ఇది చిన్న పిల్లలలో శ్వాసమార్గాన్ని బాధించే రోగం. తెరలు-తెరలుగా దగ్గు వస్తుంది. బొర్డ్‌టెల్లా పెర్టుసిస్ అనే సూక్ష్మ క్రిమివల్ల ఈవ్యాధి వస్తుంది. 2-7వయస్సు lO రావచ్చు కాని, ఇది ఏడాది లోపు పసి పిల్లలకి వస్తే బాగా ఉధృతంగా వస్తుంది.చిన్న పిల్లలకు సోకే అంటువ్యాధి కోరింత దగ్గు. ఈ వ్యాధి ప్రారంభంలో ముందుగా జలుబు చేసి ముక్కు కారుతుంది. తరువాత కొద్దిపాటి జ్వరం, దగ్గు వాస్తయి. సాధారణంగా రెండు నుంచి ఏడేళ్లలోపు చిన్నారులు కోరింత దగ్గు వ్యాధికి గురవుతారు.ఈ వ్యాధిలో రోగి దగ్గుతున్న ప్పుడు 'వూఫ్ అనే ఒక ప్రత్యేకమైన శబ్దం వెలువడుతుంది. ఈ కారణంగా దీనిని వూఫింగ్ కాఫ్ అని వ్యవహరిస్తారు.
కారణాలు
బ్యాక్టీరియా - బోర్డెటెల్లా పెర్ట్యూసిన్
వ్యాప్తి
వ్యాధి గ్రస్ధుడు తుమ్మినప్పుడు, దగ్గినపుడు తుంపర్ల (లాలాజలం) ద్వారా వ్యాపిస్తుంది. మరియు ముక్కు చీమిడి ద్వారా ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది.
లక్షణాలు
సాధారణంగా వ్యాధి లక్షణాలు. వ్యాధి సంక్రమించిన 7 నుండి 17 రోజులు తర్వాత ప్రారంభమవుతాయి.
1. సాధారణంగా 2 సం. లోపు పిల్లల్లో కన్పిస్తుంది.
2. ఈ లక్షణాలు 6 వారాల లోపు తగ్గుతాయి.
3. ఈ వ్యాధి 3 దశలుగా విభజింపబడింది.
మొదటి దశ - ముక్కు నీరు, కన్నీరు కారటం, ఆకలి తగ్గుట, నీరసంగా ఉండటం, రాత్రి పూట దగ్గు మరియు తుమ్ములు
రెండవ దశ - తెరలు తెరలుగా దగ్గుతో పాటు పక్షి వలె శ్వాస తీసుకొనుట.
మూడవ దశ - ఇది నయమయ్యే దశ ఇది నాలుగవ వారం తర్వాత మొదలవుతుంది.
ఈ దశలో దగ్గు ఉంటుంది. కానీ తీవ్రంగా ఉండదు.
ఈ వ్యాధి పెద్దల్లో వస్తే 2 వారాల లోపు తగ్గుతుంది.
శారీరకంగా దృఢంగాఉండే పిల్లల్లో ఈ వ్యాధి మంద్రస్థాయిలోనే కనిపించినా, దుర్బలంగా ఉండే వారిలో తీవ్రస్థాయిలో బాధిస్తుంది. వ్యాధి కారక క్రిములు శరీరంలో ప్రవేశించిన నాటినుంచి వ్యాధి బైటపడటానికి వారంనుంచి పదిహేను రోజులు పట్టవచ్చు. ఈ కాలాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అని వ్యవహరిస్తారు.
కోరింత దగ్గు అతి సాధారణమైన దగ్గుగానే ప్రారంభమైనా, తరువాత ఇది తీవ్రస్థాయికి చేరి తెరలు తెరలుగా దగ్గు వస్తుంది. దీనితో శ్వాస తీసుకోవడం కష్టతరమవుతుంది.కొన్ని కేసుల్లో దగ్గు తెరలుతెరలుగా వస్తుంది. అనంతరం రోగి దీర్ఘంగా శ్వాస తీసుకుంటాడు. మరికొన్ని కేసుల్లో రోగి విపరీతంగా దగ్గుతాడు. ఊపిరి తిత్తులలోని గాలి మొత్తం నిశ్వాస రూపంలో వెళ్లిపోతుంది. తరువాత సుదీర్ఘంగా శ్వాస తీసు కుంటాడు.దగ్గుతోపాటు వాంతులు కూడా సంభవిం చవచ్చు. రోగి పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తుంది. తీవ్రమైన దగ్గు వల్ల కళ్లు ఎరు పెక్కుతాయి.ముక్కునుంచి రక్తం కారే అవకాశాలున్నాయి.ముఖం ఉబ్బుతుంది.
