ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --దగ్గినప్పుడు మూత్రం పడుట -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
ఏదో ఒక సందర్బంలో దగ్గని వారు ఎవరూ ఉండరు. మన దైనందిన జీవితంలో వంటగదిలో పోపు వేస్తున్నప్పుడు వచ్చే వాసన పీల్చినప్పుడు కాని, ఇల్లూ, వాకిలి తుడుస్తున్నప్పుడు కాని, మరుగుదొడ్లు శుభ్రపరుస్తు న్నప్పుడు కాని, చలిగాలిలో బైటికి వెళ్లినప్పుడు కాని, కాలుష్యానికి గురైనప్పుడు కాని, మస్కిటో కాయిల్స్ వెలిగించినప్పుడు కాని, చివరకు పర్‌ఫ్యూమ్స్ వాడినప్పుడు కాని మనకు తెలియకుండానే దగ్గి ఉంటాము. మనం మన శరీరాన్ని రక్షించుకునే ప్రక్రియలో భాగంగా దగ్గు ఒక ప్రతిస్పందనగా పని చేస్తుంది. శ్వాసనాళాల్లో ఉండే కాఫ్ రిసెప్టార్స్ ఇలాంటి వాసనలకు గురైనప్పుడు అవి ప్రేరితమై మెదడుకు సంకేతాలు పంపుతాయి. అక్కడినుంచి ఛాతీ కండరాలకు సంకేతాలు అందుతాయి. ఈ సమయంలో ఊపిరి బాగా పీల్చడం, స్వరపేటిక మూసుకోవడం, కండరాలు బిగుతుగా మారడం, ఒక్కసారిగా ఊపిరితిత్తుల నుంచి గాలి వేగంగా బైటకు రావడం జరుగుతుంది. ఈ వేగానికి శ్వాసనాళాల్లో చేరిన మలినాలు, బాక్టీరియా, వైరస్ వంటివి బైటికి వెళ్లిపోతాయి. సాధారణంగా జరిగే ప్రక్రియను మనం గుర్తించలేకపోవచ్చు. గుర్తించినా, అవి మనకు గుర్తు ఉండకపోవచ్చు.
ఏళ్ల తరబడి ధూమపానం చేసేవారు తమకు తెలియకుండానే తీవ్రంగా దగ్గుతుంటారు. మీరు దగ్గుతున్నారని ఎదుటివారు చెప్పినా వారు నమ్మరు. దీనిని స్మోకర్స్ కాఫ్ అంటారు. సాధారణంగా కనిపించే శ్వాసకోశ వ్యాధులు - జలుబు, ఫారింజైటిస్, ట్రేకియాటిస్, బ్రాంకైటిస్, అలర్జీ, ఆస్తమా మొదలైన వాటితోపాటు - దీర్ఘకా లిక వ్యాధుల్లో కూడా దగ్గు ఒక లక్షణంగా కనిపి స్తుంది. క్షయ, న్యుమోనియా, ఇంటర్‌స్టీషియల్ లంగ్ డిసీజ్, గుండె వైఫల్యం చెందడం, ఇసినోఫిలియా వంటి వ్యాధుల్లో కూడా దగ్గు ఒక ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. బీటాబ్లాకర్స్, ఎసిఇ ఇన్హిబిటర్ల వంటి బిపి మందులు, నాన్ స్టీరాయిడల్ యాంటి ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్‌ఎస్‌ఎఐడి) వంటి నొప్పులకు వాడే మందుల వల్ల కూడా కొంతమందిలో దగ్గు వస్తుంది.
వివిధ రకాల వ్యాధుల్లో దగ్గుతోపాటు ఆయా వ్యాధులకు సంబంధించిన ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. జ్వరం, ఛాతీ నొప్పి, ఆయాసం, పిల్లికూ తలు, దగ్గులో రక్తం పడటం, గొంతు బొంగురుపోవడం వంటివి కనిపిస్తాయి. వీటినిబట్టి కొన్ని అవసరమైన రక్త పరీక్షలు, ఛాతీ ఎక్స్‌రే, సి.టి. స్కాన్ మొదలైన పరీక్షలు జరిపి వ్యాధిని నిర్ధారించడం జరుగుతుంది. చాలామందిలో దగ్గు తేలికగా ఉండటం, కొన్ని సందర్బా ల్లో దగ్గిన్పుడు ఛాతీలో మంట రావడం, దగ్గు వల్ల నిద్ర పట్టకపోవడం వంటివి కూడా జరుగవచ్చు. మరికొందరిలో దగ్గుతున్నప్పుడు మూత్రం పడుతుంది. బట్టలు తడిసిపోవడం, వాసన రావడం వంటి వాటితో కొందరు బైటకు వెళ్లడానికి కూడా ఇష్టపడరు. వీరిలో మూత్రాశయ సమస్య ఏమీ ఉండకపోవచ్చు.
దగ్గినప్పుడు ఛాతీలో కలిగే ఒత్తిడి, కడుపులోని ఒత్తిడి మూత్రాశయంపై పడటం వల్ల దగ్గిన ప్రతిసారీ మూత్రం పడుతుంటుంది. ఈ రకమైన సమస్యతో బాధపడుతున్న వారు దగ్గు రావడానికి కారణమైన వ్యాధి ఏమిటో తెలుసుకుని దానికి చికిత్స తీసుకుంటే, ఈ సమస్యను అధిగమించవచ్చు. కొంతమంది ఈ విషయం అర్థం కాక, మూత్రపిండాలు దెబ్బ తిన్నాయే మోననే భయంతో స్పెషలిస్టుల దగ్గరకు వెళ్లి రకరకాల పరీక్షలు చేయించు కుంటూ ఉంటారు. దగ్గినప్పుడు మూత్రం పడటమనే సమస్య పురుషుల్లో కంటే స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. చాలామంది ఈ సమస్యతో కుంగిపోతారు. గర్బాశయాన్ని తొలగించడం (హిస్టరెక్టమీ), లేదా జీర్ణాశయ వ్యాధులకు అవసరమయ్యే శస్త్ర చికిత్సలకు ముందు కూడా దగ్గు లేకుండా జాగ్రత్త పడాలి. ఆపరేషన్ తరువాత ఒక్కొక్కసారి కుట్లు ఊడిపోయి హెార్నియా వచ్చే ప్రమాదం ఉంటుంది. దగ్గు, దానితోపాటు మూత్రం వస్తున్నప్పుడు ముందుగా ఫిజిషియన్‌ను లేదా పల్మొనాలజిస్ట్‌ను సంప్రదించి దగ్గుకు తగిన కారణమేమిటో నిర్ధారణ చేసుకుని తదనుగుణంగా చికిత్స తీసుకుంటే దగ్గినప్పుడు మూత్రం పడే సమస్యనుంచి విముక్తి పొందవచ్చు.
==============================================
Visit my website - > Dr.Seshagirirao.com/
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.