Wednesday, March 21, 2012

cholesterol level in our body, కొలెస్టిరాల్ అటు...ఇటుఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -cholesterol level in our body, కొలెస్టిరాల్ అటు...ఇటు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ..

  • మానవ శరీరములో సహజముగా తయారయ్యే కొవ్వు పదార్ధము ... కొలెస్టిరాల్ . కాలేయములో తయారై రక్తప్రసరణలోకి చేరే కొలెస్టిరాల్ శరీరానికి మేలుచేస్తుంది . ఎన్నో హార్మోనులు తయారీకి సహకరిస్తుంది. అయితే కొలిస్టరాల్ మోతాదు మించి తయారైతే గుండెజబ్బులు , గుండెపోటుకు కారణమవుతుంది.
  • మనము తీసుకునే కొన్ని ఆహారపదార్ధాలు కొలెస్టిరాల్ ఉత్ప త్తిని పెంచుతాయి. పాలు , నెయ్యి, వెన్న , కేక్ లు , పేస్టీలు , జంతు మాంసం ఉత్పత్తులు వల్ల కొలెస్టిరాల్ పెరుగుతుంది . సముద్రపు జీవులు , పచ్చసొన తీసేసిన గుడ్లు వల్ల అంతగా ప్రమాదము ఉండదు . క్లెస్టిరాల్ అదుపులో ఉండాలంటే కూరగాయలు , పండ్లు ఆహారములో ప్రధానము గా తీసుకోవాలి. మీగడ తీసిన పాలు , దంపుడు బియ్యము , దంపుదు గోధుమలు లతో చేసిన పదార్ధములు తినాలి.
  •  
Food hints to avoid High cholesterol,ఒంట్లో కొలెస్ట్రాల్‌ మోతాను తగ్గించుకోవడానికి ఆహారం సూచన్లు

ఒంట్లో కొలెస్ట్రాల్‌ మోతాను తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నారా? ఇప్పటికే వ్యాయామాల వంటివీ మొదలుపెట్టి ఉంటారు కూడా. అదొక్కటే సరిపోదు. తినే తిండి విషయంలోనూ అదుపు పాటించటం ఎంతో అవసరం. ముఖ్యంగా పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు, విందు వినోదాల పేరిట హోటళ్లకు వెళ్లినపుడు మరీ జాగ్రత్తగా ఉండాలి. ఒకపక్క నూనెలో వేయించిన పిండి వంటకాలు మరోపక్క మాంసం వంటి కొవ్వు పదార్థాలు నోరూరిస్తుంటాయి. ఇలాంటప్పుడు జిహ్వ చాపల్యాన్ని కొద్దిగా పక్కనపెట్టి ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

* నూనెలో బాగా వేయించిన వంటకాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటికి బదులు ఉడికించినవి, తక్కువ నూనెతో లేదా అసలు నూనె లేకుండా కాల్చిన రొట్టెల వంటివి తీసుకోవటం మేలు.

* కొవ్వు ఎక్కువగా గల పదార్థాల కన్నా తక్కువ కొవ్వు పదార్థాలను ఇష్టపడటం అలవాటు చేసుకోవాలి. వేపుళ్లకు బదులు ఆవిరి మీద ఉడికించిన కూరగాయలు తీసుకోవచ్చు. పైన బటర్‌, క్రీమ్‌తో అలంకరించిన తినుబండారాలకూ దూరంగా ఉండొచ్చు.

* కొవ్వు ఎక్కువగా ఉండే గొర్రె మాంసం వంటివి తింటే కొలెస్ట్రాల్‌ మోతాదు మరింత పెరిగే ప్రమాదముంది. కాబట్టి వాటికి బదులు చేపలు, చికెన్‌ వంటివి తీసుకుంటే మంచిది.

* కూరల్లో అదనంగా ఉప్పు వేసుకోవటం ఏమంత మంచి అలవాటు కాదు. దీంతో మరింత ఎక్కువగా లాగించే అవకాశముంది. కాబట్టి అసలు ఉప్పు గిన్నెను టేబుల్‌ మీది లేకుండా చూసుకోవటం మేలు.

* అలాగే ఆహారాన్ని బాగా నములుతూ నెమ్మదిగా తినాలి. దీంతో ఎక్కువెక్కువ తినకుండా చూసుకోవచ్చు.

* ఇక భోజనం ముగిశాక ఐస్‌క్రీం వంటివి కాకుండా తాజా పళ్ల ముక్కలను తినే అలవాటు చేసుకోవాలి.
  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.