Friday, July 5, 2013

Thyroid cancer Awareness,థైరాయిడ్‌ కాన్సర్స్ అవగాహన

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Thyroid cancer Awareness,థైరాయిడ్‌ కాన్సర్స్ అవగాహన- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



థైరాయిడ్‌ గ్రంథి సీతాకోక చిలుక ఆకారంలో మెడలో విండ్‌పైప్‌ ప్రాంతంలో ఉంటుంది. మన శరీరం శక్తిని ఎలా ఉపయోగించుకుంటుంది, ఎలా నిలువ ఉంచుకుంటుంది లాంటి వాటిని సరిచూస్తూ ఉంటుంది. మన శరీరంలోని కణాలన్నింటి పని తీరుని పరీక్షిస్తుంటుంది థైరాయిడ్‌ గ్రంథి.

థైరాయిడ్‌ గ్రంథి సమస్యలు, పాంక్రియాజ్‌ గ్రంథి సమస్యలు మనకి ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొదటిది ఆడవాళ్ళలో, రెండవది మగవాళ్ళలో ఎక్కువగా కనిపించడం విశేషం.థైరాయిడ్‌ సమస్యలు ఇప్పుడు ఎక్కువకాలేదు. కాకపోతే కొన్ని అనారోగ్యాల అను మానంతో పరీక్షలు జరిపి థైరాయిడ్‌
సమస్యల్ని ఎక్కువగా కనుక్కొంటున్నారు. ప్రధానంగా థైరియిడ్‌కి వచ్చే సమస్యలు - హైపోథైరాయిడిజమ్‌, హైపర్‌ థైరాయి డిజమ్‌, థైరాయిడ్‌ కాన్సర్స్‌..హార్మోన్ ఉత్పత్తి సంబంధిత సమస్యలే కాకుండా థైరాయిడ్ ఒక్కోసారి క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. కాకపోతే, హైపోథైరాయిడిజం, లేదా హైపర్ థైరాయిడ్ సమస్యలకూ, థైరాయిడ్ క్యాన్సర్ రావడానికీ ఏ సంబంధమూ లేదు.

మగవాళ్ళలో కంటే ఆడవాళ్ళలో థైరాయిడ్‌ క్యాన్సర్‌ ఎక్కువ. గొంతు దగ్గర వాపు కనిపించడం థైరాయిడ్‌ లక్షణం దానికి నొప్పి ఉండదు. ఇతర క్యాన్సర్స్‌లాగే దీనికి చికిత్స ఉంది. కాకపోతే ప్రాథమిక దశలోనే ఇబ్బందుల్ని కనుక్కోవడం చాలా అవసరం.చాలా మందికి అవయవాల మీద, సిస్టమ్స్‌మీద అవగాహన ఉండవచ్చు. గ్రంథుల మీద అవగాహన ఉండదు. కాబట్టి గ్రంథుల నిర్మాణం, ఎక్కడుంటాయి, ఎలా ఉన్నాయి, ఏ స్థాయిలో హార్మోన్లని విడుదల చేస్తున్నాయి లాంటి విషయాల మీద అందరికీ అవగాహన ఉండాలి.

    ఒక అంచనా ప్రకారం మన దేశంలో 4.2 కోట్ల మంది (2012) థైరాయిడ్‌ క్యాన్సర్‌ బారినపడ్డారు. మహిళల్లో వచ్చే రొమ్ము, పిత్తాశయం క్యాన్సర్‌తో పాటు థైరాయిడ్‌ క్యాన్సర్‌ కూడా పెరుగుతోంది. ఈ క్యాన్సర్‌ ఎలా వృద్ధి చెందుతుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? చికిత్స, నివారణ మార్గాలు తెలుసుకుందాం....

థైరాయిడ్‌ గ్రంథి శ్వాసనాళం ముందు భాగంలో, స్వరపేటికకు కింద ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలోని అయోడిన్‌ నుంచి థైరాయిడ్‌ హార్మోనులు తయారవుతాయి. గ్రంథిలోని సాధారణ కణాలు అసాధారణ కణాలుగా మారి, నియంత్రణ లేకుండా పెరిగి, ఇతర అవయవానికి వ్యాప్తి చెందినప్పుడు థైరాయిడ్‌ క్యాన్సర్‌ వస్తుంది. ఇది అసాధారణ క్యాన్సర్‌ రూపం అయినప్పటికీ థైరాయిడ్‌ క్యాన్సర్‌లో రకాలుంటాయి. పాపిలరీ థైరాయిడ్‌ క్యాన్సర్‌, పొలిక్యులర్‌ థైరాయిడ్‌ క్యాన్సర్‌, మెడ్యులరీ థైరాయిడ్‌ క్యాన్సర్‌, అనప్లాస్టిక్‌ కార్సినొమా, థైరాయిడ్‌ లింఫొమా అనే రకాలుంటాయి.

లక్షణాలు

మొదట క్యాన్సర్‌ తొలిదశల్లో దీని లక్షణాలను గుర్తించలేరు. క్యాన్సర్‌ పెరిగి, వృద్ధి చెందుతున్నకొద్దీ లక్షణాలు బయటపడతాయి. అవి....

  • మాట్లాడలేకపోవడం లేదా గొంతు బొంగురుపోవడం,
  • మెడలో ముద్దలాగా కనిపించడం,
  • మెడ విస్తరించినట్లు అనిపించడం,
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,
  • మింగడం కష్టంగా ఉండటం,
  • దగ్గినప్పుడు రక్తం పడటం,

ఈ లక్షణాలుంటేనే థైరాయిడ్‌ క్యాన్సర్‌ అని భావించకూడదు. ఇతర కారణాల వల్ల కూడా ఇవి బయటపడొచ్చు.

కారణాలు

రేడియేషన్‌ : చిన్నతనంలో రేడియేషన్‌ ప్రభావానికి గురవడం వల్ల క్యాన్సర్‌ వృద్ధి చెందే అవకాశముంది. వైద్యం చేసే సమయంలో కలిగే రేడియేషన్‌ ఒకటైతే, అణుబాంబులు వేయడం వల్ల వాతావరణంలో కలిగే పర్యావరణమార్పులు (జపాన్‌లోని నాగసాకి, హిరోషిమా) లేదా అణు విద్యుత్‌ ప్లాంట్లలో జరిగే ప్రమాదాల (చెర్నోబిల్‌ వంటివి) వల్ల రేడియేషన్‌ ప్రభావానికి గురవుతారు.

కుటుంబ చరిత్ర : కుటుంబంలో ఎవరికైనా థైరాయిడ్‌ క్యాన్సర్‌ ఉంటే తర్వాతి తరం వారిలో క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

ఇవేకాక థైరాయిడ్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాలు చాలా ఉన్నాయి.
  • వృత్తిపరమైన, పర్యావరణ ప్రభావాలు,
  • హెపటైటిస్‌-సి సంబంధ దీర్ఘకాల హెపటైటిస్‌,
  • ఆలస్యంగా తొలిసారిగా గర్భం రావడం.

చికిత్స :
థైరాయిడ్ క్యాన్‌సర్ టైపు , స్టేజ్ లను బట్టి ట్రీట్మెంట్ చేసేపద్దతులుంటాయి.

సర్జరీ : థైరాయిడ్‌ క్యాన్సర్‌ను తొలగించడానికి చాలా కేసులకు సర్జరీ చేస్తారు. శస్త్రచికిత్సలో భాగంగా థైరాయిడ్‌ గ్రంథిలోని కొంతభాగం లేదా థైరాయిడ్‌ గ్రంథి మొత్తం తొలగిస్తారు. కొన్నిసార్లు వీటికి దగ్గర్లో ఉన్న లింఫ్‌నోడ్లను కూడా తొలగిస్తారు.

రేడియో యాక్టివ్‌ అయోడిన్‌ : రేడియో యాక్టివ్‌ అయోడిన్‌ను బిళ్ల రూపంలో లేదా ద్రవరూపంలో తీసుకోవాలి.

మందులు : థైరాయిడ్‌ సర్జరీ లేదా రేడియో యాక్టివ్‌ అయోడిన్‌ చికిత్స తర్వాత థైరాయిడ్‌ హార్మోన్‌ మందులు తీసుకోవాలని సూచిస్తారు. వీటివల్ల శరీరానికి అవసరమైన హార్మోన్లు సరైన మోతాదులో అందుతాయి.

ఎక్స్‌టర్నల్‌ బీమ్‌ రేడియేషన్‌ థెరపీ : క్యాన్సర్‌ కణాలను చంపడానికి ఎక్కువ డోసు ఎక్స్‌రే కిరణాలను ఈ చికిత్సలో ఉపయోగిస్తారు.

కీమోథెరపీ : ఈ పద్ధతిలో మందుల్లోని రసాయనాల ద్వారా క్యాన్సర్‌ కణాలను చంపుతారు. చేతి సిరల ద్వారా కీమోథెరపి వైద్యం చేస్తారు. ఇతర చికిత్సలకు స్పందించనివాళ్లకు ఈ చికిత్స సూచిస్తారు.

చికిత్స తర్వాత మళ్లీ థైరాయిడ్‌ క్యాన్సర్‌ రాకుండా డాక్టర్‌ సలహా మేరకు క్రమం తప్పకుండా అవసరమైన పరీక్షలు, రక్తపరీక్షలు, స్కానింగ్‌లు చేయించుకోవడం తప్పనిసరి.

Courtesy with : జీవన డెస్క్ @prajasakti Telugu daily   Tue, 18 Jun 2013.
Courtesy with : డా ఇరుకులపాటి రవిశంకర్‌-ఎండొక్రినాలజిస్ట్‌, హైదరాబాద్‌ @surya Telugu daily news paper.

  • ===================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, June 13, 2013

Coronary artery blocks,గుండె రక్తనాళాల్లో పూడికలు,గుండెలో బ్లాకులు,Blocks in heart

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Coronary artery blocks,గుండె రక్తనాళాల్లో పూడికలు,గుండెలో బ్లాకులు,Blocks in heart
-
గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



    కొందరు పొట్టలో, ఛాతీలో ఏ కొంచెం నొప్పి వచ్చినా అది 'గుండెపోటు' నొప్పేనేమో అని తీవ్రంగా గాభరా పడిపోతుంటారు. వీళ్లను ఆ భయంవెన్నాడుతూనే ఉంటుంది.  ఇటువంటి వారు కూడా ఒకసారి వైద్యుల సలహాతో పరీక్షలు చేయించుకుని సందేహాలను నివృత్తి చేసుకోవటం మంచిది. నాలుగు పదుల జీవితం హాయిగా నడిచిపోతుంటుంది. ఇంటాబయటా నిశ్చింత. ఇంతలో మన పక్కనే ఒక పిడుగు పడుతుంది. ప్రతి రోజూ కలిసే తోటి ఉద్యోగికో.. తరచూ పలకరించే ఎదురింటి మిత్రుడికో హఠాత్తుగా 'గుండె పోటు' ముంచుకొచ్చి.. పరిస్థితి చాలా 'సీరియస్‌' అవుతుంది. గుండెలోని రక్తనాళాల్లో  'బ్లాకులు'న్నాయని.. వాటికి స్టెంటు పెట్టాలనో, బైపాస్‌ ఆపరేషన్‌ చెయ్యాలనో చెబుతారు వైద్యులు.

ఇక అక్కడి నుంచీ మొదలవుతుంది మనకు గుండెల్లో గుబులు. ఏ క్షణాన్నైనా మనకూ గుండె పోటు రావచ్చేమో! మనకూ గుండెల్లో బ్లాకులున్నాయేమో..?రోజురోజుకూ అవి  పెరుగుతున్నాయేమో? ఏదో ఒకరోజు అవి మనల్నీ దెబ్బతీస్తాయేమో! ఇక ఈ దిగులుకు అంతుండదు.నిజానికి ఈ దిగులు, ఈ గుబులు అసహజమైనదేం కాదు. తరచుగా కొన్ని ప్రాథమిక పరీక్షలు చేయించుకుంటూ, ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించే వారికి అంత భయం అక్కర్లేదుగానీ.. అది కొరవడినప్పుడు గుండెల్లో 'బ్లాకు'లు నిజంగానే ప్రమాదకరం. ఇలా పూడికలు వచ్చే ముప్పు ఎక్కువ ఉన్నవాళ్లు దీన్నంత తేలికగా తీసుకోవటానికి లేదు. అందుకే గుండెలో పూడికలు పెరిగే ముప్పు ఎవరికి ఎక్కువ? ఈ పూడికలు ఉన్నాయా? లేదా? అన్నది నిర్ధారించుకునేందుకు ఇప్పుడున్న పరీక్షలు ఏమిటి? వీటిలో సమస్యను ఏవెంత కచ్చితంగా చెప్పగలుగుతాయన్నది తెలుసుకోవడం ముఖ్యము .

గుండెలో ఉండే రక్తనాళాల్లో పూడికలు వచ్చి... గుండె కండరానికి రక్తసరఫరా నిలిచిపోవటం... ఎవరికైనా జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద ఉపద్రవం! అదే గుండెపోటు!! ఆధునిక కాలంలో ఎంతోమంది ప్రాణాలను క్షణాల్లో హరించివేస్తున్న ఈ సమస్యను తేలిగ్గా తీసుకోవటానికి లేదు. ఒకప్పుడు ఏదో పెద్దవయసులోనే వస్తుందనుకునే ఈ సమస్య ఇప్పుడు మధ్యవయసులో, ఇంకా చెప్పాలంటే చిన్నవయసులో కూడా ముంచుకొచ్చేస్తోంది. దీని బారినపడకుండా మనల్ని మనం రక్షించుకోవాలంటే.. అసలీ పూడికలేమిటో.. ఇవెందుకు వస్తాయో అర్థం చేసుకోవటం చాలా అవసరం.

రక్తం మన ప్రాణం! రక్త సరఫరా లేకుండా మన శరీరంలో ఏ భాగమూ.. ఏ కణమూ కూడా పని చెయ్యలేదు. అందుకే మన గుండె శరీరం మొత్తానికి రక్తాన్నిపంపింగ్‌ చేస్తుంటుంది. అయితే ఇదే సూత్రం గుండెకూ వర్తిస్తుంది. మన గుండె నిరంతరం కొట్టుకుంటూ పనిచేస్తుండాలంటే.. దానికీ రక్త సరఫరా అవసరమే! ఆ పని చేసేవే గుండె గోడల్లో ఉండే 'కరోనరీ' ధమనులు. సున్నితమైన ఈ ధమనులు గుండె గోడల పైపొరల్లో ఉండి.. గుండె కండరం మొత్తానికి నిరంతరం రక్తాన్ని అందిస్తుంటాయి.ఇలా గుండెకు రక్తాన్ని అందించే ధమనులేమిటో చూద్దాం. కుడివైపు ఉండేది ఒకటి. దీన్ని 'రైట్‌ కరోనరీ ఆర్టరీ-ఆర్‌సీఏ' అంటారు. ఇక ఎడమవైపు వెళ్లేది లెఫ్ట్‌ కరోనరీ ఆర్టరీ. ఇది కొద్దిదూరం రాగానే రెండు పాయలుగా చీలుతుంది. వీటిలో ఒకదాన్ని సర్కమ్‌ఫ్లెక్స్‌, రెండోదాన్ని 'లెఫ్ట్‌ యాంటీరియర్‌ డిసెండింగ్‌ ఆర్టరీ-ఎల్‌ఏడీ' అంటారు. వీటిని స్థూలంగా చూస్తే- కుడి ధమని ఒకటి, ఎడమవైపు రెండు... ఇలా కరోనరీ ధమనులు మూడని చెప్పుకోవచ్చు. మన ఇళ్లలోని నీళ్ల గొట్టాల్లో పాచి పేరుకున్నట్టే... ఈ మూడింటిలో కొలెస్ట్రాల్‌ కొవ్వు ముద్దలు పేరుకుని.. అవి రక్త ప్రవాహానికి అడ్డుగా తయారవ్వచ్చు. వీటినే సాధారణంగా 'బ్లాక్‌'లని అంటుంటారు. ఈ బ్లాక్‌లు చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఏదైనా నాళంలో బ్లాక్‌ ఏర్పడితే.. దాని నుంచి కిందికి రక్తం వెళ్లక.. ఆ ప్రాంతం గుండె కండరం దెబ్బతింటుంది... గుండెపోటు ముంచుకొస్తుంది! అందుకే పూడికల విషయంలో చాలా జాగ్రత్త అవసరం.

