-మెదడులోని 'డొపమైన్' మనిషిని ఉత్సాహంగా, ఉత్తేజంగా అవసరానికి మించి ఆనందాన్ని ఇచ్చే రసాయన ద్రవం. మాదకద్రవ్యాలు తీసుకునేవారిలో తాత్కాలికంగా డొపమైన్ ఎక్కువై మనిషి సాధారణ స్థాయికంటే ఎక్కువ ఉత్సాహాన్ని అనుభవిస్తాడు. అనుభూతి పొందుతారు. ఒకసారి తీసుకోవడం అలవాటైతే మళ్లీ మళ్లీ తీసుకోవాలని మెదడు ప్రేరేపిస్తుంది. మాదకద్రవ్యాలు లేదా నార్కొటిక్స్ అని పిలిచే ఇవి రకరకాలు -ఇందులో ముఖ్యంగా నల్లమందు, గంజాయి, కొకైన్, నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచే స్టిమ్యులేట్ మందులు, భ్రమింపచేసే మందులు(హ్యల్లూసినోజన్స్), నిద్ర మాత్రలు, కొన్ని రకాల ద్రావణాలు, క్లబ్ డ్రగ్స్.
వైద్యుడి సలహా లేకుండా మందులు వాడటం కాని, వైద్యుడు సూచించిన మందులు మోతా దుకు మించి వాడటం కాని ప్రమాదకరమనే విషయం నిర్వివాదాంశం. అయితే, సరైన వైద్య సలహా లేకుండా దురుపయోగమయ్యే ఔష ధాల్లో నిద్ర మాత్రలు లేదా సెడేటివ్స్ అగ్ర స్థానంలో ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో వీటి వినియోగం చాలా అధికంగా ఉంది. నిద్ర మాత్రలు ఎక్కువ కాలం వాడటం వల్ల వీటికి అలవాటు పడటం జరుగుతుంది.ఏ నిద్రమాత్రలైన 15 రోజులకు మించి వాడడం మంచిదికాదు. తాత్కాలికంగా ఇతర మందులతో కలిపి వైద్యులు వాడాలని సూచిస్తారు. కానీ అవగాహనలేమితో, బాగున్నాయనే ఉద్దేశంలో రోగులు కేవలం నిద్రమాత్రలు మాత్రమే ఉపయోగిస్తారు.
ఇలా అలవాటు పడిన వ్యక్తి ఆ మందులనుంచి దూరంగా ఉండటం దాదాపు అసాధ్యమనే చెప్ప వచ్చు. ప్రతి నిముషం వీటిని తీసుకోవాలనే తహతహ ఉంటుంది. వీటిని తీసుకునే మోతాదు విషయంలో కాని, వాటికోసం చేసే ప్రయత్నాల్లో కాని ఆయా వ్యక్తులకు తమపై తమకే నియంత్రణ ఉండదు. ఫలితంగా ఈ మందులు తీసుకునే వారు వృత్తిపరంగా, సామాజికంగా, ఆరోగ్య విషయాల్లో అనేక రకాలైన సమస్యలకు గురవుతారు.
ఈ మందులు లభించనప్పుడు లేదా వాటిని విడిచిపెట్టినప్పుడు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను విత్‌డ్రావల్ సింప్టమ్స్ అని వ్యవహరి స్తారు. ఈ మందులు వేసు కునే వారిలో రానురాను వాటి మోతాదు పెంచుకోవాల్సిన స్థితి ఏర్పడుతుంది. అంటే ఆయా మందులు ఎక్కువ మోతాదుల్లో అవసర మవుతుంది. దీనిని టాలరెన్స్ అంటారు.
These drugs include:
* Barbiturates
* Opioids
* Benzodiazepines
o Estazolam
o Flunitrazepam
o Lormetazepam
o Midazolam
o Nitrazepam
o Quazepam
o Temazepam
o Triazolam
* Nonbenzodiazepines
o Zolpidem
o Zaleplon
o Zopiclone
o Eszopiclone
* Antihistamines
o Diphenhydramine
o Doxylamine
o Hydroxyzine
o Promethazine
* Melatonin Agonists
o Ramelteon
o Melatonin
o Tasimelteon
* gamma-hydroxybutyric acid (Xyrem)
* Methaqualone
* Glutethimide
* Chloral hydrate
* Ethchlorvynol
* Levomepromazine
* Chlormethiazole
* Diethyl ether
* Alcohol is also used as a hypnotic drug, though not medically. To quote the British National Formulary: "Alcohol is a poor hypnotic because its diuretic action interferes with sleep during the latter part of the night. Alcohol also disturbs sleep patterns, and so can worsen sleep disorders."
