Friday, October 12, 2012

సాధారణ కంటి సమస్యలు , Common Eye problems


  •  
  •  
  • కళ్ళు మనిషికి చాల ప్రధానమైనవి. అంధకారమైన జీవితము ఊహించడానికి కూడా సాహసించరు. కళ్ళను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. కళ్ళు ఎంత చిన్నవి అయినా , చెంపకు చేరడేసైనా మనజీవతానికి అవే వెలుగు . కళ్ళు లేని జీవనాన్ని , జీవితాన్ని ఊహించలేము . కళ్ళు ఆత్మకు అద్దం పడతాయి. ఆనందాన్ని , ఆవేదనని వ్యక్తం చే్స్తాయి . సంతోషాన్నీ , సంతాపాన్ని వెల్లడిస్తాయి. , నవ్వులు కురిపిస్తాయి., కరుణని ఒలికిస్తాయి , కళ్ళు కళ్ళు కలిస్తే మాటలు మౌనమవుతాయి. చూసి అర్ధము చేసుకోగలిగితే కళ్ళు ఎన్నో ఊసులు చెబుతాయి. ఇలా ఆనందాన్ని , ఆహ్లాదాన్ని , సంతోషాన్ని వ్యక్తముచేసే కళ్ళు అంతరంగాన్ని కూడాఆవిష్కరిస్తాయి. అలసటకు అద్దం పడతాయి. వాటికీ ఎన్నో సమస్యలు వస్తాయి. వాటిని తెలుసుకొనే అవగాహనే ఈ వ్యాసము .
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --సాధారణ కంటి సమస్యలు , Common Eye problems- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


కంటి లెన్స్‌లు
కంటి లెన్స్‌లు ఇష్టానుసారం తమకు నచ్చిన విధంగా వాడటం వల్ల కంటిలోని సున్నితమైన భాగాలు కూడా రేడియేషన్‌ ప్రభావంకు లోనవుతాయని వీటిపై అధ్యయనం చేసిన రాజ రామ న్న అటామిక్‌ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు మాజీ కార్యదర్శి డాక్ట్టర్‌ కె.ఎస్‌. పార్ధసారధి వెల్లడించారు.

సాధారణంగా కంటి అద్దాలు కొంత మేర రేడియేషన్‌ ప్రభావాన్ని కలిగిస్తాయి. దీనివల్ల కంటి లొపలి భాగాలు విపరీతమైన వత్తిడికి లోనై బాధ పడతాయి. అందువల్ల ఎక్కువమందిలో తల నొప్పి, పార్శనొప్పిలాంటి వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నా యని చెప్పారు.

శుక్లాలు ఉన్న వ్యక్తు లు ధరించే కంటి అద్దాలు పరిణామా లను వీలైనంత తక్కువగా చేసి దృష్టి లోపాలనుసరిదిద్దాలన్న ధ్యేయంతో అంతర్జాతీయ కమీషన్‌ ఆఫ్‌ రేడి యోలాజికల్‌ ప్రొటెక్షన్‌ (ఐసిఆర్‌పి) గాగుల్స్‌ పరిణామాన్ని తగ్గించిం దని చెప్పారు.

రేడియాలజీ, కార్డియాలజీ నిపుణులకు ఈ విష యాలపై అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని వెల్లడిస్తున్నారు. నేటి సమాజంలో వస్తు న్న వివిధ పరి ణామాలను దృష్టిలో ఉంచుకుని ఐసిఆర్‌పి రూపొందించి న వివరాలు వెల్లడిస్తూ… ప్రస్తుత కాలంలో కంటి అద్దాలు 50 మిల్లీ సివె రేట్‌కి మించి వాడుతుండటం వల్ల అవి కొంత కాలానికే స్పష్టత కోల్పోయి, మసకబారి పోతున్నాయని… దీని వల్ల కంటికి సంబంధించిన అనేక దుష్పరిణామా లు వస్తున్నాయని అన్నారు.
అదే 20 మిల్లీ సివెరేట్‌కి కంటి అద్దాల మందాన్ని తగ్గించి వాడితే.. ఏడాది పాటు మాత్రమే పనికి వస్తాయనుకునే వాటిని 5 ఏళ్ల పాటు వాడుకోవచ్చని, దీని వల్ల కంటికి వచ్చే ప్రమాదాలను నివారించు కొవటమే కాక కంటి లోపాలను అధిగమించకోవచ్చని తన అధ్యయనం లో తేలినట్లు పార్ధసారధి చెప్పారు.