పూడికలు వచ్చే ముప్పు ఎవరికి ఎక్కువ?
గుండెలో రక్తనాళాలు పూడుకుపోయి.. గుండెపోటు ముప్పు ముంచుకొచ్చే అవకాశం ఎవరికి ఎక్కువ ఉంటుందో ఇప్పుడు చాలామందికి తెలుసు. అయినా ఈ ముప్పుల పట్ల చాలామంది శ్రద్ధ తీసుకోవటం లేదు. ఈ కింద సమస్యలున్న వారంతా.. తమకు గుండె పోటు ముప్పు పొంచి ఉంటుందని గుర్తించటం అవసరం.

* మధుమేహులు
* హైబీపీ ఉన్నవాళ్లు
* కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉన్నవాళ్లు
* పొగతాగే అలవాటున్న వాళ్లు
* వూబకాయులు
* తగినంత శారీరక శ్రమ, వ్యాయామాలు చెయ్యనివారు
* వయసు: సాధారణంగా రక్తనాళాలు పూడుకుపోవటమన్నది 40-50 ఏళ్ల పైబడిన వారికే ఎక్కువ. కానీ ఇటీవలి కాలంలో ఇంకా చిన్నవయసులోనే అంటే 30-40 మధ్య వయసు వారిలో కూడా గుండె రక్తనాళాల్లో పూడికలు కనబడుతున్నాయి. కాబట్టి ఎటువంటి ముప్పులున్నా చిన్న వయసు నుంచీ జాగ్రత్తలు అవసరమని గుర్తించాలి.
* ఇవి కాకుండా రక్తంలో- లైపోప్రోటీన్‌-ఎ, హోమోసిస్టీన్‌, కార్డియోలిపిన్‌, ఫైబ్రినోజెన్‌ వంటివి ఉన్నవారికీ పూడికలు వచ్చే ముప్పు ఎక్కువ. సాధారణంగా గుండెకు సంబంధించిన పరీక్షల ప్యాకేజీల్లో ఇవీ ఉంటాయి. లేదూ అనుమానం బలంగా ఉన్నవారికి వైద్యులు ఈ పరీక్షలు చేయిస్తారు.

పూడికలున్నాయేమో పరీక్షలు ఎవరికి అవసరం?
* పైన చెప్పిన ముప్పుల్లో ఒకటి, రెండు కంటే ఎక్కువ ముప్పులున్న ప్రతి ఒక్కరూ పరీక్ష చేయించుకోవటం అవసరం. ఇవే కాకుండా..
* కాస్త శ్రమ చేస్తే గుండెనొప్పి లేదా ఆయాసం వంటివి వస్తున్న వాళ్లు,
* కుటుంబంలో గుండెపోటు చరిత్ర ఉన్నవాళ్లు,
* శారీరకంగా అధికంగా శ్రమించే క్రీడాకారులు, పోలీసు వంటి ఉద్యోగాలకు 'ఫిట్‌నెస్‌' పరీక్షలకు వెళుతున్న వాళ్లు, అలాగే తరచూ ఫిట్‌నెస్‌ పరీక్షలు అవసరమయ్యే పైలెట్ల వంటి ఉద్యోగులు..
..వీరంతా కూడా గుండెలో 'పూడికలు' ఉన్నాయేమో పరీక్ష చేయించుకోవటం చాలా అవసరం.

ప్రస్తుత పరిస్థితులను బట్టి 30-40 ఏళ్ల నుంచీ అందరూ కొన్ని ప్రాథమికమైన పరీక్షలు చేయించుకోవటం మంచిది. అందరికీ గుండెకు సంబంధించిన పరీక్షలన్నీ అవసరం ఉండదుగానీ 'ట్రెడ్‌మిల్‌ టెస్ట్‌'తో మాత్రం మంచి ప్రయోజనం ఉంటుంది. శారీరక వ్యాయామంతో కూడుకున్న ఈ పరీక్ష- గుండెలో అస్సలే పూడికలూ లేవని చెప్పలేకపోయినా.. దీని ఫలితాల ఆధారంగా చాలా వరకూ పెద్ద, ప్రమాదకరమైన పూడికలేమీ లేవని కచ్చితంగా నిర్ధారించుకోవచ్చు. బీపీ, కొలెస్ట్రాల్‌, హైబీపీ వంటి ముప్పులేవైనా ఉండి, 40 ఏళ్ల పైబడిన వాళ్లు ప్రతి రెండేళ్లకు ఒకసారి; 50 ఏళ్లు పైబడిన వాళ్లు ఏటా ఒకసారి- ట్రెడ్‌మిల్‌, ఎకో, ఈసీజీ పరీక్షలు మూడూ చేయించుకోవటం మంచిది.

1. ఈసీజీ
మనిషిని విశ్రాంతిగా పడుకోబెట్టి.. ఛాతీ మీద కొన్ని వైర్లను అతికించి చేసే తేలికపాటి పరీక్ష ఇది. ఛాతీలో నొప్పిగా ఉన్న సమయంలో ఈ పరీక్ష చేస్తే.. దానిలో పూడికలకు సంబంధించిన తేడాలేమీ లేకపోతే.. అప్పుడు పూడికలు లేవని భావించవచ్చు. అంతేగానీ నొప్పి లేకుండా విశ్రాంతి సమయంలో ఈ పరీక్ష చేసి..పూడికలేమీ లేవని కచ్చితంగా చెప్పటం కష్టం.

ముఖ్యమైన విషయమేమంటే చాలామంది ఛాతీలో నొప్పి వచ్చిందని ఆసుపత్రికి వెళ్లి ఈసీజీ చేయించుకుంటారు. దానిలో ఏమీ లేదనగానే ఇక సమస్యేమీ లేదని నమ్మటం మొదలుపెడతారు. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. ఎందుకంటే ఈసీజీ చేయించుకోవటానికి వెళ్లేసరికి నొప్పి తగ్గిపోయి ఉంటుంది. నొప్పి తగ్గిపోయిన తర్వాత తీసే ఈసీజీలోమార్పులేమీ కనబడకపోవచ్చు. అంతా నార్మల్‌గానే ఉండొచ్చు. కానీ అది మళ్లీ ఏ సమయంలోనైనా తిరిగి ఆరంభం కావచ్చు. కాబట్టి 'ఈసీజీ' నార్మల్‌గా ఉన్నంత మాత్రాన గుండె రక్తనాళాల్లో ఎటువంటి పూడికా లేదని, బ్లాకులేమీ లేవని నూరు శాతం భరోసా ఏమీ ఉండదు. నొప్పి ఉన్నప్పుడు తీస్తే కొంత వరకూ చెప్పచ్చు. అందుకే ఎవరైనా నొప్పితో వస్తే వైద్యులు ఆసుపత్రిలో ఓ రోజు ఉంచి కొన్ని కొన్ని గంటల వ్యవధిలో పలుమార్లు ఈసీజీలు తీసి చూసి, అప్పుడు నిర్ధారిస్తారు.

2. ఎకో కార్డియోగ్రామ్‌ (ఎకో)
ఛాతీ మీది నుంచి అల్ట్రాసౌండ్‌ తరంగాల సాయంతో గుండెను పరిశీలించే ఈ 'ఎకో' పరీక్షతో చాలావరకూ గుండె గదుల మధ్య ఉండే కవాటాలు, గుండె పంపింగ్‌ సామర్థ్యం, అందులో పీడనాల వంటివి తెలుస్తాయి గానీ రక్తనాళాల్లో పూడికలు ఉన్నాయా? లేదా? అన్నది దీనిలో స్పష్టంగా తెలియదు. పూడికలకు సంబంధించిన సమాచారం కోసం ఇతరత్రా పరీక్షల మీద ఆధారపడాల్సిందే.

3. ట్రెడ్‌ మిల్‌ టెస్ట్‌ (టీఎంటీ)
మనల్ని ట్రెడ్‌మిల్‌ మీద పరుగెత్తిస్తూ.. క్రమేపీ దాని వేగం పెంచుతూ.. వరసగా ఈసీజీలు తీస్తారు. శారీరక వ్యాయామం పెరుగుతున్న కొద్దీ గుండెలో వస్తున్న మార్పులను గుర్తించటం ఈ పరీక్ష లక్ష్యం. చాలాకాలంగా ఉన్న, గుండెలో పూడికలకు సంబంధించి విలువైన సమాచారాన్నిచ్చే మంచి పరీక్ష ఇది. వ్యాయామం చేస్తున్నప్పుడు మనందరికీ గుండె కొట్టుకునే వేగం, పంపింగ్‌, బీపీ వంటివి పెరుగుతాయి. ఈ సమయంలో గుండె ఎక్కువగా పని చెయ్యాల్సి వస్తుంది. దీంతో గుండెకు రక్తసరఫరా కూడా ఎక్కువగా అవసరమవుతుంది. గుండె మీద ఇంత ఒత్తిడి ఉన్నా సాధారణ ఆరోగ్యవంతులైతే 40-50 ఏళ్ల వయసులో కూడా కనీసం పది నిమిషాల పాటు వ్యాయామం చెయ్యగలుగుతారు. ఒకవేళ గుండెలోని రక్తనాళాల్లో ఎక్కడైనా పూడికలు వస్తే అక్కడ అవసరమైనంత స్థాయిలో రక్తసరఫరా జరగదు, అందుతున్న రక్తం సరిపోదు. దీంతో వాళ్లకు ఈసీజీలో తేడాలు కనబడతాయి. గుండెలో నొప్పి ఆరంభమవ్వచ్చు. కొన్నిసార్లు బీపీ తగ్గిపోతుండొచ్చు. ఈ లక్షణాలు మొదలైతే వెంటనే పరీక్ష ఆపేస్తారు. వీటన్నింటినీ బట్టి 'ట్రెడ్‌మిల్‌టెస్ట్‌ (టీఎంటీ) పాజిటివ్‌' అంటారు. ఇలా తేడా వస్తే గుండెలో పూడికలున్నట్టు బలంగా అనుమానించి.. రక్తనాళాల్లో పూడికలను కచ్చితంగా నిర్ధారించి చెప్పే 'యాంజియోగ్రామ్‌' పరీక్షకు పంపిస్తారు.

* మధుమేహం, హైబీపీ వంటి ఇతరత్రా ముప్పులుండి, ఎటువంటి గుండె నొప్పీ లేకపోతే.. అటువంటి వారిలో పూడికలేమైనా ఉన్నాయా? వస్తున్నాయా? అన్నది తెలుసుకునేందుకు ఈ టీఎంటీ బాగా ఉపయోగపడుతుంది.

* టీఎంటీలో ఎటువంటి తేడాలూ లేవని తేలినంత మాత్రాన.. గుండెల్లో ఎటువంటి పూడికలూ లేవని నూటికి నూరు శాతం చెప్పగలమా? అంటే లేదు. ఈ పరీక్షలో కూడా 60% వరకే ముప్పును చెప్పగలం. 40% కేసుల్లో పూడికలు ఉన్నా ఇది కచ్చితంగా పట్టుకోలేకపోవచ్చు. అలాగే ఒక రక్తనాళమే పూడుకున్నా కూడా అదీ పరీక్షలో బయటపడకపోవచ్చు. కనీసం 2 నాళాల్లో బ్లాకులు వస్తేనే దీనిలో 'పాజిటివ్‌' వస్తుంది. ఇటువంటి పరిమితులున్నాయి కాబట్టి... ఈ పరీక్షలో నార్మల్‌ వస్తే చాలావరకూ ఫర్వాలేదని చెప్పచ్చుగానీ నూరు శాతం పూడికలే లేవని చెప్పలేం.

* ట్రెడ్‌మిల్‌ పరీక్షతో మరికొన్ని ప్రయోజనాలూ ఉన్నాయి. వ్యాయామం చేస్తున్నప్పుడు బీపీ పెరుగుతోందంటే భవిష్యత్తులో బీపీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. దీన్నిబట్టి ముందే జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే వ్యాయామం ఎంత వరకూ చెయ్యచ్చన్నది కూడా ఇందులో తెలుస్తుంది. ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి 30 ఏళ్ల తర్వాత రెండేళ్లకోసారి అయినా ఈ పరీక్ష చేయించుకోవచ్చు.

* మొత్తానికి ఇప్పటి వరకూ గుండెపోటు లక్షణాలేవీ లేనివారికి.. పూడికలున్నాయేమో బలంగా అనుమానించటానికి ఉపయోగపడే పరీక్ష ఇది. ఇప్పటికే ఒకటి రెండు సార్లు గుండెలో నొప్పి వచ్చి ఉండి, అది చాలావరకూ గుండెపోటు నొప్పే అనిపిస్తున్న వాళ్లకు నేరుగా 'యాంజియోగ్రామ్‌' మేలు, టీఎంటీ అవసరం ఉండదు.

4. డొబిటమిన్‌ స్ట్రెస్‌ ఎకో
వ్యాయామాలు చెయ్యలేని వారికి చాలా ఉపయోగకరమైన పరీక్ష, కానీ దీని ప్రాధాన్యాన్ని చాలామంది గుర్తించటం లేదు. చాలామంది స్త్రీలు ట్రెడ్‌మిల్‌ మీద సరిగా నడవలేరు. వాళ్లకూ ఇది బాగా ఉపయోగపడుతుంది. మనిషిని పడుకోబెట్టి 'డొబిటమిన్‌' అనే మందు కొద్దికొద్దిగా ఇస్తూ.. మధ్యమధ్యలో 'ఈసీజీ', 'ఎకో' పరీక్షలు చేస్తుంటారు. ఈ మందు గుండె వేగాన్ని పెంచుతుంది. రక్తనాళాల్లో ఎక్కడైనా ఒక ప్రాంతంలో పూడిక వస్తే అక్కడ గుండె కొట్టుకోవటం తగ్గిపోతుంది. దీంతో ఆ ఒక్క ప్రాంతంలో తేడా స్పష్టంగా కనబడుతుంది. ఇది 15 నిమిషాల్లో పూర్తయిపోయే సున్నితమైన, కచ్చితమైన, సురక్షితమైన పరీక్ష. రక్తనాళాల్లో పూడికలు ఉంటే దీనిలో 85% వరకూ కచ్చితంగా పట్టుకోవచ్చు. ఈ పరీక్షలో నార్మల్‌ వస్తే తర్వాత 2-3 ఏళ్లలో గుండెపోటు వచ్చే రిస్కు చాలా తక్కువనే చెప్పచ్చు. ఇతరత్రా ఏవైనా ఆపరేషన్లకు వెళ్లే ముందు గుండెకు సంబంధించిన సమస్యలేమీ లేవని నిర్ధారించేందుకు కూడా ఈ పరీక్ష చేస్తుంటారు. దీనిలో నెగిటివ్‌ అని వస్తే ఆపరేషన్‌ సమయంలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఉండవనే చెప్పచ్చు. ఇది సురక్షితమైన పరీక్ష.

5. స్ట్రెస్‌ థాలియం
అమెరికా వంటి దేశాల్లో ట్రెడ్‌మిల్‌కు ప్రత్యామ్నాయంగా చాలా విరివిగా వాడేస్తున్న పరీక్ష ఇది. ఈ పరీక్ష 2 నిమిషాల్లో పూర్తయిపోతుంది. పూడికలుంటే 80% వరకూ కచ్చితత్వంతో చెబుతుంది. ట్రెడ్‌మిల్‌ మీద నడిపిస్తూ గుండె కట్టుకునే రేటు ఒక స్థాయికి చేరుకోగానే- 'థాలియం' అనే 'రేడియో ఐసోటోపు' పదార్థాన్ని ఇంజక్షన్‌ ఇచ్చి, అప్పుడు స్కానింగ్‌ చేస్తారు. బ్లాకులు లేకుండా రక్తప్రసారం బాగున్న ప్రాంతమంతటికీ థాలియం బాగా చేరిపోతుంది. బ్లాకులుండి, రక్తసరఫరా లేని చోటికి థాలియం చేరదు కాబట్టి స్కానింగ్‌లో ఆ ప్రాంతాలన్నీ మచ్చల్లా (కోల్డ్‌ స్పాట్స్‌) కనబడతాయి. గుండెలో ఎంత ప్రాంతానికి రక్తసరఫరా అందుతోందన్నది దీనిలో స్పష్టంగా తెలుస్తుంది. మిగతా పరీక్షల్లో రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నాయా? లేవా? ఉంటే ఎంత శాతం ఉన్నాయన్నది తెలిస్తే దీనిలో
గుండెలో ఎంత ప్రాంతానికి రక్తప్రసారం తగ్గుతోందన్నది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇది చాలా   కచ్చితమైన పరీక్ష. కాకపోతే దీనిలో 'రేడియేషన్‌' ప్రభావం ఉంటుంది కాబట్టి మన దేశంలో అంత విరివిగా వాడటం లేదు.

