Friday, November 23, 2012

Heart-గుండె • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు ---------- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మన శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్, ఆహారం అవసరం. అలాగే అక్కడి కార్బన్‌డయాక్సైడ్, మరికొన్ని మలిన పదార్థాల్ని ఎప్పటికప్పుడుతొలగించాల్సిన అవసరం ఉంది. ఈ పని రక్తం ద్వారా జరుగుతుంది. గుండె కొట్టుకొంటూండడంతో రక్తం శరీర భాగాలన్నింటికీ వెళ్ళడం, అక్కడ నుంచి వెనక్కి తిరిగి రావడం జరుగుతుంటుంది. ఇలా గుండె ఒక పద్ధతి ప్రకారం కొట్టుకుంటుండాలంటే దాని నిర్మాణంలో లోపాలుండకూడదు. కండరాలు

ఆరోగ్యంగా, బలంగా ఉండాలి. కవాటాలు సరిగా పనిచేస్తుండాలి. గుండె కండరాలకు రక్తసరఫరా సరిగ్గా జరుగుతుండాలి. గుండెలోని శక్తి ప్రవాహం కూడా పద్ధతిగా ఉండాలి. అప్పుడే గుండె ‘లబ్ డబ్’అంటూ సరి వేగంతో కొట్టుకుంటుంది. అలాగే గుండెనుంచి రక్తాన్ని శరీర భాగాలన్నింటికీ తీసుకువెళ్ళే రక్త నాళాలలో సమస్యలొచ్చినా అనారోగ్యాలు కలుగుతాయి.

గుండె చుట్టూ వుండే రక్షక పొరని ‘పెరికార్డియమ్’ అంటారు. పెరికార్డియమ్‌లో కూడా ఇన్‌ఫెక్షన్ రావచ్చు. అలా ఇన్‌ఫెక్షన్ వస్తే గుండె చుట్టూ నీరు చేరుతుంది. ఈ అనారోగ్యంలో కూడా ఛాతీ ప్రాంతంలో నొప్పి వస్తుంది.
గుండె కండరాలు బలహీనమైతే గుండె కొట్టుకోవడం కష్టమవుతుంది. ఇలా వదిలేస్తే ‘హార్ట్ ఫెయిల్యూర్’కి దారితీస్తుంది. గుండెలోని ఒక ప్రక్కవున్న గదుల ద్వారా ఆక్సిజన్‌తో కూడుకున్న రక్తం శరీర భాగాలకి వెళ్తే, రెండో ప్రక్కనున్న గదులలోకి కార్బన్‌డయాక్సైడ్‌తో కూడుకున్న రక్తం శరీర భాగాలనుంచి చేరుతుంది. కాబట్టి రెండు ప్రక్కల రక్తాలు కలవకుండా ఉండాలి. అలాగే రక్తం ఒకవైపే ప్రవహిస్తుండాలి. ఇందుకు కవాటాలు తోడ్పడుతుంటాయి. వీటిలో లోపమున్నా గుండె గోడలో రంధ్రాలున్నా ఈ సమతుల్యం దెబ్బతిని గుండె నీరసించే ప్రమాదముంది. సాధారణంగా ఇలాంటి ఇబ్బందులు పుట్టుకతోను,

 • చిన్నతనంలో రుమాటిక్ జ్వరం రావడంవల్ల కలగవచ్చు.

గుండెలో రంధ్రాలతోపాటు కవాటాలు మూసుకుపోయి పుట్టిన పిల్లల్లో చెడు, మంచి రక్తం కలవడంతో ‘సైనోటిక్ హార్ట్ డిసీజెస్’ రావచ్చు. వీళ్ళనే ‘బ్లూబేబీస్’ అంటారు. రక్తం నీలంగా మారడంవల్ల పిల్లలు నీలంగా కనిపిస్తారు. పుట్టుకతో వచ్చే ఈ లోపాలన్నింటినీ శస్త్ర చికిత్సలతో సరిదిద్దవచ్చు. పాఠశాలలకు వెళ్ళే పిల్లలకు 6-12 సం. మధ్య గొంతు ఇన్‌ఫెక్షన్స్ (ఫెరింజైటిస్) వచ్చి, వాటిని అశ్రద్ధచేస్తే- కీళ్ళ నొప్పులు, జ్వరంతో కూడిన ‘రుమాటిక్ ఫీవర్’ అనే వ్యాధి వస్తుంది. దీనికి వైద్యులకు చూపించి, సరైన చికిత్స చేయించాలి. లేకపోతే క్రమంగా కవాటాలు దెబ్బతిని, రుమాటిక్ హార్ట్ వ్యాధులకు దారితీస్తుంది.
మిగతా అన్ని అవయవాలకు లాగానే గుండెకి రక్తం సరఫరాచేయడానికి వేరే రక్తనాళాలుంటాయి. ఆ రక్తనాళాలను కరొనరి ధమనులంటారు.  వాటిలో అడ్డంకులేర్పడడంవల్ల గుండె కండరాలకు రక్తసరఫరా తగ్గి ఎంజైనా మరియు హార్ట్ ఎటాక్‌లు రావచ్చు. వీటిని ‘కరొనరి హార్ట్ డిసీజెస్’ అంటారు. మన లివర్ కొలెస్ట్రాల్‌ని తయారుచేస్తుంది. మనం తీసుకునే ఆహారంలో కొలెస్ట్రాల్ ఉంటుంది. రక్తంలో ఒక భాగం ఇది. రక్తంలో ఇది ఎక్కువగా ఉంటే రక్తనాళాల గోడలలోపల గోడలమీద పేరుకుపోతుంటుంది. ఇలా కొలెస్ట్రాల్ పేరుకుపోతుంటే రక్తనాళాల లోపల దారి మూసుకుపోతుంటుంది. రక్తప్రసరణ దెబ్బతింటుంది.  రక్తం లీటరులో 5.5 మి. ఎమ్‌ఒఎల్‌కన్నా ఎక్కువుంటే ‘కరొనరి ఆర్టెరి డిసీజెస్’ వచ్చే అవకాశముంది.  రక్తంలో ప్రవహించే కొలెస్ట్రాల్‌లో కొవ్వులు, ప్రొటీన్లు రకరకాల పద్ధతుల్లో కలిసి ఉంటాయి. వీటినే లైపోప్రొటీన్లంటే తక్కువ సాంద్రతగల లైపోప్రొటీన్స్‌లో లెటిలైపో... ప్రోటీన్స్ (ఎల్‌డిఎల్). ఇది చెడు కొలెస్ట్రాల్. ఇది రక్తంలో ఎక్కువ. ఎక్కువ సాంద్రతవున్న కొలెస్ట్రాల్... హైడెన్సిటీ కొలెస్ట్రాల్ (హెచ్‌డిఎల్) కూడా రక్తంలో ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్. ఎథిరో స్క్లేరోసిస్ రాకుండా ఇది కాపాడుతుంది. కాబట్టి హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువుండాలి. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువుడాలి.
ఉదయం 5 గం. ప్రాంతంలో నడక వల్ల వ్యాయామమే కాదు ఈ సమయంలో శరీరంలో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ కొద్దిగా ఎక్కువ, హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంటాయి. ఈ సమయంలో నడకవల్ల ఎల్‌డిఎల్ తగ్గి, హెచ్‌డిఎల్ పెరుగుతుంది.
నడకతోబాటు మన నడతని మార్చుకోవాలి. ధూమపానం, ఆల్కహాల్‌లాంటి అలవాట్లు మానుకోవాలి. ఆహారపుటలవాటు మార్చుకోవాలి. ఒత్తిడితగ్గించుకోవాలి. ఇవన్నీ చేయక తప్పదు మన గుండెకోసం. కరొనరి ధమనులు గుండెకి ఎడమవైపు రెండు, కుడివైపు ఒకటి ఉంటాయి. క్రొవ్వు పదార్థాలు, అడ్డంకులు తొలగించడానికి ఈ అడ్డంకులు 50% కన్నా
తక్కువ వుంటే మందులతో కరిగించవచ్చు. 75%కన్నా ఎక్కువ ఒకటి లేక రెండింట ఉంటే యాంజియో ప్లాస్టి ద్వారా తొలగించవచ్చు.
అసలు అడ్డంకుల్ని తెలుసుకోవడానికి ‘యాంజియోగ్రామ్’ తోడ్పడుతుంది. ఇప్పడు ‘ఐవస్’ గైడెన్స్ కేథలాబ్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా అమర్చిన స్టెంట్‌లు సరిగ్గా అమరాయా? లేదా తెలుసుకోవచ్చు. కష్టాన్ని కలిగించే అడ్డంకులకి బెలూన్స్ చికిత్సవల్ల లాభముందా? లేదా? తెలుసుకోవచ్చు. కాంప్లెక్స్ యాంజియో ప్లాస్టీలంటే ఎడమవైపు ఉండే ముఖ్య రక్తనాళంలో బ్లాక్‌లు, రక్తనాళాలు శాఖలుగా విభజన జరిగే ప్రాంతాలలో అడ్డంకులు, బైపాస్ అయిపోయిన తర్వాత గ్రాఫ్ట్‌లలో అడ్డంకులు, గట్టి కార్డియం అడ్డంకుల్ని  తొలగించడానికి నిర్వహించేవి. వీటికి ఐవస్ తోడ్పడుతుంది.
మూడు రక్తనాళాలలో అడ్డంకులుంటే శస్తచ్రికిత్సతో తొలగించాల్సి రావచ్చు. ఈ శస్త్ర చికిత్సలో ఇప్పుడు సన్నటి రంధ్రం ద్వారా చేస్తున్నారు. కవాట మార్పిడి శస్తచ్రికిత్సల్ని చిన్న రంధ్రం ద్వారా చేస్తున్నారు. చికిత్సలోకన్నా కూడా మనం ప్రధానం తెలుసుకోవాల్సింది వ్యాధులు రాకుండా నివారించడం. ఒకవేళ వ్యాధులు మొదలైనా ప్రాథమిక దశలోనే గుర్తించగలిగితే అపాయం కలగకుండా నివారించవచ్చు.
గుండె లయబద్ధంగా కొట్టుకుంటుంటుంది. ఆ లయ రిథమ్ తప్పి కొట్టుకోవడాన్ని ‘ఎరిధ్మియా’ అంటారు. పైనుండే చిన్న రెండు గదులు- ఆరికల్స్‌లో కొట్టుకునే లయ తప్పడాన్ని ‘ఏట్రియల్ ఫిబ్రిలేషన్’ అంటారు. అది డిజార్గనైజ్డ్‌గా తీవ్రంగా వచ్చే ఎలక్ట్రిక్ ఇంపల్సెస్‌వల్ల వస్తుంది. ఎరిధ్మియాలో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సాధారణంగా వస్తుంటుంది. వయసుని బట్టి ఈ ఫిబ్రిలేషన్ వచ్చే రిస్క్ ఎక్కువవుతుంది. ఇది వచ్చిన  లక్షణాలుండకపోవచ్చు. చెమటలు పట్టడం, ఫెయింట్ అవడం జరగవచ్చు. ఛాతీ నొప్పి రావచ్చు. గుండె ఫెయిలవ్వవచ్చు. గుండె కొట్టుకునే రేటు పెరిగినా, తగ్గినా కూడా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వస్తుంది. పైగా ఆరికల్స్ కదలికలు సరిగ్గా ఉండకపోతే రక్తం పేరుకుపోవడానికి ‘స్టాసెస్’ కారణమవుతుంది. దీనివల్ల రక్తం గడ్డలు కట్టే రిస్క్ ఎక్కువ. ఈ బ్లడ్ క్లాట్స్, గుండెవైపు వెళ్ళి, అక్కడి రక్తనాళాలలో అడ్డంగా ఏర్పడవచ్చు.
కొన్ని మందులతో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ తగ్గవచ్చు. గుండె కొట్టుకునే రేటు ఈ మందులతో తగ్గుతుంది. ఏట్రియల్ ఫిబ్రిలేషన్‌లో గుండె కొట్టుకునే రేటుని ఎలక్ట్రిక్ కార్డియో వెర్షన్‌తో మామూలు స్థితికి రావచ్చు. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ తగ్గడానికి శస్తచ్రికిత్స, కేధటార్‌తో చేసే చికిత్సా విధానాలు తోడ్పడతాయి. ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్‌తో బాధపడేవారు రక్తం పలుచనవడానికి మందులు తీసుకోవడం మంచిది. 

గుండె కొట్టుకునే రేట్ సరిగ్గా ఉండేందుకు, చర్మం క్రింద (్ఛతీ భాగంలో) పెట్టే పరికరాన్ని కృత్రిమ ఫేస్‌మేకర్ అంటారు. మామూలుగా గుండెలో ఉండే ఫేస్ మేకర్ పనిచేయకపోయినా, నోడ్ దగ్గర పుట్టిన విద్యుత్‌ని గుండె అంతా వెంట్రికిల్స్ వరకు విస్తరించేట్టు చేసే మార్గాల్లో అడ్డంకులేర్పడ్డా కృత్రిమ ఫేస్‌మేకర్ని పెట్టాల్సి ఉంటుంది.  ఈ విషయాలన్నింటిమీదా అవగాహన ఉంటే గుండె అనారోగ్యాలు కలుగకుండా జాగ్రత్తపడవచ్చు. ఒకవేళ ఏవైనా అనారోగ్యాలు కలుగుతున్నా ప్రారంభంలో గుర్తించగలగాలి. గుర్తించి ఊరుకోకూడదు. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత త్వరగా వైద్యుడికి చూపించాలి. వారు సూచించిన పరీక్షలు చేయించి,

చికిత్స చేయించుకోవాలి.ఇవాళ ఎటువంటి హృద్రోగానికైనా చికిత్స ఉంది. గుండె పూర్తిగా దెబ్బతింటే గుండె మార్పిడి చేస్తున్నారు. ఎటొచ్చీ..మన గుండె చప్పుడు మనం గమనిస్తుండాలి..అంతే.
 • గుండె నేర్పే పాఠాలు
నీ జీవన విధానాన్ని సరిగా ఉంచుకో.. ఏ ఆహారం పడితే ఆ ఆహారాన్ని సమయం సందర్భం లేకుండా తీసుకోకు.. కాయకష్టమే పాతకాలం వాళ్ళ గుండెకి శ్రీరామరక్ష. శారీరక శ్రమ, తీసుకున్న కేలరీలను ఖర్చుపెట్టడానికి సైక్లింగ్, ఈతో, నడకో ఏదో ఒక వ్యాయామం రోజుకో 45 నిముషాలన్నా అవసరం.

ధూమపానం ఆల్కహాల్ సేవనం లంటి అలవాట్లకి దూరంగా ఉండడం, వంశపారంపర్యంగా గుండె సమస్యలుంటే ఆ రిస్క్‌కి తగ్గ జాగ్రత్తలు, చిన్నవయసు నుంచే తీసుకోండి. మానసిక వత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానము, సంగీతం వినడం, పుస్తక పఠన లాంటి- అలవరచుకోండి. మీ జీవన విధానాన్ని మార్చుకోవాలని ఒక ప్రక్క చెబుతూ మరోప్రక్క-
నిర్విరామంగా కృషిచేయండి. నిస్వార్థంగా బ్రతకండంటూ కూడా చెబుతోంది. గుండె ఇరవై నాలుగ్గంటలూ కొట్టుకుండేలా కష్టపడమని మనకి చెబుతోంది.

