Tuesday, November 17, 2009

అందం గా ఉండడానికి టిప్స్ , Tips for beauty
అందం గా ఉండాలనే కోరిక ప్రతిఒక్కరిలొనూ ఉంటుంది . నేడు ఆ అందచందాల్ని పొందడానికి బ్యుతీపార్లర్లను ఆశ్రయిస్తునారు . .. లేదా వివిధ రకాలైన వ్యాపార ప్రకటనలను చూసి ప్రభావితమవుతునారు . ఈ కృత్రిమ రసాయన ఉత్పత్తుల వాడకం వల్ల అందచందాలు వస్తాయో లేదో కాని కొన్ని చరం సమస్యలు తలెత్తుతున్నాయి .

కుంకుమ ,కాటుక , తిలకం వంటివన్నీ సౌందర్య సాధనాలే . పసుపు , పెరుగు , మీగడ , కోడిగుడ్డు వంటివాటివన్నీ ఉపయోగించుకొని చర్మ సౌందర్యం పెంచుకోవచ్చును . కొన్ని టిప్స్ చూద్దాం .

టిప్స్ :

1 . ముఖ చర్మం కోమలం గా కనిపించేందుకు ప్రక్రుతి ప్రసాదించిన టమాటో చాలు . తాజా గా ఉన టమాటో లను బాగా చితకకొట్టి అలా వచ్చిన రసానికి రెండు చెంచాల పాలు కలుపగా వచ్చిన గుజ్జును ముఖానికి రాసుకుని పది , పదిహేను నిముషాలు ఉంచి ఆ పైన నీటితో కడుక్కోవాలి . దీనివలన చర్మం పైన మ్రుతకనాలు తొలగించబడతాయి . పైగా చర్మం లోపలికి వెళ్లి శుభ్రం చేస్తుంది . ముఖం పైనుండే జిడ్డు తొలగిపోయి చర్మానికి తాజాదనాన్ని , కాంతిని ఇస్తుంది .

2. ముకం మీద ముడతలు వస్తే ముసలితనాన్ని ఎత్తిచుపుతుంది .. దీనికిగాను పైనాపిల్ రసం , యాపిల్ రసం , నిమ్మరసము ఒక్కో స్పూను చొప్పున్న తీసుకొని బాగా కలియబెట్టి ముఖానికి పట్టించి , ౧౫ -౨౦ నిముషాలు ఉంచి ముఖం కడుగుకోవాలి . ముడతలు తగ్గిపోతాయి ..ఒక వారం రోజులు చేస్తే .. ఇలా ప్రతి వారం ఒకసారి చేయాలి .

3 . జిడ్డు ముఖం ఉన్నవారు విచారించానవసరం లేదు ... ముఖం మీద గుడ్డు సొనను రాసుకోండి . ముఖం ఎండిన రీతిలో నుంటే పచ్చ సోన ను తీసుకొని బాగా గిలకకొట్టి ముఖానికి రాసుకొని 15 నిముషాలు ఉంచి కడుక్కోవాలి . గుడ్డు సోనలు రెండు చరం మీదుండే రంధ్రాల వెడల్పును తగ్గించి , ముఖకారమం ముడుతలు రాకుండా చూస్తాయి . మడుదటలు తగ్గిస్తాయి . ప్రతి వారం ఒక రోజు చేయాలి .

4 . ముఖానికి వెలుగుకోసం ... గులాబి రంగుకోసం కాళ్ళు కొంచం ఎత్తు లో ఉన్నాట్లు పడుకోవాలి ... ఇలా చేయడం వలన మెడకు , ముఖానికి ,తలకి రక్తం సరఫరా ఎక్కువై గులాబీ రంగు ఛాయా ముఖం పై వెలుగుతుంది . వారానికి మూడు రోజులు చేస్తే సరిపోతుంది .

5. అందానికి పండ్లు పనికొస్తాయి ... ఒక స్పూన్ బొప్పాయి గుజ్జు , ఒక స్పూన్ ద్రాక్ష గుజ్జు , ఒక స్పూన్ నిమ్మరసం ముద్దలా తయారుచేసి ముఖానికి పట్టించి , 15 - 20 నిముషాలు ఉంది ముఖం కడుక్కోవాలి . ముఖ చర్మం బిగుతుగాను , కాంతివంతం గాను ఉంటుంది .

