Wednesday, September 5, 2012

కాన్పు తర్వాత అందాలకు మమ్మీ మేక్ ఓవర్ విధానము




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -కాన్పు తర్వాత అందాలకు మమ్మీ మేక్ ఓవర్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

  • తల్లులందరూ తమ పిల్లల కోసము సమయము , శక్తి ,డబ్బులను ఖర్చు చేస్తారు . అలాచేయడంతో ఆనందం ఉంటుంది . వారి త్యాగాలన్నీ కుటుంబాన్ని ఆనందము గా , ఆరో్గ్యముగా ఉంచేందుకే . అయితే ఆ శ్రమ , త్యాగాలలో పడి వ్యక్తిగత శ్రద్ద మరిచిపోతారు . మీగురించి మీరు శ్రద్ద తీసుకుంటూ పిల్లలను జాగ్రత్తగా పెంచవచ్చు . సరిగా ఆ విషయము తెలియచెప్పడమే మమ్మీమేకర్ ప్రొసీజర్ . వయసు తో , ప్రసవాలతో శరీరములో వచ్చిన అనవసరపు మార్పులను వదిలిందుకొని గతరూపము తెచ్చుకునేందుకు ... అనేక శస్త్ర చికిత్సావిధానాలు అందుబాటులోనికి వచ్చాయి.
  • కొంతమంది ఆడవారు కుటుంబం మీదకాక తమమీద శ్రద్ద పెందుకోవడము ఇబ్బంది కరమంటారు . ఇది ఎంతమాత్రము నిజము కాదు . అందముగా ఉండడము ఆరోగ్యములో ఒక భాగమే . చక్కని రూపంతో ఉండడము లో చాలా లాభాలు ఉన్నాయి. మీ పిల్లలు , భర్తల తో అన్యోన్యము గా ఉండి వారి ప్రవర్తనలొ మార్పులు రావడము ఈ లాభాలలో ఒకటి . మీలో ఆత్మవిశ్వాసము పెరగడము , సమాజములో ఒక ప్రత్యేకత ఉంటాయి.
మమ్మీ మేక్ ఓవర్(Mummy make-over) లో ఉపయోగించే సర్వ సాధారణ విధానాలు :
  • బ్రెస్ట్ ఆగ్మెంటేషన్‌(Breast Agumentation): సిలికాన్‌ లేదా సిలికాన్‌ ఇంప్లాంట్స్ అమరికతో్ స్తనాలు చక్కని రూపాన్ని సంతరించుకుంటాయి. దీనిలో ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ను సూచిస్తారు.
  • బ్రెస్ట్ లిప్ట్(Breat Lift) : స్థనాలను చాతీలో మరికొంచం పైభాగం లో అమర్చడాన్ని బ్రెస్ట్ లిప్ట్ అంటారు. ఈ ప్రక్రియలో స్థనాలకు యవ్వన రూపము ఇవ్వడము ముఖ్యమైనది .
  • బ్రెస్ట్ రిడక్షన్‌(Brest Reduction): గర్భానికి ముందు బాగా పెద్దస్థనాలు కలిగిన స్త్రీలకు ప్రసవం తరువాత కూడా అదే సైజ్ లో నిలిచి ఉంటాయి. వదులుగా కిందకి వ్రేలాడే విధం గా ఉంటాయి. కొద్దిపాటి శస్త్ర చికిత్స ద్వారా గుండ్రని , బిగుతైన , చిన్న స్థనాలను పొందవచ్చును.
  • అబ్డోమినో ప్లాస్టీ(Abdomino plasty) : స్త్రీలు ఎక్కువగా గమనించేది పొట్టను మాత్రమే . పొట్ట వదులుగా , లావుగా వ్రేలాడేదిగా తయాతవుతుంది . పొట్టమీద ముడతలు , చారలు వస్తాయి. మమ్మి టక్ ప్రక్రియలో కొద్దిపాటి సర్జరీ తో మంచి ఆకృతిని పొందవచ్చును.
  • లైపో సక్షన్‌ (Lipo sucction): ఇది ఒక కొత్త పద్దతి . దీనిలో కొవ్వును ఒక ప్రత్యేక పక్రియ ద్వారా తీసెస్తారు . కొన్నిచోట్ల సర్ది పెడతారు . చాతీ , నడుము మంచి ఆకృతిలోకి వస్తాయి.
  • జెనైటల్ రీజువెనేట్ సర్జరీ(Genital Rejuvunet surgery) : పురుడు తరువాత స్త్రీ జననేంద్రియాలు వదులుగా తయారవుతాయి. జెనైటల్ పార్ట్ లు టైట్ చేయడము ద్వారా మంచి ఆకృతిని పొందవచ్చును . దీనివలన తమ లైంగిక భాగస్వామికి మరింత ఆనందము అందుతుంది . వెజైనో ప్లాస్టీ ద్వారా ఇది వీలవుతుంది .

courtesy with Dr.Deepu Chundru-MS,Mch(plastic surgeon)sunshine hospital - Hyd.

  • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.