అలాగే శరీరమంతటికీ వెళ్ళాల్సిన రక్తం తన గుండెకి వెళ్తున్నా గుండె ఒక్క చుక్క తీసుకోదు... అని అవయవాలకు కొన్ని రక్తనాళాల ద్వారా రక్త సరఫరా జరుగుతుంది. అలాగే గుండెకీ కరొనరి రక్తాల ద్వారా సరఫరా జరుగుతుంది.
 • గుండె జబ్బులు రాకుండా...
గుండె జబ్బులు రాకుండా ఆరోగ్యవంతులు తీసుకోవలసిన ఆహారం గురించి ముందు మాట్లాడుకుందాం. ఫైబర్... అంటే పీచు పదార్థాలు తీసుకోవడంవల్ల కొలెస్ట్రాల్‌ని అదుపులో ఉంచుకోవచ్చు. ఓట్స్, చిక్కుడు జాతి కూరగాయల్లో, అవిసె గింజల్లో, యాపిల్, సోయా గింజల్లో, కారట్, ఆకుకూరల్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌లోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్)ని తగ్గిస్తాయి. మాంసం, పాల పదార్థాలలో శాచురేటెడ్ ఫాట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని బాగా తగ్గించాలి. మనం రోజువారీ తీసుకునే కేలరీస్‌లో ఇవి 10%కి మించరాదు. బిస్కట్లు, పేస్టీస్, చాక్‌లెట్, ఫ్రెంచి ఫ్రైస్‌లాంటి బేకరీ పదార్థాలలో ట్రాన్స్‌ఫాట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీటిని తినకుండా ఉండడం మంచిది. నెయ్యి, వెన్న, డాల్డాలాంటి శాచురేటెడ్ ఫాట్స్‌ని బాగా తగ్గించి తీసుకోవాలి. ఉప్పుని కూడా బాగా తగ్గించి తీసుకోవాలి. చల్లని నీళ్ళలో ఉండే పాలోన్, పాల్‌డైన్ లాంటి చేపలు మంచివి.
 • గుండెకి మూలకణ చికిత్సలు
‘కార్డియా’ అనే గ్రీకు పదానికి ‘గుండె’ అని అర్థం. అందుకని కార్డియక్ అంటే గుండెకి సంబంధించిన అని అర్థం. ఇన్‌వాలంటరీగా పనిచేసే కండరాలతో పనిచేస్తుంటుంది కాబట్టి గుండె ఆగకుండా అలా కొట్టుకుంటుంది. మన శరీరంలో ఇలాంటి కండరాలు మరెక్కడా లేవు. గర్భంలోని శిశువుకు 21 రోజు వయసు వచ్చేసరికి గుండె ఏర్పడడమే కాదు, కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. గర్భంలో ఆడ, మగ గుండె కొట్టుకునే రేట్లలో తేడా ఉంటుంది.
మొదటి నెలలలో గర్భంలో శిశువు గుండె నిముషానికి 75నుంచి 80 సార్లు వరకు కొట్టుకుంటుంది. ఏడవ వారంలో నిముషానికి 165 నుంచి 185సార్లు కొట్టుకుంటుంది. అక్కడ నుంచి ప్రతి పది రోజులకు గుండె కొట్టుకునే రేటు పెరుగుతుంది. 9.2 వారాలనుంచి గుండె కొట్టుకునే రేటు నిమిషానికి 150కి తగ్గుతుంది. క్రమంగా 15 వారాలకు గుండె కొట్టుకునే రేటు 145కు తగ్గుతుంది.  శిశువు గర్భంలో ఉన్నప్పుడే అల్ట్రాసౌండ్ లాంటి పరీక్షలతో లోపాలుంటే తెలుసుకోవచ్చు. కొన్నింటిని గర్భంలో ఉన్నప్పుడే తెలుసుకోవచ్చు. కవాటాల లోపాలు లాంటి వాటిని శిశువు చుట్టూవున్న మూల కణాల్ని తీసి, కావలసిన సంఖ్యకి లేబరేటరీలో పెంచి ఈ కవాటాన్ని కవాట లోపమున్న శిశువు జన్మించగానే అమర్చవచ్చు.
గుండె కండరాలు దెబ్బతింటే అదే వ్యక్తి బోన్‌మార్మోనుంచి మూలకణాలు తీసి లేబరేటరీలో కావలసిన సంఖ్యలోకి పెంచి, గుండె కండరాలలోకి ఎక్కించి,  కండరాల్ని బలమయ్యేట్టు చేయవచ్చు. ఈ చికిత్స ఫలితం కనిపించడానికి కొంత సమయం పట్టవచ్చు. కొంతే అభివృద్ధి చెందితే మళ్ళీ ఆ ప్రాంతంలో మూల కణాల్ని పంపి మరికొంత అభివృద్ధి కనిపించేట్టు చేయవచ్చు. ఎవరి మూలకణాల్ని వారికి ఎక్కిస్తారు కాబట్టి, రోగ నిరోధక మందుల్ని జీవితాంతం వాడాల్సిన పనిలేదు. మూల కణ చికిత్సని పునరుత్పత్తి వైద్యమంటారు. ఇది భవిష్యత్తులో బంగారంలాంటి చికిత్సగా భావిస్తారు.
 • గుండె భారం పెంచకండి
యాంజియో ఇంతకుముందు తొడలోని రక్తనాళాల ద్వారా చేసేవారు. తొడలోంచి చేయడంవల్ల రక్తస్రావం అధికంగా ఉండేది. ఒకరోజు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు చేతి మణికట్టునుంచి రేడియల్ రక్తనాళం ద్వారా యాంజియో చేస్తున్నాం. రక్తస్రావం తక్కువ చేతినుంచి కాబట్టి త్వరగా పంపించి వేయడం జరుగుతోంది. ప్రతిరోజూ గుండె రక్తనాళాల ద్వారా రక్తాన్ని 90,000 కి.మీ దూరం నెడుతుంటుంది. ఒక ఎత్తునిబట్టి బరువుంటుంది. దీనిని బాడీమాస్ ఇండెక్స్ అంటారు.
బాడీమాస్ ఇండెక్స్= బరువు కిలోలలో/ ఎత్తు మీటర్లలో
బాడీ మాస్ ఇండెక్స్ 20నుంచి 25వరకు మామూలు బరువు. 25 నంచి 30 వరకు ఉంటే అధిక బరువు. 30నుంచి 35 వరకు స్థూలకాయం గ్రేడ్ 1, 35నుంచి 40 స్థూలకాయం గ్రేడ్ 2, 40కన్నా స్థూలకాయం గ్రేడ్ 3- మార్బడ్ ఒబేస్ అంటారు. ఉండాల్సిన దానికన్నా శరీర బరువు ఒక కిలో ఎక్కువ వుంటే గుండెకి రోజుకి 30 కి.మీ దూరం ఎక్కువ నెట్టాల్సిన భారం పడుతుంది. బరువు ఎక్కువైనకొద్దీ గుండె మీద పడే భారం ఎక్కువవుతుంది. అందుకని 
బరువుని అదుపులో ఉంచుకోవాలి. డయాబెటిస్‌లో నరాలు దెబ్బతింటాయి. అందుకని గుండె నొప్పి వచ్చినా తెలీదు. కాబట్టే డయాబెటిస్‌ని సైలెంట్ కిల్లర్ అంటారు. డయాబెటిస్‌ని అదుపులో ఉంచుకోవడం అవసరం.దవడ దగ్గర నుంచి బొడ్డువరకు ఎక్కడ నొప్పి వచ్చినా అనుమానం రావాలి. వెంటనే వైద్యుడికి  చూపించాలి. కార్డియక్ అరెస్ట్ అయితే, అంటే గుండె కొట్టుకోవడం ఆగిపోతే కార్డియో పల్మోనరి రిససిటేషన్ ప్రారంభించాలి. అంటే గుండె మీద ఒక చేత్తో మృదువుగా రాస్తూ, నోట్లో నోరుపెట్టి కృత్రిమ శ్వాసను కల్పిస్తూ, వెంటనే అవసరమైన చికిత్స అందేలా చూడాలి. ఆటోమేటెడ్ డిఫిబ్రిలేటర్ అందుబాటులో ఉంటే దాని సాయంతో డిఫిబ్రిలేషన్‌ని అందులో ఉంచవచ్చు.
 • గుండె జబ్బులున్నవాళ్ళ ఆహారం
తీసుకునే ఆహారంలో కొవ్వు 7%కి మించరాదు. రెడ్‌మీట్ పూర్తిగా మానేయాలి. మనం ఆహారంగా తీసుకునే జీవులలోని అవయవాలలో కొలెస్ట్రాల్ చాలా  ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తినకూడదు. రొయ్యలు, పీతలు, గుడ్డులోని పచ్చ సొన, పాల పదార్థాలు లాంటి కొవ్వుని పెంచే పదార్థాల్ని పూర్తిగా మానేయాలి.
ఒమెగా కొవ్వు పదార్థాలు ఎక్కువగా వున్న చేపలు, బాదం పప్పు, అక్రూట్, నువ్వులు, పొద్దుతిరుగుడు విత్తనాలు లాంటివి ఆహారంలో తగు మోతాదులో  ఉండేలా చూసుకోవాలి. కొలెస్ట్రాల్‌ని తగ్గించే ముడి ధాన్యాలు, దంపుడు బియ్యం, ఓట్స్, గోధుమలు, సోయా పదార్థాలు, ఉల్లి, వెల్లుల్లి, మొక్కజొన్న,  చిక్కుడు, కేరట్ లాంటి కూరగాయలు; నారింజ, యాపిల్, బేరి, అరటి, అంజీర్, ఆప్రికాట్స్‌లాంటి పళ్ళు తీసుకోవడం మంచిది.
 • ========================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Herpes Simples-హెర్పిస్‌ సింప్లెక్స్

 • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- Herpes Simples-హెర్పిస్‌ సింప్లెక్స్-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...  హెర్పిస్‌ సింప్లెక్స్‌.. ఇది వైరస్‌ క్రిముల ద్వారా సంక్రమించే వ్యాధి. అంటువ్యాధి. పూర్తిగా నయం చెయ్యటం కష్టమే. వస్తూ పోతూ వుంటుంది. దీనికి హెర్పిస్‌ సింప్లెక్స్‌ వైరస్‌-1 మరియు హెర్పిస్‌ వైరస్‌-2 కారణాలుగా గుర్తించారు. అత్యధిక కేసులు హెర్పిస్‌ వైరస్‌-2 కారణంగా సంక్రమిస్తున్నట్లు నిర్ధారించడం జరిగింది. అయినా ఈ రెండు రకాల వైరస్‌ల మూలంగా నోరు, జననేంద్రియాలకు హెర్పిస్‌ సింప్లెక్స్‌ వ్యాధి సంక్రమిస్తున్నట్లు నిర్ధారించారు.

చర్మానికి చర్మం తాకినందువల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. చర్మం మీద ఎక్కడా గుల్లలు కనిపించని కేసుల ద్వారా కూడా ఇన్ఫెక్షన్‌ సంక్రమిస్తున్నట్లు గుర్తించారు. స్త్రీలలో యోని నుండి వెలువడే స్రావాలలో (పైన గుల్లలు(blisters) లేనప్పటికీ) వైరస్‌ క్రిములున్నట్లు కనుగొనడం జరిగింది.

ఈ హెర్పిస్‌ సింప్లెక్స్‌ తీవ్రమైన అంటువ్యాధి. ఈ వ్యాధి సోకిన స్త్రీలు గర్భవతులైతే వైద్యుని తప్పనిసరిగా సంప్రదించాల్సి ఉంటుంది. కాన్పు సమయంలో ఈ వ్యాధి- పుట్టే బిడ్డకు సంక్రమించే అవకాశముంది. ఈ వైరస్‌ సోకి పుట్టే బిడ్డలకు కంటిచూపు పోయే ప్రమాదముంది. మెదడు వాపు లాంటి వ్యాధులు సంక్రమించి శిశువు ప్రాణాలకూ ప్రమాదం రావచ్చు. కనుక వైద్యులు సిజేరియన్‌ ఆపరేషన్‌ ద్వారా కాన్పు చేసే విషయం ఆలోచించవలసి వుంటుంది. యోని చుట్టూ గుల్లలు లేని సందర్భంలో మాత్రం యోని ద్వారా కాన్పు చేయడం ఆలోచించవచ్చు.

హెర్పిస్‌ వైరస్‌ మెదడులోని నాడీ కణాలలో దాగి వుండి దేహరక్షణ వ్యవస్థకు తెలియకుండా నిద్రాణంగా ఉండిపోవచ్చు. మధ్యమధ్యలో ఈ క్రిములు విజృంభించి జననేంద్రియాల వద్ద గుల్లల(blisters)కు కారణమవుతుండొచ్చు. రోగనిరోధక వ్యవస్థ ఒత్తిళ్ళకు గురైన సందర్భంలో ఇలా జరిగే అవకాశాలు ఎక్కువ. అలాగే వ్యాధి మూలకంగా రోగనిరోధక వ్యవస్థ బలహీనపడిన సందర్భంలోనూ వైరస్‌ క్రిములు విజృంభించొచ్చు.

మూతిమీద 'కోల్డ్‌ సోర్స్‌' ఉన్న వ్యక్తులను ముద్దాడడం ప్రమాదకరం. వారు వాడిన తువ్వాలు మొదలైన వాడిని వాడరాదు. వారితో సెక్స్‌లో పాల్గొనటం కూడా ప్రమాదకరమే. కండోమ్‌లు వాడినా ముప్పు పొంచే ఉంటుంది. ఎందుకంటే కండోమ్‌ వెలుపల ప్రదేశంలో ఇన్ఫెక్షన్‌తో కూడిన గుల్లలుండొచ్చు.

హెర్పిస్‌ వైరస్‌ వలన రెండు ఇతరత్రా ప్రమాదకర వ్యాధులు సంప్రాప్తించే అవకాశం ఉంది. ఇది ఉంటే ఎయిడ్స్‌కారక హెచ్‌ఐవీ తేలికగా సోకే అవకాశం ఉంది. మరొకటి హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌. దీనివల్ల  క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది.


ఏటువంటి పరిస్థితులలో ఇది మళ్ళి మళ్ళీ కనిపించును :
 • సాధారణ అనారోగ్య సుస్థి చేసినప్పుడు ,
 • బాగా అలసటకు గురిచేసే వృత్తిపనులవారిలో(Fatigue),
 • అధిక శారీరక లేదా మానసిక శ్రమ ఉన్నపుడు ,
 • వ్యాధినిరోధక శక్తి తగ్గించే రోగాలు తో బాధపడుతున్నపుడు,
 • పొక్కులు లేదా గుళ్ళలు ప్రదేశములో రాపిడి కలిగినపుడు ,
 • బహిస్ట సమయాలలోనూ ఇది వ్యాపించే అవకాశమున్నది ,

 • లక్షణాలు లేదా సింప్టమ్‌స్ :
గుల్లలు లేదా పుల్లు - ఇవి మూతి చుట్టూ , జననేంద్రియాల చుట్టూ కనిపిస్తాయి .చాలా నొప్పితో ఉంటాయి. చిన్నగా జ్వరము , శరీరం నొప్పులు ఉంటాయి.
 • పరీక్షలు :
ఈ వ్యాధిని గుర్తించడానికి ఏ ల్యాబ్ పరీక్షలు అవసరము లేదు . పొక్కులు లేదా గుల్లలు (blisters) చూసి పోల్చ వచ్చును . సాధారణము గా Lab Tests ...DNA, - or PCR , virus culture మున్నగునవి చేస్తారు.
 •  చికిత్స :
చాలా మంది చికిత్స లేకుండానే మామూలు గానే తిరిగేస్తారు. పూర్తిగా ఈ వైరస్ ని శరీరమునుండి సమూలముగా లేకుండా చేయలేము .
యాంటి వైరల్ మందులు(antiviral drugs ) : ఉదా:  acyclovir and valacyclovir can reduce reactivation rates. Aloe Vera జెనిటల్ హెర్పీస్ లో కొంతవరకు పనిచేస్తున్నట్లు అదారాలు ఉన్నాయి.
నొప్పిగా ఉంటే ... tab. ultranac-p రోజుకి 2-3 మాత్రలు 5-7 రోజులు వాడాలి.
దురద , నుసి ఉంటే : tab . cetrazine 1-2 మాత్రలు 3-4 రోజులు వాడాలి.
 • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, November 22, 2012

Cardiomegaly-గుండె పెరిగితే ? • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Cardiomegaly-గుండె పెరిగితే ?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ... మన గుండె ఒక పంప్‌ వంటిది. ఈ పంపు బలహీన మైనప్పుడు శరీరానికి అవసరమైన రక్తాన్ని పంప్‌ చేయలేదు. అంతేకాక వివిధ అవయవాలకు అవసరమైన పోషకాలు అందవు. ఈ పరిస్థితినే హార్ట్‌ఫెయిల్యూర్‌ అంటారు. ఒత్తిడి పెరిగినప్పుడు తాత్కాలికంగా గుండె విస్తరిస్తుంది. ముఖ్యంగా గర్భిణిగా ఉన్నప్పుడు, గుండె కండరాలు బలహీనమైనప్పుడు, కరొనరి ఆర్టిరి వ్యాధి వచ్చినప్పుడు, గుండె కవాటాల సమస్యలున్నప్పుడు, గుండె అసాధారణంగా కోట్టుకుంటున్నప్పుడు గుండె పెరుగుతుంది. కేవలం కొన్ని సందర్భాల్లో గుండె విస్తరించడాన్ని నివారించలేం కానీ, చాలా కేసుల్లో చికిత్స చేసే వీలుంది. గుండె విస్తరించడానికి కారణమయ్యే వాటిని దృష్టిలో పెట్టుకుని చికిత్స చేస్తారు. మందులు, అవసరమైతే శస్త్రచికిత్సతో కూడా వైద్యం చేస్తారు.


గుండె విస్తరించడాన్ని (హార్ట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌) వైద్యపరిభాషలో కార్డియోమెగలె అంటారు. ఇది వ్యాధి కాదు. ఇతర పరిస్థితికి చెందిన ఒక లక్షణం. ఛాతి ఎక్స్‌రే తీసినప్పుడు అందులో గుండె విస్తరించిందని వైద్యులు చెబుతుంటారు. ఆ తర్వాత ఇతర పరీక్షలు చేస్తారు. కొంత మందిలో గుండె విస్తరించినా ఎలాంటి లక్షణాలు, చిహ్నాలు కనిపించవు. కానీ కొంత మందిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి...శ్వాసక్రియలో సమస్యలు, కళ్లు తిరగడం, గుండె అసాధారణంగా కొట్టుకోవడం, వాపు (ఎడిమ), దగ్గు, ఛాతిలో నొప్పి. గుండె విస్తరించడాన్ని ముందుగానే గుర్తిస్తే చికిత్స చేయడం సులభమవుతుంది. మీ గుండె ఆరోగ్యం గురించి మీకున్న ఆందోళనలను డాక్టర్‌తో పంచుకోండి. దీని వల్ల కలిగే పరిణామాలను ఎలా నివారించాలో చర్చించండి. పైన పేర్కొన్న లక్షణాలు, చిహ్నలు మీలో కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్యం చేయించడం తప్పనిసరి.

 • కారణాలు

గుండె విస్తరించడం వల్ల గుండె రక్తాన్ని పంప్‌ చేయడం కష్టమవుతుంది. లేదా గుండె కండరాలు దెబ్బతింటాయి. కొన్ని సార్లు గుండె విస్తరించడానికి ఎలాంటి కారణాలు ఉండకపోవచ్చు కూడా. గుండె విస్తరణతో సంబంధం ఉండే పరిస్థితులు...

అధిక రక్తపోటు : అధిక రక్తపోటు వల్ల గుండె రక్తాన్ని పంప్‌ చేయడం కష్టమవుతుంది. అంతేకాక గుండె విస్తరించడం, కండరాలు పలుచబడతాయి.

గుండె కవాటాల వ్యాధి : గుండెలోని నాలుగు కవాటాలు సరైన దిశలో రక్తం ప్రవహించడానికి తోడ్పడతాయి. రుమాటిక్‌ ఫీవర్‌, గుండెలో లోపం, ఇన్‌ఫెక్షన్లు (ఇన్‌ఫెక్టివ్‌ ఎండొకార్డైటిస్‌), కనెక్టివ్‌ టిష్యూ డిసార్డర్స్‌, ప్రత్యేక మందులు లేదా క్యాన్సర్‌ కోసం తీసుకున్న రేడియేషన్‌ చికిత్స వల్ల గుండె కవాటాలు దెబ్బతిని గుండె విస్తరించే అవకాశముంది.

కార్డియోమయోపతి : దీన్నే గుండె కండరాల జబ్బు అంటారు. అంటే గుండె కండరాలు పలుచబడటం, గట్టిపడటం. కార్డియోమయోపతి తొలి దశల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. పరిస్థితి తీవ్రమయ్యే కొద్దీ శరీరానికి రక్తాన్ని మరింత పంప్‌ చేయడానికి గుండె విస్తరిం చడానికి ప్రయత్నిస్తుంది.

గుండెపోటు : గుండె పోటు సమయంలో గుండె దెబ్బతిని గుండె విస్తరిస్తుంది. కొంత మందిలో పుట్టుకతోనే గుండెలో లోపాలు ఉండటం వల్ల ఈ సమస్య ఉత్పన్నమయ్యే అవకా శాలున్నాయి. చాలా రకాల పుట్టుకతో కలిగే గుండెలో లోపాలు గుండె విస్తరణకు దారితీస్తాయి.

అసాధారణ హృదయ స్పందన : దీన్నే వైద్య పరిభాషలో అరిత్మియా అంటారు. అంటే ఈ పరిస్థితిలో గుండె రక్తాన్ని అంత సమర్థవంతంగా పంప్‌ చేయలేదు. రక్తాన్ని పంప్‌ చేయాలంటే గుండె అదనంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇది గుండె విస్తరణకు దారితీస్తుంది.

పల్మనరీ హైపర్‌టెన్షన్‌ : గుండెకు, ఊపిరితిత్తులతో సంబంధం ఉండే ధమనుల్లోని అధిక రక్తపోటు కూడా గుండె విస్తరణకు కారణం అవుతుంది. దీన్నే పల్మనరీ హైపర్‌టెన్షన్‌ అంటారు. పల్మనరీ హైపర్‌టెన్షన్‌ ఉన్నప్పుడు ఊపిరితిత్తులు, గుండెలో ఉండే రక్తాన్ని తరలించడానికి గుండె కష్టంగా పంప్‌ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల గుండె కుడివైపు విస్తరిస్తుంది.

రక్తహీనత : తక్కువ ఎర్ర రక్తకణాల కౌంట్‌ను రక్తహీనత అంటారు. శరీరంలోని కణజాలాలకు అవసరమైన ఆక్సీజన్‌ను తీసుకెళ్లే ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలు లేని పరిస్థితిని రక్తహీనత అంటారు. దీన్ని చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇది దీర్ఘకాల రక్తహీనతగా మారి, గుండె కొట్టుకోవడంలో క్రమం తప్పడానికి దారితీస్తుంది. రక్తహీనత పరిస్థితి ఏర్పడినప్పుడు, రక్తంలో అవసరమైన ఆక్సీజన్‌ లేకపోవడం వల్ల గుండె మరింత రక్తాన్ని పంప్‌ చేయాల్సి ఉంటుంది. దీర్ఘకాలంగా రక్తహీనత ఉండి, చికిత్స చేయించు కోకుంటే అరుదుగా గుండె విస్తరిస్తుంది.

