Thursday, November 19, 2009

జలుబు తగ్గడానికి టిప్స్, Cold Treatment tips









సైన్స్ ఎంతగా అభివృద్ది చెందినా ఇంకా పరిస్కారము కాని సమస్యలు అనేకం ఉన్నాయి . మనిషికి సంభవించే అనేక అనారోగ్యలము మందులు కనుగొన్నా ప్రతి ఒక్కరికీ వేధించే జలుబుకి (common cold) ప్రత్యేకం గా చికిత్స నేటివరకు సాధ్యము కాలేదు .
వాతావరణంలో మార్పు చోటుచేసుకొన్నప్పుడల్లా ముక్కు మొరాయస్తుంది. పడిశం పట్టి పీడిస్తుంది. జలుబు చేస్తున్నట్టు అనీ అనిపించగానే తుమ్ములు, ముక్కునుంచి నీళ్లు కారడం లాంటివి బయటపడతాయ. అందుకే పడిశం పదిరోగాలపెట్టు అంటారు. పడిశం చేయగానే తలనుంచి పాదం దాకా అన్ని అవయాలు నొప్పి అనిపిస్తాయ. గాలి ఆడకుండా ముక్కు దిబ్బడి వేసినట్టుగా ఉంటుంది.

జీవితంలో ఎప్పుడో ఒకసారి జలుబు బారినపడని మని షంటూ ఎవరూ ఉండరు.చిన్న పిల్లలనుంచి వృద్ధుల దాకా ప్రతివారూ ఎప్పుడోఒకప్పుడు జలుబుబారిన పడుతుంటారు. జలుబు మనిషికి ఎంతటి సహజమైనదో, అంతటి సర్వసాధారణమైనది. సగటున మనిషి ఏడాదికి రెండుసార్లు అయినా జలుబుతో బాధపడుతుంటాడని అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ వారి అంచనా. జలుబు రావడానికి కనీసం 200 పైచిలుకు వైరస్‌లు కారణంగా ఉంటాయి. మనిషినుంచి మనిషికి మారుతున్న కొద్దీ ఈ వైరస్‌ల జన్యు నిర్మాణం మారిపోతుంటుంది. అంటే భార్యాభర్తలలో ఒకరినుంచి మరొకరికి జలుబు అంటుకుంటే, ఆ ఇద్దరి జలుబు ఒకటి కాదన్నమాట. అయితే, ముక్కు చీదడం, తుమ్మడం, దగ్గడం వంటి లక్షణాలు మాత్రం ఇద్దరిలోనూ ఒకే విధంగా ఉంటాయి.

అపోహలు
జలుబు విషయంలో మనుష్యులలో రకరకాల అపోహలు చోటు చేసుకుని ఉన్నాయి. వర్షంలో తడిస్తే...వర్షంలో తడిస్తేజలుబు చేస్తుందని చాలామంది భావిస్తారు. వర్షంలో తడిసినంత మాత్రం చేత జలుబు చేయదు. నిజానికి జలుబు మూసి ఉన్న తలుపులోపలే,అంటే ఇంటిలోపలే అంటుకుంటుంది. జలుబు వైరస్‌లు మాయిస్ట్‌ హీట్‌లో వృద్ధి చెందుతాయి. అంటే మీరు బైట వర్షం కురుస్తున్నప్పుడు ఇంటిలోపలే ఉంటారు.గదిలోపలి చెమ్మగిల్లిన వేడి వాతావరణంలో వైరస్‌ వలన జలుబు చేస్తుంది.



ఇది వర్షాకాలము , ఆపైన వచ్చేది చలి కాలము లోను , వర్షం లో తడవడము , చలికాలపు మంచులో తిరగడము వల్ల ప్రతి వక్కరినీ వేధిస్తుంది ఈ జలుబు . ముక్కు కారడం తో మొదలై తలనొప్పి , జ్వరము , దగ్గు , వల్లునోప్పులు తలబరువుగా ఉండడం వంటి లక్షణాలు ఉన్నా ఈ జలుబును రాకుడా చూసుకోవడమే మంచిది ... ఒక వేళ వచ్చినా మందులు వాడినా వాడకపోయినా ఒక వారము రోజులలో తగ్గుముఖం పడుతుంది . ఈ జలుబునే ఎలర్జీ జలుబు అంటాము. కాని కొన్ని వైరస్ క్రిముల వల్ల వచ్చే జలుబు అయితే మాత్రం డాక్టర్ ని సంప్ర డించాల్సిందే . జలుబు ముఖ్యము గా పిల్లలను పట్టి పీడిస్తుంది . . . ఇది వైరస్ వల్ల నే వస్తుంది .

టిప్స్ :

1 . వ్యాపించే విధానము : సాధారణ జలుబు ఒకరి నుండి మరొకరికి స్పర్శద్వారా , గాలిద్వారా , వస్తువుల ద్వారా వ్యాప్తిచెండుతుంది . చేయిగాని , కర్చీప్ గుద్దగాని తుమ్మ , దగ్గు వచ్చినపుడు అడ్డం గా పెట్టుకోవాలి .

2. జలుబు క్రిములు తుమ్మినా , దగ్గినా చుట్టుప్రక్కల ఉన్నా వస్తువులపై పడి ఇతరులకు వ్యాప్తిచెందుతాయి కావున చేతులు సబ్బుతో సుబ్రం గా కడుగుకోవాలి .

౩ . జలుబు ఉన్నపుడు నోరు పాడవుతుంది , జ్వరం వస్తుంది కావున ఎంతోకొంత డీహైడ్రేషన్ వస్తుంది . నీరు ఎక్కువగా త్రాగాలి ... సుమారు 1.5 నుండి 2 లీటర్ల నీటిని త్రాగాలి . నీరు తాగడానికి ఇష్టం లేనపుడు ఏ ద్రవ రూపములోనైనా నీరు తీసుకోవచ్చును .

4. జలుబు వల్ల కలిగే నీరసము పోవడానికి మంచి ఆహారము తీసుకోవాలి . వేడి పదార్ధాలు తినాలి . తేలికగా జీర్ణం అయ్యే ఆహారము నే తీసుకోవాలి . ఉడికించిన కూరలు , పాలు , రోగనిరోధక శక్తిని పెంచే నిమ్మజాతి పదార్ధాలు తిననాలి .

5. జలుబు ఉన్నవారు విశ్రాంతి తీసుకోవాలి . ఆఫీసుకి , పనులకు వెళ్ళకూడదు . తలుపులు మూసిన గదిలో ఉండకుండా బాగా గాలి వచ్చే ప్రదేశం లో విశ్రాంతి తీసుకోవాలి , చల్లని గాలి , మంచు లో తిరగకూడదు . తక్కువ తేమ , ఓ మోస్తరు వేడి ఉన్నా గదిలో ఉన్న్డాలి .

6. జలుబు ఉన్నా వారు బాగా అలిసిపోయే పనులు చేయకూడదు ... అలాగని ముసుగుతన్ని పడుకోకూడదు . ఉసారుగానే తిరగాలి . చురుకుదనం వల్ల శరీరము లోని రోగనిరోధక శక్తి మెరుగు పడుగుంది .

7. జలుబు ఉన్నవారు వేడినీరు స్నానం చేయండి . తలస్నానం చేయకూడదు . వేడినీరు స్నానం శరీర రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది .
8. జలుబుకి వాడే ఆయింట్ మెంట్లు ముక్కు కు రాయవచ్చును , వేడినీటిలో వేసి ఆవిరిపీల్చడం మంచిది .
9. మత్తుపానీయాలు తీసుకోకూడదు . పొగ తాగకూడదు . ఐస్ క్రీములు , చల్లని కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు .
10. గొంతు నొప్పి ఉంటే జలుబు లేపనములు (ointments) గొంతు పైన రాయవచ్చును . వేడి కాఫీ , తీ , పాలు తీసుకుంటే గోతులో గురగుర తగ్గుతుంది .

చికిత్స చేస్తే వారం రోజుల్లో తగ్గిపోతుంది. చికిత్స చేయకపోతే ఏడురోజులకు తగ్గుతుంది... అనేది జలుబుకు సంబంధించి చెప్పే ఓ పాత సామెత. అంటే వైద్యం చేసినా, చేయకపోయినా జలుబు వస్తే ఓ వారం పాటు బాధపడక తప్పదు అనేదే ఈ సామెతలోని అంతరార్థం.

సాధారణ జలుబు

ఎలా వస్తుంది?
జలుబు తో బాధపడుతున్నవ్యక్తి తుమ్మినా,చీదినా అందులోంచి వచ్చు వైరస్ క్రిములు గాలి తుంపర్లుగా వ్యాపిస్తాయి.ఈ వైరస్ కలిగిన తుంపర్ల గాలిని దగ్గరలో వున్న ఇతరులు పీల్చితే వారికి జలుబు వస్తుంది.
జలుబు వున్న వ్యక్తి ఎవరినైనా ముక్కుతో కాని,చేతులతో కాని తాకినా జలుబు వ్యాపిస్తుంది. జలుబు వున్న వ్యక్తి చీదిన, పెన్ను,టవలు,చేతిరుమాలు,పుస్తకాలు,కాఫీ కప్పుల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది.జలుబు కారక వైరస్ లు ఈ వస్తువుల ద్వారా అధికంగా వ్యాపిస్తాయి.
చలి వాతావరణ ప్రభావము వలన జలుబు ప్రధానంగా వ్యాపించదు.ఈ వాతావరణ మార్పు జలుబు వ్యాప్తిలో పెద్దగా ప్రభావితము చూపించదు.
ఎంతకాలం వుంటుంది?

* జలుబు సోకిన వ్యక్తి ఎంతకాలము బాధ పడతారు అన్నది వారి వ్యక్తిగత వ్యాధి నిరోధక శక్తి పైన,ఆ వైరస్ రకాల పైన ఆధారపడి వుంటుంది.
* సాధారణంగా జలుబు 2 - 7 రోజుల మధ్య ఉంటుంది.విపరీతమైన జలుబు, దగ్గుతో కూడిన జలుబు వారం నుండి రెండు వారాల వరకు వుండవచ్చును.

జలుబు తగ్గించే విధానాలు: -

* ఆహారం:-జలుబు ఉన్నప్పుడు,కొవ్వు పదార్ధాలు, మాంసము, పాల వుత్పత్తులు తక్కువగా తీసుకోవడం మంచిది.
* తాజా పళ్ళ రసాలను, కాయకూరలు అధికంగా తీసుకోవాలి.
* మాంసాహారము తీసుకొనే వారు ఒక కప్పు వేడి వేడి చికెన్ సూప్ తీసుకొనుట వలన కాస్త ఉపశమనము వుంటుంది.
* వేడి నీటి ఆవిరి తీసుకోవడం ద్వారా ముక్కు దిబ్బడ, దగ్గు తగ్గుతాయి.
* గోరు వెచ్చని వేడి నీళ్ళు తీసుకోవడం మంచిది.



అంతా బాగానే ఉంది. మరి వారం రోజులపాటు జలుబు పెట్టే నరకయాతనతో భరించేదెలా... ? జలుబు బాధలు తగ్గేందుకు ఇంగ్లీషు వైద్యంలో ఇప్పుడు బేషైన మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే జలుబులాంటి కారణాలకు కూడా అదేపనిగా మందులు మింగుతూ కూర్చుంటే ఎలా... ? అని ప్రశ్నించేవారికోసం ఇవిగో కొన్ని చిట్కాలు...

