Wednesday, March 30, 2011

మెటబాలిజమ్‌పై అవగాహన ,Awareness about Metabolismఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మెటబాలిజమ్‌పై అవగాహన (Awareness about Metabolism )- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

మెటబాలిజమ్‌ అంటే మన శరీరంలో జరిగే రసాయనిక ప్రక్రియ. దీన్ని స్థూలంగా చెప్పుకోవాలంటే రోజుకి కేలరీలు ఖర్చయ్యే వేగం అనుకోవచ్చు. అయితే ఇది అందరికీ ఒకేలా ఉండదు. కొందరు ఎక్కువగా తిన్నప్పటికీ సన్నగా ఉండటానికీ.. మరికొందరు ఏ కొంచెం తిన్నా బరువు పెరగటానికీ ఈ తేడానే కారణం. అందుకే మెటబాలిజమ్‌పై అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.జీవక్రియల (మెటబాలిజమ్‌) జరిగే మార్పుల మూలముగా మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం, క్యాన్సర్‌ వంటి వాటిని మనం ఎదుర్కొనవలసి వస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

బరువుపై ప్రభావం
* జీవక్రియల వేగం తక్కువగా ఉండే వారిలో కేలరీలు ఖర్చు కావటమూ నెమ్మదిగా జరుగుతుంది. దీంతో కేలరీలు పోగుపడి, బరువు పెరుగుతుంటారు. అదే జీవక్రియలు వేగంగా జరిగేవారిలో కేలరీలు ఖర్చూ అధికమే. కాబట్టి బరువు పెరిగే అవకాశం తక్కువ.

చల్లటి నీరు తాగండి
* రోజుకి 6-8 గ్లాసుల నీరు తాగటం మంచిది. ఇది జీవక్రియల వేగాన్ని పెంచి శరీరం నుంచి విష పదార్థాలు, అధిక కొవ్వును తొలగించటానికి తోడ్పడుతుంది. భోజనానికి ముందు చల్లటి నీరు తాగితే జీర్ణాశయం కుంచించుకుపోయి కొంచెం తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది.

మూడు గంటలకోసారి
* ఒకేసారి ఎక్కువగా తినటం కన్నా కొంచెం కొంచెంగా రోజుకి 4-6 సార్లు ఆహారం తీసుకోవటం మంచిది. భోజనాన్ని మానేయటం అసలు చేయరాదు. క్రమం తప్పకుండా ఆహారం తీసుకోకపోతే జీవక్రియలు మందగించి, కొవ్వు పేరుకుపోవటానికి దారి తీస్తుంది.

అల్పాహారమూ తప్పనిసరి
* ఉదయం పూట టిఫిన్‌ చేయటం తప్పనిసరి. తొలిసారి తీసుకునే ఈ అల్పాహారం రోజంతా జరిగే జీవక్రియల పద్ధతిని గాడిలో పెడుతుంది. ఒకవేళ పెందరాలే లేచి, ఆలస్యంగా టిఫిన్‌ చేస్తే.. కేలరీలు ఖర్చు విషయంలో చాలా సమయాన్ని వృథా చేసుకున్నట్టే.

ట్రాన్స్‌ఫ్యాట్‌ వద్దు
* బిస్కట్లు, బ్రెడ్‌, చాక్లెట్లు, ఫాస్ట్‌ఫుడ్‌, వేపుళ్లు, కేకుల వంటి వాటిల్లో ట్రాన్స్‌ఫ్యాట్స్‌ ఉంటాయి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్‌ను పెంచి హాని చేస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ మోతాదునూ తగ్గిస్తాయి. కాబట్టి వీటి జోలికి వెళ్లకపోవటమే మంచిది.

వ్యాయామం చేయాలి
* క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ఎంతో అవసరం. రోజుకి కనీసం 2-3 కి.మీ. నడవాలి. శారీరకశ్రమ మూలంగా గుండె, వూపిరితిత్తులు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయి. వ్యాయామం ఎప్పుడు చేసినా మంచిదే గానీ.. సాయంత్రం పూట శారీరకశ్రమ మెటబాలిజమ్‌కు ఎంతగానో తోడ్పడుతుంది. ఎందుకంటే రాత్రయ్యే కొద్దీ చాలామందిలో జీవక్రియల వేగం మందగిస్తుంటుంది. రాత్రి భోజనానికి ముందు అరగంట సేపు కదలికలు వేగంగా ఉండే వ్యాయామం చేస్తే జీవక్రియల వేగమూ పెరుగుతుంది.

కొవ్వుని కరిగించే పీచు
* పీచు పదార్థాలు ఎక్కువగా తినేవారిలో అధిక బరువు సమస్య తక్కువగా ఉంటున్నట్టు వివిధ అధ్యయనాల్లో తేలింది. కొవ్వును కరిగించే వేగాన్ని ఇది 30 శాతం వరకు పెంచుతుంది కూడా. కాబట్టి రోజుకి సుమారు 25 గ్రాముల చొప్పున మూడుసార్లు పండ్లు, కూరగాయలు తినటం మరవరాదు. అలాగే రోజుకి 70 గ్రాములకు తక్కువ కాకుండా ప్రోటీన్లనూ తీసుకోవాలి. ఇవి రక్తంలోకి ఇన్స్‌లిన్‌ స్రావాన్ని నియంత్రించి, జీవక్రియలకు ఉత్తేజాన్నిస్తాయి.

నిద్రతో ఎంతో మేలు
* రాత్రిపూట రోజుకి 6-7 గంటలు నిద్రపోవటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆలస్యంగా పడుకొని, తగినంత నిద్రపోనివారిలో ఒత్తిడి పెరగటమే కాదు, శరీరంలో అవయవాల చుట్టూ కొవ్వు కూడా పేరుకుంటున్నట్టు పరిశోధనల్లో బయటపడింది.

ఉపవాసం వద్దే వద్దు
* చాలామంది బరువు తగ్గించుకోవటానికి ఉపవాసాలు చేస్తుంటారు. దీంతో మేలు కన్నా కీడే ఎక్కువ. పూర్తిగా ఆహారం తీసుకోకుండా ఉంటే జీవక్రియల వేగం మందగించి, శరీరంలో కొవ్వు పేరుకుపోవటానికి దోహదం చేస్తుంది.


=============================================
Visit my website - -> Dr.Seshagirirao.com/

ఆరోగ్య పరీక్షలు-ప్రాముఖ్యత, Medical Tests Importanceఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఆరోగ్య పరీక్షలు-ప్రాముఖ్యత (Medical Tests Importance)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఆరోగ్య పరీక్షలు మన భవిష్యత్తుకు భరోసా ఇస్తాయి.మన ఆరోగ్యానికి అండగా నిలబడతాయి. ప్రతి ఏటా క్రమం తప్పకుండా.. తప్పనిసరిగా కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం ద్వారా మనం జీవితం గాడి తప్పకుండా చూసుకోవచ్చు. ఆరోగ్యం వన్నె తగ్గకుండా కాపాడుకోవచ్చు. మనం వ్యాధుల బారినపడకుండా చూసుకోవటానికి.. ఒకవేళ మన శరీరంలో ఏదైనా అనారోగ్యకర మార్పులు వస్తుంటే వాటిని తొలి దశలోనే గుర్తించి సమర్థంగా ఎదుర్కొనటానికి ఈ ఆరోగ్య పరీక్షలు ఎంతగానో దోహదపడతాయి. అందుకే ప్రతి ఏటా మనం తప్పనిసరిగా చేయించుకోవాల్సిన కొన్ని ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం జరిగినది.

మన శరీరం ఓ సంక్లిష్టమైన.. సజీవమైన యంత్రం. ఈ యంత్రం ఆరోగ్యంగా, హాయిగా పనిచేస్తుండాలంటే రకరకాల అవయవాలు, గ్రంథులు, ఇంద్రియాలు, జీవక్రియలు.. ఇలా ఎన్నో వ్యవస్థలు నిరంతరాయంగా సమన్వయంతో పని చేస్తుండాలి!.వయసుతో పాటు కొన్ని.. జీవనశైలి కారణంగా కొన్ని.. బాహ్య పరిస్థితుల కారణంగా కొన్ని.. ఇలా ఎన్నో మార్పులు వస్తూనే ఉంటాయి. ఈ మార్పులను గమనిస్తూ... ఈ జీవన యంత్రం ఎప్పుడైనా గాడి తప్పుతుంటే వెంటనే సరి చేసుకోవటం అత్యుత్తమ ఆరోగ్య సూత్రం! అందుకే ఒక వయసు వచ్చిన దగ్గరి నుంచీ మనం ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవటం.. క్రమం తప్పకుండా కొన్ని తేలికపాటి పరీక్షలు చేయించుకుని మన ఆరోగ్య స్థితిని సరి చూసుకోవటం చాలా అవసరం.

మారుతున్న మన జీవనశైలితో పాటే మధుమేహం, హైబీపీ, ఊబకాయం, కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరగటం వంటి ఎన్నో రుగ్మతలు పెరుగుతున్నాయి. వీటికి తొలిదశలో ఎటువంటి లక్షణాలూ ఉండవు. వీటివల్ల బాధలేమీ కనబడవు కాబట్టి నిర్లక్ష్యం చేస్తుంటాము. కానీ క్రమేపీ వీటి కారణంగా గుండె జబ్బులు, పక్షవాతం వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తుతాయి.
మనమే వెనకబడ్డాం. అభివృద్ధి చెందిన అమెరికా, ఐరోపా దేశాల్లో ఏటా ఆరోగ్య పరీక్షలన్నవి ఎప్పటి నుంచో తప్పనిసరిగా చేస్తున్నారు.. అనవసరంగా పరీక్షలు ఎక్కువ చేయించుకోవటంలో అర్థం లేదుగానీ ఏడాదికి ఒకసారి కొన్ని ముఖ్యమైన పరీక్షలు చేయించుకుని.. మన శరీరంలో ఏవైనా మార్పులు వస్తున్నాయా? అన్నది తెలుసుకోవటం.. ఏవైనా మార్పులు కనబడుతుంటే వెంటనే వాటిపై శ్రద్ధ పెట్టటం మాత్రం చాలా అవసరమని గుర్తించాలి.

1. ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ)
ఈ ఆధునిక కాలంలో తలెత్తుతున్న చాలా వ్యాధులకు అధిక బరువు, ఊబకాయం మూలం. మన ఆహారపుటలవాట్లు మారిపోతుండటం, శారీరక శ్రమ లేకపోవటం వంటి జీవనశైలి సమస్యల కారణంగా మన బరువే ఇప్పుడు మనకో గుదిబండగా తయారవుతోంది. అందుకే ఏటా క్రమం తప్పకుండా ఒక్కసారైనా బరువు చూసుకుని.. ఎత్తుబరువుల నిష్పత్తి లెక్కించుకుని.. అది కచ్చితంగా ఉందో లేదో చూసుకోవటం చాలా అవసరం.diininE BMI aMTaamu. bi.yam.ai.ఎంత ఉండాలి: ఎత్తు(మీటర్లలో)ను ఎత్తుతో హెచ్చించి.. బరువు(కేజీల్లో)ను ఆ వచ్చిన దానితో భాగహారించాలి. ఇది మన భారతీయుల్లో 18-23 మధ్య ఉండటం ఉత్తమం. అంతకు మించితే బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయటం అవసరం.

2. రక్తపోటు
గుండె పోటు, పక్షవాతం, కిడ్నీ జబ్బులు.. ఇలా ఎన్నో సమస్యలకు అధిక రక్తపోటు కారణమవుతుంది. కాబట్టి 25-30 ఏళ్లు దాటిన దగ్గరి నుంచీ ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి తప్పనిసరిగా బీపీ చూపించుకోవాలి. వయసు పెరుగుతున్న కొద్దీ మరింత తరచుగా చూపించుకోవటం అవసరం. ఇప్పటికే హైబీపీ ఉన్నవారైతే నెలకు ఒకసారైనా కొలిపించుకోవటం ఉత్తమం.
ఎంత ఉండాలి: ఎవరిలోనైనా 120/80 ఉండాలి. అంతకు మించి ఉంటే వైద్యులను సంప్రదించటం తప్పనిసరి.

3. సంపూర్ణ రక్తపరీక్ష (కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌-సీబీపీ)
మన దేశంలో స్త్రీపురుషుల్లో రక్తహీనత చాలా ఎక్కువ. దీన్ని తేలికపాటి రక్తపరీక్షతో గుర్తించవచ్చు. రక్తహీనత ఉంటే- నీరసం, ఏ పనీ సమర్థంగా చెయ్యలేకపోవటం, పిల్లలు ఏకాగ్రత కుదరక చదువుల్లో వెనకబడటం, ఆయాసం, కాళ్లుచేతులు లాక్కుపోవటం.. వంటి ఎన్నో సమస్యలు బయల్దేరతాయి. దీన్ని తేలికపాటి పరీక్షతో గుర్తించి సరిచేసుకోవచ్చు. అలాగే ఈ రక్తపరీక్ష ప్లేట్‌లెట్‌ కణాలు, తెల్లరక్తకణాలు, ఈఎస్‌ఆర్‌ వంటివాటిని కూడా పరిశీలిస్తారు కాబట్టి ఇతరత్రా సమస్యలున్నా బయటపడతాయి. అలాగే ఎరిత్రోసైట్‌ సెడిమెంటేషన్‌ రేట్‌(ఈఎస్‌ఆర్‌) అనేది పరీక్షించటం వల్ల ఒంట్లో చిన్నచిన్న ఇన్ఫెక్షన్ల నుంచి క్యాన్సర్ల వరకూ.. ఎటువంటి మార్పులు తలెత్తినా అనుమానించే అవకాశం ఉంటుంది.
ఎంత ఉండాలి:
* హిమోగ్లోబిన్‌:
స్త్రీలు: 12-15 జి/డీఎల్‌
పురుషులు: 14-17 జి/డీఎల్‌

* డబ్ల్యూబీసీ: 4000-11000 సీయూ/ఎంఎం
* ప్లేట్‌లెట్లు: 1.5-4 లక్షలు
* ఈఎస్‌ఆర్‌: తొలిగంటలో-
పురుషులు: 0-15 ఎంఎం
స్త్రీలు: 0-20 ఎంఎం

4. మల పరీక్ష
పేగుల్లో కొంకి పురుగులు, నట్టల వంటివి ఉంటే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఏటా మలపరీక్ష చేయించుకోవటం మంచిది. దీంతో పాటు మలంలో రక్తం కలిసి ఉందా అన్న (అకల్ట్‌ బ్లడ్‌) పరీక్షా చేయించుకుంటే.. జీర్ణాశయం నుంచి పెద్దపేగు వరకూ ఎక్కడన్నా పుండు నుంచి క్యాన్సర్‌ వరకూ.. ఏ సమస్య ఉన్నా దీనిలో రక్తం ఆనవాళ్లు కనబడతాయి. అవి ముదరక ముందే గుర్తించే వీలుంటుంది.

5. మూత్ర పరీక్ష
మూత్ర పరీక్ష చాలా తేలికైనది, మన ఆరోగ్య పరిస్థితి గురించి విలువైన సమాచారాన్ని అందిస్తుంది. ముఖ్యంగా మూత్రనాళాల్లో ఇన్ఫెక్షన్ల వంటివి ఉన్నా, మూత్రపిండాల్లో తేడాలు వస్తున్నా, మూత్రంలో సుద్ద (ఆల్బుమిన్‌) పోతున్నా ఈ పరీక్షలో సంకేతాలు కనబడతాయి. కాబట్టి ఏడాదికి ఒకసారి మూత్రపరీక్ష చేయించుకోవటం మంచిది. మధుమేహులైతే దీనితో పాటు 'మైక్రోఆల్బుమినూరియా' పరీక్ష కూడా చేయించుకోవటం అవసరం.
ఎంత ఉండాలి:
* ఆల్బుమిన్‌: ఉండకూడదు.
* గ్లూకోజు: ఉండకూడదు
* పస్‌ సెల్స్‌: 0-5 హెచ్‌పీఎఫ్‌ లోపే ఉండాలి. 5 దాటితే మూత్రనాళ ఇన్ఫెక్షన్‌ ఉన్నట్టే లెక్క.
* ఆర్‌బీసీ: ఉండకూడదు. 3 కంటే ఎక్కువ ఉంటే వైద్యులను సంప్రదించటం తప్పనిసరి.
* క్రిస్టల్స్‌: యూరిక్‌ ఆసిడ్‌, ఆక్సలేట్‌ క్రిస్టల్స్‌ ఉండకూడదు. ఉంటే మూత్రవ్యవస్థలో రాళ్లున్నాయేమో అనుమానించాలి.

6. మధుమేహం
మన దేశంలో మధుమేహ తీవ్రత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు కుటుంబ చరిత్ర ఉంటేనే అనుమానించాలని భావించేవారుగానీ ఇప్పుడు రకరకాల కారణాల రీత్యా ఎటువంటి వంశ చరిత్రా లేకుండా కూడా మధుమేహం వస్తోంది. కాబట్టి 25 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి పరగడుపున, ఆహారం తీసుకున్న 2 గంటలకు రక్తపరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి. తల్లిదండ్రులకు మధుమేహం ఉన్నా, బరువు ఎక్కువగా ఉన్నా.. ఈ మధుమేహ పరీక్షలు ఇంకా ముందే మొదలుపెట్టటం మంచిది.

7. కాలేయ పరీక్షలు (ఎల్‌ఎఫ్‌టీ)
ఇటీవలి కాలంలో హెపటైటిస్‌ రకం వైరస్‌ల దాడి ఎక్కువైంది. దీనికి తోడు మద్యం, కొన్ని రకాల అరుదైన వ్యాధుల వల్ల లివర్‌ వ్యాధులు కూడా ఎటువంటి లక్షణాలూ లేకుండా ఉండిపోయి.. ఎప్పుడో ఒకసారి ఉన్నట్టుండి బయటపడుతుంటాయి. అప్పటికే మన చెయ్యి దాటిపోయే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఏడాదికి ఒకసారి కాలేయం పని తీరును పట్టిచెప్పే 'లివర్‌ ఫంక్షన్‌ టెస్టు(ఎల్‌ఎఫ్‌టీ) కూడా చేయించుకోవటం మంచిది.