థైరాయిడ్‌ : హైపర్‌ థైరాయి డిజం, హైపోథైరాయిడిజం గుండె విస్తరణతో సహా గుండె జబ్బులకు దారితీస్తాయి.

అధిక ఐరన్‌ : శరీరంలో ఎక్కువ ఐరన్‌ ఉండటాన్ని హిమోక్రొమటొసిస్‌ అంటారు. శరీరం సరిగ్గా ఐరన్‌ను జీవక్రియకు ఉపయోగించుకోకపోవడం. దీని వల్ల ఇది శరీరంలోని ఇతర అవయవాల్లో, గుండె కండరాల్లో నిర్మితమై ఉంటుంది. ఫలితంగా గుండె కండరం బలహీనమై ఎడమ జఠరిక విస్తరిస్తుంది.

అమిలొఇడొసిస్‌ : అరుదైన వ్యాధులు కూడా గుండె విస్తరణకు కారణం అవుతాయి. అందులో ఒకటి అమిలొఇడొసిస్‌. అంటే రక్తంలో అసాధారణంగా ప్రోటీన్లు ప్రవహించి, గుండెలో నిక్షిప్తమవుతాయి. దీంతో ఇవి గుండె పనితీరుకు అడ్డుపడతాయి. గుండెలో అమిలొఇడొసిస్‌ ఏర్పడితే గుండె విస్తరణకు దారితీస్తుంది.

ప్రమాద కారకాలు-ఉపద్రవాలు

అధిక రక్తపోటు, కార్డియోమయోపతి వంశపారంపర్యంగా ఉన్నా, గుండె ధమనుల్లో అడ్డంకులు, పుట్టుకతో వచ్చే గుండె జబ్బు, గుండె కవాటాల వ్యాధి, గుండెపోటు వంటి వాటి వల్ల గుండె విస్తరించే ప్రమాదం వృద్ధి చెందే అవకాశముంది. గుండె విస్తరణ గుండెలో ఏ భాగంలో జరిగిందనే దాన్ని బట్టి, అంతర్గతంగా ఉన్న కారణాలను బట్టి ఈ ఉపద్రవాలుంటాయి.

హార్ట్‌ ఫెయిల్యూర్‌ : గుండె విస్తరణ, ఎడమ జఠరిక విస్తరణ వల్ల తీవ్ర పరిణామాలు కలుగుతాయి. అందులో హార్ట్‌ ఫెయిల్యూర్‌ ప్రమాదం అధికమవడం ఒకటి. శరీరానికి అవసరమైన రక్తాన్ని గుండె పంప్‌ చేయకపోవడం వల్ల కలిగే పరిస్థితి హార్ట్‌ ఫెయిల్యూర్‌ అంటారు. క్రమేణా గుండె కండరాలు బలహీనమవుతాయి.

రక్తంలో గడ్డలు : గుండె విస్తరించడం వల్ల గుండె పొరలో చిన్న రక్తం గడ్డలు ఏర్పడే అవకాశం ఎక్కువుంటుంది. ఒక వేళ రక్తం గడ్డలు గుండె నుండి బయటికి పంపింగ్‌ అయ్యి, రక్తప్రసరణ వ్యవస్థలోకి ప్రవేశిస్తే, ఇవి శరరీంలోని కీలక అవయవాలకు రక్తం వెళ్లకుండా అడ్డుకుంటాయి. రక్తపు గడ్డలు గుండె ఎడమవైపు ఏర్పడితే, ముఖ్యంగా గుండె మెదడు ప్రభావితమై గుండెపోటు, పక్షవాతం వస్తాయి. రక్తం గడ్డలు గుండె కుడివైపున ఏర్పడితే, ఇవి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. దీని వల్ల ప్రమాదకరమైన పల్మనరీ ఎంబొలిజం అనే పరిస్థితి ఏర్పడుతుంది.

గుండె గొణుగుడు : దీన్నే హార్ట్‌ మర్మర్‌ అంటారు. గుండె విస్తరణ ఉన్న వారిలో, నాలుగు కవాటాల్లో రెండు కవాటాలు (మైట్రల్‌, ట్రైకప్సిడ్‌ కవాటాలు) సరిగ్గా మూసుకోవు. ఇవి ఉబ్బడమే కారణం. ఇలా రక్తం వెనక్కి రావడంతో కొన్ని శబ్దాలు వస్తాయి. వీటినే హార్ట్‌ మర్మర్‌ అంటారు. అయితే, గుండె గొణుగుడు ప్రమాదకరమైనవి కాకపోయినా, వైద్యున్ని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.

కార్డియాక్‌ అరెస్ట్‌ : కొన్ని రూపాల్లో ఉండే గుండె విస్తరణ గుండె కొట్టుకునే లయ వ్యవస్థపై ప్రభావం చూపి అంతరాయం కలిగిస్తుంది. అసాధారణ గుండె లయల వల్ల శోష వచ్చి పడిపోవడం, కొన్నిసార్లు కార్డియాక్‌ అరెస్ట్‌ లేదా సడన్‌ డెత్‌ సంభవించొచ్చు.

 • నిర్ధారణ పరీక్షలు

గుండె, ఊపిరితిత్తుల పరిస్థితిని తెలుసుకోవడానికి ఛాతి-ఎక్స్‌రే చిత్రాలు ఉపయోగపడతాయి. ఒక వేళ గుండె విస్తరించి ఉంటే, ఛాతి ఎక్స్‌రే ద్వారా దాన్ని తెలుసుకునే వీలుంది. దీనికి గల ప్రత్యేక కారణాలు తెలుసుకోవడానికి ఇతర పరీక్షలు చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎకోకార్డియోగ్రాం పరీక్ష చేస్తారు. ఇందులో ధ్వని తరంగాలను ఉపయోగించి గుండె వీడియో చిత్రాలను రూపొందిస్తారు. ఈ పరీక్షలో గుండెలోని అన్ని గదులను విశ్లేషిస్తారు. గుండె ఏమైన భిన్నంగా పంపింగ్‌ చేస్తుందా ? అని గుండె కవాటాలను అంచనా వేయవచ్చు. అంతేకాక ఇంతకు ముందు వచ్చిన గుండెపోటుకు సంబంధించిన ఆధారాలను, పుట్టుకతో గుండె జబ్బును కూడా గుర్తించే వీలుంది. శారీరక శ్రమ చేస్తున్నప్పుడు, వ్యాయామం గుండె ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి స్ట్రెస్‌ టెస్ట్‌ చేస్తారు. మిగతా సమయాల్లో కన్నా గుండె వ్యాయామం చేస్తున్నప్పుడు వేగంగా రక్తాన్ని పంప్‌ చేస్తుంది. ఈ పరీక్షనే ట్రెడ్‌మిల్‌ టెస్ట్‌ అని అంటారు. ఈ పరీక్షల తర్వాత అవసరాన్ని బట్టి సిటి స్కాన్‌, ఎంఆర్‌ఐ స్కాన్‌ చేస్తారు.


 • జీవనశైలిలో మార్పులు

ఇంట్లో తీసుకునే జాగ్రత్తల వల్ల గుండె విస్తరణను నయం చేయడం వీలుకాదు. కానీ మీ పరిస్థితిని మెరుగు పరుచుకోవడానికి కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. జీవనశైలిలో ఈ మార్పులు చేసుకోవాలి. అవి...ధూమపానం మానాలి. అధిక బరువు ఉంటే తగ్గాలి. తక్కువ ఉప్పు ఉన్న ఆహారం తీసుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులైతే నియంత్రించుకోవాలి. రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి. వైద్యునితో సంప్రదించిన తర్వాత నిరాడంబరమైన వ్యాయామం చేయాలి. కొలెస్ట్రాల్‌ శాతం తగ్గించుకోవాలి. కనీసం రాత్రిపూట 8 గంటలు నిద్రపోవాలి.

మందులు- అత్యాధునిక వైద్యం

చాలా కేసుల్లో ఇప్పుడు అత్యాధునిక మందులు, వైద్య చికిత్సల వల్ల గుండె విస్తరణను నయం చేసే అవకాశముంది. కేవలం కొన్ని కేసుల్లో మాత్రమే గుండె విస్తరణను నివారించలేం. కొన్ని రకాల మందులతో గుండె పెరగడాన్ని తగ్గించొచ్చు కూడా. గుండె పెరిగితే కొత్త వైద్య చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. జబ్బును గుర్తించి నివారిస్తే, గుండె పెరగడాన్ని నివారించే వీలుంది. కార్డియోమయోపతి, ఇతర గుండె జబ్బులను ముందుగానే గుర్తిస్తే, జబ్బు ముదరకుండా చికిత్స చేయవచ్చు. గుండె విస్తరణకు కారణమయ్యే ధమనుల వ్యాధి, ధూమపానం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మధుమేహం వంటివి నియంత్రించడం వల్ల గుండె విస్తరణను, హార్ట్‌ఫెయిల్యూర్‌ను తగ్గించే వీలుంది. ఫలితంగా గుండెపోటు కూడా తగ్గే అవకాశముంది. గుండె పంపింగ్‌ వ్యవస్థను మెరుగు పరిచే మందులు అందుబాటులో ఉన్నాయి. హార్ట్‌ రిలాక్స్‌ కోసం కూడా మందులున్నాయి. ఒంట్లో చేరిన నీటి శాతాన్ని తగ్గించడానికి మందులున్నాయి. ఒంట్లో నీరు చేరిన వారు లీటరు నుంచి లీటరున్నర నీళ్లు తగ్గించి తాగాలి. చికిత్సలో భాగంగా పేస్‌ మేకర్‌ను అమరుస్తారు. కవాటంలో సమస్య వల్ల గుండె పెరిగితే, సర్జరీ చేసి కృత్రిమ కవాటాన్ని అమరుస్తారు. కరొనరి బైపాస్‌ సర్జరీ, లెఫ్ట్‌ వెంట్రికల్‌ అసిస్ట్‌ డివైజ్‌తో చికిత్స చేస్తారు.


Courtesy with : డాక్టర్‌ ఎన్‌ వి రాయుడు-సీనియర్‌ కార్డియాలజిస్ట్‌,కేర్‌ హాస్పిటల్‌, నాంపల్లి @Prajasakti Telugu news paper_రక్ష డెస్క్ 10 Sep 2012.

 • ===========================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Toxic fevers - విషజ్వరాలుఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Toxic fevers - విషజ్వరాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


జ్వరము ఒక వ్యాది కాదు . ఏదైనా జబ్బు యొక్క లక్షణాలలో ఒకటిగా... శరీర ఉష్ణోగ్రత పెరగడము . పారిశుద్ధ్య లోపమే ఈ విష జ్వరాల దురవస్థకు ప్రధాన కారణం. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా చెత్తపేరుకుపోతోంది. మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఫలితంగా వాతావరణం కలుషితమై, దోమలు ప్రబలి, వ్యాధి బాధలతో ప్రజలు పడకేస్తున్నారు. పల్లె ప్రాంతాలలో ఆరుబయట బహిర్భూమికి వెళ్ళడము అనేక నీటి కాలుష్య జ్వరాలకు కారణము అవుతుంది.

కొన్ని విషజ్వరాలు
-- కొన్ని బాక్టీరియా విష జ్వరాలు
మలేరియా ,
టైఫాయిడ్‌,
ఫైలేరియా ,

-- అన్ని వైరల్ జ్వారాలు విషజ్వరాలే .. ఉదాహరణకు కొన్ని ->
డెంగీ,
స్వైన్‌ఫ్లూ,
చికన్‌గన్యా,
ఫ్లూ ఫీవర్ ,
ఎల్లో ఫీవర్ ,
మెదడు వాపు,
బర్డ్ ఫ్లూ,


 • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Nine new principles for good health-మంచి ఆరోగ్యానికి నవ నవీన సూత్రాలు


 • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మంచి ఆరోగ్యానికి నవ నవీన సూత్రాలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ... 
  :

One principles for good health-మంచి ఆరోగ్యానికి ఒకే ఒక సూత్రము .
1 . ఈర్ష్య- ద్వేషాలు లేకుండుట ( జీవితము ప్రశాంతముగా  మనసులో కుళ్ళు కపటము లేకుండుట) ,

Two principles for life long fitness- జీవితాంతము ఫిట్ గా ఉండడానికి రెంటు సూత్రాలు :
1 . రోజూ క్రమము తప్పకుండా పగలు వ్యాయామము (exercise) చేయుట .
2 . రోజూ క్రమము తప్పకుండా రాత్రి  సురక్షిత సంభోగము (sexercise) చేయుట .

Three principles for Feel-good-రోజంతా హుసారుగా , ఆనందముగా ఉండేందుకు మూడు సూత్రాలు :
1 . నిద్ర : ఎంత నిద్ర అవసరమో ముందుగా గుర్తుంచుకోవాలి . అందరికీ ఒకే గంటల నిద్ర సూత్రము వర్తించదు . ఒక్కోసారి ఒకే వ్యక్తికి నిద్రకు సంబందించిన తేడాలూ ఉందొచ్చు . నిద్రపోయే సమయము , సహజము గా లేచే సమయము నోట్ చేసుకోవాలి . ఇలా కనీసము ఓ వారం చేయాలి. అప్పుడు రాత్రి వేళ సగటునిద్ర సమయము తెలుస్తుంది. ఆ సగటు సమయమే శరీరానికి కావాలి . సారీరక సహజనిద్ర ప్రకక్రియ పట్ల అవగాహన ఉండాలిం.
2 . పానీయాలు : శరీరం లో నీటి కొరత ఏర్పడితే మాడ్ మారిపోతుంది. ఓ రెండు రోజులపాటు తాగే నీటిపై కన్నేయాలి . పానీయాలు ఆరొగ్యవంతమైనవి కావాలి. అలా అని అవసరం మించిన  దానికంటే ఎక్కువ నీరు తాగితే శారీరకవ్యవస్థ నుండి  ప్రధాన లవణాలు వెలికి వెళ్ళిపోయే  అవకాశం ఉంటుంది. రోజుకు 1.5 నుండు 2.0 లీటర్ల పానీయాలు సగటు మోతాదు.
3 . కదలిక & విశ్త్ర్రాంతి  : ఎప్పుడు అదేపనిగా కదలకుండా ఏపనీ చేయకూడదు . పనినో ప్రతి గంటకు ఓ 5 నిముషాలు రిలాక్షేషన్‌ అవసరము . ఉదయమా ? సాయంత్రమా? అన్న సంగతి ప్రక్కన పెడితే రెగ్యులర్ శారీరక వ్యాయామము మెదడుకు(మనసుకూ), శరీరానికి ఉత్తేజాన్నిస్తుంది. వ్యాయామము ఏదైనా .. వారి వారి వృత్తులకు సరిపడే సరియైన విధముగా ఉండాలి. నడక , సైక్లింగ్ , స్విమ్మింగ్ , ఆటలు మున్నగునవి . నలుగురితో పిచ్చాపాటి కాలక్షేప కబుర్లు కోసము కొంతసమయము కేటాయించాలి.

4-principles to getrid off cold and sinus-జలుబు, సైనస్‌లను వదిలించుకునేందుకు 4-చిన్న సూత్రాలు.

నేటి గజిబిజి పరుగుల జీవితంలో మానవుడు సవాలక్ష రోగాలతో సతమతమవుతుండగా ఎక్కువగా శ్వాస సంబంధిత వ్యాధులతో భాదపడుతున్నాడు. కారణం వాతావరణ కాలుష్యం ఒకటయితే మిగిలినవి అనేకం. ప్రతిగా తరచుగా జలుబు, సైనస్ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. వీటిని చిన్న చిన్న సూత్రాలతో క్రమంగా తగ్గించుకోవచ్చును .
1. తడిగా ఉన్న తలతో ఫ్యాన్ కింద కూర్చోవడం, వాహనాలలో ప్రయాణించేటపుడు ముక్కుకు కాటన్ వస్త్రాన్ని కట్టుకోవడము చేయండి.
2. ప్రతిరోజు పది నిమిషాల పాటు సూర్య కిరణాలు మీపై పడేలా కూర్చోండి.
3. బయట ఆహార పదార్ధాలు తింటే ఓ గ్లాసు గోరువెచ్చని నీటిని త్రాగండి.
4. నిద్ర పోయేప్పుడు మీ తలను పూర్తిగా కప్పుకోండి.

Five Principles for Perfect beauty-మంచి ముఖారవిందానికి  పంచ సూత్రాలు .
    1.నారింజ తొక్కలను నీడలో ఆరబెట్టి, పొడి చేసి నీటితో కలిపి ముఖానికి రాస్తే, మొటిమలు, జిడ్డుకారడం తగ్గుతాయి.
 2.పళ్ళు శుభ్రంగా తెల్లగా ఉండాలంటే వాటిని టేబుల్‌సాల్ట్‌తో కానీ, బేకింగ్‌ సొడాతో కానీ తోముకోవాలి.
  3.  గాలి తగిలేలా మూడు రోజులు (పులిసిన) నిల్వ ఉంచిన పెరుగును తలకి బాగా మర్దన చేసి కొన్ని నిమిషాల తరువాత స్నానం చేస్తే చుండ్రు పోతుంది.
 4.జిడ్డుగా ఉన్న ముఖానికి ఆపిల్‌ గుజ్జును పట్టించి పావుగంట తరువాత కడుక్కుంటే జిడ్డు ఒదిలి బుగ్గలు ఆపిల్‌ పళ్ళలా తయారవుతాయి.
   5. వేయించిన పదార్థాల కంటే ఉడికించిన పదార్థాలు తేలికగా జీర్ణమవుతాయి. శరీరం లావెక్కదు కూడా , మంచి శరీరక అందము పొందుతారు .

Six Diet Tips for Fitness Secret-ఆరు-ఆహార  ఫిట్ నెస్ సీక్రెట్స్ :
 ఎవరైనా స్లిమ్ గా, ఫిట్ గా ఉండేందుకు 6 సూత్రాలు పాటించాలంటుంది. నిజానికి ది చాలా సింపుల్. ముందుగా చేయాల్సిందల్లా
1 . రాత్రి భోజనం ఏడు నుండి ఎనిమిది గంటలోపే ముగించేసేయాలి. రాత్రి వేళ శారీరక జీవక్రియ నెమ్మదిస్తుంది. రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారు. యుఎస్ లో ప్రజలు చాలా త్వరగా డిన్నర్ చేసేస్తారు. ఇండియాలో ప్రజలు రాత్రి తొమ్మిది గంటలయితే కానీ భోజనం చేయరు.
2 . రెండో సీక్రెట్- ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఏడు నుండి ఎనిమిదిలోపే తినేయాలి. అప్పుడు శారీరక మెటబాలిజం ఊపు అందుకుంటుంది. దాంతో రోజంతా హుషారుగా ఉండేందుకు జీవక్రియ బాగా పనిచేస్తుంది. ఉదయం ఎంత త్వరగా ఎంత ఎక్కువ మోతాదులో బ్రేక్ ఫాస్ట్ ముగిస్తే అంత మంచిది.
3 . మూడో సీక్రెట్ -మంచినీళ్ళు వీలయినంత ఎక్కువగా తాగడం. నీళ్ళు తాగడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది భావించడం సరికాదు. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని విషతుల్యాలన్నీ వెలికి వెళ్ళిపోతాయి. రోజుకు కనీసం మూడు లీటర్ల నీటినైనా తాగుతుండాలి.
4 . అందం ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందని, ఆత్మ విశ్వాసము మానసిక అనారోగ్యాన్ని రానీయదు . అందము కోసము తాజా పండ్లు తినాలి . ఫ్యాషన్‌లో అందం కూడా భాగమేనన్నారు. అందం రెట్టింపుకోసం బ్యూటీ సెలూన్స్‌ ఎంతో ఉపయోగమన్నారు.
5.  పాలు , విటమిన్‌ డి3 ఉన్న ఆహారపదార్ధాలు ఎక్కువగా తినాలి. విటమిన్‌ డి3 గుండె జబ్బులు, మదుమేహము , రక్తపోTu  నివారించడము లేదా రాకుండా కాపాడుతుంది.
6. ఒమేగా3 ఫాటీయాసిడ్స్ కోసము  సముద్ర చేపలు , లైకొఫిన్‌ కోసము టమాటోలు రెగ్యులర్ గా తీసుకోవాలి. విటిమిన్లు, ఖనిజలవనాలకోసం  ఆకుకూరలు తినాలి.


