Wednesday, November 7, 2012

Painful Urination(Cystitis)-మూత్ర విసర్జనలో బాధ(సిస్త్టెటిస్)

 [Urinarytract.jpg][Urine+flow.jpg]

  • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Painful Urination(Cystitis)-మూత్ర విసర్జనలో బాధ(సిస్త్టెటిస్)-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మూత్రవ్యవస్థలో ప్రధానంగా మూడు భాగాలుంటాయి. 1. మూత్రపిండాలు. ఇవి రక్తాన్ని వడగట్టి మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. 2. మూత్రకోశం. మూత్రపిండాల్లో తయారైన మూత్రం.. విసర్జనకు ముందు దీనిలో నిల్వ ఉంటుంది. 3. మూత్రమార్గం. దీని ద్వారా మూత్రం బయటకు విసర్జితమవుతుంది. వీటిలో మూత్రకోశం ఇన్ఫెక్షన్‌కు గురవటాన్ని 'సిస్త్టెటిస్‌' అంటారు.

పురుషులకన్నా స్త్రీలు తేలికగా ఈ రుగ్మత బారినపడుతుంటారు. దీనికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి. పురుషులకన్నా స్త్రీలలో మూత్రమార్గం పొడవు చాలా తక్కువ. గర్భధారణ సమయంలో పిండం తల మూలంగా ఇది సాగి ఉండడం రెండవ కారణం. స్త్రీలలో మూత్రమార్గం.. మలవిసర్జన ద్వారానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ కారణాల మూలంగా ఈ-కోలై క్రిములు మూత్రకోశంలో చోటుచేసుకుని తరచుగా సిస్త్టెటిస్‌కు గురికావడం జరుగుతుంది.

మూత్రకోశంలో చోటు చేసుకున్న ఇన్ఫ్‌క్షన్‌ పైన ఉన్న మూత్రపిండాలకు కూడా సోకటం చాలా తీవ్రమైన వ్యాధి. పెద్దపెట్టున జ్వరం, చలి, నిస్త్రాణ   చోటుచేసుకుంటాయి.  మూత్రాశయం ఇన్ఫెక్షన్‌కు గురైనప్పుడు మాటిమాటికీ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావటం, విసర్జన సమయంలో మంట, తెలియకుండానే మూత్రంపడిపోతుండటం వంటి లక్షణాలు అధికంగా కనబడుతుంటాయి. అయితే కొన్నిసార్లు అత్యుత్సాహంగా రతి సల్పిన కేసుల్లో కూడా మూత్రకోశం ఇన్ఫెక్షన్‌కు గురికావచ్చు. నూతన దంపతులు ఈ బాధకు తరచూ గురికావడం జరుగుతుంది. దీనినే ''హనీమూన్‌ సిస్త్టెటిస్‌'' అంటారు.

కార్యకారణ సంబంధాలను పరిశీలించేటప్పుడు,  ప్రత్యక్ష కారణాలకేగాక పరోక్ష కారణాలు గూడా ప్రాముఖ్యత సంతరించుకొంటాయి.   వయస్సు, లింగభేదం, కుటుంబ, వృత్తి సామాజికపరమైన ఒత్తిళ్ళు, మానసిక, శారీరక స్థితిగతులు, సెక్స్‌ పరమైన ధర్మాలు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకొంటాయి.

Treatment :

నీరు ఎక్కువగా త్రాగాలి,
Tab . Urispas 1 tab 3 time /day  for 7-10 days,
Tab . Mahacef plus 1 tab 2 times /day for 7-10 days.
Liq. Alakaline citrate .. 10 ml mixed with 100 ml of water 3time/day
Tab . Supradyn  1 tab daily for 10-15 days .
Rest for 7-10 days .
Avoid sexual activities for 10 days.
Avoid spicy foods like Biriyani.
  • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.