6. సీటీ యాంజియోగ్రామ్‌
ఇది అత్యాధునికమైన పరీక్ష. అయోడిన్‌ రంగు పదార్థాన్ని ఇంజక్షన్‌ చేసి.. కొద్ది నిమిషాల తర్వాత గుండెకు 'సీటీ స్కాన్‌' చేస్తారు. పరీక్ష 2 నిమిషాల్లో పూర్తయిపోతుంది. ఆసుపత్రిలో చేరటం వంటి బాదరబందీలేమీ ఉండవు. చివరికి ఫలితం దాదాపు 'యాంజియోగ్రామ్‌' అంత స్పష్టంగా, అంత కచ్చితత్వంతో ఉంటుంది. పైగా యాంజియోగ్రామ్‌ కంటే ఖరీదు తక్కువ. ఇప్పుడిప్పుడే   ఏర్పడుతున్న పూడికలను కూడా ఇది కచ్చితంగా పట్టుకోగలుగుతుంది. రేడియేషన్‌ ప్రభావం మరీ ఎక్కువేమీ ఉండదు. కొత్తతరం యంత్రాలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఈ రేడియేషన్‌ ప్రభావం మరింత తగ్గుతోంది కూడా. మొత్తానికి రేడియేషన్‌ ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని 35 ఏళ్ల లోపు వారికి దీన్ని చెయ్యరు. అలాగే 65-70 ఏళ్ల వారికి చేస్తే క్యాల్షియం పేరుకుపోయి రక్తనాళాలు గట్టిపడి ఉంటాయి కాబట్టి ఫలితాలు అంత స్పష్టంగా ఉండవు. కాబట్టి- గుండెలో రక్తనాళాలు   మూసుకుపోయే రిస్కు ఎక్కువగా ఉన్నవారికి, కుటుంబ చరిత్ర ఉన్న వారికి, తరచుగా ఛాతీలో నొప్పి వస్తున్న వారికి, గుండెపోటు భయం పీడిస్తున్న వారికి.. దీనితో చాలా ప్రయోజనం ఉంటుంది.

* ఈ 'సీటీ యాంజియో'లో చాలా ముందు దశలోనే పూడికలను గుర్తించొచ్చు. సాధారణ యాంజియోగ్రామ్‌లో రక్తనాళం లోపల ఎలా ఉందన్నదే తెలుస్తుందిగానీ.. సీటీ యాంజియోలో అయితే ఆ రక్తనాళం గోడలు, వాటిలో క్యాల్షియం పేరుకుందా? వంటి సమాచారం కూడా చాలావరకు తెలుస్తుంది.

* కొన్నిసార్లు రోగులెవరైనా తీవ్రమైన గుండె నొప్పితో ఆసుపత్రికి వచ్చినప్పుడు- అనుమానం బలంగా ఉంటే నేరుగా 'సీటీ యాంజియో' పరీక్ష చేసి... బ్లాకులు ఉన్నట్టు గుర్తిస్తే అప్పటికప్పుడే క్యాథ్‌ల్యాబ్‌కు తరలించి 'స్టెంట్‌' పెట్టిస్తారు. ఇప్పుడీ విధానం విస్తృతంగా వాడకంలోకి వస్తోంది.

7. యాంజియోగ్రామ్‌
గుండె రక్తనాళాల్లో పూడికలున్నాయా? లేదా? ఉంటే మూడు రక్తనాళాల్లో ఎన్నింటిలో పూడికలు వచ్చాయి? ఎన్ని చోట్ల పూడుకున్నాయి? ఎంత శాతం పూడుకున్నాయి? వాటితో ఇబ్బంది ఎంత ఉంటుంది? వంటి సమాచారాన్నంతా కచ్చితంగా చెప్పే అత్యంత ప్రామాణికమైన పరీక్ష ఇది. నేడు అందుబాటులో ఉన్న పరీక్షలన్నింటిలో కచ్చితత్వం దీనికే ఎక్కువ. కాకపోతే కాస్త ఖరీదైన పరీక్ష ఇది. 10-15 నిమిషాల సమయం పడుతుంది. గుండెలోకి గొట్టాలు  ప్రవేశపెట్టటం వంటివి అవసరమైన పరీక్ష కాబట్టి పరీక్ష పూర్తయిన తర్వాత కూడా కొన్ని గంటల పాటు ఆసుపత్రిలోనే పరిశీలనలో ఉంచి, తర్వాత ఇంటికి పంపించేస్తారు.

* దీనిలో రోగిని 'క్యాథ్‌ల్యాబ్‌'కు తీసుకువెళ్లి.. కాలి దగ్గర లేదా మణికట్టు దగ్గర ఉండే రక్తనాళం ద్వారా గుండెలోని కరోనరీ ధమనుల్లోకి సన్నటి గొట్టం పంపి.. దాని ద్వారా అయోడిన్‌ రంగు ద్రవం విడుదల చేస్తూ.. అదే సమయంలో వరసగా ఎక్స్‌-రేలు తీస్తూ రక్తనాళం లోపల ప్రవాహం ఎలా ఉంది? అవరోధాలు, పూడికలున్నాయా? అన్నది గుర్తిస్తారు.

* సాధారణంగా ఇతరత్రా సాధారణ పరీక్షల్లో పూడికలున్నాయని బలమైన అనుమానం వ్యక్తమైనప్పుడు- కచ్చితత్వంతో గుర్తించి నిర్ధారించుకునేందుకు ఈ యాంజియోగ్రామ్‌ పరీక్ష చేస్తారు. దీని ఫలితాల ఆధారంగా రోగికి స్టెంట్‌ అమర్చాలా? ఆపరేషన్‌ అవసరమా? చేస్తే ఎలాంటి చికిత్సలు చెయ్యాలన్నది కచ్చితంగా నిర్ధారించటం వీలవుతుంది. పూడికలు ఉన్నట్టు గుర్తిస్తే ఈ పరీక్షా సమయంలోనే 'స్టెంట్‌'లను కూడా అమర్చే వీలుంటుంది, దానికి అదనంగా మరో 30-40 నిమిషాలు పడుతుంది.

అత్యాధునికం
గుండెలోని రక్తనాళంలో పూడిక ఏర్పడితే- చికిత్స అందించటానికి ఆ పూడిక స్వభావం ఏమిటన్నది తెలుసుకోవటం అవసరం. ఇందుకు యాంజియోగ్రామ్‌ చెయ్యటానికి గుండెలోకి పంపించే గొట్టం చివర్లోనే చిన్న కెమేరా ఉండే 'కరోనరీ యాంజియోస్కోపీ', పూడికలో కొవ్వు ఎక్కువగా ఉందా.. దాని స్వభావమేంటో చెప్పే 'ఆప్టికల్‌ కొహెరెన్స్‌ టోమోగ్రఫీ', పూడికకు ముందు, ఆ తర్వాత రక్త ప్రవాహ పీడనంలో తేడా ఎంత ఉంది? దానికి స్టెంట్‌ అవసరమా? అన్నది తేల్చి చెప్పే 'డాప్లర్‌ ఫ్లో వైర్‌', రక్తనాళం లోపలే అల్ట్రాసౌండ్‌ తరంగాలు పంపించటం ద్వారా పూడిక ఎంత మేర ఉంది, దాని స్వభావం ఏమిటన్నది చెప్పే 'ఇంట్రా వ్యాస్క్యులర్‌ అల్ట్రాసౌండ్‌' వంటివి లోతైన సమాచారాన్ని ఇవ్వగలుగుతున్నాయి.

చికిత్స
పూడికలుంటే యాంజియోగ్రామ్‌ పరీక్ష తర్వాత వాటిని ఓ మోస్తరు (50% కంటే తక్కువ), మధ్యస్తం (50-70%), తీవ్రం (70% కంటే ఎక్కువ) అని వర్గీకరిస్తారు. అలాగే పూడికలు ఒక రక్తనాళంలో ఉన్నాయా? రెంటిలో ఉన్నాయా? మూడింటిలోనూ ఉన్నాయా? అన్నది చూసి, వీటన్నింటి ఆధారంగా ఏ రకం చికిత్స చెయ్యాలన్నది నిర్ధారిస్తారు. సాధారణంగా 40-60 మధ్య వయసు వారిలో ఒకటి గానీ, రెండు గానీ పూడికలు ఉంటే 'స్టెంట్‌'లు అమర్చి రక్తప్రసారాన్ని చక్కదిద్దచ్చు. 60 ఏళ్లు పైబడిన వారిలో మూడు నాళాల్లోనూ పూడికలుంటే 'బైపాస్‌' ఆపరేషన్‌ ఉత్తమం. 75 ఏళ్లు పైబడిన వారిలో పూడికలుంటే వాళ్లు పెద్దగా శారీరక శ్రమ చెయ్యరు కాబట్టి చాలా వరకూ మందులతో చికిత్స చేస్తారు.

* స్టెంట్‌, బైపాస్‌ రెండూ కుదరనప్పుడు 'కరోనరీ కౌంటర్‌ పల్సేషన్‌' చికిత్సతో ప్రయోజనం ఉంటుంది. ఇది శాస్త్రీయమైన చికిత్సే. మిగతా మార్గాలేవీ లేవనుకున్నప్పుడు, రోజూ నొప్పి వస్తున్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. శరీరంలోని రక్తనాళాలను గుండె కొట్టుకునే వేగానికి అభిముఖంగా ఆడిస్తూ వాటిలో ఒత్తిడి పెంచటం దీని ప్రత్యేకత. ఇది పూడికలను తొలగించలేదుగానీ దీనివల్ల పక్కనుండే చిన్న రక్తనాళాల్లోకి ప్రవాహం పెరిగి.. నొప్పి బాగా తగ్గుతుంది.

అపోహలు
* ఈసీజీగానీ, ఎకో పరీక్ష గానీ 'నార్మల్‌' అయితే గుండెలో పూడికలు లేవనేం కాదు. ట్రెడ్‌మిల్‌ పరీక్షలో నెగిటివ్‌ వస్తే గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువనేగానీ అస్సలుండవని కాదు.

* ఒకసారి స్టెంట్‌ పెట్టిన తర్వాత, లేదా బైపాస్‌ ఆపరేషన్‌ తర్వాత జబ్బు పూర్తిగా నయమైపోయిందని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు. స్టెంట్‌ సాయంతో, లేదా బైపాస్‌ ఆపరేషన్‌ సాయంతో మనం... రక్తనాళంలో ఇప్పటికే ఉన్న అవరోధాన్ని తొలగించామేగానీ మళ్లీ కొత్తగా పూడికలు రాకుండా అదేమీ అడ్డుకోదు. పూడికలు రావటమన్నది ఒక్కసారితో నయం చేసేయటానికి వీలైన సమస్య కాదు. కాబట్టి స్టెంట్‌ పెట్టిన తర్వాత, లేదా బైపాస్‌ తర్వాత కూడా మళ్లీ పూడికలు రాకుండా పూర్తిస్థాయి జాగ్రత్తలు, చికిత్సలు తీసుకుంటూనే ఉండాలి.

జాగ్రత్తలు
1. నిత్యం పీచు ఎక్కువగా ఉండే శాకాహారం ఎక్కువగా తీసుకోవటం.
2. యోగా, ధ్యానం చెయ్యటం.
3. నిత్యం వ్యాయామం చెయ్యటం.
4. మధుమేహం, హైబీపీ, కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్ల వంటివాటిని కచ్చితగా అదుపులో ఉంచుకోవటం.. ఇవి చాలాచాలా ముఖ్యం. స్టెంట్‌, బైపాస్‌ సర్జరీల వంటివి సాధ్యం కాకపోయినా... ఈ నాలుగు జాగ్రత్తలతో పూడికలు బాగా తగ్గుతున్నాయని మౌంట్‌అబూ, ఎయిమ్స్‌ అధ్యయనాల్లో నిర్ధారించారు కూడా. కాబట్టి వీటిని తక్కువగా అంచనా వెయ్యటానికి లేదు.

--Courtesy with Dr.A.V.Anjaneyulu -senior cardiologist ,Hyd.@eenadu sukhibhava
  • ==================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, June 2, 2013

What is AYUSH system of Medicine?,ఆయుష్ వైద్యవిధానము అంటే ఏమిటి ?

  •  
 image :courtesy with Intag(Indian development gateway)
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -What is AYUSH system of Medicine?,ఆయుష్ వైద్యవిధానము అంటే ఏమిటి ? - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

 ఆయుష్ వైద్యవిధానము :

ఇండియాలో భారతీయ వైద్యవిధానము  మరియు హోమియోపతి (ISM&H) అనే ఒక ప్రభుత్వ శాఖ 1995 , మార్చి లో ప్రారంభంచబడినది. భారతదేశము లో ఆయుర్వేదము , యోగా & ప్రకృతివైద్యము , యునాని , సిద్ధ , హోమియోపతి (Ayurveda, Yoga & Naturopathy, Unani, Siddha and Homoeopathy (AYUSH) వైద్యవిధానాలపై శ్రద్ధ తీసుకునేందికు తగిన చర్యలు , ప్రణాళికలు , విధి విధానాలు అవలుచేయడము దీని ముఖ్య ఉద్దేశము . ఈ (ISM&H) ని (AYUSH) గా నవంబర్ 2003 లో పేరు మార్చారు.

విధులు : ఈ క్రింది వాటి అభివృద్ధిలో శ్రద్ధ చూపబడును ->
  • విధ్య మరియు పరిశోధన ,
  • విద్యా ప్రమాణాలు పరిరక్షణ,
  • మందుల నాణ్యత , ప్రమాణీకరణము ,
  • మెడిషనల్ మొక్కల , మూల పదార్ధాలు అందుబాటులో ఉంచడము ,
  • ఆయుష్ వైద్యం పై దేశ విదేశాలలో జ్ఞానము (awareness) కలుగజేయడములో చర్యలు చేపట్టడము

ఇందులో విధానాలు            
  •     ఆయుర్వేధ -Ayurveda  
  •     యోగా - Yoga
  •     ప్రకృతివైద్యము - Naturopathy
  •     యునాని - Unani
  •     సిద్ధ - Siddha
  •     హోమియోపతి - Homoeopathy
  •     సోవా.రిగ్పా - SOWA - RIGPA (ఇది ఆయుర్వేదము నకు సమానము గా ఉండును)

  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, May 30, 2013

Hypothyroidism - హైపోథైరాయిడిజం

  •  


  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Hypothyroidism - హైపోథైరాయిడిజం:- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


థైరాయిడ్‌ గ్రంధి మామూలుకన్నా తక్కువగా థైరా యిడ్‌ హార్మోన్స్‌ ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఈ పరిస్థితి వస్తుంది.

లక్షణాలు:

1. అలసట, నీరసం. 2. నిద్రమత్తు. 3. ఏకాగ్రత కోల్పోవడం. 4. పెళుసైన పొడిజుట్టు, గోళ్ళు. 5. దురద పుట్టించే పొడి చర్మం. 6. ఉబ్బిన ముఖం. 7 మలబద్దకం. 8. శరీరం

బరువెక్కడం. 9. తక్కువైన రుతుశ్రావం. 10. రక్తహీనత.

