- ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మంచి ఆరోగ్యానికి నవ నవీన సూత్రాలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
One principles for good health-మంచి ఆరోగ్యానికి ఒకే ఒక సూత్రము .
1 . ఈర్ష్య- ద్వేషాలు లేకుండుట ( జీవితము ప్రశాంతముగా మనసులో కుళ్ళు కపటము లేకుండుట) ,
Two principles for life long fitness- జీవితాంతము ఫిట్ గా ఉండడానికి రెంటు సూత్రాలు :
1 . రోజూ క్రమము తప్పకుండా పగలు వ్యాయామము (exercise) చేయుట .
2 . రోజూ క్రమము తప్పకుండా రాత్రి సురక్షిత సంభోగము (sexercise) చేయుట .
Three principles for Feel-good-రోజంతా హుసారుగా , ఆనందముగా ఉండేందుకు మూడు సూత్రాలు :
1 . నిద్ర : ఎంత నిద్ర అవసరమో ముందుగా గుర్తుంచుకోవాలి . అందరికీ ఒకే గంటల నిద్ర సూత్రము వర్తించదు . ఒక్కోసారి ఒకే వ్యక్తికి నిద్రకు సంబందించిన తేడాలూ ఉందొచ్చు . నిద్రపోయే సమయము , సహజము గా లేచే సమయము నోట్ చేసుకోవాలి . ఇలా కనీసము ఓ వారం చేయాలి. అప్పుడు రాత్రి వేళ సగటునిద్ర సమయము తెలుస్తుంది. ఆ సగటు సమయమే శరీరానికి కావాలి . సారీరక సహజనిద్ర ప్రకక్రియ పట్ల అవగాహన ఉండాలిం.
2 . పానీయాలు : శరీరం లో నీటి కొరత ఏర్పడితే మాడ్ మారిపోతుంది. ఓ రెండు రోజులపాటు తాగే నీటిపై కన్నేయాలి . పానీయాలు ఆరొగ్యవంతమైనవి కావాలి. అలా అని అవసరం మించిన దానికంటే ఎక్కువ నీరు తాగితే శారీరకవ్యవస్థ నుండి ప్రధాన లవణాలు వెలికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. రోజుకు 1.5 నుండు 2.0 లీటర్ల పానీయాలు సగటు మోతాదు.
3 . కదలిక & విశ్త్ర్రాంతి : ఎప్పుడు అదేపనిగా కదలకుండా ఏపనీ చేయకూడదు . పనినో ప్రతి గంటకు ఓ 5 నిముషాలు రిలాక్షేషన్ అవసరము . ఉదయమా ? సాయంత్రమా? అన్న సంగతి ప్రక్కన పెడితే రెగ్యులర్ శారీరక వ్యాయామము మెదడుకు(మనసుకూ), శరీరానికి ఉత్తేజాన్నిస్తుంది. వ్యాయామము ఏదైనా .. వారి వారి వృత్తులకు సరిపడే సరియైన విధముగా ఉండాలి. నడక , సైక్లింగ్ , స్విమ్మింగ్ , ఆటలు మున్నగునవి . నలుగురితో పిచ్చాపాటి కాలక్షేప కబుర్లు కోసము కొంతసమయము కేటాయించాలి.
4-principles to getrid off cold and sinus-జలుబు, సైనస్‌లను వదిలించుకునేందుకు 4-చిన్న సూత్రాలు.
నేటి గజిబిజి పరుగుల జీవితంలో మానవుడు సవాలక్ష రోగాలతో సతమతమవుతుండగా ఎక్కువగా శ్వాస సంబంధిత వ్యాధులతో భాదపడుతున్నాడు. కారణం వాతావరణ కాలుష్యం ఒకటయితే మిగిలినవి అనేకం. ప్రతిగా తరచుగా జలుబు, సైనస్ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. వీటిని చిన్న చిన్న సూత్రాలతో క్రమంగా తగ్గించుకోవచ్చును .
