Saturday, March 24, 2012

మూలికా వైద్యము,హెర్బలిజం ,Herbalism
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మూలికా వైద్యము- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


హెర్బలిజం (Herbalism) అనేది మొక్కలు లేదా మొక్కల నుంచి సేకరించిన పదార్ధములను వాడి చేసే ఒక సంప్రదాయ వైద్య విధానము లేదా గ్రామీణ వైద్య విధానము. హెర్బలిజం ను బొటానికల్ ఔషదము , మెడికల్ హెర్బలిజం , మూలికా వైద్యము , హెర్బాలజీ మరియు ఫైటోథెరపీ అని కూడా అంటారు. మూలికా వైద్యములో
ఒక్కోసారి శిలీంద్ర సంబంధ పదార్దములు మరియు తేనే టీగల ఉత్పత్తులు ఇంకా ఖనిజ లవణములు, గుల్లలు మరియు కొన్ని జంతువుల ప్రత్యేక భాగములు వంటివి కూడా వాడబడతాయి. ఔషధ వృక్ష శాస్త్రం అనేది సహజవనరుల నుంచి తయారు చేయబడిన ఔషధాల గురించి చేసే ఒక అధ్యయనము.

సాంప్రదాయకముగా మందులను వాడడము అనేది భవిష్యత్తులో రాబోయే క్తివంతమైన మందుల గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. 2001 లో , ఖ్యమైన
ఔషధములలో వాడబడిన 122 మిశ్రమ ధాతువులు "ఎథ్నోమెడికల్" మొక్కల నుంచి తీసుకోబడ్డాయి అని పరిశోధకులు కనిపెట్టారు; వీటిలో 80% వరకు మిశ్రమ ధాతువులు
సంప్రదాయ ఎథ్నో మెడికల్ వాడుక లానే వాడారు లేదా దానికి సంబంధము కలిగినట్లుగా వాడారు.

పురుగులు, శిలీంద్రాలు మరియు మొక్కలను తినే క్షీరదముల వలన జరిగే దాడుల నుంచి మొక్కలు తమను తాము రక్షించుకోవడానికి సహాయము చేసే రసాయనిక
మిశ్రమములను తమంత తామే తయారు చేసుకోగలిగిన శక్తిని పరిణామక్రమములో వికసింప చేసుకున్నాయి. అనుహ్యముగా ఇలా మొక్కలను తినే వాటికి విషంతో సమానము అయిన ఈ రసాయన పదార్దములు, అదే సమయములో మానవుల జబ్బులను నయం చేయడానికి వాడబడినప్పుడు ఎంతో ఉపయోగకరముగా ఉన్నాయి. అలాంటి ద్వితీయ వర్గమునకు చెందిన జీవన క్రియలో పాల్గొనే పదార్దములు వాటి నిర్మాణములో ఎంతో వ్యత్యాసము కలిగి ఉంటాయి, వాటిలో చాలా వరకు పరిమళ భరిత పదార్ధములుగా ఉన్నాయి, వాటిలో కూడా చాలా వరకు క్రిమి నాశినిలుగా కానీ లేదా ఎక్కువ ప్రాణ వాయువు నింపబడిన వాటి నుండి తీసుకోబడిన పదార్ధములుగా కానీ ఉంటాయి. ఇప్పటివరకు కనీసము 12,000 వరకు వేరు వేరుగా కనిపెట్టబడ్డాయి; ఈ సంఖ్య అసలు మొత్తము ఉన్న వాటిలో 10% కంటే కూడా తక్కువ అని అంచనా వేయబడినది. మొక్కలలోని రసాయనిక మిశ్రమములు మానవ శరీరములో లోని గ్రాహక కణములను కలిపి ఉంచడము ద్వారా తమ మధ్య ప్రభావమును చూపిస్తాయి; ఇది సంప్రదాయ ఔషధములలో చక్కగా అర్ధము చేసుకోబడి ఉన్న పద్ధతి లాంటిదే మరియు పని తీరు విషయములో మూలికా వైద్యము మరియు సంప్రదాయ వైద్యముల మధ్య ఎక్కువ తేడా ఏమీ ఉండదు. దీని వలన మూలికా వైద్యము సంప్రదాయ ఔషధముల లానే చాలా ముఖ్యమైనది అవుతుంది, అలానే పని చేస్తుంది మరియు వాటి లానే కొన్నిసార్లు అవాంఛనీయమైన దుష్పరిణామములు కలిగించగలదు కూడా. మానవుల చేత ఆహరమునకు అధిక హంగులు చేర్చడము కొరకు వాడబడే అనేక మూలికలు మరియు సుగంధ ద్రవ్యములు వంటివి కూడా చాలా ఔషధ విలువలు కలిగి ఉంటాయి.

