Monday, November 12, 2012

Broken heart Syndrome(care your heart)-బ్రోకెన్‌ హార్ట్‌ సిండ్రోమ్(హృదయం పదిలం)

  • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Broken heart Syndrome-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అనే వ్యాధి కూడా గుండెకు సంబంధించినదే. తాత్కాలికంగా గుండె కండరం బలహీనపడి రక్తనాళాలు సాధారణంగా స్పందించలేవు. ఈ వ్యాధిని గతంలో ''టరోట్సుబో కార్డియోమయోపతీ'' అని పిలిచేవారు. అయితే ఇపుడు దీనిని ఒత్తిడి గుండెనొప్పి లేదా ''ఎపికల్ బెలూన్ సిండ్రోమ్'' గా కూడా వ్యవహరిస్తున్నారు.  జీవిత భాగస్వామి ఆకస్మిక మరణం, ఆర్థిక ఇబ్బందులు... ఇవి కేవలం సమస్యలు మాత్రమే కాదు ప్రాణాంతకాలుగా మారొచ్చని నిదర్శనాలు ఉనాయి .. ఈ కారణాలతో అధికస్థాయిలో భావోద్వేగాలకు లోనైనపుడు గుండె పనితీరులో ఇబ్బందులు తలెత్తి ప్రాణం మీదకు వస్తుందని హార్ట్ స్పెషలిస్ట్ లు చెబుతున్నారు. దీన్నే వైద్య పరిభాషలో 'బ్రోకెన్‌ హార్ట్‌ సిండ్రోమ్‌' అంటారు.

ప్రేమించేవాళ్లు దూరమైతే.. ఆ బాధ వర్ణనాతీతం. ఇక తిరిగిరారు అనుకుంటే జీవించడమే కష్టం ఎవరికైనా. దీన్నే ‘హార్ట్ టు బ్రేక్’అని పిలుస్తారు. ఇలాంటి బ్రోక్‌లు మగవాళ్లకంటే ఆడవాళ్లకే ఎక్కువ. ఈ ‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్’తో తొమ్మిది రెట్లు ఎక్కువగా బాధపడుతోంది 
ఆడవాళ్లేనట. అనుకోని పరిణామాలను ఆడవాళ్లు తొందరగా జీర్ణించుకోలేరు. అదే మగవాళ్లయితే చాలా విషయాలను అంత సీరియస్‌గా తీసుకోరు. అదే పనిగా ఆలోచించరు. కాబట్టి వాళ్లుకు ‘బ్రోకెన్ హార్ట్’తో బాధలు తక్కువ. ఇందులో కూడా మామూలు ఆడవాళ్లతో పోలిస్తే భర్త చనిపోయిన ఆడవాళ్లే ఈ సిండ్రోమ్‌తో ఎక్కువ బాధపడుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. బాధ కలిగినప్పుడు అడ్రినల్ స్థాయి  పెరుగుతుంది. అప్పుడు ఒత్తిడికి లోనవుతారు. దాంతో గుండెలో రక్త సరఫరా ఎక్కువై బెలూన్‌లా ఉబ్బి పగిలిపోతుంది. ఈ సిండ్రోమ్‌తో.. 
55సంవత్సరాల లోపు ఉన్న ఆడవాళ్లలో అయితే 7.5 రెట్లు, ఆ పై వయసు కలిగిన వాళ్లలో 9.5శాతం ప్రమాదాలు జరగొచ్చని అంచనా. అది కూడా చలికాలంలో హార్ట్ ఎటాక్‌లు వచ్చే ప్రమాదం ఎక్కువ. ఎండాకాలంలో బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ ఎక్కువగా  బయటపడుతుందట.

ఈ సమస్యకు నిపుణులు చూపుతున్న పరిష్కార మార్గాలివి...
  • * భరించలేని కష్టం వచ్చినప్పుడు ఆత్మీయులకైనా చెప్పుకోకుండా మౌనంగా ఉండిపోవడం ఈ సమస్యకు అసలు కారణం. 
  • మిత్రులు,సహోద్యోగులు లేదా దగ్గరి బంధువులతో సమస్య గురించి మాట్లాడితే మనసు తేలికపడుతుంది.
  • * బాధ కలిగించే వ్యక్తులూ అంశాల గుర్తులూ జ్ఞాపకాలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి.
  • * బాధను తట్టుకోలేక దుఃఖం ముంచుకొస్తే ఏడ్చేయండి. కన్నీటిని బలవంతంగా ఆపుకోవద్దు.
  • * ఒంటరితనం, ఒత్తిడినుంచి బయటపడేందుకు ఏదైనా విహారయాత్రకు వెళ్లండి. షాపింగ్‌తోపాటు కుటుంబసభ్యులూ స్నేహితులతో కబుర్లు కూడా ఒంటరితనాన్ని దూరంచేస్తాయి.

అయితే ఇంతవరకు దీనికి ఖచ్చితమైన కారణం కనుగొనలేదు. ఈ జబ్బు లక్షణాలు గుండెపోటు లో వలెనే వుంటాయి. ఛాతీ నొప్పి, శ్వాస కష్టమవటం, గుండె బలహీనపడి వేగంగా కొట్టుకోవడం. అయితే, కరోనరీ ఆర్టరీలలో శాశ్వత డ్యామేజి వుండదు. కనుక రోగులు కొద్ది వారాలలో కోలుకుంటారు. ఇదే గుండె పోటుకు దీనికి వ్యత్యాసం అని చెప్పాలి.

ఈ జబ్బును గురించిన పరిశోధనా ఫలితాలు ఆన్ లైన్ లో ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో నవంబర్ 23, 2010 లో ప్రచురించారు. ఇంతవరకు బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ కు తగిన వైద్యం కనుకొనబడలేదు. అయితే, దీని నివారణకుగాను లేదా గుండె కు హాని కలుగకుండా మహిళలు వారి ఒత్తిడి స్ధాయిని నియంత్రించుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
  • ============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.