Seven Principles Happy Living -ఆహ్లాదకర జీవితానికి ఏడు సూత్రాలు.
మనకు ఎంత ఐశ్వర్యం వుంది? నెల తిరిగేటప్పటికి ఎంత ఆదాయం వస్తుంది ? అనేవి కాదు ముఖ్యం. మనం ఎంత ఆరోగ్యంగా, ఎంత నాజూకుగా ఉన్నామనేది ఆరోగ్యాన్ని పొందటంలో కల రహస్యం. మన ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషించేది ఆహారం. ఆహారం విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి దినం వ్యాయమం చేస్తూ వుంటే బంగారం లాంటి జీవనం మన సొంతం అవుతుంది. అందుకోసం నిపుణులు సూచిస్తున్న మార్గాలు చూడండి.
1. ప్రతి రోజు మూడు పూటలా కొద్ది మోతాదులో అవసరం మేరకే ఆహారం తీసుకోవాలంటున్నారు.రోజుకు రెండు సార్లు లేదా మూడు సార్లు భోజనం చేయడంతో పాటు డ్రై ఫ్రూట్స్ లేక తాజా పండ్లు లేక ఉడక పెట్టని కూరగాయలు స్నాక్స్ గా తీసుకోవాలని తెలుపుతున్నారు.
2. ఆహారంలో రోజుకు కనీసం 500 గ్రాముల పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోండి. ఇందులో రెండు నుంచి నాలుగు తాజా పండ్లు ఉండాలి. పెసలు, శనగలు, మొదలగు తృణ ధాన్యాలతోపాటు పెరుగు, ఫ్రూట్ సలాడ్లను కూడా తీసుకోవచ్చు.
3. ఆహారంలో పీచు పదార్ధాలు అధికంగా వుండేలా చూసుకోండి. దీని వలన రోజంతా మీరు శక్తివంతంగా ఉండగలుగుతారు. పీచు పదార్ధాలు తీసుకోకుండా వుంటే మధుమేహం వంటి వ్యాధులు వచ్చే అవకాశముంది. నూనెలో వేయించిన ఆహార పదార్ధాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.
4. కొవ్వు చేరని ఆహార పదార్ధాలు తీసుకోండి. 100 గ్రాముల పాల ఉత్పత్తులలో మూడు గ్రాముల కొవ్వు ఉంటుంది. అందువల్ల కొవ్వు తక్కువ ఉన్న పాల పదార్ధాలతో పాటు స్కిన్ లేని చికెన్ లాంటివి తీసుకుంటే మంచిది.
5. మాంసాహారులయితే, వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు చేపలు తీసుకోండి. శాకాహారులు చిరుధాన్యాలు అధికంగా తీసుకోవచ్చు. దీనికి మించిన పోషకాహారం మరోటి లేదని కూడా చెప్పవచ్చు.
6. మీరు తీసుకునే ఆహారంలో ఉప్పు, చక్కెర అతి తక్కువగా ఉండేలా చూడండి. సోడియం రోజుకు 2,300 మిల్లీగ్రాములు అంటే ఒక టీ స్పూన్ కు మించకుండా వుండేలా జాగ్రత్త పడండి. ఉప్పు అధికంగా వుండే పదార్ధాలు తినకపోవడం మంచిది.
7. అన్నిటిని మించి ప్రతి దినం ఒక గంట పాటు శారీరక వ్యాయామం చేయాలి.
పైన తెలిపిన పనులన్నీ చేయడం ద్వారా ఏ వయసు వారైనా సరే, రోజంతా చురుగ్గా ఉండటమే కాక నాజూకుగా, ఆరోగ్యంగా తిరుగుతూ అందరిని ఆశ్చర్య పరచవచ్చు.

8(Eight) Ayurvedhic principles for health-ఆరోగ్యానికి ఎనిమిది ఆయుర్వేధ  సూత్రాలు:
  మన ఆయుర్వేధ మహర్షులు ఎన్నో సంవత్సరాలు ఎన్నో పరిశోధనలు జరిపి క్రింద తెలుపబడిన ఆరోగ్య సూత్రాలను మానవులకు ఉపయోగకరం అని మన ఆయుర్వేధ గ్రంధాలలో పేర్కొన్నారు.  ఎవరైతే ఈ ఆయుర్వేధం తెలుపబడిన ఆరోగ్య సూత్రాలను పాటిస్తారో వారు ఎల్లపుడూ అనారోగ్యం బారిన పడకుండా నిత్య ఆరోగ్య వంతులుగా ఉంటారు.
1 . తెల్లవారు జామున లేవడం ,
2 . వ్యాయామాలు చేయడం ,
3 . అబ్యంగా స్నానం ,
4 . మితాహారం సేవన ,
5 . పగలు నిధ్రపోకుండుట ,
6 . రాత్రి జాగరణ చేయకుండుట ,
7. చల్నీటి స్నానము ,
8 . తీపి , ఉప్పు ,కారము మితముగా తినడము .
 మొదలగు వాటివని పాటించుటవలన వ్యాధులు రాకుండా నివారించవచ్చు.

9 Best Easy Ways Lose Weight-సన్నగా... నాజూకుగా తయారవ్వడానికి 9 సూత్రాలు:
సన్నగా నాజూకుగా ఉండాలని ప్రతి ఆడపిల్ల కలలు కంటూ వుంటుంది. దాని కోసం పడరాని పాట్లన్నీ పడుతుంటుంది. అయితే మనం తినే ఆహార పదార్థాలలో చిన్న చిన్న మార్పుల ద్వారా సన్నగా ట్రిమ్గా తయారవ్వచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి తీసుకునే డిన్నరు వరకూ ఆహారంలో కొవ్వు తగ్గించుకుంటే సన్నబడడం పెద్ద కష్టమేమీ కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది... అవేమిటంటే...
1 . జీవన విధానంలో మార్పు: ఫాస్ట్ ఫుడ్ అభివృద్ది చెందిన తర్వాత పిజ్జాలు, బర్గర్లపై మోజు ఎక్కువైపోయింది. దీనికి తోడు ప్రతి సెంటర్లోనూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు దర్శనమిస్తున్నాయి. అందమైన ప్యాకింగులలో నోరూరిస్తుంటే వాటిని తినకుండా వుండలేకపోతున్నారు యువతరం. ఫాస్ట్ ఫుడ్ అప్పటికప్పుడు కడపునింపినా వాటిల్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది.
2 . ఆహారంలో మార్పులు : రోజు మొత్తంలో తీసుకునే ఆహారంలో నూనె, నెయ్యి వాడకం తగ్గించాలి. ఇవి రెండూ లేకుండా చేసిన ఆహారం అయితే మరీ మంచిది. అంటే ఉడికించిన కూరగాయలు, నూనె తక్కువగా వేసి చేసిన ఆకు కూరలు అయితే తేలికగా జీర్ణం కావడంతో పాటు పోషకవిలువలు పుష్కలంగా లభిస్తాయి. ప్రకటనలు చూసి మోసపోవద్దు -టీవిలలో, పేపర్లలో వచ్చే ప్రకటనలు చూసి మోసపోవద్దు. కంటికి పైన రంగుల్లో ఆకర్షనీయమైన ప్యాక్ లలో కనువిందు చేసే ఆహారపదార్థాలు  నోరూరించినా వాటిల్లో పోషక విలువలు ఏమాత్రం లేకపోగా ఆరోగ్యానికి హానిచేసే కొవ్వు అధికంగా వుంటుంది. చూసిన ప్రతిదానిని తినాలనుకోవడం మానుకోవాలి.
3 . వ్యాయామం : వాకింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్, తోటపని ఇవన్నీ ఆడవారు చేయగలిగే వ్యాయామాలు. వీటిల్లో వాకింగ్ కోసమే బయటకు వెళ్లాలి. మిగతా మూడు ఇంట్లో వుండి చేసుకునే ఎక్సర్ సైజులు. మూడింటిని చేయలేకపోయినా ఏదో ఒకటి చేసినా మంచి ఫలితం ఉంటుంది.
4 . టీవిలకు దూరంగా వుండండి : అన్నం తినేటప్పుడు టీవి చూడడం చాలా మందికి అలవాటు. అసలు అన్న తినేటప్పుడు పుస్తకాలు చదవడం, పేపరు చదవడం లాంటివి మానుకోవాలి. తినే సమయంలో ఇలాంటి పనులు చేస్తుంటే ఎంత తింటున్నారో తెలియకుండా తినేస్తారు.
5 . తాజా కూరగాయలు, పళ్లు : ఫ్రిజ్ లో నిల్వ వుంచిన కూరగాయలకన్నా తాజా కూడరగాయలు మంచివి. రోజు మొత్తం మీద ఐదు రకాల కూరగాయలు, పళ్లు తీసుకుంటే కొవ్వు అనేది మీ దరిచేరదు. వైద్యుడి అవసరం రాదు.
6 . డ్రస్సులు : మనం వేసుకునే డ్రస్సులు కూడా ఊబకాయాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి. లావుగా వున్న వారు మరీ బిగుతుగా ఉండే దుస్తులకన్నా కొద్దిగా వదులుగా వుండేవాటిని  ధరిస్తే లావుగా కనపడరు. వీరికి చిన్న చిన్న డిజైన్లు బాగా నప్పుతాయి.
7 . ఆహారాన్ని విభజించండి : రోజు మొత్తం మీద తీసుకునే ఆహారాన్ని ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ గా విభజించుకోవాలి. ఆహారాన్ని కొద్ది కొద్దిగా నాలుగైదుసార్లు  తీసుకోవడం వల్ల ఊబకాయం రాకుండా జాగ్రత్త పడచ్చు.
8 . అధిక క్యాలరీలు అనర్ధం : ప్యాకెట్లులో లభించే ఆహారపదార్థాలలో క్యాలరీలు అధికంగా వుంటాయి. పోషకవిలువలు ఎక్కువ, క్యాలరీలు తక్కువ వున్న వాటినే ఎంచుకోవాలి. కొనుగోలు  చేసే పదార్థాలలో ఎన్ని క్యాలరీలు వున్నాయో చూసుకొని మరీ కొనడం మంచిది.. రంగుని చూసి మోసపోవద్దు : వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆహార పదార్థాలను ఆకర్షనీయమైన రంగులు, ప్యాకెట్లలో మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు  ఉత్పత్తిదారులు. వీటి హంగు రంగు చూసి మోసపోవద్దని డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు.
9 . నవ్వు మంచిదే : నవ్వు నాలుగు విధాల చేటు అంటారు. కానీ నవ్వు చాలా రకాలుగా మంచిదని నిపుణుల అభిప్రాయం. రోజు మొత్తం మీద కొన్ని నిమిషాల పాటు నవ్వగలిగితే దానికి మించిన వ్యాయామం మరొకటి వుండదు. రోజుకి 15నిమిషాల పాటు హాయిగా నవ్వుతుంటే సంవత్సరంలోపు రెండు కిలోల బరువు తగ్గవచ్చు.


 • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Rhematic Fever - రుమాటిక్‌ ఫీవర్‌


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Rhematic Fever - రుమాటిక్‌ ఫీవర్‌ - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...కీళ్ళ వాత రోగి జ్వరాన్నే రుమాటిక్‌ ఫీవర్‌గా పిలుస్తాం. చిన్న పిల్లలనూ, ముఖ్యంగా యవ్వనంలో అడుగుపెడుతున్న వారికీ సాధారణంగా ఈ వ్యాధి వస్తుంటుంది. విపరీతమైన జ్వరం వస్తుంది. కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటాయి. గొంతులో నొప్పి కలుగుతుంది. ఊపిరి తీసుకుంటే నొప్పిగా ఉంటుంది. కాళ్ళూ చేతుల కదలికలు పట్టు తప్పినట్లుగా అనిపిస్తుంది. స్వాధీనంలో ఉండవు. ఎక్కువ రోజులపాటు ఉండే ఈ జ్వరాన్ని అశ్రద్ధ చేయడం మంచిదికాదు.


చాలామంది పిల్లలు రుమాటిక్‌ జ్వరం బారినపడి, సరియైన చికిత్స లేక గుండె వాల్వ్‌ దెబ్బతినటంతో ఎంతో బాధ పడుతున్నారు. మనదేశంలో ప్రతి ఏడాదీ లక్షలాది మంది పిల్లలు ఈ రోగం బారిన పడుతున్నారు. వారి గుండె వాల్వ్‌పాడై పోతోంది. దీని చికిత్స్‌ ఆపరేషన్‌ కూడా ఖర్చుతో కూడుకున్నదే. అసలీ రోగానికి కారణం తెలీదు. హిమో లైటిక్‌ స్రెఎ్టో కోకై (Haemolytic Strepto Coci) అనే జీవాణువుల ద్వారా వ్యాపిస్తుంది. గొంతు భాగం, టానిల్స్‌ నెప్పి మంట, మూడు వారాల తర్వాత జ్వరం, కీళ్లనొప్పి మొదలుతుంది. దగ్గుతుమ్ము వల్ల ఈ రోగం ఒక పిల్లాడినించి ఇంకో పిల్లకి పాకుతుంది. తేమ, మురికి ప్రాంతాల్లో త్వరగా వ్యాప్తిస్తుంది. వెంటనే చికిత్స చేయాలి. కీళ్లు త్వరగా శరీర భాగాలను కదలనీయవు. ఇలా ముట్టుకుంటే చాలు తెగనెప్పి బాధ. రోగికి బాగా చెమటలు పట్టడం గుండె వేగంగా కొట్టుకోటం జరుగుతుంది. రుమాటిక్‌ హార్ట్‌ డిసీజ్‌తో ప్రాణం పోవచ్చు. ఎలక్ట్రో కార్డియో గ్రామ్‌ ద్వారా జబ్బు తీవ్రతను కనుక్కోవచ్చు. గుండెవాల్వ్‌ కనక దెబ్బతింటే ఆపరేషన్‌ చేయక తప్పదు. వాల్వ్‌ది మార్చాల్సిన పరిస్థితి రావచ్చు. మనకు పుట్టపర్తిలో ఈ ఆపరేషన్‌ సౌకర్యం ఉంది. ఈ రోగంరాగానే బెడ్‌ పై పూర్తి విశ్రాంతి తీసుకుని తీరాలి. డాక్టర్లు యాంటీ బయోటిక్‌ వాడతారు. పిల్లలకి ఈ వ్యాధి వస్తే వారికి 20వ ఏడువచ్చే దాకా జాగ్రత్తలు, వైద్యం తప్పని సరి సుమా.

వ్యాధి నిర్ధారణ :
 • elevated or rising antistreptolysin O titre or DNAase . మూలంగా మరియుఈ క్రింది గురుతులు ఉన్నదానిని  బట్టి నిర్ణయిస్తారు .
 • పోలి ఆర్థ్రైటిస్ (polyarthritis): కీళ్ళ కీళ్ళ కి మారే గుణమున్న కీళ్ళ నొప్పుల వ్యాధి .
 • కార్డైటిస్ (carditis) :  గుండె శోదము (ఇంఫ్లమేషన్‌) ఉండడము వలన - congestive heart failure with shortness of breath, pericarditis with a rub, or a new heart murmur. ఉండటాన్ని బట్టి .
 • సబ్ కుటేనియస్ నాడ్యూల్స్ (subcutaneous nodules): ఎముకలమీద , టెండాన్ల మీద నొప్పిలేని కణుపులు.
 • Erythema marginatum-- చర్మము పై ఎర్రని రాష్ (reddish rash)
 • Sydenham's chorea -- ముఖము ,చేతులు ఓ విధమైన వణుకు .
 • fever -- జ్వరము రావడము ,
 • Arthralgia-- కీళ్ళ నొఫ్ఫులు .
 • Raised ESR,-- రక్త పరీక్షలో ఇ.యస్.ఆర్ .. ఎక్కువగా ఉండడము ,
 • ECG -prolonged PR interval, ఇ.సి.జి. తీసినచో కనిపించును .
 • Leukocytosis: :-- తెల్ల రక్తకణాలు ఎక్కువగా ఉండును .
 • Abdominal pain : అప్పుడప్పుడు కడుపు నొప్పి ,
 • Nose bleeds : ముక్కు నుండి రక్తం కారడము ,
 • positive Throat culture:-- గొంగు రసాలు నుండి తీసిన స్వాబ్ పరీక్ష.
చికిత్స : 
వై్ద్యుల సహాయ , సలహా తోనే మందులు వాడాలి . ముఖ్యము గా 
 • Aspirin ,
 • corticosteroids , 
 • Antibiotics- pencillins , sulfadiazine , erythromycin  ,  మున్నగునవి .వాడుతారు.
 • Vaccine : దీనికి టీకా మందు కూడా వాడుకలోనున్నది .

 • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, November 20, 2012

Food Restrictions in Diabetic controle-ఆహార నియమాలతో మధుమేహ నివారణ

 •  
 • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Food Restrictions in Diabetic controle-ఆహార నియమాలతో మధుమేహ నివారణ - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ... 
   

డయాబెటిస్‌ వ్యాధికాదు డిజైస్టివ్‌ డిజార్డర్‌. దీన్ని ఇలాగే వదిలేస్తే శరీరంలోని అన్ని అవయవాలు దెబ్బతింటాయి. మధుమేహానికి పాటించాల్సి ఆహార నియమాలు....

- మధుమేహ నివారణకు అతిముఖ్యమైనది ఆహారనియమము.- మధుమేహా రోగి గోధుమ, రాగి తప్ప వరి అన్నము తినరాదు అనేది కేవలం అపోహ మాత్రమే. వరి, గోధుమ, రాగి, జిన్నలు, సజ్జలు మొదలైనవాటిలో 70 శాతం పిండి పదార్ధం ఉంది. ఏ ధాన్యమైనా ఎంత పరిమాణంలో తీసుకోవలెను అన్నది ముఖ్యమైనది.
- పప్పుదినుసుల నుండి లభించే ప్రోటీనులు, మాంసాహారం నుండి లభించే ప్రోటీనుల కంటే మేలైనవి. ధాన్యాలు, పప్పులు కలిపి తీసుకున్న ఆహారం ప్రోటీన్ల శాతాన్ని పెంచుతుంది. పుట్టగొడుగులలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటూ, తక్కువ కేలరీలు ఉంటాయి. కాబట్టి కాబట్టి పుట్టగొడుగులను తీసుకోవచ్చు.
- నార (పీచు) అధికంగా ఉండే ఆహారపదార్థాలు మధుమేహా నివారణలో, రక్తంలో కొవ్వు పదార్థాలను తగ్గించటంలోను ఉపయోగపడతాయి. అన్ని పప్పు దినుసులలో (పచ్చిపెలు, శనగలు, బఠాణి, అలసందులు మొదలైనవి) ఆకుకూరలు, కూరగాయలలో నార అధికంగా ఉంటుంది.
- మొలకెత్తిన మెంతులు, పొడి చేసిన మెంతులలో పీచు పదార్థము ఎక్కువగా ఉంటుంది. వీటిని, చికిత్సకు సహాయకారిగా తీసుకోవచ్చు.
- పుల్కాలు, కూరగాయలు, పప్పులు చాలా తక్కువ నూనెతో తీసుకోవాలి. వేపుడు పదార్థాలని తీసుకోకూడదు. సమయం ప్రకారమే ఆహారాన్ని తీసుకోవాలి.
- కడుపు నిండా ఆహారాన్ని తీసుకోకూడదు, అలాగే తినకుండా కూడా ఉండకూడదు. నాలుగు గంటలకు ఒకసారి తగుమాత్రంగా ఆహారం తీసుకోవాలి.

