Thursday, November 22, 2012

Toxic fevers - విషజ్వరాలుఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Toxic fevers - విషజ్వరాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


జ్వరము ఒక వ్యాది కాదు . ఏదైనా జబ్బు యొక్క లక్షణాలలో ఒకటిగా... శరీర ఉష్ణోగ్రత పెరగడము . పారిశుద్ధ్య లోపమే ఈ విష జ్వరాల దురవస్థకు ప్రధాన కారణం. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా చెత్తపేరుకుపోతోంది. మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఫలితంగా వాతావరణం కలుషితమై, దోమలు ప్రబలి, వ్యాధి బాధలతో ప్రజలు పడకేస్తున్నారు. పల్లె ప్రాంతాలలో ఆరుబయట బహిర్భూమికి వెళ్ళడము అనేక నీటి కాలుష్య జ్వరాలకు కారణము అవుతుంది.

కొన్ని విషజ్వరాలు
-- కొన్ని బాక్టీరియా విష జ్వరాలు
మలేరియా ,
టైఫాయిడ్‌,
ఫైలేరియా ,

-- అన్ని వైరల్ జ్వారాలు విషజ్వరాలే .. ఉదాహరణకు కొన్ని ->
డెంగీ,
స్వైన్‌ఫ్లూ,
చికన్‌గన్యా,
ఫ్లూ ఫీవర్ ,
ఎల్లో ఫీవర్ ,
మెదడు వాపు,
బర్డ్ ఫ్లూ,


  • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.