Wednesday, August 5, 2015

Liver damaging foods and habits-కాలేయాన్ని దెబ్బతీసే మనం తెనే ఆహారములు

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Liver damaging foods and habits-కాలేయాన్ని దెబ్బతీసే మనం తెనే ఆహారములు -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




   అతిగా మద్యం తాగటం వల్ల కాలేయం దెబ్బతింటున్నది తెలిసిందే. అయితే ఇదొక్కటే కాదు. మనం తినే పదార్థాలు, పానీయాలు కూడా కాలేయం దెబ్బతినటానికి దోహదం చేస్తాయి.

చక్కెర: మిఠాయిలు, చాక్లెట్ల వంటివి అతిగా తింటున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. శుద్ధిచేసిన చక్కెరలను మితిమీరి తింటే కాలేయం జబ్బు ముంచుకురావొచ్చు. శరీరం వినియోగించుకోకుండా మిగిలిపోయిన కేలరీలు ఏవైనా కాలేయంలో కొవ్వురూపంలో పోగుపడతాయి. ఇది చివరికి కాలేయం కొవ్వు పట్టటానికి (ఫ్యాటీ లివర్‌) దారితీస్తుంది.

మోనోసోడియం గ్లుటమేట్‌: ప్రస్తుతం రుచికరంగా ఉండటానికి చాలా పదార్థాల్లో మోనోసోడియం గ్లుటమేట్‌ (ఎంఎస్‌జీ) కలుపుతున్నారు. ఇది కాలేయంలో వాపు ప్రక్రియకు దోహదం చేస్తున్నట్టు కొన్ని అధ్యయనాల్లో తేలింది.

విటమిన్‌ ఏ: కంటి ఆరోగ్యానికి, చూపు బాగుండటానికి విటమిన్‌ ఏ ఎంతగానో తోడ్పడుతుంది. కానీ దీన్ని అవసరమైన దాని కన్నా ఎక్కువగా తీసుకుంటే కాలేయానికి హాని కలగజేస్తుంది.

కూల్‌డ్రింకులు: చక్కెర లేని లేదా డైట్‌ కూల్‌డ్రింకులైనా సరే. వీటిల్లో కృత్రిమ తీపి పదార్థాలతో పాటు కార్బన్‌ డయాక్సైడ్‌ కూడా అధికంగా ఉంటుంది. అందువల్ల కూల్‌డ్రింకులను అదేపనిగా తాగితే కాలేయ జబ్బుకు దారితీస్తుంది.

కుంగుబాటు మందులు: అరుదుగానే అయినా.. కుంగుబాటు మందులు కాలేయంలో విషతుల్యాల మోతాదులు పెరగటానికి దోహదం చేస్తాయి. అందువల్ల వీటిని వేసుకునేవారు కాలేయ జబ్బు లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించటం మంచిది.

ఉప్పు: అధిక రక్తపోటుకు ఉప్పుతో సంబంధం ఉండటం తెలిసిందే. కానీ ఇది కాలేయ జబ్బునూ తెచ్చిపెడుతుంది. ఉప్పు ఎక్కువగా తింటే శరీరంలో ద్రవాల మోతాదులు పెరుగుతాయి. ఇది కాలేయంలో కొవ్వు పోగుపడటానికి దారి తీస్తుంది.

జంక్‌ఫుడ్‌: చిప్స్‌ వంటి ప్యాకేజ్డ్‌ పదార్థాల్లో ఉప్పుతో పాటు ట్రాన్స్‌ఫ్యాట్స్‌ కూడా ఉంటాయి. ఇవి కూడా కాలేయం దెబ్బతినటానికి మార్గం వేస్తాయి.
  • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Dangers of Small injuries in Diabetics-మధుమేహుల్లో పెద్ద ముప్పుతెచ్చే చిన్నచిన్న గాయాలు

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --మధుమేహుల్లో పెద్ద ముప్పుతెచ్చే చిన్నచిన్న గాయాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
  •  
  •  Dangers of Small injuries in Diabetics-మధుమేహుల్లో పెద్ద ముప్పుతెచ్చే చిన్నచిన్న గాయాలు