వేడి పాలల్లో చిటెకెడు పసుపు కలుపుకుని తాగితే జలుబు వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి.
అలాగే పొద్దున్నే వేడి పాలల్లో మిరియాల పొడి, కాస్త శొంఠి పొడి కలుపుకుని వేడి తగ్గకుండా చేస్తే జలుబు బాధల నుంచి చక్కని ఉపశమనం లభిస్తుంది.
ఓ గిన్నెలో వేడి నీరు పోసి అందులో పసుపు కాస్త జంఢూబామ్ వేసుకుని ఆవిరిపడితే జలుబు వల్ల మూసుకుపోయిన ముక్కు వెంటనే తెర్చుకుంటుంది.
వీటితో పాటు తులసి, అల్లం రసాన్ని తేనెతో కలిపి సేవిస్తే జలుబు తీవ్రత వెంటనే తగ్గుతుంది.
ఓ గ్లాసు వేడి నీటిలో ఒక నిమ్మకాయ రసం పిండి, రెండు చెంచాల తేనె కలిపి రోజు పరగడుపున తాగితే జలుబు తగ్గుతుంది.

ఇలా పైన చెప్పిన చిట్కాల్లో అవసరమైన వాటిని పాటిస్తే జలుబు తీవ్రత ఓ నాలుగైదు రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. ఒకవేళ వారం పదిరోజులు దాటినా జలుబు తీవ్రత తగ్గకుంటే వైద్యుని సమక్షంలో పరీక్షలు చేసుకోవడం మంచిది.

చికిత్స :

జాగ్రత్తలు
క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వలన మనలోని రోగనిరోధక యంత్రాంగం బలోపేతమవుతుంది. తద్వారా జలుబులాంటి అస్వస్థతలు మన దరికి రాకుండా ఉంటాయి.నడక, జాగింగ్‌, ఈతకొట్టడం, సైకిల్‌ తొక్కడం వంటివి రోజుకు ఒక అరగంట చేస్తే సరిపోతుంది.

మానసిక వత్తిడి
మీరుగమనించారో లేదో కాని, పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నప్పుడు లేదా ఏవైనా తీవ్ర ఇబ్బందులలో ఉన్నప్పుడు ఎక్కువగాజలుబు చేస్తుంటుంది. మాన సిక వత్తిళ్లు మనలో రోగ నిరోధక శక్తిని దెబ్బ తీయటం అందుకు కారణం.

నీళ్లు ఎక్కువ తాగాలి
మంచినీరు, టీ, పళ్ల రసాలు మొదలైన ద్రవ పదార్థాలు పుష్కలంగా లోపలికి తీసుకుంటే మనం జలుబుకు దూరంగా ఉంటామని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

తలుపులు తెరిచి ఉంచండి
జలుబు చేసిన మనిషి దగ్గినా, తుమ్మినా మిలియన్ల కొద్దీ వైరస తుంపరలు గాలిలో వ్యాపిస్తాయి. అందుకే జలుబు చేసిన మనిషి దగ్గుతున్నప్పుడూ, తుమ్ముతున్నప్పుడూ నోటికి చేతిని అడ్డంపెట్టుకోవటం మంచిది. జలుబు చేసిన మనిషి ఇంట్లో ఉండి, ఆ ఇంటి కిటికీ తలుపులు మూసేసి ఉంటే, అతడు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు జలుబు వైరస్‌లు బైటికిపోయే వీలులేక ఇంటిలోపలే ఉండిపోయి మిగతా వాళ్లకు తేలికగా అంటుకుంటాయి.

తేమ వాతావరణం
పొడి వాతావరణంలో జలుబు వైరస్‌లు తేలి కగా వ్యాప్తి చెందుతాయి. తేమ వాతావరణంలో వ్యాప్తి చెందవు.
విశ్రాంతి
కొందరు జలుబు చేసినప్పుడు ఒంట్లో బాగులేదంటూ ఆఫీసునుంచి లేదా, కాలేజినుంచి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటారు. జలుబు చేసిన ప్రతివారూ ఈ పద్ధతి పాటించడం మంచిది. దాని వలన ఇతరులకు జలుబు అంటకుండా కాపాడిన వారవుతారు.

తగ్గించే మార్గాలు
విటమిన్‌ సి : విటమిన్‌ సి, పెన్సిలిన్‌ లేదా యాంటి బయాటిక్స్‌లాంటివి జలుబును తగ్గిస్తాయనుకోవడం భ్రమ మాత్రమే. యాంటిబయాటిక్స్‌ వంటివి బాక్టీరియా వలన వచ్చే ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించడానికి ఉపకరిస్తాయి తప్ప వైరస్‌ వలన వచ్చే జలుబులాంటి అస్వస్థలకు ఉపయోగపడవు. విటమిన్‌ సి మన శరీరంలో ఉండే నానాచెత్తనూ బైటికి పారదోలే స్కావెంజర్‌లా పని చేస్తుంది. జలుబును అది పూర్తిగా తొలగించలేదు కాని, వారం రోజుల పాటు ఉండే దాని రెండు మూడు రోజుల్లో తగ్గిపోయేట్లు చేస్తుందని అంటున్నారు ఈ విషయంలో నిష్ణాతులైన డాక్టర్లు.

ఆహారం
జలుబు చేసినప్పుడు కొవ్వు గల ఆహార పదా ర్థాలు, మాంసం, పాల ఉత్పత్తులను తక్కువగా తీసుకోండి. తాజా పళ్ల రసాలు, కాయగూరలను ఎక్కువగా తీసుకోండి.

సిగరెట్లు మానండి
పొగ తాగడం వల్ల గొంతు మండుతుంది. జలుబు ఆ మంటను మరింత పెంచుతుంది. ముక్కులోపల ఉండే సిలియా అనే చిరు వెంట్రుకల లైనింగ్‌ ముక్కులోనికి ప్రవేశించే బాక్టీరియా గొంతులోకీ, ఊపిరితిత్తులకూ పోకుండా అడ్డుకుంటుంది. ఇన్‌ఫెక్షన్‌తో పోరాటం జరిపే సిలియా చర్యలను పొగతాగడం నిరోధిస్తుంది. కనుక జలుబు రోజులలోనైనా పొగ తాగడాన్ని తగ్గించడం లేదా మానుకోవడం మంచిది.

ఉప్పునీటి పుక్కిలింత
జలుబుతో బాధపడుతున్నప్పుడు ఉదయాన, మధ్యాహ్నం, సాయంత్రం ఉప్పునీటిని గొంతులో పోసుకుని పుక్కిలించడం వల్ల కొంత రిలీఫ్‌ లభిస్తుంది.

ఆవిరి కాపడం
ఇది మన పెద్దవాళ్లు పాటించే పద్ధతే. ఒక గిన్నెలో బాగా మరుగుతున్న నీటిని తీసుకుని అందులో కొంత విక్స్‌ను కాని, అమృతాంజన్‌ను కాని కలిపి తల మీద దుప్పటి కప్పుకుని ఆ ఆవిరిని గాఢంగా ముక్కుద్వారా లోపలికి పీల్చుకోవడం వల్ల జలుబు తాలూకు ముక్కు దిబ్బడ, దగ్గు తగ్గుతాయి.

జలుబుకి ... మార్కెట్ లో దొరికే (Anticold)జలుబు మాత్రలు వాడవచ్చు . ఉదా : Zincold , Coldact ,
జ్వరానికి : పారాసెటమోల్ (Paracetamol)
దగ్గుకి : ఏదైనా దగ్గుమందు ను తీసుకోవచ్చు . ఉదా : DM , Tossex , instaryl.
వాళ్ళు నొప్పులకు : Combiflame , dolomed , acelonac 750 ,
అప్పటికి తగ్గకపోతే వైద్య సలహా పొందాలి .

ఆవిరితో జలుబుకు చెక్‌
చినుకుల కాలమిది. జలుబు, ముక్కుదిబ్బడ, సైనస్‌ వంటి సమస్యలు కొందరిని తరచూ బాధిస్తాయి. వాటిని నివారించాలంటే అదేపనిగా మందులు వేసుకోవడం కాదు.. ఇలాంటి చిట్కాలు పాటించి చూడండి.

పెద్ద గిన్నెలో మరిగించిన నీరు తీసుకుని మధ్యకు కోసిన రెండు ఉల్లిపాయ మక్కలు వేయండి. ఈ నీళ్లతో కనీసం పదిహేను నిమిషాలు ఆవిరిపట్టండి. జలుబుతో మూసుకుపోయిన ముక్కు నుంచి శ్వాస తీసుకోవడం తేలికవుతుంది. జలుబు ఉన్నా లేకపోయినా సరే.. వారానికోసారి యూకలిప్టస్‌ నూనె వేసిన నీటితో ఆవిరిపట్టండి. దీనివల్ల శ్వాససంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి.

ముఖానికి చేసే మర్దనతో సైనస్‌ చాలామటుకు అదుపులో ఉంచుతుంది.చూపుడు వేళ్లను రెండు కనుబొమల మధ్యలో ఉంచి.. సున్నితంగా మర్దన చేయాలి. ఇప్పుడు కనుబొమల చివర్ల వేళ్లను ఉంచి... గుండ్రంగా తిప్పాలి. ఇలా తరచూ చేస్తుంటే.. సమస్య అదుపులో ఉంటుంది.

తులసి, మిరియాలతో చేసే కషాయం జలుబు సమస్యను అదుపులో ఉంచుతుంది. జలుబు, ముక్కుదిబ్బడ ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా యూకలిప్టస్‌ నూనెను రుమాలుపై వేసుకుని వాసన పీల్చితే మార్పు ఉంటుంది.




-- డా.వందనా శేషగిరిరావు యం.బి.బి.యస్ .

Tuesday, November 17, 2009

అందం గా ఉండడానికి టిప్స్ , Tips for beauty




అందం గా ఉండాలనే కోరిక ప్రతిఒక్కరిలొనూ ఉంటుంది . నేడు ఆ అందచందాల్ని పొందడానికి బ్యుతీపార్లర్లను ఆశ్రయిస్తునారు . .. లేదా వివిధ రకాలైన వ్యాపార ప్రకటనలను చూసి ప్రభావితమవుతునారు . ఈ కృత్రిమ రసాయన ఉత్పత్తుల వాడకం వల్ల అందచందాలు వస్తాయో లేదో కాని కొన్ని చరం సమస్యలు తలెత్తుతున్నాయి .

కుంకుమ ,కాటుక , తిలకం వంటివన్నీ సౌందర్య సాధనాలే . పసుపు , పెరుగు , మీగడ , కోడిగుడ్డు వంటివాటివన్నీ ఉపయోగించుకొని చర్మ సౌందర్యం పెంచుకోవచ్చును . కొన్ని టిప్స్ చూద్దాం .

టిప్స్ :

1 . ముఖ చర్మం కోమలం గా కనిపించేందుకు ప్రక్రుతి ప్రసాదించిన టమాటో చాలు . తాజా గా ఉన టమాటో లను బాగా చితకకొట్టి అలా వచ్చిన రసానికి రెండు చెంచాల పాలు కలుపగా వచ్చిన గుజ్జును ముఖానికి రాసుకుని పది , పదిహేను నిముషాలు ఉంచి ఆ పైన నీటితో కడుక్కోవాలి . దీనివలన చర్మం పైన మ్రుతకనాలు తొలగించబడతాయి . పైగా చర్మం లోపలికి వెళ్లి శుభ్రం చేస్తుంది . ముఖం పైనుండే జిడ్డు తొలగిపోయి చర్మానికి తాజాదనాన్ని , కాంతిని ఇస్తుంది .

2. ముకం మీద ముడతలు వస్తే ముసలితనాన్ని ఎత్తిచుపుతుంది .. దీనికిగాను పైనాపిల్ రసం , యాపిల్ రసం , నిమ్మరసము ఒక్కో స్పూను చొప్పున్న తీసుకొని బాగా కలియబెట్టి ముఖానికి పట్టించి , ౧౫ -౨౦ నిముషాలు ఉంచి ముఖం కడుగుకోవాలి . ముడతలు తగ్గిపోతాయి ..ఒక వారం రోజులు చేస్తే .. ఇలా ప్రతి వారం ఒకసారి చేయాలి .