8. సీరం క్రియాటినైన్‌
మూత్రపిండాల పనితీరును పరిస్థితిని తెలియజెప్పే కీలకమైన రక్త పరీక్ష ఇది. చాలారకాల కిడ్నీ సమస్యలకు ఆరంభ దశలో ఎటువంటి లక్షణాలూ ఉండవు. కాబట్టి ఈ పరీక్ష చేయించుకుంటే కిడ్నీ సమస్యలు త్వరగా బయటపడతాయి.
ఎంత ఉండాలి: స్త్రీలలో: 0.6-1.1 పురుషుల్లో: 0.7-1.3 ఉండాలి.

9. కొలెస్ట్రాల్‌ పరీక్షలు (లిపిడ్‌ ప్రొఫైల్‌)
మన దేశంలో గుండె జబ్బులు ఎక్కువగా ఉండటానికి అధిక కొలెస్ట్రాల్‌ ఒక ముఖ్యమైన కారణం. దీనిలో మంచి కొలెస్ట్రాల్‌(హెచ్‌డీఎల్‌), చెడ్డ కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌), మరో రకం కొవ్వు పదార్థం (ట్రైగ్లిజరైడ్లు) తదితరాలు ఉంటాయి. మన దేశంలో చాలా మందికి మంచి కొలెస్ట్రాల్‌ తక్కువగా, చెడ్డ కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటోంది. కొందరికి ఇది జన్యుపరంగా వస్తే చాలామందిలో ఇది ఆహారపుటలవాట్లు, వ్యాయామం లేకపోవటం వంటి జీవనశైలి సమస్యల వల్ల వస్తోంది. చాలామంది లావుగా ఉన్న వారికి కొలెస్ట్రాల్‌ ఎక్కువుంటుంది, బక్కగా ఉన్న వారికి ఉండదనుకుంటారుగానీ అది సరికాదు. 25-30 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి పరగడుపున ఈ కొలెస్ట్రాల్‌ పరీక్షలు చేయించుకోవటం, వీటిలో ఏవి అసాధారణంగా ఉన్నా వైద్యులను సంప్రదించి ముందే ఆహారంలో మార్పులు చేసుకోవటం, వ్యాయామం చెయ్యటం, అవసరమైతే మందులు కూడా వేసుకోవటం.. అవసరం. ఇలా చేస్తే గుండె పోటు, పక్షవాతం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు.

10. థైరాయిడ్‌ పరీక్ష
అయోడిన్‌ లోపం, రోగనిరోధక వ్యవస్థ లోపం తదితరాల వల్ల మన దేశంలో థైరాయిడ్‌ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. స్త్రీలలో మరీ ఎక్కువ. థైరాయిడ్‌ హార్మోను తగ్గినా సమస్యే, పెరిగినా సమస్యే. వాటివల్ల ఎన్నో దుష్ప్రభావాలు తలెత్తుతాయి. కాబట్టి ఏటా పరీక్ష చేయించుకుంటూ ఈ లోపాలను ముందే గుర్తిస్తే మంచిది. దీనికి చికిత్స కూడా చాలా తేలిక.

ఎంత ఉండాలి:
టీఎస్‌హెచ్‌: 0.3-6.0 మైక్రో ఐయూ/ఎంల్‌
టి3: 0.6-1.81 టి4: 4.0-12.0
గమనిక: ల్యాబోరేటరీలను బట్టి, పరీక్షా విధానాన్ని బట్టి సాధారణ విలువలు మారుతుంటాయి. కాబట్టి తేడాలుంటే స్థానిక వైద్యులను సంప్రదించటం మంచిది.

ఇవీ ముఖ్యమే
ఈసీజీ: 25 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి ఈసీజీ పరీక్ష చేయించుకోవటం మంచిది. చాలా తేలిక పాటి పరీక్ష, కానీ మన గుండె పనితీరు గురించి అమూల్యమైన సమాచారాన్ని అందిస్తుంది.

ఛాతీ ఎక్స్‌రే: ఛాతీ ఎక్స్‌రేలో కేవలం క్షయకు సంబంధించిన వివరాలే కాకుండా గుండె సైజు, బృహద్ధమని సైజు వంటివన్నీ కూడా తెలుస్తాయి. ముఖ్యంగా హైబీపీ, మధుమేహం ఉన్నవారిలో, అలాగే పొగతాగే వారిలో ఈ పరీక్షకు ప్రాధాన్యం ఎక్కువ.

ఉదరం ఆల్ట్రాసౌండ్‌: ఇది చాలా సులువైన పరీక్ష, రేడియేషన్‌ వంటివేమీ ఉండవు. కానీ పొత్తికడుపులోని అవయవాల గురించి ఎంతో సమాచారాన్ని అందిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ పరీక్ష చేయించుకుంటే మూత్రపిండాలు, కాలేయం వంటివి ఎలా ఉన్నాయో తెలుస్తుంది. స్త్రీలలో అండాశయాలు, గర్భాశయం, పురుషుల్లో ప్రోస్టేటు సమస్యలూ తెలుస్తాయి.

కళ్లు : చెత్వారం వంటివి ఉన్న పెద్దవారికే కాదు.. పిల్లలకు కూడా నేత్ర పరీక్ష అవసరం. చూపు సమస్యలను ముందే గుర్తించకపోతే పిల్లలు చదువుల్లో వెనకబడటమే కాదు.. శారీరకంగా, మానసికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. మధుమేహం, హైబీపీ ఉన్న వారికి కంట్లోని రెటీనా పొరలో మార్పులు వస్తుంటాయి, నీటికాసుల వంటి ప్రమాదకర సమస్యలకు కూడా ముందస్తుగా ఎలాంటి లక్షణాలూ ఉండవు.. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి నేత్ర పరీక్ష చేయించుకోవాలి.

మామోగ్రఫీ, పాప్‌స్మియర్‌: స్త్రీలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన క్యాన్సర్‌ ముప్పులు రెండు. రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌. కాబట్టి 40 ఏళ్లు పైబడిన స్త్రీలంతా ప్రతి ఏటా తప్పనిసరిగా రొమ్ములకు మామోగ్రఫీ పరీక్ష; గర్భాశయ ముఖద్వారానికి పాప్‌స్మియర్‌ పరీక్షలు చేయించుకోవటం చాలా అవసరం. క్యాన్సర్‌కు సంబంధించిన మార్పులు పాప్‌స్మియర్‌ పరీక్షలో పదేళ్ల ముందే కనబడతాయి. దీన్ని ముందే గుర్తిస్తే చికిత్స చాలా సులువు కూడా.

పీఎస్‌ఏ: పురుషుల్లో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ సమస్య ఒకప్పటి కంటే మన దేశంలో ఇప్పుడు ఎక్కువగా గుర్తిస్తున్నాం. 50 ఏళ్లు పైబడిన పురుషులంతా కూడా ఏటా 'ప్రోస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటిజెన్‌(పీఎస్‌ఏ)' అనే రక్తపరీక్ష చేయించుకుంటే దీనికి సంబంధించిన మార్పులేమైనా ఉంటే గుర్తించే వీలుంటుంది. పీఎస్‌ఏ స్థాయి పెరిగి ఉంటే క్యాన్సరేమోనని అనుమానించి మరింత లోతుగా పరీక్షించే వీలుంటుంది. ఎంత ఉండాలి: పీఎస్‌ఏ: 0-4 ఎన్‌జీ/ఎన్‌ఎల్‌.

source : clinical pathology for Medical graduates.
 • ====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, March 28, 2011

చాతి నొప్పి (గుండెపోటు) ప్రథమ చికిత్స ,Chest pain(heart pain) first Aid


 • http://4.bp.blogspot.com/_DP4mgmsZ7NQ/TGPoUle4idI/AAAAAAAAA6M/uBTvhboLS-A/s1600/Heart+attack.jpg


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -చాతి నొప్పి (గుండెపోటు) ప్రథమ చికిత్స (Chest pain(heart pain) first Aid)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


గుండెపోటుతో వచ్చే లక్షణాల్లో కొన్ని ఇతర వ్యాధుల్లో ఉండే సాధారణ లక్షణాల్లాగే ఉంటాయి. అందుకే చాలా మంది వాటిని పట్టించుకోరు. ఛాతీలో నొప్పి వస్తేనే గుండె పోటు అనుకునే వారే ఎక్కువ. గుండెపోటులో ఛాతీనొప్పి, శ్వాస ఆడకపోవడం, కాళ్లవాపు, గుండెదడ, కళ్లు తిరిగిపడిపోవడం, త్వరగా అలసి పోవడం, గుండె పట్టేసినట్లు బరువుగా ఉండడం, ఏదో అసౌకర్యంగా ఉండడం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. కొందరికి తలనొప్పి రావచ్చు.

కొందరికి ద గ్గుతో పాటు నోటి నుంచి రక్తం కూడా వస్తుంది. అయితే ఈలక్షణాలు గుండెపోటులోనే కాకుండా ఇతర కారణాలతోనూ రావచ్చు. అందుకే ఛాతీ నొప్పి ఎంత సేపటి నుంచి ఉంది ? నొప్పితో పాటు ఇతర లక్షణాలేమైనా ఉన్నాయా ? అన్నది గమనించాలి. అసౌకర్యంగా ఉండడాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. నిజానికి ఇది గుండెపోటులో కనిపించే ఒక తీవ్ర లక్షణం. గుండెపోటు సమయంలో కొందరికి ఛాతీ మంటలా అనిపిస్తుంది. ఈ మంటను చాలా మంది అసిడిటిగా పొరబడుతుంటారు. ఛాతీ మంటతో పాటు కొందరికి తేన్పులు, ఒక్కోసారి వాంతులు కూడా అవుతాయి.


ముఖ్యమైన లక్షణాలు

 • గుండె బరువుగా(heavyness) ఉంటూ చెమటలు(sweating) రావడం,
 • ఛాతీమంట(Heart burn), చాతిలో అసౌకర్యం(Discomfort in chest).
 • నడవడం లేదా ఏదైనా పనిచేస్తున్నప్పుడు నొప్పి ఎక్కువవడం, ఆగిపోగానే నొప్పి తీవ్రత తగ్గడం, లేదా నొప్పి మొత్తంగానే లేకుండా పోవడం.
 • ఎడమ బుజము లేదా ఎడమ దండ కి నొప్పి ప్రాకడం(radiating to left shoulder /Arm),
 • ఊపిరి తీసుకోవడం కస్టం గాను , బరువు గాను ఉండడం ,
 • వాంతి అయినట్లు ఉండడం లేదా వాంతి అవడం,
 • కొందరికి కడుపులో నొప్పిగా ఉండడం , *
 • ఛాతీలో మొదలైన నొప్పి రెండు చేతులకూ దవడలకూ లేదా వెన్ను భాగానికి పాకడం ,
 • ఏదైనా బరువు ఎత్తుకుని కొంత దూరం నడవగానే నొప్పి మొదలై, బరువు దించగానే నొప్పి తగ్గడం ఇలాంటి లక్షణాలు ఉంటే గుండె నొప్పిగా అనుమానించి సమీపంలో ఉన్న ఆసుపత్రికి చేర్చాలి.

అయితే, పనిచేస్తున్నప్పుడు ఒక మోస్తరుగా ఉంటూ పనిమానగానే నొప్పి అధికమైతే మాత్రం అది గుండెనొప్పి కాదు. ఇలా ఏం చేస్తే నొప్పి పెరుగుతోంది, ఏంచేస్తే నొప్పి తగ్గుతోంది అనే అంశాల ఆధారంగా కూడా అది గుండె నొప్పి అవునో కాదో నిర్ధారించడం వీలవుతుంది.

గుండె నొప్పికీ, గుండె పోటుకీ మధ్య కూడా తేడా ఉంటుంది. ఛాతీ నొప్పి ఉండే కాల వ్యవధిని బట్టి ఆ వ్యత్యాసాలను గుర్తించవచ్చు. ఛాతీ నొప్పి మొదలైన మూడు నిమిషాల్లోనే దానికదే తగ్గిపోతే అది గుండెనొప్పి (chest pain) అనుకోవాలి. అలా కాకుండా నొప్పి 10 నిమిషాలకు మించి కొనసాగుతూ ఉంటే అది గుండెపోటు అనుకోవాలి. అయితే, 20 ఏళ్లలోపు వారిలో ఛాతీనొప్పి వస్తే అది గుండె నొప్పి(chest pain) అయ్యే అవకాశం ఎక్కువ. అదే 60 ఏళ్లు దాటిన వారికి ఛాతీ నొప్పి పస్తే అది గుండెపోటు(heart attack) అయ్యే అవకాశం ఎక్కువ.

ప్రథమ చికిత్స
 • గుండెనొప్పి గ్రహించిన వెంటనే గ్లాసు నీరు తాగించాలి. కొన్నిసార్లు వెంటనే ఇసిజి తీసే సమయం ఉండకకపోవచ్చు.
 • పరిస్థితి విషమంగా ఉందనిపిస్తే వెంటనే కూర్చోబెట్టి గానీ, పడుకోబెట్టి గానీ డిస్పిరిన్-300 మి. గ్రా మాత్ర ను నీటితో కలిపి తాగించాలి.
 • ఆ తరువాత సార్బిట్రేట్ మాత్ర కూడా వేయాలి. దీంతో నొప్పి వెంటనే తగ్గిపోతుంది. ఆ తరువాత సాధ్యమైనంత త్వరగా హాస్పిటల్‌కు తీసుకు వెళ్లాలి.
 • బిగుతు(tight)గా ఉన్న బట్టలను వదులు (loose) చేయాలి ,
 • అవసరమైతే ... కుత్రిమ స్వాశ ఇవ్వాలి , cardiopulmonary Resuscitation(cpr) చేయాలి, దీనిలో చేతులతో చాతిని నొక్కాలి , నోటితో ఊపిరిని ఇవ్వాలి . ఒక క్రమ పద్దతిలో చేయాలి.

శరీరానికి ఏమాత్రం శ్రమ కలుగకుండా ఏదో ఒక వాహనంలో తీసుకువెళ్లాలి. హాస్పిటల్‌కు వెళ్లాక కూడా డాక్టర్ వద్దకు వీల్‌చెయిర్ మీద తీసుకు వెళ్లాలే తప్ప నడిపించకూడదు. డిస్పిరిన్ మాత్ర స్ట్రెప్టోకైనేస్ ఇంజెక్షన్‌కు సమానంగా పనిచేస్తుంది. అంతకు ముందే గుండెజబ్బుకు లోనైన వాళ్లు డిస్పిరిన్, సార్బిట్రేట్ మాత్రలను ఎప్పుడూ దగ్గర ఉంచుకోవడం శ్రేయస్కరం.

గుండెనొప్పి వచ్చినప్పుడు వీలుంటే వెంటనే ఇసిజి తీయించాలి. ఆయితే ఇసిజి కోసం కార్డియాలజిస్టులు ఉండే ఆసుపత్రికి వెళ్లాలే తప్ప డయాగ్నోస్టిక్ సెంటర్‌కు వెళ్లకూడదు. చాలా వరకు ఈ సెంటర్‌లలో టెక్నీషయన్ ఉంటాడే తప్ప డాక్టర్ ఉండడదు. డాక్టర్ ఉండకపోవడం వల్ల రిపోర్టుకు ఆలస్యమవుతుంది. ఈ లోగా ప్రాణాపాయం కలగవచ్చు. ఏమైనా గుండెపోటు వచ్చినప్పుడు తొలిగంట అమూల్యమైనది. అందుకే ఆ వ్యవధిలోపే డాక్టర్ వద్దకు చేర్చడం చాలా ముఖ్యం.

డాక్టర్ చేసే వైద్య విధానము :

Thrombolytic therapy-రక్తం గడ్డలను కరిగించేవి(streptokinase) Several new "clot-busting drugs," called thrombolytic agents, can help dissolve blood clots and prevent further heart damage. Although clot-busting drugs (e.g., r-PA, t-PA, tnk-PA, streptokinase) are most effective when administered within the first several hours of a heart attack, they are beneficial when administered within 12 hours following the onset of symptoms.These medications are not used in all cases, and whether they are used or not is determined primarily by electrocardiogram results. Thrombolytic agents carry a small risk for causing excessive bleeding, which can cause stroke if it occurs in the brain; however, potential benefits usually outweigh the risk..

Heparin therapy--రక్తం గడ్డకట్టకుండా .. రక్తాన్ని పల్చగా ఉంచుతుంది ,రక్తం గడ్డలను కరిగిస్తుంది .(dalteparin)Heparin is a drug used to "thin" the blood to help prevent further blood clot formation. This drug may be particularly useful in patients who experience intermittent blood clot formation within a coronary artery.The older form of heparin, called unfractionated heparin, usually is administered via a continuous intravenous (IV) infusion. Frequent blood tests are required during treatment to monitor how "thin" the blood is. Newer forms of heparin, called low molecular weight heparins, usually are administered via injection in the abdomen twice a day. These medications include enoxaparin (Lovenox®), dalteparin (Fragmin®), and nadroparin (Fraxiparin®). Low molecular weight heparins require less frequent monitoring and several studies suggest that this form of the drug prevents recurrent heart attack and death more effectively than unfractionated heparin.,

Aspirin-- చిక్కగా ఉన్న రక్తాన్ని పలుచనచేసి సునాయాసముగా రక్తప్రసరణ జెరిగేందుకు దోహదపడుతుంది(liquify the tenacious blood--Taking an aspirin during a heart attack and each day following a heart attack can decrease the risk of dying from the condition by almost 25%. Blood clots primarily are composed of platelets (microscopic particles that circulate in the bloodstream) that "stick" to ruptured plaques and to each other. Aspirin makes platelets less "sticky," decreasing the risk for further blood clot formation.Studies have shown that some patients are resistant to the effects of aspirin therapy. Regular blood tests may be performed to monitor the patient's response; the results of these tests can be used to adjust the aspirin dosage or change the medication.) .

Beta-blockers-- హార్ట్ రేట్ ను తగ్గించి . గుండే సొంకోచ శక్తిని తగ్గిస్తుంది (slow the heart rate and decrease the strength of the heart's contractions, reducing strain on the heart and its oxygen requirement. Commonly used beta-blockers include metoprolol (Lopressor®, Toprol XL®) and atenolol (Atenolol®). These drugs usually are administered intravenously (through a vein) at first and then orally.