నిద్ర మాత్రల్లో రెండు ముఖ్యమైన రకాల గురించి తెలుసుకుందాం.
1) బార్బిట్యురేట్స్ : వీటికి ఉదాహరణ - ఫినోబార్బిటాల్, పెంటోబార్బిటాల్, మెఫోబార్బిటాల్.
2) బెంజోడయజెపైన్స్ : వీటికి ఉదాహరణ - డయజిపామ్, అల్ప్రాజొలామ్, నైట్రజిపామ్.
ఇటీవలి కాలంలో యువతలో కూడా బెంజో డయజెపైన్స్ వాడకం అధికమవుతున్నది. సాధా రణంగా వృద్ధుల్లో వీటి వాడకం అధికంగా కని పిస్తుంది. ఆసుపత్రుల్లోని ఎమర్జెన్సీ వార్డులకు వచ్చే సుమారు 5.1 శాతం కేసులు బెంజోడయజెపైన్ పాయిజనింగ్ కారణంగా చేరుతున్నట్లు అంచనా. 3 శాతం రోగులు ఒకటికంటే ఎక్కువ పదార్థాలు వాడి ఎమర్జెన్సీ వార్డుకు వస్తుం టారు. ఉదాహరణకు - మద్యం, డయజిపామ్, మద్యం లొరాజిపామ్ వంటివి వాడి వస్తుంటారు.
గైనకాలజీ ఔట్ పేషెంట్ విభాగానికి వచ్చే స్త్రీలపై అధ్యయనాలు చేసినప్పుడు సుమారు 8 శాతంమంది బెంజోడయజెపైన్‌కు అలవాటు పడిన వారు ఉన్నట్లు వెల్లడైంది. సాధారణంగా తక్కువ మోతాదులోనే ఎక్కువ ప్రభావాన్ని కలిగిన మందులు (హై పొటెన్సీ డ్రగ్స్), త్వరగా తమ ప్రభావాన్ని శరీరంపై చూపించగల మందులు, తక్కువ సమయం మాత్రమే శరీరంలో ఉండే మందులు (తక్కువ హాఫ్ లైఫ్ టైమ్ డ్రగ్స్), ఎక్కువ తేలికగా మెదడులోకి ప్రవేశించగల మందులు - వీటికి అలవాటుపడే అవకాశాలు అధికంగా ఉంటాయి.
ఈ మందులకు అలవాటు పడే అవకాశం కొంతమందికి అధికంగా ఉంటుంది.
వారు ఇంతకు ముందు మద్యం, ఇతర మాదక ద్రవ్యా లకు అలవాటు పడిన వారు, వంశంలో మాదక ద్రవ్యాలు, మద్యం మొదలైన వాటికి అలవాటు పడిన వ్యక్తులు ఉన్న కుటుంబాల్లోని వారు, వ్యక్తిత్వ లోపాలతో బాధపడేవారు, ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడి అధికంగా ఉన్న వారు, పానిక్ డిజార్డర్స్ ఉన్నవారు, ఆసుప త్రుల్లో పని చేసేవారు (వీరికి ఈ మందుల గురించిన అవగాహన అధికంగా ఉంటుంది), వృద్ధులు, స్త్రీలు దీర్ఘకాలిక సమస్యలు, శారీరక వ్యాధులు ఉన్నవారు.
