Sunday, March 18, 2012

పచ్చకామెర్లు , Jaundice,Hepatitis


 • image : courtesy with Andhraprabha News paper.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పచ్చకామెర్లు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...పచ్చకామెర్లను జాండిస్‌ అని వ్యవహరిస్తారు. నిరంతరం రక్తంలోని ఎర్రకణాల విచ్ఛిత్తి జరుగుతూ బిలురూబిన్‌ అనే రంగు పదార్థం తయారవుతుంటుంది. రక్తంలో ఈ బిలురూబిన్‌ పరిమాణం రెట్టింపు అయితే కామెర్లు అని నిర్ధారిస్తారు. వీరి చర్మం, కళ్లు పసుపుపచ్చ రంగులో కనిపిస్తాయి.

కామెర్లకు ముఖ్య కారణాలు 3.
ఒకటి రక్తంలోని ఎర్రకణాలు అత్యధికంగా విచ్ఛిత్తిగావడం. దీన్ని 'హీమోలిటిక్‌ జాండిస్‌' అంటారు.
రెండోది- ఎర్రకణాల విచ్ఛిత్తి మూలకంగా చోటుచేసుకున్న బిలురూబిన్‌ లివర్‌ కణాలలోకి చేరలేకపోవటం. దీన్ని 'హెపాటిక్‌ జాండిస్‌' అని వ్యవహరిస్తారు.
మూడోది - లివర్‌లో ఉత్పత్తి అయిన పైత్యరసం (బైల్‌) ప్రవాహ మార్గంలో అవరోధం ఏర్పడి, అది పేగులలోకి చేరలేకపోవటం . దీన్ని 'అబ్‌స్ట్రక్టివ్‌ జాండిస్‌' అంటారు.

లివర్‌ ఇన్ఫెక్షన్‌కు గురైనట్లయితే 'హెపటైటిస్‌' అని వ్యవహరిస్తారు. హెపటైటిస్‌ కేసుల్లో 'హెపాటిక్‌ జాండిస్‌' చోటుచేసుకుంటుంది. హెపటైటిస్‌కు ప్రధాన కారణాలు - ఒకటి ఇన్ఫెక్షన్‌, రెండవది ఆల్కహాల్‌, మూడు పౌష్టికాహార లోపము (Nutritional jaundice)

ఇన్ఫెక్షన్‌ పరంగా 5 రకాల వైరస్‌లను -గుర్తించారు. ఇవి హెపటైటిస్‌- ఎ, బి, సి, డి, ఇ.

హెపటైటిస్‌ ఎ, ఇ లు కలుషిత నీరు, ఆహారపదార్ధాల ద్వారా సంక్రమిస్తాయి. హెపటైటిస్‌ బి, సి, డి లు రక్తమార్పిడి ద్వారా, ఒకరికి వాడిన ఇంజక్షన్‌ సూదులు ఇతరులకు వాడటం ద్వారా , సెక్స్‌ ద్వారానూ సంక్రమించే అవకాశముంది..

కామెర్ల రోగులలో కళ్లు, చర్మం పచ్చగా కనిపిస్తాయి. చర్మం దురదపెడుతుంది. మలం తెల్లగా, మూత్రం పసుపు రంగులో ఉంటాయి. రక్తస్రావం కనిపించొచ్చు.

నూనె పదార్ధాలు గిట్టవు. జ్వరం, వాంతులు, వికారం, పొట్టలో బాధలు చోటుచేసుకోవచ్చు. ఇవన్నీ బాహ్యంగా కనిపించే లక్షణాలే. లివర్‌ వ్యాధి బాగా ముదిరినా కూడా కొందరిలో ఇటువంటి లక్షణాలు కనిపించకపోయే అవకాశమూ ఉంటుంది,

చికిత్సా విధానము :
పచ్చకామెర్ల వ్యాధికి అల్లోపతిలో సరైన ఔషధం లేదు. ఈ వ్యాధి నీటిద్వారా సోకుతుందని వైద్యులు అంటారు. ఈ వ్యాధి ఒకసారి వస్తే మళ్ళీ రాకూడదన్న నియమంలేదు. అంతేకాదు ఇది శరీరంలో అత్యంత ప్రధానమైన 'లివర్‌'పై ప్రభావం చూపుతుంది. అందువల్ల విధిగా ఆహారంలో కొన్ని నియమాలు పాటించాలి.

