Monday, September 10, 2012

Health foretellers, ఆరోగ్య శకునాలు


  • ఆరోగ్యమే మహాభాగ్యము.మ
  • నిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Health foretellers, ఆరోగ్య శకునాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఆరోగ్యముగా ఉండడము ఎంత మహాభాగ్యమో అనారోగ్యము వస్తే కాని తెలియదు . ఎవరికి వారు ఆరోగ్యముగానే ఉన్నామని భావిస్తుంటారు . అనారొగ్య చిహ్నాలు కనిపిస్తున్నా వాటిని గుర్తించకుండా వాటికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా నిత్యజీవితాన్ని గడిపేస్తుంటారు . వ్యాధి ముదిరేక గుర్తించి అప్పుడు చేసేదేమీ లేక చింతిస్తారు .

కొన్నిరకాల జబ్బులను చిన్న చిన్న లక్షణాలతోగుర్తించవచ్చు. బ్రెయిన్‌ ట్యూమర్ లాంటి పెద్ద జబ్బుని ఒక చిన్న షేక్ హ్యాండ్ తోనే నిపుణుడైన వైద్యుడు గుర్తించేస్తాడు . ఉదా: ముంబై లో ఒక డాక్టర్ తన స్నేహితుడికి ఓ రెస్టారెంట్ లో కలిసి షేక్ హేండ్ ఇచ్చాడు .అతని అరచేయి " ప్లెష్షీ" (fleshy) గాఉండడము తో డాక్టర్ కి అనుమానము వచ్చి ... బ్రెయిం ట్యూమర్ వచ్చిన వారి చేతుల్లో టిష్యూ ఎక్కువగా పేరుకుపోతుందనే విషయము గుర్తుకువచ్చి బ్రెయిన్‌ ట్యూమర్ టెస్ట్ లు చేయించాడు . పరీక్షల్లో డాక్టర్ అనుమానము నిజమని ధృవపడింది. వెంటనే ఆపరేషన్‌ కి ఏర్పాటులు చేసి ట్యూమర్ తొలగించారు . ప్రాణాంతకమైన జబ్బులను కూడా తొలిదశలో కొన్ని ముందస్తు హెచ్చరికల ద్వారా గుర్తించే అవకాశము ఉందనే నమ్మకము ఈ ఉదాహరణ తో మనకు బోదపడుతుంది. అటువంటి వాటిలో కొన్ని :->
  • వెన్నునొప్పి :

వెన్నునొప్పి కిడ్నీలో రాళ్ళకు సంకేతము కావచ్చు . తుంటి ఎముకలకు , పక్కటెముకలకు (హిప్ , రిబ్స్ ) మధ్య నొప్పి జివ్వున లాగేస్తుంటే ఒకసారి డాక్టర్ ని సంప్రదించాల్సిందే ... ఈ నొప్పి ఒక్కోసారి తీవ్రంగా ఉండి , ఒక్కోసారీ తెలిసీ తెలీనట్లు గా పోతుంది . దీనివల్ల చాలామంది ఈ నొప్పిని తగ్గిపోతుందిలే అని నిర్లక్ష్యము చేస్తుంటారు ... ఏవో బరువైన వస్తువులను ఎత్తడం వల్ల వచ్చిన నొప్పిలే అని కొట్టిపడేస్తారు . .. కాని అది మూత్రాయం లో రాళ్ళకు సంబంచిన ముందస్తు హెచ్చరిక అని గుర్తుపట్టరు . ప్రతి 10 మంది మగవాళ్ళలో ఓకరికి మూత్రాశయములో రాళ్ళ అనారోగ్యము వస్తుంది . ఆ జబ్బును నివారించకపోతే మూత్రము సాఫీగా రాదు . దానివల్ల మూత్రాశయం వాపు వచ్చి క్రమేపీ నొప్పి తీవ్రమవుతుంది .


ఏమి చేయాలంటే :
నొప్పి మళ్ళీ మళ్ళీ వస్తున్నా లేదా గుదంలోకి పాకుతున్నా వెంటనే డాక్టర్ ని సంప్రదించి సరియైన ట్రీట్ మెంట్ తీసుకోవాలి. వారానికి మూడు సార్లు 45 నిముషాల పాటు కార్డియో ఎక్స్ ర సైజ్ లు చేయడము ,రోజూరెండున్న లీటర్ల నీరు తాగడము లాంటివి చేయాలి. ఇందువల్ల మూత్రాశయం లో రాళ్ళు పెరగకుండా అరికట్టవచ్చును.
  • పాదాల్లో నొప్పి :

