వాషింగ్టన్: మీరు ప్రేమలో ఉన్నారా? ఎవరితోనైనా ప్రతేక్య బంధం ఉందా? అది ఎంత కాలం ఉంటుందో తెలుసా? మీ రక్తంలో ఆక్సిటోసిన్ (ప్రేమ హార్మోన్) శాతం తెలుసుకుంటే అది తెలుస్తుందని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. రక్తంలో ఆక్సిటోసిన్ శాతం ఎక్కువ ఉన్న జంటలు చాలా కాలం కలిసి ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని ఇజ్రాయెల్‌కి చెందిన బార్-1 లాన్ వర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పారు. ఇటీవలే ప్రేమలో పడ్డ కొందరిలో ఈ హార్మోన్ శాతం ఎక్కువ ఉన్నవారు ఆర్నెల్ల తర్వాత కూడా తమ బంధం కొనసాగిస్తున్నారని.. తక్కువగా ఉన్న వారు విడిపోయారని 'లైవ్‌సైన్స్' పేర్కొంది. జంటల మధ్య వచ్చిన విభేధాలు తగ్గడానికి ఈ హార్మోన్‌ను ముక్కులోంచి స్ప్రే చేయడం ద్వారా విజయవంతమైనట్లు గత పరిశోధనలు వెల్లడించాయి. ఒత్తిడికి గురైన జంటల మధ్య సత్సంబంధాలు నెలకొనడానికి ఆక్సిటోసిన్ చికిత్స అవసరమని... తాజా వివరాలు దానికి బలం చేకూరుస్తున్నాయి. తల్లి, పిల్లల మధ్య పెనవేసుకొనే బంధంలోనూ ఈ హార్మోన్ ఉంటుందని, అయితే, ప్రేమ బంధం మొదలవుతున్న తొలినాళ్లలో ఇది కీలకపాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు.
- =======================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.