Nitroglycerin-- గుండె కు రక్తప్రసరణ ఎక్కువ చేస్తుంది .Nitroglycerin is a chemical that opens up (dilates) arteries and veins and increases blood flow to the heart. During heart attack, nitroglycerin can be placed under the tongue, where it quickly dissolves and is absorbed into the bloodstream. Nitroglycerin also can be administered via continuous intravenous (IV) infusion; applied to the skin in cream or patch form, where it is slowly absorbed; or administered as short- or long-acting nitrate pills. Isosorbide dinitrate (Isordil®) usually is taken 3 times a day and isosorbide mononitrate (Ismo®, Imdur®) is taken either twice (Ismo) or once daily (Imdur). Because nitroglycerin dilates not only the coronary arteries, but also other blood vessels, it may cause severe headaches. In some cases, headaches are so severe that patients are unable to tolerate nitroglycerin therapy.

IIb/IIIa Inhibitors-- ప్లేట్ లెట్స్ ఒకదానికొకటి దగ్గరవకుండా , కలవకుండా చూస్తుంది .These drugs help to prevent platelets from sticking together and forming blood clots. They also help dissolve existing blood clots. Studies show that treatment with IIb/IIIa inhibitors can reduce the risk for recurrent heart attack or death. IIb/IIIa inhibitors include eptifibatide (Integrelin®), tirofiban (Aggrastat®), and abciximab (ReoPro®).

 • ========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, March 26, 2011

పిల్లలు - దంతాల సంరక్షణ , Children and dental care


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పిల్లలు - దంతాల సంరక్షణ (Children and dental care)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


తల్లి కడుపులో ఉన్నప్పుడే మఒదలవుతుంది దంతాలు యేర్పడడము . పాలపళ్ళు రాలిపోయి శాశ్వితపళ్ళు యేర్పడిన తరువాత వాటి ప్ర్రాముఖ్యత పెరుగుతుంది . పళ్ళు ఉపయోగాలు :
 • స్పష్టముగా మాట్లాడేందుకు ,
 • ఆహారము నమిలి మింగేందుకు ,
 • అందము గా నవ్వేందుకు ,
 • ఆకర్షణీయమైన ముఖ అందానికి ,

చిన్నపిల్లలకి, ఆరునెలల వయస్సు నుంచి పాలపళ్లు రావడం మొదలవుతుంది. పళ్లు చిగురును చీల్చుకొని వచ్చేటప్పుడు, పంటి చుట్టూ ఉన్న చిగురులో కొంత దురద వంటి 'ఇరిటేషన్‌' వుంటుంది. అందువల్ల చంటి పిల్లలు ఏ వస్తువు దొరికినా నోట్లో పెట్టుకొని కొరుకుతూ ఉంటారు. అంతేకాక చిన్న పిల్లలకి, చేయి-నోరు, సమన్వయం కూడా అప్పుడప్పుడే అలవడుతూ వుంటుంది. అందుకే అందిన ప్రతి వస్తువు నోట్లో పెట్టుకొంటారు. ఈ విధంగా నోట్లో పెట్టుకొన్న వస్తువు పరిశుభ్రంగా లేని పక్షంలో, దానిని అంటి ఉన్న సూక్ష్మక్రిములు లోపలికి వెళ్ళి పిల్లలకి విరేచనాలు కావడం సహజం' అని సరిపెట్టుకోక, పిల్లల వస్తువుల విష యంలో శుభ్రత పాటించాలి.

శరీర ఆరోగ్యంపై దంత వ్యాధులు, తమ ప్రభావం చూపించకుండా ఉండాలంటే, అసలు దంతవ్యాధు లు రాకుండా జాగ్రత్తపడాలి. రాత్రి పడుకొనే ముందు, ఉదయం లేచాక బ్రష్‌తో దంత ధావనం చేయాలి. ఏదైనా తిన్నవెంటనే తిన్న ఆహారం పళ్లల్లో ఇరు క్కోకుండా పుక్కిలించి ఉమ్మి వేసే అలవాటు చేసుకోవాలి. పోష కాహారం పట్ల మక్కువ చూపించాలి. ఆరునెలల కొకసారయినా దంతవైద్య పరీక్షలుచేయించుకోవాలి. దీనివల్ల అవసరాన్నిబట్టి అప్పటికప్పుడు చికిత్స చేయించుకొనే అవకాశం ఏర్పడుతుంది. గర్భిణి స్త్రీలు, పెరుగుతున్న పిల్లలు, తీసుకొనే ఆహారంలో 'కాల్షియం' ఉంటే, వచ్చే పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి పిల్లలకి తినే ఆహారం విషయంలోను, బ్రష్‌ చేసు కొనే విధానంలోను మంచి అలవాట్లు నేర్పించాలి. మన దంతాలు ఆరోగ్యంగా ఉంటే, మన శరీరం ఆరోగ్యం కూడా బావుంటుంది. దంతాలు కూడా మనిషి శరీర భాగాలలో ముఖ్యమయినవి, దంత వ్యాధులను నిర్లక్ష్యం చేసినట్లయితే, శరీర ఆరోగ్యానికే ప్రమాదమన్న విషయం గుర్తించగలిగితే, దంత వ్యాధులు రాకుండా జాగ్రత్తపడే అవకాశాలు అధికంగా ఉంటాయి.

 • దంత సంరక్షణలో స్కేలింగ్‌

జీవితాంతం దంతాలను ఆరోగ్యంగా ఉంచు కోవడాన్ని 'దంతసంరక్షణ' అనవచ్చు. మనం ప్రతిరోజు తీసుకొనే ఆహార పదార్థాలను, మెత్తగా నమలడానికి (మాస్టికేషన్‌) ముఖం అందంగా కన్పిం చడానికి (ఈస్థటిక్స్‌), చక్కని మాట స్పష్టత కోసం (ఫోనేషన్‌) ఉప యోగపడే మన దంతాల సంరక్షణ పంటి చిగుళ్ల ఆరోగ్యంమీద, దంత పరిశుభ్రతమీద, నోటి పరిశుభ్రత మీద ఆధారపడి ఉంటుంది. ఈ మూడింటిలోను దేనివల్ల లోపం జరిగినా, లేదా ఈ మూడింటి వల్ల లోపం జరిగినా అతి తక్కువ వయస్సులోనే దంతాలను కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది.

మన నోటిలో సహజంగా ఊరే 'లాలాజలం'లో, 'మ్యూసిన్‌' అనే జిగట పదార్థం ఉంటుంది. ఇది పళ్లమీద సన్నని ఫిల్ముమాదిరిగా అతు క్కొనిపోయి వుంటుం ది. దీనినే మనం 'పాచి' (ప్లేక్‌) అంటాం. నిత్యం సరయిన దంతధావనం లేకపోవడం వల్ల, ఈ పాచి రోజురోజుకు పొరలు పొర లుగా పేరు కొనిపోయి, గట్టి పదార్థంగా మారిపోతుంది. ఇలా గట్టిగా మారిన పాచినే 'గార' లేక 'టార్టార్‌' లేక 'కాల్‌క్యులస్‌' అంటారు. ఇది ఒక్కొక్కరిలో ఒక్కో మాదిరిగా కన్పిస్తుంటుంది. కొందరిలో, పంటి భాగానికి చిగురు భాగానికి సరిహద్దుగోడగా సన్నని గీత మాదిరిగా కన్పిస్తుంది. ఇది నల్లగాగాని, ముదురు గోధుమ రంగుగా గాని, కన్పిస్తుంది.

చిన్నపిల్లల దంతాల జాగ్రత్తలు, Care about teeth of children :


చిన్న పిల్లల దంతాలపై చాలామంది అంతగా శ్రద్ధ పెట్టరు. పాల పళ్ల ప్రాముఖ్యాన్ని అసలే పట్టించుకోరు. నిజానికి దంతాలు రావటం మొదలైనప్పటి నుంచే శుభ్రతను పాటించటం తప్పనిసరి. లేకపోతే దంతక్షయం దాడి చేసే ప్రమాదం ఉంది. చిన్న పిల్లలనే కాదు.. యుక్తవయసువారినీ దంతక్షయం అధికంగా వేధిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరేడేళ్ల వయసు వచ్చేసరికే 40 శాతం మంది పిల్లలు దంతక్షయంతో బాధపడుతున్నట్టు అంచనా. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవటం అత్యవసరం.

 • పాలపళ్లనూ తోమాలి
పాలపళ్లను శుభ్రం చేయాల్సిన అవసరం లేదని చాలామంది భావిస్తుంటారు. కానీ ఒక పన్ను వచ్చినా శుభ్రం చేయటం తప్పనిసరి. నిజానికి పళ్లు రాకముందు నుంచే వేలికి తడి వస్త్రాన్ని చుట్టుకొని చిగుళ్లను నెమ్మదిగా రుద్దుతుండాలి కూడా. ఇక పళ్లు వచ్చిన తర్వాత మెత్తటి బ్రష్‌తో.. రోజుకి రెండుసార్లు పళ్లు తోమాలి. పిల్లలు సొంతంగా పళ్లు తోముకునేంతవరకు పెద్దవాళ్లే తగు శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలు మారాం చేస్తున్నా.. తప్పకుండా బ్రష్‌ చేసుకునేలా చూడాలి. పళ్ల మధ్య దారంతో శుభ్రం చేసే పద్ధతినీ (ఫ్లాసింగ్‌) నేర్పించాలి.

 • నిద్రలో పాలసీసా ప్రమాదం
కొందరు తల్లులు పిల్లలు నిద్రపోతున్నప్పుడూ నోట్లో పాలసీసాను అలాగే ఉంచేస్తుంటారు. ఇది నోటి శుభ్రతను దెబ్బతీస్తుంది. పాలు, తీయటి ద్రవాల్లోని చక్కెర దంతాలకు అతుక్కుంటుంది. ఇది బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి దోహదం చేస్తుంది. ఇక బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ఆమ్లాలు దంతక్షయాన్ని కలిగిస్తాయి. దీనికి తగు చికిత్స చేయకపోతే పిల్లల ఎదుగుదల, గ్రహణశక్తి దెబ్బతినే ప్రమాదమూ ఉంది. కొన్నిసార్లు మాట్లాడే పద్ధతిపైనా ప్రభావం చూపొచ్చు.

 • కప్పులో పానీయాలు వద్దు

తాగటానికి వీలుగా ఉండే కప్పులో (సిప్పీ కప్‌) పళ్లరసాలు, తీయని పానీయాలు పోసి రోజంతా పిల్లలకు ఇవ్వటమూ మంచిది కాదు. వీటిని దీర్ఘకాలం వాడితే ముందుపళ్ల వెనకభాగం దెబ్బతినొచ్చు. అంతేకాదు ఊబకాయం వచ్చే అవకాశమూ ఉంది.

 • పడుకున్నప్పుడు తేనెపీకలా?
పిల్లలు ఏడ్వకుండా నోట్లో తేనెపీకలు పెడుతుండటం తెలిసిందే. మెలకువగా ఉన్నప్పుడు పర్వాలేదు గానీ వీటిని పడుకున్నప్పుడు వెంటనే తీసేయాలి. లేకపోతే పిల్ల దంతాల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఈ పీకలను గట్టిగా కొరకటం వల్ల ముందుపళ్లు దెబ్బతినొచ్చు. నోటి ఆకారమూ మారిపోవచ్చు. అందువల్ల నడుస్తున్న వయసులో పిల్లలకు అసలు తేనెపీకలు ఇవ్వకపోవటమే మంచిది.

 • =========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

కట్టుడు పళ్ళు ,డెంటల్‌ ప్రొస్థటిక్స్‌,Artificial Teeth


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము .- ఇప్పుడు కట్టుడు పళ్ళు (డెంటల్‌ ప్రొస్థటిక్స్‌,Artificial Teeth)-గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

కట్టుడు పళ్ళు ఎందుకు? అంటే, ముసలి వాళ్లు పడుచుగా కన్పించడానికని చెప్పడం సులభమైన సమాధానం. ఎంత వృద్ధాప్యంలో వున్నా కాస్త పడుచుగా కనపడదాం అనుకోవ డం మానవ సహజ లక్షణం. ఇక్కడ స్త్రీ/పురు షుల తేడా లేనేలేదు. అయితే, కట్టుడుపళ్ళు పెట్టుకొనేది కేవలం ముసలి వాళ్ళు మాత్రమే కాదుకదా! ¸°వ్వనంలో మిసమిసలాడు తున్న వాళ్ళు, వృద్ధాప్యానికి ముసుగు తొడగా లనుకొనే వృద్ధులు ఇలా ఎందరో కట్టుడు పళ్ళు వాడవలసిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఎదురుకావచ్చు కూడా. పైన చెప్పిన మాట ఒకనాటి మాట. ఈనాడు వీటికి అర్థాలు వేరు. అవసరాలు అనేకం.

మనదేశంలో కట్టుడు పళ్ళు పెట్టుకొంటే, వారు సాధారణంగా వృద్ధులయివుంటారు. ఎందుచేత నంటే ఇంకా కొద్దో గొప్పో మనం అంతా భారతీయ సంస్కృతికే కట్టుబడి వున్నాం, కనుక. పళ్ళు సరిగా తోముకొనకపోయినా కనీసం భోజనం అయిన తరువాత గాని, అల్పాహారం ముగించిన తరువాత గాని, చిరుతిండ్లు తిన్న తరువాత గాని నోరుపుక్కిలించే అలవాటు, కనీసం వేలితో పళ్ళు రుద్దుకొనే అలవాటు సంప్రదాయబద్ధంగా మిగిలిన ఉండడం వల్ల, వృద్ధాప్యంవరకు కాకపోయినా, నడివయస్సు వచ్చే వరకయినా దంతాలను కలిగి వుంటున్నారు. మన సమాజంలో చాలామంది. ఖరీదయిన టూత్‌ బ్రష్‌లు, పూటకొకరకం పేష్టులు వాడుకొనేవారు మన సమాజంలో తక్కువగానే ఉన్నా, ప్రకృతి సిద్ధమైన పను దోము పుల్లలతో పళ్ళు తోముకొనేవారు చాలామంది ఉన్నారు.

అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల పరిస్థితి వేరుగా వుంది. యాంత్రిక జీవిత విధానాలలో, వాటితో సరి పుచ్చుకొనే అలవాట్లతో పళ్ళు తోముకోవడానికి వాళ్ళకి సరిపడి నంత సమయం చిక్కదు. దంత సంరక్షణ మీద వారికి సమయం కేటాయించే అవకాశ మే ఉండదు. వీరిది పూర్తిగా 'టిష్యూ పేపర్‌' కల్చర్‌. ఏమి తిన్నా పలుచని కాయితంతో నోరు తుడుచుకొని అవతల పారేయడం వీరి నాగరికత. అభివృద్ధికి చిహ్నం. అందుచేత నే, వీరిలో ఎవరు కట్టుడుపళ్ళు పెట్టుకొన్నారో, ఎవరికి సహజసిద్ధ మైన పలువరుస ఉందో గమనించడం కష్టం. అంటే ఎక్కువ శాతం మంది కట్టుడు పళ్ళు గలవారే అక్కడ ఉంటారన్నది నగ్న సత్యం. కారణాలు ఏమైనప్పటికి కట్టుడు పళ్ళు ఎందుకు? అన్న విషయం విపులంగా తెలుసుకొనవలసిన అవసరం ఇక్కడ వుంది.

పై దవుడలో పదహారు పళ్ళు కింద దవుడలో పదహారుపళ్ళు, ఉండడం వల్ల, ఒకదానికి ఒకటి పోటీగా ఆనుకొని, దవుడకీలు సరైన పద్ధతిలో నిలిచి వుండడానికి అవకాశం వుంది. ఇలా లేనప్పు డు విశ్రాంతి సమయంలో, ఈ కీళ్ళకు సరిపడ పోటీలేక, అవి క్రిందికి జారడం ఆపైన నొప్పి కలగడం జరుగుతుంది. ఇరువైపుల ఈ దవుడకీళ్ళు బాలెన్సును నిలపడానికి తప్పనిసరిగా కట్టుడు పళ్ళు అవసరం అవుతాయి. రెండవదిగా పళ్ళుపోయిన వారు, తమ మిగిలిన కాలం ఆరోగ్యంగా వుండి బ్రతికి బట్ట కట్టడానికి సరయిన ఆహారం తీసుకోవాలి కదా! తీసుకొన్న ఆహారం సరిగా నమలబడాలి గదా! సరిగ్గా నమలని ఆహారపదార్థాలు జీర్ణం కావు కదా! ఈ పరిస్థితులలో కట్టుడుపళ్ళు అవసరం కాదంటారా? ఈ పళ్ళు అసలు పళ్లు మాదిరిగా నూటికి నూరుపాళ్ళు తమ కార్య కలాపాలను సాగించలేక పోయినా తొంబయిశాతం పనికి న్యాయం చేకూరుస్తాయి.

తరువాత, మాట స్పష్టతకోసం, అందంగా కన్పించడం కోసం, పళ్ళు పెట్టించుకోవచ్చు. బోసి నోటికి, పళ్ళు పెట్టుకొన్ననోటికి ఎంతో తేడా కన్పిస్తుంది. ఎందరో సినిమా నటులు, నాటక రంగానికి చెంది న నటీ-నటులు, తాము వృద్ధులయి దంతాలను కోల్పోయినప్పటికి కట్టుడు పళ్ళను పెట్టుకొని, హీరోలుగా మన ముందు నటిస్తున్న విషయం మనకు తెలిసిందే!

ఇక అసలు విషయానికొస్తే, శరీరంలో ఏ అంగం లోపించినా, దానికి ప్రత్యామ్నాయంగా కృత్రిమ అంగాలను అమర్చే విధానాన్ని 'ప్రొస్థటిక్స్‌' అంటారు. దంత వైద్యపరంగా ఈ విధానాన్ని 'ప్రొస్థటిక్‌ డెంటిస్ట్రి' లేక 'డెంటల్‌ ప్రొస్థటిక్స్‌' అంటారు. వాడుక భాషలో ఈ పద్ధతినే పళ్ళు కట్టించుకోవడం అంటారు.

కృత్రిమ దంతాలను అమర్చే విధానం అనుకున్నంత సులభం కాకపోయినా, పెద్ద కష్టమయిన పనేమి కాదు. ఈ దంతాలకు మాత్రం సహజదంతాలకు తీసుకొనవలసిన జాగ్రత్తలకంటే ఎక్కువ జాగ్రత్తలనే పాటించవలసి వుంటుంది. పూర్వం స్ప్రింగు పద్ధతుల ద్వారా దంతాలనమర్చేపద్ధతి వాడుకలో వుండేది. మాజీ అమెరికా అధ్యక్షుడు స్వర్గీయ జార్జ్‌వాషింగ్టన్‌, ఇటువంటి స్ప్రింగు దంతాలనే వాడేవారట. కాని ఇలాంటి స్ప్రింగు దంతాలు నోరుకొంచెం ఎక్కువగా తెరిస్తే వూడి క్రిందపడేవట. దీనితోపాటు స్వర నిర్భంధం కూడా జరిగేదట.