హైపోథైరాయిడిజంని నిర్ధారణ చేయడం ఎలా

డాక్టర్‌గారు గుర్తించగల ప్రత్యేక లక్షణాలు మరియు శారీరక చిహ్నాలు. థైరాయిడ్‌ వచ్చినపðడు నిపుణులతో స్వరపేటిక పరీక్ష చేయించుకోవలెను. ఎందుకంటే ఒకొక్కసారి థైరాయిడ్‌ వ్యాధి ముదిరి లోపల స్వరపేటికకు ప్రాకి బొంగురు సంభవించవచ్చును. టి.ఎన్‌.హెచ్‌. ( థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌/థైరో (టోపిన్‌) పరీక్ష. ఎక్కువగా ఉండును .
రక్తంలో పెరిగిన టి.ఎస్‌.హెచ్‌. స్థాయి. హైపో థైరాయిడ్‌జమ్‌ యొక్క ఖచ్చితమైన సూచిక.
థైరాయిడ్‌ హార్మోన్‌ ఉత్పత్తి చేయడం కొద్దిగా తగ్గగానే ఈ పిట్యూటరీ హార్మోన్‌ ఉత్పత్తి ఎక్కువవుతుంది.

చికిత్స : ఈ సమస్య మందుల ద్వారానే నయమవుతుంది. క్రమం తప్పకుండా రోజూ మందులు తీసుకోవాల్సి ఉం టుంది. ఇది కొద్దిగా ఉన్నప్పుడే డాక్టర్‌ని సంప్రదించి సరైన వైద్యం తీసుకుంటే పూర్తి ఉపశమనాన్ని పొందవచ్చు. పిల్ల ల్లో శారీరకంగా, మానసిక ఎదుగుదల తక్కువగా ఉన్నవా రిలో వైద్యం వల్ల పూర్తిగా నయం కాకపోవచ్చు. పెద్ద వారిలో పూర్తిగా నయమవుతుంది. దీనికి థైరాక్షిన్‌ రిప్లేస్మెంట్ ట్రీట్మింట్ తీసుకోవాలి . లీవో థైరాక్షిన్‌ తగిన మోతాదులొ వాడాలి. డోసు ఎంత తీసుకోవాలో డాక్టర్ని సంప్రదించి వాడాలి .

  • Tab . Thyroxin (Elroxin, Thyrobest, Thyronil) 25 mcg to 100 mcg daily .
  •  
  • రేడియం ఎబెలేషన్‌ సాదారణ ట్రీట్మెంట్ లో భాగమయిపోంది .
  • సర్జరీ కూడా కొన్ని చోట్ల చేస్తారు .

Diet treatment for Hypothyroidism, హైపోథైరాయిడిజం కు ఆహార చికిత్స

ఆహార మార్పులు చేయడం హైపో థైరాయిడిజం చికిత్సలో మొదటి భాగం. చక్కెర మరియు కెఫిన్ వంటి  పోషక రకాలను తీసుకోవటం వలన చాలా మంది హైపో థైరాయిడిజం ఫలితాలు, అలసట మరియు బ్రెయిన్ ఫాగ్ వంటి వాటితో బాధపడుతున్నారు.

 మీ శరీరంలో చక్కర శాతం పెంచే పిండి వంటి కార్బోహైడ్రేట్లు, కెఫిన్ మరియు చక్కెరలను పూర్తిగా తగ్గించాలి. మీ దృష్టి ధాన్యం ఆధారిత కార్బోహైడ్రేట్లను తక్కువ తీసుకోవటం, స్టార్చ్ లేని కూరగాయలను తినడం వంటి వాటి మీద నిలపండి.

ప్రోటీన్ ఎక్కువగా తీసుకోండి. ప్రోటీన్ అన్ని కణజాలాలకు థైరాయిడ్ హార్మోన్ రవాణా చేయటానికి మరియు థైరాయిడ్ పనితీరును సాధారణీకరణ చేయటంలో సహాయపడుతుంది.

ప్రోటీన్లు, గింజలు మరియు నట్ బట్టర్స్, హార్మోన్ మరియు యాంటీబయాటిక్ లేని జంతు ఉత్పత్తులు (సేంద్రీయ, గడ్డి ఆధారిత మాంసాలు, గుడ్లు, మరియు సాగు చేప); మరియు
చిక్కుళ్ళు వంటి వాటిలో ఉన్నాయి.

కొవ్వు మీ స్నేహితుడు మరియు కొలెస్ట్రాల్, శాఖాహార కొవ్వులు  మీరు చాలినంత  కలిగి ఉండనట్లయితే, మీకు థైరాయిడ్ హార్మోన్లు కలిగి ఉన్న హార్మోన్ల అసమతుల్యత  పెరగవొచ్చు.
నెయ్యి , అవకాడొలు; అవిసె గింజలు, నట్ బట్టర్స్; హార్మోన్ మరియు యాంటీబయాటిక్-లేని పూర్తి కొవ్వు జున్ను, పెరుగు, కాటేజ్ చీజ్ మరియు కొబ్బరి పాల ఉత్పత్తులు, ఫ్లాక్స్ గింజలు వంటి వాటిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది.

పోషకాలను ఎక్కువ తీసుకోండి. విటమిన్ D, ఇనుము, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, సెలీనియం, జింక్, రాగి, విటమిన్ A, B విటమిన్లు, మరియు అయోడిన్: పోషక లోపాలు,
తగినంతగా లేని సూక్ష్మపోషకాలు మరియు ఖనిజాలు 'థైరాయిడ్' కు కారణం కాకపోవచ్చు  కాని ఈ లక్షణాలను ఎక్కువ చేస్తాయి.

సాధారణంగా తగినంత అయోడిన్ లేని కారణంగా హైపో థైరాయిడిజం వొస్తుందని నమ్మకం. అయోడిన్ ముఖ్యంగా సముద్ర కూరగాయలు మరియు సీఫుడ్ లో ఉంటుంది. గుడ్లు, ఆకుకూర, తోటకూర, లిమా బీన్స్, పుట్టగొడుగులు, బచ్చలికూర, నువ్వు గింజలు, మరియు వెల్లుల్లి వంటి వాటిలో సాధారణంగా ఉంటుంది.

చేపలు, గ్రాస్సఫేడ్(grass feed) జంతువుల ఉత్పత్తులు, ఫ్లాక్స్ సీడ్స్ మరియు అక్రోట్లు వంటి వాటిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి , ఇది రోగనిరోధక చర్యను పెంచే హార్మోన్ల బ్లాక్స్ ను మరియు కణ పెరుగుదల నియంత్రించడానికి, థైరాయిడ్ పనితీరును మరియు థైరాయిడ్ హార్మోన్లు ప్రతిస్పందనకు సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి ఉపయోగపడుతుంది.

100% బంక లేని వాటిని తీసుకోండి. థైరాయిడ్ కణజాలం పరమాణు కూర్పు, గ్లూటెన్ దాదాపు సమానంగా ఉంటుంది. గ్లూటెన్ ఆహారాన్ని తీసుకోవటం వలన మీ థైరాయిడ్ మీద
ఆటోఇమ్యూన్ దాడి పెరుగుతుంది.

థైరాయిడ్ పనితీరును జోక్యం చేసుకునే ఆహారాలు, గోయిట్రోజెన్స్ పట్ల జాగ్రత్త వహించండి.  బ్రస్సెల్స్ మొలకలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, కాలే, కోహ్ల్రబి, రుటబగా, టర్నిప్లు, జొన్న, స్ట్రాబెర్రీ,
, వేరుశెనగ, రాడిషేస్, మరియు సోయాబీన్స్. వంటి వాటిలో గోయిట్రోజెన్స్ ఉన్నాయి.

 గ్లూటాతియోన్ కోసం వెళ్ళండి. గ్లూటాతియోన్ రోగనిరోధక వ్యవస్థ బలపరి్చే ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది ఆటో ఇమ్యూన్ మంటను తగ్గించడానికి దోహదపడుతుంది మరియు థైరాయిడ్ కణజాల రక్షణ మరియు తగ్గుదల మరియు రోగనిరోధక వ్యవస్థను నియంత్రిస్తూ మీ శరీరం యొక్క సామర్ధ్యాన్ని పెంచడానికి దోహదపడుతుంది. కొన్ని ఆహారాలు గ్లూటాతియోన్ కలిగి ఉండగా, ఆకుకూర, తోటకూర, బ్రోకలీ, పీచెస్, అవెకాడో పండు, బచ్చలికూర, వెల్లుల్లి, స్క్వాష్, ద్రాక్షపండు, మరియు ముడి గుడ్లు వంటి ఆహారాలు మీ శరీరం గ్లూటాతియోన్ పొందటానికి సహాయం చేస్తాయి.

కేవలం Hashimoto's thyroiditis ఉనికితో మీ యొక్క శరీరం థైరాయిడ్ మీద దాడి చేసినప్పుడు, మీ శరీరం తాపజనక ఆహారాల కొరకు చూస్తుంది మరియు స్వయం  ప్రతిరక్షక ప్రతిస్పందన ఎక్కువవుతుంది.

ఒక జీర్ణాశయ పరిశీలన చేయండి. థైరాయిడ్ పనితీరుకు 20 శాతం ఆరోగ్యకరమైన జీర్ణాశయ బ్యాక్టీరియా సరఫరా మీద ఆధారపడి ఉంటుంది, కాబట్టి ప్రోబయోటిక్స్ (స్నేహపూర్వక ప్రేగు బాక్టీరియా) అదనంగా తీసుకోవటం ఉత్తమం.

మీ ఒత్తిళ్లు మరియు ఆచరణలో ఉపశమనం కోసం చూడండి. థైరాయిడ్ చాలా సున్నితమైన గ్రంథి మరియు ఒత్తిడికి అనూహ్యంగా ప్రతిస్పందిస్తుంది.


  • =================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, May 28, 2013

worms in the Stomach and intestine, కడుపు-పేగుల లో పురుగులు,చిన్న పిల్లలకి కడుపులో పురుగులు

  •  



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - worms in the Stomach and intestine, కడుపు-పేగుల లో పురుగులు,చిన్న పిల్లలకి కడుపులో పురుగులు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



కడుపులోకి పురుగులు ఎలా చేరతాయి...
పురుగులు వ్యాప్తి చెందడానికి ముఖ్య కారణం అపరిశుభ్రమైన నీరు, ఆహారం. సరిగ్గా ఉడికించని మాంసం తినడం, ఆకుకూరలు, కూరగాయలు,పండ్లు  సరిగ్గా శుభ్రపరచకుండా తీసుకోవడం వల్ల చాలా సూక్ష్మక్రిములు కడుపులోకి చేరతాయి. కాళ్ళకు ఎటువంటి రక్షణ లేకుండా మట్టిలో అపరిశుభ్రమైన పరిసరాలలో తిరగడం వల్ల హుక్ వార్మ్‌వంటి పురుగులు వ్యాప్తి చెందుతాయి . కడుపులో పురుగులున్నాయంటే అవి ప్రోటోజోవా, హెల్మింథస్‌ (ప్లాట్‌, నిమటోడ్‌) వర్గానికి చెందిన పరాన్న జీవులు అయ్యి ఉంటాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి... ఆస్కారిస్‌ వార్మ్స్‌, పిన్‌ వార్మ్స్‌, హుక్‌ వార్మ్స్‌, ఫ్లాట్‌ వార్మ్స్‌ (నులి పురుగులు, నట్టలు, నులిపాములు, ఏలిక పాములు) లాంటివి. పురుగులు వ్యాప్తి చెందడానికి ముఖ్య కారణములు. చిన్న పిల్లలు మర్మాంగాల వద్ద, పృష్ట భాగంలో గోక్కుని వేళ్లను నోట్లో పెట్టుకోవడం వల్ల వారి నుంచి వారికే పురుగులు వ్యాపిస్తాయి.

వివరణ-- కడుపులో చేరే అనేక క్రిముల వల్ల నీళ్ల విరేచనాలు, డయేరియా వంటి సమస్యలు కనిపిస్తాయి.సాధారణంగా కడుపులో, పేగుల్లోకి చేరడానికి అవకాశం ఉన్న సూక్ష్మజీవులివి.

 బద్దెపురుగులు :

 ఇవి సరిగా ఉడికించని పోర్క్ వంటి ఆహారం వల్ల కడుపులో చేరే పరాన్న జీవులు. ఈ తరహా జీవులు ప్రధానంగా ఫ్లాటీహెల్మింథిస్, నిమాటీ హెల్మింథిస్ జాతికి చెందినవై ఉంటాయి. ఇందులో నులి పురుగు లేదా ఆస్కారిస్ వార్మ్స్ ఉంటాయి. అవి ప్రధానంగా చిన్న పేగుల్లో ఉంటాయి. అపరిశుభ్రమైన ఆహారం, నీరు, సరిగా వండని ఆహారంతో ఈ క్రిములు వాపిస్తాయి.బద్దె పురుగులు-వీటిలో చాలా విభజనలు ఉంటాయి. ఇవి ముఖ్యంగా జీర్ణ వ్వవస్ధలో చొచ్చుకుని పోతాయి. అక్కడ నుండి ఇవి ఆతిధేయులు (HOST) నుంచి ఆహారాన్ని గ్రహిస్తాయి(పీల్చుకుంటాయి).

పిన్ వార్మ్ లేదా త్రెడ్ వార్మ్ లేదా సీట్ వార్మ్:

ఇవి నిమటొడా వర్గానికి చెందిన జీవులు. మలద్వారం దగ్గరలో ఉండి దురదను పుట్టిస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు మట్టిలో తమ మర్మావయవాల వద్ద గోకి మళ్లీ వేళ్లు నోట్లో పెట్టుకోవడం వల్ల ఇవి వ్యాపిస్తాయి.

హుక్ వార్మ్ (ఎన్‌కైలోస్టోమా):

ఇవి కూడా నిమటోడా వర్గానికి చెందినవే. ఇది చర్మం ద్వారా శరీరంలోకి పొడుచుకుని వెళ్ళి, రక్తనాళాల ద్వారా కాలేయం, మూత్రాశయం వంటి భాగాలలో వృద్ధి చెందుతాయి. ఇవి 1 మి.మీ కంటే తక్కువ పరిమాణంలో ఉండటం వల్ల కంటికి కనిపించవు. అపరిశుభ్రమైన పరిసరాల వల్ల ఇది ఒకరి నుంచి మరొకరి వ్యాపిస్తుంది.

ఎంటమీబా ,జియార్డియా :
 ఇది ఏకకణ సూక్ష్మజీవి. ఇది అపరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల వ్యాపిస్తుంది. దీని వల్ల అమీబియాసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. జియార్డియా వంటి ఏకకణ జీవులు పొట్టలోకి, రక్తప్రవాహంలోకి వెళ్లి శరీరమంతటా దురదలు పుట్టిస్తాయి.

వుకరేరియా బ్రాంకప్టై :
 ఫైలేరియాసిస్ (బోదకాలు) చాలా రకాల పరాన్న జీవుల చర్మాన్ని లిఫ్ గ్రంధులో చొచ్చు కొని పోయి ఆయా భాగాల్లో వాపును కలిగిస్తాయి.


    పరాన్నజీవులు ఆతిధేయులు ( Host ) శరీరంలో లోపల లేక వెలుపల కణాలలో కానీ శరీర భాగాలలో గానీ చొచ్చుకొని పోయి వాటి నుంచి ఆహార పదార్థాలను పీల్చుకుంటాయి. కొన్ని పరాన్నజీవులు ముఖ్యంగా ఏలిక పాముల వ్యాధి గ్రస్థులను చేసేస్తాయి. ఏలిక పాములు సన్నగా, పొడవుగా, ఎముకలు గానీ, ఏవిధమైన చర్మం గానీ లేకుండా పిల్లలను గుడ్ల నుంచి లార్వాల వరకు పొదిగి, పెరిగిన పాములు చర్మం, కండరాలు, ఊపిరితిత్తులు మరియు పేగులో స్థిరపడేటట్లు వదులుతూ వుంటాయి.