3 . జిడ్డు ముఖం ఉన్నవారు విచారించానవసరం లేదు ... ముఖం మీద గుడ్డు సొనను రాసుకోండి . ముఖం ఎండిన రీతిలో నుంటే పచ్చ సోన ను తీసుకొని బాగా గిలకకొట్టి ముఖానికి రాసుకొని 15 నిముషాలు ఉంచి కడుక్కోవాలి . గుడ్డు సోనలు రెండు చరం మీదుండే రంధ్రాల వెడల్పును తగ్గించి , ముఖకారమం ముడుతలు రాకుండా చూస్తాయి . మడుదటలు తగ్గిస్తాయి . ప్రతి వారం ఒక రోజు చేయాలి .

4 . ముఖానికి వెలుగుకోసం ... గులాబి రంగుకోసం కాళ్ళు కొంచం ఎత్తు లో ఉన్నాట్లు పడుకోవాలి ... ఇలా చేయడం వలన మెడకు , ముఖానికి ,తలకి రక్తం సరఫరా ఎక్కువై గులాబీ రంగు ఛాయా ముఖం పై వెలుగుతుంది . వారానికి మూడు రోజులు చేస్తే సరిపోతుంది .

5. అందానికి పండ్లు పనికొస్తాయి ... ఒక స్పూన్ బొప్పాయి గుజ్జు , ఒక స్పూన్ ద్రాక్ష గుజ్జు , ఒక స్పూన్ నిమ్మరసం ముద్దలా తయారుచేసి ముఖానికి పట్టించి , 15 - 20 నిముషాలు ఉంది ముఖం కడుక్కోవాలి . ముఖ చర్మం బిగుతుగాను , కాంతివంతం గాను ఉంటుంది .

6 . ముఖం తజదనానికి ... తాజా మీగడను ముఖం మీద నెమ్మదిగా మర్ధనచేయాలి సుమారు ౧౫ నిముషాలు చేసి కడుగుకోవాలి . ముఖచారం మీద ఉన్న మృతకణాలు రాలిపోయి తాజాదనం వస్తుంది.

7 . ముఖం అందం లో శిరోజాల పాత్ర ... అందుకే వాటికి తగిన కన్డిసనర్ వాడాలి . అరటి , దోస , తమటోల గుజ్జు పెరుగు కలిసి తయారు చేసుకున్న ముద్దను శిరోజాలకు పట్టించి ఒక గంటసేపు ఉంది , ఆ తర్వాత శాంఫో తో తలస్నామం చేయాలి . శిరోజాలు చక్కగా వెలుగునిస్తూ కొత్త అందాన్నిస్తాయి .

8 . అందానాని కి ఆహారము పాత్ర .... అందం కోసం ఎన్ని రకాల భాహ్య సాధనాలు వాడినా అసలు అందం శరీర ఆరోగ్యం ద్వారానే వస్తుంది . ఆకుకూరలు , పండ్లు , పాలు , వారి , గోధుమ మున్నగు వాటితో సంపూర్ణ ఆహారము తినాలి . యాంటి ఆక్షిదేంట్లు ఎక్కువగా తీసుకోవాలి ... క్యారత్స్ , గుడ్లు , పాలు మున్నగునవి .

9 . అందానికి కళ్లు పాత్ర .... ముఖానికి అందం కల్లనుండే వస్తుంది . కళ్లు కాతివంతం గా ఉండాలి , అలసిన కళ్లు అందాన్ని పాడు చేస్తాయి . కీర ముక్కలు కళ్లు మీద పెట్టుకుంటే అలసతపోతుంది . చల్లని దోసముక్కలైతే మంచిది . కనుబొమలు , కనురెప్పలు అందం గా ఉంచాలి . కాటుక కొద్దిగా పెట్టుకోవాలి .

10 . ముఖం మీద నల్ల మచ్చలు ముఖం అందం పాడుచేసతాయి . " బ్లాక్ హెడ్స్ గా " పేర్కొన్న వీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి . పెరుగు , నల్లమిరియాలపొడి , కలిపిన ముద్దను ముఖం మీద ఉంచి ౧౫- ౨౦ నిముషాల తరువాత కడుక్కోవాలి ... బ్లాక్ హెడ్స్ రారిపోతాయి .

11 . అందానికి వ్యాయామము పాత్ర .... వ్యాయామం చేయడం వల్ల శరీరం లోని మలినాలు పోయి చర్మమ కాంతివంతం గా తయారువుతుంది . వ్యాయామము వలన రాకతప్రసరణ పెరిగి శరీర ఆరోగ్యం బాగుపడుతుంది .. అందువల చర్మ కణాలు కాన్తివంతమవుతాయి .

12. అందానికి నిద్ర పాత్ర .... ఆరోగ్యానికి , నిద్రకు ప్రత్యక్ష సంభందం ఉన్నది . తగినంత నిద్ర లేకపోతె దాని ప్రభావం శరీర ఆరోగ్యం పై పడుతుంది . నిద్ర లేమి కళ్లు అలసటగా కనిపిస్తాయి . అందవిహీనం గా కనిపిస్తాయి . నిద్రలో అనేక శరీర కణాలు రిపేరు జరుగు తాయి . కొత్తకనాలు తయారవుతాయి . కొత్త కణాలు కొత్త అందాన్ని నిస్తాయి .

సౌందర్యానికి అమ్మ చెప్పిన చిట్కాలు :
1. కళ్ళు :
మన శరీరంలో ప్రధానమైనవి.అందుకే మన పెద్దలు "సర్వేంద్రియాణాం నయనం ప్రధానం" అన్నారు.మరి అంతటి ప్రాధాన్యం ఉన్న కనులకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం? పాతకాలంలో ఐతే కళ్ళకు చక్కగా కాటుక పెట్టుకునేవారు స్త్రీలతో పాటు పురుషులు కూడా!!కానీ రాను రాను కాటుక పెట్టుకునే వారు తక్కువ అయ్యారనే చెప్పాలి.కాటుక లో ఉండే సుగుణాలు చెప్పటం అసాధ్యం.మన పెద్దలు ఏ పని చేసినా దానికి ఖచ్చితంగా ఒక మంచి కారణం ఉంటుంది.అందుకే ఈ పోస్ట్ లో నేను మీకు ఒక మంచి కాటుకకు సంబంధించిన చిట్కాను అందించబోతున్నాను.దీన్ని మీరే ఇంట్లో తయారుచేసుకుని మీ కళ్ళ సమస్యలను పోగొట్టుకోవచ్చు.దీన్ని ఎప్పటికప్పుడు తయారుచేసుకోవచ్చు.దీనికి కావలసినవి..పెద్ద ఉల్లిపాయ రసం, మంచి తేనె, ఒక్క నలుసు పచ్చ కర్పూరం.ఒక్క బొట్టు ఉల్లిరసం తీసుకుని ఒక ప్లేట్ లో వేసి అందులో ఒక్క చుక్క తేనె,ఒక్క నలుసు పచ్చ కర్పూరం వేసి బాగా కలిపితే కాటుక వస్తుంది. దీన్ని రోజూ కళ్ళకు పెట్టుకోవటం వల్ల కంట్లోని పొర, నలుసులు, దృష్టి లోపం వంటి సమస్యలు కేవలం 20 రోజుల్లోనే నివారించబడతాయి.

2, ఉబ్బసం తో బాధ పడేవారికి :
ఉబ్బసం తో బాధ పడేవారికి ఒక మంచి "మన అమ్మ" చిట్కా.. రాత్రి పడుకునే ముందు రెండు యాలకులు (ఇలాచి)ను, దంచి లోపలి గింజలను తినాలి. అంతే ఇక ఆ రాత్రి ఉబ్బసం మిమ్మల్నిబాధించదు .

3 . అందమైన పాదాల కోసం :
పాదాలు కోమలత్వాన్ని సంతరించుకోవటానికి ఏం చేయాలో "మన అమ్మ"చిట్కా లో తెలుసుకుందాం.ఇంతకు ముందు నేను చెప్పిన చిట్కా పాటిస్తూ, నిమ్మచెక్క తో పాదాలను రుద్దండి.ఇలా తరచూ చేయటంవల్ల పాదాలు తెల్లగా, కోమలంగా తయారవుతాయి. పాదాలు ఎక్కువగా నీటిలో తడవకుండా , బాక్టీరియా పాదాలకు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి . వారానికి ఒకసారైనా పాదాలకు యాంటిఫంగల్ క్రీమ్‌ ను రాయాలి . పాదాలకు ధరించే సాక్స్ విషయము లో పర్తిరోజూ ఉతికినవి మార్చాలి . పాదాలకు పగుళ్ళు ఏర్పడితే వైట్ పెట్రోలియం జెల్లీ రాస్తుండాలి .

4. అందమైన చేతుల కోసం :
చేతులు సౌందర్య భాగాల్లో ముఖ్యమైనవి గా చెప్పుకున్నాం కదా..ఈ పొస్ట్ లో కూడా ఒక మంచి సులువైన "మన అమ్మ"చిట్కాను చెప్పబోతున్నాను.ఏదైనా డిటర్జెంట్ మీ చేతులతో ఉపయోగించినప్పుడు పని పూర్తవ్వగానే నిమ్మచెక్కతో రుద్దండి. మీ చేతులు కోమలత్వంతో అందంగా తయారవుతాయి. రోజుకి నాలుగు సార్లైనా మాయిశ్చరైజర్ క్రీమ్‌ చేతులకు రాస్తుండాలి . గోళ్ళు అందం గా కనిపించడానికి కాల్సియం ఎక్కువగా లబించే ఆహారము తినాలి .

5 .అందమైన పెదవుల కోసం :
పెదవులు అందంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి..!!కానీ ఈ రోజుల్లో భోజనం లో వచ్చిన మార్పులు, నిద్రలేమి, ఎక్కువ గాఢత కలిగిన పేస్ట్లు, రక్తహీనత వల్ల కూడా పెదవులు పాడవుతున్నాయి.పెదవులు తోలు ఊడిపోయి, చివరలు పగిలి, నల్లగా కళావిహీనంగా తయారవుతున్నాయి.కొద్దిపాటి ఖర్చు తోనే మనం ఈ సమస్యను అధిగమించవచ్చు.నాకు తెలిసిన , మనపూర్వీకుల నుండీ వస్తున్న ఒక మంచి ఆయుర్వేద చిట్కా ను మీకు కూడా చెప్పబోతున్నాను.ఆయుర్వేదం కూడా వేదాలలో ఒక భాగమే…అదేమిటో తెలుసుకుందాం "మన అమ్మ" చిట్కాలో..దీనికి కవలసిన పదార్ధాలు..జాజికాయ - 50గ్రా, పాలు- సరిపడా, దంచిన పసుపు - 50గ్రా, నాటు ఆవు నెయ్యి - 50గ్రా. జాజికాయలను పగలగొట్టి పై బెరడుని దంచి పొడి చేయాలి.తరువాత స్టవ్ వెలిగించి, ఒక గిన్నె లో పాలు పోసి పైన వస్త్రం కట్టాలి.ఈ వస్త్రం లో జాజికాయపొడిని వేయాలి.ఇలా ఒక 10నిమిషాలు ఉంచి , తీసి ఈ పొడిలో పసుపు కలిపి,గాజు సీసాలో నిల్వ చేసుకుని, పెదవులు నల్లగా ఉన్నవారు, పొక్కులు వచ్చిన వారు, అంచులు పగిలిన వారు రాత్రిపూట మాత్రమే నెయ్యిలో ఈ పొడిని తీసుకుని బాగా రంగరించి, పెదవులకు పట్టించి మృదువుగా మర్దనా చేయండి.దీనివల్ల పెదవులు తేనెలూరుతూ, ఎర్రగా నిగనిగలాడతాయి.