తరువాత, తేనెపట్టు మైనం (వాక్స్‌) ఉపయోగించి, దంత నిర్మాణం కావలసిన ప్రాంతాన్ని అచ్చుతీసి, తద్వారా సరయిన కొలతలతో దంతాలను నిర్మించడం వెలుగులోనికి వచ్చింది. ఈ పద్ధతి వల్ల కూడా ఆకృతి మార్పిడి వంటి లోపాలు ఎదురుకావడంతో క్రమంగా ఈ విధానానికి కూడా స్వస్థి పలకవలసి వచ్చింది.

రోజురోజుకి క్రొత్త రేకులు తొడుగుతున్న నాగరికతతో పాటు, శాస్త్ర విజ్ఞానం కూడా అమితంగా విప్పారడంతో 'ప్లాస్టర్‌ ఆఫ్‌ పారీస్‌' వంటి పొడులతో, అవసరమయిన చక్కటి ఆకృతులను తీసుకొనే అవకాశం కలిగింది. దీనికి భిన్నరూపం 'ఇంప్రెషన్‌ కాంపౌండ్‌' ఇది మామూలు పరిస్థితులలో గట్టిగా వుంటుంది. దీనిని దవుడలో ఒకటి లేక ఎక్కువ పళ్లు లేనప్పుడు వాటి స్థానంలో కృత్రిమంగా అమర్చుకొనే దంతాలను పాక్షిక దంతాలు అంటారు. పాక్షికదంతాలను తిరిగి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. అవసరమయినప్పుడు తీసి-పెట్టుకొనే అవకాశం కలిగి వుండ దంతాలు మొదటి రకం. వీటిని 'రిమువబుల్‌ పార్షియల్‌ డెంచర్స్‌' అంటారు దీనికి భిన్నంగా, అతి సహజంగా మళ్ళీ తీయడానికి అనువుకాకుండా, స్థిరంగా వుండే దంతాలు రెండో రకం. వీటిని 'ఫిక్స్‌ పార్షియల్‌ డెంచర్స్‌' అంటారు. ఇవి సహజ దంతాలకు అతి చేరువగా వుంటాయి.

ఇదే విధంగా 'పుల్‌ డెంచర్స్‌'లో కూడా రెండు రకాలు ఉన్నాయి. మొదటి రకం 'రిమువబుల్‌ పుల్‌ డెంచర్స్‌', రెండవ రకం 'ఫిక్స్‌డ్‌ పుల్‌ డెంచర్స్‌' వీటినే 'ఇంప్లాంట్‌ -డెంచర్స్‌' అని కూడా అంటారు. దవుడ ఎముకలో శస్త్ర చికిత్స చేసి తద్వారా ఈ పళ్ళను అమరుస్తారు. ఈనాడు ఈ చికిత్సా విధానం అధిక ప్రాధాన్యతను సంతరించుకొని వుంది. అయితే ఇది సామాన్యుడికి అందుబాటులో లేనివైద్యం. పైగా, అందరి శరీరం, ఇటువంటి కట్టుడుపళ్ళు పెట్టించుకోవడానికి అనుకూలంగా ఉండదు. ఇది సామాన్యులకు అందుబాటులోనికి వచ్చిననాడు, మరింత ప్రాచుర్యం పొందే అవకాశం వుంది.

ఇవి కాకుండా, పంటి ముక్కలపై తయారుచేసే పంటి తొడుగులు 'జాకెట్‌ క్రౌన్స్‌' అంగుటి భాగం కోల్పోయిన వారికి అమర్చే 'ఆబ్‌డ్యురేటర్లు' కృత్రిమ దంతాల సరసనే నిలుస్తాయి.

కృత్రిమ దంతాలను ధరించేవారు, దంతధావనం విషయంలో సహజ దంతాలపై తీసుకొనే శ్రద్ధ కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకోవలసి వుంటుంది. లేకుంటే నోటి దుర్వాసన వచ్చే అవకాశం వుంటుంది. సరిగా అమరని దంతాల విషయంలో దంతవైద్యుల దృష్టికి తీసుకువచ్చి, త్వరగా సరిచేయించుకోవాలి. విరిగిన కట్టుడు పళ్ళను, కదిలి వదులుగా ఉన్న కట్టుడు పళ్ళను ఎట్టి పరిస్థితిలోను వాడకూడదు.

ఒకరి దంతాలు మరొకరు వాడడానికి ప్రయత్నించకూడదు. సాధారణంగా ఒకరి దంతాలు మరొకరికి పట్టవు కూడా.

కట్టుడు పళ్ళను కట్టుడు పళ్ళగానే చూడాలి తప్ప, తమ గత సహజ దంతాలను దృష్టిలో ఉంచుకొని చూడకూడదు. తరువాత ఒకరికి ఉన్నమాదిరిగా, తమకు ఉండాలన్నది దురాశ అవుతుంది. ఎవరి దవుడ ఆధారంగా వారి దంతాలు తయారవుతాయన్నది గుర్తుంచుకోవాలి. • =======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, March 24, 2011

Medical Specialists , వైద్య నిపుణులుఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Medical Specialists , వైద్య నిపుణులు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

click here for List of Specialists->వైద్యనిపుణులు
 • .=======================================

Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, March 22, 2011

పిల్లలు పళ్ళుకొరుకుట , Teeth biting habit in children(Bruxism)ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పిల్లలు పళ్ళుకొరుకుట- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

కోపము తో కాక నిద్రలో మనము అప్పుడప్పుదు పళ్ళు కొరుకుతుంటాం . రాత్రుళ్ళు పిల్లలు మరీ కొరుకు తుంటారు తెలియకుండానే . అది వ్యాధి ... మరి రాత్రులు ఇలా పళ్ళు కొరుకోవడం నిజంగా భయపడవలసినదా! ... అవును . దీన్ని బ్రూక్సిజమ్‌ (Bruxism) అంటారు . తమ పళ్ళు తామే అస్తమానము కొరుక్కోవడం కొంతమందిలో అలవాటు గా మారుతుంది . చాలా మంది తల్లిదండ్రులు పిల్లలలో ఇది చూసి పట్టించుకోరు . సాదారణం గా ఇది మానసిక ఒత్తిడివల్ల తెలియకుండానే వస్తుంది . కాని పిల్లల్లో మానసిక ఒత్తిడి పసివయస్సులో ఉండదు కాని చదువు బరువవుతున్న వయసులో ఉండవచ్చు .. అలవాటుగా మారవచ్చు . కొంతమంది పిల్లలలో పళ్లు సరిగ తయారవనపుడు వచ్చే ఇబ్బంది భావనవల్ల పళ్ళు కొరుకుతుంటారు . దంతవైద్యులు దీన్ని పళ్ళలో వచ్చే మార్పుగా భావిస్తారు . పళ్ళలో ఏర్పడే హెచ్చుతగ్గులవల్ల పిల్లలో వచ్చే రాపిడికి తెలియకుండ నిద్రలోను , మామూలుగాను పళ్లు కొరుకుతూ ఉంటారు . ఇది అలవాటుగా మారకూడదు .

ఈ మధ్య లక్నోలో జరిగిన ఒక పరిశోధన లో పిల్లలఓ పరీక్షలు , స్కూలులో మిగిలిన వర్కు , సెమినార్లు వంటి వాటివల్ల వచ్చే మానసిక ఒత్తిడి వల్ల ఈ పళ్ళు కొరకడం ఒక లవాటుగా వస్తుందని సూచిందినది . మిగతావాళ్ళతో తమను పోల్చిచూసుకోవడం తో వచ్చే స్పర్ధవల్ల వచ్చే ఒత్తిడి ఈ పళ్ళ కొరకడం అలవాటుకి కారణం అవుతోందని .. ఇది ఆడపిల్లలలోనూ వస్తుందని గుర్తించారు . చాలా మందిలో ఉండే ఈ మానసిక ఒత్తిడి , ఆరాటం (anxiety, stress) తమకి తెలియకుండా చేసే ఈ పళ్ళు కొరుక్కోవడం గా బహిర్గతమఫుతాయని వాళ్ళ భావన . ఇది పెద్ద వ్యాధి కాకపోవచ్చుకాని భవిష్యత్తులో అలవాటుగా మారకూడదు . మామూలుగా కాదు కాని పళ్ళు పూర్తిగా నిర్మించబడ్డాక , జ్ఞానదంతం ఏర్పడ్డాక కూడా ఈ పళ్లు వాళ్ళకి తెలియకుండా కొరుక్కుంటుంటే అది మంచి అలవాటు కాదు . పెద్దలు జాగ్రత్తపడాలి .

పిల్లలు రాత్రుళ్ళు పక్కవాళ్ళతో పడుకున్నప్పుడు పళ్ళు కొరు్కుతుంటే వాళ్ళు గమనించి చెప్పినప్పుడు జాగ్రత్త పడాలి . పళ్ళలో హెచ్చు తగ్గులు ఉంటే దంతవైద్యుని సంప్రదించి సరిచేయించుకోవాలి . సాదారణము గా దంతవైద్యులు పిల్లలు పళ్ళు కొరికే విషయం లో చేసేది చాలా తక్కువ . ఎందుకంటే ఇది సాధారణం గా ఇతర కారణాల వల్ల వస్తుంది కాబట్టి . ఒక్కొక్కసారి ఈ " బ్రూక్సిజమ్‌ " విపరీతమై వారి పెద్దలకు , ఇతరులకు ఆదుర్దా , ఇబ్బంది కలుగజేస్తుంది . ముఖ్యము గా ఈ పళ్ళు కొరకడం తోపాటు ముఖం ఉబ్బటం , తలనొప్పి , దవడలు నొప్పిగా ఉండడం వంటివి వస్తే అప్పుడు తొందరపడాలి .

ముఖ్య కారణాలు :
 • పాలపళ్ళు పెద్దవి గా ఉండడం ,
 • పై వరుస పళ్ళు హెచ్చు తగ్గులు గా ఉండడం ,
 • మానసిక ఒత్తిడి ఇతరులకి చెప్పుకోలేక తమలో తామే బాధపడుతూ ఉండడం ,
 • ప్రతిదానికీ ఆదుర్ధాపడడం ,
 • చాలా దూకుడుగా ఉండే ప్రవృత్తి ఉండడం ,
పళ్ళు కొరకడం అనేది పిల్లలలో అలవాటుగా మారిందనటానికి గుర్తులు :
 • నిద్రలోనే కాకుండా మాములుగా కూడా అప్పుడప్పుడు పళ్లు కొరుక్కోవడాం
 • అస్తమానము గోళ్ళు కొరుక్కోవడం ,
 • బొటనవ్రేలు నోటిలో పెట్టుకొని చప్పరించడం ,
 • దవడ జారిందని , నొప్పిగా ఉందని అనడం ,
 • బుగ్గ ఉబ్బి ఉండడం ,
చికిత్స సూచనలు :

 • పిల్లలు పళ్ళు కొరుక్కోవడం అలవాటు కి చదువో , పని ఒత్తిడో అని అనిపిస్తే రాత్రి పడికునే ముందు ఒక కప్పు వేడి పాలు పటిక బెల్లం కలిపి ఇవ్వండి .
 • తనకిస్టమైన జానపద , పురాణకథల పుస్తకాలో , కార్టూన్‌ పుస్తకాలో చదువుతూ పడుకోమనండి .
 • పళ్ళకి పెట్టుకునే " నైట్ గార్డ్ " అనే ప్లాస్టిక్ క్లిప్పులు వచ్చాయి. వైద్యుల సహాయము తో వాడండి .
 • మానసికం గా పిల్లలను తయారు చేయాలి , • =============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, March 21, 2011

మన శరీరములో లివర్ ,Liver in our body,కాలేయము,ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మన శరీరములో లివర్ (Liver in our body)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

 • కాలేయం శరీరంలో ఉండే అవయవాలలోకెల్లా (చర్మము తరువాత) పెద్ద అవయవం. శరీరంలో అన్ని రకాల సౌకర్యాలతో కూడిన జీవ రసాయన ప్రయోగశాలగా దీనిని అభివర్ణించవచ్చు. కార్బొ హైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవ ణాలు మొదలైన వాటి జీవక్రియను ఇది నిర్వహిస్తుంది. అలాగే శరీరంలో ఉష్ణశక్తిని ఉత్పత్తి చేసే అవయవంగా పని చేస్తుంది.
కాలేయం ఉదరభాగంలో కుడివైపు పైభాగంలో ఉంటుంది. గర్భస్థ శిశువులో దీని పరిమాణం పెద్దల్లో కంటే ఎక్కువగా ఉంటుంది. దీనిలో కుడి, ఎడమ ప్రక్కల రెండు లోబులు ఉంటాయి. ప్రతి లోబులోనూ అనేక చిన్న లోబులుంటాయి.
చివరి వరకూ పెరిగే అవయవం కాలేయం--కడుపులో కోన్‌ ఆకారంలో, ముదురు ఎరుపు రంగులో, మెత్తగా ప్రకాశిస్తూ స్పాంజ్‌లా ఉండే కాలేయం ఎవరికైనా శరీర బరువులో 2-3% మధ్యలో ఉంటుంది. కడుపులో కుడిభాగాన, ఉదర వితానం కింద ఉరః పంజరంలో ఉంటుంది.

కాలేయ నిర్మాణం
కాలేయానికి రెండు లోబ్స్‌ ఉంటాయి. ఒక్కో భాగంలోనూ మళ్ళీ నాల్గేసి విభాగాలుంటాయి. వీటిని ‘సెగ్మెంట్‌’ అంటారు. ఒక్కో సెగ్మెంట్‌ విడివిడిగా ఉండగల్గుతుంది. ఎలాగంటే ప్రతీదానికీ రక్తం లోపలికి వెళ్ళే రక్తనాళాలు, బయటకు రక్తాన్ని తీసుకొచ్చే రక్తనాళాలు వేరువేరుగా ఉన్నాయి. అంటే ఒక విధంగా చెప్పాంటే ఒక అపార్ట్‌మెంట్‌లో ఎనిమిది ఫ్లాట్లు ఉన్నట్లు ఎనిమిది వేరువేరు సెగ్మంట్‌లో కాలేయముంటుంది. ఏ ఫ్లాట్‌కి ఆ ఫ్లాట్‌కి నీటి సరఫరా లోపలికి, మురుగు బయటకు వెళ్ళే ఏర్పాటున్నట్లు కాలేయ ప్రతి సెగ్మంట్‌కి రక్త ప్రసరణ చేసే, తిరిగి వెనక్కి తెచ్చే నాళాలున్నాయి. ఇలాంటి నిర్మాణం ఉండడం వల్లే కంతులు లాంటివి ఏమైనా వస్తే కాలేయంలో ఆ భాగాన్ని తొలగించగల్గుతున్నారు. అలాగే బతికున్నవాళ్ళు దగ్గర బంధువులకు కాలేయంలో కొంతభాగాన్ని దానం చేయగల్గుతున్నారు. కాలేయంలో మూడవ వంతున్నా అది చేసే పనులన్నీ చేయగల్గుతోంది. అలాగే రెండు, మూడు నెల్లో అది మామూలు పరిమాణానికి పెరగగలదు.

కాలేయ ప్రత్యేకతలు
కాలేయంలో 70% దెబ్బతిన్నా మిగిలిన భాగం అన్ని పనుల్నీ నిర్వర్తించగలదు. చనిపోయే వరకూ పెరిగే ఏకైక అవయవం కాలేయం. మూడో భాగం మిగిలి మిగతాది తెగిపోయినా, రెండు నెల్లో ఉన్న కాలేయం పూర్తి స్థాయికి పెరుగుతుంది.

కాలేయ అనారోగ్యాలు
కాలేయ సింథటిక్‌ ఫంక్షన్‌ దెబ్బ తినడంతో రక్తస్రావం, కామెర్లు, ఎన్‌కెఫలోపతి లాంటి అనారోగ్యాలు కలుగవచ్చు. విసర్జన పని దెబ్బ తినడంతో కామెర్లు పుట్టుకతో రావచ్చు. బలియరీ ఎట్రేషియా అంటారు. లేకపోతే పెద్దయిన తర్వాత గాల్‌స్టోన్స్‌, కంతులు రావచ్చు. వీటిని తొలగించడానికి లాప్రోస్కోపిక్‌ సర్జరి చేయాల్సి రావచ్చు. సిర్రోసిస్‌ వల్ల రక్తప్రసరణలో అడ్డంకులేర్పడితే ‘పోర్టల్‌ హైపర్‌టెన్షన్‌’ కలుగవచ్చు. రక్తవాంతులు కావచ్చు, కడుపులో నీరు చేరడాన్ని ఎసైటిస్‌ అంటారు.
 • కాలేయంలో బైల్‌ అనే జీర్ణరసం తయారవుతుంది. ఈ రసం కాలేయ నాళాల ద్వారా పిత్తాశయంలోకి చేరుతుంది. అక్కడ చిక్కగా తయారై, పిత్తాశయ నాళాల ద్వారా చిన్న ప్రేవుల్లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి ఇది తోడ్పడుతుంది. ఈ బైల్‌తోపాటు క్లోమ రస గ్రంథినుంచి వచ్చే స్రావాలతో కలిసి ఆహార పదా ర్థాలు జీర్ణమవుతాయి.శరీరానికి కావలసిన పదార్థాలు ప్రేవుల ద్వారా పీల్చుకుని రక్తంలో కలిసి పోర్టల్‌ సిరల ద్వారా కాలేయానికి చేరుతాయి. ఈ పదార్థాలు (కార్బొహైడ్రేట్లు, ప్రోటీనులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు) కాలేయంలో జరిగే జీవక్రియ ద్వారా శరీరశక్తిని, ఉష్ణశక్తినిఉత్పత్తి చేయడానికి ఉపయోగ పడతాయి.