నడుస్తున్నప్పుడు కాలి వేళ్లకు ఏదైనా తగలటం.. బిగుతైన షూ, చెప్పులు వేసుకున్నప్పుడు బొబ్బ రావటం.. ఇలాంటి చిన్న చిన్న గాయాలను మనం పెద్దగా పట్టించుకోం. నిజానికివి వాటంతట అవే తగ్గిపోతాయి కూడా. కానీ మధుమేహుల్లో ఇలాంటి చిన్న చిన్న గాయాలైనా పెద్ద ముప్పును తెచ్చిపెడతాయి. గాయాలు, పుండ్లు త్వరగా మానకపోవటం.. ఇన్‌ఫెక్షన్‌ తలెత్తి తీవ్రం కావటం వల్ల అక్కడి కణజాలం, ఎముక దెబ్బతినే ప్రమాదమూ ఉంది. దీంతో కాలి వేళ్లను, పాదాలను తొలగించాల్సిన పరిస్థితీ తలెత్తుతుంది.

మధుమేహం నియంత్రణలో లేకపోతే నాడులు దెబ్బతినటం(న్యూరోపతీ), రోగనిరోధకశక్తి మందగించటం, రక్తనాళాలు సన్నబడటం వంటి పలు సమస్యలు ముంచుకొస్తాయి. నాడులు దెబ్బతింటే గాయం, పుండు తీవ్రమయ్యేంతవరకూ నొప్పి కలగదు. రోగనిరోధకశక్తి తగ్గితే చిన్న గాయమైనా త్వరగా ఇన్‌ఫెక్షన్‌ తలెత్తుతుంది. రక్తనాళాలు సన్నబడితే తగినంత రక్తం సరఫరా కాక పుండు నయమయ్యే ప్రక్రియ మందగిస్తుంది. అందువల్ల గాయాలు, పుండ్ల విషయంలో మధుమేహులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి.

* పుండుపై నీటిని పోస్తూ శుభ్రంగా కడగాలి. సబ్బు, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, అయోడిన్‌ వంటివి వాడొద్దు.

* అనంతరం పుండుపై యాంటీబయోటిక్‌ మలాం రాసి, శుభ్రమైన బ్యాండేజీని చుట్టాలి.

* బ్యాండేజీని రోజూ మారుస్తుండాలి. పుండు చుట్టుపక్కల భాగాన్ని సబ్బుతో శుభ్రం చేయాలి.

* రోజూ పుండును గమనిస్తుండాలి. ఎరుపు, వాపు వంటి ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలేవైనా కనబడితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.

నివారణ ఉత్తమం
మధుమేహుల్లో కాలికి ఏదైనా తగిలితే తెలియకపోవటంతో పాటు చూపు సమస్యలూ ఉంటాయి. దీంతో గాయం తీవ్రం అయ్యేంతవరకు వాటిని గుర్తించలేరు. అందువల్ల అసలు కాళ్లకు దెబ్బలు తగలకుండా, పుండ్లు కాకుండా చూసుకోవటం అన్నింటికన్నా ఉత్తమం.

* రోజూ పాదాలను క్షుణ్నంగా పరిశీలించాలి. బొబ్బలు, ఆనెలు, ఎరుపు, వాపు, గీసుకుపోవటం వంటివేమైనా ఉన్నాయేమో గమనించాలి. పాదాలను అందుకోలేకపోతే అద్దం సాయంతో పాదం కింది భాగాన్ని చూసుకోవాలి. అవసరమైతే ఇంట్లో వాళ్ల సాయం కూడా తీసుకోవచ్చు.

* రోజుకు ఒకసారి గోరు వెచ్చటి నీటితో పాదాలను కడుక్కోవాలి. పాదాలను పూర్తిగా ఎండనివ్వాలి. ముఖ్యంగా కాలి వేళ్ల మధ్య తడి లేకుండా చూసుకోవాలి. వేళ్ల మధ్య పొడిగా ఉండేందుకు పౌడర్‌ను గానీ మొక్కజొన్న పిండిని గానీ చల్లుకోవాలి. చర్మం మృదువుగా ఉండేందుకు పాదం పైన, కింద మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి.

* కాలి గోళ్లు తీసుకునేటప్పుడు చర్మం తెగకుండా జాగ్రత్త తీసుకోవాలి.

* బయటకు వెళ్లేప్పుడే కాదు ఇంట్లోనూ చెప్పులు వేసుకోవాలి. దీంతో పాదాలకు ఏదైనా తగిలినా గాయాలు కాకుండా చూసుకోవచ్చు.