లక్షణాలు

    ఏ లక్షణాలు వుండవు, బహు కొద్ది లక్షణాలు వుండవచ్చును.
    కొన్నిమార్లు లక్షణాలు వెంటనే కలుగుతాయి. కొన్నిమార్లు 20 సం,, వరకు పడుతాయి.
    కొన్నిసార్లు ఈ పరాన్న జీవులు మొత్తంగా లేదా కొన్ని కొన్ని భాగాలుగా మల విసర్జన నుంచి బయట పడతాయి.
    అన్నవాహిక, జీర్ణ వ్యవస్థ, (అన్నాశయము, పేగులు, కాలేయము, పెద్దపేగు, గుదము).పై బాగాలలో వున్న ఏలిక పాములు కడుపులో నొప్పి కలిగిస్తాయి.
    బలహినత, విరేచనాలు, ఆకలి లేక పోవడం బరువు తగ్గిపోవడం, వాంతులు, రక్తహీనత, పౌష్ఠికాహార లోపం, విటమిన్లు, ధాతువులలోపం, కొవ్వు పదార్ధాల, ప్రోటీన్ల లోపం వంట లక్షణాలు కలుగ చేస్తాయి.
గుద ద్వారము వద్ద దురద, మానము  వద్ద దురద, నిద్రలేమి, ప్రక్కలో మూత్రం పోయడం,కడుపులో నొప్పి వంటి లక్షణాలు నులి పురుగులు వల్ల కలిగే ఇన్ ఫెక్షన్లు కనబడుతాయి.
    చర్మం – వాపులు, నోటితో లేదా ద్రవంతో కూడిన తిత్తులు, బొబ్బలు, మొఖం వాపు, ముఖ్యంగా కండ్ల చుట్టూ కనబడుతుంది.
    అలర్జీ లక్షణాలు – చర్మం మీద దద్దుర్లు, చర్మంలో దురద, గుదద్వారం చుట్టూ దురద,
    అవర ప్లూక్సీ – కాలేయం వాపు, పెద్దగా పెరగడం,జ్వరం,కడుపు నొప్పి, విరేచనాలు, చర్మం పసుపు రంగులో మారడం.
    లింఫ్ గ్రంధులు ఏనుగు కాళ్ళు, (శోషరసనాళ గ్రంధులు) పురుష బీజాశయాలలో వాపు,
 ఇంకా->
నీళ్ళ విరేచనాలు, కడుపులో నొప్పి, వాంతులు, కడుపు ఉబ్బరంగా అనిపించడం, ఆహారం తీసుకుంటున్నా బరువు తగ్గిపోతూ ఉండటం, విరేచనాలలో రక్తం, పురుగులు కనిపించడం, మర్మావయవాల వద్ద దురద, శ్వాసలో దుర్గంధం, కళ్ళ చుట్టూ నల్లటి చారలు, చిన్న పిల్లల్లో ముఖంపై తెల్ల మచ్చలు రావడం అప్పుడప్పుడు ఆకస్మికంగా జ్వరం రావడం, దగ్గు, కాలేయానికి సంబంధించిన వ్యాధులు, మూత్రంలో రక్తం పోవడం,  అనీమియాకు గురికావడం, నిద్రలో ఉన్నప్పుడు పళ్ళు కొరకడం. కొన్ని సందర్భాలలో పురుగులకు సంబంధించిన లార్వాలు మెదడులోకి వెళ్ళడం వల్ల మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

కారణాలు

    కణజాలాల్లో ఉండే ఏలిక పాములు మరియు బద్దె పురుగులు.    ప్రేగులలో ఉండే        ఏలిక పాములు – మలవిసర్జనం లో  ఏలిక పాములు గుడ్లు వుంటాయి. వీటితో  కలుషితం అయిన ఆహారం కానీ,నీరు కానీ యాధృచ్చికంగా మనుషులు తీసుకొనడం సంభవింవచ్చు.అప్పుడు అవి వారి శరీరంలోని ప్రేగులలో పెరిగి, రక్త ప్రసరణ ద్వారా శరీరం లోని ఇతర భాగాలకు ముఖ్యంగా ఊపిరితిత్తులకు చేరుతాయి. ఇవి 40cm వరకూ పెరుగుతాయి.

హాని కలిగించే కారణాలు

    మల విసర్జనలో కలుషితం అయిన నీరు
    అపరిశుభ్ర వాతావరణం (పరిసరాలు)
    పచ్చి లేక పూర్తిగా ఉడకని, కూరగాయలు,చేపలు,మాసం తినడం,
    జంతువుల (గొర్రెలు, కోళ్ళు, బర్రెలు) ను అపరి శుభ్ర పరిసరాలలు,మానవాసాలకు దగ్గరగా ఉంచుకోవడం.
    ఎలుకలు క్రిమికీటకాలతో ఇన్ఫెక్షన్లు,
    పౌష్ఠికాహార లోపం మరియు ఇతర జబ్బులు వున్న వ్యక్తులు,
    దోమలు ఇతర కీటకాలు అధికంగా ఉన్న పరిసరాలు.
    ఆటస్ధలాలో పిల్లలు మట్టిలో ఆడడం మూలాన వాటిలో ఉన్న పరాన్న జీవులు చేతులకు అంటవచ్చును.

నివారణోపాయాలు

    ద్రవపదార్ధాలు
    విశ్రాంతి
    కుటుంబంలో అందరికి పరీ్క్షలు చేయించి వైద్యం చేయించడం.
    వైద్యం పూర్తయ్యే వరకు లోపలి బట్టలు, దుప్పట్లు, బట్టలు, వేడి నీటిలో ఉడక పెట్టడం,
    చేతులు తరచుగా పరిశుభ్రం చేసుకోవడం, పచ్చి కూరలు, పూర్తిగా ఉడకని ఆహారం తీసుకోకూడదు.
    నీటిని మరిగించి తాగాలి.
    పండ్లు,కూరగాయలు శుభ్రంగా కడిగి వాడుకోవాలి.

 కడుపులో పురుగుల నివారణకు ఆహారనియమాలు:

తేనె, వెల్లుల్లి, గుమ్మడికాయ విత్తనాలు, దానిమ్మ పళ్లు, క్యారట్ వంటి ఆహారం కడుపులోని పురుగులను తగ్గించడంలో తోడ్పడుతుంది. ముఖ్యంగా తేనె, పుప్పొడి పండ్ల విత్తనాలు శరీరంలో పురుగులను తొలగించడంలో చాలా బాగా పనిచేస్తాయి.
పురుగులు పేగుల్లో నుంచి బయటపడాలంటే బవెల్(Bowel) కదలికలు సరిగ్గా ఉండాలి. అప్పుడే విరేచనాల ద్వారా పురుగులు బయటకు వస్తాయి. కాబట్టి ఇందుకు దోహదపడే విధంగా మంచినీరు, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. కడుపులో బద్దె పురుగులు, ఏలికపాము వంటివి పుదీనా రసం పరకడుపున తీసుకోవడం ద్వారా మలముద్వారా అవి బయటపడిపోతాయి.
ఆహారం జీర్ణం అవ్వడంలో తోడ్పడే ఎంజైమ్‌ల వల్ల చిన్నపేగు ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఎంజైమ్‌లు వృద్ధి చెందాలంటే విటమిన్-సి, జింక్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
కలుషితమైన నీళ్లను తాగకూడదు.

  • =================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, May 24, 2013

Dehydration,నిర్జలీకరణం

  •  
  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Dehydration,నిర్జలీకరణం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


నిర్జలీకరణం అనగా నేమి ?

శరీరం నుంచి అధిక మోతాదులో నీరు నష్టపోవడాన్ని నిర్జలీకరణం అంటారు. మన శరీరం లో ఉన్న వ్యవస్థలు పని చేయడానికి నిర్ణీత మోతాదులో నీరు అవసరం. కనీసం 8 గ్లాసుల నీరు రోజుకు అవసరం ఈ అవసరం మనిషి రోజు చేసే పని,వయసును బట్టి మారుతూ వుంటుంది. చాలా శరీరక శ్రమ చేసే వారికి దీనికి రెండు నుంచి మూడింతలు త్రాగవలసి వుంటుంది. శరీరంలో సహజంగా జరిగే జీవ ప్రక్రియలు అవసరమైన నీరు మనం అందించ వలసి వుంటుంది. తగిన మోతాదులో తీసుకొనక పోయినా, తీసుకొన్న దానికంటే అధికంగా నష్ట పోయినా నిర్జలీకరణం సంభవిస్తుంది.

నిర్జలీకరణకు కారణాలు   
అన్నవాహిక (జీర్ణ వ్యవస్ధ) నుంచి అధికంగా నీరు నష్టపోవడం మూలాన ఈ స్ధితి ఏర్పడవచ్చును.

దీనికి కారణాలు

  •  ప్రేగుల లోపల ఉపరితలంలో వాపు, హాని కలిగి ఉండడం.
  •  బాక్టీరియా,వైరసుల మూలంగా అధికంగా ద్రవం స్రవించడం, దీనిలో చూషణ (absorption) కన్నా స్రవించడం అధికంగా వుంటుంది.
  •  నోటి ద్వారా తీసుకునే నీరు సరిపడా లేకపోవడం, ఉదా: కడుపులో త్రిప్పుట, వాంతులు.
  • వడదెబ్బ (sun stroke) , 
  • కొన్ని దీర్ఘకాలిక వ్యాదులు (Diabetes , peptic ulcers ,T.B. etc.)

లక్షణాలు చిహ్నాలు

    నిర్జలీకరణకు గుర్తు కొద్ది రోజులలో అధికంగా బరువు తగ్గిపోవడం

(కొన్ని మార్లు కొద్ది గంటలలో త్వరిత గతిన బరువు తగ్గడం 10 శాతం కన్నా ఎక్కువ వున్నప్పుడు సమస్యకు తీవ్రంగా పరిగణించ వలసి వుంటుంది.
కొన్ని సార్లు వేరే జబ్బు లక్షణాలతో కలిసి వుండి గుర్తించడం కష్టం కావచ్చు.

  •     ఎక్కువ దాహం
  •     ఎండి పోతున్న నాలిక
  •     చర్మము ఎండి పొవుట
  •     తల తేలికగా అనిపించడం. (ముఖ్యంగా నిలుచున్నప్పుడు)
  •     బలహీనత
  •     మూత్రం రంగు ముదురు పసుపులో వుండడం లేక మూత్రం తక్కువ గా రావడం.
  •     నిర్జలీకరణ తీవ్రంగా వున్నప్పుడు శరీరంలో వుండే రసాయనాల మార్పు రావచ్చు. మూత్ర పిండాలు అసఫలిత కొద్ది సమయాలలో ప్రాణ హాని కూడా కలుగవచ్చు.

  • చికిత్స
వాంతులు విరోచనాలు అవుతున్నప్పుడు మన జీర్ణమండలము సరియైన రీతిలో పనిచేసే పరిస్థితిలో ఉండదు . కావున దానికి విశ్రాంతి అవసరము . విరోవనాలు + వాంతులు అవుతున్న రోగికి .... డీ హైడ్రేషన్‌ తీవ్రతను బట్టి మూడు రకాలు గా విభజించారు . 1.తక్కువ తీవ్రత(mild),2.ఒక మోస్తరు తీవ్రత (moderate) , ఎక్కువ తీవ్రత (severe) గలవి గా చెప్పబడినవి .

సివియర్ టైప్ లో 24 గంటలు నోటిద్వారా ఏమీ ఇవ్వకూడదు. I.V salines , I.V antibiotics, I.V vitamins ఇవ్వాలి . ఈవిషయము లో డాక్టర్ తప్పనిసరి .

మోడరేట్ టైప్ లో కొంతవరకూ ఐ.వి.ఫ్లూయిడ్స్ ఇస్తూ నోటిద్వారా అవసరమైన ద్రవపదార్ధాలు ఇవ్వవచ్చును.

మైల్డ్ టైప్ లో అన్నీ నోటిద్వారానే ఇవ్వవచ్చును . ఈ క్రింది విధము గా నోటిద్వారా ఇవ్వాలి ....

  • * రోగికి దాహం తగ్గేంతవరకు 'అరలీటరు నీళ్లలో పిడికెడు చక్కెర, మూడు చిటికెల ఉప్పు కలిపి' లేదా 'ఓఆర్‌ఎస్‌' పొడిని ప్యాకెట్‌పై సూచించిన విధంగా నీళ్లలో కలిపి తాగించాలి.
  • * కొబ్బరి నీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ తాగించొచ్చు.
  • * వాంతులు విరేచనాలతో కలుషితమైన దుస్తులను మార్చి, శరీరాన్ని నీళ్లతో శుభ్రపరచాలి.

జాగ్రత్తలు--
  • తొలుత మెత్తగా ఉండే ఘనాహారాన్ని మొదలుపెట్టి క్రమంగా రెగ్యులర్ ఫుడ్ తీసుకోవాలి.
  • ఫుడ్ పాయిజనింగ్ జరగకుండా నీళ్లు కాచి తాగడం మంచిది.
  • ఆహారంపై మూతలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
  • తినడానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
  • కాచి చల్లార్చిన నీటిని తాగాలి.
  • వాంతులు, విరేచనాలు అవుతున్న సమయంలో కాఫీ, ఆల్కహాలిక్ డ్రింక్స్, కూల్‌డ్రింక్స్ వంటివి తీసుకోకూడదు. పాలు కూడా తాగకూడదు.

వాంతులు, విరేచనాలు ఆగకుండా అవుతున్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.



Courtesy with : India Development Gateway
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

cataract,క్యాటరాక్టు,కంటి తెల్లపువ్వు,కంటిశుక్లం

  •  


  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -cataract,క్యాటరాక్టు,కంటి తెల్లపువ్వు,కంటిశుక్లం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


కంటిలో ఒక లెన్సు ఉంది.. రానురాను ఈ లెన్సు పారదర్శకత్వాన్ని కోల్పోతుంది. చూపు మందగిస్తుంది. ఈ దశను క్యాటరాక్టు అంటారు.

క్యాటరాక్టు వచ్చిన వారికి ఈ క్రింది లక్షణములు ఉంటాయి :
          రాను రాను నొప్పి లేకుండా కంటిచూపు తగ్గుతుంది. దగ్గర దూర చూపులో వ్యత్యాసం దుర్లభం. రంగులు గుర్తు పట్టడంలో కష్టం, ఒకే దృశ్యం రెండుగ కనబడడం. కంటిపాప రంగుమారి తెల్లపడడం, మబ్బుమబ్బుగా ఉండడం.

క్యాటరాక్టును ఏవిధంగా చికిత్స చేయగలం?
సామాన్య కంటిచూపు మళ్ళీ తెచ్చుకోవడానికి ఒకే ఒక ఉపాయం ఉంది. ఒక సామాన్య ఆపరేషన్ ద్వారా కంటిలోని లెన్సు తొలగించడమే.

క్యాటరాక్టు ఆపరేషన్ దుష్పరిణామానికి దారితీస్తుందా?
          ఇదొక సామాన్యమైన ఆపరేషన్. ఇందులో నొప్పి ఉండదు. రోగికి స్పృహ లేకుండా చెయ్యరు. మత్తుమందు ఇవ్వనవసరము లేదు.
          కంటి సంరక్షణ కోసం, క్యాటరాక్టు వచ్చిన వారిని పరీక్షించడానికి, వారికి చికిత్స చేయడానికి, జిల్లా అంధత్వ నివారణ సంఘములను, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేశారు.
          స్వచ్ఛంద సేవా సం)స్థల ద్వారా నేత్రచికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఆపరేషన్ తర్వాత రోగులకు ఉచితంగా కంటద్దాలు అందచేస్తున్నారు.

జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయాలు :

    భారతదేశంలో క్యాటరాక్టు, అంధత్యానికి మూల కారణం. అంధులలో 85 శాతం, క్యాటరాక్టువల్ల చూపు కోల్పోయిన వారే.
    సరైన సమయంలో క్యాటరాక్టుకు చికిత్స చేయాలి. అశ్రద్ధ చేయవద్దు.
    క్యాటరాక్టు వృద్ధాప్యంలో వస్తుంది. కంటికి దెబ్బ తగిలిందంటే క్యాటరాక్టు ఏ వయస్సులోనైనా రావచ్చు.
    క్యాటరాక్టువల్ల ఆపరేషన్ సులభమైంది. నిశ్చింతగా చేయించుకోవచ్చు.
    ఆపరోషన్ తరువాత కంటి పరీక్ష చేయించుకొని సరైన కళ్ళజోళ్ళు వాడాలి.
    క్యాటరాక్టు వచ్చిన వ్యక్తి ఆత్మ స్థైర్యంతో ఆపరేషన్ చేయించుకొనేటట్లు చూడాలి.


