Showing posts with label చెవిలో చీము. Show all posts
Showing posts with label చెవిలో చీము. Show all posts

Monday, March 1, 2010

చెవిలో చీము , Ear Pus discharge(Otitis Media)




చిన్న పిల్లలలో చెవిలోంచి చీము కారడం చాలా సాధారణంగా చూసే వ్యాధి లక్షణం. చెవిలో చీమేగా...! చిన్నపిల్లల్లో ఇవన్నీ మామూలే అనుకుంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. ప్రతి చిన్న విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. చెవిలోని కర్ణభేరి పగిలి అక్కడ సూక్ష్మక్రిములు చేరి చీము తయారు చేస్తాయి. ఇది సరిగా చికిత్స చేయకపోతే పూర్తిగా చెముడు, అప్పుడప్పుడు మెదడుకు పాకి మెదడు వాపు వ్యాధి లక్షణాలు కలుగుతాయి.

పిల్లలకు ఏం పనులు చేయాలో, ఏం పనులు చేయకూడదో తెలియదు. ముఖ్యంగా స్నానం చేసినపుడు చెవిలో నీరు పోయినా, లేదా చెవిలో ఏదైనా చీమో, దోమో దూరినా వారికి తెలియదు కాబట్టి చెవిలో నొప్పి అని ఏడుస్తారు తప్పితే కారణాన్ని చెప్పలేరు.

చిన్నపిల్లల్లో చెవి సంబంధ వ్యాధులు ప్రధానంగా మధ్య చెవిలో ఇన్‌ఫెక్షన్స్‌ కారణంగా వస్తాయి. చెవి ఇన్‌ఫెక్షన్లు జలుబు చేయడం వలన, మధ్య చెవిలో నీరు ఉండిపోవడం వల్ల (సరిగ్గా స్నానం చేయన ప్పుడు), చల్లగాలిలో చిన్న పిల్లలను పడుకో బెట్టడం వల్ల వస్తాయి. కొన్నిసార్లు టాన్సిల్స్‌ ఇన్‌ఫెక్షన్‌ వలన, పంటి నొప్పి వలన కూడా చెవిపోటు రావచ్చు.
లక్షణాలు
చెవి నొప్పి రాత్రిపూట ఎక్కువగా వస్తుంది. పాలు తాగలేరు. ఏడుస్తారు. చెవిలోపల ఎర్ర బడి, ముట్టుకుంటే నొప్పిగా ఉంటుంది. చాలా సార్లు నొప్పి ఎక్కడ ఉందో తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు జ్వరం కూడా రావచ్చును. మీజిల్స్‌, డిఫ్తీరియా వ్యాధులతో పాటు చెవి బాధలు రావచ్చును. మెడ దగ్గర సర్వైకల్‌ గ్రంథులు పెద్దవవుతాయి. తలనొప్పి, గొంతు నొప్పి ఉండవచ్చును. అక్యూట్‌ కేసుల్లో తరువాత చెవినుండి చీము కారవచ్చును. సరైన సమయంలో తగిన చికిత్స చేస్తే ఒటైటిస్‌ మీడియాను పూర్తిగా నయం చేయవచ్చును. క్రానిక్‌ కాటరల్‌ ఇన్‌ఫ్లమేషన్‌లో చెవుడు వస్తుంది. నొప్పి ఉండదు. చెవిలో చీము ఉండదు. జలుబు చేసినప్పుడు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చెవిలో వినికిడి తగ్గుతుంది. చెవిలో శబ్దాలు వస్తాయి.
గుటక వేస్తే చెవిలో శబ్దం వస్తుంది. మాట్లాడుతూ ఉంటే ప్రతిధ్వని వినిపిస్తుంది. కొన్నిసార్లు చెవిలోపల దురదగా ఉంటుంది. కొంతమందిలో చెవిలో నీరు ఎండిపోయినట్లు ఉంటుంది. ఇటువంటి కేసులు చికిత్సకు తొందరగా స్పందించవు. కుటుంబంలో పెద్దవారికి ఇటువంటి సమస్య ఉంటే, వారికి కూడా కొంతకాలం తరువాత పూర్తిగా చెవుడు వస్తుంది. ఈ రోగుల చెవులను ద్రవరూపంలోని మందులతో శుభ్రం చేయకూడదు. కొన్నిసార్లు అది ఉపయోగం కంటే నష్టమే ఎక్కువగా కలుగజేస్తుంది.


టాన్సిల్‌ సమస్యకు సరైన చికిత్స చేయించకపోతే, గొంతులోని ఇన్‌ఫెక్షన్లు, చెవిలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. దీనివల్ల చెవిలో నొప్పి, వినిపించకపోవడంతో పాటు కొందరిలో చెవిలో చీము కూడా రావచ్చు. గ్రహణ పెదవి (మొర్రి) వలన తరచూ చెవిలో చీము కారడం ఇన్ఫెక్షన్ వలన జరుగుతూ ఉంటుంది .

చెవిలో చీము కారడం (OtitisMedia) : మూడు రకాలు --
Acute otitis media (AOM),
Otitis media with effusion (OME)
Chronic suppurative otitis media


వ్యాధి లక్షణాలు :
  • ఒక చెవి లేదా రెండు చెవులలోంచి చీము,
  • నీరు, దుర్వాసనతో చీము వస్తుంటాయి.
  • జలుబు చేసినపుడు ఎక్కవగుతుంటుంది.
  • చెవినొప్పి, పోటు, జ్వరం కూడా రావచ్చును.

జాగ్రత్తలు :
  • నీరు చెవిలో పోనివ్వకూడదు.
  • దూదిపెట్టి స్నానం చేయించాలి. ఈదనివ్వకూడదు.
  • చిన్నపుల్లకి దూదిచుట్టి కనిపించినంత మేరకు చీము తుడిచి శుభ్రం చేయాలి.
  • నూనె, పసర్లు పోయనివ్వకూడదు.
  • డాక్టర్ల సలహాపై చెవిలో మందులు వేయాలి.

మూడు సంవత్సరాలలోపు పిల్లలకు రెండు చెవుల్లోనూ చీము కారడంతో మధ్య చెవి, లోపలి చెవి దెబ్బతిని శాశ్వతంగా మాటలు రాని, వినికిడి లేనివారుగా తయారవుతారు. అందుకని చిన్న పిల్లలకు చెవిలో చీము కారుతూ ఉంటే జాగ్రత్తగా ఉండాలి.

ట్రీట్మెంట్ : డాక్టర్ల సలహాపై చెవిలో మందులు వేయాలి

Drep ear drops --- రెండు చుక్కలు ఉదయం , సాయంత్రం వేయాలి .
నొప్పి తగ్గడానికి -- combiflam మాత్రలు ఒక్కొక్కటి ఉదయం , సాయంత్రం తీసుకోవాలి ,
ఇన్ఫెక్షన్ తగ్గడానికి - Oflaxin 200 మగ్ రోజుకి రెండు చొప్పునన 5-7 రోజులు వాడాలి
ఎలర్జీ తగ్గడానికి ... సిట్రజిన్ ట్యాబు రోజుకొకటి వాడాలి .
చిన్నపిల్లలకు పై మందులు సిరప్ రూపం లో దొరుకును .

చెవిపోటు వచ్చినపుడు తమలపాకులను మెత్తగా నూరి శుభ్రమైన తడి వస్త్రంలో ఆ ముద్దను వేయాలి. తర్వాత ఆ గుడ్డను పిండి అలా వచ్చిన రసాన్ని చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది.


  • ======================================

Visit my website - > Dr.Seshagirirao.com/