కొన్ని మందులను ఇంజక్షన్ల రూపంలో తీసు కోవడం కూడా జరుగుతుంది. ఇలా తీసుకునే వారిలో 97 శాతం మంది సిరంజులను, 75 శాతం మంది సూదులను కలిసి ఉపయోగించు కుంటున్నట్లు అంచనా. ఫలితంగా హెపటైటిస్, ఎయిడ్స్ వంటి ఇన్‌ఫెక్షన్లకు, ఇంజక్షన్ తీసు కున్న ప్రదేశంలో యాబ్సెస్‌లు తదితర సమస్య లకు ఎక్కువగా లోనవుతుంటారు. కొంతమంది సెడేటివ్స్‌ను, యాంటి హిస్టమిన్స్‌ను కలిసి కాక్‌టెయిల్‌గా చేసుకుని ఇంజక్ట్ చేసుకుంటూ ఉంటారు.
నిద్రమాత్రలకు అలవాటు పడిన వారు తర చుగా వైద్యులవద్దకు వెళ్లి ఈ మందులు రాయా లని ఒత్తిడి చేస్తుంటారు. మరికొంతమంది వైద్యుడి సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ ఈ మందులు కొనుక్కోవడానికి యత్నిస్తుంటారు. సాధారణంగా రకరకాల వ్యాధి లక్షణాలతో, బాధలతో వైద్యులను కలుస్తుంటారు. సెడేటివ్స్ రాసే వరకూ వైద్యులను విడిచిపెట్టరు. తర చుగా వైద్యులను మారుస్తుంటారు. ఇలా వైద్యు లను మార్చడాన్ని డాక్టర్ షాపింగ్ అంటారు. ఇటువంటి వారి శరీరాలపై ఇంజక్షన్ చేసు కున్నట్లు గుర్తులు, ఇన్‌ఫెక్షన్స్ ఉండటాన్ని చూస్తుంటాము. ఈ మందుల కారణంగా కలిగే దుష్ప్రభావాలు, మందులు మానడం వల్ల కలిగే విత్‌డ్రావల్ లక్షణాల కోసం కూడా వైద్యులను సంప్రది స్తుంటారు.
లక్షణాలు
సెడేటివ్స్ వాడినప్పుడు కలిగే లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి. సెడేటివ్ వాడిన ప్పుడు కలిగే స్థితిని ఇంటాక్సికేషన్ అంటారు. ఇంటాక్సికేషన్‌ను మనం తెలుగులో విష ప్రభావం అని వ్యవహరించుకోవచ్చు. ఆ లక్షణాలు - లైంగికపరమైన అసంబద్ధ ప్రవర్తనలు లేదా ఉద్రేకపూరిత ప్రవర్తన, విచక్షణాలోపం, నత్తి, సమతూకంగా నడవలేకపోవడం, ఏకాగ్రతా లోపం, జ్ఞాపకశక్తి లోపం, అపస్మారం మొదలైనవి. సెడేటివ్స్ కారణంగా శ్వాస ప్రక్రియ సక్ర మంగా జరుగకపోవడం (రెస్పిరేటరీ డిప్రెషన్), తద్వారా హైపాక్సియా వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అయితే ఇది ఎక్కువగా సెడే టివ్స్‌తోపాటు ఇతర పదార్థాలు - ఉదాహర ణకు మద్యం మొదలైనవి - కలిపి వాడినప్పుడు జరుగుతుంటుంది.
వృద్ధుల్లో మత్తుపదార్థాల వాడకం వల్ల తూలి పడిపోవడం, ఎముకలు విరగడం వంటి సమ స్యలు కలుగుతాయి. సెడేటివ్స్ వాడి వాహ నాలు నడిపే సమయంలో ప్రమాదాలు సంభవి స్తుంటాయి. సెడేటివ్స్‌ను ఎక్కువ కాలం వాడి నప్పుడు, ముఖ్యంగా బెంజోడయజెపైన్స్ వల్ల జ్ఞాపక శక్తి, విచక్షణాలోపం, తెలివి మందగిం చడం వంటివి ఎక్కువగా కనిపిస్తాయి.
వైద్యులు ఈ మందులు ఎందుకు ఇస్తారు?
బెంజోడయజెపైన్ మందులను వివిధ సమ స్యలకు చేసే చికిత్సలో భాగంగా వైద్యులు సూచిస్తారు.