అలాగే డాక్టర్ చేత సూచించబడిన మందుల కంటే, పెద్ద సంఖ్యలో మూలికలు అవాంఛనీయ ఫలితములను కలిగిస్తాయి అని భావిస్తున్నారు. అంతే కాకుండా, "కల్తీ చేయబడడము, సరైన పాళ్ళలో మిశ్రమములు కలపబడక పోవడము లేదా మొక్క గురించి సరైన అవగాహన లేకపోవడము మరియు ఒక ఔషధము వేరే వాటితో కలిసినప్పుడు ఏమి జరుగుతుంది అనే విషయము గురించి సరిగా తెలుసుకోకపోవడము వంటివి ఒక్కోసారి తీవ్రమైన పరిస్థితికి లేదా పూర్తిగా ప్రాణము పోయేలా చేయగలిగిన అవాంఛనీయ ఫలితములకు దారి తీయవచ్చు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ, సంప్రదాయ ఔషధముల GP పరిశోధనలలో వచ్చే 20% ADR లతో పోల్చి చూస్తే ఇవి చాలా తక్కువ. ఇంకా ADR ల వలన వైద్యశాలలో చేరవలసిన అవసరము 6-7% వరకు కల్పించే వాటికంటే తక్కువ. చక్కగా తయారు చేయబడిన మూలికల ఉత్పత్తులు ఇతర ఔషధముల కంటే గణనీయముగా తక్కువ ADR మరియు/లేదా అవాంఛనీయ ఫలితములు కలిగి ఉంటాయి.

  • పరిశోధనా శాస్త్రము

అన్ని ఖండముల ప్రజలు వందలు మరియు వేల సంఖ్యలో తమ తమ స్వదేశీయ మొక్కలను ఎన్నో రకముల వ్యాధుల నివారణకు చరిత్రకు అందని సమయము నుంచి

వాడుతూనే ఉన్నారు. 5,300 సంవత్సరముల కంటే ఎక్కువ సంవత్సరముల పాటు ఒట్జాల్ ఆల్ప్స్ లోని మంచులో కూరుకు పోయిన ఓత్జి ది ఐస్మాన్ శరీరము యొక్క స్వంత ప్రభావములో వైద్యము కొరకు వాడబడే మూలికలు కనుగొనబడ్డాయి. ఈ మూలికలు అతని ప్రేగులలో ఉన్న పరాన్న జీవుల నుండి విముక్తి కల్పించడానికి వాడినట్లుగా కనిపిస్తున్నది. మానవ జాతులపై పరిశోధన చేసేవారు జంతువులు అనారోగ్యమునకు గురి అయినప్పుడు చేదుగా ఉండే మొక్కల భాగములు తినడానికి మొగ్గు చూపుతాయి అని ప్రతిపాదించారు. స్వదేశీ వైద్యము చేసేవారు తాము అనారోగ్యముగా ఉన్న జంతువులు అంతకు మునుపు సాధారణముగా తినడానికి ఇష్టపడని చేదు మూలికలను కొంచెం కొంచెంగా తినడము చూసి వైద్యము నేర్చుకున్నామని తరచుగా చెపుతూ ఉంటారు. ఫీల్డ్ లో తిరిగి చెప్పే జీవ శాస్త్రవేత్తలు తాము చింపాంజీలు, కోళ్ళు, గొర్రెలు మరియు సీతాకోక చిలుకలు వంటి వేరు వేరు జాతుల ప్రాణులను బాగా గమనించి బలమైన ఆధారములను ఇచ్చారు. లోవ్లాండ్ గొరిల్లా లు తమ ఆహారములో 90% వరకు ఆఫ్రామోముం మేలేగ్యుట పండ్ల నుంచి తీసుకుంటాయి, ఇవి అల్లము మొక్కకు సంబంధం కలిగినవి, ఇది చాలా గొప్ప సూక్ష్మ జీవుల నాశిని మరియు చీము, రక్తము కారడము, రక్త విరోచనములు అవ్వడము వంటి
వాటిని మరియు అలాంటి ఇతర సూక్ష్మ జీవుల వలన కలిగే వ్యాధులను ఎంతో దూరంగా ఉంచగలుగుతుంది. ప్రస్తుతము జరుగుతున్న అధ్యనములు ఈ మొక్కలు బహుశా గొరిల్లాలకు సోకితే చాలా ప్రమాదకరము అయిన కారణము తెలియకుండా గుండె కండరముల అభివృద్దిని ఆటంకపరిచే జబ్బు నుంచి కూడా రక్షణ కల్పించ గలుగుతున్నదా అనే విషయము పై దృష్టి సారిస్తున్నాయి.