తీవ్రమైన కోరింత దగ్గుతో బాధపడేవారికి వాంతులయ్యే అవకాశాలు న్నాయి కనుక ఆహారాన్ని కొద్ది మొత్తాలలో ఇవ్వడం మంచిది. ఈ వ్యాధిగ్రస్తులు బ్రాంకైటిస్‌తో బాధపడే అవకాశాలు కూడా హెచ్చుగా ఉన్నాయి. ఊపిరితిత్తులు వాపునకు గురవుతాయి. బ్రాంకో న్యుమోనియా, ఫిట్స్‌వంటి సమస్యలు కూడా ఎదురు కావచ్చు.వ్యాధి సోకిననాటినుంచి ఆరు వారాలపాటు రోగిని ఇది బాధించి తగ్గుముఖం పడు తుంది.అయితే కొన్ని కేసుల్లో వ్యాధి తగ్గుముఖం పట్టడానికి కొన్ని నెలలు కూడా పట్టవచ్చు.
నిరోధక విధానం
3,4 మాసాల వయస్సులో ఆరంభించి ఒక మాసం వ్యవధితో మూడు ఇంజెక్షనులు ఇవ్వాలి. ఈ రోగం రాకుండా పెర్టసిస్, డిఫ్తీరియా, టెటనస్ వాక్సిన్‌లతో కలిపి మూడు వాక్సిన్ (DPT triple antigen) ల రూపంలో ఇస్తే, రోగ నిరోధక శక్తి బాగా ఏర్పడుతుంది. బిడ్డకు వ్యాధి సోకిన తర్వాత ఈ వాక్సిన్ ఇచ్చి ప్రయోజనం లేదు. కోరింత దగ్గు రాగానే, బాగా గాలి వచ్చే గదిలో శయ్యావిశ్రాంతి (bed rest) ఇవ్వాలి. తక్కిన పిల్లలను దగ్గరికి రానివ్వకూడదు. నోటివెంటా, ముక్కు వెంటా వచ్చే స్రావాలను కాగితంలోనో, పాతగుడ్డతోనో సేకరించి తగులపెట్టెయ్యాలి. ఈ జబ్బుతో బాధ పడుతున్న బిడ్డ ఉపయోగించే దుస్తులూ, పాత్రలూ, వస్తువులూ తక్కిన బిడ్డలు వాడరాదు.
జాగ్రత్తలు
రోగినిచలినుంచికాపాడాలి.తద్వారా బ్రాంకో న్యుమోనియా రాకుండా జాగ్రత్తపడవచ్చు. ఉత్తేజితం చేసే ఆహార పదార్థాలు ఏమీ ఇవ్వకూడదు. ఫిట్స్, కోపంవంటి ఉద్రేకాలకు గురి కాకుండా చూడాలి.
లేకపోతే ఇవి పరిస్థితిని మరింత క్షీణింపజేస్తాయి. ఆలివ్ ఆయిల్‌ను ఛాతిపైన, వెన్నెముక పైన రాయడం వలన కొంతఉపయోగం ఉంటుంది. గాలి ధారాళంగా ఆడేగదిలో రోగికి విశ్రాంతి కల్పించాలి.
చికిత్స :
- యాంటి బయోటిక్స్ -- ఎరిత్రోమైసిన్ సిరప్ 2.5 mlరోజుకి 3 సార్లు 7-10 రోజులు .
- జ్యరానికి : పారసెటమాల్ సిరప్ వయసును బట్టి డోసు ఇవ్వాలి .
- దగ్గుకి : neo-zeet cough sy. 2.5 ml 3 times/day.
- వాంతులు తగ్గడానికి :Domstal sy/drops రోజుకి 3 సార్లు .
- న్నీరసం తగ్గడానికి : multivitamin syrup/Drops ఇవ్వాలి .
- =============================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.