* చెమటను పీల్చుకునే కాటన్‌ వంటి వాటితో తయారైన సాక్స్‌ను ధరించాలి. గట్టిగా పట్టుకొనే ఎలాస్టిక్‌ బ్యాండ్స్‌ రక్త సరఫరాను తగ్గిస్తాయి కాబట్టి అలాంటి సాక్స్‌ను వాడొద్దు.

* మడమకు, పాదం మధ్య భాగానికి దన్నుగా ఉండే సరైన షూనే ధరించాలి. బిగుతుగా, హీల్‌ భాగం ఎత్తుగా ఉండే షూ వాడొద్దు.

* మధుమేహుల కోసమే ప్రత్యేకంగా తయారుచేసిన చెప్పులు, షూ, సాక్స్‌ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. వీలుంటే అలాంటివి కొనుక్కోవటం మంచిది.

* పొగ తాగటం రక్తంలో ఆక్సిజన్‌ మోతాదును తగ్గిస్తుంది. ఇది పుండ్లు మానటం ఆలస్యం కావటానికి, తీవ్రం కావటానికి దారితీస్తుంది. కాబట్టి పొగ అలవాటుంటే వెంటనే మానెయ్యాలి.
  • =======================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Chronic inflamation way to many diseases-జబ్బులకు దారి తీసే దీర్ఘకాల వాపు

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --జబ్బులకు దారి తీసే దీర్ఘకాల వాపు-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
  •  

  •  

    వాపు అనగానే మనకు శరీరంపై ఎక్కడైనా ఉబ్బటం, కమలటం, ఎర్రబడటం వంటివే గుర్తుకొస్తాయి. కానీ ఇలాంటి వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) మన శరీరంలోని కణాల్లోనూ తలెత్తుతుంది. ఇది గాడితప్పినా, దీర్ఘకాలం కొనసాగినా రకరకాల జబ్బులను ప్రేరేపిస్తుంది. క్యాన్సర్‌, గుండెజబ్బు, మధుమేహం, అల్జీమర్స్‌, కుంగుబాటు వంటి అన్నిరకాల జబ్బులకు దారితీస్తుంది.

ఏవైనా విష పదార్థాలు ప్రవేశించినప్పుడో, గాయాలైనప్పుడో, ఇన్‌ఫెక్షన్లు దాడి చేసినప్పుడో మన శరీరంలోని కణాలు కొన్ని రసాయనాలను విడుదల చేసి.. రోగనిరోధకవ్యవస్థను అప్రమత్తం చేస్తాయి. వెంటనే రోగనిరోధకవ్యవస్థ స్పందించి వైరస్‌, బ్యాక్టీరియా వంటి వాటిని నిరోధించటానికి, దెబ్బతిన్న కణజాలాన్ని నయం చేయటానికి వాపు కణాలను పంపిస్తుంది. ఈ క్రమంలో రక్తనాళాల్లోని ద్రవం దెబ్బతిన్న భాగాల్లోకి విడుదలవుతుంది. దీంతో వాపు, ఎరుపు, నొప్పి వంటివి తలెత్తుతాయి. ఇవి అప్పటికి బాధ కలిగించినప్పటికీ సమస్య నయమయ్యేలా చేస్తాయి. మన రక్షణవ్యవస్థలో భాగమైన ఇది సహజంగా జరిగే ప్రక్రియ. అయితే కణసంబంధ వాపు ప్రక్రియతో చిక్కేటంటే.. కొందరిలో ఇది దీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తుంది. దీంతో శరీరం నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఇది గుండె, మెదడు వంటి అవయవాలను దెబ్బతీస్తుంది. ఉదాహరణకు.. రక్తనాళాల్లో వాపు కణాలు దీర్ఘకాలంగా ఉండటం గార పోగుపడటాన్ని ప్రోత్సహిస్తుంది. పైగా మన శరీరం ఈ గారను బయటినుంచి చొచ్చుకొచ్చిందని భావించి మరిన్ని వాపుకణాలను పంపిస్తుంది. దీంతో మరింత గార పోగుపడుతుంటుంది. ఫలితంగా రక్తనాళాలు గట్టిపడి గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యల ముప్పు పెరుగుతుంది. అలాగే మెదడులో వాపు ప్రక్రియ మూలంగా అల్జీమర్స్‌ రావొచ్చు. కాబట్టి దీర్ఘకాల వాపు ప్రక్రియ ముప్పును తగ్గించుకునే మార్గాలపై దృష్టి పెట్టటం మంచిదన్నది నిపుణుల సూచన. పొగ తాగటం, వూబకాయం, దీర్ఘకాల ఒత్తిడి, అతిగా మద్యం అలవాటు వంటి పలు జీవనశైలి అంశాలు సైతం వాపు ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. అందువల్ల పొగ మానెయ్యటం, బరువును అదుపులో ఉంచుకోవటం, మద్యం అలవాటుంటే పరిమితం చేసుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వంటి వాటితో వాపు ప్రక్రియ ముప్పును తగ్గించుకోవచ్చు. రకరకాల జబ్బుల బారినపడకుండా చూసుకోవచ్చు.
  • ============================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Dental Implant-డెంటల్‌ ఇంప్లాంట్‌