5 .అందమైన మోము కోసం :
ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య "మొటిమలు".వీటి నివారణకు "మన అమ్మ" చిట్కాను తెలుసుకుందాం.. గులాబి, బచ్చలి ఆకులను తీసుకుని మెత్తగా రుబ్బి మొటిమల మీద రాస్తూ ఉంటే పదిహేను రోజుల్లోనే తేడాను గమనించవచ్చు.
a) అందమైన మోము కోసం పచ్చిపాలతో..
ముఖం తెల్లగా ఉండాలని అందరికీ ఆశ గా ఉంటుంది.కానీ ఉన్న రంగులోనే ముఖం ఇంకొంచెం ఛాయ పెరిగేలా, ముఖం నునుపు గా వచ్చేలా చేయొచ్చు.అదేంటో తెలుసుకుందాం "మన అమ్మ" చిట్కా లో..
పచ్చిపాలు, మంచి గంధం సరిపడా తీసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాత్రమే కాక, మెడకు, చేతులకు పట్టించి ఆరాక చల్ల నీటితో కడిగేయండి. ఇది క్రమం తప్పకుండా ఒక నెల రోజులు వాడి చూడండి.. తేడా మీకే తెలుస్తుంది.ఇది ముఖానికి పట్టించి, ముఖాన్ని కడిగేశాక ముఖం ఎంత మెరుపు, నునుపును సంతరించుకుంటుందో తెలియాలంటే "మన అమ్మ" చిట్కాను పాటించి మీరంతా అందంగా తయారవుతారని ఆశిస్తున్నాను.

b) అందమైన మోము కోసం.- టొమాటో, బీట్రూట్, క్యారట్...సౌందర్య చిట్కా- అందమైన మోము కోసం.
ఇంట్లో దొరికే కూరలతోనే ఒక అద్భుతమైన ఫేస్ ప్యాక్ మీ కోసం "మన అమ్మ" చిట్కా లో..
టొమాటో, బీట్రూట్, క్యారట్ ఈ మూడిటిని మెత్తటి ముద్దచేసి, అందులో కొంచెం పాలమీగడ వేసి బాగా రుబ్బి, వీలు దొరికినప్పుడల్లా ఈ ఫేస్ ప్యాక్ ను పట్టించటం వల్ల ముఖం కాంతివంతంగా, ప్రకాశవంతంగా ఉంటుంది.

చలికాలంలో చర్మం సహజమెరుపును కోల్పోయి అందవిహీనంగా తయారవుతుంది. ఒకింత నల్లగా మారుతుంది కూడా. ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలంటే...
  • * చలికాలం ఎండ ఒంటికి అంత మంచిది కాదు. బయటికి వచ్చేటప్పుడు సన్‌స్క్రీన్‌లోషన్‌ తప్పక రాసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. పచ్చికూరలూ పళ్లూ అధికంగా తినాలి.
  • * సబ్బును ఉపయోగించకుండా వీలైనన్నిసార్లు మంచినీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
  • * పాలు సహజ వైటెనర్‌గా పనిచేసి చర్మం నల్లగా అవకుండా రక్షిస్తాయి. గోరువెచ్చటి పాలలో మెత్తటి వస్త్రాన్ని ముంచి దాంతో ముఖంపై అద్దాలి. బాగా ఆరిపోయాక చల్లటి నీళ్లతో కడిగెయ్యాలి. రోజూ ఇలా చేస్తుంటే... చలి కారణంగా మెరుపు కోల్పోయిన చర్మం సహజమెరుపును సంతరించుకుంటుంది.
  • * ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మారోగ్యాన్ని సంరక్షిస్తాయి. అవి పుష్కలంగా లభ్యమయ్యే పాలు, చేపలు, వాల్‌నట్స్‌, సోయా, అవిసె గింజలు ఆహారంలో భాగం చేసుకోవాలి.
  • * పెరుగులో నాలుగైదు చుక్కల నిమ్మరసం వేసి ముఖానికి రాయాలి. ఈ మిశ్రమం మంచి బ్లీచింగ్‌ ఏజెంట్‌లా పనిచేస్తుంది.
  • * సెనగపిండి, పాలు కలిపి పేస్టులా చేసి రాయండి. పావుగంట తర్వాత కడిగేస్తే చర్మం సరికొత్త కాంతులీనుతుంది.
  • * రెండు నిమ్మచెక్కలను తీసుకుని ముఖంపైనా మెడపైనా రుద్ది ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం తేటగా ఉంటుంది.

ముఖం ప్రకాశవంతంగా అందంగా కనిపించడానికి : మార్కెట్లో రకరకాల సబ్బులూ క్రీములూ దొరుకుతాయి. కానీ వాటి కన్నా చర్మాన్ని శుభ్రపరిచే సహజగుణాలు కలిగిన పసుపు, శనగపిండి, తేనె వంటివి వాడటం వల్ల మరిన్ని లాభాలు ఉన్నాయంటున్నారు సౌందర్య నిపుణులు.

* అరకప్పు పాలల్లో అరకప్పు శనగపిండి, చెంచాడు పసుపు కలపండి. తయారైన మిశ్రమాన్ని ముఖానికీ మెడకూ పట్టించండి. ఐదునిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగెయ్యండి. జిడ్డు చర్మం గలవారికి ఈ ప్యాక్‌ బాగా పనిచేస్తుంది.
* ఒక దోసకాయ తీసుకుని దాని రసం తీయండి. అందులో నాలుగైదు టేబుల్‌స్పూన్ల పెరుగు కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి రాయండి. ఐదు నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగెయ్యండి. ఈ ప్యాక్‌ స్వేదరంధ్రాలను శుభ్రపరచి బిగుతుగా ఉండేలా చేస్తుంది. తద్వారా ముఖం కాంతిమంతంగా తయారవుతుంది.
* ఒక కప్పు పెరుగులో టేబుల్‌స్పూన్‌ తేనె కలపండి. బాగా కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసి ఐదునిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగెయ్యండి. పొడిచర్మం గలవారికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.
* అరకప్పు గోరువెచ్చటినీళ్లలో ఒక టేబుల్‌స్పూన్‌ తేనె వేయండి. మందుల షాపులో దొరికే ఎ, ఇ విటమిన్‌ టాబ్లెట్లను ఒక్కొక్కటి తీసుకొని వాటి పొడిని తేనె, నీళ్ల మిశ్రమంలో వేసి బాగా కలపండి. తరచుగా ఈ చిట్కాను పాటిస్తే ముఖంపై ఉండే మచ్చలు క్రమంగా తొలగిపోతాయి.

Monday, November 16, 2009

ఆహారము జీవితకాలము , Food and Lifespan



ఆహారం అందరికి అవసరం ... అది లేకుంటే బతకడం కష్టం . అందరు ఒకే వయసు వరకు బ్రతకరు ... కొందరు చిన్న వయసు లోనే అనారోగ్యానికి గురై మందులు మింగుతూ బ్రతుకుతుంటారు . షష్టి పూర్తీ చేసుకున్న తరువాత కుడా ఉత్సాహం ఏమాత్రం తగ్గకుండా జీవితాన్ని గడుపుతున్న వారుంటారు . అటువంటి తేడాకు కారణం వారు తీసుకునే ఆహారము . ఆహారము పోషక పదార్ధాలను అందిస్తుంది . ఈ పోషక పదార్ధాలు అందించే శక్తి అనేక రోగాలను నిరోధిస్తుంది . ఆరోగ్యం చెడి పోకుండా కాపాడే ఆహారపదార్ధాలకు తగినంత ప్రాధాన్యత మనం ఇవ్వటం లేదు . పోషక పదార్ధాలకు కాక రంగు , రుచి కి ప్రాధాన్యత పెంచినందునీ పిల్లలు "జంక్ ఫుడ్" పట్ల మక్కువ చూపుతున్నారు . ఒకప్పడు మనది ఋతువులకు తగిన ఆహారపదార్ధాలను తిన్న సంస్కృతీ . ఆ ఋతువులో ఏ ఆహార పదార్ధాలను తీసుకోవాలో ఆ పదార్ధాలను కనీస మోతాదు లో ప్రతి ఒక్కరు తీసుకునేలా పండుగ ప్రసాదాలను నిర్దేశించారు మన పెద్దలు .

అంత ముందు చూపుతో రూపొందించిన జీవన విధానానికి దూరం గా జరిగినందునే భారతీయులు అనారోగ్యాలకు గురవుతున్నారు . తిరిగి తమ జీవన విధానాన్ని , ఆహారపు పద్దతులను , ఆహారపదార్ధాల విషయం లో పట్టింపులను వెనక్కు తెచ్చుంటే తప్ప జీవిత కాలాన్ని ఎవరు మెరుగు పరుచుకోలేరు .

టిప్స్ :
1 . మన శరీరం లో తయారయ్యే రసాయనాల వల్ల కణాలు దెబ్బతింటాయి . చర్మము మీద ముడతలు రావడం , చర్మం కాంతిని కోల్పోవడం వంటివన్నీ ఆ రసాయనాలు తీసుకువచ్చే మార్పులే . కాబట్టి అటువంటి రసాయనాలను నిలువరించే యాంటి ఆక్షిడెంత్స్ ను శరీరానికి అందించాలి . యాంట్ ఆక్షి డెంత్స్ (AtiOxidents) ఎక్కువగా ఉన్నా ఆహారము తీసుకోవల్లి .
బాసం , నిమ్మ , బత్తాయి , క్యారెట్లు , ఆకుకూరలు , టమాటోలు , రంగు మిరపకాయలు , వంటివి ఆహారము లో ప్రతి రోజు భాగం గా చేసుకోవాలి .

2. సలాడ్లు అనగా పచ్చి కాయకురకాయల ముక్కలు , పండ్లు ముమ్మలు , టమాటో ముక్కలు , క్యారట్ ముక్కలు సలాడ గా చేసుకొనే తింటే మంచిది . పీచు పదార్ధము ఎక్కువగా ఉంటుంది కావున విరోచనం సాఫీగా అవుతుంది . విటమిన్లు , మినరల్స్ ఉంటాయి .

3. ఇంట్లో పండ్లు నిలువ ఉంచుకోవాలి , భోజనానికి ... భోజనానికి మధ్యలో శక్తి కోసం పండ్లు తినాలి . ఒక్కో ఋతువులో ఒక్కో రకం పండు లభిస్తాయి. అవి తినడం ఎంతో మంచిది .

4 . బలం గా , ద్రుడం గా ఉండాలంటే గట్టి ఎముకలున్డాలి .. చక్కని ఎముకలు , దంతాలు ఉన్నవారు ఆకర్షణీయం గా ను ఆరోగ్యం గాను కనిపిస్తారు ... అటువంటి బలాన్ని అందించేవి పాలు , పాల ఉత్పత్తులు ప్రతి రోజు తీసుకోవాలి .

5 . అల్ఫారం గురించి ప్రత్యేకం గా చెప్పనక్కరలేదు .. రాత్రి ౯ గంటలకు భోజనం చేస్తే తిరిగి ఉదయం ౭ గంటల వరకు ఆహారం లేకుండా ఉంటుంది శరీరం . అటువంటి శరీరానికి మధ్యలో అలపాహారం అందిస్తే మంచిది , వారి ,గోధుమ , మినప , పెసర లతో చేసే టిఫిన్లు తింటే మంచిది .

6 . ఆహారపదార్ధాలు తీసుకునేటపుడు ఎక్కువ పోషక పదార్ధాలు , పీచు ఎక్కువగా ఉండేటట్లు చూడాలి . పీచు పదార్ధము వల్ల రక్తం లోని కొలెస్టిరాల్ తగ్గుతుంది , షుగర్ స్థాయి తగ్గుతుంది , పెగుఅలకు సంభండిచి న క్యాన్సర్లు రాకుండా నిరోధిస్తుంది .

