- image : courtesy with Surya daily news paper.
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు
--హిస్టెరెక్టమీ తర్వాత సెక్స్ సమస్యలు అపోహలు-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
కొన్ని గైనిక్ సర్జరీల తర్వాత కొన్ని రకాల సెక్స్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కారణాలుగా అండాశయాల పనితీరు దెబ్బతిని హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం జెనైటల్‌ట్రాక్‌లో లేదా యోనిమార్గంలో నిర్మాణానికి సంబంధించిన మార్పులు సర్జరీ సమయంలో పేషెంట్ వ్యాధి తీవ్రతను తగ్గించడానికో ప్రాణాలు కాపాడ్డానికో చేయవలసిరావటంగా చెప్పవచ్చు. పేషెంట్ ఈ విషయాలు గమనించి డాక్టర్‌కో, సెక్సాలజిస్ట్‌కోఈ విషయాల్ని చెప్పగలిగినపుడు సరైన సూచనలు కొని మార్పుల ద్వారా మానసిక ఒత్తిడిని, ఆందోళనలను తగ్గించవచ్చును.
-తీవ్రమైన డిస్‌ఫంక్షనల్ యుటెరైన్ బ్లీడింగ్ ద్వారా రోగి తీవ్రమైన రక్తహీనతకు గురవుతున్నపుడు గర్భసంచిలో మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నపుడు, ఎండోమెట్రియాసిస్, సెర్వైకల్ కాన్సర్ ఒవేరియన్ కాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులున్నపుడు గర్భసంచిని శస్తచ్రికిత్స ద్వారా తొలగించడానినే హిస్టెరెక్టమీ అంటారు. చాలామంది స్ర్తీలు ఈ సర్జరీ అయిన తర్వాత కొన్ని రకాల దాంపత్య సమస్యలను ఎదుర్కొం టుంటారు. అదీ అపోహలతో అనుమానాల తో అశాస్ర్తీయమైన దృక్పథంతో! పైగా సర్జరీ ముందు తర్వాత కౌన్సెలింగ్ సరిగా చెయ్యకపోవడం కూడా ఒక కారణం! చాలామంది గర్భసంచి శరీరంలోంచి కోల్పోయిన తర్వాత దాంపత్యజీవితంలో శృంగారపర్వం ముగిసిపోయిందని తమకు శృంగారసమస్యలు వస్తాయని భ్రమపడుతూ భయపడుతుంటారు.
ఇది దంపతులు ఇరువురిలోనూ వస్తుంది. చాలామంది స్ర్తీలు డాక్టరు ఎంత చెప్పినా చాలాసార్లు హిస్టెరెక్టమీ చేయించుకోవడానికి వెనకాడతారు. కారణం- గర్భసంచి తో వుండటాన్ని స్ర్తీ పరిపూర్ణత్వంగా భావిస్తుంది. గర్భసంచి తొలగించిన తర్వాత శరీరంలో ఏదో ఖాళీ ఏర్పడినట్టు డొల్లతనంగా ఫీల్ అవటమే కాక డిప్రెషన్‌లోకి వెళిపోతుంటారు. భర్తకు తనపైన ఆకర్షణ, ప్రేమ తగ్గిపోయాయని భావిస్తూ చాలామంది భర్తలు కూడా స్ర్తీలు గర్భసంచి కోల్పోయిన తర్వాత శృంగార జీవితానికి పనికిరానివారైపోయారని ఆందోళన పడుతూ భార్యలను మానసికంగా హింసిస్తూ అవమానిస్తుంటారు. అందువల్లనే హిస్టెరెక్టమీ సర్జరీ ముందు, తర్వాత భర్తలకు కూడా కౌన్సిలింగ్ చాలా అవసరం. చాలామంది పురుషులు ఈ సర్జరీ తర్వాత భార్యతో శృంగారం పట్ల అనాసక్తిని ప్రదర్శించడమే కాకుండా పాల్గొనకుండా దాటివేయడం తమకు కూడా క్యాన్సర్ వస్తుందేమోనని, ఒకవేళ అదే కారణం గా గర్భసంచి తొలగిస్తే భయపడతారు. ఈ రకమైన అవమానాలు, భయాలతో భార్య ను గాయపర్చకుండా ఉండటం కోసం ప్రి అండ్ పోస్ట్ ఆపరేటివ్ కౌన్సెలింగ్ చాలా అవసరం.