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- డెంటల్‌ ఇంప్లాంట్‌-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
  •  

  •  
 డెంటల్‌ ఇంప్లాంట్‌


    కావటానికి చాలా చిన్నదేగానీ.. అది లేకపోవటం జీవితంలో సృష్టించే 'వెలితి' మాత్రం చాలా పెద్దది! నోట్లో ఒక్క పన్ను లేకపోతే ప్రాణ ప్రమాదమేం ఉండదుగానీ ప్రతి దినం.. ప్రత్యక్ష నరకమే! అందుకే దంతవైద్య రంగం ఈ సమస్యను అధిగమించేందుకు చిరకాలంగా నానా ప్రయత్నాలూ చేస్తూనే ఉంది. ఈ క్రమంలో మనం కట్టుడు పళ్లు, పెట్టుడు పళ్లు.. వంతెన పళ్లు.. ఇలా చాలా ప్రయత్నాలను దాటుకుని వచ్చాం! కానీ వేటితోనూ పూర్తి సంతృప్తి లేదు. వేటి సమస్యలు వాటివి. ఇవేవీ కూడా సహజమైన దంతాలకు సరిజోడీగా, వాటికి దగ్గరగా కూడా రాలేదు. అందుకే ఇన్నేళ్లుగా 'బోసి నోటి'లో ఆ వెలితి.. వెలితిగానే వేధిస్తోంది.
    ఇప్పుడీ ప్రయాణం ఒక కీలక దశకు చేరుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆధునిక వైద్యరంగం ఆవిష్కరించిన 'డెంటల్‌ ఇంప్లాంట్‌' పరిజ్ఞానంతో ఇప్పుడు మనం పన్ను వూడిపోయిన చోటే... చాలావరకూ సహజమైన పంటితో సరిసమానంగా.. అంతే దృఢంగా.. అంతే మన్నికగా.. అంతే సౌకర్యంగా.. అచ్చం అలాగే.. శాశ్వతంగా ఉండిపోయే దంతాన్ని సృష్టించగలుగుతున్నాం! దంత వైద్య రంగంలో ఇదో పెను విప్లవానికి బాటలు వేసింది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా దీనికి విస్తృతమైన ఆదరణ లభిస్తోంది.

ఆధునిక వైద్యరంగం బోసి నోటికి' చెల్లు చీటీ రాసేసింది!
ఒకప్పుడు నోటిలో దంతాలు వూడిపోతే.. వాటి స్థానాన్ని భర్తీ చెయ్యటానికి చాలా తంటాలు పడాల్సి వచ్చేది. దశాబ్దాల పాటు 'ట్టుడు పళ్లు' ఒక్కటే శరణ్యంగా ఉండేవి. వాటిని తయారు చేయించుకోవటం.. తరచూ తీసి పెట్టుకోవటం, వాటితో గట్టిగా కొరకలేకపోవటం.. అవి చిగుళ్లకు నొక్కుకు'ని గట్టి వస్తువులు తినటం కష్టం కావటం.. ఇలాంటి ఇబ్బందులు బోలెడన్ని! పైగా శాశ్వతంగా ఉండిపోయేవీ కాదు కాబట్టి సహజమైన దంతాలకు ఇవి ఎన్నడూ సరిసాటి కాదు. అందుకే అనంతర కాలంలో ీబ్రిడ్జెస్‌' అందుబాటులోకి వచ్చాయి. మామూలు కట్టుడుపళ్లతో పోలిస్తే వీటికి దృఢత్వం ఎక్కువ, సౌకర్యమూ ఎక్కువే. వంతెనలు కట్టినట్టే.. పక్క దంతాలను స్తంభాల్లా ఆధారంగా చేసుకుని.. వాటికి అనుసంధానంగా కొత్త పంటిని ఏర్పాటు చెయ్యటం ఈ విధానం ప్రత్యేకత. అయితే వూడిన పంటికి పక్కన అటూఇటూ దంతాలు లేకపోయినా, ఉన్నా గట్టిగా లేకపోయినా ఈ విధానం కుదిరేది కాదు. పైగా వీటిని అమర్చేందుకు పక్క పళ్లను కొంత అరగదీయాల్సి ఉంటుంది. వూడిన పంటిని భర్తీ చెయ్యటం కోసం.. పక్క పంటిని అరగదీయటమంటే ఆరోగ్యంగా ఉన్న పంటిని ఇబ్బంది పెట్టటమే. అందుకే ఇలాంటి సమస్యలేవీ లేకుండా.. కేవలం వూడిన పంటిని.. వూడిన చోటే.. అంతే స్థిరంగా భర్తీ చేసే పరిజ్ఞానం కోసం దంతవైద్యరంగం విస్తృతంగా కసరత్తులు చేసింది. ఫలితంగా అందుబాటులోకి వచ్చిందే.. ఇంప్లాంట్‌!