కాలుష్యంతో కంటి సమస్యలు
 ఇనుము కంపెనీ నుంచి వచ్చే వాయు కాలుష్యం వల్ల  కంటి చూపు సమస్యలు వస్తాయి.  కొన్ని హొటల్స్ , కుటీర పరిశ్రమల  నుంచి పెద్ద ఎత్తునా పొగ వెలువడి  ఒకరికొక్కరు కనబడని పరిస్థితి నెలకొంటుంది  . జనావాసాల మధ్య కాలుష్య కారక పరిశ్రమలను సుప్రీం కోర్టు నిషేధించినప్పటికీ అమాయకులైన ప్రజలు ఇష్టారాజ్యము గా పొగ కాలుస్యాన్ని కలిగించే పరిశ్రమలు నిలకొల్పుతునే ఉన్నారు.

చిన్న పిల్లలకు వచ్చే సాధారణ కంటి సమస్యలివి...
సాధారణంగా చిన్నారుల్లో కనిపించే కంటిసమస్యలను ఆరు విభాగాలుగా చెప్పవచ్చు.
  • అన్‌కరెక్టెడ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్: ఇందులో లక్షణాలు కంటికి కనిపించేది స్పష్టంగా లేకుండా మసకమసకగా ఉండటం (బ్లర్‌డ్ ్రవిజన్), ఏదైనా చూస్తున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు కంటికి ఇబ్బందిగా ఉండటం, ఎక్కువసేపు చదివినప్పుడు కంటికి భారంగా అనిపించడం, కళ్లలోంచి నీరు కారడం, తలనొప్పి మొదలైనవి. ఈ ఇబ్బందులను యాస్థెనోపిక్ సింప్టమ్స్ అంటారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లోనే సరైన అద్దాలను ఉపయోగించడం ద్వారా పిల్లలకు స్పష్టంగా కనిపించేలా చేసి... సమస్య తీవ్రతరం కాకుండా కాపాడవచ్చు.

  • ఆక్యులార్ అలర్జీ: పిల్లలకు ఏవైనా సరిపడని పక్షంలో (అంటే ఇంట్లో ఉండే దుమ్ము ధూళి లేదా పూల పుప్పొడి వంటి వాటితో) కన్ను బాగా ఎర్రబారడం, కళ్లను తీవ్రంగా నలుపుకోవాలి అనిపించేలా కనురెప్పల చివరల్లో దురదలు, కళ్లలో నీరు రావడం వంటివి.