6 . ముఖం తజదనానికి ... తాజా మీగడను ముఖం మీద నెమ్మదిగా మర్ధనచేయాలి సుమారు ౧౫ నిముషాలు చేసి కడుగుకోవాలి . ముఖచారం మీద ఉన్న మృతకణాలు రాలిపోయి తాజాదనం వస్తుంది.

7 . ముఖం అందం లో శిరోజాల పాత్ర ... అందుకే వాటికి తగిన కన్డిసనర్ వాడాలి . అరటి , దోస , తమటోల గుజ్జు పెరుగు కలిసి తయారు చేసుకున్న ముద్దను శిరోజాలకు పట్టించి ఒక గంటసేపు ఉంది , ఆ తర్వాత శాంఫో తో తలస్నామం చేయాలి . శిరోజాలు చక్కగా వెలుగునిస్తూ కొత్త అందాన్నిస్తాయి .

8 . అందానాని కి ఆహారము పాత్ర .... అందం కోసం ఎన్ని రకాల భాహ్య సాధనాలు వాడినా అసలు అందం శరీర ఆరోగ్యం ద్వారానే వస్తుంది . ఆకుకూరలు , పండ్లు , పాలు , వారి , గోధుమ మున్నగు వాటితో సంపూర్ణ ఆహారము తినాలి . యాంటి ఆక్షిదేంట్లు ఎక్కువగా తీసుకోవాలి ... క్యారత్స్ , గుడ్లు , పాలు మున్నగునవి .

9 . అందానికి కళ్లు పాత్ర .... ముఖానికి అందం కల్లనుండే వస్తుంది . కళ్లు కాతివంతం గా ఉండాలి , అలసిన కళ్లు అందాన్ని పాడు చేస్తాయి . కీర ముక్కలు కళ్లు మీద పెట్టుకుంటే అలసతపోతుంది . చల్లని దోసముక్కలైతే మంచిది . కనుబొమలు , కనురెప్పలు అందం గా ఉంచాలి . కాటుక కొద్దిగా పెట్టుకోవాలి .

10 . ముఖం మీద నల్ల మచ్చలు ముఖం అందం పాడుచేసతాయి . " బ్లాక్ హెడ్స్ గా " పేర్కొన్న వీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి . పెరుగు , నల్లమిరియాలపొడి , కలిపిన ముద్దను ముఖం మీద ఉంచి ౧౫- ౨౦ నిముషాల తరువాత కడుక్కోవాలి ... బ్లాక్ హెడ్స్ రారిపోతాయి .

11 . అందానికి వ్యాయామము పాత్ర .... వ్యాయామం చేయడం వల్ల శరీరం లోని మలినాలు పోయి చర్మమ కాంతివంతం గా తయారువుతుంది . వ్యాయామము వలన రాకతప్రసరణ పెరిగి శరీర ఆరోగ్యం బాగుపడుతుంది .. అందువల చర్మ కణాలు కాన్తివంతమవుతాయి .

12. అందానికి నిద్ర పాత్ర .... ఆరోగ్యానికి , నిద్రకు ప్రత్యక్ష సంభందం ఉన్నది . తగినంత నిద్ర లేకపోతె దాని ప్రభావం శరీర ఆరోగ్యం పై పడుతుంది . నిద్ర లేమి కళ్లు అలసటగా కనిపిస్తాయి . అందవిహీనం గా కనిపిస్తాయి . నిద్రలో అనేక శరీర కణాలు రిపేరు జరుగు తాయి . కొత్తకనాలు తయారవుతాయి . కొత్త కణాలు కొత్త అందాన్ని నిస్తాయి .

