Friday, May 11, 2012

లివర్ క్యాన్సర్,Liver Cancer





ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -లివర్ క్యాన్సర్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


  • -హెపటో లేదా హెపాటిక్ అని అంటుండడం వింటూనే ఉంటాం. దీనికి అర్థం కాలేయం అని జీవవూపక్షికియలలో కీలక పాత్ర పోషించే మన కాలేయం దాదాపు 500 రకాలకు పైగా క్రియలను నిర్వర్తించి పునరుత్పత్తి శక్తి కలిగిన ఏకైక అవయవం. 1000కి పైగా ఎంజైమ్స్‌ని లివర్‌ తయారు చేస్తుంటుంది. మన శరీరం లోపలి అవయవాలలో అతి పెద్ద (చర్మము తరువాత) అవయవమైన కాలేయాన్ని అతి పెద్ద గ్రంథిగా కూడా పేర్కొనవచ్చు. నాలుగు భాగాలుగా విభజించబడి ఉండే కాలేయం దాదపు ఒకటిన్నర కిలోల వరకు బరువు ఉంటుంది.
మనదేశంలో ప్రతి 20 మందిలో ఒకరు జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యకు లోనవుతున్నారు. గ్యాస్‌ సమస్య మొదలుకొని పెద్దపేగు క్యాన్సర్‌... పొట్ట ఇలా జబ్బుల పుట్టగా మారుతున్నది. తినే ఆహారం, తాగే నీటి విషయంలో శుభ్రత పాటించకపోవడం, మన జీవనశైలి ఇందుకు ప్రధాన కారణాలు. చాలా మందిలో నెలలో ఒకటి, రెండు సార్లయినా పొట్టకు సంబంధించిన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. గ్యాస్‌, కడుపులో నొప్పి, తిన్నది సరిగా జీర్ణం కాకపోవడం, కడుపులో మంటలు ఈ సమస్యలు ఎక్కువమందిని వేధిస్తాయి. పొట్టలో కాస్త ఇబ్బంది కనిపించగానే కొందరు తమకు తోచిన టాబ్లెట్‌ వేసుకుంటారు. ఆ మందులు తాత్కాలిక ఉపశమనం ఇచ్చిన శాశ్వత పరిష్కారం కావు.