  • స్ట్రేబిస్మస్ లేదా స్క్వింట్ (మెల్లకన్ను): ఈ సమస్య ఉన్న పిల్లల్లో రెండు కళ్లలోని నల్లగుడ్డు ఒకేలా లేకపోవడం (అంటే ఒకటి ఒక పక్కకు గాని, లేదా రెండూ రెండు పక్కలకు గాని తిరిగి ఉన్నట్లు కనిపించడం). ఈ లక్షణాన్ని మిస్‌అలైన్‌మెంట్ ఆఫ్ ఐస్ అని పేర్కొనవచ్చు. దీన్ని వాడుక భాషలో మెల్లకన్ను అని వ్యవహరిస్తుంటారు. సాధారణంగా మన గ్రామీణ ప్రాంతాల్లో మెల్లకన్ను అదృష్టసూచిక అని ఒక దురభిప్రాయం ఉంది. అయితే మన రెండు కళ్లలో చివరన ఏర్పడే ప్రతిబింబాలు రెండూ మెదడులో ఒకటిగానే కనిపించే ఏర్పాటు ఉండి... మనకు స్పష్టంగా కనిపిస్తుంది.స్ట్రేబిస్మస్ లేదా స్క్వింట్ అని పిలిచే ఈ మెల్లకన్నుకు సరైన వయసులో సాధ్యమైనంత త్వరగా చికిత్స జరగకపోతే అది ఆంబ్లోపియా అన్న సమస్యకు దారితీసి శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మెల్లకన్ను అదృష్టసూచిక కాదని గ్రహించి, పిల్లల్లో ఈ సమస్య ఉంటే వెంటనే కంటి వైద్యనిపుణులకు అందునా చిన్నపిల్లల కంటివైద్యుల (పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజిస్ట్)కు చూపించడం మంచిది.
  • రెటినల్ డిస్ట్రఫీస్ అండ్ డీజనరేషన్స్: ఈ తరహా జబ్బుల్లో కంటికి దగ్గర్లో ఉన్నవి లేదా దూరాన ఉన్నవి స్పష్టంగా కనిపించకపోవడం, రాత్రివేళల్లో లేదా పగటి వెలుతురు ఎక్కువగా ఉన్న సమయాల్లో స్పష్టంగా కనిపించకపోవడం, రంగులను స్పష్టంగా గుర్తించలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇవేగాక మనకు కనిపించే కంటిచూపు పరిధి (ఫీల్డ్ ఆఫ్ విజన్) తగ్గుతూ పోవడం, ఒక్కోసారి కనుగుడ్లు అటూఇటూ వేగంగా కదులుతున్నట్లుగా ఉండటం (వైద్య పరిభాషలో నిస్టాగ్మస్) వంటి లక్షణాలు ఉన్న సమస్యలన్నీ ఈ విభాగంలోకి వస్తాయి.

  • ల్యూకోకోరియా: ఇందులో కంటిపాప తెల్లగా కనిపిస్తుంది. మనలో చాలామందికి సాధారణంగా కంటిలోని తెల్లపువ్వు ఒక వయసు తర్వాతే వస్తుంటుందని భావిస్తుంటాం. కానీ కొందరిలో పుట్టుకతోనే కళ్లలో తెల్లపువ్వు (కంజెనిటల్ కాటరాక్ట్) ఉంటుందన్నమాట. అలాంటివే కంటిలో గడ్డలు (వైద్యపరిభాషలో ఇంట్రా ఆక్యులార్ ట్యూమర్స్) కనిపించే రెటినోబ్లాస్టోమా వంటి కేసులు కూడా ఉంటాయి. రెండు కిలోల కన్నా తక్కువ బరువు ఉన్న పిల్లలు లేదా తొమ్మిది నెలలు నిండకముందే పుట్టిన పిల్లల్లో రెటీనా దెబ్బతినే పరిస్థితి కూడా రావచ్చు. దాన్నే హాఫ్ ప్రీమెచ్యురిటీ రెటినోపతి అంటారు.

  • విటమిన్-ఏ లోపంతో వచ్చే కంటిసమస్యలు: కొందరు పిల్లల్లో పోషకాహారలోపం వల్ల కూడా కంటి సమస్యలు రావచ్చు. ఇటువంటివారిలో కళ్లు పొడిబారిపోవడం, రాత్రిపూట కనిపించకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. వీళ్లను పరిశీలిస్తే నల్లగుడ్డు పక్కన తెల్లమచ్చలు (కార్నియల్ అండ్ కంజంక్టివల్ గ్సీరోసిస్) ఉంటాయి. దీనికి సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే కంటిలోని నల్లగుడ్డు దెబ్బతిని చూపు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

