాలాజలాన్ని వైరస్ పరిక్షకి పంపి తట్టు ఉందో లేదో నిర్థారిస్తారు. మీజిల్స్ వైరస్ దాడి చేత మానవ శరీరం వ్యాధి నిరోధక ఆంటీబాడీస్ తయారు చేస్తుంది. వాటిని రక్త పరీక్ష ద్వారా పరీక్షించి వ్యాధి ని నిర్థారించవచ్చు. ఈ వ్యాధి నిరోధకా ఆంటీబాడీస్ రెండు రకాలు IgM IgG. మీజిల్స్ IgM రక్తములొ కనిపిస్తే మీజిల్స్ ఉన్నట్లు అర్థం. అదే మీజిల్స్ IgG రక్తం లొ కనిపడితే పూర్వం మీజిల్స్ గ్రస్తమయ్యినట్లు లేదా పూర్వము మీజిల్స్ కి సంబంధించిన టీకా తిసుకొన్నట్లు అర్థము.
  • హార్మోన్ల సమతుల్యత ఎలా ఉందో తెలుసుకునేందుకు పీరియడ్స్‌ (బహిష్టు) సమయంలో రక్తపరీక్ష చేయించుకోవాలి. త్వరిత మెనోపాజ్‌ను గుర్తించేందు కు కూడా ఈ పరీక్ష తోడ్పడుతుంది. ఇతర హార్మోన్ల అసమతుల్యత లేదని నిర్ధా రించుకునేందుకు టీఎస్‌హెచ్‌ (థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌), పీఆర్‌ఎల్‌ (ప్రోలాక్టిన్‌) వంటి పరీక్షలు కూడా చేయించుకోవాలి. అప్పటికే రుతుచక్రం సరిగా లేకపోవడం, చర్మంపై వెంట్రుకలు అధికంగా పెరగడం లాంటి సమస్యలు ఉంటే తదుపరి హార్మోన్‌ సంబంధిత పరీక్షలు అవసరమవుతాయి.

  • వీడీఆర్‌ఎల్‌, హెచ్‌ఐవీ, హెచ్‌బీఎస్‌ఏజీ, హెచ్‌సీవీ లాంటి ఇన్‌ఫెక్షియస్‌ వ్యాధుల నిర్ధారణ కోసం భాగస్వాములిద్దరీకీ బేస్‌లైన్‌ వైరల్‌ పరీక్ష చేయించాల్సి ఉంటుంది. ఒక్కోసారి గర్భాశయం ఎండోమెట్రియల్‌ లైనింగ్‌ కణజాలం నమూనా సేకరించి విశ్లేషించాల్సి ఉంటుంది.

ఇతర పరీక్షలు
1. పెల్విక్‌ అల్ట్రాసౌండ్‌: రిప్రొడక్టివ్‌ ట్రాక్ట్‌ సంబంధిత కాన్‌జెనిటల్‌ అనమలీస్‌, యుటెరిన్‌ ఫైబ్రాయిడ్స్‌ (గర్భాశయ కంతులు), హైడ్రోసాల్‌పిన్స్‌ (ఏదేని ద్రవం లాంటి పదార్థంతో ఫా లోపియన్‌ ట్యూబు లు -బీజవాహికలు- మూసుకు పోవడం), ఓవరియన్‌ సిస్ట్‌‌స (అండాశయంలో దవంతో నిండిన కంతు లు లాంటివి), ఎండోమెట్రిమాస్‌, పోలిసిస్టిక్‌ ఓవరీస్‌ లాంటి వాటి నిర్ధారణకు ఈ పరీక్ష తోడ్పడుతుంది.

2. హిస్టెరొసాల్‌పింగోగ్రఫీ (హెచ్‌ఎస్‌జీ): యుటెరిన్‌ కేవిటీ, ఫాలోపియన్‌ ట్యూ బ్‌ (బీజవాహిక) ఓపెనింగ్‌ పరిస్థితిని అంచనా వేసేందుకు నేటికీ అత్యంత సాధారణంగా ఉపయోగిస్తున్న పరీక్ష హిస్టెరొసాల్‌పింగోగ్రఫీ (హెచ్‌ఎస్‌జీ). ఫైబ్రాయిడ్స్‌ (గర్భాశయ కంతులు), పోలిప్స్‌, సైనికె లాంటి యుటెరిన్‌ కేవిటీ లోపాలు ఈ పరీక్ష ద్వారా వెల్లడవుతాయి. బహిష్టు పూర్తయిన తరువాత ఈ పరీక్ష చేయించుకోవాలి. బహిష్టు నుంచి పరీక్ష జరిగే వరకు కూడా దంపతులు కలుసుకోకూడదు. గర్భం దాల్చడానికి
సంబంధించిన అంశాలు, లోపాలు కల సిపోకూడదని ఈ విధంగా సూచిస్తారు.

3. హిస్టెరోస్కోపీ: సెర్వికల్‌ కెనాల్‌, గర్భాశయాన్ని అత్యంత సన్నిహితంగా పరీక్షించేందుకు ఇది ఉపయోగపడుతుంది. సన్నటి, తేలికపాటి, సరళమైన ట్యూబ్‌ను ఈ పరీక్షకు ఉపయోగిస్తారు. వ్యాధినిర్ధారణ, చికిత్సను అందించే ఉపకరణంగా ఇది తోడ్పడుతుంది. లోకల్‌ అనస్తీషియా ఇచ్చి లేదా ఇవ్వకుండా కూడా ఈ పరీక్ష చేస్తారు.

కేవలం వ్యాధినిర్ధారణకు మాత్రమే అయితే లోకల్‌ అనస్తేషియా ఇవ్వకుండానే చేస్తారు. కంతులు లాంటి వాటిని తొలగించేందుకు లేదా నమూనా సేకరణకోసమైతే జనరల్‌ అనస్తీషియా ఇస్తారు.

4. లాప్రోస్కోపీ : జనరల్‌ అనస్తేషియా ద్వారా ఈ పరీక్షను నిర్వహిస్తారు. ట్యూ బల్‌ పేటెన్సీ, అడ్‌నెక్సల్‌ అడ్హెసన్స్‌, ఓవరియన్‌ మాస్‌ లాంటివి తెలుసుకునేం దుకు ఈ
పరీక్ష చేస్తారు. పరీక్ష సందర్భంగా బయటపడే చిన్న చిన్న లోపాలను (లైసిస్‌ ఆఫ్‌ అడ్‌హెసిన్స్‌, సాల్‌పింగెక్టో మీ, ఓవరియన్‌ సిస్టెక్టోమీ, కేటరైజేషన్‌ లేదా వెపరైజేషన్‌ ఆఫ్‌ ఎండో మెట్రి యాటిక్‌ ఇంప్లాంట్స్‌) అప్పటికప్పుడే సవ రించే అవకాశం కూడా ఉంది.

డా.దుర్గ -- మెడికల్ డైరెక్టర్ -ఒయాసిస్ సెంటర్ ఫర్ రిప్రొడక్టివ్ మెడిసిన్‌ - హైదరాబాద్ .
  • =====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.