Sunday, November 18, 2012

parkinson's disease-పార్కిన్‌ సన్‌ వ్యాధి


  • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పార్కిన్‌ సన్‌ వ్యాధి- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


పార్కిన్‌ సన్‌ వ్యాధి ని ''పారాలైసిస్  ఎజిటాన్స్'' , ''షేకింగ్ పాల్సీ''  అని కూడా అంటారు . ఇది మెదడు లోని నరాలు క్షీనించడము వలన లేదా చనిపోవడము వలన కలుగుతుంది . పార్కిన్‌ సన్‌ వ్యాధి సోకిన వాళ్ళకి మెదడులోని కణజాలాలు

క్రమక్రమంగా క్షీణించి నశించడం వల్లే ఆ వ్యాధి గ్రస్థులు జీవశ్ఛవా లుగా మారిపో తారనడా నికి క్యూబా అధినేత ఫైడెల్‌ కాస్ట్రో ఒక సజీవమైన ఉదాహరణ.

లక్షణాలు :
పార్కిన్‌ సన్‌ వ్యాధి మెదడు పనితీరును మార్చేటు వంటిది . కండరాల చురుకుదనము తగ్గిస్తుంది , వనుకు ,బిగుసుకుపోవడము , మలిదశలో శరీరము అదుపు తప్పిపోవడము  జరుగుతుంటాయి . కనురెప్పలు తక్కువగా కొట్టుకోవడము , మలబద్దకము , మింగడము కష్టమవడము , చొంగ కార్చడము , నడక , శరీరము బ్యాలెన్‌స్ లో సమస్యలు , ముఖములో భావాలు పలకకపోవడము , కండరాల నొఫ్ఫులు మున్నగునవి.

 ఇది 50 యేళ్ళ వయసు తరువాత  సాధారణము గా వస్తుంది. అరుదుగా పార్కిన్‌ సన్‌ జబ్బు యవ్వనములోనూ రావచ్చు . పిల్లలలో అత్యంత అరుదు . స్త్రీ ,పురుషులిద్దరికీ వస్తుంది. కొన్ని కుటుంబాలలో ఈ వ్యాధి వంశపారంపర్యం . చిన్న వయసులో ఈ వ్యాధి బారిన పడితే అది వంశ పారంపర్యమే అవుతుంది.
ఇప్పటి వరకు పార్కిన్‌సన్‌ వ్యాధి సోక డానికి కార ణమేమిటో, వైద్య శాస్త్రవేత్తలకి కూడా అంతు చిక్క లేదు. కానీ, ఇటీ వల 'యూనివర్శిటీ ఆఫ్‌ టెక్సాస్‌ హెల్త్‌ సైన్స్‌ సెంటర్‌'కి చెందిన పరిశోధకులు, 'న్యూరాన్స్‌' అనే మెదడులోని కణజాలాలు మరణించడం వల్లే పార్కిన్‌సన్‌ వ్యాధి ప్రబలిపోతుందని వెల్లడించారు. న్యూరాన్స్‌ నశించే ప్రక్రియని నివారించడంతో, పార్కిన్‌సన్‌ వ్యాధి తగ్గు ముఖం పట్టిందని కూడా తెలుసు కున్నారు. ఇప్పటిదాకా శరీరం వణకడం, కంతులు పెరగడం, శరీర భాగాల
చలనం మందగించడం, కండరాలు బిరుసెక్కడం, సంతులనం కోల్పోవడం వంటి లక్షణాలకి తాత్కాలి కంగా చికిత్స జరపడానికి అలవాటు పడిన వైద్య నిపుణులకి మెదడులోని న్యూరాన్స్‌ కణాలని పునరుద్దరించడం వల్ల పార్కిన్‌సన్‌ వ్యాధి నివారించవచ్చుననే కీలకమైన విషయం తెలిసిరావడం వినూత్న వైద్యప్రక్రియలో విప్లవాత్మకమైన విషయమే!

జబ్బు వచ్చే విధారనము : కండరాల కదలికకు నాడీకణాలు మెదడులో ఉత్పత్తి అయ్యే  " డోపమైన్‌" రసాయనము ఉపయోగిస్తాయి. డోపమైన్‌ తయారుచేసే  మెదడు కణాలు నెమ్మదిగా నశించినపుడు పార్కిన్‌ సన్‌ వ్యాధి వస్తుంది . డోపమైన్‌
లేకుంటే మెదడులోని ఆ భాగం లోని కణాలు సక్రమముగా సందేశాలు పంపలేదు . దీనివలన కండరాలు పనిచేయవు . కాలముతో అవి మరింత దెబ్బతింటాయి. మెదడు కణాలు ఎందుకు పాడవుతాయో స్పస్టము గా ఇంతవరకూ తెలియదు.
పార్కిన్‌సోనిజమ్‌ అనేది ఇతర అనారోగ్యాల వలన (సెకెండరీ పార్కిన్‌సోనిజం అంటారు) , లేదా కొన్ని మందుల వల్ల కూడా  రావొచ్చును.