7. ఆహారము తీసుకునే తప్పుడు మితిమీరి తినకూడదు ... కొంత ఆకలిగానే భోజనం ముగించాలి . భోజనానికి ,భోజనానికి మధ్య కనీసం ౩-౪ గంటలు వ్యవధి ఉండాలి . ఆరోగ్యానికి మంచిది .

8 . కొవ్వు పదార్ధాలు ఉన్నా ఆహారము పరిమితం గా తీసుకోవాలి . కొవ్వు శరీరానికి అవసరమే కాని ... కొవ్వు ఎక్కువగా చేరిన శరీమము అనేక రోగాలకు దారితీస్తుంది . అందుకే కొవ్వుపదార్ధాలు అతి తక్కువగా తినాలి . తీపి పదార్ధాలు , వెన్న , జున్ను , జంతు మాంసాలు ఎక్కువగా తినకూడదు . చేపలు , పిట్ట(పక్షి) మాంసము తినవచ్చును .

9 . పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది . ప్రతిరోజూ పండ్లు మార్చి మార్చి రకరకాల పండ్లు తినాలి .

10. తాజా కూరగాయలు తినడానికి ఎంచుకోవాలి . కూరలు వందే టపుడు మసాల వస్తువులు తక్కువగా వాడాలి .

11. నీరు ఎక్కువగా తాగాలి . దాహం వేసే తపుడే నీరు తాగడం కాదు . మధ్య మధ్య లో కావాలని నీరు తాగాలి . కడుపు ఖాళీ గా ఉన్నప్పుడే ఎక్కువ నీరు తాగితే చాలా మంచిది . ఆహారము ముందు నీరు తాగం వలన తక్కువ భోజనం చేయడం జరుగుతుంది .. మిత ఆహారము ఆరోగ్యానికి చాలా మంచిది . భోజనం తరువాత నీరు తాగాలి ... నీరు జీర్ణక్రియకు తోడ్పడుతుంది .
12. భోణం తిన్న వెంటనే పడుకోకూడదు ... పది నిముషాలు అటు ఇటు నడవాలి . టీవీ చూస్తూ తినకూడదు ఎందుకంటే మనకు తెలియకుండానే ఎక్కువగా తేనె అవకాశముంది కనుక . ఒకవేళ టీవీ ముందు తింటే ముందే ఆహారము కొలపెట్టి వడ్డించుకోవాలి .

Friday, November 13, 2009

Mythology and Health , ఆధ్యాత్మికం - ఆరోగ్యం




జీవితం లో ఏ దశలో ఉన్నా మనిషికి కావాలిసింది మానసిక ప్రశాంతత ,.. ఈ ప్రశాంతత కరువైతే డబ్బు , సంపద , హోదా, ఇతర సౌకర్యాలు ఏవీ మనిషిని ఆడుకోలేవు .జీవితం లో ఎటువంటి విజయాలు సాధించినా , ఎంతటి ఉన్నత స్థితికి చేరినా చివరిగా కావాల్సింది మానసిక ఆనందం , ప్రసంతట మాత్రమే .

జీవితం లో అనుకున్నది సాధిస్తే మానసిక ప్రశాంతత వస్తుందని భావించవచ్చు ... ఆ ఆలోచనతో పగలు , రేయి అనే తేడా లేకుండా , పోటీ ప్రపంచం లో కొట్టుకుని చవరికి అనుకున్నది సాధిస్తారు . విజయ గర్వం తో వెనుదిరిగి చూసుకుంటే విజయ శిఖరం మీద ఒంటరిగా మిగిలామన్న దుగులు మొదలవుతుంది .అక్కడ నుండి ఏదో తెలియని అలజడి , ఆశాంటి ... దానినుండి బయటపడి తిరిగి సాధారణ మనిషి గా జీవించేందుకు ప్రయత్నాలు మొదలౌతాయి .

టిప్స్ :
1. జీవితం లో ఎలా ఎదుగుతున్నా ఎంత వేగం గా లక్ష్యం వైపు పరుగులు తీస్తునా . . . తానూ ప్రాధమికం గా మనిషి నని , మానవత్వం మనిషి ముఖ్య గుణమని .. అనే విషయం మరువకూడదు .శారీరక , మానసిక ఆరోగ్యం , ప్రశాంతతను అందించేది వాస్తవానికి దగ్గర గా బ్రతకగలిగిననాడే .

2. తమ తమ వృత్తులలో బిజీ బిజీ గా గడిపే చాలా మందికి మానసిక ప్రశాంతత కరువవడానికి కారణం తన తోటివారికి దూరం గా జరగటమే . భౌతికం గా కాక మానసికం గా ఏర్పడుతున్న ఎడం వలన ఒంటరివరవుతున్నారు . ప్రకృతికి , తోటి మానవులు , జతువులకి మనిషికి విడదీయలేని బంధముంది .. .. అది ఎన్నటికీ వదల కూడదని చెప్పేందుకు ప్రతి జీవిలో ఉన్న ఆత్మా ఒక్కతేనన్న విశేష ఆలోచనను పెద్దలు మనకు అందించారు . మునులు , ఋషులు ఏన్తో ఆలోచించి , తమ జ్ఞానం రంగరించి అందించిన ఆధ్యాత్మిక చింతనా మార్గం తెలియక కొట్టుమిట్టాడుతున్న బిజీ మనుషులు మానవత్వం వైపు మళ్ళించేందుకు నిర్దేచించిన మార్గాలివి .

3. ఈ అనంత విశ్వాన్ని ఒక మహత్తర శక్తి నడిపిస్తోంది. అది భగవంతుడో లేక మరొకతో అనవసరం .. అయితే ప్రతి ఉదయం ప్రశాంత ఉదయం గా అందిస్తున్న ఆ శక్తికి నమస్కరించి రోజును మొదలు పెట్టండి . అడేవిధం గా ప్రతి రాత్రి పడుకునే ముందు ఆ రోజులో జరిగిన సంఘటనలను తలచుకొని వాటిని విజయవంతం గా నడిపింపచేసిన ఆ శక్తికి కృతజ్ఞతా వందనం చేయండి .

4. ప్రభాత కాలం లో 20 నిమిషాల పాటు చల్లని ప్రశాంత వాయువులను పేలుస్తూ అటు ఇటు నడవాలి . ముఖం మీద చిరునవ్వులు చిన్దిస్తుడాలి . నవ్వు అంతర్గతం గా ఎన్నో లోపాలును సరిదిద్దుతుంది .మనసును ప్రశాంత పరచగలిగిన శక్తి నవ్వుకుంది . దానిని ఉపయోగించుకోవటం మన చేతిలో పని .

5. ఆహారనుయమాలు పాటించాలి . ఏదితిన్నా అది తాజాగా వండినది ఉండాలి . అది కుడా పూర్తిగా ఉడికించినది కాక , ఓ మోస్తరు తక్కువగా ఉడికించినది ఉండాలి . మసాలా దినుసుల వాడకం తగ్గించాలి . మనం సృస్తించే మానసిక శక్తికి మూలము .. ఆహారము అందించే శక్తే . ఈ ములపదార్దము మేలుగా ఉంటే శక్తి కుడా చక్కనిది ఉంటుంది .

6. ఆహారపు నియమం తో పాటు నిద్రకి నియమం అవసరం . ప్రతిరోజూ నిర్ణీత సమయం లో పడుకుని వేకువజామునే లేవటం అలవాటు చేసుకోవాలి . అనంత విశ్వం లో మీరు ఒక భాగం .. ఆ అనంత విశ్వం లోని మిగిలిన అంశాలతో మీకు సంభంధం ఉంటుంది ... ఆ బంధాన్ని బద్రపరిచేది ఆధ్యాత్మిక చింతన . ప్రతి ఉదయం ప్రశాంత వాతావరణం లో శుభ్రం గా స్నానం చేసి ఆశ్యాత్మిక చింతను పెంచే గ్రంధాలను చదవండి . . . అవి మతపరమైనవైనా లేదా మహానుభావుల ప్రవచనాలైనా పరవాలేదు .

7. ప్రకృత లో మీ అనుబంధం మరింత గ పెంచుకోండి . ప్రక్రుతి ములాలనుండే జీవం పుట్టింది . అందులోనే మళ్ళీ జీవులు కలిసిపోతాయి . తాత్కాలికం గా లభించే ఆలోచనలు , విజయాలను చూసుకొని ప్రకృతికి వ్యతితేకం గా ఎవ్వరు తయారుకాకూడదు . ఉదయం వేల మొక్కలతో సమయం గడపండి . మొక్కలతో పాటు చుట్టూ కనిపించే చిన్న , పెద్ద జంతువులను గమనిస్తూ వాటికి ఆహారం అందిస్తూ మానసిక ప్రశాంతత అందుకోవడానికి ప్రయత్నించండి .

8. ధ్యానం కున్న శక్తిని మనుషులు మద్యలో మరచిపోయారు . ప్రతి రోజు ఉదయం ధ్యానం తో రోజు వారి పనులను ప్రారంభించటం ఏన్తో మేలుచేస్తుంది .మనసు పడుతున్న ఒత్తిడిని పక్కకు నేట్టివేయగలిగిన శక్తి ధ్యానానికి ఉంది . ముఖ్యం గా నేటి ఉద్యోగాలలో ఒత్తిడి భాగమైపోయింది .

9. ప్రతి రోజు ఉదయం , సాయంత్రం ప్రార్ధన చేయడం అవసరం . ప్రార్ధన అనగానే ఏదో ఒక మతపరమైన అంశం గా పరిగనించ కూడదు . ప్రార్ధనలు మనషును తేలికపరిచే సాధనాలు . మనం ఎంత వద్దనుకునా ఏదో ఒక రకమైన ఒత్తిడికి గురవుతుంటాం . మనసును వేధించే అంశాలలో కొన్ని అర్ధం లేనివి .. పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినా పట్టించుకునేవి , అటువంటి వాటినని వదలించుకునే మార్గం , శక్తి ఒక ప్రార్ధలకే ఉన్నది . మనకందని ఎన్నో అంశాలను సాధించి పెట్టేలాగా చేస్తాయి ప్రార్ధనలు .

10. ప్రార్ధన బిగ్గర గా చేస్తాలు కొందరు , మౌనము గా చేస్తారు మరికొందరు . మౌనం లో చేసే పనుల్లో మరెంతో శక్తి ఉందనిపిస్తుంది . అందుకేనేమో మహాత్మా గాది వారం లో ఒకరోజు మౌనం పాటించేవారు . ప్రసిద్ధ గురువులు ఇదే పద్దతి పాటిస్తారు .. రోజంతా మౌనం గా ఉండటం సాద్యం కాకపోయినా కనీసం 20 నుండి ౩౦ నిముషాలు మౌనానికి కేటాయించాలి . కేవలం శ్వాసమీద దృష్తి నిలిపి చేసే ' మౌన వ్రతం ' ఇతర వ్రతాలన్నితికంటే మేలైనది .

11 . స్పందన అనేది సహజం . అయితే స్పందిచే తీరు అందరిలో ఒకేలా ఉండదు . మీకు ఒక ప్రత్యేకత తెచ్చేది మీ స్పందన విధానం . ఏఅంశం మీద అయినా తక్షణం స్పందించాలనుకోవద్దు . కొద్దిసేపు ఆగి స్పందించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది . స్పందనకు ముందు మీరుతీసుకునే సమయం రెండు నిమిషాలే కావచ్చు ... కాని ఆ కొద్దికాలమే అద్భుతమైన తేడాను తెస్సుంది . కొత్త ఆలోచనలనూ మీ ముందుంచుతుంది . మంచి చెడు లకు మధ్య ఉన్న తేడాను తెలుసుకుంటారు .

