Wednesday, November 30, 2011

కన్నీరు,The tearsఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -కన్నీరు,The tears-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...సినిమాలో హీరోహిన్‌ పడుతున్న కష్టాలు చూస్తున్న ప్రేక్షకులు కంటతడి పెడతారు . అదే సినిమాలో హాస్యనటులు కడుపుబ్బ నవ్విస్తుంటే ఆ సమయములోనూ ప్రేక్షకులవెంట కన్నీరు కారుతుంది . విషాదానికి , ఆనందానికి కూడా కన్నీరు కారుతుంది . మనసులో కలిగే భావోద్వేగాలను కన్నీళ్లు ప్రతిబింబిస్తాయి . అయితే భావోద్వేగాలు మనుషులకే కాదు ఇతరజీవులకు ఉంటుంది . . . కాని కంటివెంట నీరు కారదు . కంటినీరు పెట్టడము అనేది మానవ లక్షణము . తమ భాదను అరుపులు ద్వారా తెలియజేస్తాయి కోతులు , చింపాజీలు .

కంటిలోని పొరలను శుభ్రం చేయడానికి, వాటిని (lubricate చేసి) తడిగా ఉంచడానికి స్రవించే ద్రవాన్ని అశ్రువులు, కంటినీరు లేదా కన్నీరు అంటారు. ఇలా కన్నీరు స్రవించే ప్రక్రియను వైద్యశాస్త్ర పరిభాషలో lacrimation అంటారు. సాధారణ పదజాలంగా "ఏడవటం" అనే చర్యను ఇది సూచిస్తుంది. దుఃఖం, సంతోషం వంటి బలమైన భావోద్వేగాలు కలిగినపుడు ఇది జరుగుతుంది. చాలా జంతువులలో lacrimation కు అవుసరమైన వ్యవస్థ (శరీర భాగాలు, గ్రంధులు) ఉన్నాయి. అయితే భావోద్వేగాల కారణంగా ఇలా కన్నీరు కార్చే క్షీరదం జాతి జీవి మానవుడే అని భావిస్తున్నారు.


  • కన్నీటిలో రకాలు
కన్నీరు స్రవించే విధానం బట్టి వాటిని మూడు విధాలుగా విభజిస్తారు.

1. శుభ్రం చేసే కన్నీరు (Basal tears): క్షీరదాలు తమ కంటి కార్నియాను తడిగా, శుభ్రంగా ఉంచడానికి, దుమ్మును నివారించానికి మరియు కొంత పోషక పదార్ధాలను అందించడానికి కన్నీటిని నిరంతరం స్రవిస్తాయి. ఈ కన్నీటిలో నీరు, మ్యుసిన్, లిపిడ్‌లు, లైసోజైములు, లాక్టోఫెర్రిన్, ఇమ్యునోగ్లోబిలిన్‌లు, గ్లూకోస్, యూరియా, సోడియం, పొటాషియం వంటి అనేక పదార్ధాలు ఉన్నాయి. కన్నీటిలో ఉన్న లవణాలు రక్తం ప్లాస్మాలో ఉన్న లవణాలకు ఇంచుమించు సరిమోతాదులో ఉన్నాయి. షుమారుగా 24 గంటలలో 0.75 నుండి 1.1 గ్రాముల వరకు స్రవిస్తాయి. వయసు పెరిగినకొద్దీ ఈ స్రావం తగ్గుతుంది.

2. కలక కన్నీరు (Reflex tears): ఏదైనా ధూళి వంటివి తగిలి కంటికి irritation కలిగినపుడు (ఉదా. ఉల్లి, మిరియం పొడి, దుమ్ము వంటివి) కంటినుండి కన్నీరు స్రవిస్తుంది. ముక్కులో కలిగే వాసన వల్ల, తీవ్రమైన కాంతి వలన, నోటిలి ఘాటైన రుచి కలిగినపుడు కూడా ఇలావే జరుగుతుంది. ఇలా జరిగే అసంకల్పిత ప్రతీకార చర్య ద్వారా కంటికి కలిగిన ఇర్రిటేషన్ పదార్ధాలను తుడిచి వేయడానికి కన్నీరు స్రావం జరుగుతుంది.


3. ఏడవడం వలన కన్నీరు (Crying or weeping (psychic tears)): బలమైన భావోద్వేగాలు, నొప్పి, తడబాటు వంటి వాటి కారణంగా కూడా కన్నీరు వెలువడుతుంది. మనుషులలో ఈ ప్రక్రియకు సమాంతరంగా ముఖం ఎర్రబడడం, గొంతులో గద్గదత, శరీరం కంపించడం కూడా జరుగుతాయి. పైన చెప్పిన రెండు విధాల కన్నీటిలో కంటె ఈ మూడవ తరహా కన్నీరులో ప్రోటీన్ సంబంధిత పదార్ధాలు, హార్మోనులు ఎక్కువగా ఉంటాయి. ఆ ఉద్వేగ సమయంలో నరాలలో జరిగే సంకేతాల కారణంగా ఇలా జరుగుతుంది.