వీలైనంత త్వరగా ఎందుకు...?
పిల్లల్లో కంటి సమస్య కనిపించిన వెంటనే వీలైనంత త్వరగా దాన్ని కనుగొనడానికి (డయాగ్నోజ్ చేయడానికి), చికిత్సకు ప్రయత్నించాలి. ఎందుకంటే మనం సముపార్జించే జ్ఞానంలో 80 శాతానికి పైగా మన జ్ఞానేంద్రియాలన్నింటిలోనూ ప్రధానమైన కంటి తో చూసి నేర్చుకునేదే. ఇక మన కంటి ద్వారా జరిగే చూపు ప్రక్రియలో చాలా ప్రక్రియలు ఎనిమిదేళ్ల వయసు వచ్చేవరకు జరుగుతుంటాయి. అందుకే ప్రక్రియలు జరిగే సమయంలో తలెత్తే లోపాలను ఎంత త్వరగా తెలుసుకుంటే వాటిని అంత త్వరగా సరిదిద్దవచ్చన్నమాట. తద్వారా పిల్లల్లో శాశ్వతంగా చూపుకోల్పోయే ప్రమాదాలను నివారించవచ్చు. అందుకే పిల్లల్లో చూపు సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు.

మనం రెండు కళ్లతో చూసే వేర్వేరు దృశ్యాలను ఒకటిగా చూసే యంత్రాంగం మెదడులో ఉంటుంది. రెండు కళ్లలో కనిపించే వేర్వేరు ప్రతిబింబాలను సమన్వయం చేసి ఒకే దృశ్యంగా చూసే ప్రక్రియలో ఒక్కోసారి మెదడు ఒక కంటి ప్రతిబింబాన్ని విస్మరించే ప్రమాదం ఉంది. అంటే... ఏదైనా కంటి నుంచి వచ్చే ప్రతిబింబం తాలూకు దృశ్యం అంత స్పష్టంగా లేనప్పుడు ఆ ప్రతిబింబాన్ని స్వీకరించేందుకు మెదడు నిరాకరిస్తుంటుంది. ఫలితంగా ఒక కంటి ప్రతిబింబాన్నే మెదడు కంటిన్యువస్‌గా స్వీకరిస్తూ రెండవ కంటి ప్రతిబింబాన్ని నిరాకరిస్తుంటుంది. ఇలా జరగడాన్నే వైద్యపరిభాషలో ఆంబ్లోపియా (లేజీ ఐ) అంటారు. దాంతో కొంతకాలం గడిచాక చూపు సరిగాలేని కంటికి వైద్యం చేసినా మెదడు దాన్ని నిరాకరించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా చికిత్స చేయించడం అన్నది చాలా ప్రధానం.

పిల్లల్లో కంటిజబ్బులను గుర్తించడానికి ఏం చేయాలి?
సాధారణంగా పిల్లల్లో దృష్టిలోపాలు ఏవైనా ఉన్నాయేమో అన్న విషయాలు వారు చదివే పొజిషన్‌ను బట్టి తెలుస్తుంటాయి. పిల్లలు పుస్తకాలు చదివే సమయంలో సాధారణంగా ఒక అడుగు లేదా అడుగున్నర (12 నుంచి 18 అంగుళాల) దూరంగా పెట్టుకొని చదువుతుంటారు. చిన్నారులు తాము చదివే సమయంలో పుస్తకాన్ని మరీ దగ్గరగా పెట్టుకొని చదవడం లేదా దూరంగా పెట్టుకొని చదవడం, టీవీ బాగా దగ్గర్నుంచి చూడటం, మెల్లకన్ను పెట్టడం వంటివి చేస్తుంటే ఒకసారి చిన్నపిల్లల కంటి వైద్యనిపుణులను కలవాలి.