కాలేయం విధులు
 • *గర్భంలోని శిశువులో ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడం, పెద్దలలో ఎర్ర రక్త కణాలను విచ్ఛిన్నం చేయడం.
 • *శరీరంలోని రక్తాన్ని నిలువఉంచడం,క్రమబద్దీకరించడంరక్త గడ్డ కట్టడానికి విటమిన్‌ కె ద్వారా ప్రోత్రాంబిన్‌, ఫైబ్రి నోజెన్‌లను ఉత్పత్తి చేయడం.
 • మాస్ట్‌ కణాల ద్వారా హెపారిన్‌ను ఉత్పత్తి చేసి రక్త నాళాలలో రక్తం గడ్డ కట్టకుండా సహాయపడటం.
 • రెటిక్యులో ఎండోథీలియల్‌ (ఆర్‌ఇ) వ్యవస్థ ద్వారా ఇమ్యూన్‌ మెకానిజంలో పని చేయడం
 • పోర్టల్‌ ధమనుల ద్వారా వచ్చిన రక్తాన్ని శరీరంలో ప్రవ హించే రక్తంలో కలపడంప్లాస్మా ప్రొటీన్లను ఉత్పత్తి చేయడం.
 • ఎర్ర రక్త కణాలు, హీమోగ్లోబిన్‌ తయారీకి కావలసిన ఇనుప ధాతువు, విటమిన్‌ బి12, రాగి ధాతువులను నిలువ చేయడం .
 • కాలేయం నిముషానికి 75 మి.లీ. లింఫును ఉత్పత్తి చేస్తుంది. దీనిలో ప్రొటీను 90 శాతం ఉంటుంది. కాలేయానికి సబంధించిన లింఫు నాళాల ద్వారా ప్రతి 24 గంటలలో 40 శాతం ప్లాస్మా ప్రొటీన్లు రక్తంలోకి చేరుతాయి.
 • పిత్త రసము తయారీకి ఉపయోగపడటం.
 • కార్బొహైడ్రేట్లను గ్లయికోజెన్‌ రూపంలో నిలువ ఉంచడం.
 • శరీరంలోని గ్లూకోజ్‌ను నియంత్రించడంకార్బొహైడ్రేట్లనుంచి కాకుండా ఇతర పద్ధతుల ద్వారా గ్లూకోజును తయారు చేయడం,
 • కొవ్వు పదార్థాలను కార్బొహైడ్రేట్లునుంచి తయారు చేయడం.
 • మద్యం (ఆల్కహాల్‌) మెటబాలిజానికి ప్రధాన స్థానంగా వ్యవహరించడం.
 • కొవ్వు పదార్థాలను నిలువ చేయడంఆమ్లజనీకరణ (ఆక్సిడేషన్‌) అనే ప్రక్రియ ద్వారా కొవ్వు నుండి అడినోసిన్‌ ట్రై ఫాస్ఫేట్‌ (ఎటిపి) అనే శక్తిని ఉత్పత్తి చేయడం.
 • ఎసిటేట్‌నుంచి కొలెస్టరాల్‌ను, కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లనుంచి కొవ్వు పదార్థాలను, ఫాస్ఫోలిపిడ్స్‌ను ఉత్పత్తి చేయడం.
 • కీటోన్‌పదార్థాలను ఉత్పత్తి చేయడం.విటమిన్‌ ఎ, డి, ఇ, కెలను నిలువ చేయడం.
 • డీ అమైనేషన్‌కు ప్రధాన కేంద్రంగా వ్యవహరించడం, యూరియా, యూరిక్‌ యాసిడ్‌ల ఉత్పత్తి, కొన్ని అమైనో యాసిడ్‌ల తయారీకి, ప్లాస్మా ప్రొటీన్ల (ఇమ్యునోగ్లోబిన్‌ కాకుండా మిగిలినవి) తయారీకి తోడ్పడటం.
 • హార్మోన్లు,విటమిన్‌లమెటబాలిజంలో తోడ్పడటం.
 • భారీ లోహ పదార్థాలు, ఎక్కువ సాంద్రత కలిగిన ఖనిజా లను, బ్యాక్టీరియా, కొలెస్టరాల్‌, బైల్‌ పిగ్మెంట్లు, బైల్‌ను పిత్తం లోకి విసర్జించడం.
 • శరీరాన్ని దెబ్బతీసే విషపదార్థాలను, మందులను ఆక్సిడే షన్‌, హైడ్రాలిసిస్‌, రిడక్షన్‌, కాంజుగేషన్‌ ప్రక్రియల ద్వారా నాశనం చేయడం,
 • శరీరంలోని ఉష్టాన్ని క్రమబద్ధీకరించడం.

కాలేయం పైన పేర్కొన్న విధులను నిర్వర్తిస్తుంది. కాలేయా నికి సమస్య ఏర్పడినప్పుడు మనిషి అనేక ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తుంది.
 • =====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

దంతక్షయం ,Dental caries


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -దంతక్షయం (Dental caries)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

---యాంత్రికమయమైపోయిన ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరూ అనేక రకాల ఆందోళనలకు, ఆదుర్దాలకు గురవుతూ, తద్వారా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు లోనవుతున్నారు. ఇలాంటి వాటిలో మనం ప్రస్తావించుకోవాల్సిన అంశం - దంతక్షయం. దంతక్షయం అంటే సహజంగా పంటి మీద ఉండే పింగాణి లాంటి పదార్థం అరిగిపోవడం. దానికి కారణం నోటి లోపల విడుదలయ్యే కొన్ని ఆమ్లాల ప్రభావం. పంటిమీద ఉండే పింగాణిపొర పంటి లోపలి భాగానికి రక్షణ కవచంగా ఉంటుంది. పింగాణి పొర అరిగిపోతే పంటిలోపలి సున్నితమైన భాగం బయటపడుతుంది. దీనివల్ల ఆహారం తినేటపుడు పళ్ళులాగడం, చల్లని వెచ్చని ఆహార పదార్థాలు పంటికి తగిలితే ఓర్చుకోలేకపోవడం జరుగుతుంది. ఒక్కోసారి వాంతి వచ్చినట్లు అనిపిస్తుంది.

 నిర్వచనము :

కొన్ని కఠిన పరి స్థితులలో, దంతాలు విరిగి వాటిలో చిల్లులు ఏర్పడుతాయి. దీనిని దంతాలు పుచ్చి పోవటం లేదా ''దంతక్షయం (Dental caries)'' అంటారు. పళ్ళమధ్య సందులు ఏర్పడటం, పళ్ళు గుల్లగా కావడం లేదా పళ్ళు అరిగినట్లు ఉంటే దంతక్షయంగా భావించాలి. దంతక్షయం వల్ల పంటి లోపలి భాగాలు పైకి కనిపించడం, పళ్ళు నల్లగా, పచ్చగా ఉండటం జరుగుతుంది. ఈ విధంగా సున్నితమైన పంటి భాగం బయటపడడం వల్ల వేడి, చల్లని, తీపి పదార్థాలు తినేటప్పుడు, త్రాగేటప్పుడు పళ్ళు చాలా తీవ్రంగా గుంజి నట్లు అనిపిస్తాయి.ఇది ఎనామిల్‌లో కొంత ఖాళీతో ప్రారంభం అవు తుంది. ఈ దశలో నరాలు, పల్స్‌ దంతాలను బలహీనపరచి మంట, వాపు, నొప్పి వుండి దంతాలు ఊడిపోయేందుకు దారి తీస్తాయి. ఇది సర్వ సాధారణమైనదా?...దంతాలు పుచ్చిపోవ టమనేది సర్వసాధారణమైన దంత సమస్య. ఇది ఏ వయస్సు లోనైనా ఏ సమయంలో నైనా రావచ్చును. అయితే తీపి పదా ర్థాలు, బేవరేజస్‌ క్రమం లేకుండా తినటం వలన దంతాలు పుచ్చిపో వటం ప్రారంభమవుతుంది. కనుక ఇది ఇతర వయసుల వారి కంటే, చిన్న వయస్సు, యవ్వన దశలోని వారిలో ఎక్కువ ఉంటుంది. శిశువుకు కనపడే ఒక రకమైన ఈ లక్షణాన్ని నర్సింగ్‌ క్యారిస్‌(nursing carries) అంటారు.


ఎలా తెలుసుకోవాలి
పళ్ళమధ్య సందులు ఏర్పడటం, పళ్ళు గుల్లగా కావడం లేదా పళ్ళు అరిగినట్లు ఉంటే దంతక్షయంగా భావించాలి. దంతక్షయం వల్ల పంటి లోపలి భాగాలు పైకి కనిపించడం, పళ్ళు నల్లగా, పచ్చగా ఉండటం జరుగుతుంది. ఈ విధంగా సున్నితమైన పంటి భాగం బయటపడడం వల్ల వేడి, చల్లని, తీపి పదార్థాలు తినేటప్పుడు, త్రాగేటప్పుడు పళ్ళు చాలా తీవ్రంగా గుంజి నట్లు అనిపిస్తాయి.

కారణాలు
మనం ఏదైనా ఆహార పదార్థం తిన్నప్పుడు, త్రాగిన ప్పుడు ప్రతిసారీ మన పంటి మీది పింగాణి పొర మృదువుగా కావడం లేదా మనం తీసుకున్న ఆహార పదార్థంలో ఖనిజ లవణాలను బట్టి కొంత నష్టపోవడం జరుగుతుంది. నోటిలో లాలాజలం ఈ పరిస్థితిని తగ్గించి, మన నోటిని కాపాడుతూ ఉంటుంది.

-అయితే ప్రతిసారి ఆమ్లపు ప్రభావం నోటి మీద ఎక్కువగా ఉంటే లాలాజలం దీనిని తగ్గించడానికి కష్టమవడమే కాకుండా పళ్ళ మధ్య ఇరుకున్న చిన్న, అతి సూక్ష్మ పదార్థాలు, పింగాణి పొరను పాడుచేసి మనం బ్రష్‌ చేసుకున్నప్పుడు ఈ పొర కొద్ది కొద్దిగా నష్టపోవడం జరుగుతుంది.

ఇతర సమస్యలు
ఆహారం తినేటప్పుడు కష్టమవడం, వాంతి వచ్చి నట్లు అనిపించడం, అనారోగ్యం ఫలితంగా బరువు తగ్గడం వీటికి నోటి లోపల ఆమ్లాలు వాంతి ద్వారా నోటి బయటకి రావడం జరుగుతుంది.

ఆమ్లాల ప్రభావం
ఎన్నోరకాల అనారోగ్య పరిస్థితులు ఈ దంత క్షయానికి కారణం కడుపులో ఆమ్లాలు నోటిలోకి రావ డమే. దీనిని గ్యాస్ట్రో ఈసోఫేజియల్‌ రిఫ్లక్స్‌ డిసీజ్‌ అంటారు. నోటినుండి కడుపులోకి ఆహారం వెళ్ళే మార్గం పుండు పడటం మొదలైన వాటితో బాధపడే వారు మద్యం ఎక్కువగా సేవించేవారు ఎక్కువగా వాంతి చేసుకోవడం కారణంగా ఆమ్ల ప్రభావానికి గురై దంతక్షయానికి గురవుతారు.

ఇక్కట్లు
డెంటైన్‌ అనేది సున్నిమైన పంటిభాగం. ఇది బయ టపడినపుడు పళ్ళు రంధ్రాలు పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ డెంటిన్‌ అనేది సున్నితం కావున వేడి, చల్లని, తీపిపదార్థాలు తిన్నా త్రాగినా పళ్ళ బాధ కలగడం జరుగుతుంది. దంతక్షయం వలన పళ్ళు చూడడానికి అందవిహీనంగా ఉంటాయి. పళ్ళు రంగు మారి చిన్నవిగా అవుతాయి.

ఆహారం పాత్ర
నిమ్మ, నారింజ మొదలైన సిట్రిక్‌ ఆమ్లం కల్గిఇన పళ్ళు, పళ్ళరసాలు పళ్ళకు హాని కలిగిస్తాయి. ఆమ్ల స్వభావం కల్గిన ఆహార పదార్థాలు, పళ్ళ రసాలు కూడా పళ్ళకు కొద్దిగా హాని కల్గిస్తాయి. సోడా గ్యాస్‌ కలిగిన ద్రవాలు, కూల్‌ డ్రింక్స్‌ పళ్ళకు హానిచేస్తాయి. ఆమ్ల స్వభావం కల్గిన ద్రవాలు ఆహార పదార్థాలు ఒక్కసారి భోజన సమయంలో మాత్రం తీసుకోవచ్చు. అయితే ఇలాంటి పదార్థాలు తిన్న, త్రాగినా తర్వాత ఒక గంట వ్యవధిలో బ్రెష్‌ చేసుకుంటే తిరిగి మినరల్స్‌ వృద్ధి అయి దంతక్షయం తగ్గుతుంది. ఆమ్లపూరితమైన ఆహార పదార్థాలు తిన్నా త్రాగినా పంటిపై వాటిప్రభావం ఉండి పళ్ళు గారపట్టడం జరు గుతుంది. ఇది దంతక్షయానికి, పంటి మీద పింగాణి పొర పాడవడానికి కారణం అవుతుంది. చక్కెర లేని చూయింగ్‌ గమ్స్‌ 20 నిముషాలపాటు నవలడం వలన మంచిఫలితాలు ఉంటాయి.

ఆల్కహాలు ప్రభావం
అన్నిరకాల ఆల్కహాల్‌ డ్రింక్స్‌ దంతక్షయానికి కారణం. ఎందువల్లనంటే వాటిలో ఎక్కువగా పుల్లని పళ్ళరసాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఆల్కహాలు తీసుకోకూడదు .

చికిత్స
దంతక్షయం నివారణకు ప్రత్యేక చికిత్స ఎప్పుడూ అవసరం ఉండదు. తరచుగా దంతవైద్యడ్ని సంప ద్రించి నోటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే దంతక్షయం రాకుండా నివారించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఫిల్లింగ్‌ చికిత్సద్వారా అరిగిన పళ్ళకు చికిత్స చేస్తారు.

ట్రాబెర్రీని సగానికి కోసి,ఆ ముక్కతో దంతాల మీద సున్నితంగా రుద్దాలి. పచ్చగా మారిన దంతాలు తెల్లగా అవుతాయి.

for more details see telugu wikipedia.org • ============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, March 20, 2011

మూర్ఛలకు- స్పృహ తప్పడానికి మధ్య భేదం ,Difference between Fits and Unconsciousnessఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మూర్ఛలకు- స్పృహ తప్పడానికి మధ్య భేదం (Difference between Fits and Unconsciousness)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

స్పృహ తప్పడాన్ని లక్షణ సందర్భాలనుబట్టి వివిధ రకాలుగా పిలుస్తారు. అనేక సందర్భాలు, వివిధ రకాల స్థితిగతులు మనిషిని తెలివి తప్పేలా చేస్తాయి. ఉదాహరణకు శరీరంలో రక్తభారం(B.P) హఠాత్తుగా తగ్గడం, ఫిట్స్‌, గుండె స్పందనలో అపక్రమం చోటు చేసుకోవటం, మెదడుకు హఠాత్తుగా రక్త సరఫరా తగ్గి ట్రాన్సియంట్‌ ఇస్కిమిక్‌ అటాక్‌ రావటం ఇత్యాదివన్నీ స్పృహ తప్పడానికి కారణాలే.

ఒక్కొక్క వ్యాధికి చికిత్స అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది కనుక ఏ కారణం వలన స్పృహ తప్పారన్నది తెలుసుకోవడం ముఖ్యం.

చాలామంది ఫిట్స్‌నూ, తెలివి తప్పిపడిపోవడాన్ని ఒకే వ్యాధిగా భ్రమ పడుతుంటారు. ఈ రెండు సందర్భాలలోనూ బాధితుడికి చుట్టుపక్కల ఏం జరుగుతున్నదో తెలియదు కనుక రెండూ ఒకవే విధమైన వ్యాధులుగా భావిస్తుంటారు. అయితే, ఫిట్స్‌కూ స్పృహ తప్పి పడిపోవడానికీ మౌలికంగా చాలా భేదముంది. ఫిట్స్‌/మూర్ఛల్లో శరీరం బిగుసుకుపోతుంది. కాళ్లూ చేతులూ కొట్టుకుంటూ ఉంటాయి. లేదా మెలికలు తిరిగిపోతాయి. నోటినుంచి నురగ వస్తుంది. బట్టలో మూత్రం పడిపోతుంది. నాలుక దంతాల మధ్య ఇరుక్కుంటే తెగే అవకాశం కూడా ఉంది. స్పృహ తప్పిపడిపోయినప్పుడు ఈ లక్షణాలేమీ కనిపించవు. సొమ్మసిల్లి పడిపోతారంతే. అచేతనంగా, మొదలు నరికిన మానులాగానేలమీద పడిపోతాru. ఈ రెండు స్థితుల్లోనూ వేర్వేరు పూర్వరూపాలు కనిపిస్తాయి. వీటినే ఆరా అంటారు.

ఉదాహరణకు
సొమ్మసిల్లి పడిపోబోయే ముందు కళ్లు బైర్లు కమ్మడం, చూపు మసకబారడం, తల తిరగడం, కాళ్లూ చేతులూ చల్లగా మారడం, చెమటలు కారడం తదితర లక్షణాలు ఉంటాయి.
మూర్ఛలు రాబోయే ముందు లేని శబ్దం వినబడటం, కళ్ల ముందు రకరకాల రంగులు కనిపించడం వంటి వింత భావనలు ఉంటాయి.
గుండె భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా శరీరంలోని రక్తాన్ని తల భాగానికి సరఫరా చేస్తుంది. అలా చేయలేనప్పుడు మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా తగ్గుతుంది కనుక స్పృహ తప్పుతుంది. మూర్ఛ వచ్చినప్పుడు కానీ, సొమ్మసిల్లినప్పుడు కానీ మనిషి నేల మీద పడిపోవడంలోని ఆంతర్యం తలకు రక్త సరఫరా అందాలనే. నేలమీద బల్లపరుపుగా పడుకుంటే తలకు రక్తసరఫరా తగినంతగా అందుతుంది. రోడ్డు మీద ఎవరైనా పడిపోతే చుట్టూ చేరిన వాళ్లు వారిని లేపి కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. నేల మీద బల్లపరుపుగా పడుకోబెట్టడమే మేలు. ఇలా చేయడం వలన పడిపోయిన వ్యక్తికి త్వరగా మెలకువ వస్తుంది.