 • మధుమేహంవున్న వారు ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహారపదార్థాలు.....
- తెల్లగుమ్మడి, సొరకాయ, వంకాయ, బెండకాయ, దోసకాయ, ముల్లంగి, బెంగుళూరు వంకాయ అరటిపువ్వు, ములగకాయ, గోరుచిక్కుడు, కొత్తిమీర, పొట్ల కాయ, టమాట, ఉల్లిపాయలు, క్యాబేజి, బీన్స్‌, అల్లం, అన్ని రకాల ఆకుకూరలు,కరివేపాకు, పుదీనా, బొప్పాయి (పచ్చి) తదితర కూరగాయలు తినవచ్చు.

 • నిషేధించవలసిన ఆహార పదార్థాలు :-
- చక్కెర, తేనే, గ్లూకోజ్‌, జామ్‌, బెల్లం, తీపి వస్తువులు, కేకులు, పేస్ట్రీలు, లేతకొబ్బరినీరు, టెంకాయ (కొబ్బరి), చల్లనిపానియాలు, మిత్తు (సారాయి), పానియము, హార్లిక్స్‌, బూస్ట్‌ ,బోర్న్‌విటా, కాంప్లాన్‌, ఖర్జురం, అత్తి, ద్రాక్ష (ఎండినవి) మొదలైనవి.వీటిలో కార్భోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల తీసుకోకూడదు. బంగాళదుంప, కంద, చేమ, చిలకడదుంప మొదలైనవి తినకూడదు. క్యారెట్‌, బఠానీలు, బీట్‌రూట్‌, డబుల్‌బీన్స్‌ మితంగా తీసుకోవాలి.
- నీళ్ళు ఎక్కువగా తాగాలి.
-చేపలు తింటే మంచిది .
 • ===================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, November 18, 2012

parkinson's disease-పార్కిన్‌ సన్‌ వ్యాధి


 • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పార్కిన్‌ సన్‌ వ్యాధి- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


పార్కిన్‌ సన్‌ వ్యాధి ని ''పారాలైసిస్  ఎజిటాన్స్'' , ''షేకింగ్ పాల్సీ''  అని కూడా అంటారు . ఇది మెదడు లోని నరాలు క్షీనించడము వలన లేదా చనిపోవడము వలన కలుగుతుంది . పార్కిన్‌ సన్‌ వ్యాధి సోకిన వాళ్ళకి మెదడులోని కణజాలాలు

క్రమక్రమంగా క్షీణించి నశించడం వల్లే ఆ వ్యాధి గ్రస్థులు జీవశ్ఛవా లుగా మారిపో తారనడా నికి క్యూబా అధినేత ఫైడెల్‌ కాస్ట్రో ఒక సజీవమైన ఉదాహరణ.

లక్షణాలు :
పార్కిన్‌ సన్‌ వ్యాధి మెదడు పనితీరును మార్చేటు వంటిది . కండరాల చురుకుదనము తగ్గిస్తుంది , వనుకు ,బిగుసుకుపోవడము , మలిదశలో శరీరము అదుపు తప్పిపోవడము  జరుగుతుంటాయి . కనురెప్పలు తక్కువగా కొట్టుకోవడము , మలబద్దకము , మింగడము కష్టమవడము , చొంగ కార్చడము , నడక , శరీరము బ్యాలెన్‌స్ లో సమస్యలు , ముఖములో భావాలు పలకకపోవడము , కండరాల నొఫ్ఫులు మున్నగునవి.

 ఇది 50 యేళ్ళ వయసు తరువాత  సాధారణము గా వస్తుంది. అరుదుగా పార్కిన్‌ సన్‌ జబ్బు యవ్వనములోనూ రావచ్చు . పిల్లలలో అత్యంత అరుదు . స్త్రీ ,పురుషులిద్దరికీ వస్తుంది. కొన్ని కుటుంబాలలో ఈ వ్యాధి వంశపారంపర్యం . చిన్న వయసులో ఈ వ్యాధి బారిన పడితే అది వంశ పారంపర్యమే అవుతుంది.
ఇప్పటి వరకు పార్కిన్‌సన్‌ వ్యాధి సోక డానికి కార ణమేమిటో, వైద్య శాస్త్రవేత్తలకి కూడా అంతు చిక్క లేదు. కానీ, ఇటీ వల 'యూనివర్శిటీ ఆఫ్‌ టెక్సాస్‌ హెల్త్‌ సైన్స్‌ సెంటర్‌'కి చెందిన పరిశోధకులు, 'న్యూరాన్స్‌' అనే మెదడులోని కణజాలాలు మరణించడం వల్లే పార్కిన్‌సన్‌ వ్యాధి ప్రబలిపోతుందని వెల్లడించారు. న్యూరాన్స్‌ నశించే ప్రక్రియని నివారించడంతో, పార్కిన్‌సన్‌ వ్యాధి తగ్గు ముఖం పట్టిందని కూడా తెలుసు కున్నారు. ఇప్పటిదాకా శరీరం వణకడం, కంతులు పెరగడం, శరీర భాగాల
చలనం మందగించడం, కండరాలు బిరుసెక్కడం, సంతులనం కోల్పోవడం వంటి లక్షణాలకి తాత్కాలి కంగా చికిత్స జరపడానికి అలవాటు పడిన వైద్య నిపుణులకి మెదడులోని న్యూరాన్స్‌ కణాలని పునరుద్దరించడం వల్ల పార్కిన్‌సన్‌ వ్యాధి నివారించవచ్చుననే కీలకమైన విషయం తెలిసిరావడం వినూత్న వైద్యప్రక్రియలో విప్లవాత్మకమైన విషయమే!

జబ్బు వచ్చే విధారనము : కండరాల కదలికకు నాడీకణాలు మెదడులో ఉత్పత్తి అయ్యే  " డోపమైన్‌" రసాయనము ఉపయోగిస్తాయి. డోపమైన్‌ తయారుచేసే  మెదడు కణాలు నెమ్మదిగా నశించినపుడు పార్కిన్‌ సన్‌ వ్యాధి వస్తుంది . డోపమైన్‌
లేకుంటే మెదడులోని ఆ భాగం లోని కణాలు సక్రమముగా సందేశాలు పంపలేదు . దీనివలన కండరాలు పనిచేయవు . కాలముతో అవి మరింత దెబ్బతింటాయి. మెదడు కణాలు ఎందుకు పాడవుతాయో స్పస్టము గా ఇంతవరకూ తెలియదు.
పార్కిన్‌సోనిజమ్‌ అనేది ఇతర అనారోగ్యాల వలన (సెకెండరీ పార్కిన్‌సోనిజం అంటారు) , లేదా కొన్ని మందుల వల్ల కూడా  రావొచ్చును.


పరీక్షలు : ఖచ్చితమైన లేబురిటరీ పరీక్షలంటూ ఎమీ లేవు . డోపమైన్‌ ఇచ్చి మనిషి యాక్టివిటీ లో మార్పులు గమనించడము , బ్రెయిన్‌ స్కానింగ్ , MRI స్కానింగ్ , వంటివి కొంతవరకు ఉపయోగ పడును.  Dopaminergic function in the basal ganglia can be measured with different PET and SPECT radiotracers. Examples are ioflupane (123I) (trade name DaTSCAN) and iometopane (Dopascan) for SPECT or fluorodeoxyglucose (18F) for PET. A pattern of reduced dopaminergic activity in the basal ganglia can aid in diagnosing PD.


చికిత్స : చికిత్స చేయించకపోతే రోగము ముదిరి రోగి పూర్తిగా అశక్తుడైయి పోతాడు . న్యుమోనియా వలన ఎక్కువ మరణాలు  సంభవిస్తాయి. ఎక్కువ మంది మందులకు స్పందిస్తారు .మందుల వలన రోగ లక్షణాలు ఏ మేరకు తగ్గుతాయి , ఎంతకాలము తగ్గిఉంటాయి అనేది రోగులందరిలో ఒకేలా ఉండదు .


మందులు : డోపమైన్‌ , ఫిన్‌డోఫా , ప్రమిక్సోల్ , రోఫిన్‌రోల్ , బ్రోమోక్రిప్టిన్‌ , సెలిజిలిన్‌ , రసాజిలిన్‌ , ఎంటకెఫోన్‌ , ఎమాంటిడిన్‌ మున్నగు మందులు వాడుతారు. మేధకు , మూడ్ మార్పుకు , బాధ , నిద్రలో ఇబ్బంది తగ్గుముఖం పడతాయి. పారికిన్‌సన్‌ వ్యాధి  తగ్గుదలకు జీవనవిధానము లో మార్పులు మేలు చేస్తాయి.  ఉదా: మింగడానికి సమస్యలుంటే ఆహారము దరవరూపలో ఇవ్వాలి , ఒత్తిడికి దూరముగా , తగినంత విశ్రాంతి , ఫిజియో తెరఫీ , స్పీచ్ థెరఫీ , ఇంట్లో నడిచేందుకు , పడిపోయి దెబ్బలు తగలుకుండా బాత్ రూమ్‌ , ఇంట్లో ఇతర ప్రదేశాలలో తగిన మార్పులు , ప్రత్యేకమైన ఆహార పాత్రలు , చక్రాల కుర్చీ , వాకర్స్ , స్నానాల కుర్చీ, మంచం మీదకు చేర్చే లిఫ్ట్ వంటివి అమర్చుకోవాలి.


ఇతర చికిత్సలు : కొందరికి మెదడు లో ఆపరేషన్‌ చేయడము ద్వారా కొన్ని కణాలు తొలగించడము , మూల కణాల మార్పిడి , ప్రత్యేక బాగాలకు ' షాక్ ' ఇవ్వడము ద్వారా పార్కిన్‌సన్‌ వ్యాధి లక్షణాలను తగ్గించవచ్చును.

పార్కిన్సన్‌ జబ్బు వణుకుడుకు నికోటిన్‌ ఉండే కూరగాయలు

పార్కిన్సన్‌ జబ్బు బారినపడ్డవారికి తల, చేతులు, కాళ్లు అదేపనిగా వణుకుతుంటాయి. కాళ్లు చేతులు బిగుసుకుపోవటం, శరీర నియంత్రణ కోల్పోవటంతో పాటు కదలికలూ తగ్గిపోతాయి. మెదడులో డోపమైన్‌ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసే కణాలు తగ్గిపోవటం ఈ జబ్బుకు దారితీస్తుంది. అయితే సహజసిద్ధంగా నికోటిన్‌ గల పచ్చిమిర్చి, క్యాప్సికమ్‌, టమోటా, బంగాళాదుంప వంటివి తరచుగా తినేవారికి ఈ వ్యాధి ముప్పు మూడోవంతు వరకు తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. పొగాకు వినియోగానికీ పార్కిన్సన్‌ ముప్పు తగ్గటానికీ సంబంధం ఉంటున్నట్టు గతంలో వెల్లడైంది. ఇందుకు పొగాకులోని నికోటిన్‌ దోహదం చేస్తుండొచ్చని భావిస్తున్నారు. అందుకే సహజసిద్ధంగా నికోటిన్‌ ఉండే కూరగాయలు పార్కిన్సన్‌ జబ్బుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అనేదానిపై వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం చేశారు. వీటిని తరచుగా తినేవారికి ఈ జబ్బు ముప్పు తగ్గుతున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా ఇంతకుముందు పొగాకు అలవాటు లేనివారికి మరింత రక్షణ కల్పిస్తున్నట్టు కనుగొన్నారు.

source : Wikipedia.org/
 • ======================

Saturday, November 17, 2012

Paralysis and physiotherapy importence-పక్షవాతం ఫిజియోథెరపీ ప్రాముఖ్యత

 •  
 • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - పక్షవాతం ఫిజియోథెరపీ ప్రాముఖ్యత- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ... 


వైద్య రంగంలో ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ప్రస్తుత యాంత్రిక జీవనంలో ఎన్నో రకాల రుగ్మతలు మనిషి జీవిత కాలాన్ని నాణ్యతను నిర్ధేశించడమే కాకుండా మరణానికి కూడాకారణం అవుతున్నాయి. ఇలాంటి ముఖ్య కారణాలలో పక్షవాతం అనేది మూడవ ముఖ్య కారణంగా(మొదటి కారణం క్యాన్సర్‌, రెండో కారణం హార్ట్‌ ఎటాక్‌ ) నిలుస్తుంది. సరైన సమయంలో అత్యాధునికమైన వైద్య సదుపాయాలు అందజేయడం చేత పక్షవాతం వల్ల వచ్చే మృత్యువును చాలా వరకు అరికట్టవచ్చు. అయితే జీవిత కాలాన్ని పెంపొందించినప్పటికి శరీరంలో ఒక భాగం చచ్చుబడి పోవడంతో బాత్‌రూమ్‌కి వెళ్లడం, కూర్చుని తినడం, బట్టలు వేసుకోగలగడం వంటి కనీస అవసరాలు తీర్చుకోవడం కోసం కూడా ఇతరుల మీద ఆధారపడతారు. ఇలా మంచం మీదపడి ఇతరులతో సేవలు చేయించుకుంటున్నందున వీరు చాలామానసిక ఆవేదనకు గురిఅవుతారు.

పక్షవాతానికి నేడు ఎంతో ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. అయితే శరీరంలోని నరాలపై ప్రభావం చూపించే పక్షవాతానికి అందుబాటులోకి వచ్చిన వైద్యవిధానం, ఆధునిక చికిత్స చేయించడంతో పాటు కండరాల కదలికకోసం వ్యాయామం అనేది చాలా అవసరం. అయితే నిశ్చలంగా , నిరాశగా ఉన్న రోగులు తిరిగి లేచి ఎవరి మీద ఆధారపడకుండా వారి పనులు వాళ్లు స్వయంగా చేసుకొనేవిధంగా ఎలాంటి వ్యాయామం చేయాలన్న అవగాహన చాలా మందిలో ఉండదు. వీలైనంతవరకు అవిటితనాన్ని తగ్గించడానికి మళ్లి వారికి జీవనంలో నూతన ఉత్సాహం తీసుకురావడానికి ఫిజియోథెరపీ (వ్యాయమం) చికిత్స చేయించడం అత్యవసరం. ఫిజియోథెరపీ చికిత్స చేయించుకోవడం చేత డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు రోగులుఎవరి సహాయం లేకుండానే, ఎవ్వరిపై ఆధారపడకుండానే సొంతంగా లేక బ్రేసెస్‌ సహాయంతో నడవగలుతారు. పక్షవాతం బారిన పడినవారిలో యాభై నుంచి అరవై శాతం వరకు వాళ్లు రోజు  చేసుకునే పనులు స్వయంగా చేసుకోగలుగుతారు. పక్షవాతం వచ్చిన వారికి పూర్వస్థితి రావడానికి ఎంతో దోహదపడే ఫిజియోథెరపి గురించి వివరంగా తెలుసుకుంద్దాం...

 • ఫిజియెథెరపీ ఆశ్యకత...
ఫిజియోథెరపీ అనగా ఇది శారీరక చికిత్స అంటేగాని మందులతో కూడిన చికిత్స కాదు. ఫియోథెరపీలో నొప్పి నివారణకు విద్యుత్‌ పరికరాలతో పాటు కండరాలు, కీళ్లు నరాల సామర్థ్యం పెంపొందిచడానికి నిర్ధిష్టమైన వ్యాయామాలు కలిగి ఉంటాయి.
 • ఫిజియోథెరపీ ముఖ్య ఉద్దేశ్యం :
మందులలో రోగి ముఖ్య జీవిత కాలాన్ని పొడిగించితే, ఫిజియోథెరపీతో పొడిగించిన కాలానికి తిరిగి జీవితాన్ని పెంపొందించడం మరియు రోగికి (ఫంక్షనల్‌ ఇండిపెండెన్స్‌) స్వతంత్రంగా పనులు చేసుకునే వీలుగా (క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌) పెంపొందించుట.

సాధారణంగా ఫిజియెథెరపీ చికిత్స ఎప్పుడు మొదలుపెడతారు?
వైద్యపరీక్షల ద్వారా పక్షవాతం అని తెలియగానే , ఆసుప్రతిలో పక్షపాతం అని నిర్దారిచగానే ఐయుసిలో నుంచే ఫిజియోథెరపీ చికిత్స దిశల వారిగా మొదలవుతుంది.
 • ప్రారంభ దశ : రోగి కదలలేని పరిస్థితి లో ఉన్నప్పుడు స్వాధీనం తప్పిన కండరాలను, నరాలను తిరిగి పూర్వస్థితికి తీసుకువచ్చేలా ఫిజియోథెరపి అవసరం అవుతుంది. అత్యవసరం చికిత్స నుంచి సాధారణ వార్డుకు మార్చిన తరువాత ఎక్కువ సార్లు ఫిజియోథెరపీ వ్యాయామం చేయబడుతుంది.
రెండవదశ : ఆసుపత్రిలో డాక్టర్‌ సలహామేరకు ఫిజియోథెరపీ చేసిన తరువాత , వైద్యచికిత్స విధానాలతో పాటుగా కొన్ని రోజుల పాటు వ్యాయామం చేయాల్సి వుంటుంది.
ఐస్‌క్యూట్‌ స్ట్రోకింగ్‌ : మెదడు నుంచి నరాలకు, కండరాలకు సంకేతాలు పెంపొందించుటకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
 • గెయిట్‌ ట్రెయినింగ్‌ ఇన్‌ ప్యారెలల్‌ బ్యార్‌ విత్‌ మిర్రర్‌ : రోగి నడకలో వచ్చిన మార్పులు, నడిచే సమ యంలో సంభవించే ఇబ్బం దులు అధిగమించి సరియైన పోస్చర్‌లో నడవడానికి దోహద పడు తుంది.
వెయిట్‌ బెయిరింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు : నడిచే క్రమంలో మోకాళ్లు, తుంటి ( జాయింట్స్‌), కీళ్లలో సంభవించే పటుత్వం కోల్పోవడాన్ని అధిగమించి, ప్రాప్రియేసెప్షన్‌ మరి యు జాయింట్‌ పొసిషన్‌సెన్స్‌ ను పెంపొందించుటకు ఇవి చాలా ఉపయోగకరమైనవి.
 • న్యూరో డెవలప్‌మెంటల్‌ ట్రెయినింగ్‌, కో ఆర్డనేషన్‌ ఎక్సర్‌సైజ్‌లు : ఇది అన్ని రకాల వ్యాయామాలలో చాలా ముఖ్య మైన అతి క్లిష్టమైన చాలా సమయం, ఓపికతో కూ డిన ఎక్స ర్‌సైజ్‌ టెక్ని క్‌. ఇందు లో రెండు ప్రాంతాలు చేయి, కాలు వ్యాయా మాలు విడివి డిగా చేయించ బడతాయి.