  • Cataract surgery-శక్లాల సర్జరీ


విజ్ఞానశాస్త్రం విస్తరించిన కొద్దీ.. మన `దృష్టి' మెరుగవుతోంది! అందుకు ఆధునిక `శక్లాల' సర్జరీలే సాక్ష్యం! మలివయసులో చూపునకు పట్టే గ్రహణం.. శక్లం!
పుట్టుకతోనే మన కంటిలో ఉండి.. నిరంతరం మనకు లోకాన్ని చూపిస్తుండే సహజమైన `కటకం' ముదిరిపోయి.. మబ్బుగా.. కాంతి ప్రసరించనంతటి గట్టి `కొబ్బరి ముక్క'లా తయారవ్వటమే ఈ సమస్యకు మూలం!

సర్జరీ చేసి... మబ్బుగా ఉన్న ఈ శక్లాన్ని తొలగించి ఎంతోకొంత చూపు పునరుద్ధరించటం ఒక ముందడుగు. దాని  స్థానంలో కృత్రిమ కటకాన్ని అమర్చటం మరో గొప్ప పురోగతి.
అయితే.. ఈ ప్రయోగపరంపర ఇక్కడితో ఆగిపోలేదు. ఈ కృత్రిమ కటకాలకు మరిన్ని మెరుగుదిద్దుతూ సానబెట్టే పని నిరంతరాయంగా సాగుతూనే ఉంది. అందుేక ఇప్ఫుడు సాధ్యమైనంత సహజంగా.. మన్నికగా.. బహుళ ప్రయోజనాలను చేకూర్చే విధంగా రకరకాల కటకాలు అందుబాటులోకి వస్తున్నాయి.
శక్లాల ఆపరేషన్‌ చాలా సాధారణమైపోయిన ఈ కాలంలో.. ఈ ఆధునిక కటకాలపై అవగాహన పెంచుకోవటం చాలా ఉపయోగకరం. అందుేక దీనిపై సమగ్ర కథనాన్ని మీ ముందుకు తెస్తున్నాం!

అసలేమిటి శక్లం?
మన కన్ను ఓ ెకమేరాలాంటి అమోఘమైన నిర్మాణం!
మన కనుగుడ్డు మీద ఉండే తెల్లటి కార్నియా పొర, దాని వెనేక ఉండే సహజ కటకం.. ఈ రెండూ బయటి నుంచి వచ్చే కాంతి కిరణలు కచ్చితంగా లోపలి రెటీనా పొర మీద ేకంద్రీకృతమయ్యేలా చేస్తాయి. తెరలాంటి ఆ రెటీనా పొర.. ఆ కిరణ బింబాన్ని విద్యుత్‌ ప్రేరణలుగా మార్చి మెదడుకు పంపిస్తుంది. దీంతో మనకు కళ్ళ ముందరి దృశ్యం కనిపిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం సజావుగా సాగుతుండటానికి... కంటిలోని సహజమైన కటకం చాలా కీలకం!
ఎప్ఫుడూ లేత ముంజిలా.. బయటి నుంచి వచ్చే కిరణాలు సరిగ్గా రెటీనా మీద పడేలా చాలా పారదర్శకంగా ఉండే ఈ కటకం.. వయసుతో పాటు.. లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో.. బాగా ముదిరిపోయి కొబ్బరిముక్కలా తయారైపోతుంది. ఇదే శక్లం. దీని గుండా లోపలికి కాంతి కిరణాలు ప్రసరించవు. దీంతో చూపు మందగిస్తుంది!

ఎందుకిలా?
1. వయసుతో పాటు సహజంగానే రావచ్చు.
2. అతినీల లోహిత కిరణలు ఎక్కువగా సోకినప్ఫుడు
3. సహజ కటకానికి దెబ్బల వంటివి తగిలినప్ఫుడు
4. మధుమేహం వంటి సమస్యలున్నప్ఫుడు
5. స్టిరాయిడ్ల వంటి మందులు ఎక్కువగా వాడినప్ఫుడు
... సహజ కటకం దళసరిగా తయారై శక్లం ఏర్ఫడొచ్చు. సాధారణంగా 50, 55 ఏళ్ళ తర్వాత వచ్చే శక్లాలకు ఒకటి కంటే ఎక్కువ కారణాలే ఉంటాయి. పిల్లల్లో కూడా శక్లాలు ఏర్ఫడొచ్చుగానీ దీనికి చాలా వరకూ జన్యుపరమైన, వంశపారంపర్యమైన అంశాలే కారణం.
మధుమేహ బాధితులకు.. శక్లాలు ఏర్ఫడే అవకాశం ఎక్కువ. ఎందుకంటే రక్తంలో చెక్కెర ఎక్కువగా ఉండటం వల్ల ఆ చెక్కెర కటకం లోపలికి వెళ్థూవస్తూఉంటుంది. దానివల్ల క్రమేపీ కటకంలో తేడాలు వచ్చి పారదర్శకమైన కటకం.. శక్లంగా మారుతుంది. లేదా ఇప్ఫటిేక శక్లాలు ఏర్ఫడుతుంటే వాటిని త్వరగా ముదిరేలా చేస్తుంది.

శక్లం: లక్షణలేమిటి?
* చూపు మందగించి.. మబ్బుగా తయారవటం
* రంగుల మధ్య, తలాల మధ్య వ్యత్యాసం (కాంట్రాస్‌‌ట) సరిగా తెలియదు.
* అరుదుగా ఒక వస్తువు, ఒక కాంతి రెండు మూడుగా కనబడుతుండొచ్చు. ఉదా: చంద్రబింబాలు రెండుగా కనబడొచ్చు
* మిరుమిటు్ల గొల్ఫే కాంతిలో చూపు కష్టం కావచ్చు.
* కటకం మధ్యభాగం శక్లంలా మారటం వల్ల కొన్నిసార్లు తీƒణమైన వెలుతురులోకి వెళ్లినప్ఫుడు కొద్దిసేపు ఒక్కసారిగా చూపు మొత్తం కనబడకుండా పోవచ్చు. దీనివల్ల డ్రైవర్ల వంటివారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.
* కొందరిలో కటకం మధ్యభాగం బాగా దళసరిగా మారి మైనస్‌ పవర్‌ బాగా పెరుగుతుంటుంది, దీంతో దగ్గరి చూపు మెరుెగనట్టనిపించవచ్చుగానీ శక్లం కారణంగా మొత్తం మీద చూపు ఇబ్బందిగా తయారవుతుంది.

మందులున్నాయా?
వాస్తవానికి శక్లాలను కరిగించే ప్రామాణికమైన మందులేం లేవు. దీనికి ఆపరేషన్‌ ఒక్కటే ఉత్తమ మార్గం. కొందరు `యాంటీక్యాటరాక్‌‌ట' చుక్కలు వాడుతుంటారుగానీ వీటితో ఉపయోగం ఉన్నటు్ట శాస్త్రీయమైన ఆధారాలేం లేవు. పైగా ఈ మందులు చాలా రీదైనవి. వీటిని ఏళ్ళ తరబడి వాడినా ఏ ప్రయోజనమూ ఉండకపోవచ్చు. కాబట్టి పనిచేస్తాయో లేదో తెలీని ఈ మందులతో సమయాన్ని వృథా చేసుకునే కంటే ఆపరేషన్‌ చేయించుకోవటం ఉత్తమం.

ఆపరేషన్‌ ఎప్ఫుడు మంచిది?
శక్లం ముదిరే వరకూ వేచి ఉండాలన్నది ఒకప్ఫటి, పాతకాలపు ధోరణి. 15-20 ఏళ్ళ క్రితం శక్లాల ఆపరేషన్‌ను చాలా నాటుగా చేసేవాళ్లు. (ఇప్ఫుడూ కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇలాేగ చేస్తున్నారు.) వీటితో దుష్ర్ఫభావాలు తలెత్తి చూపు మొత్తం పోయే అవకాశం ఎక్కువ. అందుేక డాక్టర్లు శక్లం బాగా ముదిరినప్ఫుడు ఎలాగో ఏమీ కనబడదు కాబట్టి.. ఆ సమయంలో సర్జరీ చేస్తే ఫలితం ఉన్నాలేకున్నా నష్టం ఉండదని భావించేవారు. కానీ ఇప్ఫుడు అత్యాధునికమైన సర్జరీ పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో... ఆల్ట్రాసౌండ్‌ తరంగాలతో `ఫేకోఎమల్సిఫిేకషన్‌' పద్ధతిలో శక్లాన్ని తొలగిస్తూ దాని స్థానంలో లోపల కృత్రిమ కటకం (ఇంట్రా ఆక్యులర్‌ లెన్‌‌స-ఐఓఎల్‌) అమర్చటమన్నది చాలా ప్రామాణికమైన.. అద్భుతమైన విధానమని చెప్ఫవచ్చు. ఇది చాలా సురక్షితమైన, చక్కటి చూపునిచ్చే పద్ధతి. కాబట్టి ఇవాల్టి రోజున.. శక్లాలు ముదిరే వరకూ ఎదురు చూడాల్సిన పని అస్సలు లేనే లేదు! శక్లాల కారణంగా రోగి దైనందిన జీవితం ఎప్ఫుడు ఇబ్బందికరంగా తయారవుతుంటే.. అప్ఫుడే సర్జరీ చేయించుకోవచ్చు, తొలిదశలో కూడా చేయించుకోవచ్చు.'

ఏమిటీ సర్జరీ?
సర్జరీకి ముందు... మధుమేహం, హైబీపీ ఉంటే సర్జరీకి వెళ్ళే ముందు వాటిని నియంత్రించుకోవటం చాలా అవసరం. లేకపోతే అధిక రక్తపోటు వల్ల కంటిలో రక్తస్రావం అవుతుంది. మధుమేహం ఎక్కువగా ఉన్నప్ఫుడు ఇన్ఫెక్షన్లు వస్తే వాటిని నియంత్రించటం కష్టం. అలాేగ రక్తాన్ని పల్చగా చేసే ఆస్ఫిరిన్‌ తరహా మందులు వాడుకుంటూ ఉంటే.. వాటిని తప్ఫనిసరిగా ఆపరేషన్‌కు రెండు మూడు ముందు నుంచీ మానెయ్యాలి.

ఆపరేషన్‌...
ఒకప్ఫుడు ేకవలం కంటిలోని శక్లాన్ని తొలగించి వదిలేసేవాళ్లు. దానివల్ల దాదాపు ప్లస్‌ 10 పవర్‌ ఉండే సోడాబుడీ్డ అద్దాలు పెటు్టకోవాల్సి వచ్చేది. ఈ అద్దాల్లేకపోతే ఏమీ కనబడేది కాదు. మెట్ల వంటివి దిగాలంటే మహా కష్టం. దీనికి విరుగుడుగా.. మొదటగా బ్రిటన్‌నేత్ర వైద్యుడు హెరాల్‌‌డ రిడ్లే 1948లో లోపలే కృత్రిమ కటకం (ఐఓఎల్‌) అమర్చటం ఆరంభించాడు. శక్లాల ఆపరేషన్‌లో ఇదో గొప్ఫ ముందడుగు. రెండోది- లోపలి శక్లాన్ని తీసి, కృత్రిమ కటకం అమర్చేందుకు కనుగుడ్డు మీద పెద్ద కోతబెట్టాల్సి వచ్చేది. ఈ పెద్ద కోత వల్ల కార్నియా బల్లబరుపుగా తయారై.. చూపు బాగా ప్రభావితమయ్యేది. దీనికి విరుగుడుగా- ఆల్ట్రాసౌండ్‌ పద్ధతిలో.. చాలా చిన్న కోత ద్వరానే శక్లాన్ని తొలగించే పద్ధతిని 1968లో ఛాల్‌‌స ెకల్మన్‌ అనే అమెరికా నేత్ర వైద్యుడు ఆరంభించాడు. తరువాత ఆ చిన్న కోత ద్వారానే కృత్రిమ కటకాన్ని మడతబెట్టి లోపలికి పంపించి.. అమర్చటమన్న అత్యాధునిక పద్ధతి అందుబాటులోకి వచ్చింది! ఇదే ఇప్ఫుడు ప్రామాణిక చికిత్స!

  •  


కోత కీలకం!

కనుగుడ్డు కార్నియా పొర మీద ఎంత పెద్ద కోతబెడితే.. ఆ తర్వాత పెటు్టకోవాల్సిన అద్దాల పవర్‌ అంత పెరుగుతుంది. పెద్ద కోతబెట్టినప్ఫుడు.. పుండు మానిన తర్వాత కార్నియాలో ఆ కాస్త భాగం బల్లబరుపుగా తయారవుతుంది, దీంతో అద్దాల పవర్‌ ఇంకా పెరుగుతుంది. అందుేక సాధ్యమైనంత `చిన్న కోత' ద్వారానే లోపలి కటకం తొలగించటం, కొత్త కటకం అమర్చటం.. రెండూ పూర్తి చేసేందుకు విస్తృతంగా ప్రయోగాలు సాగాయి. ఆల్ట్రాసౌండ్‌ పరిజ్ఞానం సాయంతో `ఫేకో' పద్ధతిలో 2, 2.5 మిల్లీమీటర్ల చిన్నకోత ద్వారా లోపలి శుక్లాన్ని తొలగించటం తేలిక అయ్యిందిగానీ కొత్త కటకాన్ని ఆ చిన్న కోత ద్వారా లోపలికి పంపటం కష్టమైంది. కటకం పంపాలంటే కనీసం 6 మిల్లీమీటర్ల దారి అవసరమైంది. అందుేక దీనికి విరుగుడుగా మడతపెట్టే రకం `ఫోల్డబుల్‌' కృత్రిమ లెన్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని సన్నటి కోత ద్వారా లోపలికి తోసి.. అక్కడ విచ్చుకునేలా చెయ్యచ్చు. 90ల నుంచీ ఈ రకం మడతపెట్టే లెన్సులు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో పెద్ద కోత అవసరం తప్ఫింది.. అద్దాలు పెటు్టకోకున్నా కూడా చూపు కొంత మెరుగ్గా ఉంటుంది.

పదార్థమూ ముఖ్యమే!
కంట్లో అమర్చేందుకు కృత్రిమ కటకాలను ఏ రకం పదార్థంతో తయారుచేస్తే ఫలితాలు బాగుంటాయన్న దానిపై చాలా ప్రయోగాలు జరిగాయి. వీటిలో సిలికాన్‌, అక్రిలిక్‌ పదార్ధాలు ఉత్తమమైనవని గుర్తించారు. మళ్లీ ఈ అక్రిలిక్‌లో కూడా హైడ్రోఫిలిక్‌, హైడ్రోఫోబిక్‌ అనే రెండు రకాల పదార్ధాలతో తయారైన కటకాలున్నాయి. వీటితో ఆపరేషన్‌ తర్వాత.. శక్లాలకు సంబంధించిన సమస్యలు చాలా తక్కువ. ముఖ్యంగా శక్లం ఆపరేషన్‌ చేసిన తర్వాత రెండుమూడేళ్లు చూపు బాగానే ఉండి.. ఆ తర్వాత మళ్లీ తిత్తి మొత్తం దళసరిగా మారుతూ చూపు తేగ్గే అవకాశం ఉంటుంది. దీన్నే `కాప్సులార్‌ ఒపేసిఫిేకషన్‌' అంటారు. ఈ రకం సమస్య అక్రిలిక్‌ కటకాలతో చాలా తక్కువనీ, ఈ కటకాల్లో కూడా వెనక భాగం పలకలుగా, ముందు భాగం గుండ్రంగా ఉండే కటకాలతో మరీ తక్కువని గుర్తించారు. కాకపోతే వీటి ఖరీదు కొంత ఎక్కువగా ఉంటుంది.