ఒక్క ఉదుటున లేచి కూర్చున్నప్పుడు, వేడి వాతావరణం నుంచి హఠాత్తుగా చల్లని వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు స్పృహ తప్పుతున్నట్లు ఉంటుందా?
నేలబారుగా అమర్చిన నీటిపైపులో నీరు ప్రవహిస్తున్నప్పుడు హఠాత్తుగా దానిని పైకి ఎత్తితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఒక్కక్షణం పాటు పైపునుంచి నీరు ప్రవహించడం ఆగిపోతుంది. సరిగ్గా ఇదే తరహా ప్రక్రియ మన శరీరంలో కూడా జరుగుతుంది. దీనిని పాస్ట్యురల్‌ హైపోటెన్షన్‌ అంటారు. ఉధృతంగా దగ్గుతున్నప్పుడూ, అదే పనిగా తుమ్ముతున్న ప్పుడూ, శ్వాసను వేగంగా తీసుకుంటున్నప్పుడూ కళ్లు బైర్లు కమ్మి పడిపోయే అవకాశం ఉంది. కుర్చీలోనుంచి హఠాత్తుగా లేచి నిలబడినప్పుడు, తలను వేగంగా తిప్పినప్పుడూ తలకు రక్త సరఫరా తగ్గి స్పృహ కోల్పోతున్నట్లుగా అనిపిస్తుంది.
ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు శరీరం కొత్త భంగిమకు అలవాటు పడేలా కొంచెం సేపు ఆగితే సరిపోతుంది. ఉదాహర ణకు మంచం మీదనుంచి లేచేటప్పుడు ఒకేదఫాలోకాకుండా రెండు మూడు దశల్లోఅంటే లేచికూర్చున్న తరువాత కొంచెం సేపూ, కూర్చొని నిలబడిన తరువాత కొంచెంసేపూ సమయం తీసుకుని లేవాలి.

మందులు వాడుతున్నారా?
అనేక రకాల అల్లోపతి మందులకు రక్తభారాన్ని తగ్గించేలా, స్పృహ తప్పి పడిపోయేలా చేసే నైజం ఉంది. బ్లడ్‌ ప్రెషర్‌ను తగ్గించే మందులు వీటిలో ప్రధానమైనవి. ముఖ్యంగా మూత్రాన్ని జారీ చేసే డైయూరిటిక్స్‌ తీసుకున్నప్పుడు ఈ లక్షణం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే కాకుండా గుండె నొప్పిలో వాడే గ్లిజరిల్‌ ట్రైనైట్రేట్స్‌కు, మత్తు కలిగించే ట్రాంక్విలైజర్స్‌కూ, బిపి కోసం వాడే బీటా బ్లాకర్స్‌కు కుంగుబాటులో వాడే యాంటి డిప్రసెంట్స్‌కు, గుండె స్పందనలను క్రమబద్దీకరించడానికి వాడే డిగాక్సిన్‌కు, పార్కిన్‌సన్స్‌ వ్యాధిలో వాడే లెవొడోపాకు ఈ లక్షణం ఉంటుంది. ఈ మందుల్లో వేటినైనా వాడుతున్నప్పుడు స్పృహ తప్పుతున్నట్లు అనిపిస్తే వెంటనే ఆ విషయాన్ని మీ డాక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లడం మంచిది.

తరచుగా గుండె దడ, ఛాతి నొప్పి వంటివి వస్తుంటాయా? గుండె శబ్దాల్లో మర్మర్స్‌ వినిపిస్తుంటాయా?
గుండె స్పందన వేగం మరీ తక్కువగా - అంటే నిముషానికి 50 కంటే తక్కువగా ఉంటే మెదడుకు రక్తసరఫరా పూర్తిస్థాయిలో అందకపోవడం వల్ల స్పృహ తప్పుతుంది. గుండె కండరాలు బలహీనంగా మారినప్పుడు హార్ట్‌బ్లాక్‌ ఏర్పడి స్పందనల సంఖ్య తగ్గిపోతుంది. గుండె వేగంగా అంటే నిముషానికి 200 సార్లకు పైగా కొట్టు కుంటున్నా సమస్యే. గుండె పూర్తిస్థాయి సంకోచ వ్యాకోచాలు జరుగవు కాబట్టి మెదడుకు రక్తసరఫరా పరిపూర్ణంగా అందదు. ఈ పరిస్థితి కూడా గుండె కవాటాలు వ్యాధిగ్రస్తమవడం వల్ల తలెత్తుంది. గుండె కవాటాలకు చెందిన వాల్వులర్‌ వ్యాధులూ, గుండె కండరాలకు రక్తసరఫరా తగ్గడం వలన ఏర్పడే హార్ట్‌ ఎటాక్‌ వంటి వ్యాధులూ మెదడుకు రక్త సర ఫరాను తగ్గించి స్పృహ కోల్పోయేలా చేసే అవకాశం ఉంది. ఈ తరహా సమస్యలకు వైద్య సహాయం తప్పనిసరి. ఇలాంటి సమ స్యలకు ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

కడుపునొప్పితోపాటు మలం నల్లని రంగులో వెలువడు తుందా?
శరీరాంతర్గత ప్రదేశాల్లో రక్తస్రావమవుతున్నప్పుడు, శరీరం వెలుపల ఏర్పడిన గాయాల నుంచి రక్తస్రావమవుతున్నప్పుడు రక్తభారం గణనీయంగా తగ్గిపోయి స్పృహ కోల్పోతారు. చాలా కాలంనుంచి పేగుల్లో
అల్సర్లతో బాధపడేవారి విషయంలోఇలా జరుగుతుంది. అల్సర్లనుంచి రక్తస్రావమై పేగుల్లోని మలాన్ని నల్లగా మారుస్తుంది. అందుకే స్పృహ తప్పుతున్నట్లు ఉండటం తోపాటు ఇతర అల్సర్‌ లక్షణాలు కూడా కనిపిస్తున్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఆకలి, చెమటలు, అసహనం వంటివి కనిపించిన తరువాత సొమ్మసిల్లిపడిపోయారా?
ఇలా సాధారణంగా మధుమేహ రోగుల్లో - రక్తంలో గ్లూకోజ్‌ మోతాదు తగ్గిపోయినప్పుడు జరుగుతుంటుంది. ఇన్సులిన్‌ తీసుకొని ఆహారాన్ని తీసుకోవడం మర్చిపోయినా, అలవాటు లేకుండా ఎక్కువగా వ్యాయామం చేసినా, ఇన్సులిన్‌ మోతాదు ఎక్కువైనా ఇలా జరుగవచ్చు. ఇవే లక్షణాలు మధుమేహం లేనివారిలో కూడా కనిపించ వచ్చు. ఎక్కువసేపు ఆహారం తినకుండా, గంటల తరబడి నిలబడి పని చేసే వారిలో మధుమేహం లేకపోయినప్పటికీ ఇలా జరుగుతుంటుంది. ఈ సమస్యతో సతమతమయ్యేవారు ఆహా రాన్ని కొద్దిమొత్తాల్లో తరచుగా తినాల్సి ఉంటుంది.

భయాందోళనలకు లోనైనప్పుడు వేగంగా గాలి పీల్చు కుంటారా?
కొంతమంది భయాందోళనలకు లోనైనప్పుడు, భావావేశాలకు గురైనప్పుడు తమకు తెలియకుండానే వేగంగా శ్వాస తీసు కుంటారు. అప్పుడు హైపర్‌ వెంటిలేషన్‌ అనే స్థితి నెలకొం టుంది. కొద్ది క్షణాలపాటు పరిస్థితి ఇలాగే కొనసాగితే రక్తంలోని కార్బన్‌ డై ఆక్సైడ్‌ మోతాదు తగ్గిపోయి, కాల్షియం నిల్వలలో మార్పు చోటు చేసుకుంటుంది. దీనితో కాళ్లు చేతుల్లో సూదులు గుచ్చుకుంటున్నట్లు ఉండటమే కాకుండా, తలతిరగడం, స్పృహతప్పడం కూడా జరుగవచ్చు. ఇలాంటి లక్షణాలున్నప్పుడు నోటికీ, ముక్కుకూ ఎదురుగా ఒక కాగితం సంచిని తెరిచి ఉంచి, బయటకు వదిలిన గాలినే కొంచెం సేపు మళ్లీ మళ్లీ పీల్చుకోవాలి. శరీరంనుంచి బైటికి వెళ్లిపోయిన కార్బన్‌ డై ఆక్సైడ్‌ తిరిగి రక్తంలోనికి చేరి కళ్లు బైర్లు కమ్మినట్లు ఉండటం తగ్గుతుంది.

స్పృహ తప్పడంతోపాటు పక్షవాతం, మాటల్లో అస్పష్టత కనిపిస్తున్నాయా?
పక్షవాతం వలన మెదడుకు రక్తసరఫరా తగ్గి స్పృహ తగ్గుతుంది. వివిధ కారణాల వలన శరీరంలోని రక్తనాళు గట్టిపడి రక్త ప్రవాహాన్ని సజావుగా జరుగనివ్వవు. దీనితో రక్తకణాలు ముద్దలుగా తయారై తమ మార్గాలను తామే అడ్డుకుంటాయి. దీనికి శరీరం పరిహార చర్యలు తీసుకుంటుంది.
అధిక వత్తిడితో రక్తాన్ని పంపించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ మార్పును స్వీకరించడానికి అంతకుముందే గట్టిగా తయారైన రక్తనాళాలు సన్నద్ధంగా ఉండకపోవడంతో వాటి గోడలు చిట్లి రక్తస్రావమవుతుంది.అరవై ఏళ్ల వయస్సు దాటిన వారిలోనూ, కొన్ని రకాలైన గుండెజబ్బులున్నవారిలోనూ రక్తపుగడ్డలు ఎక్కువగా తయారయ్యే అవ కాశం ఉంది. రక్తభారం(B.P) నియంత్రణలో లేని వ్యక్తుల్లో రక్తనాళాలు చిట్లి రక్తస్రావమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పక్షవాతాల్లో 85 శాతం రక్తపుగడ్డల వల్లను, 15 శాతం రక్తస్రావాల వల్లనూ ఏర్పడుతాయి. ఈ రెండు సందర్భాలలోనూ కాళ్లూ, చేతులు పడిపోవడం, తిమ్మిరి పట్టడంతోపాటు స్పృహ తప్పడం కూడా ఉంటుంది.

===========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, March 19, 2011

దంతవైద్యం-ఆర్థోడాంటిక్‌ చికిత్స,Dentalcare-orthodontic Treatment


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -దంతవైద్యం-ఆర్థోడాంటిక్‌ చికిత్స- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

-ఆర్థోడాంటిక్ అంటే గీకులో orthos =straight or proper, and odous=tooth అని అర్ధము . ఇది దంతవైద్యవంధానములో మొట్టమొదటి స్పెషాలిటీ. . ఆర్థోడాంటిక్‌ చికిత్సా విధానం ద్వారా పళ్ళను ఒక వరుస క్రమంలో అమర్చడానికి, చూడడానికి అందంగా ఉండేటట్లుగా మరింత బాగా చేయడానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా పళ్ళు దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంటూ పనిచేసేటట్లు, చిగుళ్లు, దవడ ఎముక మూలలు పంటితో కొరికినప్పుడు వత్తిడి అన్ని పళ్ళమీద సమానంగా పడేటట్లు చేయవచ్చు.

ఆర్థోడాంటిక్‌ చికిత్స ఎందుకు అవసరమవుతుంది?
చాలామందిలో దొంతర పళ్లు ఉంటాయి. పళ్ళు రంగుమారి ఉంటాయి. ఆర్థోడాంటిక్‌ చికిత్సావిధానం ద్వారాపళ్ళను సరి చేసి మంచిగా తయారుచేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి కేవలం అందంకోసమే కాకుండా, పంటి సామర్థ్యాన్ని పెంచి, నమలడానికి, శుభ్రంచేసుకోవడం సులువుగా ఉంటుంది. కొంతమందిలో ముందుపళ్ళ వరుసలో జిగురుగా ఉండి వరుస క్రమం తప్పి చూడడానికి అందవిహీనంగాఉంటుంది. సాధారణంగా ఈపళ్ళు అప్పటికే పాడయివుంటాయి.

అయితే ఆర్థోడాంటిక్‌ చికిత్సా విధానం ద్వారా వీటిని సరిచేసి బాగు చేయవచ్చు. మరికొందరిలో క్రింది దవడ, పై దవడ సరిగా కలవక కొరికినప్పుడువత్తిడి అన్నిపళ్ళవి ఒకేవిధంగా ఉండవు. దీనినకూడా ఆర్థోడాంటిక్‌ చికిత్స ద్వారా సరిచేయవచ్చు. దీని వలన దవడ ఎముకలను వత్తిడి ఎక్కువై వాటికి సంబంధించిన సమస్యలతో పాటు, కొంత మందిలో తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంది. ఆర్థోడాంటిక్‌ చికిత్సావిధానం ద్వారా చాలా సరిగ్గా అన్ని పళ్ళు ఒకే రకమైన వత్తిడితో కొరికేటట్లు చేయవచ్చు.

ఏ వయస్సులో చేయించుకోవాలి?
సాధారణంగా ఈచికిత్స చిన్నపిల్లలుగాఉన్నప్పుడు చేయిం చుకోవడం మంచిది. అయితే పెద్దవయస్సులోను చేయించు కోవచ్చు. కానీ ఎక్కువసార్లు అవసరమవుతంది. చిన్నపిల్ల విషయంలో పూర్తిగా పళ్ళు వచ్చిన తరువాత ఈ చికిత్స చేయించుకోవాలి. ఇది చాలా ముఖ్యం.

-ఎవరితో చేయించుకోవాలి?
ఆర్థోడాంటిక్‌ అనే ప్రత్యేక నిపుణత అర్హత కలిగిన దంత వైద్యుడు ఈ చికిత్స చేయాలి. ఈ వైద్య విధానం అవలంభించేవారిని లేదా ఆసుపత్రిలో ఆర్థోడాంటిస్ట్‌ అని పిలుస్తారు.

చికిత్సా విధానం ఎలా ఉంటుంది?
దీనిలో అతిముఖ్యంగా పూర్తి అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలి. కావాలసని ఎక్స్‌రేలు మరియు పళ్ళయొక్క మాదిరినమూనాలు తీసుకుని,పూర్తిస్థాయిలో పళ్ళను పరీక్షలు చేయాలి. చికిత్సప్రారంభానికి ముందు ఏ మేరకు ఫలితాలు వస్తాయో ఆర్థోడాంటిస్ట్‌ చర్చల ద్వారా తెలుసుకుంటారు.

పలువరుసలో ఖాళీకి సహజ దంతాలు చేయించుకోవాలా?
మీ పలువరుసలో ఏ విధమైన ఖాళీ లేని పక్షంలో కొన్ని సహజ దంతాలను చేయించుకోవాల్సిన అవసరంవుంటుంది. మీ దంతవైద్యులు అవసరమైతేనే చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు ఇతర విధానాల ద్వారా ఖాళీని పెంచుతారు. ఎన్నో వస్తువుల సహాయంతో సులభతరంగా చికిత్స చేస్తారు. చాలా మందికి తెలుసున్న విధానం పేరు బెసెస్‌. ఆర్థోడాంటిక్‌ చికిత్సా విధానం ద్వారా పళ్ళను ఒక వరుస క్రమంలో అమర్చడానికి, చూడడానికి అందంగా ఉండేటట్లుగా మరింత బాగా చేయడానికి ఉపయోగిస్తారు. అంత ేకాకుండా పళ్ళు దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంటూ పనిచేసేటట్లు, చిగుళ్లు, దవడ ఎముక మూలలు పంటితో కొరికినప్పుడు వత్తిడి అన్ని పళ్ళమీద సమానంగా పడేటట్లు చేయవచ్చు.
చాలామందిలో దొంతర పళ్ళ మరియు పళ్ళు రంగుమారి ఉంటాయి. ఆర్థోడాంటిక్‌ చికిత్సావిధానం ద్వారాపళ్ళను సరి చేసి మంచిగా తయారుచేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి కేవలం అందంకోసమే కాకుండా, పంటి సామర్థ్యాన్ని పెంచి, నమలడానిక, శుభ్రం చేసుకోవడం సులువుగా ఉంటుంది.

ఫంక్షనల్‌ అప్లయన్సెస్‌ అంటే ఏమిటి?
దవడ ఎముక పెరుగుదలలో అవసరమైన మార్పులు ఆర్థోడాంటిక్‌ వస్తువులు ఉపయోగించి కొన్నిసార్లు చేస్తారు. ఇలా వాడుకునే వస్తువుల దవడ ఎముక శక్తిని పెంచడంతోపాటు కొన్ని రకాల సమస్యలను తగ్గించడానికి సహాయ పడతాయి.

ఫిక్స్‌డ్‌ అప్లయన్స్‌ అంటే ఏమిటి?
తీసివేయడానికి అనువుగా ఉండే ఒక ప్లేటు సహాయంతో పళ్ళను అతి చక్కగా అమర్చడానికి చికిత్స చేస్తారు. కొన్ని సందర్భాలలో స్థిరంగా ఉండే అప్లయన్స్‌ వాడవలసి ఉంటుంది. దీనిలో (బ్రాకెట్స్‌) బాండ్స్‌ అని పిలువబడేవి తాత్కాలికంగా నోటిని పట్టుకునేట్లు చేస్తాయి. తేలికైన వైరు (బ్రాకెట్స్‌)కు కల పడం ద్వారా పళ్ళు కదిలేటట్లు చేస్తారు. ఈ విదానంలో అప్లయన్స్‌ను తీసివేయడానికి అవకాశం ఉండదు. కావున దీనిని స్థిర అప్లయన్స్‌ అంటారు.

బ్రాకెట్స్‌ దేనితో తయారు చేస్తారు?
స్థిర బెసెస్‌ అన్ని లోహాలు ఉపయోగించి చేయరు. ముఖ్యంగా పెద్దవారికి ఉపయోగిచేవాటిని ప్లాస్టిక్‌ మరియు సిరమిక్‌ వాడతారు. ఎన్‌హెచ్‌ఎస్‌తో సాధారణంగా ఈ రకమైన బెసెస్‌ లభించవు

ఇవి ఏ విధంగా పని చేస్తాయి?
వైర్లు, స్రింగులు ఒకదానికొకటి కలపడానికి నమిలేటప్పుడు డెంట్యూర్స్‌ ద్వారా పక్కపళ్ళకి వత్తిడి తగ్గిస్తారు. కొన్ని సందర్భాలలో ఇంప్లాంట్‌తో కలపవడం చేస్తారు. ఈ విధానం పైకి కనపించదు.