* ఏ ప్రాంతంలో ఉన్నా, తాగే నీటిని కాచి, వడపోసి, చల్చార్చి వాడడం మంచిది. లేదా ఫిల్టర్‌ చేసిన నీటిని మరగబెట్టయినా వాడవచ్చు.
* పచ్చకామెర్ల వ్యాధి సోకితే దుంపలు వాడకూడదు. అలాగే సరిగా జీర్ణంకానివి ఏవీ వాడకూడదు. రెండు నెలలేకాదు కనీసం సంవత్సరం వరకు కూడా

ఆహారంలో నియమాలు తప్పక పాటించాలి.
* మజ్జిగ బాగా వాడాలి,
* అడపాదడపా కొబ్బరి బోండాలు తాగాలి,
* అరటిపళ్ళు బాగా తినాలి.
* మాంసాహారులు మాంసానికి, చేపలకు దూరంగా ఉండాలి.
* గోంగూర ప్రియులు విధిగా దానికి దూరంగా ఉండాలి.
* ఆవకాయ, మాగాయ వాడకపోతే భోజనం పూర్తయినట్లుకాదని భావించేవారు కొన్నాళ్ళు వాటికి గుడ్‌బై చెప్పాలి.
* కారం, పులుపు, ఉప్పు తగ్గించక తప్పదు.
* డాక్టర్‌ సలహాలనుబట్టి లివ్‌-52 మాత్రలు మరికొన్నాళ్ళు వాడవచ్చు. అవి 'లివర్‌' పనితీరును మెరుగుపరుస్తాయి.
పచ్చకామెర్ల వ్యాధి పూర్తిగా ఆహారంపై నియంత్రణ ఉంటేనే తగ్గుతుందన్న విషయాన్ని ఏనాడూ మరిచిపోకూడదు . పదేళ్ళయిన తర్వాత కూడా కొన్ని

ఆహారపదార్ధాలను తీసుకొనేందుకు జాగ్రత్తలు పాటించాలి .

గ్రుర్తించుకోవలసిన విషయాలు :
నాటు వైద్యులు ఆశ్రయించి కొంతమంది వెళ్లి పచ్చకామెర్ల వ్యాధికి పసరుమందు తాగడంతో పాటు మెడలో పేరు వేసుకుని నాటువైద్యాన్ని నమ్ముకోవడంతో

పచ్చకామెర్లు ముదిరి ప్రాణాలను హరించివేస్తున్నాయి. కల్తీ నూనెలతో పాటు ఇతర పదార్థాల ద్వారా ఈవ్యాధులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పచ్చకామెర్ల

వ్యాధి నయం కావడానికి నూనెలను తక్కువగా కల్తీలేనివి వాడాలి .

* పచ్చకామర్లు తెలియని వారు ఉండరు. * పచ్చకామెర్లు వ్యాధి కాదు. ఇది ఒక వ్యాధి లక్షణం. మనం సాధారణంగా బాధపడే పచ్చకామెర్లు మన శరీరంలో

'కాలేయం' అనే అవయవం సూక్ష్మజీవుల బారినపడడం వల్ల వస్తుంది. ఈ సూక్ష్మజీవులు సాధారణంగా కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం వల్ల మన

శరీరంలో ప్రవేశిస్తాయి.

* చాలా సందర్భాలలో దానంతట అదే తగ్గిపోతుంది.

* దీనికి ఆధునిక వైద్యంలో మందులు లేవంటారు చాలా మంది. అయితే పచ్చకామెర్లకు ఏ వైద్యంలో కూడా మందులు లేవు.