1. తడిగా ఉన్న తలతో ఫ్యాన్ కింద కూర్చోవడం, వాహనాలలో ప్రయాణించేటపుడు ముక్కుకు కాటన్ వస్త్రాన్ని కట్టుకోవడము చేయండి.
2. ప్రతిరోజు పది నిమిషాల పాటు సూర్య కిరణాలు మీపై పడేలా కూర్చోండి.
3. బయట ఆహార పదార్ధాలు తింటే ఓ గ్లాసు గోరువెచ్చని నీటిని త్రాగండి.
4. నిద్ర పోయేప్పుడు మీ తలను పూర్తిగా కప్పుకోండి.
Five Principles for Perfect beauty-మంచి ముఖారవిందానికి పంచ సూత్రాలు .
1.నారింజ తొక్కలను నీడలో ఆరబెట్టి, పొడి చేసి నీటితో కలిపి ముఖానికి రాస్తే, మొటిమలు, జిడ్డుకారడం తగ్గుతాయి.
2.పళ్ళు శుభ్రంగా తెల్లగా ఉండాలంటే వాటిని టేబుల్‌సాల్ట్‌తో కానీ, బేకింగ్ సొడాతో కానీ తోముకోవాలి.
3. గాలి తగిలేలా మూడు రోజులు (పులిసిన) నిల్వ ఉంచిన పెరుగును తలకి బాగా మర్దన చేసి కొన్ని నిమిషాల తరువాత స్నానం చేస్తే చుండ్రు పోతుంది.
4.జిడ్డుగా ఉన్న ముఖానికి ఆపిల్ గుజ్జును పట్టించి పావుగంట తరువాత కడుక్కుంటే జిడ్డు ఒదిలి బుగ్గలు ఆపిల్ పళ్ళలా తయారవుతాయి.
5. వేయించిన పదార్థాల కంటే ఉడికించిన పదార్థాలు తేలికగా జీర్ణమవుతాయి. శరీరం లావెక్కదు కూడా , మంచి శరీరక అందము పొందుతారు .
Six Diet Tips for Fitness Secret-ఆరు-ఆహార ఫిట్ నెస్ సీక్రెట్స్ :
ఎవరైనా స్లిమ్ గా, ఫిట్ గా ఉండేందుకు 6 సూత్రాలు పాటించాలంటుంది. నిజానికి ది చాలా సింపుల్. ముందుగా చేయాల్సిందల్లా
1 . రాత్రి భోజనం ఏడు నుండి ఎనిమిది గంటలోపే ముగించేసేయాలి. రాత్రి వేళ శారీరక జీవక్రియ నెమ్మదిస్తుంది. రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారు. యుఎస్ లో ప్రజలు చాలా త్వరగా డిన్నర్ చేసేస్తారు. ఇండియాలో ప్రజలు రాత్రి తొమ్మిది గంటలయితే కానీ భోజనం చేయరు.
2 . రెండో సీక్రెట్- ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఏడు నుండి ఎనిమిదిలోపే తినేయాలి. అప్పుడు శారీరక మెటబాలిజం ఊపు అందుకుంటుంది. దాంతో రోజంతా హుషారుగా ఉండేందుకు జీవక్రియ బాగా పనిచేస్తుంది. ఉదయం ఎంత త్వరగా ఎంత ఎక్కువ మోతాదులో బ్రేక్ ఫాస్ట్ ముగిస్తే అంత మంచిది.
3 . మూడో సీక్రెట్ -మంచినీళ్ళు వీలయినంత ఎక్కువగా తాగడం. నీళ్ళు తాగడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది భావించడం సరికాదు. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని విషతుల్యాలన్నీ వెలికి వెళ్ళిపోతాయి. రోజుకు కనీసం మూడు లీటర్ల నీటినైనా తాగుతుండాలి.
4 . అందం ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందని, ఆత్మ విశ్వాసము మానసిక అనారోగ్యాన్ని రానీయదు . అందము కోసము తాజా పండ్లు తినాలి . ఫ్యాషన్‌లో అందం కూడా భాగమేనన్నారు. అందం రెట్టింపుకోసం బ్యూటీ సెలూన్స్ ఎంతో ఉపయోగమన్నారు.
