ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -చిన్నపిల్లల్లో అంధత్వం ,Blindness in children- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
-భారత ప్రభుత్వం 1961లో ఏర్పాటు చేసిన హెల్త్ కమిటీ తన నివేదికలో 6 నెలల వయస్సునుంచి 6 సంవత్సరాల వయస్సు వరకూ ఉన్న బాలబాలికల్లో అంధత్వం కలగడానికి దారి తీసే కారణాలు 6 శాతమని పేర్కొనడం జరిగింది.
నవజాత శిశువుల్లో అంధత్వం కలగడానికి జన్యులోపాలు, గర్భిణీ దశలో తల్లికి వైరల్ విభాగానికి చెందిన రోగాలు సోకడం, ప్రసూతి సమయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
అలాగే ప్రమాదాల వల్ల, జీవక్రియా సంబంధిత వ్యాధుల వల్ల, కంతుల వల్ల కూడా అంధత్వం సంభవిస్తుంది.
చిన్న పిల్లల్లో దృష్టిలోపాలు, మెల్ల కన్ను అనే సమస్య విటమిన్-ఎ, ఇతర పోషకాహార లోపాల వల్ల, కొన్ని రకాల వ్యాధుల వల్ల కలుగుతాయి.
మెల్ల కన్ను, దృష్టి లోపాల వల్ల రెటీనా మీద కాంతి ప్రసరించకపోవడం (అంబిలోపియా) లేదా చూపు శాశ్వతంగా పోవడం జరుగుతుంది.ట్రకోమా అనే కళ్ల కలకకు చెందిన వ్యాధిలో కను రెప్పలు వాచి, నల్లపాప మీదకు రక్తనాళాలు పెరిగి శాశ్వత అంధత్వానికి దారి తీస్తుంది. టెట్రాసైక్లిన్ వంటి యాంటిబయాటిక్ మందుల వాడకం వల్ల ఈ సమస్యను అరికట్టవచ్చు.
విటమిన్-ఎ లోపానికి పోషకాహార లోపం, నిరక్షరాస్యత, పేదరికం ముఖ్య కారణాలు. విటమిన్-ఎ లోపం వల్ల మొదట రే చీకటి, రజత రంగులో మెరిసే బైటాట్ చుక్కలు కార్నియా మీద ఏర్పడటం జరుగుతాయి. తరువాత కంటిలో తడి ఆరిపోయి కార్నియా మెత్తబడి చొట్టపడుతుంది.
-ఈ రకమైన సమస్యకు గురైన శిశువులకు అధిక మోతాదుల్లో బీటా కెరొటిన్ ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల త్వరగా కోలుకుంటారు. బీటా కెరొటిన్ కాలేయంలోకి ప్రవేశించిన తరువాత విటమిన్-ఎగా మార్పు చెందుతుంది. రేచీకటి, బైటాట్ చుక్కలు మొదలైన సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని పిల్లలకు 1 నుంచి 6 సంవత్సరాల వయస్సు వచ్చే వరకూ 1600 మైక్రోగ్రాములు, 7 నుంచి 19 సంవత్సరాల వయస్సులోని వారికి 2400 మైక్రోగ్రాముల బీటా కెరొటిన్ ప్రతియేటా ఇవ్వడం జరుగుతున్నది. అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా విటమిన్-ఎ ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతుంది.
వెన్న తీయని పాలు, వెన్న, జున్ను, చేపలు, పశువుల కాలేయాలు, కోడిగుడ్లు, మాసం మొదలైన వాటిలో విటమిన్-ఎ అధికంగా ఉంటుంది. అలాగే అన్ని రకాల ఆకుపచ్చ కాయగూరలు, బొప్పాయి, పుచ్చకాయ, కేరట్‌లలో కూడా విటమిన్-ఎ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ పదార్థాలు ఆహారంలో ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. ఇటీవలి కాలంలో పాలు, వనస్పతి మొదలైన ఆహార పదార్థాల్లో విటమిన్-ఎ కలపడం జరుగుతున్నది.
తల్లిదండ్రులు తమ శిశువులలో ఏమైనా కంటి సమస్యలు గమనించిన వెంటనే అలక్ష్యం చేయకుండా, వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటే, పిల్లలు అంధత్వంబారిన పడకుండా కాపాడుకోగలుగుతారు.
- =========================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.