సౌందర్యానికి అమ్మ చెప్పిన చిట్కాలు :
1. కళ్ళు :
మన శరీరంలో ప్రధానమైనవి.అందుకే మన పెద్దలు "సర్వేంద్రియాణాం నయనం ప్రధానం" అన్నారు.మరి అంతటి ప్రాధాన్యం ఉన్న కనులకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం? పాతకాలంలో ఐతే కళ్ళకు చక్కగా కాటుక పెట్టుకునేవారు స్త్రీలతో పాటు పురుషులు కూడా!!కానీ రాను రాను కాటుక పెట్టుకునే వారు తక్కువ అయ్యారనే చెప్పాలి.కాటుక లో ఉండే సుగుణాలు చెప్పటం అసాధ్యం.మన పెద్దలు ఏ పని చేసినా దానికి ఖచ్చితంగా ఒక మంచి కారణం ఉంటుంది.అందుకే ఈ పోస్ట్ లో నేను మీకు ఒక మంచి కాటుకకు సంబంధించిన చిట్కాను అందించబోతున్నాను.దీన్ని మీరే ఇంట్లో తయారుచేసుకుని మీ కళ్ళ సమస్యలను పోగొట్టుకోవచ్చు.దీన్ని ఎప్పటికప్పుడు తయారుచేసుకోవచ్చు.దీనికి కావలసినవి..పెద్ద ఉల్లిపాయ రసం, మంచి తేనె, ఒక్క నలుసు పచ్చ కర్పూరం.ఒక్క బొట్టు ఉల్లిరసం తీసుకుని ఒక ప్లేట్ లో వేసి అందులో ఒక్క చుక్క తేనె,ఒక్క నలుసు పచ్చ కర్పూరం వేసి బాగా కలిపితే కాటుక వస్తుంది. దీన్ని రోజూ కళ్ళకు పెట్టుకోవటం వల్ల కంట్లోని పొర, నలుసులు, దృష్టి లోపం వంటి సమస్యలు కేవలం 20 రోజుల్లోనే నివారించబడతాయి.

2, ఉబ్బసం తో బాధ పడేవారికి :
ఉబ్బసం తో బాధ పడేవారికి ఒక మంచి "మన అమ్మ" చిట్కా.. రాత్రి పడుకునే ముందు రెండు యాలకులు (ఇలాచి)ను, దంచి లోపలి గింజలను తినాలి. అంతే ఇక ఆ రాత్రి ఉబ్బసం మిమ్మల్నిబాధించదు .

3 . అందమైన పాదాల కోసం :
పాదాలు కోమలత్వాన్ని సంతరించుకోవటానికి ఏం చేయాలో "మన అమ్మ"చిట్కా లో తెలుసుకుందాం.ఇంతకు ముందు నేను చెప్పిన చిట్కా పాటిస్తూ, నిమ్మచెక్క తో పాదాలను రుద్దండి.ఇలా తరచూ చేయటంవల్ల పాదాలు తెల్లగా, కోమలంగా తయారవుతాయి. పాదాలు ఎక్కువగా నీటిలో తడవకుండా , బాక్టీరియా పాదాలకు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి . వారానికి ఒకసారైనా పాదాలకు యాంటిఫంగల్ క్రీమ్‌ ను రాయాలి . పాదాలకు ధరించే సాక్స్ విషయము లో పర్తిరోజూ ఉతికినవి మార్చాలి . పాదాలకు పగుళ్ళు ఏర్పడితే వైట్ పెట్రోలియం జెల్లీ రాస్తుండాలి .

4. అందమైన చేతుల కోసం :
చేతులు సౌందర్య భాగాల్లో ముఖ్యమైనవి గా చెప్పుకున్నాం కదా..ఈ పొస్ట్ లో కూడా ఒక మంచి సులువైన "మన అమ్మ"చిట్కాను చెప్పబోతున్నాను.ఏదైనా డిటర్జెంట్ మీ చేతులతో ఉపయోగించినప్పుడు పని పూర్తవ్వగానే నిమ్మచెక్కతో రుద్దండి. మీ చేతులు కోమలత్వంతో అందంగా తయారవుతాయి. రోజుకి నాలుగు సార్లైనా మాయిశ్చరైజర్ క్రీమ్‌ చేతులకు రాస్తుండాలి . గోళ్ళు అందం గా కనిపించడానికి కాల్సియం ఎక్కువగా లబించే ఆహారము తినాలి .