ఖచ్చితమైన అమరిక అంటే ఏమిటి?
ప్రతివ్యక్తికి అవసరమయ్యే విధంగా లోహ సంబంధ డెంట్యూర్స్‌ లాంటి కట్టుబడికి ఖచ్చితమైన అమరిక అంటారు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. అయితే రెండూ ఒకే విధంగా పనిచేస్తాయి.

ఇవి ఏ రకంగా పనిచేస్తాయి?
చిన్న వైర్లు ఆధారంగా ఇవి పనిచేస్తాయి. ఆహారాన్ని నమిలేటప్పుడు ఏ విధమైన ఇబ్బందిని కలిగించకుండా, పక్క దంతాలకు నొప్పిని తగ్గించి, డెంట్యూర్స్‌ కొద్దిగా కదలేటట్లు అమరి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఇంప్లాంట్‌తో సముచ్ఛయంగా ఈ అమరికను ఉంచుతారు. ఇవి పైకి కనిపిస్తూ ఉంటాయి. కనుక సాంప్రదాయ లోహ కట్టుకుంటే ఉపయోగకరంగా ఉంటాయి.

ఏ అమరిక నాకు చక్కగా పనిచేస్తుంది?
మీ అవసరానికి తగినట్లుగా మీకు ఏ అమరిక అన్ని రకాల చక్కగా అనువుగా ఉంటుందో మీ దంతవైద్యులు మీతో చర్చించి చెబుతారు. నమిలేటప్పుడు అన్ని పళ్ల వత్తిడి ఒకే విధంగా ఉండేట ట్లుగా చేయడం డాక్టర్‌ పరిగణలోకి తీసుకుంటారు.

బ్రెసెస్‌ ఎలాంటి జగ్రత్తలు తీసుకోవాలి?
చక్కెర కలిగిన ఆహార పదార్థాలు పానీయాలు అవసరమైనంత వరకు తగ్గించడం చేయాలి. చిరుతిండ్లు, శీతల పానీయాలు మాని వేయాలి. జిగురుగా, గట్టిగా ఉండే ఆహార పదార్థాలు, సన్నితంగా ఉన్న ఆర్థోడాంటిక్‌ వస్తువులను పాడుచేస్తాయి. రోజుకు రెండుసార్లు అవసరమనుకుంటే మౌత్‌వాష్‌ ఉపయోగించండి.

---డాక్టర్‌ టి. శంకర్‌, మాక్సిలోఫేసియల్‌ సర్జన్‌ అండ్‌ ప్రోస్థోడాంటిస్ట్‌ (Hyderabad).

 • =====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

కాలేయంపై మద్యం ప్రభావం,Effects of Alcohol on Liverఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -కాలేయంపై మద్యం ప్రభావం(Effects of Alcohol on Liver)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

దీర్ఘకాలికంగా ఎక్కువగా ఆల్కహాల్‌ సేవించడం వలన మనిషిలోని కాలేయం మూడు రకాలుగా దెబ్బ తింటుంది. అవి - ఆల్కహాలిక్‌ ఫ్యాటి లివర్‌ (90 శాతం), ఆల్కహాలిక్‌ హెపటైటిస్‌, ఆల్కహాలిక్‌ సిర్రోసిస్‌ (ఈ రెండూ 10 నుంచి 20 శాతం). ఆల్కహాల్‌ కారణంగా కాలేయ వ్యాధి రావడానికి మనిషి ఎంత కాలంనుంచి ఆల్కహాల్‌ తీసుకుంటున్నాడు, ఎంత మోతాదులో తీసుకుంటున్నాడనే విషయాలు అవసరమవుతాయి. అంతేకాకుండా, మహిళలా? పురుషులా? అనేది కూడా ప్రధానాంశమే. పురుషుల్లో కంటే మహిళల్లో ఆల్క హాల్‌ను ఎక్కువ, తక్కువ మోతాదుల్లో తీసుకున్నా దాని వలన కలిగే అనర్థాలు త్వరగా వస్తాయి.
పురుషులు రోజుకు 60 నుంచి 80 గ్రాములకంటే ఎక్కువ ఆల్కమాల్‌ చొప్పున పది సంవత్సరాలు తీసుకోవడం వలన కాలేయం ఎంత దెబ్బ తింటుందో, స్త్రీలలో రోజుకు 20 నుంచి 40 గ్రాముల చొప్పున తీసుకుంటే అదే స్థాయిలో కాలేయం దెబ్బ తింటుంది. ఆల్కహాల్‌ తీసుకోవడమనే అంశం స్త్రీపురుష భేదంతోనే కాకుండా, వారివారి సామాజిక, పౌష్టికాహార, వ్యాధినిరోధక శక్తి తదితర అంశాలపై ఆధారపడిఉంటుంది.

దీర్ఘకాలిక హెపటైటిస్‌ సివైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నవారిలో ఆల్కహాల్‌ వలన కాలేయం చాలా త్వరగా దెబ్బ తిని, తీవ్ర స్థాయిలో ఆల్కహా లిక్‌ లివర్‌ డ్యామేజ్‌కు కారణమవుతుంది. సాధారణంగా ఆల్కహాల్‌ తీసుకునే వారికంటే 5 శాతం ఎక్కువగా ఈ దీర్ఘకాలిక హెపటైటిస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్న వారిలో వస్తుంది.

ప్రమాదకర అంశాలు
మోతాదు : పురుషులు రోజుకు 40 నుంచి 80 గ్రాముల ఆల్క హాల్‌ తీసుకోవడం వలన ఫ్యాటి లివర్‌, రోజుకు 80 నుంచి 160 గ్రాములు తీసు కోవడం వలన 10 నుంచి 20 సంవత్సరాలలో ఆల్కహాలిక్‌ హెపటైటిస్‌ లేదా లివర్‌ సిర్రోసిస్‌ వస్తాయి. 15 శాతం ఆల్కహాలిక్‌ లివర్‌ వ్యాధితో బాధపడతారు.
లింగభేదం : పురుషుల్లో కంటే స్త్రీలలో ఎక్కువ శాతం ఆల్కహాల్‌ వలన త్వరగా కాలేయం దెబ్బతింటుంది. (మోతాదు : రోజుకు 20 గ్రాముల కంటే ఎక్కువ)
హెపటైటిస్‌ సి వైరస్‌ : దీర్ఘకాలిక హెపటైటిస్‌ సి వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్న వారు ఆల్కహాల్‌ తాగడం వలన కాలేయం త్వరగా దెబ్బ తింటుంది. జీవిత కాలం తగ్గుతుంది.
ఒక బీరు, 4 ఔన్సుల వైన్‌ = 12 గ్రాముల ఆల్కహాల్‌, ఒక ఔన్సు స్పిరిట్‌ = 12 గ్రాముల ఆల్కహాల్‌

ఫ్యాటి లివర్‌ - లక్షణాలు
ఆల్కహాలిక్‌ ఫ్యాటి లివర్‌ వ్యాధి ప్రారంభంలో చాలా వరకూ ఎటువంటి లక్షణాలు లేకుండా ఉంటారు. ఏదో ఒక కారణంగా డాక్టర్‌ వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకుంటున్నప్పుడు కాలేయం పరిమాణం పెద్దదైనట్లు తెలుస్తుంది.

ఒక్కొక్కసారి కడుపు కుడివైపు పైభాగంలో అసౌకర్యంగా ఉండటం, లేదా నొప్పి, వాంతి వచ్చేలా ఉండటం లేదా కళ్లు పచ్చ బడటం వంటి లక్షణాలతో వ్యాధి బైటపడుతుంది. రోగిని దీర్ఘకా లికంగా ఆల్కహాల్‌ తీసుకునే అలవాటు ఉందా? అని ప్రశ్నించి నప్పుడు కారణం బైటపడుతుంది. లేని పక్షంలో డాక్టర్‌ ఇతర కారణాల గురించి ఆలోచించాల్సి ఉంటుంది.

పరీక్షలు
కాలేయం పని తీరు పరీక్ష (ఎల్‌ఎఫ్‌టి), లిపిడ్‌ ప్రొఫైల్‌, అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌, కార్బొహైడ్రేట్‌ డెఫిసియెంట్‌ ట్రాన్స్‌ఫెర్రిన్‌ (సిడిటి), గామా గ్లుటామిల్‌ ట్రాన్స్‌ పెప్టిడేస్‌ (జిజిటిపి), మీన్‌ కార్పస్కురాల్‌ వాల్యూమ్‌ (ఎంసివి), సీరం యూరిక్‌ యాసిడ్‌ తదితర పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ జరుగుతుంది.
అనేకమంది రోగులు ఎటువంటి లక్షణాలు లేకుండా ఉంటారు. కాని కొంతమందిలో జ్వరం, కడుపుపైన ఎర్రటి సాలెపురుగులాంటి మచ్చలు, కామెర్లు, తీవ్రమైన కడుపునొప్పి తదితర లక్షణాలతో బాధపడుతుంటారు.

ఏం జరుగుతుంది?
ఆల్కహాలిక్‌ హెపటైటిస్‌తో బాధపడుతున్న వారు ప్రాణాపాయ స్థితిలో పడినప్పుడు వారిలో మరణాల రేటు 70 శాతం వరకూ ఉంటుంది. ప్రోత్రాంబిన్‌ టైమ్‌ 5 సెకండ్లకంటే ఎక్కువగా పెరగడం, రక్తహీనత, శరీరంలోని సీరం ఆల్బుమిన్‌ తగ్గడం, సీరం బిలిరుబిన్‌ శాతం 8మి.గ్రా. కంటే ఎక్కువగా పెరగడం వంటివి సంభవిస్తాయి.

ఉదర కోశంలో నీరు చేరడాన్ని అసైటిస్‌ అంటారు. ఈ అసైటిస్‌తో పాటు ఆహార నాళం నుండి రక్తస్రావం జరుగుతుంది. రక్తస్రావం ఈసోఫేజియల్‌ వారిసెస్‌ల వలన, వాటి తీవ్రత వలన జరుగుతుంది. ఈసోఫేజియల్‌ వారిసెస్‌ అంటే ఆహార నాళం గోడలోని రక్త నాళాలు పోర్టల్‌ హైపర్‌ టెన్షన్‌ వలన ఉబ్బుతాయి. పోర్టల్‌ హైపర్‌ టెన్షన్‌ తీవ్రతనుబట్టి వీటిని 1, 2, 3 గ్రేడులుగా విభజిస్తారు. వీటినే ఈసోఫేజియల్‌ వారిసెస్‌ అంటారు.
మూత్రపిండాలు పని చేయక, రీనల్‌ ఫెయి ల్యూర్‌కు గురి కావడం జరుగుతుంది.

కడుపులో నీరు చేరడం, ఆహార నాళం ద్వారా వారిసెస్‌(varicose veins) వలన రక్తస్రావం, మెదడు మందగించి స్పృహ కోల్పోవడం, తరువాత హెపాటిక్‌ కోమాకు గురికావడం వంటి తీవ్ర ఆల్కహాలిక్‌ హెపటైటిస్‌ వ్యాధికి గురైన వారిని లివర్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చేర్చి చికిత్స చేసినప్పటికీ, మృత్యువాత పడే అవకాశాలు అధికంగా ఉంటాయి.

చికిత్స
ఆల్కహాల్‌ లివర్‌ వ్యాధితో బాధపడుతున్న వారు మద్యం మానే యడం వారు చేయాల్సిన మొట్టమొదటి పని. అంతే కాకుండా, భవిష్యత్తులో కూడా మద్యం తీసుకోకూడదు. రోగికి పౌష్టికాహారం ఇస్తూ, మానసిక స్థితిని కౌన్సెలింగ్‌ ద్వారా సరి చేయాల్సి ఉంటుంది.
అవసరాన్నిబట్టి ప్రెడ్నిసిలోన్‌ వంటి మందులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ మందులను సెప్సిస్‌, ఆహారనాళంనుంచి రక్తస్రావం జరిగే సమయంలో, మూత్ర పిండాలు పని చేయన ప్పుడు, పాంక్రియాటైటిస్‌ వంటి వ్యాధులున్నప్పుడు ఉపయోగించ కూడదు.
కాలేయానికి బలం చేకూర్చే ఔషధాలతో చికిత్స చేయడం తర చుగా దీర్ఘకాలికంగా ఆల్కహాల్‌ తీసుకునే వారు ఫిజిషియన్‌ లేదా గ్యాస్ట్రో ఎంటరాలజిస్టును సంప్రదించి నట్లయితే వారికి అవసర మైన పరీక్షలు చేసి చికిత్స చేస్తారు.

 • ============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

తడి ఆరిన కళ్ళకు చికిత్స, Treatment for dry eyesఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -తడి ఆరిన కళ్ళకు చికిత్స (Treatment for dry eyes)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

--కంటిలో ఉండే పారదర్శకమైన పొరని కార్నియా అంటాము. ఈ కార్నియా కారణంగానే కాంతి కిరణాలు కంటి లోపలి భాగంలో ఉండే రెటీనాపైకి ప్రసరించి మనకు ఏ దృశ్యమైనా కనిపిస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలకూ, కణజాలాలకు అవస రమైన మాదిరిగానే కార్నియాకు కూడా పోషకపదార్థాలూ, ఆక్సిజన్‌ అవసరమవుతాయి. కంటిలో ఉండే నీటి ద్వారా అంటే కన్నీటి ద్వారా ఆక్సిజన్‌, ఇతర పోషకాలు కార్నియాకు అందుతాయి. అయితే ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యం కారణంగానూ, ఆధునిక జీవనశైలిలో సరైన విశ్రాంతి లేకుండా రాత్రింబవళ్లు పని చేయడం వల్ల కన్నీటి గ్రంథుల (లాక్రియల్‌ గ్లాండ్స్‌)నుంచి తగిన స్థాయిలో కన్నీరు స్రవించడం లేదని, దాని మోతాదు తగ్గిపోతున్నదని గమనించారు. కంటిలోని తడి ఆరిపోయి కళ్లు పొడిగా మారడాన్ని Dry Eyes అంటారు.

కారణాలు
కన్నీటి గ్రంథులకు సంబంధించిన కొన్ని రకాల వ్యాధుల వల్ల, వైరస్‌ కారణంగా సోకే కంజెంక్టివైటిస్‌ వల్ల కన్నీరు స్రవించడం శాశ్వతంగా కూడా తగ్గిపోవచ్చు. కొన్ని రకాల వృత్తుల్లో ఉన్నవారికి (ఉదాహరణకు - ప్లాస్టిక్‌ పరిశ్రమలు, ఫర్నేస్‌, సిమెంట్‌, కెమికల్‌ ఫ్యాక్టరీలు, తోలు పరిశ్రమలు మొదలైన వాటిలో పని చేసేవారికి), మూత్ర విసర్జనను పెంచే మందులు వాడుతున్న వారికి, సంతానం కలుగకుండా మాత్రలు వాడే వారికి తాత్కాలికంగా కంటిలోని తడి ఆరిపోవడం జరుగుతుంది. ఎలర్జీకి వాడే మందులు, జీర్ణకోశ వ్యాధులకు వాడే మందులు, నిద్ర కోసం వాడే మందులు, మానసిక ఒత్తిడి తగ్గించే మందులు, మొటిమల మందులు, రక్తపోటు తగ్గించే మందులు కూడా తాత్కాలికంగా డ్రైనెస్‌ను కలిగిస్తాయి.

ఆధునిక కాలంలో అధిక సమయంపాటు ఎసి గదుల్లో కంప్యూటర్‌ ముందు పని చేయడం, కాంటాక్ట్‌ లెన్స్‌ను ఎక్కువ కాలం వాడటం, నిద్ర లేమి, వాతావరణ కాలుష్యం తది తర కారణాలవల్ల అనేకమంది కంటిలోని తడి ఆరిపోయే సమ స్యకు గురవుతున్నారు. కంటిలోని తడి ఆరిపోయి, కళ్లు పొడిగా మారినప్పుడు ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి. కళ్లు ఎర్రబారడం, - కంట్లో నలకలు పడినట్లు ఉండటం- కళ్లు త్వరగా అలసిపోవడం కన్నీరు ఆరిపోయి కనురెప్పలు బరువెక్కడం - ఎక్కువసార్లు కంటి రెప్పలు కొట్టుకోవడం మొదలైనవి.

చికిత్స
కళ్లు పొడిబారిన్పుడు చేసే చికిత్స రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది జీవనశైలిలో మార్పులు చేయడం. రెండవది మందులు వాడటం.కంప్యూటర్‌ను ఉపయోగించేవారు మధ్య మధ్య కంటికి విశ్రాంతి ఇవ్వాలి.కళ్లు విపరీతమైన అలసటకు గురి కాకుండా జాగ్రత్తలు వహించాలి.కంటి వైద్యుల సలహాలను పొంది వారు సూచించిన విధంగా యాంటిగ్లేర్‌ అద్దాలను వాడాలి. స్వల్పమైన దృష్టిలోపాలు ఉంటే వెంటనే సరి చేయించుకోవాలి.కంటిలో తిరిగి తడి కలిగేలా చేయడానికి వివిధ రకాలైన లూబ్రికెంట్స్‌ అందుబాటులో ఉన్నాయి. అలాగే కృత్రిమ కంటి చుక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి. కంటిలోని పొడి తీవ్రత (dryness of eyes)ను అనుసరించి రోగికి అవసరమైన మందులను, మోతాదులను, వాడవలసిన కాలపరిమితిని కంటి వైద్య నిపుణులు సూచిస్తారు. వాటిని ఆయా పద్ధతుల్లో వాడాలి.ఎవరికైనా కంటిలోని తడి ఆరిపోయి ఇబ్బంది పడుతుంటే వెంటనే కంటి వైద్య నిపుణులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. కళ్లు పొడిబారే అవకాశా లున్న వృత్తులోని వారు ఒక క్రమపద్ధతిలో కంటి వైద్యులను సంప్రదిస్తూ ఉంటే నేత్ర సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్త పడవచ్చు.