విషతుల్యమైన పదార్థాల వల్ల కలుషితమైన ఆహారం, నీరు, మద్యం, స్మోకింగ్ వల్ల కాలేయం మీద ప్రభావం పడి వాపునకు గురవుతుంది. దానిని హెపటైటిస్ అంటారు. హెపటైటిస్‌కు గురిచేసే వైరస్‌లు ఎ, బి, సి, డి, ఇ అని ఐదు రకాలుగా ఉంటాయి. వీటిలో బి, సి, వైరస్‌లు ప్రమాదకరమైనవి. రక్త మార్పిడి వల్ల, అరక్షిత శృంగారం ద్వారా, తల్లి నుండి బిడ్డకు ఈ వైరస్‌లు సోకకుండా మూడు డోసుల వ్యాక్సిన్ వేయించుకోవాలి. హెపటైటిస్‌-బి పాజిటివ్ ఉన్నవారు కూడా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. పిల్లలకు వారి టీకా షెడ్యూల్ ప్రకారం వ్యాక్సిన్ వేయిస్తే చాలా మంచిది. ఆకలి తగ్గటం, వికారం, కామెర్లు, జ్వరం, కీళ్లనొప్పులు వంటి సమస్యలు ఉన్నపుడు చెట్ల వైద్యం, నాటు వైద్యం వంటి సొంత వైద్యాలు చేసుకోకుండా కారణం తెలుసుకుని అవసరమైన చికిత్స తీసుకోవడం ఉత్తమం. లివర్ ఇన్‌ఫెక్షన్స్ ఫ్యాటి లివర్, లివర్ వెబ్‌సెస్, విల్సన్ డిసీజ్, గిల్‌బర్డ్ సిండ్రోమ్ వంటి అనేక రకాల కాలేయ సంబంధిత వ్యాధులున్నా వీటిలో హెపటైటిస్ బి, సి, వైరస్ కలుగజేసే ఇన్‌ఫెక్షన్లు కొన్ని సంవత్సరాల తర్వాత కాలేయనాన్ని గాయపరచడం, గట్టిగా మార్చడం(సిరోసిస్) తర్వాత క్యాన్సర్‌కు దారితీయటం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అందుకే ఆసియా దేశాలలో హెపటైటిస్-బి, ఇన్‌ఫెక్షన్లు ఎక్కువ కాబట్టి లివర్ క్యాన్సర్స్ ఎక్కువే. లివర్ క్యాన్సర్‌ లో హెపటోసెల్యులార్ కార్సినోమా, మెటాస్టాటిక్ లివర్ క్యాన్సర్ అనే రెండు రకాలుంటాయి. జీర్ణవ్యవస్థలో క్యాన్సర్లు, బ్రెస్ట్ క్యాన్సర్స్ బోన్ క్యాన్సర్లు, ఇలా ఏ క్యాన్సర్స్ అయినా కాలేయానికి వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువ. లేటుగా బయటపడే లివర్ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనదిగా పేర్కొనవచ్చు.
  • -పొట్ట సంబంధిత క్యాన్సర్లు, లంగ్ క్యాన్సర్లు తర్వాత లివర్ క్యాన్సర్లు ఎక్కువ. ఇండియా, చైనా, హాంగ్‌కాంగ్, తైవాన్, కొరియా, సౌత్ ఆఫ్రికాలలో హెపటైటిస్ -బి, ఇన్‌ఫెక్షన్ల వల్ల ఈ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. అమెరికా, యూరప్‌లో ఈ క్యాన్సర్ తక్కువే అయినా హెపటైటిస్ - సి, వైరస్‌వల్ల , అధికబరువు, మధుమేహం వంటి సమస్యల వల్ల ఈ క్యాన్సర్‌కు గురయ్యే వారి సంఖ్య ఈ దేశాలలో కూడా ఈ మధ్య పెరుగుతూ వస్తోంది. అమెరికా వంటి దేశాలలో స్థిరపడిన ఆసియా దేశస్థులలో హెపటైటిస్-బి ఇన్‌ఫెక్షన్ వైరస్ వల్ల లివర్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటోంది. పుట్టినపుడే ఈ ఇన్‌ఫెక్షన్ ఉన్నా 30, 40 ఏళ్లలో లక్షణాలు బయటపడడం, క్యాన్సర్‌కు గురవటం జరుగుతుంది. పురుషులలో ఎక్కువగా కనిపించే ఈ క్యాన్సర్, హెపటైటిస్-బి పాజిటివ్‌కు ఆల్కహాల్ తోడయితే త్వరగా ముదిరిపోవడం, చికిత్సకు లొంగకపోవడం జరుగుతూ ఉంటుంది.
చికిత్స :
  • కాలేయానికి వ్యాధి వచ్చిన 60 శాతం వరకు ప్రమాద విషయం తెలియదని, కొన్ని సంకేతాల ద్వారా గుర్తించవచ్చని అన్నారు.ప్రపంచ వ్యాప్తంగా హెపటైటిస్‌ ‘బి’ లేక ‘సి’ లతో బాధపడుతున్న వారు అరువందల(600) మిలియన్ల దాకా ఉన్నారు. హెపటైటిస్‌ బి లేక సి తో బాధపడుతూ మరణిస్తున్న వారు ప్రతి సంవత్సరం 105 మిలియన్ల దాకా ఉన్నారు. అవగాహన కోసము ప్రతి సంవత్సరమూ 19-ఏప్రిల్ న ''వరల్డ్ లివర్ డే'' జరుపుకుంటున్నాం.


లివర్‌ దెబ్బతిన్నప్పుడు సాధారణంగా జాండిస్‌ వస్తుంది. లివర్ వ్యాధితో ఉన్నవారు బాగా విశ్రాంతి తీసుకోవాలి . ఎక్కువగా కాచి చల్లారిన లేదా మినరల్ వాటర్ .. నీరు త్రాగాలి. Liv-52 మాత్రలు రోజుకి 2 ఉదయము రెండు రాత్రి వాడుతూ ఉండాలి . జీర్ణశక్తి కి Digeplex (with sorbitol) వాడుతూ ఉండాలి. బి.కాంప్లెక్ష్ మాత్రలు రెగ్యులర్ గా తింటూ ఉండాలి. కొంతమంది వైద్యులు silmarin తో తయారుచేసిన మందులులు వాడమంటారు . Ursodeoxycholic acid, UDCA-(ursodiol) ని కొందరు డాక్టర్లు వాడమని సలహా ఇస్తారు . మంచిదే. హెపటైటిస్ -బి /సి కోసము యాంటి వైరల్ ప్రిపరేషన్స్ వాడాలి. సిర్రోసిస్ తో బాదపడుతున్నవారికి కాళ్ళు వాపులు కోసము తక్కువ మోతాదు లో Diuretics వాడాలి . ఏ మందులు వాడినా వైద్యుల సలహామేరకే తీసుకోవాలి.

  • సర్జరీ : శ్యాప్ లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్, స్ప్లిట్ లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్, ఆక్సిలరి లివర్ మార్పిడి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి .
--Cortesy with Dr.Mohanavamsy ,chief oncologist ,Omega hos.Hyd.@Namste Telangana paper.
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.