Saturday, March 19, 2011

రక్తపోటు నియంత్రణ మార్గం,Hypertension(B.P)controle hints


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -రక్తపోటు నియంత్రణ మార్గం-(Hypertension(B.P)controle hints)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

అధిక రక్తపోటుకు శాశ్వతమైన చికిత్స లేకపోయిన ప్పటికీ, జీవనశైలిలో మార్పులు, ఔషధాలతో దానిని నియంత్రించుకోవచ్చు .ధమనుల్లో రక్తం కలుగజేసే ఒత్తిడిని రక్తపోటు అని వ్యవహరిస్తాము. రక్తపోటు అధికంగా ఉంటే అది శరీర మంతటికీ రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలపైన ఒత్తిడిని అధికం చేస్తుంది. ఈ స్థితి రక్తనాళంలో రక్తం గడ్డకట్టడా నికి లేదా రక్తనాళం బలహీనపడటానికి కారణమవు తుంది. ఫలితంగా రక్తనాళం సన్నబడుతుంది. ఇలా రక్త నాళాలు సన్నబడటం కాని, రక్తపు గడ్డలు ఏర్పడటం కాని గుండె లేదా మెదడు పని తీరు వైఫల్యం చెందడా నికి కారణమవుతాయి.

అధిక రక్తపోటు కారణంగా పక్షవాతం సోకి సంభ వించే మరణాలు 50 శాతం మేరకు ఉండగా, కరొనరీ ఆర్టరీ డిసీజ్‌కు గురై సంభవిస్తున్న మరణాలు 24 శాతం ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. భారతదేశంలోని పట్టణాల్లో 10 శాతం మంది, గ్రామీణ ప్రాంతాల్లో 3 నుంచి 5 శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు ప్రజలు వలస రావడం, వారి జీవన విధానాల్లో మార్పులు చోటు చేసుకోవడం వంటి కారణాల వల్ల అధిక రక్తపోటుకు గురయ్యే వారి సంఖ్య మరింతగా పెరుగుతున్నది. అధిక రక్తపోటును ఇతర వ్యాధుల్లాగా తేలికగా గుర్తిం చడం కష్టం. అందుకే దీనిని నిశ్శబ్ద హంతకి అంటారు.

తెలుసుకోవడమెలా?
అధిక రక్తపోటుకు గురయ్యే అవకాశాలు వయస్సుతో పాటుపెరుగుతూ వస్తాయి. తలనొప్పి, తలలో భారంగా అనిపించడం, దృష్టిలో మార్పులు, నిద్రలో అపశ్రు తులు, లేదా నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం, పని చేసేప్పుడు లేదా మెట్లెక్కేప్పుడు ఆయాసం రావడం వంటి కొన్ని లక్షణాలు స్పష్టాస్పష్టంగా కనిపిస్తాయి.
అటువంటి సమయంలో రక్తపోటు ఎంత ఉందని పరీక్ష చేయించుకోవాలి. ఒకవేళ రక్తపోటు 140/90 కంటే ఎక్కువగా ఉండి, అది అలాగే కొనసాగుతుంటే అధిక రక్తపోటు సమస్య ఉత్పన్నమైందని భావించాలి.

కారణాలు
అధిక రక్తపోటు జీవనశైలికి సంబంధించిన సమస్య. ఇతర వ్యాధుల మాదిరిగా దీనికి ప్రత్యేక కారణాలను పేర్కొనడం కష్టం.
ఉదాహరణకు కలరా, మలేరియా, క్షయ తదితర వ్యాధులకు ఉన్నట్లు దీనికి ప్రత్యేక కారణాలంటూ ఉండవు. అయితే అధిక రక్తపోటు సమస్యకు గురి కావడానికి కొన్ని అంశాలు దోహదం చేస్తాయి. ముఖ్యంగా
స్థూలకాయం,
వ్యాయామం లేకపోవడం,
అధిక మోతాదుల్లో మద్యం సేవించడం,
ధూమపానం,
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం లేదా
ఉప్పు అధికంగా ఉండే ఆహార పదార్థాలను సేవించడం,
మానసిక ఒత్తిడి .............మొదలైనవి అధిక రక్తపోటు సమస్య సోకడానికి కారణమవుతాయి.

ఇక్కట్లు
సమస్యలెప్పుడూ ఒంటరిగా రావని సామెత. ఉదాహరణకు జీవనశైలికి సంబంధించిన వ్యాధిగా గుర్తించే స్థూలకాయానికి గురైనప్పుడు హృద్రోగ సమ స్యలు, మధుమేహం మొదలైనవి కూడా వెన్నంటి వస్తాయి. అధిక రక్తపోటుకు గురైనవారు దానిని నియంత్రిం చుకోకపోతే మెదడులో రక్తనాళాలు చిట్లిపోవడం, గుండె వైఫల్యానికి గురి కావడం, మూత్రపిండాలు వైఫల్యా నికి గురి కావడం వంటి సమస్యలు ఉత్పన్నమై అకస్మా త్తుగా మరణించడం జరుగుతుంది.

నివారణ
ప్రతి రోజూ వ్యాయామం చేయాలి. ఉప్పు తక్కువగా తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయం.చిప్స్‌, సాల్టెడ్‌ బిస్కట్స్‌ మొదలైన వాటిని తీసుకోకూడదు.
వీలైనంత ఎక్కువగా పండ్లు, తాజా కూరగాయలు తీసుకోవాలి. మాంసాహారాలను తగ్గించుకోవాలి.మద్యపానాన్ని మానేయాలి. ధ్యానం, యోగ, మర్దన, కోపాన్ని నియంత్రించుకోవడం, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయడం మొదలైన వాటివల్ల అధిక రక్తపోటును నియంత్ర ణలో ఉంచుకోవచ్చు.


  • =================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.