5. పాలు , విటమిన్ డి3 ఉన్న ఆహారపదార్ధాలు ఎక్కువగా తినాలి. విటమిన్ డి3 గుండె జబ్బులు, మదుమేహము , రక్తపోTu నివారించడము లేదా రాకుండా కాపాడుతుంది.
6. ఒమేగా3 ఫాటీయాసిడ్స్ కోసము సముద్ర చేపలు , లైకొఫిన్ కోసము టమాటోలు రెగ్యులర్ గా తీసుకోవాలి. విటిమిన్లు, ఖనిజలవనాలకోసం ఆకుకూరలు తినాలి.
Seven Principles Happy Living -ఆహ్లాదకర జీవితానికి ఏడు సూత్రాలు.
మనకు ఎంత ఐశ్వర్యం వుంది? నెల తిరిగేటప్పటికి ఎంత ఆదాయం వస్తుంది ? అనేవి కాదు ముఖ్యం. మనం ఎంత ఆరోగ్యంగా, ఎంత నాజూకుగా ఉన్నామనేది ఆరోగ్యాన్ని పొందటంలో కల రహస్యం. మన ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషించేది ఆహారం. ఆహారం విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి దినం వ్యాయమం చేస్తూ వుంటే బంగారం లాంటి జీవనం మన సొంతం అవుతుంది. అందుకోసం నిపుణులు సూచిస్తున్న మార్గాలు చూడండి.
1. ప్రతి రోజు మూడు పూటలా కొద్ది మోతాదులో అవసరం మేరకే ఆహారం తీసుకోవాలంటున్నారు.రోజుకు రెండు సార్లు లేదా మూడు సార్లు భోజనం చేయడంతో పాటు డ్రై ఫ్రూట్స్ లేక తాజా పండ్లు లేక ఉడక పెట్టని కూరగాయలు స్నాక్స్ గా తీసుకోవాలని తెలుపుతున్నారు.
2. ఆహారంలో రోజుకు కనీసం 500 గ్రాముల పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోండి. ఇందులో రెండు నుంచి నాలుగు తాజా పండ్లు ఉండాలి. పెసలు, శనగలు, మొదలగు తృణ ధాన్యాలతోపాటు పెరుగు, ఫ్రూట్ సలాడ్లను కూడా తీసుకోవచ్చు.
3. ఆహారంలో పీచు పదార్ధాలు అధికంగా వుండేలా చూసుకోండి. దీని వలన రోజంతా మీరు శక్తివంతంగా ఉండగలుగుతారు. పీచు పదార్ధాలు తీసుకోకుండా వుంటే మధుమేహం వంటి వ్యాధులు వచ్చే అవకాశముంది. నూనెలో వేయించిన ఆహార పదార్ధాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.
4. కొవ్వు చేరని ఆహార పదార్ధాలు తీసుకోండి. 100 గ్రాముల పాల ఉత్పత్తులలో మూడు గ్రాముల కొవ్వు ఉంటుంది. అందువల్ల కొవ్వు తక్కువ ఉన్న పాల పదార్ధాలతో పాటు స్కిన్ లేని చికెన్ లాంటివి తీసుకుంటే మంచిది.
5. మాంసాహారులయితే, వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు చేపలు తీసుకోండి. శాకాహారులు చిరుధాన్యాలు అధికంగా తీసుకోవచ్చు. దీనికి మించిన పోషకాహారం మరోటి లేదని కూడా చెప్పవచ్చు.
6. మీరు తీసుకునే ఆహారంలో ఉప్పు, చక్కెర అతి తక్కువగా ఉండేలా చూడండి. సోడియం రోజుకు 2,300 మిల్లీగ్రాములు అంటే ఒక టీ స్పూన్ కు మించకుండా వుండేలా జాగ్రత్త పడండి. ఉప్పు అధికంగా వుండే పదార్ధాలు తినకపోవడం మంచిది.