లెన్సులు
1. నాన్‌ఫోల్డబుల్‌:
* సాధారణంగా దీనితో కోత 5-5.5 మి.మీ. వరకూ అవసరమవుతుంది. కోత పెరిగిన కొద్దీ కార్నియా చదునుగా అయిపోతుంది, కోత మానటానికి ఎక్కువ సమయం పడుతుంది. గ్లాసుల పవర్‌ ఎక్కువ అవుతుంది. అద్దాలు పెటు్టకోకపోతే బాగా కనబడదు, కాబట్టి ఎప్ఫుడూ అద్దాలు పెటు్టకునే ఉండాలి.
* వీటిలో స్వదేశీ, విదేశీ కటకాలు రెండూ లభిస్తాయి. సాధారణంగా ఈ లెన్సుతో, ఫేకో పద్ధతితో సర్జరీ చేస్తే రూ.6-8 వేల వరకూ అవుతుంది.

2. ఫోల్డబుల్‌
చిన్నకోత ద్వరానే మడతపెట్టి లోపల అమర్చటానికి వీలైన ఈ లెన్సులను ఎ. సిలికాన్‌ బి. హైడ్రోఫిలిక్‌ అక్రిలిక్‌ సి. హైడ్రోఫోబిక్‌ అక్రిలిక్‌. అనే మూడు రకాల పదర్ధాలతో తయారైనవి దొరుకుతాయి.
మళ్లీ వీటిలో ప్రతి ఒక్కటీ- స్వదేశీ, విదేశీ తయారీలో ఉంటాయి, దీన్ని బట్టి వీటి రీదు కూడా మారుతుంది.

డిజైన్లూ ముఖ్యమే!
అంచులు:
ఈ కటకాలలో వెనక భాగం పలకలుగానూ, ముందు భాగం గుండ్రంగానూ ఉన్న వాటితో తిరిగి శక్లం తిత్తి దళసరిగా మారే అవకాశం తక్కువని, చూపు కూడా నాణ్యంగా ఉంటుందని గుర్తించారు. కాబట్టి ఏ పదార్థంతో తయారైన కటకాన్ని అమర్చుకున్నా కూడా... ఈ రకం డిజైన్‌ వాటిని ఎంచుకోవటం మంచిది.

ఉపరితలం:
సాధారణంగా మన కంటిలోని కార్నియా పొరకు +దృష్టిలోపం ఉంటుంది, కటకానికి -దృష్టిలోపం ఉంటుంది. ఈ రెండూ కలిసి న్యూట్రల్‌గా మారి మనకు చక్కటి చూపునిస్తాయి. కానీ వయసు పెరిగిన కొద్దీ శక్లం ఏర్ఫడితే కటకానికి ఉండే -దృష్టిలోపం తగ్గుతుంది, చూపులో అస్ఫష్టత పెరుగుతుంది. అలాేగ స్థాయీవ్యత్యాసాలూ (కాంట్రాస్‌‌ట) సరిగా తెలీవు. దీనికి విరుగుడుగా కొత్తగా కంటిలో అమర్చే కటకాలను `ఏస్ఫెరిక్‌' లేదా `ఆబరేషన్‌ ఫ్రీ' తరహా డిజైన్లలో తయారు చేస్తున్నాయి. అన్ని రకాల పదార్ధాల్లోనూ లభ్యమయ్యే ఈ డిజైన్లలో.. కటకం ముందు ఉపరితలం కొద్దిగా ఉబ్బుగా ఉంచుతారు. దీంతో రాత్రిపూట, డే లైట్‌లో కూడా చూపు మెరుగవుతుంది. మంచి కాంట్రాస్‌‌ట ఉంటుంది, వాహన ప్రమాదాలు తగ్గుతాయి.

మల్టీఫోకల్‌:
సాధారణంగా ఈ కృత్రిమ కటకాలన్నీ కూడా దీర్ఘదృష్టికో, హ్రస్వదృష్టికో.. ఏదో ఒక దాని మీద మాత్రమే ేకంద్రీకరించేందుకు ఉపయోగపడతాయి. కాబట్టి ఏదో ఒకదానికి పరిమితం కాకుండా వీటిని మధ్యేమార్గంగా కొంతకొంత రెంటికీ పనికొచ్చేలా అమరుస్తారు. దీంతో ఇంట్లో పనులన్నీ అద్దాల్లేకుండా చేసుకుంటారు, చదువుకూ, దూరపు చూపుకూ అద్దాలు వాడుకుంటారు. ఇవి మోనోఫోకల్‌ లెన్సులు. ఈ కాస్త ఇబ్బందినీ కూడా తగ్గించేందుకు ఇటీవలికాలంలో `మల్టీఫోకల్‌ లెన్సులు' వస్తున్నాయి. ఈ కటకాల మీద కొన్నికొన్ని వలయాలుగా ఉంటాయి. వీటిలో కొన్ని దగ్గర చూపునకు, కొన్ని దూరపు చూపునకు ఉపయోగపడతాయి. దీంతో కళ్ళద్దాలు పెటు్టకోవల్సిన అవసరం అంతగా ఉండదు. కాకపోతే ఈ రకం డిజైన్‌ లెన్సులు పెట్టించుకుంటే రెండు కళ్ళకూ చేయించుకోవాలి. ఒక్క రాత్రిపూట డ్రైవింగ్‌ వంటివి చేసేవారికి మాత్రం వీటి వల్ల ేగ్లరింగ్‌ సమస్య రావచ్చు, కాబట్ట వారు మోనోఫోకల్‌ అద్దాలు పెట్టించుకోవటం మంచిది.

మూవీ అబ్జార్బింగ్‌ లెన్స్:
సాధారణంగా మన కంటిలోని సహజమైన కటకం.. అతినీల లోహిత కిరణలను కొంతవరకులోపలికి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. కృత్రిమ లెన్సుకు ఈ స్వభావం ఉండదు. దీంతో ఈ కిరణాలు లోపలికి వెళ్లి రెటీనాను దెబ్బతీసే అవకాశాలుంటాయి. కాబట్టి ఈ కృత్రిమ లెన్సులను కూడా అతినీలలోహిత కిరణాలు లోపలకు సోకకుండా ఉండేలా రంగు కలిపి.. తయారు చేస్తారు. మాక్యులర్‌ డీనరేషన్‌ వంటి సమస్యలు రాకుండా వృద్ధులకు ఇవి మంచివే. ఇవి అక్రిలిక్‌ లెన్సులన్నింటిల్లోనూ అందుబాటులో ఉంటాయి.
* కాబట్టి అన్ని కటకాలూ మంచివే అయినా ఇవాల్టి రోజున స్తోమతును బట్టి సాధ్యమైనంత మన్నికైన కటకానికి వెళ్ళటం దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తుంది.
* ప్రస్తుతం శక్లాన్ని తొలగించేందుకు- `ఫేకోఎమల్సిఫిేకషన్‌' సర్జరీ పద్ధతి ఉత్తమం.
*దీనికి తోడుగా... దీర్ఘకాలం మన్నికైన, సురక్షితమైన ఫలితాల కోసం లోపల- ఫోల్డబుల్‌, ఎక్రిలిక్‌ హైడ్రోఫోబిక్‌ కటకాన్ని ఎంచుకోవటం మంచిదని చెప్ఫవచ్చు.



Courtesy with : India Development Gateway

  • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Fever in Adults,పెద్దవాళ్ళలో జ్వరం

  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Fever in Adults,పెద్దవాళ్ళలో జ్వరం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత 370 లేక 98.60ఉంటే అది నార్మల్ అని అంటారు. శరీర ఉష్ణోగ్రత అంతకంటే ఎక్కువ ఉంటే అది జ్వరం అంటారు. సాధారణంగా 37.50 (100 ) వుంటుంది. జ్వరం అన్నది శరీరంలో వున్న ఏదో ఒక వ్యాధి లక్షణము మాత్రమే వ్యాధి ప్రభావము పెరిగే కొద్ది జ్వర తీవ్రత అధికమవుతుంది. 39.50 c లేదా 1030Fకు పైన ఉన్నా తప్పనిసరిగా డాక్టరు సలహా తీసుకోవాలి.
సాధారణ కారణాలు

    మలేరియా, టైఫాయిడ్ , క్షయ, రుమాటిక్ జ్వరము, ఆటలమ్మ, గవదలమ్మ, ఊపిరితిత్తులు ఇన్ పెక్షన్, జలుబు, దగ్గు, టాన్సిలైటిస్ , బ్రాంకైటిస్ మూత్రనాళాల ఇన్ ఫెక్షన్ మొదలైనవి. బ్యాక్టీరియా, వైరస్.

సాధారణ జ్వరం లక్షణాలు

    37.50 C లేదా 1000 F ఆ పైన జ్వరం నమోదు
    తలనొప్పి
    చలితో కూడిన జ్వరం
    కీళ్ళనొప్పులు
    నోరు చేదుగా ఉండుట
    అకలి తగ్గడం, మలబద్దకం
    కొన్ని ప్రత్యేక సమయాలలో కలవరింతలు మొదలైనవి

జ్వరం వచ్చినప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు

    జ్వరం వచ్చిన వ్యక్తి వున్న వాతావరణం చల్లగా ఉండేటట్లు చూడాలి
    సాధారణ ఫ్యాన్ క్రింద పరుండబెడితే కొంత ఉపశమనముంటుంది
    పలుచటి దుస్తులు వాడాలి
    పలుచటి దుప్పట్లు వాడాలి
    గోరువెచ్చని నీళ్ళతో శరీరమంతా తుడవాలి
    నీళ్ళు ద్రవ పదార్దాలు అధికంగా తీసుకోవాలి
    చల్లని నీళ్ళ తో శరీరము తుడవరాదు. నుదుటి మీద తడిగుడ్డ వేయడం వలన ఉపయోగం లేదు
    జ్వరం వచినపుడు తీసుకోవలిసిన ఆహారము
    ఎక్కువ విశ్రాంతి తీసుకొని అధికంగా నీరు త్రాగాలి
    జ్వరం ఉన్నప్పుడు శరీరానికి అధిక కేలరీలు అవసరము అవుతాయి కనుక గ్లూకోజ్ ,హార్లిక్స్ లాంటి ద్రవ పదార్దాలు, పండ్ల రసాలు వంటివి ఆధికంగా తీసుకోవాలి
    బియ్యం గంజి,సగ్గుబియ్యం గంజి,జావ, బార్లీ నీళ్ళు సులభంగా జీర్ణమై య్యే పదార్దాలు ఇవ్వాలి
    కాఫీ , టీ లాంటి ద్రవ పదార్దాలు సాధారణ వేడి తో తీసుకోవాలి
    పాలు , రొట్టె లాంటి పదార్దాలు తీసుకోవచ్చును
    మాంసం ,గుడ్డు, వెన్న , పెరుగు ,నూనె పదార్దాలు తీసుకోరాదు


courtesy with : http://www.indg.in/india
  • ======================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Fats and human health , కొవ్వుపదార్ధాలు - మనిషి ఆరోగ్యం


  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Fats and human health , కొవ్వుపదార్ధాలు - మనిషి ఆరోగ్యం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...





    కొవ్వు సంబంధ ఆహారం నుండి, మన శరీరానికి కొవ్వు అందుతుంది ఇవి చాలా రకాలుగా శరీరానికి ఉపయోగపడతాయి. ఇది శక్తివంతమైన, శరీరానికి ఇంధనము ఇచ్చే పదార్ధము
    1 gram కొవ్వు = 9 cal ఇంధనము శరీరానికి అందిస్తుంది.
    vit A, B, E & K అను విటమినులు, రక్తంలో కొవ్వుపదార్ధాము ఇమడడానికి చాలా అవసరం.

    కొవ్వు అనేది – ఆహారంలో, చెట్ల నుండి జంతువుల నుండి లభిస్తుంది.
    veg-ఆయిల్ - మనము  తీసుకొనే  ఆహారంలొ  చాలా  ముఖ్యమైనది.

       దీనిలోఅవసరమైన కొవ్వు ఆమ్లములు,
      1. ఆన్ సాచ్యురేటడ్ (మొనో ఆన్ సాచ్యురేటడ్)
      2. పాలీ ఆన్ సాచ్యురేటడ్
       ఉదా :అన్ సాచ్యురేటడ్ కొవ్వుఆమ్లాలు-వెజిటబుల్ oils
       సాచ్యురేటడ్ కొవ్వు అనగా - వెన్న, నెయ్యి

    పెద్దవయస్సువారు - కొవ్వుపదార్ధాలు ఉండే, వెన్న, నెయ్యి హైడ్రొజినేటడ్ కొవ్వుపదార్ధాలు చాలా తక్కువగా తీసుకొవాలి కొబ్బరినూనెవాడరాదు.

    హైడ్రోజినేటడ్ కొవ్వు తీసుకొంటే రక్తంలో కోలెస్ట్రాల్ పెరుగుతుంది, తద్వారా గుండెకు, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులకు గురి అవుతారు.

    వంటలకు వాడే నూనెలు, వెజిటబుల్ నూనె, వనస్పతి, నెయ్యి, వెన్నలలో కొ్వ్వును చూడగలము.
    తినుబండారాలలో వుండె కొవ్వు, కరగగలిగే మాంసము కొవ్వు, లేక ఇతర జంతువులకు సంబంధించిన కొవ్వు ఎక్కువ శాతం సాచ్యురేటడ్ కొవ్వులు -

    ప్రతిరోజు ఆహారంలో ఉండాల్సిన కొవ్వుశాతం -

    యుక్త వయస్సు పిల్లలో రోజుకు, 25గ్రా- వరకు  సాచ్యురేటడ్ ఫాట్స్ ఉండాలి.
    పెద్దవాళ్ళకు - 20గ్రా రోజుకు.
    గర్బవతులకు/ పాలిచ్చే తల్లులకు - 30 గ్రా రోజుకు.

    గుర్తుంచుకోవలసినవి -

    1. తగినంతగా సరిపడగలిగే కొవ్వు పధార్ధాలు తీసుకోవాలి.
    2. వంటలో ఒకటి కన్నాఎక్కువ రకాల నూనెలువాడాలి.
    3. నెయ్యి, వెన్న, వనస్పతి నూనెలు తగ్గించాలి.
    4. ఆకుకూరలు, మెంతులు, ఆవాలు ప్రతి రోజూ వాడాలి.
    5. జంతు అవయవాలు తినరాదు మాంసము/కోడి కన్నా ఎక్కువగా చేపలు తినవచ్చు

source : http://www.indg.in/india
  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, May 23, 2013

Role of Nutritional food in growth , పెరుగుదలలో పోషకాహారం పాత్ర

  •  
  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Role of Nutritional food in growth , పెరుగుదలలో పోషకాహారం పాత్ర - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

భారత దేశ జనాభాలో ఐదో వంతు కౌమార వయస్సు వారే. ఈ దశలో వారి శారీరక పెరుగుదల వేగంగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కౌమార దశ లక్షణాలివీ :
కౌమార దశలో పెరుగుదలను వేగవంతం చేయడానికి పోషకాహారం చాలా కీలకమైనది. మన దేశంలోని బాలికల్లో యుక్తవయస్సు రాకుండా జాప్యం జరగడానికి పోషకాహార లోపాన్ని ఒక కారణంగా చెప్పవచ్చు. అమ్మాయి శరీర బరువు పది శాతం కొవ్వుతో 30 కిలోలకు చేరుకున్నప్పుడే యుక్తప్రాయంలోకి ప్రవేశించి శారీరక ఎదుగుదలను సాధించగలరు.అందుకే కౌమార దశ వయస్కులకు మాంసకృత్తులు,ఖనిజాలు,విటమిన్లు,శక్తిని ఇచ్చే ఆహార పదార్ధాలు ఎక్కువ అవసరం

మనకు శక్తి ఎందుకు అవసరం? :

    మనుషులు తమ పనులు చేసుకోవటానికి తగినంత శక్తి కలిగి ఉండటం అవసరం.శరీర ఉష్టోగ్రతను స్ధిరంగా ఉంచటానికి, జైవిక క్రియకు, పెరుగుదలకు కూడా శక్తి అవసరం. జాతీయ పోషకాహార పర్యవేక్షక బృందం (NNMB) జరిపిన ఒక సర్వే ప్రకారం,మన దేశంలో 50శాతం మంది మహిళలు,పురుషులు శక్తిహీనతతో బాధ పడుతున్నారు.

