దేశము లో ప్రభుత్వకళాశాలలు 181, ప్రవేటు రంగములో 206 , కలిపి మొత్తము 387 వైద్యకళాశాలు ఉన్నాయి.
సంవత్సరానికి మనదేశములో ....
30 వేల మంది డాక్టర్లు ,
18 వేల మంది స్పెసలిస్టులు ,
30 వేల మంది ఆయుష్ వైద్యులు ,
54 వేల మంది నర్సులు ,
15 వేల మంది ఎ.ఎన్.ఎం.లు ,
36 వేల మంది పార్మశిస్టులు , ............ పట్టాలు పొందుతున్నారు.
ప్రస్తుతం మనదేశములో ఉన్న డాక్టర్లు సంఖ్య : 6.5 లక్షలు .
ఇంతమంది ఆరోగ్య సేవకులు ఉన్నా సామాన్య ప్రజలకు వైద్యము అందడములేదు . కార్పొరేట్ హాస్పిటల్ వచ్చి వైద్య ఖర్చులు మోయలేని భారముగా తయారైనవి. వైద్యము వ్యాపారము గా మారినది. రోగులను రిఫర్ చేస్తున్న RMP లకు పర్సెంటేజ్ ఇవ్వడము తప్పనిసరి అయినది. లేబు బిల్ లో 30%, ఆపరేషన్ బిల్లు లో 30%-40% , డెలివరీ బిల్లులోనూ 30% p.c లు గా ఫిక్ష్ అయినది. ఈ విధముగా రోగి ఆనారోగ్యము తో వ్యాపారము చేస్తూ ఉన్నారు.
ఇక మందులు కంపెనీలు లక్షలకొద్దీ పుట్తగొడుగులు గా పుట్టుకొస్తూ ఉన్నాయి. మందుల MRP రేట్లు పెంచేసి ... మందుల షాపులకు 10 కి 10 ఫ్రీ ఆఫర్లు ఇస్తూ రోగి మందుల బిల్లులు చెల్లించలేని బారము గా తయారైనవి.
డయాగ్నోస్టిక్ ... లేబరిటరీలు పరీక్షలు , ఎక్సురే , స్కానింగ్ లు అవసరము లేకపోయినా చేస్తూ రోగి ఖర్చు విపరీతముగా పెరిగేటట్లు దోహదం చేస్తూ ఉన్నాయి. జ్వరం అని వచ్చిన పేసెంట్ కి సుమారు 600- 800 రూపాయిల రక్తపరీక్షలు అవుతున్నాయంటే .. ఏ ష్థాయిలో వైద్య-వ్యాపారము జరుగుతుందో ఊహించవచ్చును. ఇక ఎక్స్ రేలు , స్కానింగ్ లు , ఇ,సి.జి లు , ఎండోస్కోపులు , ఎం.ఆర్.ఐ లు ఖరీదులు ఎలా ఉంటాయో ఊహించగలరు.
ఇన్ని జరిగినా పేసెంటుకు నాణ్యమైన వైద్యము దొరకదు. నాసిరకం మందులే ... కంపెనీలు ఇచ్చే గిఫ్ట్ ల కోసము .. చెలామని అవుతూ ఉన్నాయి.
- ========================
U have given the exact picture of today's medical business
ReplyDelete