Saturday, March 19, 2011

యాంటి ఆక్సిడెంట్స్‌ ప్రాముఖ్యత,Importance of Antioxidents



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -యాంటి ఆక్సిడెంట్స్‌ ప్రాముఖ్యత(Importance of Antioxidents)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

మన శరీరంలో నిరంతరం ఎన్నో రసాయన ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. వీటిలో అతి కీలకమైనది ఆక్సిడేషన్‌ ప్రక్రియ.
శరీరంలోని ప్రతి కణజాలం ఆక్సిజన్‌ను ఉపయోగించుకునే ప్రక్రియలో భాగంగా కొన్ని రసాయన పదార్థాలు విడుదల అవుతాయి. ఈ రసాయన పదార్థాలను ఫ్రీ రాడికల్స్‌ అంటారు.

ఈ ఆక్సిజన్‌ వ్యర్థ పదార్థాలు ఎక్కువైతే శరీరానికి హాని చేస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్‌ను తటస్థపరుస్తూ, మోతాదు పెరగకుండా సమతుల్యం కాపాడటానికి శరీరంలో యాంటి ఆక్సిడెంట్స్‌ తయారవుతూ ఉంటాయి.
ఈ యాంటి ఆక్సిడెంట్స్‌ ప్రధానంగా - విటమిన్లు (ఎ,సి,ఇ,), మినరల్స్‌(సెలీనియం, జింక్‌, కాపర్‌, మెగ్నీషియం), ఎంజై మ్‌లు (సూపర్‌ ఆక్సైడ్‌, పెరాక్సైడ్‌, గ్లూటా థయోన్‌), ప్రోటీన్లు (సిస్టిన్‌, ల్యూకోటిన్‌) మొదలైనవి.

ఫ్రీ రాడికల్స్‌ ఎంతో శక్తివంతమైనవి. కణజా లాల రసాయన స్వరూపాన్నే మార్చగల శక్తి ఉంది. ముఖ్యంగా కణాల్లోని జన్యు పదార్థం లేదా డిఎన్‌ఎను, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాల రసాయన స్వరూపాలను మార్చే శక్తి వీటికి ఉంది. తద్వారా అనేక రకాల వ్యాధులకు దారి తీస్తుంది. దాదాపు 60 రకాల వ్యాధులకు ఈ ఫ్రీ రాడి కల్స్‌ కారణమవుతున్నాయని గుర్తించారు. వీటిలో ముఖ్యమైనవి కేన్సర్‌, గుండెపోటు, డయాబె టిస్‌, మెదడు వ్యాధులు, చర్మవ్యా ధులు, రుమటాయిడ్‌ కీళ్ల వ్యాధులు, వ్యాధి నిరోధకశక్తి దెబ్బ తినడం ద్వారా సోకే వ్యాధులు మొదలైనవి.

శరీరంలో వయస్సుతో వచ్చే మార్పులను, ప్రధానంగా ఎథిరోస్ల్కీరోసిస్‌ ప్రక్రి యను ఫ్రీ రాడికల్స్‌ వేగవంతం చేస్తాయి.
తక్కువసాంద్రత కలిగిన లిపోప్రోటీన్‌ల ఆక్సి డేషన్‌ ప్రక్రియ రక్తనాళాల్లో కొవ్వు పేరుకో వడంలో కీలకమైనది. దీనినే ఎథిరోస్ల్కీరోసిస్‌ అంటారు. ఈ ఎథిరోస్ల్కీరోసిస్‌ ఎక్కువగాను, తొందరగాను హృదయ రక్తనాళాల్లో జరగడం వల్ల హార్ట్‌ ఎటాక్‌కు దారి తీస్తుంది.అలాగే మెదడు రక్తనాళాల్లో ఏర్పడితే పక్షవా తానికి దారి తీస్తుంది.

వయస్సు పెరిగే కొద్దీ చర్మం మందంగా తయారై, ముడుతలుపడటం వంటి మార్పులు చర్మంలోని ఎలాస్టిన్‌, కొల్జేన్‌ కణాలు దెబ్బ తినడం వల్ల వేగవంతమవుతాయి. తద్వారా చిన్న వయస్సులోనే పెద్దవారిగా కనిపిస్తారు.
చర్మ సౌందర్యాన్ని కాపాడి నిత్య యవ్వ నాన్ని ప్రసాదించేవి యాంటి ఆక్సిడెంట్లు. వయస్సు రీత్యా మెదడులో వచ్చే డీజనరేషన్‌ మార్పులను ఫ్రీ రాడికల్స్‌ వేగవంతం చేసి న్యూరో డీ జనరేటివ్‌ వ్యాధులు, ముఖ్యంగా అల్జీమర్స్‌, పార్కిన్‌సన్‌ వ్యాధులు త్వరగా వచ్చేందుకు దోహదం చేస్తాయి.
శరీరం వివిధ రకాల ఒత్తిళ్లకు లోనైనప్పుడు ఈ ఫ్రీ రాడికల్స్‌ మోతాదు పెరుగుతుంది. పొగ తాగడం, మద్యం సేవించడం, పరిశ్రమల కాలుష్యం, వాహనాల కాలుష్యం, తీవ్రమైన ఎండ తాకిడి, మెడికల్‌ ఎక్స్‌రే రేడియేషన్‌కు గురి కావడం, ఆహారం, నీరు, గాలి ద్వారా అనేక రకాల కాలుష్యాలకు గురైన్పుడు శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ ఎక్కువై రకరకాల వ్యాధులకు కారణమవుతాయి.
యాంటి ఆక్సిడెంట్లు మనం తీసుకునే ఆహారంనుంచే శరీరంలో తయారవుతాయి. ఈ యాంటి ఆక్సిడెంట్లు శరీరంలోని కణజాలాలు దెబ్బ తినకుండా, వివిధ రకాల వ్యాధుల బారిన పడకుండా రక్షణ కవచంలా కాపాడుతాయి.

