Tuesday, November 20, 2012

Food Restrictions in Diabetic controle-ఆహార నియమాలతో మధుమేహ నివారణ

  •  
  • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Food Restrictions in Diabetic controle-ఆహార నియమాలతో మధుమేహ నివారణ - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ... 
   

డయాబెటిస్‌ వ్యాధికాదు డిజైస్టివ్‌ డిజార్డర్‌. దీన్ని ఇలాగే వదిలేస్తే శరీరంలోని అన్ని అవయవాలు దెబ్బతింటాయి. మధుమేహానికి పాటించాల్సి ఆహార నియమాలు....

- మధుమేహ నివారణకు అతిముఖ్యమైనది ఆహారనియమము.- మధుమేహా రోగి గోధుమ, రాగి తప్ప వరి అన్నము తినరాదు అనేది కేవలం అపోహ మాత్రమే. వరి, గోధుమ, రాగి, జిన్నలు, సజ్జలు మొదలైనవాటిలో 70 శాతం పిండి పదార్ధం ఉంది. ఏ ధాన్యమైనా ఎంత పరిమాణంలో తీసుకోవలెను అన్నది ముఖ్యమైనది.
- పప్పుదినుసుల నుండి లభించే ప్రోటీనులు, మాంసాహారం నుండి లభించే ప్రోటీనుల కంటే మేలైనవి. ధాన్యాలు, పప్పులు కలిపి తీసుకున్న ఆహారం ప్రోటీన్ల శాతాన్ని పెంచుతుంది. పుట్టగొడుగులలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటూ, తక్కువ కేలరీలు ఉంటాయి. కాబట్టి కాబట్టి పుట్టగొడుగులను తీసుకోవచ్చు.
- నార (పీచు) అధికంగా ఉండే ఆహారపదార్థాలు మధుమేహా నివారణలో, రక్తంలో కొవ్వు పదార్థాలను తగ్గించటంలోను ఉపయోగపడతాయి. అన్ని పప్పు దినుసులలో (పచ్చిపెలు, శనగలు, బఠాణి, అలసందులు మొదలైనవి) ఆకుకూరలు, కూరగాయలలో నార అధికంగా ఉంటుంది.
- మొలకెత్తిన మెంతులు, పొడి చేసిన మెంతులలో పీచు పదార్థము ఎక్కువగా ఉంటుంది. వీటిని, చికిత్సకు సహాయకారిగా తీసుకోవచ్చు.
- పుల్కాలు, కూరగాయలు, పప్పులు చాలా తక్కువ నూనెతో తీసుకోవాలి. వేపుడు పదార్థాలని తీసుకోకూడదు. సమయం ప్రకారమే ఆహారాన్ని తీసుకోవాలి.
- కడుపు నిండా ఆహారాన్ని తీసుకోకూడదు, అలాగే తినకుండా కూడా ఉండకూడదు. నాలుగు గంటలకు ఒకసారి తగుమాత్రంగా ఆహారం తీసుకోవాలి.

  • మధుమేహంవున్న వారు ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహారపదార్థాలు.....
- తెల్లగుమ్మడి, సొరకాయ, వంకాయ, బెండకాయ, దోసకాయ, ముల్లంగి, బెంగుళూరు వంకాయ అరటిపువ్వు, ములగకాయ, గోరుచిక్కుడు, కొత్తిమీర, పొట్ల కాయ, టమాట, ఉల్లిపాయలు, క్యాబేజి, బీన్స్‌, అల్లం, అన్ని రకాల ఆకుకూరలు,కరివేపాకు, పుదీనా, బొప్పాయి (పచ్చి) తదితర కూరగాయలు తినవచ్చు.

  • నిషేధించవలసిన ఆహార పదార్థాలు :-
- చక్కెర, తేనే, గ్లూకోజ్‌, జామ్‌, బెల్లం, తీపి వస్తువులు, కేకులు, పేస్ట్రీలు, లేతకొబ్బరినీరు, టెంకాయ (కొబ్బరి), చల్లనిపానియాలు, మిత్తు (సారాయి), పానియము, హార్లిక్స్‌, బూస్ట్‌ ,బోర్న్‌విటా, కాంప్లాన్‌, ఖర్జురం, అత్తి, ద్రాక్ష (ఎండినవి) మొదలైనవి.వీటిలో కార్భోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల తీసుకోకూడదు. బంగాళదుంప, కంద, చేమ, చిలకడదుంప మొదలైనవి తినకూడదు. క్యారెట్‌, బఠానీలు, బీట్‌రూట్‌, డబుల్‌బీన్స్‌ మితంగా తీసుకోవాలి.
- నీళ్ళు ఎక్కువగా తాగాలి.
-చేపలు తింటే మంచిది .
  • ===================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.