విరామం లేకుండా మూర్ఛకు గురవుతున్న వారికి, కదలికల్లో లోపాలు ఉన్నవారికి, మత్తు మందు (అనస్థీషియా) ఇవ్వవలసిన సంద ర్భంలో, కండరాల విశ్రాంతి కోసం, ఒత్తిడి, ఆందోళన, భయాలు, పానిక్ డిజార్డర్స్ వంటి మానసిక సమస్యలో ఈ మందులను ఉపయో గించడం జరుగుతుంది.
నిద్ర మాత్రలు శరీరంపై ప్రభావం చూపే సమయాన్ని హాఫ్ లైఫ్ అంటారు. హాఫ్ లైఫ్ తక్కువగా ఉండే బెంజోడయజెపైన్స్ శరీరంపై తక్కువ సమయం మాత్రమే ప్రభావం కలిగి ఉంటాయి కనుక వాటిని మళ్లీ మళ్లీ వాడాల్సి వస్తుంది. బెంజోడయజెపైన్స్ కంటే బార్బిట్యురేట్స్‌కు అలవాటుపడే అవకాశాలు అధికంగా ఉంటాయి. బార్బిట్యురేట్స్ ఎక్కువ ప్రమాదకరమైనవి. వాటి వాడకం తక్కువగా ఉంటుంది.
రోగి లక్షణాలకు తక్షణం ఉపశమనం లభిం చడం, ఇతర వైద్య పద్ధతులు కఠినమైనవి కావడం (ఉదాహరణకు సైకోథెరపీ వంటి పద్ధ తులకు సమయం, ఓపిక అవసరం) వంటి కారణాల వల్ల బెంజోడయజెపైన్స్ అధికంగా వాడకంలోకి రావడానికి దోహదపడ్డాయి.
వృద్ధాప్యంలో ఎక్కువగా అలవాటు పడే మందులు బెంజోడయజెపైన్స్. నిద్రలేమి, శారీరక బాధలు, ఒంటరితనం మొదలైన వాటి నుంచి ఉపశమనం కోసం బెంజోడయజెపైన్స్‌కు అలవాటు పడటం జరుగుతుంది.
బెంజోడయజెపైన్స్‌కు అలవాటుపడటమ నేది ఆయా మందుల హాఫ్ లైఫ్ (శరీరంలో ఎంతకాలం మందు పని చేస్తుంది), పొటెన్సీ (ఎంత మోతాదుతో మందు అవసరం) ఎంత త్వరగా ప్రభావం మొదలు పెడుతుంది? తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ఎక్కువగా డయజిపామ్, ఫ్లూనైట్రజెపామ్, ఇన్‌ఫెక్టబుల్ టెచజెపామ్, ఆల్ప్రాజొలామ్ మందులకు అలవాటుపడుతుంటారు.
ఫ్లూనైట్రజెపామ్, లోరాజెపామ్‌లను డేట్ డ్రగ్స్ అని వ్యవ హరిస్తారు. విదేశాల్లో ఈ మందు లను మద్యంలో కలిపి ఇస్తారు. దీనివల్ల తమ శరీరంపై స్వాధీనం తప్పుతుంది. ఇటు వంటివి తీసుకున్న స్త్రీలు బలవంతపు లైంగిక కార్యానికి (రేప్) తేలికగా లొంగిపోతారు. ఇలాంటి స్థితిలో జరిగిన లైంగిక కార్యం ఆ తరువాత వారికి గుర్తు ఉండకపోవచ్చు.
బెంజోడయజెపైన్స్ ఆందోళన, నిద్రలేమి, అధిక ఒత్తిడి మొదలైన వాటినుంచి ఉపశమనం కలిగించడంతో పాటు ఒక రకమైన మానసిక విశ్రాంతిని, మత్తును కలిగిస్తాయి. ఇలాంటి మత్తు స్థితి కోసం మనిషి వీటికి అలవాటు పడతాడు. కానీ కొంతకాలం వాడిన తరువాత అధిక మోతాదుల్లో తీసుకుంటే కాని ఆ రకమైన మత్తు, విశ్రాంతి కలుగవు. అంతేకాక కొన్ని రోజులపాటు వీటిని వాడి మానేసినప్పుడు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. అవి -
అటానమిక్ డిస్ట్రబెన్స్ - ఉదాహరణకు : గుండె దడ, చెమటలు, బి.పి.లో హెచ్చుతగ్గులు మొదలైనవి. చేతులు వణకడం, నిద్రలేమి, పగలు చిరాకుగా, నిద్రమత్తుగా ఉండటం, వికారం, వాంతులు, ఆందోళన, విసుగు, చిరాకు, నిస్సత్తువ, కళ్ల ముందు లేని ఆకారాలు కనిపించడం, ఎవరూ లేకపోయినా చెవిలో శబ్దాలు వినిపించడం, శరీరంపై పురుగులు పాకినట్లు భావన కలగడం (ఇవి తాత్కాలికంగా కలుగుతాయి).