7. అన్నిటిని మించి ప్రతి దినం ఒక గంట పాటు శారీరక వ్యాయామం చేయాలి.
పైన తెలిపిన పనులన్నీ చేయడం ద్వారా ఏ వయసు వారైనా సరే, రోజంతా చురుగ్గా ఉండటమే కాక నాజూకుగా, ఆరోగ్యంగా తిరుగుతూ అందరిని ఆశ్చర్య పరచవచ్చు.
8(Eight) Ayurvedhic principles for health-ఆరోగ్యానికి ఎనిమిది ఆయుర్వేధ సూత్రాలు:
మన ఆయుర్వేధ మహర్షులు ఎన్నో సంవత్సరాలు ఎన్నో పరిశోధనలు జరిపి క్రింద తెలుపబడిన ఆరోగ్య సూత్రాలను మానవులకు ఉపయోగకరం అని మన ఆయుర్వేధ గ్రంధాలలో పేర్కొన్నారు. ఎవరైతే ఈ ఆయుర్వేధం తెలుపబడిన ఆరోగ్య సూత్రాలను పాటిస్తారో వారు ఎల్లపుడూ అనారోగ్యం బారిన పడకుండా నిత్య ఆరోగ్య వంతులుగా ఉంటారు.
1 . తెల్లవారు జామున లేవడం ,
2 . వ్యాయామాలు చేయడం ,
3 . అబ్యంగా స్నానం ,
4 . మితాహారం సేవన ,
5 . పగలు నిధ్రపోకుండుట ,
6 . రాత్రి జాగరణ చేయకుండుట ,
7. చల్నీటి స్నానము ,
8 . తీపి , ఉప్పు ,కారము మితముగా తినడము .
మొదలగు వాటివని పాటించుటవలన వ్యాధులు రాకుండా నివారించవచ్చు.
9 Best Easy Ways Lose Weight-సన్నగా... నాజూకుగా తయారవ్వడానికి 9 సూత్రాలు:
సన్నగా నాజూకుగా ఉండాలని ప్రతి ఆడపిల్ల కలలు కంటూ వుంటుంది. దాని కోసం పడరాని పాట్లన్నీ పడుతుంటుంది. అయితే మనం తినే ఆహార పదార్థాలలో చిన్న చిన్న మార్పుల ద్వారా సన్నగా ట్రిమ్గా తయారవ్వచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి తీసుకునే డిన్నరు వరకూ ఆహారంలో కొవ్వు తగ్గించుకుంటే సన్నబడడం పెద్ద కష్టమేమీ కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది... అవేమిటంటే...
1 . జీవన విధానంలో మార్పు: ఫాస్ట్ ఫుడ్ అభివృద్ది చెందిన తర్వాత పిజ్జాలు, బర్గర్లపై మోజు ఎక్కువైపోయింది. దీనికి తోడు ప్రతి సెంటర్లోనూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు దర్శనమిస్తున్నాయి. అందమైన ప్యాకింగులలో నోరూరిస్తుంటే వాటిని తినకుండా వుండలేకపోతున్నారు యువతరం. ఫాస్ట్ ఫుడ్ అప్పటికప్పుడు కడపునింపినా వాటిల్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది.
2 . ఆహారంలో మార్పులు : రోజు మొత్తంలో తీసుకునే ఆహారంలో నూనె, నెయ్యి వాడకం తగ్గించాలి. ఇవి రెండూ లేకుండా చేసిన ఆహారం అయితే మరీ మంచిది. అంటే ఉడికించిన కూరగాయలు, నూనె తక్కువగా వేసి చేసిన ఆకు కూరలు అయితే తేలికగా జీర్ణం కావడంతో పాటు పోషకవిలువలు పుష్కలంగా లభిస్తాయి. ప్రకటనలు చూసి మోసపోవద్దు -టీవిలలో, పేపర్లలో వచ్చే ప్రకటనలు చూసి మోసపోవద్దు. కంటికి పైన రంగుల్లో ఆకర్షనీయమైన ప్యాక్ లలో కనువిందు చేసే ఆహారపదార్థాలు నోరూరించినా వాటిల్లో పోషక విలువలు ఏమాత్రం లేకపోగా ఆరోగ్యానికి హానిచేసే కొవ్వు అధికంగా వుంటుంది. చూసిన ప్రతిదానిని తినాలనుకోవడం మానుకోవాలి.
