గురక (Snoring) చాలా సాధారణమైన సమస్య. ఇది బాధితున్నే కాకుండా ఇతరుల్ని కూడా ఇబ్బంది పెట్టే సమస్య. ఇది మనిషి అనారోగ్యాన్ని సూచిస్తుంది .నిద్రలో గాలి పీల్చుకొంటున్నప్పుడు కొండనాలుకతో పాటు అంగిటిలోని మెత్తని భాగం కూడా అధిక ప్రకంపనలకు లోనైనప్పుడు గురక వస్తుంది. కొందరిలో ఇవి గాలి మార్గాలను పూర్తిగా లేదా అసంపూర్తిగా మూసివేసి నిద్రలేమికి కారణం అవుతుంది. ముక్కు ద్వారా గాలి పీల్చుకోలేని సందర్భాల్లో నోటితో గాలి పీల్చడం వలన ఈ గురక శబ్దం ఏర్పడుతుంది.
గుర్రు పెట్టేటపుడు నోరు మూతబడి ఉంటుంటే దానికి కారణము నాలుకగా గుర్తించాలి . నోరు తెరచి గుర్రు పెడుతుంటే సమస్య గొంతు కణాల లో ఉన్నట్లు .
కారణాలు
అసలు గురక ఎందుకు వస్తుంది...?
సాధారణంగా నిద్రించే సమయంలో ముక్కుతో గాలి పీలుస్తుంటాం. ఇలా ముక్కుతో గాలి పీల్చడంలో ఇబ్బంది ఎదురైతే మనకు తెలియకుండానే నోటి ద్వారా శ్వాసిస్తుంటాం. ఇలాంటి సందర్భంలో శ్వాసకోసం సంకోచ వ్యాకోచాలకు గురై నాలుక, అంగిటను నియంత్రించే కండరాల నియంత్రణ విఫలం అయినప్పుడు వచ్చే శబ్దమే గురక.
నిద్ర మాత్రలు వాడే అలవాటున్న వారు, ధూమపాన ప్రియులు, మత్తు పానీయాలు వాడే వారు ఈ గురక బారిన పడుతుంటారు. అంతే కాదు.. నాసిక రంధ్రాలు సరిగా పనిచేయకపోయినా, ముక్కు దిబ్బడతో బాధపడుతున్నా, టాన్సిల్స్ వాపు వున్నా కూడా గురక రావచ్చు. వయసు ముదరడం, మితిమీరిన భోజనం కూడా ఇందుకు కారణాలే.
ఇలా గురక పెట్టే వారికి నిద్రలేమి, పక్షవాతం, గుండె జబ్బులు, రక్త పోటు వంటి పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. సాధారణంగా ఈ గురక సమస్య పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. గురక పెట్టే స్త్రీలు అరుదుగా ఉంటారు. వృద్దాప్యం మీదపడే కొద్ది ఈ సమస్య అధికంగా ఉంటుంది. 50 ఏళ్ల వయస్సు దాటిన వారిలో దాదాపు 80 శాతం మంది గురక పెడతారు.
- స్థూలకాయం :
- గొంతు వాపు :
- ధూమపానం :
- ముక్కుదిబ్బడ, ముక్కులోఎలర్జీ, పెద్దగాపెరిగిన టాన్సిల్స్, ఎడినాయిడ్స్, ముక్కులోని దూలం వంకర, చిన్న మెడ (షార్ట్ నెక్), కింద దవడ ఇబ్బందులు, ఎతైన పై దవడ (హైఆర్చ్‌ప్యాలెట్) మొదలైనవి.
దీర్ఘకాలిక గురక వలన సరిగా ప్రాణవాయువు ఊపిరితిత్తులకు చేరక, ఊపిరితిత్తులు, గుండె, రక్తప్రసరణ మీద ప్రభావం చూపించవచ్చు. రాత్రి ఏడు గంటల నిద్రలో కనీసం 30మార్లు, 10సెకండ్ల కాలం పూర్తి శ్వాస ఆగితే (ఎప్నియా). దీనిని స్లీప్‌ఎప్నియా సిండ్రోమ్ అంటారు.
వైద్య సలహాలు
- లావుగా ఉన్నవారు బరువు తగ్గడానికి ప్రయత్నించాలి.