డిస్క్ జారడము వల్ల కావచ్చు " హెర్నియేటెడ్ " లేదా " ప్రోలాప్సెడ్ డిస్క్ వల్ల పాదాల్లో నొప్పి వస్తుంది . సామాన్యము గా నొప్పి ఉదయము పూట ఎక్కువగా ఉంటుంది .కూర్చోవడము వల్ల నొప్పి తీవ్రమవుతుంది . వెన్నునొప్పి లేకపోవడము వల్ల దీన్ని డిస్క్ సమస్యగా సామాన్యముగా డాక్టర్ లు గుర్తించలేకపోతారు. ఈ సమస్యను నివారించకపోతే సయాటిక్ నరం మీద ఒత్తిడి ఎక్కువై ఆ కాళు అంతా తిమ్మిరి గాను , నొప్పిగాను వచ్చే స్థితి సంభవిస్తుంది. ఏమి చేయాలంటే : పొత్తికడుపు మీద పడుకుని కోబ్రా ఆసనాలు ఓ పదిసార్లు మృదువుగా చేయాలి. పిరుదులను నేలకు ఆనించి వీపుని మాత్రము బాణం లా వంచి చేతులను నెమ్మదిగా చాపాలి. ఈ ఎక్సర్ సైజ్ లు చేయడము వలన ఒత్తిడి తగ్గి నొప్పి కూడా తగ్గుతుంది. దిస్క్ సమస్యని కూడా ఇలా ఎక్సర్ సైజులతో తగ్గిందుకోవచ్చు. ఫిజియో థెరపీకి వెళ్ళేవరకు ఈ ఎక్సర్ సైజులు అవసరాన్నిబట్టి గంటకు ఒకసారి చేసుకుంటూ నొప్పిని తగ్గించవచ్చును.

  • కాళ్ళనొప్పులు :

నడిచేటప్పుడు , పరుగెత్తేటప్పుడు కాళ్ళ నొప్పులున్నాయంటే అది కార్డియోవాస్కులర్ జబ్బు లక్షణముగా గుర్తించవచ్చు. ఆర్థోపెడిక్ సమస్యవల్ల కూడా కాళ్ళ నొప్పులొస్తాయి. అయితే వెన్నుపూస కండరాలు కుంచించుకుపోవడము వల్ల ఆర్టరీస్ సమస్య వస్తుంది. నడవడం ,పరుగెత్తడం మానెయ్యగానే నొప్పి తగ్గిపోతుంది. బరువులు ఎత్తినా , వేగంగా నడిచినా మళ్ళీ నొప్పి వస్తుంటే గుండె పోటు వచ్చే ప్రమాదము తొలిదశలో ఉన్నట్లు సంకేతము . ఏం చేయాలంటే : కాళ్ళు నొప్పులు వస్తుంటే ఇంట్లో ఎవరికైనా గుండెజబ్బు ఉన్న చరిత్ర ఉంటే గుండె జబ్బుల డాక్టర్ని కలవాలి .

  • మెడ,భుజము నొప్పి:

అది లైమ్‌ వ్యాధి కావచ్చు . కీఈళ్ళనొప్పుల వల్ల జిమ్‌ కి వెళ్ళ్డం మానేస్తున్నారా? సూదులతో పొడుస్తున్నట్లు తలనొప్పితో బాధపడుతున్నారా? ఫలానా చోట అని గుర్తు చెప్పలేం కాని మొత్తం గా నొప్పిఉంటుంది. సమస్య తీవ్రమయ్యాక కాని లైమ్‌ వ్యాధిగ్రస్తులు డాక్టర్ దగ్గరకు రావడం లేదు . అందుకు మొదటి కారణం అనేక మంది మెడనొప్పిని మామూలు నొప్పి గా భావించి పెద్దగా పట్టించుకోకపోవడం . రాత్రి నిద్రసరిగా లేకపోవడం వల్ల మెడనొప్పి వచ్చి ఉంటుదనుకోవడము . అది తప్పు . అది మెనింజైటీస్ లేదా ఫేసియల్ పాల్సీ, తీవ్రమైన ఆర్థరైటిస్ కావచ్చు . కాబట్టి మెడనొప్పి , భుజాల నొప్పి అనిపిస్తే డాక్టర్ ని సంప్రదించి పరీక్షలు చేయిందుకోండి. ఏమి చేయాలంటే : తలనొప్పి , కీళ్ళు నొప్పులు కనిపిస్తే ప్రమాదకరమైన జబ్బులేవీ లేవని డాక్టర్ ని సంప్రదించి నిర్ధారణ చేసుకోండి . కొన్ని రకాల జబ్బులకు నిర్ధారణ కొంచం కష్టం . నొప్పి ఎక్కడ , ఎప్పుడు , ఎలా వస్తుందో ఎంతసేపు ఉంటుందో గుర్తుపెట్టుకొని డాక్టర్ కి తెలియజేస్తే జబ్బు నిర్ధారణ సులువవుతుంది .