ఒక ఇనుపముక్క బైట ఉంచితే కొద్ది రోజుల్లో తుప్పు పడుతుంది. గాలి నీరు, ఆక్సిజన్‌ కారణంగా ఆక్సిడేషన్‌ ప్రక్రియ జరిగి తుప్పు పడుతుంది. అదే ఇనప ముక్కకు రంగు పూసి ఉంచితే తుప్పు పట్టదు. అలాగే శరీరంలోని కణజాలాలు దెబ్బ తినకుండా యాంటి ఆక్సిడెంట్లు కాపాడుతాయి.

వ్యాయామం చేసేప్పుడు శరీరం 10 నుంచి 20 రెట్లు ఎక్కువ ఆక్సిజన్‌ను తీసుకుంటుంది కనుక ఫ్రీ రాడికల్స్‌ కూడా ఎక్కువ తయారవుతాయి. కానీ క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారి శరీరాల్లో క్రమేణా యాంటి ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా తయారై బాలెన్స్‌ అవుతుంది.

అప్పుడప్పుడు వ్యాయామం చేసే వారికంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారిలో యాంటి ఆక్సిడెంట్లు సమృద్ధిగా తయారవుతాయి. క్రీడాకారులు యాంటి ఆక్సిడెంట్లు సమృద్ధిగా తీసుకోవడం మంచిది.
యాంటి ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కేన్సర్‌, గుండెపోటు, మధుమేహం, కీళ్ల జబ్బులు, మెదడు జబ్బుల వంటి వ్యాధుల సోకకుండా జాగ్రత్త పడవచ్చు.

యాంటి ఆక్సిడెంట్లు అన్ని రకాల ఆకుకూ రలు, కూరగాయలు, పండ్లలో ఉంటాయి. ముఖ్యంగా క్యారెట్‌, క్యాబేజీ, టమాటొ, ఉల్లి, దుంపలు, బీన్స్‌, చిక్కుళ్లు, యాపిల్‌, ఆరంజ్‌, ద్రాక్ష, బొప్పాయి, చెర్రీ, బెర్రి, గ్రీన్‌ టీ, కోకో చాకొలెట్‌, ఆలివ్‌ ఆయిల్‌, తేనె, రేగుపళ్లు మొదలైన వాటిలో సమృద్ధిగా ఉంటాయి.
విటమిన్‌-ఎ ఆకుకూరలు, ఆరంజ్‌ రంగు ఉండే పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా టమాటొ, బొప్పాయి, మామిడి, క్యారెట్‌ మొదలైన వాటిలో ఎక్కువగా ఉంటుంది.

విటమిన్‌-సి పులుపుగా ఉండే కూరగాయ లలో, పండ్లలో ఎక్కువగా ఉంటుంది.
విటమిన్‌-ఇ ధాన్యపు గింజలు, చేపనూనె, వెజిటబుల్‌ ఆయిల్స్‌లో ఎక్కువగా ఉంటుంది.
ప్రోటీన్లు టమాటొ, పుచ్చకాయ, బొప్పాయి, జామ, ద్రాక్షలో ఎక్కువ. ఆరోగ్యకరమైన కళ్లకు అవసరమయ్యే ల్యూటిన్‌ అనే యాంటి ఆక్సిడెంట్‌ ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది.

సెలీనియం వరి, గోధు, రాగులు, జొన్నల్లో ఎక్కువ. కనుక మనచుట్టూ రోజువారీ లభ్య మయ్యే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు మొదలైనవి మన శరీరాన్ని ప్రాణాంతక వ్యాధులనుంచి కాపాడు రక్షణాయుధాలు.
యాంటి ఆక్సిడెంట్‌ క్యాప్సూల్స్‌, టాబ్లెట్ల వాడకంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మందుల ద్వారా యాంటి ఆక్సిడెంట్లు ఎక్కు వగా వాడితే ప్రమాదం కూడా ఉంది. వీటి వాడకంపై ఇంకా అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉంది.
మందుల ద్వారా కంటే ఆహారపు అలవాట్లలో సమతుల్య పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఎంతో క్షేమకరం.
  • =====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.