3 . వ్యాయామం : వాకింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్, తోటపని ఇవన్నీ ఆడవారు చేయగలిగే వ్యాయామాలు. వీటిల్లో వాకింగ్ కోసమే బయటకు వెళ్లాలి. మిగతా మూడు ఇంట్లో వుండి చేసుకునే ఎక్సర్ సైజులు. మూడింటిని చేయలేకపోయినా ఏదో ఒకటి చేసినా మంచి ఫలితం ఉంటుంది.
4 . టీవిలకు దూరంగా వుండండి : అన్నం తినేటప్పుడు టీవి చూడడం చాలా మందికి అలవాటు. అసలు అన్న తినేటప్పుడు పుస్తకాలు చదవడం, పేపరు చదవడం లాంటివి మానుకోవాలి. తినే సమయంలో ఇలాంటి పనులు చేస్తుంటే ఎంత తింటున్నారో తెలియకుండా తినేస్తారు.
5 . తాజా కూరగాయలు, పళ్లు : ఫ్రిజ్ లో నిల్వ వుంచిన కూరగాయలకన్నా తాజా కూడరగాయలు మంచివి. రోజు మొత్తం మీద ఐదు రకాల కూరగాయలు, పళ్లు తీసుకుంటే కొవ్వు అనేది మీ దరిచేరదు. వైద్యుడి అవసరం రాదు.
6 . డ్రస్సులు : మనం వేసుకునే డ్రస్సులు కూడా ఊబకాయాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి. లావుగా వున్న వారు మరీ బిగుతుగా ఉండే దుస్తులకన్నా కొద్దిగా వదులుగా వుండేవాటిని ధరిస్తే లావుగా కనపడరు. వీరికి చిన్న చిన్న డిజైన్లు బాగా నప్పుతాయి.
7 . ఆహారాన్ని విభజించండి : రోజు మొత్తం మీద తీసుకునే ఆహారాన్ని ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ గా విభజించుకోవాలి. ఆహారాన్ని కొద్ది కొద్దిగా నాలుగైదుసార్లు తీసుకోవడం వల్ల ఊబకాయం రాకుండా జాగ్రత్త పడచ్చు.
8 . అధిక క్యాలరీలు అనర్ధం : ప్యాకెట్లులో లభించే ఆహారపదార్థాలలో క్యాలరీలు అధికంగా వుంటాయి. పోషకవిలువలు ఎక్కువ, క్యాలరీలు తక్కువ వున్న వాటినే ఎంచుకోవాలి. కొనుగోలు చేసే పదార్థాలలో ఎన్ని క్యాలరీలు వున్నాయో చూసుకొని మరీ కొనడం మంచిది.. రంగుని చూసి మోసపోవద్దు : వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆహార పదార్థాలను ఆకర్షనీయమైన రంగులు, ప్యాకెట్లలో మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు ఉత్పత్తిదారులు. వీటి హంగు రంగు చూసి మోసపోవద్దని డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు.
9 . నవ్వు మంచిదే : నవ్వు నాలుగు విధాల చేటు అంటారు. కానీ నవ్వు చాలా రకాలుగా మంచిదని నిపుణుల అభిప్రాయం. రోజు మొత్తం మీద కొన్ని నిమిషాల పాటు నవ్వగలిగితే దానికి మించిన వ్యాయామం మరొకటి వుండదు. రోజుకి 15నిమిషాల పాటు హాయిగా నవ్వుతుంటే సంవత్సరంలోపు రెండు కిలోల బరువు తగ్గవచ్చు.
- ======================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.