సౌకర్యం.. సుస్థిరం!
పక్క పళ్లను వేటినీ ముట్టుకోవాల్సిన అవసరం లేకుండా.. పన్ను వూడిన చోటే కొత్తగా కృత్రిమ దంతాన్ని అమర్చే సమర్థ విధానమే ీడెంటల్‌ ఇంప్లాంట్‌'. ఇందులో దంతం వూడిన చోట.. అదే ప్రదేశంలో ఎముకలోకి ఒక మర సీల వంటి ీఇంప్లాంటు'ను బిగించి.. అది స్థిరంగా కుదురుకున్న తర్వాత.. దాని మీద దంతాన్ని అమరుస్తారు. చూడటానికి ఇది అచ్చం మన నిజ దంతం మాదిరే ఉంటుంది. ఒకసారి ఇంప్లాంట్‌ అమరిస్తే.. తీసిపెట్టుకోవటం వంటి ఇబ్బందులేమీ ఉండవు, దాన్ని పూర్తి సహజమైన దంతంలాగే చూసుకోవచ్చు. అందుకే ఇంప్లాంట్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆదరణ బాగా పెరిగింది.

రెండు దశలుగా.. లేదంటే ఒక్కసారే!
మన పంటి కింద.. బలమైన పునాదిలాగా దంతమూలం ఉంటుంది. ఇది చిగురు నుంచి కిందికి వెళ్లి.. కింద ఉండే దవడ ఎముకలో దృఢంగా కుదురుకుని ఉంటుంది. అందుకే మన దంతాలు దృఢంగా ఉండాలంటే.. పైకి కనిపించే చిగురు, దాని కింద పంటికి ఆధార భూతంగా ఉండే ఎముక... రెండూ బాగుండాలి!

సాధారణంగా డెంటల్‌ ఇంప్లాంట్‌ను రెండు దశలుగా చేస్తారు. తొలిదశలో ఎముకలోకి గుండ్రటి సీలలాంటి ఇంప్లాంటును అమర్చి.. మూడు నెలల వ్యవధి ఇచ్చి.. అది బాగా కుదురుకున్న తర్వాత దానిపైన దంత భాగాన్ని (క్రౌన్‌) అమర్చటం ఒక విధానం. ఇది రెండు దశల్లో ఇంప్లాంట్‌ అమర్చే విధానం. ఒకవేళ ఎముక, చిగురువంటివన్నీ ఆరోగ్యకరంగా బాగుంటే ఈ మొత్తం ప్రక్రియ మొత్తాన్నీ ఒక్కసారే చెయ్యొచ్చు కూడా. అందుకని వైద్యులు అవసరాన్ని బట్టి, దంతమూలం వద్ద ఎముక స్థితిని బట్టి ఎవరికి ఏ విధానం మంచిదో సిఫార్సు చేస్తారు. సాధారణంగా ముందు వరస పళ్లు... ఎక్కడా కూడా పైపళ్లకు తగలవు. వీటి మధ్య కాస్త ఎడం ఉంటుంది. ఇలాంటి పళ్ల విషయంలో ఒకేసారి (సింగిల్‌ స్టేజ్‌).. అంటే ఇంప్లాంట్‌ అమర్చి, ఆ వెంటనే పైదంతాన్నీ (క్రౌన్‌) బిగించెయ్యొచ్చు.
ఎముక దృఢత్వం లేకపోతే..
కొందరికి దంతమూలం వద్ద ఎముక గట్టిగా ఉండదు. కొందరికి ఎముక మొత్తం అరిగిపోయి లేదా క్షీణించిపోయి ఉంటుంది. ఇలాంటి వారికి ముందు కృత్రిమ ఎముకను గానీ.. ఇతర భాగాల నుంచి తెచ్చిన ఎముకనుఅక్కడ తెచ్చి అమరుస్తారు. దీన్నే 'బోన్‌ గ్రాఫ్టింగ్‌' అంటారు. కొద్దినెలల్లో ఆ ఎముక క్రమేపీ అక్కడ కుదురుకుని స్థిరంగా తయారవుతుంది. అప్పుడు దానిలోకి ఇంప్లాంట్‌ అమరుస్తారు. కొన్ని రకాల ఇంప్లాంట్‌లకు.. సన్నటి రంధ్రాలు ఇస్తారు. ఎముక వీటిలోకీ విస్తరించి, గట్టిగా పట్టుకుంటుది.

