Saturday, March 12, 2011

రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ , Restless Leg Syndrome
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ (Restless Leg Syndrome)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
పగలంతా పనిచేసిన త్ర్వాత సాయంత్రం అయ్యేటప్పటికి కాళ్ళు గాగుతూ కాస్త ఎవరైనా నొక్కితే బాగుండును అని అనిపిస్తోదా? అవిశ్రాంత జీవన పోతాటంలో మన శరీరము అలసి తనలో వస్తున్న మార్పుని మనకి సూచించే మొదటి ప్రక్రియ కాళ్ళు లాగుతున్నాట్లు అనిపించడం . పైకి చెప్పికోదగ్గ బాధ కాదది . కాని మనని ... మన మనస్సుని చికాకు పరిచే ఒక ఫీలింగ్ , ఒక చురుబాధ లాంటి అనుభూతి , పడుకోనివ్వదు , తగ్గేదాకా నిద్రపోనివ్వదు , ఆగనివ్వకుండ కాళ్ళు కదపాలనే తొందర .. దీన్ని 'రెస్ట్లెస్ లెగ్ సిండ్రోం '(Restless leg syndrome) అంటారు . ఏ డాక్టర్ దగ్గరకి వెళ్ళాలన్నా పెద్ద జబ్బుకాదుకదా అనిపిస్తుంది . వదిలేస్తే ప్రతిరాత్రి ఇదే బాద . ఈ ' RLS ' ఉన్నప్పుడు సుఖంగా నిద్రపట్టదు . ఆలిసి నట్లుంటుంది . తెల్లారి లేచినతర్వాత నీరసంగా , మగతగా ఉంటుంది . చదవాలన్నా , పనిచేయాలన్నా ఉత్సాహం గా ఉండదు . దీని వల్ల కొద్దికాలానికి నిర్లిప్తత , కోపతాపాలు పెరగడం వంటి లక్షణాలు వస్తాయి .

ఎందుకు వస్తుంది ?
ఈ ఆర్.యల్.యస్. అనేది కాళ్ళు ఎక్కువ కదపాలనే తీవ్రమైన కోరిక వల్ల ఉత్పన్నమవుతుంది . కొంతమంది ఊరకనే కూరోని కాళ్ళు ఊపుతారు (కదుపుతారు) ఇది వాళ్లు కావాలని చేయడం కాదు , అదొక లెలియని అలవాటు . కాళ్ళలో బిగపట్టినట్లుండడం , తిమ్మిరిగా ఉండడం లాంటివి వల్ల కాల్ళు ఊపుతుంటారు . ఇది పక్కవాల్లకి కొంత ఇబ్బందిగా ఉన్నా ఊపడం ఆపలేరు . ఇది ఏ వసులోని వారికైనా రావచ్చును . వంశపారంపర్యముగా వచ్చే అలవాటుగా అభిప్రాయము ఉన్నది . విచితమైన విషయమేమిటంటే ... మందులవల్ల వైద్యపక్రియవల్ల ఈ వ్యాధి తీవ్రమవుతుంది . ఆధినిక పరిశోధనలలో తేలినదేమంటే మనము తీసుకునే ఇనుము (iron) వాడకం లో హెచ్చు తగ్గులు ఈ వ్యాధికి కారణమని అంటున్నారు. మన brain లో ఇనుమును Dopamine అనే పదార్ధాన్ని తయారుచేయడానికి ఉపయోగించుకుంటుంది . ఈ డోపమైన్‌ మనలో కదలిక కేంద్రమైన స్థావరాన్ని క్రమబద్దీకరిస్తుంది . దీనికి ఇనుము అవసరము .
కిడ్నీలు పాడవడం , పార్కిన్సన్‌ డిసీజ్ , సుగర జబ్బు ఉన్న వాళ్ళు , వికారానికి ,వాంతులకు తగ్గడానికి వాడే మందులు వల్ల , డిప్రషన్‌ కి వాడే మందులవల్ల , , జలుబు , ఎలర్జీలకు వాడే మందులవల్ల , గుండె జబ్బులకు , బి.పి. లకు వాడే కాల్సియం చానెల్ బ్లోకర్స్ మందులవల్ల కూడ ఈ వ్యాది కలుగు తుంది .

ఆరోగ్యవంతులైన వ్యక్తులు రక్తాన్ని దానమివ్వడంవల్ల రక్తం అవసరమేర్పడిన వ్యక్తులతోపాటు దానమిచ్చిన వారికి కూడా మేలు జరుగుతుందని వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే తరచు రక్తదానం చేయడంవల్ల హాని జరిగే అవకాశం ఉందని అమెరికాలోని వైద్య పరిశోధకులు సూచిస్తున్నారు.తరచు రక్తదానం చేసే వారిలో ఐరన్ లోపించి వారికి ‘రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్’ వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. ఏడాదిలో కనీసం నాలుగుసార్లు రక్తదానం చేసే అలవాటు వున్న వ్యక్తుల్లో ఎక్కువ శాతం మందికి రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ వున్నట్లు తమ పరిశోధనలలో వెల్లడయ్యిందని వీరు ప్రకటిస్తున్నారు. ఇటువంటి వారు రక్తదానం చేయడం కొనసాగించడంవల్ల వారిలో ఐరన్ మరింత క్షీణించింది. అందుకే ఇటువంటివారు ఐరన్ మాత్రలు తీసుకోవలసిన ఆవశ్యకత ఉందంటున్నారు. అలా తీసుకుంటే వారి పరిస్థితి మెరుగుపడుతుంది. రక్తదానం చేయడం మంచిది. అయితే అలా చేసేముందు శరీరంలో ఐరన్ నిల్వలు ఏ స్థాయిలో వున్నదీ పరీక్షల ద్వారా తెలుసుకుని ఆ తరువాత రక్తదానం చెయ్యడం ఉత్తమం.

నివారణ మార్గాలు :

  • మందు కాళ్ళు కదలిక ఆపడం , నిద్ర చక్కగా పట్టేటట్లు చూసుకోవడం పాటించాలి ,
  • రాత్రి పడుకునే ముందు రెండు పాదాలకు నువ్వులనూనె మర్ధన చేసుకొని పడుకోవాలి
  • నిద్రపోయే చోటును ఆహ్లాదకరము గా ఉంచుకోవడం ,
  • టి.వి. కంప్యూటర్లకు రాత్రులు దూరంగా ఉండడం ,
  • నిద్రపోయే ముందు వేడి నీళ్ళ తో స్నానం చేయడం మంచిది .
  • టొమాటోలు , మిరియాలు , మసాలా వస్తువులు , గుడ్లు తక్కువగా తినడం మంచిది .
  • నీరు ఎక్కువగా త్రాగడం
  • ఐరన్‌ మాత్రలు , బి.కాంప్లెక్ష్ మాత్రలు క్రమం తప్పకుండా తీసుకోవాలి .
  • మనసును కట్టుదిట్టం చేసుకోవాలి .
  • =========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.