చేతికి సంబంధించి :--మొత్తం చేయి పనిచే యడానికి పెగ్‌బోర్డుని ఉపయోగిస్తారు. తిందు లోచెక్కతో వివిధ రకాల ఆకారాలతో తయారు చేయ బడిన వస్తువులు తీస్తూ తిరిగి యథాస్థానికి చేర్చాలి. ఇది రోగి స్వంతగా తన చేత్తో భోజనం చేయడానికి, గ్లాసుపట్టుకుని నీళ్లు తాగడానికి, ఇతర కార్య క్రమాలు సులభతనం చేస్తుంది. ఇందులో సన్నని ఇనుప ముక్కలు నిలువుగా జత చేసి ఉంచబడతాయి. అందులో వాటిని రెండు వెళ్లతో పైకి లాగి తిరిగి యథాస్థితికి చేర్చాలి. ఇది చొక్కా బొత్తలు పెట్టు కోవడా నికి దోహ దపడుతుంది.

 • ఫిగర్‌ ఆఫ్‌ ఎయిట్‌ '8' స్ట్రెయిట్‌ లైన్‌ ఎక్సర్‌సైజ్‌లు : --ఇందులో నెంబర్‌ 8పై నడవడం, రెండు సరళ రేఖల మధ్య నడవడం వల్ల్ల దశల వానిగా ఫిజియోథెరపీ చికిత్స దీనిని న్యూరో రిహా బిలిటేషన్‌ అని కూడా పిలుస్తారు.

మొదటి దశ ఫిజియో థెరపీ/ న్యూరో రిహాబిలిటేషన్‌ చికిత్సప్యాసివ్‌ జాయింట్‌ రేంజ్‌ ఆఫ్‌ మోషన్‌ ఎక్సర్‌సైజ్‌ మరియు అసిస్టెడ్‌ జాయింట్‌ రేంజ్‌ ఆఫ్‌ మోషన్‌ ఎక్సర్‌సైజ్‌లు: --కీళ్లు బిగుతుగా మార కుండా కదలిక యథావిధిగా ఉండేలా కండరాలు బిగుతుగా మారకుండా క్షీణించకుండా, రక్త ప్రసరణ యథావిధిగా జరిగేలా, ఉంచడానికి దోహదపడతాయి.


బ్రిడ్జింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు :
--నడుము భాగాన్నిసులువుగా పైకి ఎత్తడానికి మల, మూత్ర విసర్జనకు ఇబ్బందికరంగా ఉండకుండా సులువుగా బెడ్‌ ప్యాన్‌ యూరినల్‌ క్యాన్‌ని చొప్పించడానికి, వ్యక్తిగత శుభ్రత పెంపొందించడానికి ఉపయోగపడతాయి.

 • పిసిషన్‌ చేంజింగ్‌, బెడ్‌రోలింగ్‌ ఎక్సర్‌ సైజ్‌లు : మంచంపైన ఒకే స్థితిలో పడుకోకుండా, అత్యధిక వత్తిడి (పీడనం) కలిగిన ప్రాంతాలపై పుండ్లు/అల్సర్‌ (ప్రెస్సర్‌ సోర్స్‌) పెరగకుండా ఉండడానికి.

కాక్‌ అప్‌ మరియు ఫుట్‌ డ్రాప్‌ స్పింట్స్‌ :-- కండరాలు బలహీనత కారణంగా మణికట్టు మరియు పాదము భూమ్యాకర్షణ శక్తివైపు ఆకర్షించకుండా ఉండడానికి, కండర క్షీణత పెరగకుండా ఉండడానికి

 • ఎలక్రికల్‌ మజిల్స్‌ అండ్‌ నెర్వ్‌ స్టిమ్యులేషన్‌ : --మెదడు నుంచి సంకేతాలు కోల్పొయిన కండరాలకు, నరాలకు తిరిగి సంకేతాలను పెంపొందించుటకు, అంతేకాకుండా పరిసరాల మార్పునకు, పరిసరాల అవగాహనకు దోహదపడతాయి.నడకలో నిలకడ మరియు నిధానము పెరుగుతాయి.ఇంతే కాకుండా ఫింగర్‌ నోస్‌ ఫింగర్‌ మాత్‌ ఫింగర్‌ హీల్‌ టుషిన్‌ బోన్‌ టెస్టులు లాంటి ఎన్నో రకాల వ్యాయామాలు చేయించబడడం జరుగుతుంది.

ఫిజియోథెరపీ చికిత్సతో కుటుంబ సభ్యుల ప్రాముఖ్యత ఎంతగానో అవసరమైన, ముఖ్యమైన అంశం, ఫిజియోథెరపిస్టు చేయించిన వ్యాయా మాలు అన్ని కాకున్నా వీలైనవి కనీసం రెండు పూటలు ఒక రోజుకు చొప్పున చేయించడం వల్ల ఫలితం ఇంకా త్వరగా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.


Courtesy with --డా వై. నందకిషోర్‌ కుమార్‌,బిపిటి(నిమ్స్‌) ఎంఎస్‌ (స్పోర్ట్స్‌ యుకె), గమన్‌ హెల్త్‌ కేర్‌ @Andhraprabha daily Telugu newspaper.

 • ====================

Monday, November 12, 2012

Broken heart Syndrome(care your heart)-బ్రోకెన్‌ హార్ట్‌ సిండ్రోమ్(హృదయం పదిలం)

 • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Broken heart Syndrome-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అనే వ్యాధి కూడా గుండెకు సంబంధించినదే. తాత్కాలికంగా గుండె కండరం బలహీనపడి రక్తనాళాలు సాధారణంగా స్పందించలేవు. ఈ వ్యాధిని గతంలో ''టరోట్సుబో కార్డియోమయోపతీ'' అని పిలిచేవారు. అయితే ఇపుడు దీనిని ఒత్తిడి గుండెనొప్పి లేదా ''ఎపికల్ బెలూన్ సిండ్రోమ్'' గా కూడా వ్యవహరిస్తున్నారు.  జీవిత భాగస్వామి ఆకస్మిక మరణం, ఆర్థిక ఇబ్బందులు... ఇవి కేవలం సమస్యలు మాత్రమే కాదు ప్రాణాంతకాలుగా మారొచ్చని నిదర్శనాలు ఉనాయి .. ఈ కారణాలతో అధికస్థాయిలో భావోద్వేగాలకు లోనైనపుడు గుండె పనితీరులో ఇబ్బందులు తలెత్తి ప్రాణం మీదకు వస్తుందని హార్ట్ స్పెషలిస్ట్ లు చెబుతున్నారు. దీన్నే వైద్య పరిభాషలో 'బ్రోకెన్‌ హార్ట్‌ సిండ్రోమ్‌' అంటారు.

ప్రేమించేవాళ్లు దూరమైతే.. ఆ బాధ వర్ణనాతీతం. ఇక తిరిగిరారు అనుకుంటే జీవించడమే కష్టం ఎవరికైనా. దీన్నే ‘హార్ట్ టు బ్రేక్’అని పిలుస్తారు. ఇలాంటి బ్రోక్‌లు మగవాళ్లకంటే ఆడవాళ్లకే ఎక్కువ. ఈ ‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్’తో తొమ్మిది రెట్లు ఎక్కువగా బాధపడుతోంది 
ఆడవాళ్లేనట. అనుకోని పరిణామాలను ఆడవాళ్లు తొందరగా జీర్ణించుకోలేరు. అదే మగవాళ్లయితే చాలా విషయాలను అంత సీరియస్‌గా తీసుకోరు. అదే పనిగా ఆలోచించరు. కాబట్టి వాళ్లుకు ‘బ్రోకెన్ హార్ట్’తో బాధలు తక్కువ. ఇందులో కూడా మామూలు ఆడవాళ్లతో పోలిస్తే భర్త చనిపోయిన ఆడవాళ్లే ఈ సిండ్రోమ్‌తో ఎక్కువ బాధపడుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. బాధ కలిగినప్పుడు అడ్రినల్ స్థాయి  పెరుగుతుంది. అప్పుడు ఒత్తిడికి లోనవుతారు. దాంతో గుండెలో రక్త సరఫరా ఎక్కువై బెలూన్‌లా ఉబ్బి పగిలిపోతుంది. ఈ సిండ్రోమ్‌తో.. 
55సంవత్సరాల లోపు ఉన్న ఆడవాళ్లలో అయితే 7.5 రెట్లు, ఆ పై వయసు కలిగిన వాళ్లలో 9.5శాతం ప్రమాదాలు జరగొచ్చని అంచనా. అది కూడా చలికాలంలో హార్ట్ ఎటాక్‌లు వచ్చే ప్రమాదం ఎక్కువ. ఎండాకాలంలో బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ ఎక్కువగా  బయటపడుతుందట.

ఈ సమస్యకు నిపుణులు చూపుతున్న పరిష్కార మార్గాలివి...
 • * భరించలేని కష్టం వచ్చినప్పుడు ఆత్మీయులకైనా చెప్పుకోకుండా మౌనంగా ఉండిపోవడం ఈ సమస్యకు అసలు కారణం. 
 • మిత్రులు,సహోద్యోగులు లేదా దగ్గరి బంధువులతో సమస్య గురించి మాట్లాడితే మనసు తేలికపడుతుంది.
 • * బాధ కలిగించే వ్యక్తులూ అంశాల గుర్తులూ జ్ఞాపకాలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి.
 • * బాధను తట్టుకోలేక దుఃఖం ముంచుకొస్తే ఏడ్చేయండి. కన్నీటిని బలవంతంగా ఆపుకోవద్దు.
 • * ఒంటరితనం, ఒత్తిడినుంచి బయటపడేందుకు ఏదైనా విహారయాత్రకు వెళ్లండి. షాపింగ్‌తోపాటు కుటుంబసభ్యులూ స్నేహితులతో కబుర్లు కూడా ఒంటరితనాన్ని దూరంచేస్తాయి.

అయితే ఇంతవరకు దీనికి ఖచ్చితమైన కారణం కనుగొనలేదు. ఈ జబ్బు లక్షణాలు గుండెపోటు లో వలెనే వుంటాయి. ఛాతీ నొప్పి, శ్వాస కష్టమవటం, గుండె బలహీనపడి వేగంగా కొట్టుకోవడం. అయితే, కరోనరీ ఆర్టరీలలో శాశ్వత డ్యామేజి వుండదు. కనుక రోగులు కొద్ది వారాలలో కోలుకుంటారు. ఇదే గుండె పోటుకు దీనికి వ్యత్యాసం అని చెప్పాలి.

ఈ జబ్బును గురించిన పరిశోధనా ఫలితాలు ఆన్ లైన్ లో ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో నవంబర్ 23, 2010 లో ప్రచురించారు. ఇంతవరకు బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ కు తగిన వైద్యం కనుకొనబడలేదు. అయితే, దీని నివారణకుగాను లేదా గుండె కు హాని కలుగకుండా మహిళలు వారి ఒత్తిడి స్ధాయిని నియంత్రించుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
 • ============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, November 8, 2012

Genetic Disorders in humans-మానవులు లో జన్యు లోపాలుఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మానవులు లో జన్యు లోపాలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...మానవులలో జన్యు లోపాలు వేలల్లో ఉన్నాయి. కొద్ది అరుదు అయితే కొన్ని సాధారణం. వారి సంభవం  ఏమైనా  ఈ రుగ్మతల గురించి చికిత్స  చాలా వేధించే సమస్య అని శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఈ వ్యాధులకు నివారిణులు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్న సందర్భాలు ఉన్నాయి. . కొన్ని అభివృద్ధి దిశలో కొన్ని ఏమీ తెలియని స్థితిలొను ఉన్నందున ఇంకా చాలా పరిశోధన అవసరం. ఇక్కడ తరచుగా మానవులలో గమనించిన  వివిధ జన్యు లోపాలు- సమగ్ర అభిప్రాయం.

జన్యులోపాలతో వచ్చే వ్యాధులను నయం చేయటానికి ప్రసుత్తం ఎలాంటి చికిత్సా లేదు. వీటిని నివారించుకోవటం ఒక్కటే మార్గం. కానీ పిండం అభివృద్ధి చెందుతున్న దశలోనే తలెత్తే జన్యులోపాలను అడ్డుకోవటం ఎలా? ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల రూపొందించిన ఓ పద్ధతి జన్యువ్యాధుల నివారణలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ముఖ్యంగా తల్లి నుంచి సంక్రమించే అరుదైన, ప్రాణాంతకమైన జబ్బులను నివారించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు. తల్లి  అండంలోని డీఎన్‌ఏలో లోపాలు గల భాగాలను తొలగించి, వాటి స్థానంలోకి ఆరోగ్యంగా ఉన్న దాత అండంలోని డీఎన్‌ఏ భాగాలను మార్పిడి చేయటమే ఈ విధానం ప్రత్యేకత. ఇలా డీఎన్‌ఏను మార్పిడి చేసిన అండాలు పూర్తిస్థాయిలో ఫలదీకరణ చెందటమే కాదు.. ఆరోగ్యకరమైన పిండాలుగా ఎదిగినట్టూ ప్రయోగాల్లో వెల్లడైంది. అమెరికా పరిశోధకుల బృందం 2009లోనే కోతులపై ఇలాంటి ప్రక్రియను చేపట్టింది.
దానికి కొనసాగింపుగానే మనుషులపై అధ్యయనం చేసింది. డీఎన్‌ఏ మార్పిడి చేసిన అండాలతో కోతుల్లో పిల్లలనూ పుట్టించగలిగారు.  ఇప్పుడు ఆ కోతి పిల్లలకు మూడేళ్లు. అన్నీ ఆరోగ్యంగా ఉండటం విశేషం. తాజాగా మనుషుల అండాలపై చేసిన అధ్యయనంలోనూ మంచి ఫలితం కనబడటం శాస్త్రవేత్తల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. అందుకే రెండు మూడేళ్లలో వీటి ప్రయోగ పరీక్షలూ ఆరంభం కావొచ్చని
అధ్యయన నేత, ఒరేగాన్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌   విశ్వవిద్యాలయానికి చెందిన షౌఖ్రత్‌ మిటాలిపోవ్‌ ఆశిస్తున్నారు.

మైటోకాండ్రియా.. శక్తి కేంద్రం
మనకు సంబంధించిన జన్యు సంకేతం చాలావరకు కణకేంద్రకంలోనే నిక్షిప్తమై ఉంటుంది. ఇందులో తల్లీతండ్రీ నుంచి సంక్రమించిన జన్యువులు సమానస్థాయిలో ఉంటాయి. అయితే కణాల్లో అక్కడక్కడ తేలియాడుతూ ఉండే సూక్ష్మ నిర్మాణాలైన మైటోకాండ్రియాలోనూ కొన్ని జన్యువులుంటాయి. ఇవి పూర్తిగా తల్లి నుంచే సంక్రమిస్తాయి. కణాలకు శక్తిని అందించే కేంద్రాలుగా పనిచేసే  మైటోకాండ్రియా.. మనం ఆహారం ద్వారా తీసుకునే పిండి పదార్థాలను, కొవ్వులను శక్తి రూపంలోకి మారుస్తాయి. అయితే వీటిలోని జన్యువుల్లో లోపాలు తలెత్తితే ఈ ప్రక్రియ దెబ్బతింటుంది. అందుకే మైటోకాండ్రియా వ్యాధులు ప్రధానంగా శక్తిని ఎక్కువగా గ్రహించే గుండె, మెదడు, కాలేయం, మూత్రపిండాల వంటి అవయవాల్లోనే తలెత్తుతుంటాయి. పుట్టుకతోనే మధుమేహం, చెవుడు, డిమెన్షియా, గుండెజబ్బుల వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తాయి. ప్రతి 5-10 వేల కాన్పుల్లో సుమారు ఒకరు ఇలాంటి మైటోకాండ్రియా వ్యాధులతో పుడుతున్నారని అంచనా.

కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో భాగంగా పిండాలను పరీక్షించటం ద్వారా ఇలాంటి జన్యువ్యాధులను  నివారించేందుకు పరిశోధకులు గతంలో ప్రయత్నం చేశారు. కానీ దీనికి కొన్ని పరిమితులున్నాయి. పైగా ఇది అందరికీ ఉపయోగపడేదీ కాదు. కుటుంబంలో ఎవరికైనా జన్యువ్యాధులుంటే, లేదా వాటిని సూచించే లక్షణాలు స్వలంగా ఉంటే పరీక్షలు చేయించుకొని ముందుగానే జాగ్రత్తపడే వీలుంది.

ఏమిటీ కొత్త పద్ధతి?
మన కణాల కేంద్రకంలోని క్రోమోజోముల మీద డీఎన్‌ఏ ఉంటుంది. ఈ క్రోమోజోములు.. స్పిండిల్‌ అని పిలుచుకునే నిర్మాణాన్ని పట్టుకొని ఉంటాయి. డాక్టర్‌ మిటాలిపోవ్‌ పద్ధతిలో అండం నుంచి ఈ స్పిండిల్‌ను తొలగించి, దాత నుంచి సేకరించిన ఆరోగ్యకరమైన అండంలో జొప్పించారు. దీన్ని వీర్యంతో ఫలదీకరణ చెందించి జన్యులోపాలు లేని పిండంగా అభివృద్ధి చేశారు. ఇలా తల్లుల నుంచి సంక్రమించే
మైటోకాండ్రియల్‌ వ్యాధుల నుంచి పిల్లలను విముక్తం చేసే అవకాశముందని మిటాలీపోవ్‌ చెబుతున్నారు. ఈ జబ్బులకు చికిత్స  లేకపోవటం వల్ల కొత్త ప్రక్రియ పట్ల నిపుణులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు.

జన్యు లోపాలు కారణాలు

మానవులలో జన్యు వ్యాధులు జన్యువులు లేదా క్రోమోజోమ్లు అసాధారణ కారణంగా వస్తాయి. ఇటువంటి లోపాలుకు కారణాలు:
 • ఉత్పరివర్తనాలు(Mutations): ఈ జన్యు న్యూక్లియోటైడ్ క్రమంలో హఠాత్తుగా వారసత్వం  మార్పులు. 
 • Aneuploidy: ఒక జీవి క్రోమోజోములు అసాధారణ సంఖ్యలో ఉన్నపుడు Aneuploidy కలుగుతుంది. ఈ ఒక క్రోమోజోమ్ నష్టం (క్రోమోజోమ్ సంబంధ అసాధారణత) లేదా క్రోమోజోమ్ యొక్క అదనపు కాపీ ఉనికి (trisomy, tetrasomy, మొదలైనవి)కారణం గా అవుతుంది .
 • తొలగింపులు-Deletions:: జాకబ్సెన్ సిండ్రోమ్ సందర్భంలో క్రోమోజోమ్ భాగంగా నష్టం.
 • నకిలీలు-Duplications: జన్యు పదార్ధ అదనపు మొత్తం కారణమవుతుంది క్రోమోజోమ్ ఒక భాగం యొక్క నకలు.
 • విలోమాలు-Inversions: క్రోమోజోమ్ ఒక భాగం  విరిగిపోయింది ఎందుకంటే న్యూక్లియోటైడ్ క్రమం తారుమారు కావడం, క్రోమోజోమ్ అసలు స్థానం వద్ద తలక్రిందులు మరియు విరిగిపోయినది reattached అవడము .
 • Translocations: క్రోమోజోమ్ ఒక భాగం ఇతర క్రోమోజోమ్ లో బదిలీ అయి వచ్చింది అవుతుంది. కొన్నిసార్లు  క్రోమోజోమ్ విభాగాలు మార్పిడి  రెండు క్రోమోజోమ్ల మధ్య జరుగుతుంది. అయితే, కొన్ని సందర్భాలలో ఒక క్రోమోజోమ్ ఒక భాగం మరొక క్రోమోజోమ్ తో జత జరగవచ్చు.

