Wednesday, March 2, 2011

గర్భిణి స్త్రీల ఆహారము ,Food for pregnant woman



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -గర్భిణి స్త్రీల ఆహారము (Food for pregnant woman)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. ఈ విషయం తెలిసినా పోషకాహారం విషయంలో మహిళలు నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఫలితంగా లిగే నష్టాలను వారి పిల్లలు అనుభవించాల్సి వస్తుంది మరి. చాలా మంది తల్లులు వీటిని ఆలోచించకుండా డాక్టర్లు ఇచ్చే సలహాలను పక్కన పెట్టేస్తున్నారు. కానీ కలిగే నష్టాలను తెలుసుకుంటే ఇలా చేయరు.

-భారతీయ మహిళలో పోషకాహార లోపం చాలా ఎక్కువ వుంది. నలభైలు దాటీ దాటక ముందే అనేక మంది షుగర్‌ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఇటీవలి కాలంలో చాలా చిన్న వయసులో ఉన్న వారికి కూడా చక్కెర వ్యాధి వచ్చే ధోరణి మొదలైంది. ఇప్పటివరకు స్థూలకాయం, చక్కెర వ్యాధులకు శారీరక వ్యాయామం లేకపోవడం, తిండి అలవాట్లు, ఒత్తిడి కారణమని వైద్యులు అభిప్రాయపడుతూ వస్తున్నారు. పుణెలోని కింగ్‌ మెమోరియల్‌ హాస్పిటల్‌ డయాబెటీస్‌ యూనిట్‌ డయాబెటీస్‌ పేషంట్ల సంఖ్య పెరగడానికి గల కారణాలను అధ్యయనాలు చేసింది.

ఇప్పటి వరకూ చెబుతూ వస్తున్న కారణాల కంటే ముఖ్యమైనవి కూడా ఉన్నాయని గుర్తించింది. విదేశాలలోని చక్కెర వ్యాధిగ్రస్థుడితో పోల్చి చూస్తే భారతీయుల్లో చక్కెర వ్యాధి బారిన పడినవారు తక్కువ బరువుతోనే ఉన్నారు. కాని శరీరంలో కొవ్వు శాతం ఎక్కువ ఉంది. కండపుష్ఠి లేకపోవడమే దీనికి కారణం. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయే లక్షణం ఎక్కువ. కాలేయం కొవ్వులో మునిగితేలుతుంది. ఈ కొవ్వు జీవక్రియలు జరిగే తీరు మీద ప్రభావం చూపిస్తుంది. ఇన్సులిన్‌ని శరీరకణ జాలం మీద సరిగా పనిచేయ నీయ కుండా చేస్తుంది. దీనివల్లే భారతీయులు డయాబెటిస్‌, దానికి సంబంధిం చిన ఇతర వ్యాధులకు గురవుతున్నారని చెప్పింది. తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్లో ఇలా కొవ్వు పేరుకుపోయే లక్షణం ఎక్కువగా ఉండి, పెద్దయ్యాక డయాబె టిస్‌కి, గుండె జబ్బులకు గురవుతారని ప్రొఫెసర్‌ డేవిడ్‌ వివరించారు.

పొట్టలో పిండంగా ఉన్నప్పుడే తగిన ఆహారం అందకపోవడం వల్ల బయటి ప్రపంచాన్ని కరువుతో కూడుకున్న దానిగా చూసే లక్షణం బిడ్డ శరీరానికి వస్తుందని, కాబట్టి దొరికినప్పుడు వీలైనంత ఆహారాన్ని గ్రహించి దాన్ని కొవ్వు రూపంలో నిల్వ చేసుకోవడానికి అలవాటుపడుతుందని అయన ఆంటున్నారు. ఆ వ్యక్తులు మధ్యతరగతి, సంపన్న స్థితిలో ఉన్నప్పుడు శరీరం తీవ్రంగా స్పందిస్తుంది. ఇది హార్మోన్ల వ్యవస్థ, జీవక్రియల వ్యవస్థల పనితీరునీ మందగింపచేసి మనిషిని టైప్‌-2 డయాబిటిస్‌ వైపుకు నెడుతుంది. ఇటువంటివి భారతీయులకు వర్తించే అవకాశం ఎక్కువ. ఇక్కడ పిల్లలు పుట్టినప్పుడు ఉండే బరువు అనేక దేశాల పిల్లల బరువుతో పోలిస్తే తక్కువ ఉంటుంది, పెద్ద వాళ్ళలోనే కాకుండా పుడుతున్న పిల్లల్లో కూడా బలం శాతం తక్కువ.

కొవ్వు ఎక్కుగా ఉంటున్నవారు ఎక్కువగానే ఉన్నారు. అంటే తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి శరీరం కొవ్వును నిల్వ చేసుకునే ప్రక్రియ ప్రారంభమవుతోంది. భారతీయ శిశువుల శరీర కొలతల్ని చూస్తే వాళ్ళ శరీరం ఇన్సులిన్‌ నిరోధకంగా తయారయ్యే అవకాశం ఎక్కువ వుంటుంది. పుట్టినప్పుడు బరువు తక్కువ ఉండి బాల్యంలో పెరుగుదల వేగంగా ఉన్న పిల్లలు పెద్దయ్యాక టైప్‌ -2 డయాబెటీస్‌కి గురయ్యే అవకాశాలు ఎక్కువ అని పరిశోధనల్లోనూ తేలింది.

బలహీనంగా పుట్టిన పిల్లల బరువును పెంచడానికి తల్లిదండ్రులు, వైద్యులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. గర్బిణులుగా ఉన్నవారిలో కొన్ని బి విటమిన్లు తగ్గినా కండ తక్కువ కొవ్వు ఎక్కువ ఉండే పిల్లలు పుట్టవచ్చని పుణెలో చేసిన ఇటీవల పరిశోధనలు తెలుపుతున్నాయి. భావితరాల ఆరోగ్యం కోసం ఆడపిల్లలు ఎలాంటి తిండి తినాలో తెలిపే సూచనలను త్వరలోనే చేయనున్నామని పరిశోధనలు చేసిన డాక్టర్‌ తెలియజేస్తున్నారు. తల్లుల ఆరోగ్యం మీదనే భావితరాల ఆరోగ్యం ఆధారపడి ఉంది. ముఖ్యంగా టైప్‌-2 డయాబెటిస్‌ నుంచి భావితరాల్ని విముక్తం చేయాలంటే ఇప్పటి యువతులకు ఆరోగ్యకరమైన ఆహారం ఆందాలి.

మధ్య తరగతి..... ఆ పై తరగతికి ఈ విషయా లు తెలియ జేసే బాధ్యత, దిగువ తరగతుల యువతులకు పోషకా హారం అందే మార్గాలు అన్వేషించే బాధ్యత విధానాలు రూపొందించే వారి మీదే ఉంది. ఏది ఏమైనా గర్భం ధరించాక ఆహార విషయంలో మహి ళలు అధిక జాగ్రత్తలు తీసు కోవాలని పరిశోధ కులు సూచిస్తున్నారు. ఐరన్‌ ,కాల్సియం , ఫోలిక్ యాసిడ్ , ప్రోటీన్‌ ఫుడ్ , బి.కాంప్లెక్ష్ మాత్రలు వంటివి తప్పకుండా తీసుకోవాలనిసూచిస్తున్నారు. ఇతర పోషకాహారాలపై దృష్టి పెట్టాలి.
  • ========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.