5 .అందమైన పెదవుల కోసం :
పెదవులు అందంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి..!!కానీ ఈ రోజుల్లో భోజనం లో వచ్చిన మార్పులు, నిద్రలేమి, ఎక్కువ గాఢత కలిగిన పేస్ట్లు, రక్తహీనత వల్ల కూడా పెదవులు పాడవుతున్నాయి.పెదవులు తోలు ఊడిపోయి, చివరలు పగిలి, నల్లగా కళావిహీనంగా తయారవుతున్నాయి.కొద్దిపాటి ఖర్చు తోనే మనం ఈ సమస్యను అధిగమించవచ్చు.నాకు తెలిసిన , మనపూర్వీకుల నుండీ వస్తున్న ఒక మంచి ఆయుర్వేద చిట్కా ను మీకు కూడా చెప్పబోతున్నాను.ఆయుర్వేదం కూడా వేదాలలో ఒక భాగమే…అదేమిటో తెలుసుకుందాం "మన అమ్మ" చిట్కాలో..దీనికి కవలసిన పదార్ధాలు..జాజికాయ - 50గ్రా, పాలు- సరిపడా, దంచిన పసుపు - 50గ్రా, నాటు ఆవు నెయ్యి - 50గ్రా. జాజికాయలను పగలగొట్టి పై బెరడుని దంచి పొడి చేయాలి.తరువాత స్టవ్ వెలిగించి, ఒక గిన్నె లో పాలు పోసి పైన వస్త్రం కట్టాలి.ఈ వస్త్రం లో జాజికాయపొడిని వేయాలి.ఇలా ఒక 10నిమిషాలు ఉంచి , తీసి ఈ పొడిలో పసుపు కలిపి,గాజు సీసాలో నిల్వ చేసుకుని, పెదవులు నల్లగా ఉన్నవారు, పొక్కులు వచ్చిన వారు, అంచులు పగిలిన వారు రాత్రిపూట మాత్రమే నెయ్యిలో ఈ పొడిని తీసుకుని బాగా రంగరించి, పెదవులకు పట్టించి మృదువుగా మర్దనా చేయండి.దీనివల్ల పెదవులు తేనెలూరుతూ, ఎర్రగా నిగనిగలాడతాయి.

5 .అందమైన మోము కోసం :
ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య "మొటిమలు".వీటి నివారణకు "మన అమ్మ" చిట్కాను తెలుసుకుందాం.. గులాబి, బచ్చలి ఆకులను తీసుకుని మెత్తగా రుబ్బి మొటిమల మీద రాస్తూ ఉంటే పదిహేను రోజుల్లోనే తేడాను గమనించవచ్చు.
a) అందమైన మోము కోసం పచ్చిపాలతో..
ముఖం తెల్లగా ఉండాలని అందరికీ ఆశ గా ఉంటుంది.కానీ ఉన్న రంగులోనే ముఖం ఇంకొంచెం ఛాయ పెరిగేలా, ముఖం నునుపు గా వచ్చేలా చేయొచ్చు.అదేంటో తెలుసుకుందాం "మన అమ్మ" చిట్కా లో..
పచ్చిపాలు, మంచి గంధం సరిపడా తీసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాత్రమే కాక, మెడకు, చేతులకు పట్టించి ఆరాక చల్ల నీటితో కడిగేయండి. ఇది క్రమం తప్పకుండా ఒక నెల రోజులు వాడి చూడండి.. తేడా మీకే తెలుస్తుంది.ఇది ముఖానికి పట్టించి, ముఖాన్ని కడిగేశాక ముఖం ఎంత మెరుపు, నునుపును సంతరించుకుంటుందో తెలియాలంటే "మన అమ్మ" చిట్కాను పాటించి మీరంతా అందంగా తయారవుతారని ఆశిస్తున్నాను.

b) అందమైన మోము కోసం.- టొమాటో, బీట్రూట్, క్యారట్...సౌందర్య చిట్కా- అందమైన మోము కోసం.
ఇంట్లో దొరికే కూరలతోనే ఒక అద్భుతమైన ఫేస్ ప్యాక్ మీ కోసం "మన అమ్మ" చిట్కా లో..
టొమాటో, బీట్రూట్, క్యారట్ ఈ మూడిటిని మెత్తటి ముద్దచేసి, అందులో కొంచెం పాలమీగడ వేసి బాగా రుబ్బి, వీలు దొరికినప్పుడల్లా ఈ ఫేస్ ప్యాక్ ను పట్టించటం వల్ల ముఖం కాంతివంతంగా, ప్రకాశవంతంగా ఉంటుంది.