పరీక్షలు : ఖచ్చితమైన లేబురిటరీ పరీక్షలంటూ ఎమీ లేవు . డోపమైన్‌ ఇచ్చి మనిషి యాక్టివిటీ లో మార్పులు గమనించడము , బ్రెయిన్‌ స్కానింగ్ , MRI స్కానింగ్ , వంటివి కొంతవరకు ఉపయోగ పడును.  Dopaminergic function in the basal ganglia can be measured with different PET and SPECT radiotracers. Examples are ioflupane (123I) (trade name DaTSCAN) and iometopane (Dopascan) for SPECT or fluorodeoxyglucose (18F) for PET. A pattern of reduced dopaminergic activity in the basal ganglia can aid in diagnosing PD.


చికిత్స : చికిత్స చేయించకపోతే రోగము ముదిరి రోగి పూర్తిగా అశక్తుడైయి పోతాడు . న్యుమోనియా వలన ఎక్కువ మరణాలు  సంభవిస్తాయి. ఎక్కువ మంది మందులకు స్పందిస్తారు .మందుల వలన రోగ లక్షణాలు ఏ మేరకు తగ్గుతాయి , ఎంతకాలము తగ్గిఉంటాయి అనేది రోగులందరిలో ఒకేలా ఉండదు .


మందులు : డోపమైన్‌ , ఫిన్‌డోఫా , ప్రమిక్సోల్ , రోఫిన్‌రోల్ , బ్రోమోక్రిప్టిన్‌ , సెలిజిలిన్‌ , రసాజిలిన్‌ , ఎంటకెఫోన్‌ , ఎమాంటిడిన్‌ మున్నగు మందులు వాడుతారు. మేధకు , మూడ్ మార్పుకు , బాధ , నిద్రలో ఇబ్బంది తగ్గుముఖం పడతాయి. పారికిన్‌సన్‌ వ్యాధి  తగ్గుదలకు జీవనవిధానము లో మార్పులు మేలు చేస్తాయి.  ఉదా: మింగడానికి సమస్యలుంటే ఆహారము దరవరూపలో ఇవ్వాలి , ఒత్తిడికి దూరముగా , తగినంత విశ్రాంతి , ఫిజియో తెరఫీ , స్పీచ్ థెరఫీ , ఇంట్లో నడిచేందుకు , పడిపోయి దెబ్బలు తగలుకుండా బాత్ రూమ్‌ , ఇంట్లో ఇతర ప్రదేశాలలో తగిన మార్పులు , ప్రత్యేకమైన ఆహార పాత్రలు , చక్రాల కుర్చీ , వాకర్స్ , స్నానాల కుర్చీ, మంచం మీదకు చేర్చే లిఫ్ట్ వంటివి అమర్చుకోవాలి.


ఇతర చికిత్సలు : కొందరికి మెదడు లో ఆపరేషన్‌ చేయడము ద్వారా కొన్ని కణాలు తొలగించడము , మూల కణాల మార్పిడి , ప్రత్యేక బాగాలకు ' షాక్ ' ఇవ్వడము ద్వారా పార్కిన్‌సన్‌ వ్యాధి లక్షణాలను తగ్గించవచ్చును.

పార్కిన్సన్‌ జబ్బు వణుకుడుకు నికోటిన్‌ ఉండే కూరగాయలు

పార్కిన్సన్‌ జబ్బు బారినపడ్డవారికి తల, చేతులు, కాళ్లు అదేపనిగా వణుకుతుంటాయి. కాళ్లు చేతులు బిగుసుకుపోవటం, శరీర నియంత్రణ కోల్పోవటంతో పాటు కదలికలూ తగ్గిపోతాయి. మెదడులో డోపమైన్‌ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసే కణాలు తగ్గిపోవటం ఈ జబ్బుకు దారితీస్తుంది. అయితే సహజసిద్ధంగా నికోటిన్‌ గల పచ్చిమిర్చి, క్యాప్సికమ్‌, టమోటా, బంగాళాదుంప వంటివి తరచుగా తినేవారికి ఈ వ్యాధి ముప్పు మూడోవంతు వరకు తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. పొగాకు వినియోగానికీ పార్కిన్సన్‌ ముప్పు తగ్గటానికీ సంబంధం ఉంటున్నట్టు గతంలో వెల్లడైంది. ఇందుకు పొగాకులోని నికోటిన్‌ దోహదం చేస్తుండొచ్చని భావిస్తున్నారు. అందుకే సహజసిద్ధంగా నికోటిన్‌ ఉండే కూరగాయలు పార్కిన్సన్‌ జబ్బుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అనేదానిపై వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం చేశారు. వీటిని తరచుగా తినేవారికి ఈ జబ్బు ముప్పు తగ్గుతున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా ఇంతకుముందు పొగాకు అలవాటు లేనివారికి మరింత రక్షణ కల్పిస్తున్నట్టు కనుగొన్నారు.

source : Wikipedia.org/
  • ======================

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.