హిస్టెరెక్టమీ తర్వాత ఆఫెరెక్టొమీ(Oopherctomy) లేదా అండాశయాల్ని తొలగించి లేదా తొలగించకపోయినా పేషెంట్‌కు సరైన విధంగా హార్మోన్‌రీప్లేస్‌మెంట్ థెరపీ(హెచ్‌ఆర్‌టి) ఇచ్చిన తర్వాత కూడా ఆమె శృంగార సమస్యలను ఎదుర్కొంటుంది. అదే ప్రధాన కారణం. మానసిక పరమైనవే అయి వుంటాయి కచ్చితంగా. ప్రధానంగా గర్భసంచీని కోల్పోవటం వల్ల సంతానాన్ని పొందే శక్తిని స్ర్తీత్వాన్ని కోల్పోయినట్టుగా అనుకోవటం. అలాగే సంతానోత్పత్తికి పనికిరాని శృంగారం వృథా అనుకోవడం సరైనది కాదు. ఈ భావన వల్ల కూడా శృంగార వైఫల్యం కలుగుతుంది. సర్జరీకి ముందు ఒకవేళ పేషెంట్ తీవ్రమైన నొప్పి సంయోగ సమయంలో అనుభవించినట్లయితే సర్జరీ తర్వాత కూడా భయంతో శృంగారాన్ని తిరస్కరిస్తారు.
-అలాగే భర్తను మునుపటిలా సంతృప్తిపరచగలనా అని కూడా ఆందోళన చెంతుతుంటారు. తనలో కూడా శృంగార ప్రేరణలు తగ్గిపోయాయని దానికికారణం తనకు జరిగిన సర్జరీ అనే భావిస్తుంటారు. అలాగే సర్జరీ తర్వాత బరువు పెరుగుతామని హిర్యుటిసమ్(Hirsutism) అనే వ్యాధికి గురవుతామని దాంతోపాటు ముసలితనంలోకి త్వరగా వెళిపోతామని అపోహలకు, అర్ధం లేని భయాలకు లోనవుతుంటారు. హిస్టెరెక్టమీ జరిగిన మూడు సంవత్సరాలలోపు 70శాతం స్ర్తీలు తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళుతున్నట్టు పోస్ట్‌ఆపరేటివ్ సెక్సువల్ డిస్‌ఫంక్షన్స్ పరిశోధన సమాచారంలో బయటపడింది.
వెజైనల్ లూబ్రికేషన్ తగ్గుతుంది. అది కూడా రెండు వైపులా ఉండే అండాశయాలు తొలగిస్తేనే ! దాని వల్ల యోనిమార్గం పొడిబారి సంయోగసమయంలో మంట, నొప్పి కలిగి శృంగారం పట్ల భయం ఏర్పడి విముఖత కలుగుతుంది. ఈ బాధ హార్మోన్ రీప్లేస్‌మెంట్ చికిత్స వల్ల తగ్గిపోతుంది. అయితే ఈ ఈస్ట్రోజన్ రీప్లేస్‌మెంట్ చికిత్స శృంగార కోరికలు పెంచడానికో, భావప్రాప్తిని కలిగించడానికో ఇవ్వడం జరగదు. హెచ్‌ఆర్‌టి వల్ల ఎముకలు పెళుసుబారటం, ప్రిమెచ్యూర్ ఆర్టిరియల్ డిసీజ్‌ని తగ్గించడానికి వెజైనా పొడిబారడాన్ని తగ్గించి లూబ్రికేషన్ పెంచి అంగప్రవేశం తర్వాత మంట, నొప్పి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈస్ట్రోజెన్స్ రిప్లేస్మెంట్ ఇవ్వకూడని పరిస్థితిలో కే-వై జెల్లీ లేదా సెన్సిలి జెల్లీ వెజైన్‌లో వాడవచ్చు.
అయితే కొంతమంది స్ర్తీలలో హిస్టెరెక్టమీ తర్వాత ఈస్ట్రోజన్ రీప్లేస్‌మెంట్ థెరపీ వల్ల స్పర్శకు సంబంధించిన శృంగారోద్దీపనలు కలగటం గమనించారు. ఒకవేళ సర్జరీ తర్వాత ఏవైనా ఆరోగ్యసమస్యలు (పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్) వస్తే తిరిగి కోలుకోవడానికి సమయం పడుతుంది. దాంతోపాటుగా శృంగార జీవితం తిరిగి ఆరంభించడానికి సమయం పడుతుంది. వెజైనల్ కఫ్‌ని సుపీరియర్ పొజిషన్‌లో పెట్టేటపుడు సరైన శ్రద్ధతీసుకోకపోతే సంయోగం అపుడు స్నేర్డ్ ఏరియాలో రాపిడి వల్ల నొప్పి కలగవచ్చు.
Visit my website - >
Dr.Seshagirirao.com/
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.