ఓహియో వెస్లియన్ విశ్వ విద్యాలయము నకు చెందిన పరిశోధకులు కొన్ని పక్షులు తమ పిల్లలకు హాని కలిగించే సూక్ష్మ జీవుల నుండి రక్షణ కల్పించడానికి గూడు అల్లేటప్పుడు పరాన్న జీవులను నాశనము చేయగలిగిన కారకములను చాలా ఎక్కువగా వాడతాయి అని కనిపెట్టారు. అనారోగ్యముతో ఉన్న జంతువులు టన్నిన్స్ మరియు ఆల్కలాయిడ్లు వంటి రెండవ తరహా జీవ క్రియకు చెందిన పదార్ధములను కలిగిన మొక్కలను మేతగా తీసుకోవడానికి మొగ్గు చూపుతాయి. ఈ ఫైటో కెమికల్స్ లో సాధారణముగా యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ హెల్మిన్టిక్ లక్షణములు కలిగి ఉంటాయి కాబట్టి అడవిలో జంతువులు తమంత తామే వైద్యము చేసుకుంటున్నాయి అనడము హేతుబద్దము గానే ఉన్నది

చరిత్ర

మొక్కలను ఔషధములుగా వాడడము అనేది మానవ చరిత్ర వ్రాయడము మొదలు పెట్టక మునుపే మొదలైంది. ఉత్తర ఇరాక్ లోని 60 000-సంవత్సరముల పూర్వపు
నియాన్డేర్తల్ లను పూడ్చి పెట్టె స్థలము "షానిదర్-4 " లో ఎనిమిది రకముల మొక్కల యొక్క పుప్పొడి రేణువులు పెద్ద మొత్తములో దొరికాయి, వాటిలో 7 ప్రస్తుతము మూలికా వైద్యములో ఔషధముగా వాడబడుతున్నాయి. రాత పూర్వకముగా నమోదు చేయబడిన దాని ప్రకారము, మూలికలను గురించిన అధ్యయనము అనేది 5,000 ల పూర్వము సుమేర్ఎయన్స్ చేయబడినది, వీరు పొన్న చెట్టు వంటి ఒక చెట్టు, సోపు గింజలు మరియు వాము పువ్వు ఇచ్చే చెట్టు వంటి వాటి ఔషధ గుణములను చక్కగా అర్ధమయ్యేలా తెలిపారు. 1000 B.C. కు చెందిన ప్రాచీన ఈజిప్షియన్ ఔషధములు వెల్లుల్లి, నల్ల మందు , ఆముదము నూనె , ధనియాలు, పుదీనా, నీలిమందు మరియు ఇతర మూలికలను ఔషధములుగా వాడినట్లు తెలుస్తోంది, మరియు ఒక పాత శాసనము ప్రకారము మాన్డ్రేక్ చెట్టు , వేట్చ్ చెట్టు , సోపు గింజలు , గోధుమ, బార్లీ మరియు రై వంటి వాటితో సహా చాలా మూలికల వాడకము మరియు పెంపకము వంటి వాటి గురించి తెలుస్తోంది.

భారతీయ ఆయుర్వేద ఔషధములు పసుపు వంటి చాలా మూలికలను దాదాపు 1900 B.C. నుంచే వాడుతున్నారు. ఇంకా ఆయుర్వేదములో వాడబడిన వనమూలికలు మరియు ఖనిజ లవణముల గురించి ఆ తరువాతి కాలములో ప్రాచీన భారత దేశ మూలికా శాస్త్రవేత్తలైన చరకుడు మరియు సుశ్రుతుడు వంటివారు మొదటి మిలీనియం BC సమయములోనే వివరించారు . ఆరవ శతాబ్దము BC లోని సుశ్రుతునికి చెందినదిగా చెప్పబడుతున్న సుశ్రుత సంహిత పుస్తకం 700 ఔషధ మొక్కలు, ఖనిజ లవణముల నుండి తయారు చేసే 64 రకముల కషాయముల వంటి మందులు మరియు వివిధ జంతువుల ఆధారముతో చేసే 57 రకముల కషాయముల వంటి వాటిని గురించి వివరించింది. ఔషధములుగా వాడబడుతున్న మొక్కల ఉదాహరణలు

కొన్ని మూలికల వైద్యములు సరైన పరీక్ష లేని కారణముగా కావచ్చును, సరైన మంచి ప్రభావమును మానవులపై చూపలేవు. చాలా అధ్యయనములు జంతువులలో కానీ లేదా పరీక్ష నాళములలో కానీ జరుపబడినవి, కాబట్టి బలమైన ఆధారముగా సమర్ధన చేయలేవు.