12. " నీ స్నేహితులెవరో చెపితే నీ గుణగుణాల గురించి చెపుతా"అన్నది తెలుగు నానుడి . ఇది అక్షరాల సత్యం . మంచి ఆలోచనలు , మంచితనం కలిగిన వారితోనే స్నేహం చేయండి . సహనము , దయ , కరుణ కలిగిన వారితోనే తిరుగుతుందండి . దీనినే మనపెద్దలు " సత్సంగం" అన్నారు . సత్సంగం లో అందరితో మీరు కలిసి అద్భుతం గా ఎదగాగాలుగుతారు .

Thursday, November 12, 2009

దంత సంరక్షణ , Dental Care







  • పల్లు లేదా దంతాలు (Teeth) దవడలకు అమర్చబడి ఉండి మనం ఆహారాన్ని నమలడానికి ఉపకరిస్తాయి. వీటిమొదలు భాగాలు చిగుళ్ళతో కప్పబడి ఉంటాయి.

మానవులలో రెండు జతల పల్లుంటాయి. ముందుగా చిన్నపిల్లలలో వచ్చే పల్లను పాలపల్లు అంటారు. ఇవి 10 పైదవడకి 10 క్రిందిదవడకి ఉంటాయి. తర్వాత వచ్చే 32 పల్లు శాశ్వతంగా మనిషి జీవితాంతం ఉంటాయి. ఇవి 16 పైదవడకి 16 క్రిందిదవడకి ఉంటాయి. కుంతకాలు, రదనికలు, చర్వణకాలు, అగ్రచర్వణకాలు అనే నాలుగు రకాల దంతాలు క్రింద, పైన, కుడి, ఎడమవైపు ఒకే విధంగా ఉంటాయి.

  • కుంతకాలు ఆహారాన్ని ముక్కలు చేయడానికి, రదనికలు చీల్చడానికి, చర్వణకాలు, అగ్ర చర్వణకాలు నమలడానికిఉపయోగపడతాయి. ప్రతి దవడ అర్ధ భాగంలో రెండు కుంతకాలు, ఒక రదనిక, రెండు అగ్ర చర్వణకాలు, మూడుచర్వణకాలు ఉంటాయి. దవడ ఎముక లో ఉండే దంత భాగాన్ని మూలం అనీ, బయటకు కనిపించే భాగాన్ని కిరీటంఅంటారు. దంతం డెంటయిన్ అనే పదార్థంతో నిర్మితమై ఉంటుంది. ఇది ఎముక కంటే గట్టిగా ఉంటుంది. దంతం లోపలఉండే కుహరంలో రక్త నాళాలు, నాడీ తంతువులు ఉంటాయి.

శుభ్రత

  • దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు కనీసం ఒకసారి దంతధావనం చేయాలి. ఈ ప్రక్రియ వల్ల దంతాలలోచేరుకున్న చిన్న ఆహారపు ముక్కలు, పాచి తొలగిపోతాయి.

దంత గార >
  • ఒక్కో సారి మా చ్గుల్లపై తెల్లని పదార్ధం పెరుకోవడం చూస్తాం . గోళ్ళతో అలా అనగానే ఇది తొలగిపోతుంది . దీనిని వైద్యభాషలో ఫ్లేక్ (గార) అంటారు ,.

పళ్ళ పైన ఏర్పడే సుక్ష్మ జీవులనే ఫ్లేక్ అంటారు . ఇదొక రకమైన సూక్ష్మజీవి . అనువైన పారిస్తితులలో కేవలం ౧౪ గంటలలో పది లక్షల జీవరఆశిగా మారుతుంది . ఇందులో సగం వెంటనే పంటి పై అంటుకుని గట్టిగా మారుతుంది . దీనిని "సెల్ క్యులాస్ " అంటారు . దీనిని మనం గరదట్టడం అని సాధారనభాషలో అంటు ఉంటాము ఇది పళ్ళపై గట్టి పొరగా మారి ఇతర జబ్బులకు ప్రధాన కారణమవుతుంది .
ఇటు వంటప్పుడు పళ్ళు తోముకునే సమయంలో చిగుళ్ళ నుంచి రక్తం కారడం కనిపిస్తుంది . బ్రష్ తో తోముకోవడం వల్ల చాల వరకు ఈ సమస్య నయమువుతుంది . వైద్యుల అవసరం ఉండదు .
తీసుకో వలసిన జాగ్రత్తలు >
  • రోజూ మంచి బ్రష్ , పేస్టు లతో పళ్ళు తోముకోవాలి .
  • మౌత్ వాష్ తో గార్గిల్ /పుక్కలించడం చేయాలి ,
  • డెంటల్ ఫ్లాష్ ఉపయోగించాలి ,
  • ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఫ్లోరైడ్ ఉన్నా పేస్ట్ తో బ్రష్ చేయాలి .
  • తెల్లని పళ్ళ కోసం దంత వైద్యుని సంప్రదించి ఫ్లోష్ చేయించు కుంటే మంచి ఫలితం ఉంటుంది .
దంతసిరి
ముఖ సౌందర్యంలో దంతాల తెల్లదనమూ కీలకపాత్ర పోషిస్తుంది. చక్కటి పలువరస లేకపోతే పదుగురిలో మనసారా నవ్వలేని దుస్థితి. కారణాలేవైనా కానీ పచ్చగా మారిన దంతాలను తెల్లగా మెరిపించాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.
జామ, యాపిల్‌, క్యారెట్‌, చెరకు, దోస... ఇవన్నీ సహజవైట్‌నర్లు. తరచుగా తింటుంటే వాటిలో ఉండే రసాయనాలు పంటిపై ఉండే మరకల్ని తొలగిస్తాయి.
టొమాటో, ఉసిరి, స్ట్రాబెరీ వీటితో పళ్లపై రుద్దినా అదే ఫలితం లభిస్తుంది. రాత్రిపూట పడుకోబోయే ముందు నారింజ తొక్కతో పళ్లు రుద్దుకుంటే అందులోని సి విటమిన్‌ రాత్రంతా సూక్ష్మజీవులతో పోరాడుతుంది.
అర టేబుల్‌స్పూన్‌ బేకింగ్‌సోడాలో అంతే పరిమాణంలో వినెగర్‌, చిటికెడు ఉప్పు కలిపి తోముకుంటే పళ్ల పచ్చదనం పోయి తెల్లగా అవుతాయి. అక్కడ బ్యాక్టీరియా కూడా నిల్వ ఉండలేదు.
అర చెంచాడు బేకింగ్‌ సోడాలో రెండుచుక్కల హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వేసి కలిపి ఆ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తోముకుంటే క్రమంగా పళ్లు తెల్లగా అవుతాయి.
వేప, నల్లతుమ్మ పుల్లలతో తోముకున్నా కూడా దంతాల మీది మరకలు త్వరగా పోతాయి. వేపలో ఉండే యాస్ట్రింజెంట్లు, యాంటీ సెప్టిక్‌ గుణాలు పంటికి రక్షణ కల్పిస్తాయి. దుర్వాసనను కూడా తొలగిస్తాయి.
తులసి ఆకుల్ని ఎండబెట్టి పొడి చేసి దాంతో పళ్లు తోముకున్నా దంతాలు ఆరోగ్యంగా మెరుస్తాయి. చిగుళ్ల నుంచి రక్తం కారేవారికి కూడా ఇది మంచి మందు.

దంత సమస్యలు - లేజర్‌ చికిత్స

దంత సమస్యలకు చికిత్సలో భాగంగా హార్డ్‌, సాఫ్ట్‌ టిష్యూలకు లేజర్‌ చికిత్స చేస్తుంటారు. లేజర్‌ యంత్రంలో వీటికి చికిత్స చేసే పైప్స్‌ వేరువేరుగా ఉంటాయి. పలు రకాల చికిత్సలను అందించేందుకు వీలుగా పలు రకాల ప్రోగ్రామ్‌లు ముందుగానే అందులో లోడ్‌ అయి ఉంటాయి. ప్రోగ్రామ్‌ మార్చినప్పు డల్లా చికిత్సా విధానం మారుతుంది. ఎలాగంటే చిగుళ్లకి చికిత్స చేయాలంటే ఒక విధమైన ప్రోగ్రామ్‌నివ్వాలి. రూట్‌కెనాల్‌ ట్రీట్‌మెంట్‌కి మరో ప్రోగ్రామ్‌...ఇలా హార్డ్‌ టిష్యూ చికిత్స కోసం 40 ప్రోగ్రామ్‌లుంటే, సాఫ్ట్‌ టిష్యూకోసం మరో 40 ప్రోగ్రామ్‌లున్నాయి ఈ యంత్రంలో.

సాఫ్ట్‌ టిష్యూ చికిత్సలో ఉన్న ఎండోడాంటిక్స్‌ ప్రోగ్రామ్స్‌తో రూట్‌కెనాల్‌ ట్రీట్‌మెంట్‌ చెయవచ్చు. బాగాలోతుగా ఉన్న ఇన్‌ఫెక్షన్‌ని అరికట్టవచ్చు. పంటినిగాని, చిగుళ్లనిగాని, ఎముకనిగాని అవసరమైన మేరకు కత్తిరించవచ్చు. మరో ప్రోగ్రామ్‌ ద్వారా పన్నుపై భాగాలు అరిగి జివ్వున లాగుతుంటే ఆ ప్రాంతంలోని అతిస్పందనని మరో ప్రోగ్రామ్‌ ద్వారా.. లేజర్‌ కిరణాన్ని ఆ ప్రాంతంలోకి పంపి సెన్సిటివ్‌నెస్‌ని తగ్గించవచ్చు.
సాధారణంగా అధి రక్త్తపోటు, మూర్ఛలతో బాధపడే వాళ్లకు చిగుళ్లు వాస్తే ఎక్కువగా ఉన్న చిగుళ్లని ఇంకో ప్రోగ్రామ్‌తో కత్తిరించవచ్చు. మరో ప్రోగ్రామ్‌తో చిగుళ్లని ఓపెన్‌ చేయకుండానే కాంతి కిరణాలతో లోపల దెబ్బతిన్న చిగుళ్ల కణాన్ని మాడ్చివేయవచ్చు. నోట్లో చీముగడ్డలు ఏర్పడితే వాటిని తీసివేసే ప్రోగ్రామ్‌ కూడా ఉంది. కొంతమందిలో రెండు పళ్ల మధ్య ఫ్రీనమ్‌ అనే కండరం ఏర్పడుతుంటుంది. దీంతో పళ్ల మధ్య సందులు ఏర్పడతాయి. అలా సందులు ఏర్పడకుండా ఫ్రీనమ్‌ని తీసివేయవచ్చు లేజర్‌ కిరణాలతో. ఇలా చెప్పుకుంటూపోతే ఇంకా ఎన్నో ప్రోగ్రామ్‌లున్నాయి సాఫ్ట్‌ టిష్యూ చికిత్సలకి. ఒక్కమాటలో చెప్పాలంటే నోటిలోని మెత్తటి కణాలన్నింటికీ సంబంధించిన ప్రోగ్రామ్‌తో ఉన్నాయి ఈ లేజర్‌ చికిత్సా యంత్రంలో.

హార్డ్‌ టిష్యూ...
గట్టి కణాల చికిత్సకొస్తే అవీ 40 రకాల వరకూ ఉన్నాయి. డెంటిన్‌ని, ఎనామెల్‌ని కట్‌ చేయవచ్చు. పంటి మీద ఎత్తుపల్లాలు ఏర్పడి క్రమంగా పళ్లలో కంతలు ఏర్పడవచ్చు. ఇలా పళ్లు పుచ్చిపోకుండా కంతలు ఏర్పడుతున్న ప్రదేశాన్ని ‘ఫిట్‌ అండ్‌ ఫీజర్‌ సీలింగ్‌ పద్ధతి’లో మూసివేస్తారు. లేజర్‌ కిరణాలతో పన్నునే కాదు, ఎముకనీ కట్‌ చేయవచ్చు. పుచ్చిన పళ్లని తీసివేయవచ్చు. ఫ్లోరోసిస్‌వల్ల పళ్ల మీద పసుపు పచ్చని పొర ఏర్ప డుతుంటే దాన్నీ తీసివేయవచ్చు. పళ్లపై భాగంలో సెన్సిటివ్‌నెస్‌ ఎక్కువగా ఉంటే లేజర్‌ కిరణాలతో ఆ భాగాన్ని డిసెన్సిటైజ్‌ చేయవచ్చు.