  • కన్నీటి ఔషధ గుణాలు
"ఏ నీళ్ళూ దొరకని ఎడారిలో కన్నీరైనా తాగి బ్రతకాలి" అన్నాడో కవి. కన్నీరు ఆరోగ్యానికి పన్నీరని, ఏడిస్తే అనారోగ్యం దూరం అవుతుందనీ, ప్రశాంతత చేకూరుతుందనీ పరిశోధనల్లో వెల్లడి అయ్యిందట. ఆరోగ్యంగా ఉండాలంటే మనస్ఫూర్తిగా కన్నీళ్లు పెట్టుకోండి. వెక్కివెక్కి ఏడ్వండి. ఉద్వేగాలను దాచుకుని బాధ పడటం కంటే ఏడిస్తేనే ఆరోగ్యంగా ఉంటారని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. కన్నీళ్లలో ప్రొటీన్లు, మాంగనీసు, పొటాషియం, హార్మోన్లు, ప్రొలాక్టిన్ ఉంటాయి. మాంగనీసు అత్యవసరమైన పోషక పదార్థం. రక్తం గడ్డ కట్టడానికి, చర్మ వ్యాధులను నయం చేయడానికి, కొలెస్ట్రాల్ (కొవ్వు)ను తగ్గించడానికి కొద్ది మోతాదు మాంగనీసు సరిపోతుంది. నరాలు పనిచేయడానికి, కండరాల నియంత్రించడానికి, బీపీని అదుపులో ఉంచడానికి పొటాషియం ఉపకరిస్తుంది. ఒత్తిడి నివారించడానికి, శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, వివిధ అవయవాలను ప్రభావవంతంగా పనిచేయించడానికి ప్రొలాక్టిన్ హార్మోన్ ఉపకరిస్తుంది.

  • శోకం బంధాన్ని పెంచుతుంది

ఏడుపుతో ఒంట్లో నొప్పి, ఒత్తిడి తగ్గుతాయి. మానసికోద్వేగాల పరంగానూ ఉపయోగాలున్నాయి. కన్నీరు మానసిక అనుబంధాన్ని బలిష్టం చేస్తుంది. శారీరకమైన కుంగుబాటును సూచించే సంకేతంగానే కాకుండా, మనుషుల మధ్య బంధాన్ని మరింత గాఢంగా మార్చే శక్తి కన్నీటికి ఉంది.బాధ, దుఖం, కన్నీరు ఎదుటి వారిని తృప్తి పరుస్తుంది, శత్రువుల నుంచీ సానుభూతి సంపాదిస్తుంది, బంధాన్ని, స్నేహాన్ని పెంచుతుంది. ఏడుపుతో అనుబంధాలు బలపడతాయి. ఏడుపు ఒత్తిడిని తగ్గిస్తుందన్నది తెలిసిందే. అయితే.. అది వ్యక్తిగత సంబంధాలనూ మెరుగుపరుస్తుందట. ఏడిస్తే శత్రువు కూడా కరిగిపోయే అవకాశం ఉందని, కన్నీరు మనుషులను దగ్గర చేస్తుందని టెల్ అవీవ్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. ఇతరుల కన్నీటికి కరిగిపోవడం మానవ నైజమని కూడా వారు గమనించారు. మానవ పరిణామక్రమంలో ఏడుపనేది.. మన అవసరాలను, విధేయతను తెలియజేస్తుందని, దీనితో సాంఘిక సంబంధాలు బలపడే అవకాశం ఉంటుందని బ్రిటన్‌లోని 'ఎవల్యూషనరీ సైకాలజీ' అనే జర్నల్‌లో ప్రచురించారు. ముఖ్యంగా పరుల నుంచి సానుభూతి సాధించడానికి, మన అవసరాలకు అనువైన సహాయాన్ని పొందడానికి ఏడుపు చక్కటి సాధనంగా పని చేస్తుందని పరిశోధకులు సెలవిస్తున్నారు. వివిధ సందర్భాల్లో స్పందించిన వ్యక్తుల నిజాయితీని వారి ఏడుపు కారణంగా ఇతరులు గ్రహించే అవకాశం ఉందని తేలింది.అంతే కాక, కన్నీరు కార్చడం వలన ఇరువురి మధ్య బంధం మరింత బలపడే అవకాశం ఉందని తేలింది. అయితే.. ఎక్కడ పడితే అక్కడ ఏడిస్తే ఫలితం ఉండకపోవచ్చని కూడా చెబుతున్నారు. ఉదాహరణకు మనం పని చేసే కార్యాలయంలో బక్కెట్ల కొద్దీ కన్నీరు కారిస్తే ఫలితం ఉండదని స్పష్టం చేశారు. మనతో ఏదో విధమైన అనుబంధం ఉన్న వారి దగ్గర ఏడిస్తేనే ఫలితం ఉంటుందన్న మాట.
  • ============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.