  • నోటి దుర్వాసన :


ఊపితి తిత్తుల వ్యాధి లేదా తొలిదశ మధుమేహం కావచ్చు . దంతాల చిగుళ్ళ వ్యాధి కావచ్చు . గతరాత్రి వెళ్ళుల్లి తిన్నాం కాబట్టి నోటి దుర్వాసన వచ్చిందనుకొని నిర్లక్ష్యం చేస్తుంటారు కొందరు. కాని అది తప్పు. టిక్ -టాక్ నోట్లో వేసుకుంటే పోయే దుర్వాసన కాకపోవచ్చు . కొన్ని ఊపిరితిత్తుల వ్యాధులు ... ఆస్మా , సిస్టిక్ ఫైబ్రోసిస్ , లంగ్ యాబ్సెస్ కావడం వలన వచ్చే దుర్వాసన అయిఉండవచ్చును . ఆ దుర్వాసన ఎంత యాసిడ్ తో కూడుకొని ఉంటుందో జబ్బు అంటతీవ్రమైనట్లు లెక్క . దాదాపు 90 శాతము నోటిదుర్వాసన కేసులు గమ్‌ (gums)సమస్యలవల్ల లేదా నోరు పరిశుబ్రము గా ఉంచుకోకపోవడం వల్ల వస్తుంది. మిగతా 10 శాతము ఊపిరితిత్తుల వ్యాధి , లివర్ వ్యాధి మదలైన వాటి మూలాన వస్తుంది. ఏమి చేయాలంటే : నొరు ఎండిపోవడం , సైనస్ , గమ్‌ వ్యాధులు , పొగ తాగడం లాంటి వాటివలన నోటి దుర్వాసన వస్తుందా? లేక మరేదైనా కారణమున్నదా ? అని వైద్యుని సంప్రదించి తెలుసుకోవాలి. నోటి కాన్సర్ తొలిదశలో దంత వైద్యులు గుర్తుపట్టి హెచ్చరిస్తారు. మొదటిలో అయితే చికిత్స చేయడం సులభం అవుతుంది.

  • నీళ్ళ విరోచనాలు :

హార్మోనులు సరిగా పనిచేయకపోవడం వలన ప్రతి 50 మందిలో ఒకరు ఈ నీళ్ళ విరోచనాల సమస్యతో బాధపడుతుంటారు. దీన్ని సరిగా నిర్మూలంచకపోతే చాలామంది యువకులు " గ్రేవ్స్ " జబ్బు బారిన పడతారు. దీని వల్ల కండరాల పనితీరు , పటుత్వము తగ్గిపోతాయి. జుట్టురాలిపోతుంది . తీవ్రమైన కంటిచూపు సమస్యలు వస్తాయి. నీళ్ళవిరోచల్లతో బరువు విపరీతం గా కోల్పోతారు . ఆకలి తగ్గిపోతుంది. ఏమి చేయాలంటే : -> నీళ్ళ విరేచనాలతో చాలా రొజులపాటు బాధపడటం తో పాటు నిద్రలేమి , ఎండకు తట్టుకోలేకపోవడం ఉంటే " థైరాయిడ్ " సమస్య అయి ఉండవచ్చు. జనరల్ ఫిజీషియన్‌ ని సంప్రదిస్తే తగిన పరీక్షలు చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడును.

  • నపుంసకత్వ సమస్య :

ప్రపంచము లోనే ప్రతిష్టాత్మకమైన హార్వార్డ్ విశ్వవిద్యాలయం ఇటీవల జరిపిన పరిశోధనల ప్రకారం మగవాళ్ళలో నపుంసవత్వము కు కారణము " పార్కిన్‌ సన్స్ " వ్యాది తొలిదశ కావచ్చని సూచించారు. ఈ వ్యాధి - (నపుంసకత్వం) వచ్చిన వారిలో ఎక్కువందికి తర్వాత పార్కిన్‌సన్‌ వ్యాధి బయటపడినట్లు అంటారు. ఏమి చేయాలంటే : ఈ వ్యాధిని అరికట్టేందుకు సులువైన తెలిసిన మార్గం అంటూ ఏదీ లేదు. అమెరికాలోని కొంతమంది న్యూరాజిస్ట్ లు ప్రకారము జీన్స్ లో మార్పు వలన ఈ వ్యాది వస్తుందంటారు. మిలియన్ల కొద్దీ మగవాళ్ళు ఈ సమస్యతో బాధపడు తున్నట్లు అంచనాలు ఉన్నాయి. మంది డాక్టర్ ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి .


Note : ఇలా చిన్న చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే డాక్టర్ ని సంప్రదించి పెద్దబబ్బుల... లేదా జబ్బు ముదిరి పోకుండా జాగ్రత్తవహించంది.


  • =====================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.