 • ====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

యాంప్యుటేషన్‌(అవయవాన్ని తొలగించడం),Amputation


 • photo : courtesy with bundjil.com

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -యాంప్యుటేషన్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

ఏదేని కారణంగా కాలు, చేయి వంటి శరీరంలోని ఒక అవయవాన్ని తొలగించడాన్ని యాంప్యుటేషన్‌ అంటారు. ఏ వయస్సులోని వారికైనా తప్పనిసరి పరిస్థితులు ఏర్పడిన ప్పుడు యాంప్యుటేషన్‌ చేయాల్సి రావచ్చు.

యాంప్యుటేషన్‌కు కారణాలు
వ్యాధులు(diseases) : శరీరంలోని ఒక భాగాన్ని తొలగించాల్సి రావడమనేది అనేక పరిస్థితుల్లో కలుగుతుంది. కానీ ప్రధానంగా చెప్పుకోవాల్సినవి మధుమేహం, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు.

ప్రమాదాలు (Accidents): సాధారణంగా రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి, పరిశ్రమల్లో పని చేస్తే ప్రమాదాలకు గురైన వారికి యాంప్యుటేషన్‌ తప్పనిసరి అవుతుంటుంది.

పుట్టుకతో వచ్చే లోపాలు(congenital defects) : పుట్టుకతో వచ్చే లోపాల్లో అవయవం లేకపోవడం కాని, అతి చిన్నగా ఉండటం కాని జరిగితే దానిని యాంప్యుటేషన్‌గానే గుర్తిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ప్రోస్థెటిక్‌ డివైస్‌ను రూపొందించి అమర్చడం జరుగుతుంది.

కంతులు (Tumours): ఎముకలకు సోకే కంతులకు (ఆస్టియో సార్కోమా) చికిత్స చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని సార్లు ఆ అవయవాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రోగికి కాలు తొలగించాల్సిన పరిస్థితి వస్తే పాదాల వేళ్ల దగ్గరనుంచి తుంటి కీలు వరకూ వివిధ రకాలుగా తొలగిం చడం జరుగుతుంది. వాటి గురించి తెలుసుకుందాం.

ఫుట్‌ యాంప్యుటేషన్‌(Foot amputation) : పాదానికి సంబంధించినంత వరకూ అది కేవలం బొటన వేలుకో, కొన్ని వేళ్లకో పరిమితం కావచ్చు. లేదా పాదంలో కొంత భాగం వరకూ తొలగించాల్సి రావచ్చు. లేదా పాదం మొత్తంగా తొలగించాల్సి రావచ్చు.

ట్రాన్సటిబియల్‌ యాంప్యుటేషన్‌(Trans Tibial amputation) : మోకాలి కింది భాగంనుంచి కాలి మడమ వరకూ ఉండే భాగాన్ని తొలగించాల్సి వస్తే దానిని ట్రాన్స్‌టిబియల్‌ యాంప్యుటేషన్స్‌ అంటారు.

నీ డిసార్టిక్యులేషన్‌(Knee Dearticulation) : మోకాలి కీలు వద్ద చేసే యాంప్యు టేషన్‌ ఇది.
ట్రాన్స్‌ఫిమొరల్‌ యాంప్యుటేషన్‌(Trans femoral amputation) : మోకాలి కీలు భాగం నుంచి పైన తుంటి కీలు భాగం వరకూ తొలగించే శస్త్ర చికిత్స ఇది.
హిప్‌ డిసార్టిక్యులేషన్‌(Hip disarticulation) : ఈ రకమైన యాంప్యుటేషన్‌లో తుంటి కీలునుంచి మొత్తం తొడ భాగాన్ని తొలగించడం జరుగుతుంది.
చేతికి సంబంధించిన యాంప్యుటేషన్‌ రకాలు ఈ కింది విధంగా ఉంటాయి.
పార్షియల్‌ హ్యాండ్‌ యాంప్యుటేషన్‌(partial Hand amputation) : దీనిలో చేతి వేలును కాని, బొటన వేలును కాని, లేదా మణికట్టు కింద ఉండే చేతిలో భాగాన్ని తొలగించడం చేస్తారు.
రిస్ట్‌ డిసార్టిక్యులేషన్‌(Wrist dearticulation) : చేతిని మణికట్టు వరకూ తొలగిస్తారు.
ట్రాన్స్‌ రేడియల్‌ యాంప్యుటేషన్‌ : మోచేయి కింది భాగంనుంచి మణికట్టు వరకూ ఉండే భాగాన్ని తొలగించడం జరుగుతుంది.
ట్రాన్స్‌హ్యూమరల్‌ యాంప్యుటేషన్‌(Trans humeral amputation) : మోచేయి పైనుంచి భుజం కింది వరకూ ఉండే భాగం ఇది.
షోల్డర్‌ డిసార్టిక్యులేషన్‌(Shoulder Disarticulation) : భుజం వరకూ తొలగించే శస్త్ర చికిత్స ఇది. ఇందులో కాలర్‌ బోన్‌ను తొలగించవచ్చు. లేదా తొలగించకపోవచ్చు. షోల్డర్‌ బ్లేడ్‌ను మాత్రం అలాగే ఉంచుతారు.
ఫోర్‌క్వార్టర్‌ యాంప్యుటేషన్‌(Four quarter amputation) : దీనిలో కాలర్‌బోన్‌, షోల్డర్‌ బ్లేడ్‌తో సహా మొత్తాన్ని తీసివేయడం జరుగుతుంది.


 • ====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

ఎయిడ్స్‌ వ్యాధి వ్యాప్తి -లక్షణాలు,Aids disease spread and symptoms


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Aids- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

నిర్వచనము : -మనిషి శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని క్షీణింపజేసే వైరస్‌ (హ్యూమన్‌ ఇమ్యునో డెఫిషి యెన్సీ వైరస్‌ లేదా హెచ్‌ఐవి) కారణంగా వ్యాధినిరోధక శక్తి నశించి, పలువ్యాధులకు గురయ్యే పరిస్థితి ఉత్పన్నం కావడాన్ని అక్వైర్డ్‌ ఇమ్యూనో డెఫిషియెన్సీ సిండ్రోమ్‌ లేదా ఎయిడ్స్‌ అని వ్యవహరిస్తాము. 25నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉండే పురుషుల్లో సంభవించే మరణాలకు అతి పెద్ద కారణం ఎయిడ్స్‌.

ఇదే వయస్సున్న స్త్రీలలో మరణాలు సంభవించడానికి నాలుగవ అతి పెద్ద కారణం ఎయిడ్సే.

హెచ్‌ఐవి క్రిములు మానవ శరీరంలోకి ప్రవే శించి రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేసి దానిని నిర్వీర్యం చేస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి నశించడంతో వివిధ రకాలైన ప్రాణాంతక వ్యాధులకు గురి కావడం జరుగుతుంది.

లక్షణాలు
హెచ్‌ఐవి క్రిములు శరీరంలోకి ప్రవేశించిన తరువాత ఎలాంటి లక్షణాలు కనిపించక పోవచ్చు. వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన తరు వాత వ్యాధి లక్షణాలు కనిపించడానికి సగటున 5 నుంచి 10 సంవత్సరాల సమయం పడుతుంది. ఇలా కనిపించే లక్షణాల్లో అత్యధిక భాగం హెచ్‌ఐవి క్రిముల కారణంగా కాకుండా, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల సోకే ఇతర ఇన్‌ఫెక్షన్లకు చెందినవై ఉంటాయి.

హెచ్‌ఐవి సోకిన తరువాత కనిపించే వ్యాధి లక్షణాలు కొన్ని వారాలనుంచి కొన్ని నెలలపాటు కొనసాగవచ్చు. ఈ లక్షణాలు ఇతర వ్యాధుల్లో కూడా కనిపి స్తాయి కనుక బాధితుడికి తనకు హెచ్‌ఐవి సోకిందనే అనుమానం కలుగకపోవచ్చు. హెచ్‌ఐవికి సంబంధించిన పరీక్షలను ఒకటికి రెండుసార్లు చేయించుకుని, స్పష్టమైన నిర్ధారణకు వస్తే తప్ప ఈ లక్షణాలు హెచ్‌ఐవి వ్యాధికి సంబంధించినవి నిర్ధారించకూడదు.

హెచ్‌ఐవి క్రిములు శరీరంలోకి చేరిన తరువాత అవి విభజన చెంది వాటి సంఖ్య పెరిగి, వ్యాధి నిరోధక వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడానికి కొన్ని వారాలనుంచి నెలల వరకూ పట్టవచ్చు. ఈ సమయంలో పరీక్షలు చేయిం చుకుంటే హెచ్‌ఐవి పాజిటివ్‌ అని ఫలితం రాదు. అయితే, బాధితులు మాత్రం ఈ వ్యాధి మరొకరికి వ్యాపింప చేయగలిగే స్థితిలో ఉంటారు.

హెచ్‌ఐవి క్రిములతో పోరాడటానికి వ్యాధి నిరోధక వ్యవస్థ యాంటిబాడీస్‌ను తయారు చేయనారంభిస్తుంది. ఆ సమయంలో పరీక్ష చేస్తే హెచ్‌ఐవి పాజిటివ్‌ అని ఫలితం వస్తుంది. హెచ్‌ఐవి శరీరంలోకి చేరిన తరువాత తొలిదశలో కనిపించే.. ఫ్లూ వంటి లక్షణాలు తగ్గి పోయిన తరువాత బాధితులు కనీసం పదేళ్ల వరకూ ఆరోగ్యంగా ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకుండా జీవిస్తారు. అయితే ఆ సమయంలో హెచ్‌ఐవి క్రిములు మాత్రం వ్యాధి నిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేస్తూనే ఉంటాయి.

వ్యాధి నిరోధక వ్యవస్థ ఏ మేరకు నాశనం చెందిందనే విషయాన్ని సిడి4 కణాల సంఖ్యను బట్టి తెలుసుకోవచ్చు. సిడి 4 కణాలను టి-హె ల్పర్‌ కణాలని కూడా అంటారు. మనిషిలోని వ్యాధి నిరోధక వ్యవస్థలో ఈ కణాలు పోషించే పాత్ర చాలా ముఖ్యమైనది. ఆరోగ్యవంతులలో సిడి4 కణాలు ప్రతి మిల్లీ లీటర్‌ రక్తంలో 500 నుంచి 1500 వరకూ ఉంటాయి. సరైన చికిత్స తీసుకోని పక్షంలో సిడి4 కౌంట్‌ గణనీయంగా తగ్గిపోతుంది. ఫలితంగా హెచ్‌ఐవి వ్యాధి తాలూకు లక్షణాలు కనిపించడం ఆరంభమవుతుంది.

--వ్యాప్తి
హెచ్‌ఐవి ప్రధానంగా మూడు రకాలుగా వ్యాప్తి చెందుతుంది.
1.అనైతిక విశృంఖల లైంగిక సంబంధాలు కలిగి ఉండటం,
2. మాదక ద్రవ్యాలవంటి వాటిని తీసుకో వడానికి ఒకే సిరంజిని, సూదిని పలువురు కలిసి ఉపయోగించడం.
3.రక్తమార్పిడి ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

తల్లి గర్భంలో ఉండే శిశువుకు తల్లినుంచి ఈ వ్యాధి శిశువు గర్భంలో ఉన్నప్పుడు కాని, జనన సమయంలో కాని వ్యాపించే అవకాశం ఉంది. సర్జికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ వంటివి సరైన విధంగా శుభ్రపరచి వాడకపోతే ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

ఎలా వ్యాపించదు?
హెచ్‌ఐవి బాధితుడికి షేక్‌హ్యాండ్‌ ఇచ్చినా, కలిసి భోజనం చేసినా ఈ వ్యాధి వ్యాప్తి చెందదు. అలాగే హెచ్‌ఐవి బాధితులను ముద్దు పెట్టుకుంటే వ్యాధి వ్యాప్తి చెందుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు

లేవు. దోమలు కుట్టడం ద్వారా హెచ్‌ఐవి వ్యాప్తి చెందదు. తుమ్ములు, దగ్గు, ఇంట్లో వస్తువు లను కలిసి ఉపయోగించుకోవడం మొదలైన వాటి వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందదు.

 • ఎఆర్‌టి మందులతో హెచ్‌ఐవి నివారణ

హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న తల్లులకు లేదా పాలుతాగే పిల్లలకు 28 వారాలపాటు యాంటి రిట్రోవైరల్‌ మందులు ఇవ్వడం వల్ల హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్‌ తల్లి నుండి బిడ్డకు సంక్రమించడాన్ని నివారించొచ్చని పరిశోధకులు తెలిపారు. భారీ స్థాయిలో యాదృశ్చికంగా జరిగిన అధ్యయన ఫలితాలు ఈ విషయాన్ని తెలిపాయి. యూనివర్శిటీ ఆఫ్‌ నార్త్‌ కరొలినా పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు.

For some more information : see Wikipedia.org/
 • ===================================
Visit my website - > Dr.Seshagirirao.com/

రక్తపోటు నియంత్రణ మార్గం,Hypertension(B.P)controle hints


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -రక్తపోటు నియంత్రణ మార్గం-(Hypertension(B.P)controle hints)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

అధిక రక్తపోటుకు శాశ్వతమైన చికిత్స లేకపోయిన ప్పటికీ, జీవనశైలిలో మార్పులు, ఔషధాలతో దానిని నియంత్రించుకోవచ్చు .ధమనుల్లో రక్తం కలుగజేసే ఒత్తిడిని రక్తపోటు అని వ్యవహరిస్తాము. రక్తపోటు అధికంగా ఉంటే అది శరీర మంతటికీ రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలపైన ఒత్తిడిని అధికం చేస్తుంది. ఈ స్థితి రక్తనాళంలో రక్తం గడ్డకట్టడా నికి లేదా రక్తనాళం బలహీనపడటానికి కారణమవు తుంది. ఫలితంగా రక్తనాళం సన్నబడుతుంది. ఇలా రక్త నాళాలు సన్నబడటం కాని, రక్తపు గడ్డలు ఏర్పడటం కాని గుండె లేదా మెదడు పని తీరు వైఫల్యం చెందడా నికి కారణమవుతాయి.

అధిక రక్తపోటు కారణంగా పక్షవాతం సోకి సంభ వించే మరణాలు 50 శాతం మేరకు ఉండగా, కరొనరీ ఆర్టరీ డిసీజ్‌కు గురై సంభవిస్తున్న మరణాలు 24 శాతం ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. భారతదేశంలోని పట్టణాల్లో 10 శాతం మంది, గ్రామీణ ప్రాంతాల్లో 3 నుంచి 5 శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు ప్రజలు వలస రావడం, వారి జీవన విధానాల్లో మార్పులు చోటు చేసుకోవడం వంటి కారణాల వల్ల అధిక రక్తపోటుకు గురయ్యే వారి సంఖ్య మరింతగా పెరుగుతున్నది. అధిక రక్తపోటును ఇతర వ్యాధుల్లాగా తేలికగా గుర్తిం చడం కష్టం. అందుకే దీనిని నిశ్శబ్ద హంతకి అంటారు.

తెలుసుకోవడమెలా?
అధిక రక్తపోటుకు గురయ్యే అవకాశాలు వయస్సుతో పాటుపెరుగుతూ వస్తాయి. తలనొప్పి, తలలో భారంగా అనిపించడం, దృష్టిలో మార్పులు, నిద్రలో అపశ్రు తులు, లేదా నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం, పని చేసేప్పుడు లేదా మెట్లెక్కేప్పుడు ఆయాసం రావడం వంటి కొన్ని లక్షణాలు స్పష్టాస్పష్టంగా కనిపిస్తాయి.
అటువంటి సమయంలో రక్తపోటు ఎంత ఉందని పరీక్ష చేయించుకోవాలి. ఒకవేళ రక్తపోటు 140/90 కంటే ఎక్కువగా ఉండి, అది అలాగే కొనసాగుతుంటే అధిక రక్తపోటు సమస్య ఉత్పన్నమైందని భావించాలి.

కారణాలు
అధిక రక్తపోటు జీవనశైలికి సంబంధించిన సమస్య. ఇతర వ్యాధుల మాదిరిగా దీనికి ప్రత్యేక కారణాలను పేర్కొనడం కష్టం.
ఉదాహరణకు కలరా, మలేరియా, క్షయ తదితర వ్యాధులకు ఉన్నట్లు దీనికి ప్రత్యేక కారణాలంటూ ఉండవు. అయితే అధిక రక్తపోటు సమస్యకు గురి కావడానికి కొన్ని అంశాలు దోహదం చేస్తాయి. ముఖ్యంగా
స్థూలకాయం,
వ్యాయామం లేకపోవడం,
అధిక మోతాదుల్లో మద్యం సేవించడం,
ధూమపానం,
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం లేదా
ఉప్పు అధికంగా ఉండే ఆహార పదార్థాలను సేవించడం,
మానసిక ఒత్తిడి .............మొదలైనవి అధిక రక్తపోటు సమస్య సోకడానికి కారణమవుతాయి.

ఇక్కట్లు
సమస్యలెప్పుడూ ఒంటరిగా రావని సామెత. ఉదాహరణకు జీవనశైలికి సంబంధించిన వ్యాధిగా గుర్తించే స్థూలకాయానికి గురైనప్పుడు హృద్రోగ సమ స్యలు, మధుమేహం మొదలైనవి కూడా వెన్నంటి వస్తాయి. అధిక రక్తపోటుకు గురైనవారు దానిని నియంత్రిం చుకోకపోతే మెదడులో రక్తనాళాలు చిట్లిపోవడం, గుండె వైఫల్యానికి గురి కావడం, మూత్రపిండాలు వైఫల్యా నికి గురి కావడం వంటి సమస్యలు ఉత్పన్నమై అకస్మా త్తుగా మరణించడం జరుగుతుంది.

నివారణ
ప్రతి రోజూ వ్యాయామం చేయాలి. ఉప్పు తక్కువగా తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయం.చిప్స్‌, సాల్టెడ్‌ బిస్కట్స్‌ మొదలైన వాటిని తీసుకోకూడదు.
వీలైనంత ఎక్కువగా పండ్లు, తాజా కూరగాయలు తీసుకోవాలి. మాంసాహారాలను తగ్గించుకోవాలి.మద్యపానాన్ని మానేయాలి. ధ్యానం, యోగ, మర్దన, కోపాన్ని నియంత్రించుకోవడం, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయడం మొదలైన వాటివల్ల అధిక రక్తపోటును నియంత్ర ణలో ఉంచుకోవచ్చు.


 • =================================================
Visit my website - > Dr.Seshagirirao.com/