ఎక్కువున్న చిగుళ్లని కట్‌చేయవచ్చు. గ్రాన్యులేషన్‌..అంటే పాడైపోయిన కణాన్ని కచ్చితంగా అంతవరకే తీసివేయవచ్చు. నోట్లో ఏర్పడే రకరకాల గడ్డల్ని హార్డ్‌ లేజర్‌తో తొలగించవచ్చు. ముఖ్యంగా హిమాంజియోమాలు.. రక్తపు గడ్డల్ని తీసివే యడం కష్టం. వాటిని కొద్దిగా కత్తిరిస్తే చాలు రక్తం ధారగా కారుతుంటుంది. అలాంటి గడ్డల్ని రక్తస్రావం కాకుండా కాల్చి వేయవచ్చు. ఒక్కపన్ను దగ్గరే చిగురు వాస్తే దానిని తీసి వేయవచ్చు. క్రేన్‌ని పెంచడంకోసం చిగుళ్లని పెంచవుచ్చు. నోట్లోని చిన్నచిన్న పుళ్లమీదకి లేజర్‌ కిరణాన్ని పంపగానే నొప్పి తగ్గి పోతుంది. ఇరవైనాలుగు గంటల్లో పుళ్లు పూర్తిగా తగ్గిపోతాయి. అంతేకాదు ఆ ప్రాంతంలో నున్నగా తయారవుతుంది. ఎటువంటి మచ్చ పడకుండా కూడా ఉంటుంది.

చిన్నపిల్లల్లో...
చిన్నారుల్లో కొందరికి పళ్లు చిగుళ్లలో ఉండిపోతాయి. త్వరగా బయటకు రావు. అలాంటి పరిస్థితుల్లో లేజర్‌ కిరణాలతో నొప్పిలేకుండా చిగుళ్లని కోసి పళ్లు బయటకు వచ్చేట్టు చేయవచ్చు. పళ్ల మీద జెల్‌ని రాసి లేజర్‌ కిరణాన్ని నాలుగునిముషాలు పంపడంతో పళ్లని తెల్లగా చేయవచ్చు.

వెస్టిబ్యులో ప్లాస్టి...
పెదవి లోపలివైపు ఎముకని లేజర్‌ కిరణాలతో కత్తిరించవచ్చు. పంటి చివరి భాగం కోసుకుంటుంటే ఆ పదునుని తగ్గించవచ్చు. ఎక్కడ ఎముక ఏమాత్రం ఎక్కువ వున్నా నొప్పిలేకుండా కత్తిరించవచ్చు. జ్ఞానదంతాలు ఓ పట్టాన బయటకు రాకుండా నొప్పి పెడుతుంటే లేజర్‌ కిరణాలను పంపి నొప్పిలే కుండా పైనున్న చిగుళ్లని కత్తిరించి దంతాలు బయటకు వచ్చేట్టు చేయవచ్చు. ఇలా హార్డ్‌ టిష్యూ లేజర్‌లో కూడా ఎన్నో ప్రోగ్రామ్‌లున్నాయి.అన్ని రకాల దంత చికిత్సల్నీ లేజర్‌తో చేయవచ్చు. మెత్తటి కణాలని చికిత్స చేసినా, గట్టికణాన్ని కత్తిరించినా నొప్పి ఉండదు. రక్తం కారదు. చిగుళ్లలో పాడైపోయిన భాగాల్ని చిగుళ్లని కత్తిరించకుండా కాంతిని పంపి మాడ్చేయవచ్చు. సైడ్‌ ఎఫెక్ట్‌‌స ఉండవు ఈ చికిత్సలో. చికిత్సకి పట్టే సమయం కూడా మామూలు విధానంతో పోలిస్తే తక్కువ. కేవలం రెండు నిముషాలలో కావలసిన ప్రోగ్రామ్‌ని సెట్‌ చేసుకోవచ్చు. ఏ ప్రోగ్రామ్‌ని సెట్‌చేస్తే లేజర్‌ కిరణాలు ఆ ప్రోగ్రామ్‌నే చేస్తాయి. మిగతా కణాన్ని ముట్టుకోవు. ఉదాహరణకు చిగుళ్లులోపల దెబ్బతిన్న కణాల్ని మాడ్చటానికి ప్రోగ్రామ్‌ పె డితే లేజర్‌ కిరణాలు ఆ కణాలనే మాడ్చేస్తాయి మిగతాకణాల్ని ఏమాత్రం ముట్టుకోకుండా.

ఈ లేజర్‌ యంత్రాలలో కూడా కార్బన్‌డయాకై్సడ్‌ లేజర్‌ కన్నా ఎన్‌డిఆర్‌ లేజర్‌ శక్తివంతమైంది. అనస్థేషియా లేకుండానే ఈ శస్తచ్రికిత్సలన్నీ చేయవచ్చు.

లేజర్‌ అంటే..?
ఒక పద్ధతి లేకుండా ప్రయాణించే అనేక ఎలక్ట్రోమేగ్నిటిక్‌ వేవ్స్‌ మాములు కాంతిలో ఉంటాయి. దీనిని ‘ఇన్‌కొహెరెంట్‌ లైట్‌’ అంటారు.లేజర్‌కాంతి కిరణాలకు మూడు ప్రత్యేక ధర్మాలుంటాయి. ఇది తిన్నగా ఒకే దారిలో వెళ్తుంది. దూరం ప్రసరింపచేసిన చాలా కొద్దిగా మాత్రమే వంగుతుంది ఈ కాంతి. ఇందుకు భిన్నంగా మామూలు కాంతికిరణాలు విస్తరిస్తాయి. లేజర్‌ కిరణాల రెండవ ధర్మం ఒకటే రంగుని కలిగి ఉంటుంది.

మామూలు కాంతిలో ఇందుకు భిన్నంగా ఎన్నో వేవ్‌లెంత్స్‌ రంగులుంటాయి. లేజర్‌ యంత్రంలో లేజర్‌ కేవిటీలో లేజర్‌ కిరణాలు ఉత్పత్తి అవుతుం టాయి. లేజర్‌ కేవిటీలో మూడు ముఖ్యమైన విభా గాలున్నాయి. లేజర్‌ కిర ణాలు ఉత్పత్తి చేసే ప్రాం తం పవర్‌ జనరేటర్‌. లేజ ర్‌ కిరణాలని ఉత్పత్తి చేసే ప్రాంతం పవర్‌ జనరేటర్‌ అనేది ఒక ముఖ్యభాగం. లేజర్‌ కిరణాలని ఉత్పత్తి చేసే సోర్స్‌ ఘనరూపంలో ఉండవచ్చు. ద్రవరూపం లో ఉండవచ్చు. వాయు రూపలో ఉండవచ్చు. రెండవది యాక్టివ్‌ మీడియా పరమాణువుల్ని స్టిమ్యూలేట్‌ చేసే ఎనర్జీ సోర్స్‌ పల్స్‌డేలో ప్రెజర్‌ జినాన్‌ ఫ్లాష్‌లాంప్‌.మూడవ ముఖ్యమైన భాగం ఆఫ్టికల్‌ రిజోనేటర్‌. లేజర్‌కేవిటీకి రెండు చివర్లలోనూ రెండు హైలిపాలిష్ట్‌ మిర్రర్స్‌ ఉంటాయి. ఇవి ఉత్పత్తి అయ్యే లేజర్‌ కిరణాలు ప్రక్కలకు వెళ్లకుండా ముందుకు వెళ్లే మార్గాన్ని నిర్దేశిస్తాయి.

లేజర్‌ కిరణాలు ఉత్పత్తి కాగానే లేజర్‌బీమ్‌ డెలివరి సిస్టమ్‌ ద్వారా ముందుకు వెళ్తాయి. అక్కడ నుంచి పైప్‌ ద్వారా ఆ కిరణాల్ని నోటిలో ఏ ప్రదేశంలోకి పంపాలో ఆ ప్రదేశంలోకి పంపిస్తారు. మనుష్యుల మీద ఈ లేజర్‌ కిరణాల ప్రభావం లేజర్‌ యం త్రం నుంచి ఉత్పత్తి ఆయ్యే రేడియంట్‌ ఎనర్జీవేవ్‌ లెంత్‌ని బట్టి ఉంటుంది. విచిత్రమేమిటంటే ఎంతో ఎక్కువగా ఉష్ణము లేజర్‌ కిరణాలలో ఉన్నా ఏమాత్రం కాలదు, నొప్పి అనిపించదు. శరీరంలో ఏ ప్రాంతంలోనయినా ఈ లేజర్‌ కిరణాలు మనల్ని తాకగానే ఆ ప్రాంత అవయవాలు వాటిని పీల్చు కుంటాయి. ఈ పీల్చుకున్న లేజర్‌ కిరణాలు ఖచ్చితంగా ప్రోగ్రామింగ్‌ ప్రకారమే పనిచేస్తాయి. ఎంత ఎక్కువ ఎనర్జీ లోపలకు తీసుకుంటే అంత ఎక్కువ ఎఫెక్ట్‌ ఉంటుంది. లేజర్‌ కిరణాలు ఒక తరంగ దైర్ఘ్యంలో ప్రసరిస్తాయి. లేజర్‌ ద్వారా ఎంత ఎనర్జీ ఉత్పత్తి అయ్యేది అన్నది పవర్‌ వైద్యం కోసం ఉపయోగించే లేజర్స్‌ని పల్స్‌మోడ్‌లో ఆపరేట్‌ చేస్తారు. పల్స్‌ రిపిటిషన్‌ రేట్‌ ప్రకారం లేజర్‌ కిరణాలు ప్రసరిస్తాయి. సాధారణంగా సెకండుకి 10 పల్స్‌స్‌ రేట్‌ ప్రకారం లేజర్‌ కిరణాలు ప్రసరించేట్టు చూస్తుంటారు.
థెర్మోకోయాగ్యులేటింగ్‌ ఎఫెక్ట్‌ వల్ల గత ఇరవై సంవత్సరాలుగా లేజర్‌ కిరణా లను దంత వైద్యానికి సంబంధించిన వివిధ చికిత్సలకి ఉపయోగిస్తున్నారు.

సాఫ్ట్‌ టిష్యూ చికిత్సలకి లేజర్‌తో బాగా నిర్వహించవచ్చు స్టెరిలైజింగ్‌ కోయాగ్యులేటింగ్‌ ఎఫెక్ట్‌వల్ల మామూలు పద్ధతుల కన్నా ఈ లేజర్‌ చికిత్స ఎంతో ఉపయోగం. రక్తస్రావం,నొప్పి ఉండవు. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌‌స కూడా ఉండవు. మందుల అవసరం ఉండదు.

అనస్తేషియా లాంటి మత్తునిచ్చే మందుల అవసరం అక్కర్లేదు.అవసరమైన చోటికే లేజర్‌ కిరణాలను పంపడం...ఎంత వేగంతో కావాలంటే అంత వేగంతో పంపడం వైద్యుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో ఇటువంటి లేజర్‌ చికిత్సలకు భయపడనవసరం లేదు. ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ టెక్నాలజీని ఉపయోగించి సులభ పద్ధతుల ద్వారా పంటి సమస్యలను వైద్యులు పరిష్కరించగలుగుతున్నారు.