జన్యు లోపాలు రకాలు-Types of Genetic Disorders
 • ఆటోసోమల్ డామినెంట్ జన్యు లోపాలు-Autosomal Dominant Genetic Disorders: ఈ రుగ్మతలు ఒక వ్యక్తి ఒకే మాతృ లేదా పితృ లోపాల జన్యువును వారసత్వంగా అయినప్పుడు కలుగుతాయి. ఈ లోపభూయిష్ట జన్యు ఒక అలైంగిక క్రోమోజోమ్ చెందినది. అలాంటి ఒక వారసత్వం కూడా వారసత్వం యొక్క ఆటోసోమల్ డామినెంట్ నమూనా అంటారు.
 • అలైంగిక క్రోమోజోమ్ సంబంధిత అంతర్గత జన్యుపరమైన రుగ్మతలు-Autosomal Recessive Genetic Disorders:: ఒక వ్యక్తి అదే జన్యువు యొక్క రెండు లోపభూయిష్ట యుగ్మ వికల్పాలు, ప్రతి పేరెంట్ నుండి ఇచ్చారు అయినప్పుడు ఇటువంటి లోపాలు మాత్రమే వ్యక్తం అవుతాయి.. ఈ జన్యు లోపాలు వారసత్వం యొక్క అలైంగిక క్రోమోజోమ్ సంబంధిత అంతర్గత నమూనా ద్వారా సంక్రమిస్తాయి.
 • సెక్స్ లింక్డ్ డిజార్డర్స్-Sex-Linked Disorders:: ఈ వాటిలో లైంగిక క్రోమోజోమ్లు లేదా జన్యువుల రుగ్మతలను ఉన్నాయి.
 • అనేకనేక -కారకమైన జన్యు లోపాలు-Multi-factorial Genetic Disorders:: ఇటువంటి లోపాలు జన్యు అలాగే పర్యావరణ కారణాలు మూలంగా రావచ్చును ..
 • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, November 7, 2012

Painful Urination(Cystitis)-మూత్ర విసర్జనలో బాధ(సిస్త్టెటిస్)

 [Urinarytract.jpg][Urine+flow.jpg]

 • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Painful Urination(Cystitis)-మూత్ర విసర్జనలో బాధ(సిస్త్టెటిస్)-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మూత్రవ్యవస్థలో ప్రధానంగా మూడు భాగాలుంటాయి. 1. మూత్రపిండాలు. ఇవి రక్తాన్ని వడగట్టి మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. 2. మూత్రకోశం. మూత్రపిండాల్లో తయారైన మూత్రం.. విసర్జనకు ముందు దీనిలో నిల్వ ఉంటుంది. 3. మూత్రమార్గం. దీని ద్వారా మూత్రం బయటకు విసర్జితమవుతుంది. వీటిలో మూత్రకోశం ఇన్ఫెక్షన్‌కు గురవటాన్ని 'సిస్త్టెటిస్‌' అంటారు.

పురుషులకన్నా స్త్రీలు తేలికగా ఈ రుగ్మత బారినపడుతుంటారు. దీనికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి. పురుషులకన్నా స్త్రీలలో మూత్రమార్గం పొడవు చాలా తక్కువ. గర్భధారణ సమయంలో పిండం తల మూలంగా ఇది సాగి ఉండడం రెండవ కారణం. స్త్రీలలో మూత్రమార్గం.. మలవిసర్జన ద్వారానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ కారణాల మూలంగా ఈ-కోలై క్రిములు మూత్రకోశంలో చోటుచేసుకుని తరచుగా సిస్త్టెటిస్‌కు గురికావడం జరుగుతుంది.

మూత్రకోశంలో చోటు చేసుకున్న ఇన్ఫ్‌క్షన్‌ పైన ఉన్న మూత్రపిండాలకు కూడా సోకటం చాలా తీవ్రమైన వ్యాధి. పెద్దపెట్టున జ్వరం, చలి, నిస్త్రాణ   చోటుచేసుకుంటాయి.  మూత్రాశయం ఇన్ఫెక్షన్‌కు గురైనప్పుడు మాటిమాటికీ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావటం, విసర్జన సమయంలో మంట, తెలియకుండానే మూత్రంపడిపోతుండటం వంటి లక్షణాలు అధికంగా కనబడుతుంటాయి. అయితే కొన్నిసార్లు అత్యుత్సాహంగా రతి సల్పిన కేసుల్లో కూడా మూత్రకోశం ఇన్ఫెక్షన్‌కు గురికావచ్చు. నూతన దంపతులు ఈ బాధకు తరచూ గురికావడం జరుగుతుంది. దీనినే ''హనీమూన్‌ సిస్త్టెటిస్‌'' అంటారు.

కార్యకారణ సంబంధాలను పరిశీలించేటప్పుడు,  ప్రత్యక్ష కారణాలకేగాక పరోక్ష కారణాలు గూడా ప్రాముఖ్యత సంతరించుకొంటాయి.   వయస్సు, లింగభేదం, కుటుంబ, వృత్తి సామాజికపరమైన ఒత్తిళ్ళు, మానసిక, శారీరక స్థితిగతులు, సెక్స్‌ పరమైన ధర్మాలు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకొంటాయి.

Treatment :

నీరు ఎక్కువగా త్రాగాలి,
Tab . Urispas 1 tab 3 time /day  for 7-10 days,
Tab . Mahacef plus 1 tab 2 times /day for 7-10 days.
Liq. Alakaline citrate .. 10 ml mixed with 100 ml of water 3time/day
Tab . Supradyn  1 tab daily for 10-15 days .
Rest for 7-10 days .
Avoid sexual activities for 10 days.
Avoid spicy foods like Biriyani.
 • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, November 5, 2012

Nutritional deprivation_Mother and child deaths-పౌష్టికాహార లేమి_మాతాశిశు మరణాలు


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Nutritional deprivation_Mother and child deaths-పౌష్టికాహార లేమి_మాతాశిశు మరణాలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


దేశంలో ఏటా సంభవిస్తున్న శిశుమరణాల్లో సగానికిపైగా పౌష్టికాహార లోపమే కారణమవుతోంది. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఏడు నెలల వ్యవధిలో సుమారు 700మంది చిన్నారులు కన్నుమూసిన ఘటనలో జాతీయ మానవ హక్కుల సంఘం రెండ్రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని నివేదిక అడిగింది. తగినంత సిబ్బంది, అవసరమైన సౌకర్యాలు లేని కారణంగానే అంతటి దారుణం జరిగిందన్న ఆరోపణలపై స్పందిస్తూ దాన్ని 'బాలల హక్కుల' ఉల్లంఘనగానే వ్యాఖ్యానించింది. ఆంధ్రప్రదేశ్‌లోని మూడేళ్లలోపు పిల్లల్లో 74.3శాతంమంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు కేంద్ర మహిళా శిశుసంక్షేమ శాఖ తాజాగా వెల్లడించిన వాస్తవం.

'వైద్యం ఓ సామాజిక శాస్త్రం.  అవగాహన కొరవడటంవల్లే మలేరియాలు, డయేరియాలు ఇప్పటికీ మన సమాజాన్ని అట్టుడికిస్తున్నాయి. పుట్టిన వెయ్యిమంది శిశువుల్లో 74మంది పురిట్లోనే ప్రాణం వదులుతున్నారన్నారు, దేశంలోని బాలల్లో 42శాతం వయసుకు తగిన బరువు లేనివారే.

ప్రపంచంలో నమోదవుతున్న అయిదేళ్లలోపు చిన్నారుల మరణాల్లో అత్యధికం మనదేశంలోనే ఉంటున్నాయి. పుట్టిన నెలరోజుల్లోపే ప్రపంచవ్యాప్తంగా ఏటా నాలుగు లక్షలమంది శిశువులు అసువులుబాస్తున్నారని- అందులో లక్ష మరణాలు భారత్‌లోనే నమోదవుతున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బాలల ఆరోగ్య వికాసాలే లక్ష్యంగా 1975నుంచీ దేశంలో అమలవుతున్న సమీకృత శిశు అభివృద్ధి కార్యక్రమం(ఐసీడీఎస్‌) కింద- సుమారు పదిలక్షల అంగన్‌వాడీల ద్వారా రోజూ ఏడుకోట్ల ఇరవై లక్షలమంది పిల్లలకు, కోటిన్నర గర్భిణులకు పోషకాహారం అందిస్తున్నారు . మాతాశిశు మరణాల రేటు, పౌష్టికాహారం, పిల్లల బరువు, గర్భిణుల రక్తహీనత వంటివాటి ఆధారంగా దేశ జీవన ప్రమాణస్థాయిని అంచనా కడతారు. ఐసీడీఎస్‌ నేతృత్వంలో నడిచే అంగన్‌వాడీలకు- పాఠశాలలకూ మధ్య బొత్తిగా సమన్వయం కనిపించదు. కనీసం 90శాతం పాఠశాలలు రక్షిత మంచినీటికి  దూరంగా ఉంటున్నాయి. డెబ్భై శాతానికిపైగా స్కూళ్లలో శౌచాలయాలు లేవు. జాతీయ పౌష్టికాహార నిపుణుల బృందం, ప్రత్యేకంగా పౌష్టికాహార శాఖను నెలకొల్పాలని సిఫార్సు చేసింది.

గణాంకాలు :
* అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పౌష్టికాహార లోపాలతో బాధపడుతున్న వారిలో 35శాతం భారత్‌లోనే ఉన్నారు

* మాతృ మరణాల్లో కనీసం 20శాతానికి కేవలం రక్తహీనతే కారణం. దేశంలో సుమారు 60శాతం తల్లులు రక్తహీనతతో కుంగిపోతున్నారు.

* అయోడిన్‌ లోపం, గాయిటర్‌ కారణంగా దేశంలో ఏడుకోట్లమంది అల్లాడుతున్నారు.

* అతిసార వల్ల దేశంలో సుమారు ఆరు లక్షలమంది శిశువులు అసువులు బాస్తున్నారు.

* విటమిన్‌-ఎ లోపం కారణంగా దేశంలో ఏటా నాలుగు లక్షలమంది పసివాళ్లు కన్నుమూస్తున్నారు. అయోడిన్‌ లోపించడంవల్ల ప్రతి సంవత్సరం భారత్‌లో 70 లక్షలమంది పిల్లలు మానసిక వైకల్యాలతో జన్మిస్తున్నారు.

* ఆహారంలో ఫొలిక్‌ ఆసిడ్‌ సరైన పాళ్లలో అందని కారణంగా ఏటా రెండు లక్షలమంది పిల్లలు నరాల సంబంధ సమస్యలతో పుడుతున్నారు. ప్రపంచ సగటుతో పోలిస్తే ఇది 16 రెట్లు అధికం.

అమ్మపాలు...
తల్లిపాలు అమృతంతో సమానమని మరోసారి గుర్తుచేస్తోంది పోషకాహార సంస్థ. కనీసం నాలుగు నెలలవరకూ తల్లిపాలు అవసరమని పన్నెండేళ్లనాటి నివేదిక సలహా ఇచ్చింది. ఆ వ్యవధిని ఇప్పుడు ఆరు నెలలకు పొడిగించింది. గరిష్ఠంగా రెండేళ్ల వరకూ ఇవ్వవచ్చంది. తల్లిపాలలోని కొలెస్ట్రమ్‌లో అపారమైన పోషక విలువలు ఉన్నాయి. ఆ మురిపాలతో తల్లీబిడ్డల అనుబంధాలూ బలపడతాయని నిపుణులు చెబుతున్నారు. పుష్కలంగా తల్లిపాలు తాగిన బిడ్డల్లో పెద్దయ్యాక కూడా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వూబకాయం, కొన్నిరకాల క్యాన్సర్లూ దరిచేరే ప్రమాదమూ తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.

పెరిగే పిల్లలకు...
పెరిగి పెద్దవుతున్న కొద్దీ, చిన్నారులకు మరింత శక్తిమంతమైన ఆహారం కావాలి. అప్పుడే పుట్టిన పసికందు బరువు ఐదునెలలు తిరిగేసరికి రెట్టింపు అవుతుంది. ఏడాది నిండేసరికి మూడురెట్లు ఎక్కువవుతుంది. బిడ్డలు రెండో ఏడాదికంతా, 7-8 సెంటీ మీటర్ల ఎత్తు పెరుగుతారు. కౌమార దశకు ముందు బాలబాలికలు...ఏటా 6-7 సెంటీమీటర్ల ఎత్తు, 1.5 నుంచి 3 కిలోల బరువు పెరుగుతూనే ఉంటారు. ఇక కౌమారం మొదలైందంటే ఎన్నో శారీరకమైన, మానసికమైన మార్పులు! అమాంతంగా ఎత్తూ (10 నుంచి 12 సెంటీమీటర్లు) బరువూ (8 నుంచి 10 కిలోలు) మారిపోతాయి. ఆ మార్పులకు సరిపడా ఆహారం అందాలి. ముఖ్యంగా కాల్షియం సమృద్ధిగా ఇవ్వాలి. ప్రతి మనిషికీ రోజుకు 600 నుంచి 800 మిల్లీ గ్రాముల కాల్షియం అవసరం అవుతుంది. ఎదిగే వయసులో ఆ అవసరం ఇంకా ఎక్కువ. పాల ద్వారా ఆ కొరత కొంత తీరుతుంది. నెయ్యి, వంటనూనెలు తగినంతగా (రోజుకు 25 నుంచి 50 గ్రా.) ఇవ్వాలి. ఆటల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. పొద్దస్తమానూ టీవీకి అతుక్కుపోకుండా జాగ్రత్తపడాలి. పిజ్జాలూ బర్గర్లూ వంటి చిరుతిళ్ల విషయంలో హెచ్చరికలు చేస్తూ ఉండాలి. బాల్యం నుంచే ఆరోగ్యం మీదా పోషక విలువల మీదా అవగాహన కల్పించాలి. పిల్లల్లో పెరుగుతున్న వూబకాయ సమస్య పట్ల జాతీయ పోషకాహార సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వూబకాయం బూచి చూపించి కడుపు మాడ్చడం కంటే, వ్యాయామాన్నీ ఆటపాటల్నీ ప్రోత్సహించడమే మంచి మార్గమని కన్నవారికి సలహా ఇస్తోంది.

 • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, November 4, 2012

What is a Cancer?-అసలు క్యాన్సర్‌ అంటే ఏమిటి?

 •  
 • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -క్యాన్సర్‌- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ... 

 అసలు క్యాన్సర్‌ అంటే ఏమిటి?
సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణసమూహాలను 'కంతి' ( టూమర్, tumor) అంటారు. అటువంటి కొన్ని ప్రమాదకరమైన వాటిని కేన్సర్ అని వ్యవహరిస్తారు. ఈ రకమైన పెరుగుదలకు ఒక స్పష్టమైన విధి ఉండదు. కేన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని 'ఆంకాలజీ' (Oncology) అంటారు. క్యాన్సర్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వ్యాధి.క్యాన్సర్‌ మహమ్మారి ఏటా రూ.41,17,000 కోట్లు హరిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.మూడింట రెండొంతుల క్యాన్సర్‌ మరణాలు పేద, మధ్యతరగతి దేశాల్లోనే సంభవిస్తున్నాయి.అందులో ఎక్కువ భాగం ముందుగా గుర్తించి చికిత్స అందించడం ద్వారా నయంచేయొచ్చని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. క్యాన్సర్‌ అనేది ఏ వయస్సు వారి కైనా రావచ్చును. ఆడవారికి, మగవారికి కూడ రావచ్చును. శరీరములో ఏ భాగానికి అయినా రావచ్చును. ఉదా : నోరు, గొంతు, ఎముకలు, రొమ్ము, చర్మము మున్నగునవి .

పేర్ల వెనక కథ

ఇంగ్లీషులో 'టుమర్‌' అన్న మాటకి 'వాపు' అన్నది వాచ్యార్ధం. కణాలు విభజన చెంది అతిగా ఒక చోట చేరితే వచ్చే వాపు ఇది. అప్పుడప్పుడు ఈ వాపు చిన్న 'కాయ' రూపంలో తారస పడుతుంది. అప్పుడు దానిని 'కంతి' అంటారు. ఈ కంతి అన్నది రెండు స్వరూపాలలో తారసపడవచ్చు: నిరపాయమైన కంతులు (benign tumors), ప్రమాదమైన కంతులు (malignant tumors).

నిరపాయమైన కంతులని మూడు లక్షణాల ద్వారా గుర్తు పట్టవచ్చు.

* అవి నిరవధికం (unlimited)గా, దూకుడుతనం (aggressiveness)తో పెరిగిపోవు
* అవి ఇరుగు పొరుగు కణజాలం (tissue) మీదకి విరుచుకు పడవు (do not invade neighboring tissue)
* శరీరంలో ఒకచోటి నుండి మరొక చోటికి దండయాత్ర చెయ్యవు (do not metastasize)

కొన్ని రకాల కేన్సర్ల పేర్లు -ఓమా శబ్దంతో అంతం అవుతాయి: కార్సినోమా, సార్కోమా, మొదలయినవి. ఈ -ఓమా అనే ఉత్తర ప్రత్యయం ఉంటే అది కంతి (tumor) రూపంలో ఉందని అర్ధం. మెలనోమా (melanoma) అంటే మెలనోసైట్‌ (melanocytes)లు (అంటే మెలనిన్‌ కణాలు) విపరీతంగా పెరిగి కంతిలా ఏర్పడటం. ఈ మెలనిన్‌ కణాలు మన శరీరపు ఛాయని నిశ్చయించ గలవు. అందుకనే పుట్టుమచ్చల కైవారం అకస్మాత్తుగా పెరిగిందంటే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి.

ట్యూమర్లు రకాలు

* మాలిగ్నెంట్ ట్యూమర్లు (Malignant tumors): ఈ రకమైన ట్యూమర్ల నుంచి కొన్ని కాన్సర్ కణాలు విడిపోయి, దేహంలో, ఏర్పడిన ప్రాంతం నుంచి వేరొక ప్రాంతంలోకి చేరి ద్వితీయ ట్యూమర్లను ఏర్పరుస్తాయి. ఈ ప్రక్రియను మెటాస్టాసిస్ (Metastasis) అంటారు. ఇవి తొందరగా పెరుగుతాయి, ప్రమాదకరం, ప్రాణాంతకమైనవి.
* బినైన్ ట్యూమర్లు (Benign tumors): ఈ రకమైన ట్యూమర్లు సాధారణంగా నెమ్మదిగా పెరిగి, చిన్నవిగా ఉంది, ఒక తంతుయుత పొరచే కప్పబడి స్థానికంగా ఏర్పడతాయి. ఇవి మెటాస్టాసిస్ ను ప్రదర్శించవు. ఇవి హానికరమైనవి కావు. చిన్న శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చును.