* కలబంద సంప్రదాయముగా కాలిన గాయములు మరియు పుండ్లు తగ్గడానికి వాడబడుతున్నది. ఒక క్రమానుసారముగా చేసిన రివ్యూ (1999 నుండి) పుండును తగ్గించడములో కలబంద యొక్క సామర్ధ్యం స్పస్టముగా తెలియడము లేదు అని తెలిపింది, ఆ తరువాతి రివ్యూ లో (2007 లో) మొదటి మరియు రెండవ స్థాయిలో ఉన్న కాలిన గాయాలు తగ్గడానికి కలబంద సహకరిస్తుంది అని తెలపడానికి చాలా ఆధారములు ఉన్నట్లుగా తెలిపింది.

* పరీక్ష నాళికలో మరియు చిన్న క్లినికల్ అధ్యయనములో కనిపెట్టబడిన దాని ప్రకారము ఆర్టిచొక్(సినారా కర్డున్క్యులస్ ) లు క్రొవ్వు తయారు అవ్వడమును తగ్గిస్తుంది అని తెలుస్తోంది.
* బ్లాక్ బెర్రీ (రుబుస్ ఫ్రూటికోసస్ )ఆకు సౌందర్య ఉత్పత్తులు చేసేవారి దృష్టిని ఆకర్షించింది, ఎందుకు అంటే ఈ ఆకు చర్మము ముడుత పడేలా చేసే మెటల్లోప్రోటీన్స్ లో జోక్యము చేసుకుంటుంది.
* బ్లాక్ రాప్స్బెరీ (రుబుస్ ఒసిడేన్టలిస్) నోటి రాచ పుండు రాకుండా నివారించగలదు.
* బుఫోన్ (బుఫోన్ దిస్తిచ ) ఈ అత్యంత విష పూరిత మొక్క దక్షిణ ఆఫ్రికా సంప్రదాయ వైద్యములో మానసిక అనారోగ్యమును నయము చేయడానికి వాడబడుతుంది. పరీక్ష నాళములలో మరియు బయట చేసిన పరిశోధనలలో అది మానసిక కుంగుబాటుకు వ్యతిరేకముగా ప్రభావము కలిగి ఉంది అని వివరముగా తెలిసింది.

* కలేన్ద్యుల (కలేన్ద్యులా అఫిసినాలిస్) అనేది సంప్రదాయముగా ఉదర సంబంధ వ్యాధులు మరియు మల బద్దకము వంటి వాటి నివారణకు వాడబడుతున్నది. జంతువుల పై చేసిన పరిశోధనలలో కలేన్ద్యులా అఫిసినాలిస్ పూవుల నుంచి సేకరించబడిన ఆక్వియస్-ఈథనాల్ స్పస్మోలిటిక్ మరియు స్పస్మోజేనిక్ రెంటిపై ప్రభావము కలిగి ఉంది అని తెలుస్తోంది, కాబట్టి దీని యొక్క సంప్రదాయ ఉపయోగమునకు ఒక సాంకేతిక అన్వయమును ఇచ్చింది. రేడియేషన్ ద్వారా వచ్చిన చర్మ సంబంధ ఇబ్బందులపై ప్రభావము చూపించే విషయములో కలేన్ద్యులా సారము లేదా అంజనము పని చేస్తుంది అని అనడానికి "కొంచెం సాక్షము" మాత్రమే ఉన్నది.

* క్రన్బెర్రీ (వాసినియం ఆక్సికోకోస్) తరచుగా కనిపిస్తున్న లక్షణములతో స్త్రీలలో వచ్చే మూత్ర నాళ సమస్యల నివారణకు బహుశా ప్రభావవంతముగా ఉండవచ్చు.
* ఎచినాసియా (ఎచినాసియా ఆన్గస్తిఫోలియా, ఎచినాసియా పల్లిడా, ఎచినాసియా పుర్పురియా ) ల నుంచి తీసుకోబడినవి రైనోవైరస్ జలుబుల తీవ్రత మరియు వచ్చే సమయమును నియంత్రించగలుగుతాయి; ఏది ఏమైనప్పటికీ, మందుల దుకాణములో వైద్యుని సలహా లేకున్నా ఇచ్చే మందుల కంటే సరైన మోతాదు తెలియాలంటే ఇంకా పరిశోధన అవసరము ఉన్నది.

Source : http://Wikipedia.Org.

For more details - click here -- > Mమూలికా వైద్యము
  • ==============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.