Friday, March 11, 2011

మింగడంలో ఇబ్బంది కారణాలు,Difficulty in Swallowingఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మింగడంలో ఇబ్బంది కారణాలు(Difficulty in Swallowing)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


శ్వాస తీసుకోవడం, రెప్పలను ఆర్పటంలాగే మింగటాన్ని కూడా మనం తేలికగా చేస్తుం టాము. ఈ మూడుచర్యలూ మన ప్రయత్నం లేకుండా వాటికవి జరిగిపోతుండటం వలన మనం పెద్దగా పట్టించుకోము. ఏదైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు తప్ప!
మింగడం విషయంలో ఆయా భాగపు కండ రాల సంకోచ వ్యాకోచాలు నరాలప్రేరణల మధ్య ఎంతో సమన్వయం ఉండాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఎక్కడ చిన్న అపశృతి దొర్లినా మనంఎంతో ఇబ్బందిపడాల్సి వస్తుంది.

మింగటం అంటే ఆహారం కాని, నీరుకాని గొంతు పైభాగంనుంచి అన్నవాహిక పొడుగునా, జీర్ణాశయం పైభాగం వరకూ ప్రయాణించే చర్య. ఈ ప్రయాణమార్గంలో ఎక్కడ ఏ చిన్న భాగం దెబ్బతిన్నా అది మింగటానికి అవరోధం అవుతుంది. మింగటం ఇబ్బంది అవుతుంది.
మింగటంబాధాకరంగా, ఇబ్బందిగా ఉండేట్లు చేసే అంశాలు ఎన్నో ఉన్నాయి. అయితే వీటిలో చాలాభాగం తాత్కాలికంగా వచ్చిపోయేవి మాత్రమే ఉంటాయి.

అయితే మింగటం ఇబ్బందిగా ఉండటం ఏకొద్ది రోజులో కాక, ఇంకా ఎక్కువ రోజులు కొనసాగి, రానురాను పరిస్థితి దిగజారుతున్న ట్లుగా అనిపించి అందుకు పైకి ఏ కారణమూ కనిపించకపోతే దానిని సీరియస్‌ విషయంగా తీసుకుని వెంటనే పరీక్షలు జరిపించుకోవాల్సి ఉంటుంది. మింగటంలో సమస్యలు ఏర్పడు తున్నప్పుడు దానిని నిర్లక్ష్యం చేయకుండా డాక్ట ర్‌కు చూపించుకోవడం అవసరం. మింగడంలో ఇబ్బంది కలిగించే కారణాలను పరిశీలిద్దాం.

గొంతు భాగంలో ఇబ్బంది
ముద్ద నోటిలో పెట్టుకుని నమిలి మింగబో తుండగా గొంతు మొదటి (పై) భాగంలో ఇబ్బంది, నొప్పిగా అనిపిస్తే అది ఫారింక్స్‌కు సంబంధించిన సమస్యగా భావించవచ్చు.

ఆహారం కిందికి దిగుతున్నప్పుడు
ఆహారం కిందికి దిగుతున్నప్పుడు ఇబ్బంది అనిపిస్తే అన్న వాహికలో ఏదైనా లోపం ఉండి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

-అన్నవాహికలోపల అల్సర్‌ కాని, కేన్సర్‌ కాని ఏర్పడి ఉండటం
- పక్కనే ఉన్న గ్రంథులు వాపు చెంది అన్నవాహికను నొక్కి పడుతుండటం
- గుండెనుంచి రక్తాన్ని శరీర భాగాలకు తీసుకు వెళ్లే బృహద్ధమని వ్యాకోచించడం
- ఆహారాన్ని సరిగ్గా నమలక గట్టి, పెద్దపెద్ద ముద్దలను మింగడం వలన కూడా ఆహారం మింగుతున్నప్పుడు ఇబ్బంది కలుగవచ్చు.

ఘన, ద్రవాహారాలతో ఇబ్బంది
ఘన,ద్రవాహారాలు రెండింటితోనూ ఇబ్బంది కలుగుతుంటే అన్నవాహిక పూర్తిగా పూడుకు పోయి ఉండవచ్చు. కంతిఏర్పడి ఉండవచ్చు.
- అన్నవాహికలో నరాల సంబంధమైన అస్తవ్యస్థత ఏర్పడిఉండవచ్చు.
లేదా అక్కడి కండరాల పటుత్వం సడలటం కూడా కారణం అయి ఉండవచ్చు. ఈ స్థితి సంభవిస్తే వెంటనే వైద్య సహాయం పొందాలి.

