ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --చిన్నపిల్లలో వ్యాయామం ,Exercise in children -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇది పిల్లలకూ ఎంతగానో మేలు చేస్తుందని మీకు తెలుసా? 7-8 ఏళ్ల పిల్లలు ఎక్కువ సమయం వ్యాయామం చేస్తే వారి ఎముకల పరిమాణం,సాంద్రత బాగా పెరుగుతున్నట్టు తాజాగా స్వీడన్ అధ్యయనంలో వెల్లడైంది. గతంలో పిల్లలు అధికంగా వ్యాయామం చేస్తే ఎముకలు విరిగే ప్రమాదముందని భావించేవారు. కానీ ఇది నిజం కాదని నాలుగేళ్లుగా చేసిన ఈ అధ్యయనంలో తేలింది.
ఇందులో భాగంగా ఒక స్కూలులోని విద్యార్థులకు వారానికి 200 నిమిషాల పాటు పరుగెత్తటం, గెంతటం, తాడుతో పైకి ఎగబాకటం, బాల్ గేమ్స్ వంటివి ఆడటం చేయాలని సూచించారు. అలాగే మరికొన్ని స్కూళ్లల్లో చదివేవారికి వారానికి 60 నిమిషాల పాటు సాధారణ వ్యాయామం చేయమని చెప్పారు.
నాలుగేళ్ల అనంతరం పరిశీలించగా.. ఎక్కువ సమయం వ్యాయామం చేసినవారిలో వెన్నెముక, మెడ తదితర భాగాల్లో ఎముక పరిమాణం పెరిగినట్టు గుర్తించారు. ఇది మున్ముందు అంటే ఎముక సాంద్రత అధికంగా పెరిగే 25-30 ఏళ్ల వయసులో వారికి చాలా ఉపయోగపడుతుందని స్వీడన్‌లోని లుంద్ విశ్వవిద్యాలయానికి చెందిన లాఫ్‌గ్రెన్ వివరించారు. అందుకే చిన్నతనంలోనే పిల్లలకు వ్యాయామం చేయటాన్ని తప్పకుండా అలవాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
వ్యాయామం (Exercise) మంచి ఆరోగ్య పరిరక్షణ కోసం చాలా అవసరం. శరీరములో శక్తి (energy) వినియోగించుకొని కేలరీలను ఖర్చు చేసే పని ఏదైనా సరే వ్యాయామమే . ఇది ఎక్కువగా కండరాలను, రక్త ప్రసరణ వ్యవస్థను ధృఢపరచడానికి, క్రీడలలో మంచి ప్రావీణ్యత సాధించడానికి ఉపయోగిస్తారు. దైనందిక వ్యాయామం వలన మన శరీరపు వ్యాధినిరోధక శక్తి వృద్ధిచెందుతుంది, గుండెకు సంబంధించిన వ్యాధులు, స్థూలకాయం, మధుమేహం వంటి వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది. కొన్ని రకాల మానసిక వ్యాధుల నివారణ కు తోడ్పడుతుంది.
పోటీ చదువులు, నగర జీవనంతో పిల్లలకు మైదానంలో ఆటలకు అవకాశం లేకుండా పోయింది. దాంతో టీవీలూ, కంప్యూటర్లతోనే వారు కాలక్షేపం చేస్తున్నారు. ఆరుబయట ఆటలతో పిల్లలు వ్యాయామం చేసినట్లవుతుంది. శరీరానికి కావాల్సిన విటమిన్-డి లభిస్తుంది. అంతేకాదు, పిల్లలు బయట ఆడుకుంటే కంటి సమస్యలు తక్కువగా ఉంటాయట. వారంలో కనీసం ఎనిమిది గంటలూ అంతకన్నా ఎక్కువ సమయం బయట ఆడితే కంటి జబ్బులు దాదాపు దరిచేరవంటున్నారు వైద్యులు. టీవీలూ కంప్యూటర్లు చూసేటప్పటికంటే బయట ఎక్కువ ప్రాంతాన్ని చూడటానికి కంటి నరాల మధ్య మరింత సమన్వయం అవసరం. అదేవారి కంటిచూపు మెరుగు పడటానికి ఉపయోగపడుతుందట.
- ===================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.