రకరకాల భ్రమలు కలుగుతాయి. (ఉదా హరణకు - తాడును చూసి పాముగా భ్రమించడం), కొన్ని సందర్భాల్లో డెలీరియమ్, సైకోసిస్, గ్రాండ్‌మాల్ సీజర్స్ (ఫిట్స్ లేదా మూర్ఛలు) కలుగుతాయి. ఈ లక్షణాలు నిద్ర మందులు మానేసిన తరువాత 24 గంటలలో మొదలై 48 గంటల నుంచి 2 వారాల వరకూ అధికమవుతాయి. ఇది బెంజోడయజెపైన్ హాఫ్‌లైఫ్‌ను బట్టి (పని చేసే సమయాన్ని బట్టి) ఆధారపడి ఉంటుంది.
బార్బిట్యురేట్స్ వాడి మానేయడం వల్ల కలిగే లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. శరీరంలో ఉష్ణో గ్రత అధికం కావడం (హైపర్‌థర్మియా), డెలీరి యం, చివరకు ప్రాణాలకు ప్రమాదం సంభవిం చడం జరుగుతుంది. బార్బిట్యురేట్స్ వాడే వ్యక్తికి ఆ మందు వేసుకున్న విషయం జ్ఞాపకం ఉండదు కనుక మళ్లీ మళ్లీ వేసుకుంటూ ఉంటాడు. తరువాత రెస్పిరేటరీ డిప్రెషన్‌కు గురై ప్రమాదానికి లోనవుతాడు.
ఇక్కట్లు జ్ఞాపకశక్తి లోపం, ఏకాగ్రత, వేగం తగ్గు తాయి. చేసే పనిని వేగంగా చేయలేడు. వ్యక్తిత్వంలో మార్పులు సంభవిస్తాయి. బెంజో డయజె పైన్స్‌తో పాటు మద్యం, ఇతర మందులు కలిపి వాడటం వల్ల రెస్పిరేటరీ డిప్రెషన్, కోమా మొదలైనవి సంభవించవచ్చు.
ఆత్మహత్య కోసమో, అనుకోకుండానో అధిక మోతాదులో వాడవచ్చు.
వాహనాల్లో ప్రయా ణించేప్పుడు లేదా పని చేసే చోట ప్రమాదాలు సంభవించే అవకాశం అధికంగా ఉంది. (ఈ మందులు వాడే సమయంలో వాహనాలు నడప కుండా ఉండటం మంచిది.) గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలు పడుతున్న తల్లులు బెజోడయజెపైన్స్‌ను వాడటం వల్ల గర్భస్థ శిశువుపై, పాలు తాగే చిన్నారిపై ప్రభావం చూపుతాయి. తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, గ్రహణ మొర్రి, ఫ్లాపీబేబీ సిండ్రోమ్ తదితర పుట్టుకతో వచ్చే లోపాలకు గురవుతారు. పిల్లలకు రెస్పిరేటరీ డిప్రెషన్, అధికంగా మత్తు కలగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
వైద్యుడి సలహా, సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడటం హానికరం.
వృద్ధులు, శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉన్నవారు, మద్యం సేవించే వారు, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారు ఈ మందులను వాడకూడదు. వీటిని వాడే సమయం, తరువాత మోతాదు తగ్గిస్తూ ఆపే తీరు మొదలైనవి వైద్యుడి పర్యవేక్షణలో జరిగితే మంచిది. ఈ పదార్థాలకు అలవాటు పడితే తక్షణమే వైద్యుడిని సంప్రదించడం అవసరం.
- =========================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.