ద్రవాహారంతోనే ఇబ్బంది
ఘనాహారాన్ని మింగుతున్నప్పుడు సాఫీగానే ఉండి, ద్రవాహారాన్ని మింగుతున్నప్పుడు మాత్రమే ఇబ్బంది కలుగుతుంటే లోపం అన్నవాహికది కాక, ఆపైభాగన ఉండే గొంతు తాలూకు నరాలు, కండరాలు బలహీనపడటం వలన అయి ఉంటుంది.
మింగుతున్న ద్రవంలో కొంత వెనక్కు వెళ్లి ముక్కుద్వారా బైటికి వచ్చేయడానికి కారణం పక్షవాత రోగుల్లో మింగటానికి సంబంధించిన యంత్రాంగం బలహీనపడటం.
ఘనాహారంతోనే ఇబ్బంది
అన్నవాహిక ఇరుకుగా కావటం వలన ఇలా జరుగుతుంది.
- బహుశాలోపల కేన్సర్‌ రావడం వలన మింగుతున్నప్పుడు ఏ గట్టిపదార్థమో గీసుకు పోవడం వలన అయి ఉండవచ్చు. ఇది అత్యవ సరంగా వైద్య సహాయం పొందాల్సిన స్థితి.

నెలలు గడిచినా తగ్గకపోతే
నెలలు గడిచినా సమస్య తొలగకపోతే దానికి కారణం అన్నవాహికకు కేన్సర్‌ సోకడమై ఉంటుంది.

గొంతు బొంగురు ఉంటే
స్వరపేటిక, అన్నవాహిక రెండూ ఒకదాని పక్కన మరొకటి ఉంటాయి.
- స్వరపేటిక గాలిని ఊపిరితిత్తులకు చేర వేస్తుంటే, అన్నవాహిక ఆహారాన్ని జీర్ణాశయానికి చేరవేస్తుంటుంది. రెండింటిలో దేనికి సమస్య ఏర్పడినా, అది రెండవ దానిపై ప్రభావం చూపుతుంది.

మింగటంలో ఇబ్బంది కలగడానికి రెండు వారాల ముందునుంచి గొంతు బొంగురుపోయి ఉంటే అది స్వరతంత్రుల సమస్య అయి ఉంటుంది. అలాకాకుండా, మింగటానికి ఇబ్బంది కలగటం ప్రారంభించిన తరువాత కొన్నాళ్లకు గొంతు బొంగు రుతనం కూడా కనిపిస్తే అది అన్నవాహికకు కేన్సర్‌ సోకడం వలన అయి ఉంటుంది. కేన్సర్‌ సోకిన భాగం స్వర తంత్రులను నియంత్రించే నరాన్ని నొక్కడం వలన ఇలా జరుగుతుంది.

వాంతులతో పోతే
అన్నవాహిక కండరాలలో పటుత్వం పోయి ఉంటుంది. లేదా అన్నవాహిక తిత్తిబుడగలా బైటికి రావడం వలన అయి ఉంటుంది.దీనిని ఈసోఫేజియల్‌ డైవర్టిక్యులమ్‌ అంటారు.

డైవర్టిక్యులమ్‌ ఏర్పడినప్పుడు తిన్న ఆహారం తిత్తిలోకి చేరుకుని దానిని నింపుతుంది. తిత్తిలో నిండు కున్న ఆహారాన్ని ఖాళీ చేయటం కోసం వాంతులు మొదలవుతాయి. వాంతులతో తిత్తి ఖాళీ అయేదాకా మనిషికి ఉపశమనం లభించదదు. తిత్తిలోని ఆహారం పులవడం వలన ఆ మనిషి శ్వాస దుర్వాసన కొడుతుంది.

నడక ఇబ్బందిగా మారితే
మింగుతున్నప్పుడు ఇబ్బందితోపాటునడక కూడా ఇబ్బందిగా మారితే పక్షవాతం, మెదడుకు సంబంధించిన వ్యాధులు మయస్తీనియా గ్రావిస్‌, మల్టిపుల్‌ స్ల్కీరోసిస్‌ వంటి నరాల సంబంధవ్యాధులు కారణం కావచ్చు.

తల పైకెత్తి తింటే నొప్పి లేనప్పుడు
మామూలుగా మింగుతున్నప్పుడు నొప్పిఉండి, తల పైకెత్తి మింగితే నొప్పి లేకపోవడం అన్నవాహిక లోపం కాక, ఫారింక్స్‌లో ఏదో సమస్య ఉండటం వలన అయి ఉంటుంది.

నలుగురిలో మింగడం సమస్య అయితే..
ఆందోళన, నరాలబలహీనత, మానసిక వత్తిళ్లు మొదలైన వాటి వలన నలుగురిలో ఉన్నప్పుడు గుటకపడటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇది పురుషుల్లో కంటే స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది.

చికిత్స : కారణాన్ని బట్టి ట్రీట్ మెంట్ చేయవలసి ఉంటుంది .

  • =========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.