Sunday, November 27, 2011

ప్రసూతి మరణాలు, Maternity Deaths


  • image : courtesy with ->http://topnews.ae/

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --ప్రసూతి మరణాలు, Maternity Deaths- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


  • భారతదేశానికి స్వాతం త్య్రం వచ్చి 63 సం.రాలు దాటినా, రాజ్యాంగంలో జాతి, మతం, రాజకీయ, సాంఘీక, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ఆరోగ్యంగా వుండటం ప్రతిమానవుని హక్కుగా ఉటంకించినా నేటికీ అందరికీ ఆరోగ్యం అందనిద్రాక్షే? . ప్రపంచవ్యాప్తంగా లక్ష జననాలకు గాను 400 ప్రసూతి మరణాలు నమోదు అవుతుండగా భారత్‌లో అది 300 గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక లక్ష డెలివరీలకు ప్రసూతి మరణాల రేటు 195 గా ఉంది. రాష్ట్రంలో మాతా, శిశు మరణాల సంఖ్యను తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సిఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం సచివాలయంలో స్త్రీ, శిశు, వికలాంగుల సంక్షేమంపై సిఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, స్త్రీ,శిశుసంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి ఛాయారతన్‌, కమిషనర్‌ అనితా రాజేందర్‌ హాజరయ్యారు. చిన్నపిల్లలు, ప్రసూతి మరణాలను తగ్గించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల చర్యలనూ ప్రారంభించాలని అధికారులను సిఎం ఆదేశించారు. ఆసుపత్రుల్లోనే ప్రసవం చేసే విధంగా గర్భిణీలకు అవగాహన కల్పించాలని, పౌష్టికాహారం తీసుకునే విధంగా సూచించాలని తెలిపారు. మన రాష్ట్రంలో ఏ కారణం చేత కూడా చిన్నపిల్లలు, ప్రసూతి మరణాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఫుడ్స్‌ సంస్థ ఉప్మా, కిచిడీ, హల్వామిక్స్‌ ఆహారపదార్థాలను తయారు చేసిందని, దీన్ని ఐఎస్‌ఓ సంస్థ కూడా ధ్రువీకరించిందన్నారు. దీన్ని ఇప్పటికే 213 అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారని చెప్పారు. గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలకు ఈ ఆహారం మంచి పౌష్టికాహారంగా ఉంటుందన్నారు.

భారత్‌లో ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం చేస్తున్న తలసరి వ్యయం ఎంతో తెలుసా? కేవలం 32 డాలర్లు (సుమారు రూ. 1,400) మాత్రమే. అదే సమయంలో ధనిక దేశాలు తమ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం చేస్తున్న తలసరి ఖర్చు దీనికి 140 రెట్లు (4590 అమెరికన్ డాలర్లు- అంటే సుమారు రూ. 2,06,000) ఎక్కువ. భారతీయుల ఆరోగ్యంపై ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉన్నదో ఈ గణాంకాలు చాటుతున్నాయి. అంతేకాదు.. భారత్‌లో వ్యాధుల కారణంగా పేదలే కాదు.. ధనిక వర్గాలు సైతం రెండింతలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విడుదల చేసిన తాజా నివేదిక ఈ పచ్చి నిజాలను
వెల్లడించింది.

  • * ప్రపంచ వ్యాప్తంగా ఏటా దాదాపు 3.5 లక్షల మంది మహిళలు గర్భధారణ, కాన్పు సమయంలో, ప్రసవానంతరం చనిపోతున్నారు.
  • * మన దేశంలో ఏటా దాదాపు 75 వేల ప్రసూతి మరణాలు సంభవిస్తున్నాయి.
  • * 99 శాతం ప్రసూతి మరణాలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే కలుగుతున్నాయి.
  • * ప్రసూతి మరణాలు మహిళలపై జరుగుతున్న ఒక పెద్ద కుంభకోణం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది.
  • * ప్రసూతి మరణాలు భారత దే్శములో బాగా నిరోధించగల సమస్య.
  • * ప్రసూతి మరణాల విషయంలో సహస్రాబ్ది లక్ష్యాలు సాధించడంలో మనం చాలా దూరంగా ఉన్నాం.

ప్రసూతి మరణాలు తగ్గించడానికి మనం ఏం చేయాలంటే....
  • 18 సంవత్సరాల తర్వాతే స్త్రీలకు వివాహం చేయాలి.
  • 20 నుండి 30 ఏళ్ల వయసు గర్భధారణకు అనువైన సమయం. ఈ అంశాన్ని పాటించాలి.
  • కాన్పు-కాన్పు మధ్య ఎడం పాటించండి.
  • ఆడపిల్లలను బాగా చదివించండి.
  • గర్భధారణ సమయంలో ఆరోగ్య
  • కార్యకర్తతో పరీక్షలు చేయించుకోండి.
  • కాన్పు శిక్షణ పొందిన ఆరోగ్యకర్తతో చేయించుకోండి.
  • ఆరోగ్య కార్యకర్త నుండి ప్రసవానంతర సేవలు పొందండి.
  • బిడ్డ పుట్టిన మొదటి గంటలో తల్లిపాలు పట్టడం మొదలుపెట్టండి.

గర్భిణులకు ఉచిత ఆరోగ్య పర్యవేక్షణ కార్డులు

  • గర్భిణులు, శిశువుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడానికి వీలుగా, వారికి ఉచితంగా ఆరోగ్య కార్డులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 2010 సెప్టెంబర్ నుంచి ఈ కార్డులను అందజేసారు. గర్భిణులు, శిశువులు నిర్ణీత పద్ధతిలో మందులు తీసుకునే విధంగా, వారికి సంబంధించిన అన్ని ముఖ్యమైన ఆరోగ్య సూచికలను ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేటు ఆస్పత్రులలో నమోదుచేస్తారు. ఈ కార్డుల ద్వారా గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని తొమ్మిదినెలలపాటు, శిశువుల ఆరోగ్య పరిస్థితిని ఐదేళ్ళపాటు పర్యవేక్షిస్తారు. ప్రసూతి మరణాల శాతం (ఎం ఎం ఆర్) లోను, శిశు మరణాల శాతం (ఐ ఎం ఆర్) తగ్గించడం లో ఆంధ్రప్రదేశ్ వెనుకబడి వున్నదని, ఈ కార్డుల జారీ ద్వారా ఈ వెనుకబాటును తగ్గించుకోవడానికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ పి. వి. రమేష్ తెలియజేశారు.

మనం ఇంతవరకూ ప్రసూతి మరణాలకు కారణం సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, స్త్రీలకు పోషకాహారలోపం వంటివే పరిగణనలోనికి తీసుకుంటున్నాం... కానీ 'రాజకీయ కులవివక్ష' వారి మరణాలకు మరో కారణమని తాజా సర్వేలు తెలియజేస్తున్నాయి. భారతదేశములో రాజకీయ నాయకులు ప్రతినిత్యము ఎక్కడో ఒకచోట ఎన్నికల వ్యవహారములో బిజీ ఉండడము వలన అభివృద్ధి కుంటుబడుతుంది.
  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.