* పచ్చకామెర్లు ఎక్కువగా ఉంటే విశ్రాంతి ఎంతో ముఖ్యం.

* పచ్చకామెర్లు తక్కువగా ఉంటే సాధారణ పనులు చేసుకుంటే జీవించొచ్చు.

* మనం తీసుకునే చాలా మందులు కాలేయం ద్వారా పోతాయి. మనం అశాస్త్రీయంగా మందులు వాడితే ఆ మందులు కాలేయాన్ని మరింత పాడుచేస్తాయి.

* పచ్చకామెర్లు ముదరితే అన్ని వసతులున్న ఆసుపత్రిలో చేరాలి.

* కాలేయానికి మంచిది అని ప్రచారం చేసే మందుల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.

* పరిశుభ్రమైన ఆహారం, కాచి చల్లార్చిన నీరు తాగడం వల్ల పచ్చకామెర్లను బాగా నిరోధించొచ్చు.

* 'పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా ఉంటుంది' అనేది నిజం కాదు.


Viral hepatic Jaundice:

శీతాకాలంలో అధికంగా నీటిప్రభావానికిలోనై వచ్చే వ్యాధులలో పచ్చ కామెర్లవ్యాధి ఒకటి. తగిన జాగ్రత్తలు తీసుకుని సత్వరనివారణ చర్యలు చేపట్టకుంటే ఇది మన శరీరంలో అత్యంత ప్రధానభాగమైన కాలేయా న్ని పనిచేయ కుండా చేసి పరిస్ధితి అగమ్మగోచరంగా మార్చే ఆస్కారం ఉంటుంది. ఈకాలేయ సంబంధితవ్యాధికి చెందిన వైరస్‌ ఎ,బి,సి,డి,ఇ, రకాలుగా విభజించారు. వీటిలో హెపటైటిస్‌-ఏ, హెపటైటిస్‌-బి, హెపటైటిస్‌-సిలు మానవ శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపడమే కాకుండా ప్రాణాంతకాలుగా పరిణమిస్తాయి. వీటి గురించి ఓసారి తెలుసుకుందాం...

హెపటైటిస్‌-ఏ :

ఇది సాధారణంగా కనిపించే పచ్చకామెర్ల వ్యాధి. 'ఫికో ఓరల్‌ రూట్‌' అంటే మనం తాగే నీరుగానీ, ఆహారం గానీ కలుషితమైనా అది నోటి ద్వారా తీసుకున్నపడే కాదు. మలరంధ్రాల ద్వారా కూడా శరీరంలోకి వైరస్‌లు చేరి హెపటైటిస్‌-ఏ సంభవించేందుకు ఆస్కారం ఉంది.

హెపటైటిస్‌-బి

ఇదిహెపటైటిస్‌-ఏకన్నా అత్యంత ప్రమాదకర వ్యాధి. ముఖ్యంగా ఇది రక్త మార్పిడి వల్ల ఎక్కువగా వచ్చే వ్యాధి. కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడే వారి రక్తాన్ని వైరొకరికి ఎక్కించినపడు ఈ వ్యాధి కారక వైరస్‌లు వ్యాప్తి చెందుతాయి. అలాగే ఈ వ్యాధితో బాధపడేవారికి సిరంజ్‌ని వేరొకరికి వాడినా... ఆ క్రిములు సంక్రమిస్తాయి.

ఈ వ్యాధి సోకిన గర్బి ణీ ద్వారా తన బిడ్డకు కూడా ఈవ్యాధి వస్తుంది. ఇక వ్యాధితో బాధ పడుతున్న వారితో లైంగిక సంపర్కాలు జరిపినా ఈవ్యాధి వస్తుంది..

ఈ వ్యాధి లక్షణాలు ప్రారంభమై... హెప టైటిస్‌గా, లివర్‌క్యాన్సర్‌గా, సిరోసిస్‌గా మారి ప్రాణాంతకమువుతుంది.