ఇంప్లాంట్‌: ఎవరికి?
సాధారణంగా 14-15 ఏళ్ల వయసు వచ్చేసరికి పాలపళ్లన్నీ వూడి, శాశ్వత దంతాలు వచ్చేస్తాయి. ఆ తర్వాత పళ్లు వూడిపోతే.. ఏ వయసు వారికైనా.. అంటే యుక్తవయస్సువారి నుంచి వృద్ధుల వరకూ.. ఎవరికైనా ఇంప్లాంట్‌ అమర్చవచ్చు. కాకపోతే- ఇంప్లాంట్‌ అమర్చే ముందు వారికి- పొగ, మద్యం అలవాట్లున్నాయా? మధుమేహం వంటి సమస్యలేవైనా ఉన్నాయా? చిగుళ్లు, నోటి ఆరోగ్యం ఎలా ఉంది? వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మధుమేహం నియంత్రణలో లేనివారికి ఇంప్లాంట్‌ అమరిస్తే.. ఎముక ఏర్పడక 'అది వూడిపోవచ్చు. అలాగే పొగ, మద్యం అలవాట్లున్నా.. చిగుళ్ల వాధులున్నా.. దంతమూలంలో ఎముక క్షీణించినా.. వీరికి ఇంప్లాంట్స్‌ పనికిరాకపోవచ్చు. క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా రేడి'యేషన్‌, కీమోథెరపీ చేయించుకున్న వారికీ వీటిని అమర్చటం కుదరదు. అందుకని ఎక్స్‌రే వంటి పరీక్షలు చేసి.. ఎముక ఎంత ఉంది, అదెంత దృఢంగా ఉందన్నది గుర్తించి.. దాని ఆధారంగా ఇంప్లాంట్‌ చికిత్సను నిర్ణయిస్తారు.
ఇంప్లాంట్‌: ఎలా అమరుస్తారు?
సాధారణంగా మనకు దంతం వూడిపోతే.. వెంటనే అక్కడ ఖాళీ కనబడినా.. క్రమేపీ అక్కడ ఎముక పూడుకుపోతుంది. దీనివల్ల మళ్లీ అదే స్థానంలో, ఆ ఎముకలోకే ఇంప్లాంట్‌ అమర్చే వీలుంటుంది. ఇంప్లాంటును అమర్చాల్సిన భాగంలో ముందుగా మత్తు ఇస్తారు. తర్వాత ఇంప్లాంటు సైజును బట్టి ఎముకలోకి రంధ్రం చేసి, అవసరమైనంత మేర దవడ ఎముకను తొలగిస్తారు. అనంతరం అందులో ఇంప్లాంట్‌ను బిగిస్తారు. దీని చుట్టూ ఎముక ఏర్పడి గట్టిపడటానికి సుమారు మూడు నెలల సమయం పడుతుంది. అది స్థిరంగా తయారై.. దంత మూలం మాదిరిగా పని చేస్తుంది. ఆ తర్వాత దాని మీద ీక్రౌన్‌'ను బిగిస్తారు. అవసరమనుకుంటే- ఇంప్లాంట్‌ అమర్చిన వెంటనే అక్కడ ఖాళీ కనబడకుండా తాత్కాలికంగా ప్లాస్టిక్‌ పన్నును అమర్చుకోవచ్చు. అది స్థిరపడిన తర్వాత శాశ్వతంగా క్రౌన్‌ బిగించొచ్చు.