చలికాలంలో చర్మం సహజమెరుపును కోల్పోయి అందవిహీనంగా తయారవుతుంది. ఒకింత నల్లగా మారుతుంది కూడా. ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలంటే...
  • * చలికాలం ఎండ ఒంటికి అంత మంచిది కాదు. బయటికి వచ్చేటప్పుడు సన్‌స్క్రీన్‌లోషన్‌ తప్పక రాసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. పచ్చికూరలూ పళ్లూ అధికంగా తినాలి.
  • * సబ్బును ఉపయోగించకుండా వీలైనన్నిసార్లు మంచినీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
  • * పాలు సహజ వైటెనర్‌గా పనిచేసి చర్మం నల్లగా అవకుండా రక్షిస్తాయి. గోరువెచ్చటి పాలలో మెత్తటి వస్త్రాన్ని ముంచి దాంతో ముఖంపై అద్దాలి. బాగా ఆరిపోయాక చల్లటి నీళ్లతో కడిగెయ్యాలి. రోజూ ఇలా చేస్తుంటే... చలి కారణంగా మెరుపు కోల్పోయిన చర్మం సహజమెరుపును సంతరించుకుంటుంది.
  • * ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మారోగ్యాన్ని సంరక్షిస్తాయి. అవి పుష్కలంగా లభ్యమయ్యే పాలు, చేపలు, వాల్‌నట్స్‌, సోయా, అవిసె గింజలు ఆహారంలో భాగం చేసుకోవాలి.
  • * పెరుగులో నాలుగైదు చుక్కల నిమ్మరసం వేసి ముఖానికి రాయాలి. ఈ మిశ్రమం మంచి బ్లీచింగ్‌ ఏజెంట్‌లా పనిచేస్తుంది.
  • * సెనగపిండి, పాలు కలిపి పేస్టులా చేసి రాయండి. పావుగంట తర్వాత కడిగేస్తే చర్మం సరికొత్త కాంతులీనుతుంది.
  • * రెండు నిమ్మచెక్కలను తీసుకుని ముఖంపైనా మెడపైనా రుద్ది ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం తేటగా ఉంటుంది.

ముఖం ప్రకాశవంతంగా అందంగా కనిపించడానికి : మార్కెట్లో రకరకాల సబ్బులూ క్రీములూ దొరుకుతాయి. కానీ వాటి కన్నా చర్మాన్ని శుభ్రపరిచే సహజగుణాలు కలిగిన పసుపు, శనగపిండి, తేనె వంటివి వాడటం వల్ల మరిన్ని లాభాలు ఉన్నాయంటున్నారు సౌందర్య నిపుణులు.

* అరకప్పు పాలల్లో అరకప్పు శనగపిండి, చెంచాడు పసుపు కలపండి. తయారైన మిశ్రమాన్ని ముఖానికీ మెడకూ పట్టించండి. ఐదునిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగెయ్యండి. జిడ్డు చర్మం గలవారికి ఈ ప్యాక్‌ బాగా పనిచేస్తుంది.
* ఒక దోసకాయ తీసుకుని దాని రసం తీయండి. అందులో నాలుగైదు టేబుల్‌స్పూన్ల పెరుగు కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి రాయండి. ఐదు నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగెయ్యండి. ఈ ప్యాక్‌ స్వేదరంధ్రాలను శుభ్రపరచి బిగుతుగా ఉండేలా చేస్తుంది. తద్వారా ముఖం కాంతిమంతంగా తయారవుతుంది.
* ఒక కప్పు పెరుగులో టేబుల్‌స్పూన్‌ తేనె కలపండి. బాగా కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసి ఐదునిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగెయ్యండి. పొడిచర్మం గలవారికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.
* అరకప్పు గోరువెచ్చటినీళ్లలో ఒక టేబుల్‌స్పూన్‌ తేనె వేయండి. మందుల షాపులో దొరికే ఎ, ఇ విటమిన్‌ టాబ్లెట్లను ఒక్కొక్కటి తీసుకొని వాటి పొడిని తేనె, నీళ్ల మిశ్రమంలో వేసి బాగా కలపండి. తరచుగా ఈ చిట్కాను పాటిస్తే ముఖంపై ఉండే మచ్చలు క్రమంగా తొలగిపోతాయి.

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.