ఎయిడ్స తదితరాలులా ఇది కూడా ఎలాంటి చికిత్స లేని వ్యాధికావటం ఆందోళన కలిగించే విషయం, దీనికి నివారణాచర్యలు ముఖ్యమైనవి. కలుషిత సూదులు గుచ్చుకున్నా, వ్యాధికారకులతో లైంగిక సంపర్కం జరిపినా 14 రోజుల్లోగా వ్యాక్సిన్‌ని వేయించు కోవటం ద్వారా వ్యాధి కారకాలను నిలువరించవచ్చు. ఈ వ్యాక్సిన్‌తో పాటు వైద్యుల సూచనల మేరకు ఇమ్యూనోగ్లోబిలిన్‌ని కూడా ఇవ్వాల్సి ఉం టుంది. ఈ వ్యాధి కార కాల గర్భిణీకి జన్మించిన బిడ్డకు పుట్టగానే వ్యాక్సిన్‌ ఇప్పించడం ద్వారా చాలామేరకు రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

హెపటైటిస్‌-సి :

ఇది హెపటైటిస్‌-బితో కూడిన అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. హెప టైటిస్‌-బి కనీసం వ్యాక్సిన్‌ వేసి నిలువరించ వచ్చు కానీ దీనిని మాత్రం ఏలాంటి పద్దతులలోనూ నిలువరించలేం అంటే ఇది ఎంత ప్రమాదకర మైనదో అర్ధం చేసుకోవచ్చు. కలుషిత సూదుల ద్వారా, అవసరార్ధం ఇతరుల నుండి రక్తం స్వీకరించే సమయంలో..తగుపరీక్షలని, జాగ్రత్తలని తీసుకోకుండా ఆదరాబాదరా పడితే.. ఆ వ్యక్తికి హెపటైటిస్‌-సి ఉంటే ఈవ్యాధి క్షణాలలో సంక్రమిస్తుంది. కాలక్రమంలో ఇది లివర్‌ సిరోసిస్‌గా, లివర్‌ క్యాన్సర్‌గా మారి.. ప్రాణాంతకం కూడా కావచ్చు.

లక్షణాలు :

ఈ వైరస్‌ సోకిన క్రమంలో ఈ వ్యాధి లక్షణాలు బైట పడేందుకు 15 నుంచి 50 రోజుల సమయం పట్టేందుకు ఛాన్సుంది. చలి జ్వరం, తల నొప్పి, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, వికారంగా ఉండటం, విరేచనాలు కావ టం, ఆకలి లేకపోవటంతో పాటు మూత్రం పసుపు వర్ణంలో పోయటం, కళ్లు, నాలుక పచ్చగా మారిపోతుంది. చేతులు, కాళ్ల గోర్లు కూడా పచ్చగా మారుతుంటాయి. కాలేయ భాగం విపరీతమైన నొప్పిగా మారుతుంది. కాలయం కొద్దిగా కొద్దిగా పెరుగుతుంటుంది. దీని తో పాటు ప్లీహం కూడా పెరిగే ఆస్కారం కూడా ఉంది. ఒళ్లంతా దద్దుర్లు, దురదలు వస్తాయి. నడి చేందుకు కూడా వెసులు బాటు ఇవ్వని కీళ్ల నొప్పులు, మలం ద్వారా తెల్లని పదార్ధం శరీరం నుండి బైటకు రావటం ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు.

వ్యాధి నిర్ధారణ--పరీక్షలివి...

ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ ద్వారా కాలేయ పరిస్ధితిని నిర్ధారించుకోవచ్చు. మూత్ర పరీక్షలు చేస్తే అందులో బైల్‌ పింగ్మెంట్స్‌ కనిపిస్తాయి. అలాగే రక్త పరీక్షలలో సీరం ఎంజైమ్స్‌, సీరం బలురూబిన్‌ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది.