* కొందరికి రకరకాల కారణాల రీత్యా పంటిని తొలగించి.. దాని స్థానంలో ఇంప్లాంట్‌ అమర్చాల్సి ఉంటుంది. ఇలాంటి వారికి పంటిని తొలగించినపుడు ఏర్పడ్డ రంధ్రంలోనే.. వెంటనే మరికాస్త పెద్దగా రంధ్రం చేసి ఇంప్లాంట్‌ను అమరుస్తారు.
ఎన్ని అమర్చొచ్చు?
డెంటల్‌ ఇంప్లాంట్స్‌ మనం బయటి నుంచి తెచ్చి అమర్చే కృత్రిమ సీలల వంటివే అయినా.. ఇవి శరీరంలో చక్కగా ఒదిగిపోతాయి. శరీరం తిరస్కరించటమన్నది ఉండదు. సాధారణంగా ఎక్కడ దంతం వూడితే అక్కడ ఇంప్లాంట్‌ అమర్చవచ్చు. పళ్లు మొత్తం వూడిన పక్షంలో.. గరిష్ఠంగా పైదవడలో 6, కింది దవడలో 6.. మొత్తం 12 ఇంప్లాంట్స్‌ అమర్చి.. వాటి ఆధారంగా మొత్తం 28 పళ్లనూ ఏర్పాటు చెయ్యొచ్చు. 6 ఇంప్లాంట్స్‌ అమర్చటం కూడా కుదరని పక్షంలో నాలుగే అమర్చి, వాటికే అన్ని పళ్లూ బిగించొచ్చు. దీన్ని ీఆల్‌ ఆన్‌ ఫోర్‌' పద్ధతి అంటారు. కొందరికి ఈ ఇంప్లాంట్స్‌ పెట్టటమూ కుదరదు. వీరికి కింద దవడ, పైదవడల్లో రెండేసి ఇంప్లాంట్స్‌ అమర్చి.. వాటికే ీకట్టుడుపళ్ల'ను (డెంచర్లను) బిగిస్తారు. దీన్ని ీఇంప్లాంట్‌ సపోర్టెడ్‌ డెంచర్‌' విధానమంటారు. అవసరమైనప్పుడు ఈ కట్టుడు పళ్లను తీసి మళ్లీ పెట్టుకోవచ్చు.

క్రౌన్స్‌ రకరకాలు
పైకి కనిపించే దంత భాగం.. క్రౌన్‌లలో.. చాలా రకాలున్నాయి. జెర్కోనియం, సిరామిక్‌, పోర్సిలీన్‌ ఫ్యూజ్డ్‌ టు మెటల్‌, ఆల్‌రెసీన్‌ వంటిరకాలన్నీ మన్నికగానే ఉంటాయిగానీ.. ఇది చాలా వరకూ ఆయా వ్యక్తుల ఆహారపుటలవాట్ల వంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. కొందరికి ఇంప్లాంట్‌ అమర్చినపుడు అంతా బాగానే ఉంటుంది. కొంత కాలానికి మధుమేహం వంటి జబ్బుల మూలంగానో, నోటిని సరిగా శుభ్రం చేసుకోకపోవటం వల్లనో అది వదులుగా అయ్యి వూడిపోయే అవకాశం ఉంటుంది. మన సహజ దంత మూలానికి ఇన్‌ఫెక్షన్లు వచ్చి దంతం వూడినట్టుగానే ఇంప్లాంట్‌కూ ఇన్‌ఫెక్షన్లు రావచ్చు. అందుకే ఇంప్లాంట్‌ అమర్చిన తర్వాత నోటి శుభ్రత విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించకూడదు.
ఇంప్లాంట్‌తో ఎన్నో సౌకర్యాలు!
* ఇంప్లాంటు.. పూర్తి సహజమైన దంతంలాగే ఉంటుంది. కాబట్టి దంత సౌందర్యానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

* ఇంప్లాంటును అమర్చిన తర్వాత నొప్పేమీ ఉండదు. పూర్తి సహజమైన దంతంలాగే సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. దీంతో తినటానికేం ఇబ్బంది ఉండదు, మాట్లాడటం చాలా సహజంగా ఉంటుంది.