  --ఆహారంలో లభించే కాలరీలు : పౌష్టికాహార పరిభాషలో ఆహారం ద్వారా లభించే శక్తిని ' క్యాలరీలు ' అంటారు. ఒక మనిషికి ఎంత శక్తి అవసరమనేది అతడు/ఆమె ప్రతి రోజు పడే శారీరక శ్రమ పై ఆధారపడి  ఉంటుంది. వయస్సు ,లింగ భేదం శరీర బరువు, పెరుగుదల, శరీరం పని పాటలు ఒత్తిడిని బట్టి ఇది మారుతుంటుంది. భారత దేశంలో 70-80 శాతం మంది ప్రధాన గింజ ధాన్యాలు, పప్పు దినుసులు, చిరుధాన్యాలు, కాయధాన్యాల నుంచి శక్తిని గ్రహిస్తున్నారు.
      --  పిల్లలు ,కౌమార దశ వారు 55-60/శాతం రోజువారి కాలరీలను పిండి పదార్ధాల ద్వారా పొందుతున్నారు. కౌమార వయస్సు వారు ఆరోగ్యంగా పెరగటానికి ఎక్కువ కాలరీలు అవసరం. ఉదాహరణకు 16-18 ఏళ్ల అమ్మాయిలు ప్రతిరోజు కనీసం 2060కిలో క్యాలరీలు గల ఆహార పదార్ధాలు తీసుకోవాలి. అదే వయస్సు అబ్బాయిలకైతే 2640 కిలో కాలరీలు అవసరం. గర్భవతులకు అదనపు క్యాలరీలు ఆహారం ఇవ్వాలి. పిండం ఎదుగుదలకు,గర్భవతి ఆరోగ్యానికి ఇది చాలా అవసరం. అవసరమైన దానికన్నా తక్కువ క్యాలరీల ఆహారం తీసుకుంటే పోషణ లోపానికి దారి తీస్తుంది.అధికంగా తీసుకుంటే ఊబకాయం (లావు) కు దారి తీస్తుంది.    

అధిక శక్తిని ఇచ్చే ఆహర పదార్ధాలు :

        ప్రధాన గింజ ధాన్యాలు,చిరు ధాన్యాలు ,పప్పు దినుసులు,దుంప కాయగూరలు,వంట నూనేలు,వనస్పతి,నెయ్యి,వెన్న,నూనెలు విత్తనాలు,గింజకాయలు చెక్కర,బెల్లం తదితరాలు.
        మనకు కాలరీలు ఎక్కువగా గింజ ధాన్యాలు నుంచి లభింస్తున్నాయి.కనుక గింజ ధాన్యాలు,చిరు ధాన్యాల్లో వివిధ రకాలను వినియోగించేలా చొరవ చూపాలి. జోన్నలు,సజ్జలు లాంటి ముతక ధాన్యాలు,రాగులు లాంటి చిరు ధాన్యాలు చౌకగా లభిస్తాయి. ఇవి అధిక శక్తినిచ్చేవి.   

    ఆహార పదార్ధాలు---     శక్తి (ప్రతి వందగ్రాములకు కి.కాలరిలలో)
    బియ్యం--- గోధుమ పిండి-----జొన్న---    సజ్జలు ---   రాగి---    మొక్కజొన్న  
    345----341-----------349---    361---    328---    342
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, May 21, 2013

Pricklyheat prevention methods , చెమటకాయలు తీసుకోవలసిన జాగ్రత్తలు

  •  
  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Pricklyheat prevention methods , చెమటకాయలు తీసుకోవలసిన జాగ్రత్తలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



వేసవికాలం వచ్చిందంటే చాలు... మండే ఎండలు, భరించలేని చెమట. ఇది అందరికీ తెలిసినదే. వేడిమి, చెమట... కొన్నిసార్లు ఇవే కాదు... చెమటకాయలూ మొదలవుతాయి. ఈ కాలంలో ఇది చాలామందిని బాధించే సమస్య. పిల్లల్లో మరీ ఎక్కువ. ఇదొక రకమైన చర్మవ్యాధి. వేడిగా ఉండే వాతావరణంలో ఈ సమస్య సర్వసాధారణం. పిల్లల్లో స్వేదగ్రంథులు పూర్తిగా రూపొందకపోవడంతో చిన్నారులలో ఇవి ఎక్కువ. వాటితో కలిగే చికాకూ ఎక్కువే. ఒక్కోసారి వాటిని భరించలేక చిదిపేస్తూ ఉంటారు. ఫలితంగా సమస్య తీవ్రమవుతుంది. శరీరంపై కాసే ఈ కాత... మనం కోరని కాత. కాయకముందే కోయాల్సిన కోత. ఈ కాతను రాల్చాలంటే కేవలం ప్రేమ మాత్రమే చాలదు. కాసిని జాగ్రత్తలు కూడా కావాలి.

చెమట లేదా స్వేదం చర్మం నుంచి ఉత్పత్తి అయ్యే ఒకరకమైన స్రావం. ఇది చర్మంలోని స్వేద గ్రంథుల నుంచి తయారవుతుంది. ఇది ముఖ్యంగా నీరు, వివిధ లవణాలతో కలిసి ఉంటుంది. స్వేదంలో కొద్దిగా యూరియా వంటి మలిన పదార్థాలుంటాయి. అయితే స్వేదానికి దుర్వాసన ఉండకపోయినా, చెమట పట్టడం వల్ల శరీరంపై అభివృద్ధి చెందే ప్రాపియోనీ బ్యాక్టీరియా పెరగడం వల్ల దుర్వాసన వస్తుంటుంది. (ఇలా దుర్వాసన రావడాన్ని బ్రామ్‌హిడరోసిస్ అంటారు). చెమట పట్టడం అనేది ఒక రకంగా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే విధానం. చెమట అధికమయినప్పుడు శరీరం మీద చెమటకాయలు ఏర్పడతాయి. వీటిని వైద్య పరిభాషలో ‘మిలీరియా రుబ్రా’ అంటారు
వేసవిలో వేడి మూలంగా చాలామందికి చర్మం పేలినట్లయి, చెమటకాయలు వస్తుంటాయి. జిడ్డు చర్మం గలవారికి ఈ సమస్య మరింత ఎక్కువ. ఇలాంటివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం.

చెమటకాయలు ఎలా వస్తాయి?

చర్మంలో ఎక్రైన్ స్వెట్‌గ్లాండ్స్ అనే చెమట గ్రంథులు ఉంటాయి. ప్రతి గ్రంథికి ఎక్రైన్ అనే ఒక నాళం (డక్ట్) ఉంటుంది. మన చర్మంలో సహజంగా స్టెఫలోకాకస్ ఎపిడెర్మిడిస్ అనే బ్యాక్టీరియా ఎప్పుడూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా వల్ల, మృత చర్మ కణాల వల్ల స్వేద రంధ్రాలు మూసుకుపోతాయి. స్వెట్ డక్ట్‌ కు అడ్డుపడి, చెమటకాయలలాగ తయారవుతుంది. ఒక్కోసారి ఈ చెమటకాయలలో చీము కూడా చేరుతుంది. దీనిని‘మిలీరియా పస్టులోసా అంటారు.

ఈ చెమటకాయలను నిర్లక్ష్యం చేస్తే, ఇవి పెద్ద పెద్ద గడ్డలుగా మారే అవకాశం లేకపోలేదు. దీన్ని పెరిపొరైటిస్ స్టెఫిలోజిన్స్ అంటారు. సాధారణంగా చెమటకాయలు వచ్చినచోట చెమట పట్టడం తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి చెమట పూర్తిగా ఆగిపోతుంది. ఎందుకంటే పగిలినట్టుగా అయిన స్వేద నాళిక ) పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి కొద్దిరోజులు పడుతుంది. చెమట పట్టకుండా ఆగిపోవడానికి ఇదే కారణం.

ఎవరికి వస్తాయి?

ఇవి పెద్దవాళ్ల కంటే పిల్లలకే ఎక్కువగా వస్తాయి. పుట్టిన బిడ్డ నుంచి సంవత్సరం లోపు వయసున్న పిల్లలలో అప్పుడే ఈ చెమటకాయల సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లలో ఈ స్వేదనాళం పూర్తిస్థాయిలో పనిచేయదు. అంటే అప్పటికి పూర్తిగా అభివృద్ధిచెందదు. అందువల్ల చెమట పట్టినప్పుడు, ఈ నాళిక త్వరగా పగిలినట్టు అయి, చెమట కాయలు వస్తాయి. ఇవి క్రింది కారణాల వల్ల వస్తాయి.

    చిన్నపిల్లలకు, పెద్దవారికి

    ఎండలో ఎక్కువగా తిరిగేవారికి,
    చల్లటి ప్రదేశాల నుంచి వేడి ప్రదేశాలకు తరలి వెళ్లిన వారికి,
    బిగుతుగా ఒంటికి పట్టేసినట్టు ఉండే వస్ర్తాలు ధరించేవారికి,
    జ్వరం వచ్చినవారికి,

చెమట పడితేనే చికాకుగా ఉంటుంది. అటువంటిది చెమటకాయలు వస్తే? చికాకు రెట్టింపు అవుతుంది. అంతేకాక ఏ పని చేయాలన్నా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే తగు జాగ్రత్తలు తీసుకుని ఈ సమస్యను ముందుగానే నివారించుకోవడానికి ప్రయత్నించాలి. ఎన్ని చేసినప్పటికీ చెమటకాయలు ఎక్కువ బాధిస్తుంటే మాత్రం చర్మవ్యాధుల నిపుణుడిని సంప్రదించడం మంచిది.

ఏయే ప్రదేశాలు

    చెమటకాయలు శరీరం మీద చాలా భాగాలలో కనిపిస్తాయి. ముఖం, మెడ, చర్మం ముడత పడే చోట, వస్ర్తాల ఒరిపిడి ఉండే చోట.
    పిల్లలలో - వీపు, మెడ, గజ్జలు, బాహుమూలాలలో. పెద్దవారిలో - మెడ, తల, వీపు, బాహుమూలాలలో

జాగ్రత్తలు

    కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ చెమటకాయల సమస్యను నివారించుకోవచ్చు.
    చెమట ఎక్కువ పట్టకుండా జాగ్రత్త పడాలి,
    వేడి వాతావరణం లోకి వెళ్లకూడదు,
    చల్లటి ప్రదేశాలు లేదా ఏసి ఉన్నచోట ఉండాలి,
    మందంగా ఉండి, శరీరాన్ని చుట్టేసేలాంటి వస్ర్తాలు ధరించకూడదు,
    బట్టల ఒరిపిడి లేకుండా చూసుకోవాలి,
    సాధ్యమయినంతవరకు పల్చగా ఉండే నూలు వస్ర్తాలు ధరించాలి,
    సబ్బును ఎక్కువగా వాడకూడదు,
    సన్‌స్క్రీన్ లోషనులు వాడాలి,
    పిల్లలు ఎండలో చెమటపట్టేలాంటి ఆటలు ఆడకూడదు,
    ఎక్కువ మంచినీరు తాగుతుండాలి.,

చికిత్స

ప్రిక్లీ హీట్ పౌడర్: ఈ పౌడర్‌లో డ్రయింగ్ మిల్క్ ప్రొటీన్, ట్రైక్లోజాన్, మెంథాల్ అనే పదార్థాలు ఉంటాయి. వీటిలోని మిల్క్‌ప్రొటీన్, ట్రైక్లోజాన్‌లు ఇన్‌ఫెక్షన్‌ని తగ్గిస్తాయి. మెంథాల్ శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తుంది.

    తరచు స్నానం, అంటే రోజుకి మూడు నాలుగు సార్లు చన్నీటి చేస్తుండాలి. సబ్బును ఎక్కువగా వాడకూడదు,
    క్యాలమిన్‌ లోషన్‌ను వాడాలి.
    జింక్ ఆక్సైడ్ వాడటం మంచిది,
    నిపుణుడైన వైద్యుని సలహా పై, ట్రోపికల్ కార్టికోస్టెరాయిడ్స్ లేదా
    ట్రోపికల్ యాంటీబయాటిక్స్ వాడాలి.

పైన చెప్పిన వాటిలో మొదటి రెండింటి (క్యాలమిన్ లోషన్, జింక్ ఆక్సైడ్) తో సమస్య తగ్గకపోతే, చర్మవ్యాధుల నిపుణుని (డెర్మటాలజిస్టు) సూచన మేరకు మాత్రమే (ట్రోపికల్ కార్టికోస్టెరాయిడ్స్, టాపికల్ యాంటీబయాటిక్స్) వాడాలి.

* కొన్నిసార్లు చుండ్రు కూడా నుదురు, బుగ్గల మీద చెమటకాయలు రావటానికి దోహదం చేస్తుంది. కాబట్టి చుండ్రు మరీ ఎక్కువగా ఉంటే చికిత్స తీసుకోవాలి. దిండు కవర్లను తరచుగా శుభ్రం చేసుకోవాలి. ముఖంపై జుత్తు పడకుండా చూసుకోవటమే కాదు.. చెమటకాయలు ఉన్నచోట స్క్రబ్స్‌ అసలే ఉపయోగించరాదనీ గుర్తుంచుకోవాలి.

* జిడ్డుచర్మం గల కొందరు పదే పదే సబ్బుతో ముఖాన్ని కడుక్కుంటూ ఉంటారు. ఇలా చేయటం మంచిది కాదు. దీంతో చర్మంలో పీహెచ్‌ స్థాయులు అస్తవ్యస్తమవుతాయి. అయితే వాతావరణం బాగా వేడిగా, తేమగా ఉన్నపుపడు మామూలు నీటితో ముఖాన్ని తరచుగా కడుక్కుంటే ఇబ్బందేమీ ఉండదు.

* ఉదయం, రాత్రి రోజుకి రెండుసార్లు ముఖాన్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత దూదితో చర్మం బిగుతుగా ఉండేందుకు దోహదం చేసే (ఆస్ట్రింజెట్‌) లోషన్‌ లేదా దోసకాయ రసం రాసుకొని.. 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.

* చెమటకాయలు వచ్చినచోట గోళ్లతో గోకటం ఏమాత్రం మంచిదికాదు. దీంతో ఇన్‌ఫెక్షన్‌ రావొచ్చు. బాగా దురద పెడుతుంటే మూడొంతుల నీరు, ఒకవంతు వెనిగర్‌ను కలిపి, అందులో దూదిని ముంచి దద్దు వచ్చినచోట అద్దాలి. ఇది దురద తగ్గటానికి తోడ్పడుతుంది. నీటిలో కొద్దిగా బైకార్బోనేట్‌ సోడాను కలిపి కడుక్కునా దురద తగ్గుతుంది. జిడ్డు కూడా తొలగిపోతుంది.

* గంధం అన్నిరకాల చర్మాలకీ బాగా పనిచేస్తుంది. ఇది మంచి యాంటీసెప్టిక్‌ మాత్రమే కాదు.. చర్మంలో తేమను పట్టి ఉంచే సామర్థ్యాన్నీ పెంచుతుంది. దురదనూ తగ్గిస్తుంది.

* గంధానికి కొద్దిగా రోజ్‌ వాటర్‌ను కలిపి ముద్దగా చేయాలి. దీన్ని చెమటకాయలు వచ్చినచోట అద్ది, 15 నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం కనబడుతుంది.

* పిడికెడు వేప ఆకులు తీసుకొని నాలుగు కప్పుల నీటిలో వేసి సన్నటి మంట మీద గంటసేపు మరిగించాలి. దీన్ని రాత్రిపూట అలాగే వదిలేసి, తెల్లారాక ఆకులను వడగట్టి ఆ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఆకులను కూడా ముద్దగా నూరి ముఖానికి పట్టించి పూర్తిగా ఆరిన తర్వాత కడిగేసుకోవాలి.

* అయితే చెమటకాయలు, దురద తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్‌ని సంప్రదించటం తప్పనిసరి.
  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/