ఇక లివర్‌ ఫంక్షన్‌ టెస్టుల్లోనూ మన కాలేయంలో జరిగిన పరిణా మాలను నిర్ధారించుకోవటమే కాకుండా లివర్‌ మార్కర్స్‌ ద్వారా వైరస్‌ కారకాలను ఇట్టే గుర్తించి నిపుణులైన వైద్యుల సలహా సూచనల మేరకు తగిన వైద్యాన్ని చేయించుకుంటే హెప టైటిస్‌-ఏ ని 4 వారాలలోనే తగ్గించుకోవచ్చు.

జాగ్రత్తలిలా...
హెపటైటిస్‌ వచ్చిన వారిలో ఎక్కువ మంది వాంతులు, వికారంతో బాధ పడుతుంటారు. వీరికి గ్లూకోజ్‌ ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందుకు గానూ గ్లూకోజ్‌తో పాటు పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు అడపా దడపా తాగించాలి.

అవసరమైతే.. నరాల ద్వారా కూడా సిలెన్‌ రూపంలో గ్లూకోజ్‌ ఎక్కిం చాల్సి ఉంటుంది. అలాగే విటమిన్‌-సి ఎక్కువగా ఉండే పళ్లను గానీ, టాబ్లెట్లని ఇవ్వాలి. అలాగే అవసరం మేరకు విటమిన్‌ సి ఇంజక్షన్‌ ఇవ్వాల్పి ఉంటుంది.

ఇక హెపటైటిస్‌ సోకిన వ్యాధి గ్రస్తులలో విటమిన్‌ బి తక్కువగా ఉండటం వల్ల తీవ్ర నీరసానికి గురవుతారు. దీనిని నుండి కాపాడుకునేందుకు విటమిన్‌ బి టాబ్లెట్లని ఎక్కువ వెూతాదులో ఇవ్వాలి.

శరీరంపై దద్దుర్లు, దురదల వస్తే 'కొలిస్టరిమిన్‌'ని ఇవ్వాల్సి ఉంటుంది. వీలైనంత వరకు విటమిన్‌- కెని కూడా ఇవ్వటమే కాకుండా మల్టీవిటమిన్‌ టాబ్లిట్లు మింగించాలి. ఇన్‌ఫిక్షన్లు సోకితే నియోమైసిన్‌, ప్రెడ్సిసలోన్‌, మెట్రోనిడజాల్‌ మాత్రలు ఇవ్వాలి. కొన్ని రకాల మందులు కూడా శరీర తత్వాన్ని బట్టి ప్రభావం చూపి ఇన్‌ఫిక్షన్లకు దారి తీసే అవకాశాలు ఉంటాయి. దీని వల్ల కాలేయం మరింతగా దెబ్బతింటుంది. అందుకే మందులు వాడేటప్పుడు నిపుణులైన వైద్యుల సలహా సూచలను ఖచ్చితంగా తీసుకో వాల్సిందే..

ఆహారం...

ఈ వ్యాధిగ్రస్తులు మద్యపానానికి దూరంగా ఉంచాలి. ఆకలిగా ఉన్నపడు అధిక ఆహారం ఇవ్వాలి. పళ్ల రసాలు, మజ్జిగ తదితరాలు ఎక్కు వగా ఇవ్వటమే కాకుండా కూరగాయలు, పప్పుదినులు బాగా ఉడక పెట్టి ఇవ్వటంతో పాటు పౌష్టికాహరం ఇవ్వటం ద్వారా వ్యాధిగ్రస్తులు త్వరగా కోలుకుంటారు.


జాండీస్‌ నివారణకు ఆయుర్వేదిక్ చిట్కాలు


లివర్‌ పనితీరులో ఒడిదుడుకులు వచ్చినపుడు శరీరంలో వచ్చే మార్పులను లక్షణాలను కామెర్లు అంటాం. లివర్‌ను మామూలుగా పనిచేటట్లు చేయడమే దీనికి చికిత్స అది ప్రధానంగా ఆహారంతోనే సాధ్యపడుతుంది.

ప్రతిరోజు ఒక గాస్లు తాజా టమాటారసం తాగాలి. ఒకగ్లాసు రసంలో చిటికెడు ఉప్పు, మిరయాల పొడి కలిపి పరగడుపున తాగాలి.