కేన్సరు సప్త సూచికలు

* మానని పుండు (Ulcer)
* అసహజమైన రక్త స్రావం (Bleeding)
* పెరుగుతున్న కంతి (Tumor)
* తగ్గని దగ్గు (Cough), బొంగురు గొంతు (Hoarseness of voice)
* మలంలో రక్తం, మలవిసర్జన లో మార్పు
* తగ్గని అజీర్తి, మింగుట కష్టం
* పుట్టుమచ్చలలో మార్పు

కాన్సర్ ఉత్పరివర్తనాలు

* వైరస్ ఆంకో జన్యువు (Oncogenic virus) ల ప్రభావం,
* ట్యూమర్ అణచివేత జన్యువు (Tumor suppressor genes) లను కోల్పోవడం. వాటిలో ఉత్పరివర్తనాలు కలగటం లేదా వాటిని ఉత్తేజరహితం గావించడం.
* డి.ఎన్.ఎ. రిపేర్ జన్యువులను కోల్పోవడం. వాటిలో ఉత్పరివర్తనాలు కలగటం లేదా వాటిని ఉత్తేజరహితం గావించడం.
* క్రోమోజోములు అరుదుగా భ్రంశనం (Aberration) కు గురి కావటం.

పైన చెప్పిన అన్ని లేదా కొన్ని మార్పులు యాదృచ్ఛికంగా గాని లేదా అనేక కారకాల వల్ల జరగవచ్చును. ఈ మార్పులను ప్రేరేపించే కారకాలు: కొన్ని రకాల కాలుష్యం, రేడియేషన్, పొగాకు, ఆల్కహాల్, ఔషధాలు, రసాయనాలు.

కేన్సర్‌ రకాలు

* కార్సినోమా (Carcinoma) అనేది ఉపకళా కణజాలాలలో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు. ఈ కాన్సర్ లు చర్మం, శ్వాస, జీర్ణ మరియు, జనన వ్యవస్థలోని ఉపకళా కణాల నుంచి ఏర్పడతాయి. లేదా దేహంలోని వివిధ గ్రంధులు ఉదా: క్షీరగ్రంధులు, నాడీ కణజాలం నుంచి ఏర్పడతాయి. మన దేహంలో ఏర్పడే కాన్సర్ లలో 85 % కార్సినోమా రకానికి చెందినవి.

* సార్కోమా (Sarcoma) సంయోజక కణజాలాలలో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు. ఇవి మధ్యస్త్వచం నుంచి ఏర్పడిన కణజాలాలు, అవయవాల నుంచి గాని ఏర్పడతాయి. కాన్సర్ లలో సార్కోమా సుమారు 2 % ఉంటాయి.

* లూకీమియా (Leukemia): గ్రీకు భాషలో 'లూకోస్‌' అంటే 'తెలుపు', 'ఈమియా' అంటే 'రక్తానికి సంబంధించిన'. కనుక 'లూకీమియా' అంటే 'తెల్ల రక్తం' అని ఆర్ధం వస్తుంది. రక్తంలో తెల్ల కణాలు బాగా పెరిగినప్పుడు అది లుకీమియా అని పిలవబడుతుంది. ఇది ముఖ్యంగా అస్థిమజ్జలో (bone marrow) ఉన్న తెల్ల కణాలను ప్రభావితం చేస్తుంది. దీనిని 'ద్రవరూప కంతి' అని కూడా అంటారు. దేహంలో ఏర్పడే ట్యూమర్లలో ఇవి 4 % ఉంటాయి.

* లింఫోమా (Lymphoma) ప్లీహం, శోషరస గ్రంధులలోని తెల్ల రక్తకణాలలో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు. దేహంలో ఏర్పడే ట్యూమర్లలో ఇవి ఇంచుమించు 4 % ఉంటాయి.

అవయవాలు

కాన్సర్ మన శరీరంలో ఏ భాగానికైనా వచ్చే ప్రమాదం ఉన్నది. అయినా గర్భాశయం, రొమ్ము, ఊపిరితిత్తులు, పేగులు, శ్వాస నాళాలు మొదలైన భాగాలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ. కాన్సర్లలో ఊపిరితిత్తుల కాన్సరు, జీర్ణకోశ - పేగుల కాన్సరు, రొమ్ము కాన్సరు, గర్భాశయముఖ కాన్సరు, తల, మెడ కాన్సరు, ప్రోస్టేలు, రక్త సంబంధిత కాన్సరులు ముఖ్యమైనవి.

లక్షణాలు

వృద్ధుల్లో వచ్చే కాన్సర్‌ వల్ల నొప్పి నీరసం, ఆకలి లేకపోవటం, ఆయాసమే కాక ప్రదేశాన్ని బట్టి లక్షణాలు ఇలా ఉంటాయి.

తల, మెడ కాన్సరు : మాననిగాయం, గొంతుల్లో, నోటిలో నొప్పి. ఆహారం మింగటంలో కష్టం. స్వరంలో మార్పు, మెడపై వాపు.

ఊపిరితిత్తుల కాన్సరు : దగ్గు, కళ్లెలో రక్తం, ఊపిరితిత్తుల చికాకు, ఛాతీ నొప్పి తరచుగా శ్వాసకోశ వ్యాధి గ్రస్థత.

అన్న వాహిక, జీర్ణకోశ కాన్సరు : మింగటంలో కష్టం. ఆకలి లేకపోవటం, బరువును కోల్పోవటం, రక్తాన్ని వాంతి చేసుకోవటం, వాంతులు కావటం, యాస్పిరేషన్‌ న్యూమోనియా.

పెద్దపేగు-గుదము-ఆసనం కాన్సరు : జీర్ణకోశ పేగుల కింది మార్గం - (పెద్దపేవు-గుదం- అసనం) పేగుల అలవాట్లలో మార్పులు, మల బద్ధకం/విరేచనాలు, గుదము నుండి రక్తస్రావం లేక రక్తంతో కూడిన స్రావం స్రవించడం, ఆసనంలో నొప్పి, గాలిపోవుట, ఉదరంలో గడ్డ, పేగుల్లో ఆటంకం.

జననాంగ, మూత్రాశయం కాన్సరు : రక్తహీనత, జ్వరం, బరువును కోల్పోవడం.

గర్భకోశ ముఖద్వారం కాన్సరు : యోని నుండి రక్తస్రావం నడుంనొప్పి, ఉదరంలో నొప్పి.

ప్రోస్టేటు కాన్సరు : త్వరగా మూత్రం విసర్జించాలన్న భావన ఎక్కువ కావటం, మూత్రం పోసేటప్పుడు మంట, మూత్రం చుక్కలు, చుక్కలుగా రావటం, ధారతగ్గటం మొదలగునవి.

మూత్రాశయ కాన్సరు : నొప్పి లేకుండా మూత్రంలో రక్తం రావటం, ఉదరంలో నొప్పి, మూత్రం నిలచి పోవటం.

రొమ్ము కాన్సరు : రొమ్ములో చేతితో తాకి గుర్తించగల గడ్డ, చనుమొనల నుండి రక్తంస్రావం, చంకలో గడ్డ.

రక్త కాన్సరు : రక్తహీనత, బలహీనత, జ్వరం, బరువు కోల్పోవటం, తరచుగా ఛాతీ, మూత్ర సంబంధ వ్యాధి గ్రస్తత, చర్మం కింద చిన్న చిన్న రక్త స్రావాలు, ముక్కు నుండి చిగుళ్ళ నుండి రక్తం కారటం, కీళ్ళనొప్పులు, నొప్పిలేని తాకి తెలుసుకోగల లింఫ్‌ గ్రంథులు, కాలేయం ప్లీహము వాచుట.

కేంద్రనాడీ మండల కాన్సరు : తలనొప్పి వాంతులు, మూర్ఛలు, చూపుతగ్గుట, స్వర్శ కోల్పోవుట లేక కండరాల బలహీనత, మూత్ర కోశ ప్రేవుల ధర్మాల్లో మార్పులు, స్పృహలో మార్పులు.

వ్యాధి నిర్ధారణ పద్ధతులు

కాన్సరు వ్యాధి నిర్ధారణకు.. భౌతిక శరీరపరీక్ష, వ్యాధి సంబంధిత పరీక్షలు జరపాలి. ఎండోస్కోపీ, లారింగోస్కోపీ, బ్రోంకోస్కోపీ, కోలోస్కోపే పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. వాటితో పాటు ఎక్స్‌-రే, అల్ట్రా సౌండ్‌, సిటీస్కాన్‌, మామోగ్రఫీ, రక్త సంబంధ, జీవ రసాయనశాస్త్ర పరీక్షలు, ఎముక స్కాన్‌, ఎముకల అధ్యయనం చేస్తారు. కాన్సరు దశలను నిర్ణయించి దానిని నయం చేయడానికి విధానాలను రూపొందించుకోవాలి. కాన్సరు దశను నిర్ణయించుకోవటంవల్ల జబ్బు ఏ దశలో వుంది? దాని పెరుగుదల ఎలా వుంటుంది? వ్యాధిని నయం చేయడానికి ఏ విధానాలను రూపొందిచాలి. చికిత్సకు ఎటువంటి ఫలితం వుంటుందనే విషయాలు తెలుస్తాయి.


చికిత్స :

నివారణ
క్యాన్సర్ కస్ట నస్టాల గురించి ప్రజలకు తెలియజేసి అవగాహన కల్పిచాలి , కాన్సర్‌ వ్యాధిని నయం చేయడానికి శస్త్ర చకిిత్స, రేడియేషన్‌, కీమోథెరపీ అవసరం .
ఆరోగ్యపు అలవాట్లను, ఆహారపు అలవాట్లను 30 నుంని 40 ఏళ్ల వయస్సు నుంచే ప్రారంభించాలి. తొలిదశలోనే కాన్సరును గుర్తించి చికిత్స పొందాలి. ధూమపానం, సురాపానం, గుల్కా, జర్దాకిల్లీలు మానాలి. పండ్లు, కూరగాయలు పీచు పదార్థం ఎక్కువగానూ, కొవ్వు తక్కువగానూ వుండే ఆహారాన్ని తీసుకోవాలి. కాన్సరు బారినుండి శరీరాన్ని రక్షించుకోవాలి. దీనికి స్క్రీనింగ్‌ పరీక్షలు జరపాలి.

చికిత్సకు సంబంధించి నిర్ణయాలు మూడు విషయాలపై ఆధారపడి వుంటాయి. శరీర సాధారణ స్థితి, ఇతర జబ్బులు, కాన్సరుదశ, రోగి కోరిక, సమ్మతి. తొలిదశలో వున్న కాన్సర్లలో 70 నుంచి 90 శాతం కేసుల్లో నయం అయ్యే అవకాశం వుంది. కాన్సరు చికిత్సలో 19వ శతాబ్దం చివరిదశలో కాన్సరుకు శస్త్ర చికిత్స ప్రారంభమైంది. అయితే కాన్సరుకు శస్త్ర చికిత్స రానురాను వయస్సు పెరిగిన కొద్దీ తగ్గిపోతున్నది. రేడియేషన్‌ చికిత్స ఎక్స్‌రేను కనుగొన్న 1895 నుండి జరుపబడుతున్నది. వృద్ధుల్లో కాన్సరు జబ్బుకు రేడియేషన్‌ చికిత్సను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాన్సరుకు మందులతో చికిత్స 1950 నుండి ప్రారంభమైంది. వృద్ధుల్లో కాన్సరు చికిత్సకు మందులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

క్యాన్సర్‌ను చంపే పసుపు : పసుపు కు క్యాన్సర్‌ కణాలను తుదముట్టించే సామర్థ్యం ఉన్నట్లు , పసుపులో ఉండే కర్కుమిన్‌ అనే రసాయనానికి 24గంటల్లోపే క్యాన్సర్‌ కణాలను చంపే శక్తి ఉన్నట్టు పరిశోధకులు తేల్చారు. కర్కుమిన్‌ కు గాయాలు నయం చేయడంతోపాటు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించే శక్తి ఉంది.

 • =========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, November 2, 2012

Tetralogy of Fallot(TOF), టెట్రాలజీ ఆఫ్ ఫాలట్

 • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Tetralogy of Fallot(TOF), టెట్రాలజీ ఆఫ్ ఫాలట్ - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

టెట్రాలజీ ఆఫ్ ఫాలాట్ అనేది జన్మతహా వచ్చే గుండె లోపము . ఇది ఒక సైనోటిక్ గుండె జబ్బు . దీనినే జీలం బీబీ సిండ్రోమ్‌ అంటాము . 1672 లో దీన్ని Niels Stensen , 1773 లో  Edward Sandifort , 1888 లో ఫ్రెంచ్ వైద్యుడు Étienne-Louis Arthur Fallot వర్ణించారు . Fallot పేరునే ఈ వ్యాది పిలువ బడు తుంది  టెట్రా అంటే నాలుగు . అందుచే 4 శరీర నిర్మాణ సంబంధించి అసాధారణతలు ఉంటాయి . అందులో 3 ఎప్పుడూ ఉంటాయి.

సూచనలు మరియు లక్షణాలు : 
 మంచి రక్తము , చెడురక్తము కల్సిపోవడము వలన పూర్ ఆక్షిజెనేషన్‌ మూలంగా ,నీలి రంగు లో చర్మము కనిపించును , గుండె లో heart murmur శబ్దము , బరువు తగ్గిఫోవడము , చిన్నపనిచేసినా ఆయాసము పడడము , గోళ్ళ లో  క్లబ్బింగ్ ఆకారము రావడము జరుగును . ఆక్షిజన్‌ అందక ఆయాసముతో చనిపోవడమూ జతుగుతుంది.

కారణాలు :
పరిసర వాతావరణ ప్రభావము లేదా జెనెటిక్ అంశాలు , రెండూ కలిపి అయిఉండవచ్చును . ఇదిక్రోమోజోం 22 సంబంధిత  జన్యుపరమైన వ్యాది . నాలుగు అంశాలలో four heart malformations --
 • A: Pulmonary Infundibular Stenosis
 • B: Overriding aorta
 • C: ventricular septal defect (VSD)
 • D: Right ventricular hypertrophy
ఉంటాయి .
 అదనపు క్రమరాహిత్యాలు

అదనంగా, Fallot యొక్క నాలుగు అంశముల గ్రూపు లేదా వరుస ఇతర శరీర నిర్మాణ సంబంధమైన క్రమరాహిత్యాలు, తో ఉండవచ్చు:

     రోగుల 40% లో ఎడమ పుపుస ధమని యొక్క స్టెనోసిస్,
     రోగుల 60% లో ఒక ద్విపత్ర కవాట పుపుస,
     రోగుల 25% లో కుడి వైపు సంబంధ వంపు,
     రోగుల 10% హృదయ ధమనుల క్రమరాహిత్యాలు,
     సిండ్రోమ్ కొన్నిసార్లు Fallot ఒక pentalogy  అని పిలుస్తారు, ఈ సందర్భంలో ఒక రంధ్రము అండాకార వర్తులము లేదా ధమని భాగాలలో లోపం,
     ఒక జఠరికల భాగాలలో లోపం
     పాక్షికంగా లేదా పూర్తిగా క్రమరహిత పుపుస సిర తిరిగి
     పంగలుగల పక్కటెముకలు మరియు పార్శ్వ-అదనపు క్రమరాహిత్యాలు

అదనంగా, Fallot యొక్క నాలుగు అంశముల గ్రూపు లేదా వరుస ఇతర శరీర నిర్మాణ సంబంధమైన క్రమరాహిత్యాలు, తో ఉండవచ్చు:

     రోగుల 40% లో ఎడమ పుపుస ధమని యొక్క స్టెనోసిస్,
     రోగుల 60% లో ఒక ద్విపత్ర కవాట పుపుస,
     రోగుల 25% లో కుడి వైపు సంబంధ వంపు,
     రోగుల 10% హృదయ ధమనుల క్రమరాహిత్యాలు,
     సిండ్రోమ్ కొన్నిసార్లు Fallot ఒక pentalogy  అని పిలుస్తారు, ఈ సందర్భంలో ఒక రంధ్రము అండాకార వర్తులము లేదా ధమని భాగాలలో లోపం,
     ఒక జఠరికల భాగాలలో లోపం
     పాక్షికంగా లేదా పూర్తిగా క్రమరహిత పుపుస సిర తిరిగి
     పంగలుగల పక్కటెముకలు మరియు పార్శ్వ-అదనపు క్రమరాహిత్యాలు

అదనంగా, Fallot యొక్క నాలుగు అంశముల గ్రూపు లేదా వరుస ఇతర శరీర నిర్మాణ సంబంధమైన క్రమరాహిత్యాలు, తో ఉండవచ్చు:

     రోగుల 40% లో ఎడమ పుపుస ధమని యొక్క స్టెనోసిస్,
     రోగుల 60% లో ఒక ద్విపత్ర కవాట పుపుస,
     రోగుల 25% లో కుడి వైపు సంబంధ వంపు,
     రోగుల 10% హృదయ ధమనుల క్రమరాహిత్యాలు,
     సిండ్రోమ్ కొన్నిసార్లు Fallot ఒక pentalogy  అని పిలుస్తారు, ఈ సందర్భంలో ఒక రంధ్రము అండాకార వర్తులము లేదా ధమని భాగాలలో లోపం,
     ఒక జఠరికల భాగాలలో లోపం
     పాక్షికంగా లేదా పూర్తిగా క్రమరహిత పుపుస సిర తిరిగి
     పంగలుగల పక్కటెముకలు మరియు పార్శ్వ

అదనపు క్రమరాహిత్యాలు

అదనంగా, Fallot యొక్క నాలుగు అంశముల గ్రూపు లేదా వరుస ఇతర శరీర నిర్మాణ సంబంధమైన క్రమరాహిత్యాలు, తో ఉండవచ్చు:

     రోగుల 40% లో ఎడమ పుపుస ధమని యొక్క స్టెనోసిస్,
     రోగుల 60% లో ఒక ద్విపత్ర కవాట పుపుస,
     రోగుల 25% లో కుడి వైపు సంబంధ వంపు,
     రోగుల 10% హృదయ ధమనుల క్రమరాహిత్యాలు,
     సిండ్రోమ్ కొన్నిసార్లు Fallot ఒక pentalogy  అని పిలుస్తారు, ఈ సందర్భంలో ఒక రంధ్రము అండాకార వర్తులము లేదా ధమని భాగాలలో లోపం,
     ఒక జఠరికల భాగాలలో లోపం
     పాక్షికంగా లేదా పూర్తిగా క్రమరహిత పుపుస సిర తిరిగి
     పంగలుగల పక్కటెముకలు మరియు పార్శ్వ

Treatment:
 దీనికి సరియైన చికిత్సఆపరేషన్‌ ఒక్కటే . ముందుగా సైనోటిక్ స్పెల్స్ కి , ఆయాసానికి ,
బీటాబ్లోకర్ - ప్రొప్రనాల్ ఇస్తారు.
మార్ఫిన్‌ to reduce ventilatory drive ,
vaasopressor ఎపినెఫ్రిన్‌ , నార్ ఎపినెఫ్రిన్‌ ... బ్లడ్ ప్రెజర్ సరిచేయడానికి ,
ఆక్షిజన్‌ - అవసరము ఎల్లప్పుదూ ఉంటుంది ,
 బేబీ ని  స్క్వాటింగ్ లేదా knee -chest position లో ఉండేటట్లు చూడాలి . ఇది Aortic wave reflection ను , బ్లడ్ ప్రజర్ ఎడమ గుండె కు ఎక్కువచేయడము లోనూ, కుడి నుండి ఎడమ సంట్ ను తగ్గించుటలోనూ సహకరించును .
సర్జరీ ద్వారా గుండె రంద్రాన్ని పూడ్చగలగాలి .

 • =========================================
Visit my website - > Dr.Seshagirirao.com/