ఎప్పుడెప్పుడు?
చిన్నారుల్లో ఎలాంటి లోపాలు కనిపించకపోయినా స్కూల్లో చేర్పించే ముందు అంటే... మూడేళ్ల వయసులో ఒకసారి చిన్నపిల్లల కంటి వైద్యనిపుణులకు చూపించాలి. ఆ తర్వాత ఐదేళ్ల వయసులో మరోసారి సంప్రదించాలి. ఇదిగాక పిల్లల్లో కంటికి సంబంధించి ఏ అసాధారణ లక్షణం కనిపించినా లేదా పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సంప్రదించడం అవసరం.

పిల్లల్లో తల్లిదండ్రులు చూడాల్సిన అంశాలివే...
రెండు కళ్లలోని కనుగుడ్లు రెండూ ఒకేలా ఉన్నాయేమో చూడాలి.
రెండు కళ్లతో చూసినా మనకు కనిపించే దృశ్యం ఒకటిగానే ఉండాలి. (ఒకవేళ రెండు దృశ్యాలు వేర్వేగా ఉంటే దాన్ని డిప్లోపియా లేదా డబుల్‌విజన్ అంటారు. అలాంటి సందర్భాల్లో వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి).
ఏ కంటితో చూసినా మనం చూసే దృశ్యం స్పష్టంగా ఉండాలి. ఒక కంటితో స్పష్టంగానూ, మరో కంటితో మసకగానూ ఉంటే వెంటనే చిన్నపిల్లల కంటివైద్య నిపుణులను సంప్రదించాలి.


టీచర్ల పాత్ర
సాధారణంగా పిల్లలకు కంటి సమస్య ఉన్నట్లుగా మొదట కనుగొనగలిగే అవకాశం ఉన్నది వాళ్ల ఉపాధ్యాయులకే. చదవడం, రాయ డం, బోర్డుపైన ఉన్న అంశాలను నోట్ చేసుకోవడం వంటివి వాళ్లు గమనిస్తుంటారు కాబట్టి మొదట తెలుసుకునే అవకాశం వాళ్లకే ఎక్కువ. ఈ సంగతి తెలియగానే టీచర్లు తల్లిదండ్రులకు విషయాన్ని వివరించాలి. దాంతో పిల్లల సమస్య మరింత తీవ్రతరం కాకుండా కాపాడే అవకాశం ఉంటుంది.

పిల్లల కంటివైద్యుల ప్రాధాన్యం
పిల్లల కంటి సమస్యలకూ సాధారణ కంటివైద్యులే చికిత్స చేయవచ్చు కదా! మరి పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజిస్ట్ ఎందుకన్న ప్రశ్న తలెత్తవచ్చు. ఎందుకంటే... పెద్దల్లా పిల్లలు తమను బాధించే సమస్యను సరిగ్గా వివరించలేరు. పెద్దల్లా డాక్టర్లకు సహకరించకపోవచ్చు కూడా. వారు చెప్పని విషయాలను కూడా పరిగణనలోకి తీసుకొని, వైద్యపరీక్షల సమయంలో పిల్లలు సహకరించకపోయినా ఓపిగ్గా సమస్యను తెలుసుకొని చికిత్స చేసేలా పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజిస్ట్స్ శిక్షణ పొందుతారు.

పిల్లల్లో కనిపించే కంటి సమస్యల చికిత్సల్లో నైపుణ్యం ఉంటుంది. పిల్లల కంటివైద్యం కోసమే రూపొందించిన ప్రత్యేకమైన ఉపకరణాలను పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజిస్ట్స్ కలిగి ఉంటారు. కాబట్టి అందుబాటులో ఉన్నప్పుడు పిల్లలను పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజిస్ట్‌కు చూపించడం మంచిది.

- డాక్టర్ రచనా, వినయకుమార్, పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజిస్ట్, స్క్వింట్ స్పెషలిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీహిల్స్, హైదరాబాద్.
     

  • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.