పొట్ల ఆకులను ఎండబెట్టి పదిహేను గ్రాముల ఆకులను పావులీటరు నీటిలో వేసి మరిగించాలి. మరొక పాత్రలో అర లీటరు నీటిని తీసుకుని అందులో ఒక స్పూన్‌ ధనియాలను వేసి, నీరు మూడు వంతులు వచ్చే వరకు మరిగించాలి. ఈ మిశ్రమంలో పొట్ల ఆకులను మరిగించిన నీటిని కలిపి రోజుకు మూడు సార్లు తాగాలి. ఎండు ఆకులను బదులు తాజా ఆకులు వాడవచ్చు.

ముల్లంగి ఆకుల రసం తాగితే జాండీస్‌ అదుపులోకి వస్తుంది. తాజా ముల్లంగి ఆకులను గ్రైండ్‌ చేసి తాగాలి. మూడు లేదా నాలుగు దఫాలుగా రోజు మొత్తంలో అరలీటరు రసం తాగితే పది రోజుల్లో లివరు పనితీరు పూర్తిగా మెరుగయ్యి జాండీస్‌ తగ్గుతుంది.

నాలుగు స్పూనుల తాజా నిమ్మరసంలో తగినంత నీటిని కలిపి తాగితే జాండీస్‌ తగ్గుతుంది. నిమ్మరసం లివర్‌ కణాలను రక్షిస్తుంది.


 • =================================
Visit my website - > Dr.Seshagirirao.com/

15 comments:

 1. Really Thank You Doctor for such valuable and useful information

  ReplyDelete
 2. Respected doctor, thanks for your valuable suggetion. As i have 2.3 biluribin . taken control measures. And my doubt is in english i.e., diet health club we site it has mentioned banana should not be taken. but here you have mentioned more bananas to be taken. Please give clarity of this.

  thanking you,

  suresh k
  9440109114, hyderabad

  ReplyDelete
  Replies
  1. అరటి పండు వాడడము వలన విరోచనము ఫ్రీ గా అవుతుంది.

   Delete
  2. Doctor Kindly share me your Contact Number to my email id saicse6@gmail.com.

   Delete
 3. Hi doctor Nenu recent gaa vontlo bogoledu anee hospital kee vellanu so vallu blood test chesaru aa reports loo naaku biluribin 2.9 vundee so main doctor naaku jaundice ledu annaru but some few doctor they informed that i am suffering with Jaundice. so naaku jaundice vunde antta raa leda. Kindly reply as early as possible to my email id saicse6@gmail.com Plz....

  ReplyDelete
 4. hi sir naku two mnths back negative vachindi marala ippudu urine yellow ga vastundi any prblm sir

  ReplyDelete
 5. జాండీస్ వల్ల తల తిరగడం కొద్దిగా తలపోటు గా ఉంటుందా. . ?

  ReplyDelete
 6. Sir I have 1.8 mg/dl total bilirubin is there it is jandies r not, it is jandies what are tha precautions plz give a valuable information

  ReplyDelete
 7. Sir I have 1.8 mg/dl total bilirubin is there it is jandies r not, it is jandies what are tha precautions plz give a valuable information

  ReplyDelete
 8. Sir I have 1.8 mg/dl total bilirubin is there it is jandies r not, it is jandies what are tha precautions plz give a valuable information

  ReplyDelete
 9. JANDIS VALANA TALA NOPPI VASTHUNDA...

  ReplyDelete
 10. SIR,BANANA,COCONUT WATER,CARROT USE CHEYYOCHA.

  ReplyDelete
 11. sir ma nannaki koddirojula nundi fever vomtings unnav e roju blood test chepincham kamerlu unnav ani ani annaru sir .madi anantapur distric kadiri sir .traraga kolukovadaniki am cheyalo cheppandi sir alage dr hospital name contact no evvandi sir ma nanna age 55

  ReplyDelete

Your comment is very important to improve the Web blog.