--మన దేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీ యంగా పెరుగుతున్నట్లుగానే, గర్భిణీల్లో మధుమేహం అధికమవుతున్నది. తమిళనాడులో జరిగిన అధ్యయనాల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ప్రతి వందమంది గర్భిణీల్లో 16 నుంచి 17 మందికి, గ్రామీణ ప్రాంతాల్లో 10 మందికి మధుమేహం ఉన్నట్లు బైటపడింది. తమిళనాడు ప్రభుత్వం గ్లూకోజ్ ఛాలెంజ్ పరీక్షను ప్రతి గర్బిణీ స్త్రీకి తప్పనిసరిగా చేయాలని చట్టాన్ని తీసుకువచ్చి దానిని ఉచితంగా చేయడానికి సన్నద్ధమవుతున్నది.
మన రాష్ట్రంలో కూడా వైద్యులకు, ప్రజలకు అవగా హన కల్పించి, గర్భ సమయంలో ఈ పరీక్షను తప్పని సరిగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.గర్భిణీల్లో కనిపించే మధుమేహాన్ని రెండు రకాలుగా విభజించవచ్చు. గర్భధారణకు ముందే మధుమేహం ఉంటే దానిని ప్రీజెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. గర్భధారణ సమయంలో మొదటిసారిగా మధుమేహం బైటపడితే దానిని జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు.
ప్రీజెస్టేషనల్ డయాబెటిస్(గర్భధారణకు ముందే మధుమేహం ఉంటే?)
ఫోలిక్ యాసిడ్ బిళ్లలను వాడుతూ, రక్తంలో చక్కెర స్థాయి (సుగర్ లెవెల్) నియంత్రణలో ఉండి, హీమోగ్లోబిన్ ఎ, సి అనే రిపోర్టు 6 నుంచి 7 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడే గర్భం కోసం ప్రయత్నించాలి.
హీమోగ్లోబిన్ ఎ, సి -10 శాతం కంటే ఎక్కువగా ఉంటే బిడ్డకు లోపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మధుమేహానికి మాత్రలు గర్భం ధరించగానే ఆపి ఇన్సులిన్ ఇంజక్షన్ ఆరంభించాలి. డాక్టర్ సలహా ప్రకారం 15 రోజులకు ఒకసారి రక్తంలో చక్కెర స్థాయి ఏ విధంగా ఉందో పరీక్ష చేయించుకుంటూ ఆహార నియంత్రణ, ఇన్సులిన్ ద్వారా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి.
జెస్టేషనల్ డయాబెటిస్
ఆసియా దేశాల్లో మధుమేహ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల మన దేశంలోని ప్రతి గర్భిణీ 24 - 28 వారాల మధ్య తప్పనిసరిగా 50 గ్రా. గ్లూకోజ్ పరీక్ష (7వ నెల ఆరంభంలో) చేయించుకోవాలి. ఆ రిపోర్టు 130 మి.గ్రా. కంటే ఎక్కువగా వస్తే 100 గ్రాముల గ్లూకోజ్ టాలరెన్స్ పరీక్ష చేసి గర్భధారణలో మధుమేహం ఏమైనా బైటపడిందా అనేది చెప్పగలుగుతారు.
ఇలా రెండుసార్లు గ్లూకోజ్ పరీక్ష చేయ కుండా, 75 గ్రాముల గ్లూకోజ్ పరీక్ష (ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం) ద్వారా గ్లూకోజ్ స్థాయి 140 మి.గ్రా. కంటే ఎక్కువగా ఉంటే జెస్టేషనల్ డయాబెటిస్‌ను నిర్ధారించవచ్చు.
కుటుంబంలో మధుమేహ చరిత్ర ఉన్నా, బరువు ఎక్కువగా ఉన్న బిడ్డకు జన్మనిచ్చినా, అంతకుముందు కాన్పులో శిశువు గర్భంలోనే మరణించినా, ఈ పరీక్షను గర్భధారణ మొదట్లో ఒకసారి, 24 - 28 వారాల మధ్య ఒకసారి, తిరిగి 32 - 34 వారాల మధ్య ఒకసారి చేయాల్సి ఉంటుంది.
గర్భధారణలో మధుమేహం: దుష్ఫలితాలు
గర్భధారణ మొదటి మూడు నెలల్లో గ్లూకోజ్ స్థాయి నియంత్రణలో లేకపోతే బిడ్డకు లోపాలు వచ్చే అవకాశం ఎక్కువ.
