కారణాలు :
- శరీరములో అధిక వేడి ,
- పొడి చర్మము ,
- ఎక్కువ సేపు నిలబడి పనిచేయువారికి ,
- కటిన నేలపై నడవడం ,
- ఎత్తైన చెప్పులు ధరించి నడవడం ,
- అధిక బరువు కలిగిఉండడం ,
- పోషకాహార లోపము ,
- మధుమేహ వ్యాది ,
- రొజూ నిద్రించటానికి ముందు కాళ్ళను శుభ్రపరుచుకుని తుడుచుకోవాలి .
- పగుల్లపై కొబ్బరి నూనె తో మృదువుగా మర్దన చేసి మందం గా ఉండే సాక్సులు ధరించాలి .
- ప్రతిరోజూ ఉదయం పాత బ్రష్ తో రుద్ది గోరువెచ్చని నీటి లో కడిగితే మురికి , మృతకణాలు పోయి నున్న గాతయారవుతాయి .
- అరటిపండు ను ముద్దగా చేసుకొని పగుళ్ళ పై రాసి పదినిముసాలు వుంచి తరువాత నీటి తో శుభ్రపరచుకుంటే పాదాలు మెత్త బడతాయి .
- గోరువెచ్చని నీటిలో కొంచెము నిమ్మరసం వేసి అందులో పదాలను వుంచి పది నిముషాలు తరువాత మామూలు నీటితో శుభ్రపరచుకుంటే పగుళ్ళ నొప్పి తగ్గుతుంది .
- ప్రతి రోజు సాయంత్రం రోజ్ వాటర్ ను పళ్ళెం లో వేసి పది నిముషాలు పాదాలు ముంచి ఉంచితే మృదువు గా తయారవుతాయి .
- నిమ్మరసము వ్యాజ్ లైన్ వేసిన గోఫువేచ్చని సబ్బు ద్రావనం లో పాదాలను పెట్టి 15 నిముషాలు అయ్యాక పొడి వస్త్రం తో తుడిచి నాణ్యమైన మాయిశ్చరైజర్ రాయాలి .
- ఉదయం వేజలైన్ తో కాళ్ళను మర్దన చేసుకుంటే పగుళ్ళు మెత్తబడి కొద్దిరోజులకు తగ్గిపోతాయి .
- రోజు మంచి పోషకాహారము తీసుకోవాలి .
- పాదాలు నిర్జీవంగా కనిపించినప్పుడు రెండు టేబుల్ స్పూన్ల పటికబెల్లం పొడిలో, పావుకప్పు బొప్పాయి గుజ్జు కలిపి మృదువుగా రుద్దాలి. అలా పావుగంట పాటు చేశాక గోరు వెచ్చని నీళ్లతో కడిగేసుకొని, తడి ఆరనివ్వాలి. ఆ తరువాత కొంచెం ఆలివ్ నూనెను తీసుకొని మరోసారి పదినిమిషాల పాటు మర్దన చేస్తే మృదువుగా తయారవుతాయి.
- అలాగే మృత-కణాల వల్ల కొన్నిసార్లు పాదాలు కాంతివిహీనంగా కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు పావుకప్పు పెసర పిండిలో చెంచా చొప్పున పంచదార, తేనె కలుపుకొని దానిలో బాగా రుద్దితే సరి. తరువాత వేడినీటిలో తువాలును ముంచి, ఆ నీటిని పిండేసి పాదాలకు కప్పాలి. ఇలా తరచూ చేస్తుంటే మురికీ, మృత కణాలూ దూరమవుతాయి.
- కాలి పగుళ్లు కొందరిని తరచూ ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటప్పుడు పావుకప్పు చొప్పున బొప్పాయి, కలబంద గుజ్జుల్ని తీసుకుని రెండు చెంచాల గంధం పొడీ, చిటికెడు పసుపూ, చెంచా ఆలివ్ నూనె కలిపి మెత్తని పేస్టులా చేసుకుని, దాన్ని పాదాలకు పూతలా వేయాలి.
- "Healit cream రోజు రెండు సార్లు పపసల్కు రాయాలి ,
- "Crackfoot Cream " రోజుకు రెండు సార్లు రాయాలి ,
- "Beclate-S" రోజుకు ఒకసారి వాడవచ్చును .
- ======================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.