Tuesday, May 1, 2012

ఫ్లూ జ్వరం,ఫ్లూ వైరస్‌,Flue fever



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఫ్లూ జ్వరం,ఫ్లూ వైరస్‌,Flue fever- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


జలుబు తెచ్చిపెట్టే వైరస్‌లు వందల సంఖ్యలో వుంటాయి. అందుకే జలుబు నిరోధక వ్యాక్సీన్‌లు మనకు అందుబాటులో లేవు. ఫ్లూకు సంబంధించి ప్రధానంగా రెండు తరగతుల వైరసులను గుర్తించడం జరిగింది. వీటికి వైరస్‌-ఎ, వైరస్‌-బి అని పేర్లు పెట్టి వ్యవహరిస్తున్నారు. మూడవ తరగతి వైరస్‌ 'సి' ఉనికి తక్కువే. అది అంతగా బాధ పెట్టదు కూడా. ఫ్లూ జ్వరం అకస్మాత్తుగా వస్తుంది. చలిచలిగా ఉంటుంది. జలుబు, దగ్గు, గొంతునొప్పి ఉంటాయి.తలనొప్పి, ఒళ్ళునొప్పులు బాధ అనిపిస్తాయి. బాగా నీరసం అనిపిస్తుంది. కడుపులో వికారమూ ఉంటుంది.ఫ్లూ జ్వరాన్నే ఇన్ ఫ్లూయింజా జ్వరం అంటారు. ఈ జ్వరం జులై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలోఎక్కువమందికి సోకుతుంది. ఇంట్లో ఒకరికి వస్తే తక్కినవాళ్ళకి కూడా రావచ్చు, ఈ జ్వరం రావడానికి ఇన్ ఫ్లూయింజా వైరస్ ఏ,బి,సి రకాలు కారణం. ఇన్ ఫ్లూయింజా వైరస్ శరీరంలో చేరిన 1-3 రోజులలో ఫ్లూ జ్వరం వస్తుంది.

ఫ్లూ వైరస్‌ సోకిన ఒకటి రెండు రోజుల తరవాత ఫ్లూ లక్షణాలు ప్రారంభమవుతాయి. చలి మొదటి లక్షణం. తరవాత జ్వరం 102-103 ఫారన్‌హీట్‌ డిగ్రీల దాకా పెరుగుతుంది. తీవ్రంగా తలనొప్పి, ఒళ్లు నొప్పులు. వీపు నొప్పి అధికంగా వుంటుంది. మూడు నాలుగు రోజుల్లో బాధలన్నీ తగ్గిపోతాయిగానీ దగ్గు మాత్రం వారం, పది రోజుల వరకూ బాధించవచ్చు.


  • వ్యాపించే విధానము :
ఫ్లూ కారక వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి పీల్చే గాలి ద్వారా సంక్రమిస్తుంది. అలాగే ముక్కు నుండి వెలువడే స్రావాలతో కలుషితమైన గ్లాసులు, పాత్రలు, వస్తువుల ద్వారా కూడా సంక్రమించవచ్చు.

  • ఫ్లూ జ్వరంలో రకాలు :
ఫ్లూ జ్వరంలో రకాలున్నాయి. ఒక రకంలో ఫ్లూ కేవలం జ్వరంవరకే పరిమితం అవుతుంది. ఇందులో జ్వరం, ఒళ్ళునొప్పులు, జలుబు, గొంతునొప్పి, కళ్ళు ఎర్రబడటం, నీరసం ప్రధానంగా వుంటాయి. పొడిదగ్గు ఉంటుంది. నాలుగు నుండి ఆరు రోజులలో జ్వరం తగ్గిపోతుంది ఇలాంటి జ్వరం ఎక్కువమందిలో కనిపిస్తుంది.

శ్వాసకోశాలకి సంబంధించిన ఫ్లూ జ్వరంలో జ్వరంతో పాటు బ్రోంకైటీస్, బ్రోంఖోన్యుమోనియా, ఫ్లూరసి వుంటాయి. కళ్ళే జిగురుగా, ఎరుపుగా వుంటుంది. ఇటువంటి ఫ్లూజ్వరం గురించి అప్రమత్తత అవసరం.

జీర్ణకోశ పెగులకి సంబంధించినటువంటి ఫ్లూ జ్వరం మరొకటి ఇందులో ఫ్లూజ్వరంతోపాటు ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, కడుపునొప్పి, మలబద్ధకం వంటివి ప్రధానంగా వుంటాయి. కొంతమందిలో మలబద్ధకం బదులు విరేచనాలు వుంటాయి.

నరాలకి చెందిన ఫ్లూజ్వరం కూడా ఉంది. ఇందులో విపరీతంగా తలనొప్పి ఉంటుంది. అపస్మారకస్థితి కూడా ఏర్పడుతుంది. మెనింజైటీస్ ఫ్లూ జ్వరం అనేది మరొకటివుంది. దీన్నే విషజ్వరం అని అంటారు. ఈ జ్వరం వచ్చినవాళ్ళలో ఒళ్ళు నీలంగా మారుతుంది.

  • ఫ్లూ జ్వరానికి చికిత్స ఏమిటి?
ఫ్లూ జ్వరం వచ్చిన వ్యక్తికి పూర్తి విశ్రాంతి ఇవ్వాలి. జ్వర తీవ్రత, ఒళ్ళునొప్పులు తగ్గడానికి ''పెరాసిటమాల బిళ్ళలు'' వాడాలి. గొంతునొప్పి, దగ్గు తగ్గడానికి '' కాఫ్ సిరప్ '' వాడాలి. సాధారణంగా ఎలాంటి యాంటిబయోటిక్ మందులవసరం లేకుండానే ఉపశాంతికి వాడే మందులతో ఫ్లూజ్వరం తేలికగా తగ్గుతుంది.

కాంప్లికేషన్లు ఎదురైతే వాటికి చికిత్స చేయాలి. వైరల్ ఇన్ ఫెక్షన్ తోపాటు బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ కూడా తోడైతే యాంపిసిలిన్, ఎమాక్సిసిలిన్, ఎజిద్రోమైసిన్ ఇతర యాంటిబయాటిక్ మందులు వాడాలి. ఇన్ ఫ్లూయింజా జ్వరం రాకుండా వ్యాక్సిన్లు కూడా ఉన్నాయి. అవి చిన్నవయసులోనే వాడాల్సి వుంటుంది. జ్వరం వచ్చాక ప్రయోజనం ఉండదు. వైరస్‌ వ్యాధికి బాక్టీరియా ఇన్ఫెక్షన్‌ తోడయినా యాంటిబయాటిక్స్‌ వంటి ఔషధాలతో అంత ప్రయోజనం ఉండదు. సిగరెట్లు, మద్యపానం లాంటి అలవాట్లున్న వారు ఈ సమయంలో వాటికి దూరంగా వుండాలి. ప్లూ వ్యాధిగ్రస్తులలో బ్రాంకైటిస్‌, న్యుమోనియా లాంటి వ్యాధులు చోటు చేసుకోవచ్చు.


soruce : Price Text book of Medicine

  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.