* సాధారణంగా క్రౌన్‌ దెబ్బతినదు. ఒకవేళ దెబ్బతిన్నా.. దాన్ని తీసేసి కొత్తది వేసుకోవచ్చు. ఎముకలోకి అమర్చిన ఇంప్లాంట్‌.. మనం నోటి ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలన్నీ తీసుకుంటుంటే చాలావరకూ జీవితాంతం, సుస్థిరంగా అలాగే ఉండిపోతుంది.

* కట్టుడుపళ్ల మాదిరిగా తియ్యటం, పెట్టుకోవటం వంటి ఇబ్బందులేమీ ఉండవు.
అమర్చటంలోనూ జాగ్రత్త అవసరం!
* ఇన్ఫెక్షన్లు ఉంటే.. ముందు వాటిని నయం చేసి.. అప్పుడు ఇంప్లాంటు అమర్చాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇప్పుడు ీలేజర్‌ కంబైన్డ్‌ ఇంప్లాంట్‌ సర్జరీ' అనే అధునాతన ప్రక్రియక అందుబాటులోకి వచ్చింది. ముందు లేజర్‌తో ఇన్‌ఫెక్షన్లను నియంత్రించి, ఆ వెంటనే ఇంప్లాంటును అమరుస్తారు.

* మనకు పైదవడ ఎముక సమీపంలోనే గాలిగది (మ్యాగ్జిలరీ సైనస్‌) ఉంటుంది. కొందరికి వెనక పళ్లు వూడిపోయిన తర్వాత ఈ సైనస్‌ గది దాదాపు నోటికి తాకుతున్నట్టే ఉంటుంది. దాని దగ్గర ఇంప్లాంట్‌ బిగిస్తే.. అది నేరుగా సైనస్‌లోకి వెళ్లొచ్చు. కాబట్టి ఇలాంటి వారికి సైనస్‌ను కాస్త పైకి లేపి, కొత్తగా కృత్రిమ ఎముక అతికించి (బోన్‌ గ్రాఫ్టింగ్‌).. ఆ తర్వాత ఇంప్లాంట్‌ అమరుస్తారు.

* కొందరికి కింది దవడ ఎముక పూర్తిగా అరిగిపోయి అక్కడి నాడులు బయటపడి ఉంటాయి. ఇలాంటి సమయాల్లో నాడిని వేరొక మార్గానికి మళ్లించి, అప్పుడు ఇంప్లాంట్‌ అమర్చాల్సి ఉంటుంది.

ఇప్లాంటు తర్వాత..
* సాధారణంగా మనం దంతాల సంరక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో ఇంప్లాంటు విషయంలోనూ అంతే! రోజూ బ్రషింగ్‌ చేసుకోవటం, ఆహారం తీసుకోగానే నీటిని పుక్కిలించి నోరు శుభ్రం చేసుకోవటం, వేడి-చల్ల వస్తువులు వెంటవెంటనే తినకపోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యం, ఆల్కహాల్‌ వంటివి ఇంప్లాంట్‌ను దెబ్బతీస్తాయని మరువకూడదు. తరచూ దంతవైద్యులతో చెకప్‌ చేయించుకోవటం ఉత్తమం.

* ఇంప్లాంటును అమర్చిన తర్వాత తగు జాగ్రత్తలు తీసుకోకపోవటం మూలంగా కొందరికి ీపెరి ఇంప్లాంటైటిస్‌' అనే సమస్య తలెత్తి నొప్పికి దారి తీస్తుంటుంది. ఇలాంటి వారికి లేజర్‌ ద్వారా చికిత్స చేసి, శుభ్రం చేసి, మందులు వాడితే నొప్పి తగ్గుతుంది.

* అవయవాల మార్పిడి చికిత్సలు చేయించుకొన్న వారికి రోగనిరోధకశక్తిని అణిచిపెట్టి ఉంచే మందులు ఇస్తారు. ఇలాంటి మందులు తీసుకునేవారిలో ఇంప్లాంట్‌లు బయటకు వచ్చే ప్రమాదముంది.కాబట్టి వీటి గురించి వైద్యులతో ముందుగానే చర్చించాలి

courtesy with Dr.Kadiyala Rajendra Dentist@ 'సుఖీభవ' 30-june-2015
  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/