- నిద్రపోయేటప్పుడు పక్కకు తిరిగి పడుకోవటం అలవాటు చేసుకోవాలి. మంచాన్ని తలవైపు ఎత్తు ఉండేలాగాఅమర్చుకోండి.
- నీటి ఆవిరిలో యూకలిప్టస్ తైలాన్ని వేసి ఆవిరి పడితే శ్వాస మార్గాలు తెరుచుకొని గురక తగ్గుతుంది.
- ఏదైనా పదార్ధము ఎలర్జీ ఉన్నట్లైతే వాటిని తినడం మానివేయాలి . Cetrazine tab. daily one for 1 week వాడాలి .
- సమస్యకు మూలకారణము వైద్య పరీక్షలు ద్వారా తెలుసు కొని చికిత్స తీసుకోవాలి .
- తీవ్రమైన గురకకు, స్లీప్‌ఎప్నియా సిండ్రోమ్ - అంగిలి, గొంతులోపల ఇతర భాగముల పొరలను తగ్గించి శ్వాసబాగా ఆడేలాగా చేసే యు.పి.పి.పి. ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. లేజర్ పద్ధతిలో కూడా శస్త్ర చికిత్స చేయవచ్చు.
యాంత్రికంగా ఈ గురకను నివారించేకన్నా ప్రకృతి సిద్ధమైన పద్దతుల ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు. అవేంటో ఒకసారి చూద్దాం...!
నిద్రించే పొజిషన్‌ను మార్చండి:
సాధారణంగా ఈ గురక సమస్య ఉన్న వారు వెళ్లికిలా(ఆకాశం వైపు చూస్తూ) పడుకుంటారు. అలా చేయడం వల్ల ఈ సమస్య అధికమవుతుంది. అటువంటి వారు ఓ పక్కకు తిరిగి పడుకోండి. ఎత్తుగా ఉన్న తలగడ వాడండి. లేదా రెండు తలగడలను ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల గురకను నియంత్రించవచ్చు.
బరువు తగ్గండి:
గురక పెట్టడానికి ఒబేసిటీ(ఊబకాయం) కూడా పెద్ద సమస్య. కాబట్టి వీలైనంత వరకూ బరువు తగ్గండి, ఫలితం ఉంటుంది.
మధ్యం, ఉపశమనకారకాలకు దూరంగా ఉండండి:
చాలా మంది గురక నివారణకు ఉపశమనకారకాల(మధ్యం, నిద్రమాత్రలు.. వంటివి)ను వాడుతుంటారు. కానీ.. శాస్త్రీయంగా నిరూపించబడింది ఏంటంటే.. ఉపశమనకారకాల వల్ల కూడా గురక సమస్య అధికమవుతుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు.
నిద్రకు ఉపక్రమించే ముందు ఆవిరి పీల్చండి:
నాసికా రంధ్రాల సమస్య ద్వారా ఈ గురక వస్తుంది. కాబట్టి నిద్రకు ఉపక్రమించే ముందు వేడి నీటి ద్వారా ఆవిరిని పీల్చండి.
ఆహారపు అలవాట్లను మార్చుకోండి:
నిద్రించే ముందు తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించటం వల్ల కూడా ఈ సమస్యను నివారించవచ్చు. డైరీ ఉత్పత్తులు, కేక్స్, కుకీస్, పిజ్జా వంటి ఆహారాన్ని తీసుకోకండి. నిద్రించే ముందు హెవీ ఫుడ్‌కు బదులు లైట్ ఫుడ్ తీసుకోవడం మంచిది.
పైనచెప్పిన చిట్కాలను పాటించటంతో పాటు నిద్రించటానికి సరైన సమయాన్ని పాటించండి, ధూమ పానాన్ని మానేయండి. అప్పటికీ ఈ సమస్య అదుపులోకి రాకపోతే సరైన వైద్యుని కలిసి చికిత్స చేయించుకోవడం మంచిది.
ఆయువేదిక్ చికిత్స : సైలెన్స్(Silence) అనే నేషల్ స్ప్రే (Nasal Spray) ని ప్రతిరోజూ నిద్రకు ముందు వాడాలి .
- ================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.