లేజర్‌ కిరణాలని ఉత్పత్తి చేసే సోర్స్‌ ఘనరూపంలో ఉండవచ్చు. ద్రవరూపంలో ఉండవచ్చు. వాయురూపలో ఉండవచ్చు. రెండవది యాక్టివ్‌ మీడియా పరమాణువుల్ని స్టిమ్యూలేట్‌ చేసే ఎనర్జీ సోర్స్‌ పల్స్‌డేలో ప్రెజర్‌ జినాన్‌ ఫ్లాష్‌లాంప్‌.

- డాక్టర్‌ జాన్‌ అబ్రహం,దంత వైద్య నిపుణులు.

వృద్ధుల్లో దంతాలు జాగ్రత్త

వయసు పెరుగుతున్నకొద్దీ వృద్ధుల్లో దంత సమస్యల ముప్పూ ఎక్కువవుతుంది. అయితే దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తే వీటి బారి నుంచి తప్పించుకోవచ్చు. ఇందుకు తగు జాగ్రత్తలతో నోటి శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వటం ఎంతో అవసరం.

* రోజూ ఉదయం, రాత్రి ఫ్లోరైడ్‌ టూత్‌పేస్ట్‌తో పళ్లను తోముకోవాలి. దంతాల మధ్య శుభ్రత కోసం ఫ్లాసింగ్‌ కూడా చేసుకోవాలి. కట్టుడుపళ్లు గలవారు వాటిని రోజులో కనీసం నాలుగు గంటల పాటు తీసి పక్కనపెట్టాలి. ఈ పళ్లను పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. కనీసం ఏడాదికి ఒకసారైనా దంత వైద్యుడిని సంప్రదించాలి. పొగ అలవాటుంటే వెంటనే మానెయ్యటం మంచిది.

  • ==========================
Dr.Seshagirirao MBBS

Saturday, November 7, 2009

కలరా ,Cholera


  • కలరా చిన్న పిల్లలకు సెలైన్ ----------------కలరా లో డీహైడ్రేషన్ --------------------------కలరా బాక్టీరియా


కలరా (Cholera) అనునది అతిసార వ్యాధి. ఈ వ్యాధి విబ్రియో కలరే అను బాక్టీరియా వలన కలుగుతుంది. ఇది నీరు ద్వారా లేదా ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రాణాంతక వ్యాధి. ఆతి విరోచనాలతో మొదలయ్యే ఈ వ్యాధి సోకిన వెంటనే వైద్య సహాయం అందకపోతే రోగి మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ప్రపంచంలో నమోదవుతున్న కలరా కేసులు ఎక్కువగా ఆఫ్రికా ఖండం నుంచి నమోదవుతున్నవే. ఇంకా పర్యవేక్షణా లోపం వల్ల చాలా కేసులు సకాలంలో అధికారుల దృష్టికి రాకుండా ఉన్నాయి. కలరా సోకిన తర్వాత ఆఫ్రికాలో 5% మంది చనిపోతున్నారు. అదే ఇతర దేశాల్లో అయితే ఇది కేవలం 1% మాత్రమే.
  • లక్షణాలు
* నీళ్ల విరెచనాలు అధికంగా కావడం.
* వాంతులవడం, మరియు
* కాళ్ల కండరాలు పట్టుకుపోవడం/తిమ్మిరెక్కడం.

  • కలరా ఎలా వస్తుంది?

కలరా బ్యాక్టీరియమ్‌ గల కలుషితమైన నీటిని తాగడం లేదా కలుషితమైన ఆహారం తినడం ద్వారా ఏ వ్యక్తికైనా రావచ్చు. అంటువ్యాధిసోకిన వ్యక్తి యొక్క మల విసర్జితంతో కలుషితమైన వాటి మూలంగా సమాజం లోని కూటమి ఒకే చోట నివసించే వారందరికిని కి సామాన్యంగా కలరా వస్తుంది. మురుగునీరు, మంచి నీటి సదుపాయాలు తగిన రీతిలో లేనప్పుడు శీఘ్రంగా ఈ వ్యాధి వా్యపిస్తుంది.

చవిటిగా ఉండి కొద్దిగా ఉప్పదనంగల నదులలోను, సముద్ర తీరపు నీటి వాతావరణంలో కూడ కలరా బ్యాక్టీరియమ్‌ నివసించగలదు.
శుభ్రంగాలేని లేదా సరిగా ఉడకని ఎండ్రకాయ, రొయ్యలు మెదలగు వాటిని తినడం మూలంగా కలరా రావచ్చును. ఈ వ్యాధి నేరుగా ఒకరి నుండి మరొకరికి వ్యాపించదు. కాబట్టి, సాధారణ స్పర్శ ద్వారా అంటువ్యాధి సోకిన వ్యక్తి నుంచి మరొకరికి వచ్చే ప్రమాదం లేదు.


చికిత్స

చాలావరకు కలరా కేసులను ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ ద్వారా నయం చేయవచ్చు.
తీవ్రమైన వ్యాధిగలవారిలో కూడ రక్తనాళాలకు నేరుగా ఈ ద్రవాన్ని చేరేటట్లుగా ఎక్కించాలి. శరీరం కోల్పోయిన ద్రవాలను తిరిగి చేరేటట్లు చేయాలి. నిర్జలీకరణాన్ని లేకుండ చేయడం ద్వారా ఒక శాతం కన్నా తక్కువ మంది కలరా వ్యాధిగ్రస్తులు చని పోతున్నారు.

ఏంటీబయాటిక్స్‌ వల్ల చికిత్సా సమయం తగ్గించబడి, వ్యాధి తీవ్రత తగ్గుతుంది. తీవ్రమైన విరేచనాలు మరియు వాంతులతో బాధపడుతున్న వ్యక్తులకు తక్షణమే వైద్య చికిత్సను అందుబాటులోకి తేవాలి.
వ్యాది తీవ్రత బట్తి : 24 గంటలవర్కూ నోటి ద్వారా ఏమీ ఇవ్వకూడదు . సెలైన్లు ద్వారా కోల్పోయిన నీటిని, లవణాలను బర్తీచేయాలి. అదే సలైన్లలో IV యాంటిబయోటిక్స్ ఇవ్వాలి . సాదారణముగా
డాక్షిసైక్లిన్లు , టెట్రసైక్లిన్లు , సిప్రోఫ్లోక్షిన్లు , సెఫలోస్పోరిన్లు ఇస్తారు . వ్యాది తీవ్రత తగ్గిన తరువాత నోటిద్వారా ఫ్లూయిడ్స్ , యాంటిబయోటిక్స్ 2-3 రోజులు ఇవ్వాలి .

  • నివారణ

కలరా వ్యాధి ప్రాణాంతకమైనా దీన్ని మన దైనందిన కార్యక్రమాలన్నింటిలో పరిశుభ్రతను పాటించడం ద్వారా సులభంగా నివారించవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో నీటిని శుద్ధం చేయడానికి మంచి సాంకేతిక పద్దతులు అమలులో ఉండటం వలన ఇది ఆ దేశాల్లో చాలా అరుదు గా కనిపిస్తుంది.
కలరా వాక్షిన్‌ తీసుకోవడము మంచిది .

  • తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు

* బూడిద సేకరణ గుంటలను శుభ్రపరచడం, స్వేచ్చగా గాలి ప్రసరించెటట్లుగానూ మరియు ఉంటున్న ప్రదేశంలో అంటు వ్యాధిసోకకుండా చేయడం.
* శారీరకంగా లేదా మానసికంగా అధిక అలసట చెందకుండా చూసుకోవాలి. శీఘ్రంగా ఉష్ణోగ్రతలో వచ్చే మార్పులకు గురి కాకూడదు.
* గుంపులలో ఉండడం చేయకూడదు.
* మరగకాచిన నీటిని చల్లార్చి, ఒక సీసాలో సగం వరకు నింపి చక్కగా బిగించి ఉంచి తాగే కొద్దినిమిషాల ముందు సీసాను బాగా గిలకరించాలి. మంచి నీటితో నింపే సీసాతోబాటు, నీరు తాగే కప్పులను లేదా గ్లాసులను కూడ సలసల కాగే నీటిలో వేసి శభ్రం చేయాలి.
* మరగించని దేనినీ కూడ తాగకూడదు.
* అన్నీ ఆహార పదార్ధాలను బాగా వండాలి. కాచిన నీటిలో బాగుగా కడిగిన పండ్లనన్నింటినీ వేడి నీటిలో కడిగిన గిన్నెలలో మాత్రమే ఉంచాలి ; లేదా పండ్లను కడిగిన తర్వాత వాటిపైన గల తొక్కలను తొలగించడం, లేదా బట్టతో అన్ని రకాల పండ్ల పైన కప్పి ఉంచడం మెరుగైన పద్ధతి.
* సామాన్యంగా తీసుకునే రొట్టె , వెన్నకు బదులుగా వెచ్చ చేసిన (నిప్పుల ముందు కల్చిన) వాటిని తీసుకోవాలి.
* వేడి, వేడిగా భోంచేయడం చాలా మంచిది.
* అన్ని గిన్నెలు, గ్లాసులు, కత్తులు, ఫోర్కులు, చెంచాలు, పెనము/బాణలి, తినడానికి వినియోగించే అన్నింటినీ ఉపయోగించడానికి ముందు, వేడి నీటితో కడగాలి. ఏవేవిుటి తయారుచేస్తారో వాటిని అన్నింటిని వేడిపొయ్యి పై వేడిమితో ఉంచాలి.
* మరగకాచని నీటిలో దేనిని కడగరాదు.
* రోజులో చాలాసార్లు , భోజనానికి ముందు చేతులను, ముఖాన్ని కార్బాలిక్‌ ఆమ్లంతో కలిసిన కాచిన నీటితో శుభ్రం చేసుకోవాలి.
* వీలైతే ప్రతీసారి శుభ్రంగా ఉతికిన తువ్వాళ్ళనే వాడాలి.
* కడగడానికి వినియోగించే నీటిని మరిగే ఉష్ణోగ్రత వద్దకు వచ్చేటంత వరకు ఉంచి తర్వాత చల్లబరచాలి.
* పక్క బట్టలను, విసర్జన శాలలో ఉపయోగించే బట్టలను మరిగే నీటిలో వేసిన తర్వాత ఎండలో ఆరవేయాలి.
* వాడిన ప్రతీసారి కంచాలను/పళ్ళాలను శుభ్రపరచే బట్టలు, అన్నీ రకాల పొడిగా ఉంచే బట్టలను మరిగే నీటిలో వేయాలి. మరల వాడ వలసినప్పుడు బాగా ఆరబెట్టి, వేడిచేయాలి.
* కుటుంబంలో ఒక వ్యక్తికి గనక కలరా వేస్త అతనిని ఇతరులు నుండి విడిగా ఉంచాలి.
* కలరా రోగిగ్రస్తుల దేహాలను శుభ్రపరచడానికి లేదా వారి దుస్తులను మరియు మురికైన బట్టలను జాగ్రత్తగా తొలగించడానికి, నోటిని, ముక్కురంధ్రాలను అరంగుళం మందం మేరకు దూదిని/ బట్టతోదట్టించిన స్వచ్చమైన లోహపు బట్టతో తయారుచేసిన చిన్నపాటి ముసుగుతో కప్పి ఉంచుకోవడం తప్పనిసరిగా చేయాలి. ముసుగును /తొడుగును 150డిగ్రీల సెంటిగ్రెడ్‌ వేడిమికి గురిచెయ్యాలి . వినియోగించిన ప్రతిసారి అంతే వేడిమి ఉండేటట్లు చూడాలి. మంట కొలిమి యెదుట ముసుగును పట్టుకుని ఉంటె ఆ వేడిమి కల్గుతుంది. వాడిన ప్రతీసారి అదే వేడిమి చివరిదాకా ఉండాలి.
* కలరా రోగగ్రస్తులను ఉంచిన గదులను ముందుగా అనేక గంటలేసపు ఎవ్వరూ లేదా ఇతరులు ప్రవెశించకుండా మూసి ఉంచాలి.