చక్కెర స్థాయి నియంత్రణలో లేకపోతే బిడ్డ మరీ బరువు ఎక్కువగా పెరగడం, పుట్టిన తరువాత ఊపిరి తిత్తులు పని చేయకపోవడం, గ్లూకోజ్, కాల్షియం స్థాయి పడిపోవడం, జాండిస్ రావడం వంటి దుష్ఫలితాలు ఎదు రవుతాయి. మరీ ఎక్కువగా నియంత్రిస్తే, కీటోఎసిడోసిస్ అనే పరిస్థితి ఉత్పన్నమై తల్లి కూడా ప్రమాదకర పరిస్థి తిలోకి చేరవచ్చు.
జెస్టేషనల్ డయాబెటిస్ ఉన్నవారందరికీ ఇన్సులిన్ అవసరం రాకపోవచ్చు. 70 నుంచి 80 శాతం మందిలో ఆహార నియంత్రణ, నడక వంటి వ్యాయామం రోజుకు 30 నిముషాల పాటు చేయడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.
వ్యాయామం, ఆహార నియం త్రణ తరువాత కూడా ఫాస్టింగ్ గ్లూకోజ్ 120 మి.గ్రా. కంటే ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ తీసు కోవాల్సి ఉంటుంది. గర్భధా రణలో మధుమేహానికి మాత్రలు కాకుండా ఇన్సులిన్ మాత్రమే వాడాల్సి ఉంటుంది.
ఇన్సులిన్ : జాగ్రత్తలు
ఇన్సులిన్ తీసుకోవడానికి మోతాదుకు సరిపడే సిరంజినే వాడాలి. ఇంజక్షన్ తీసుకునేప్పుడు చర్మాన్ని పైకెత్తి 45 డిగ్రీల కోణంలో సూదిని చర్మంలోకి గుచ్చాలి. పిరుదుల మీద, తొడల ముందు భాగంలోను, పొట్టపైన, భుజాల కింద ఇన్సులిన్ ప్రతిసారి 2 సెంటీమీటర్ల దూరంలో తీసుకోవచ్చు. ఆహారం తీసుకోకపోయినా, ఎక్కువ శారీరక శ్రమ చేసినా లేదా ఇన్సులిన్ మోతాదు ఎక్కువ అయినా రక్తంలో చక్కెర స్థాయి పడిపోయి శరీరం చల్లబడుతుంది. చెమటలు పట్టడం, చేతి వణుకు, గుండె దడ, నీరసం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి పరిస్థితి వస్తే పంచదార నీళ్లు తాగి వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలి.
కొన్ని సూచనలు క్రమం తప్పకుండా డాక్టర్‌కు చూపించుకుంటూ, వారి సూచనలు పాటిస్తూ, బిడ్డ కదలికలను గమనిస్తూ ఉండాలి. డాక్టర్ సూచనల ప్రకారం స్కానింగ్, 9వ నెలనుంచి వారానికి ఒకటి రెండుసార్లు నాన్ స్ట్రెస్ టెస్ట్ (ఎన్‌ఎస్‌టి) చేయించుకోవాల్సి ఉంటుంది. బిడ్డ బరువు ఎక్కువగా ఉన్నా, చక్కెర నియంత్రణలో లేకపోయినా లేదా ఏ ఇతర ఇక్కట్లు ఉన్నా సిజేరియన్ ద్వారా కాన్పు చేయాల్సి ఉంటుంది.
కాన్పు తరువాత జెస్టేషన్ డయాబెటిస్‌లో కాన్పు అయిన వెంటనే సాధారణంగా రక్తంలో చక్కెర స్థాయి సాధారణ స్థితికి వచ్చేస్తుంది. తిరిగి ఆరు వారాల తరువాత గ్లూకోజ్ టాలరెన్స్ పరీక్ష చేయించుకోవాలి.
ప్రీజెస్టేషనల్ డయాబెటిస్‌లో కాన్పు తరువాత ఇన్సులిన్ ఆపివేసి, మెట్‌ఫార్మిన్, గ్లిబెన్‌క్లమైడ్ వంటి మాత్రలను తిరిగి ఆరంభించవచ్చు.
కాన్పుల మధ్య కొంత వ్యవధి ఉండేలా చూసుకుని, ఆహార నియమాలు పాటిస్తూ. వ్యాయామం చేయడం ద్వారా తదుపరి గర్భధారణలో మధుమేహం రాకుండా కొంత వరకూ నిరోధించవచ్చు.
source : Wikipedia.org --English article
- =========================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.