Thursday, May 13, 2010

ఫైలేరియా , Filaria







ఫైలేరియాసిస్- హెల్మెంత్ వర్గానికి చెందిన సన్నని పరాన్నజీవి వలన కలుగుతుంది. ఈ వ్యాధి మానవుని మరణానికి దారితీయకపోయినప్పటికీ, దీని వలన కలిగే దుష్పరిణామాలు మాత్రం చాలా తీవ్రమైనవి. వ్యాధి సంక్రమణను సరిగా అంచనా వేయడం, ప్రాథమిక దశలో గుర్తించడం కష్ట సాధ్యం. ఈ వ్యాధి నుండి పూర్తి విముక్తికి మార్గం లేదు. రాకుండా చూసుకోవడమే ఉత్తమం. ఈ వ్యాధి సోకిన వారి వ్యాధినిరోధక శక్తి లోపించి యితర వ్యాధులకు గురి కావడానికి అవకాశం ఎక్కువ అవుతాయి. వాపుల వలన సాధారణమైన పనులు చేసుకోలేకపోవడం, అంగవైకల్యం, శారీరక, మానసిక వ్యధ యీ వ్యాధి వలన కలిగే దుష్పరిణామాలు.


బోదకాలు : కాళ్ళు చేతులలోని శోషరస నాళాల్లో శోషరస గ్రంథుల్లో చేరిన క్రిములు పెద్ద సంఖ్యలో పెరిగిపోతాయి దీనితో ఆ భాగాలు ఉబ్బి పరిమాణం కూడా పెరుగుతుంది. దీనినే బోదవ్యాధి-ఫైలేరియా లేక ఏనుగుకాలు (ఎలిఫెంటియాసిస్‌) వ్యాధి అని అంటారు.

కాలానుగుణంగా దోమల వలన వచ్చే సీజనల్‌ వ్యాధులు : మెదడు వాపు వ్యాధి -(జపనీస్‌ ఎన్‌సెఫలైటీస్‌), బోదకాలు వ్యాధి -(ఏనుగుకాలు), డెంగ్యూ జ్వరం , ''మలేరియా జ్వరం'', చికున్‌ గున్యా జ్వరం ... మున్నగునవి .

  • బోదకాలు వ్యాధి -ఏనుగు కాలు (లింఫాటిక్‌ ఫైలేరియాసిస్‌)
ఫైలేరియా లేక బోదకాలు వ్యాప్తి : ముఖ్యంగా బోద వ్యాధి ''ఉచిరీరియా బాంక్రాప్టై'' అను సన్నని దారం లాంటి పరాన్నజీవి (క్రిమి) వలన కలుగుతుంది. ఈ క్రిమి ''క్యూలెక్స్‌'' దోమకాటు ద్వారా మన శరీరంలో ప్రవేశించి లింఫ్‌ నాళాలను పాడుచేస్తుంది. నిజానికి మన శరీరంలో లింఫ్‌ నాళాలు కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. ఒక రకంగా ఇవి సమర్థంగా పనిచేసే డ్రైనేజి గొట్టాలాంటివి. రక్తనాళాల్లాగానే ఈ లింఫ్‌ నాళాలు కూడా ఒళ్లంతా ఉంటాయి. రక్త నాళాల నుండి లీక్‌ అవుతుండే స్రావాలను, కణవ్యర్థాలను తిరిగి గుండె దగ్గరికి తీసుకువెళ్తుంటాయి. ఫైలేరియా క్రిములు ప్రధానంగా ఈ లింఫ్‌ నాళాల్లోచేరి వీటిని పాడుచేస్తాయి, కాబట్టి సరైన డ్రైనేజి వ్యవస్థ లేక కణాల మధ్య లింఫ్‌ స్రావాలు ఎక్కడివక్కడే ఉండిపోయి ముందుగా కాలు ఉబ్బడం ఆరంభమవుతుంది. ఈ వ్యాధి అన్ని వయస్సుల వారికి వస్తుంది. చిన్నతనంలో సోకిన ఈ వ్యాధి పెద్దయ్యాక రోగ లక్షణాలు బయటపడతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం సుమారు 12 కోట్ల మంది ప్రజలు లింఫాటిక్‌ ఫైలేరియాసిస్‌కు గురౌతున్నారు. ప్రపంచంలో 80 దేశాల్లోకెల్లా భారతదేశంలోనే అత్యధికంగా కేసులు ఉన్నాయి. భారత్‌లో 28 రాష్ట్రాల్లో ఫైలేరియా కేసులు నమోదౌతున్నాయి. మన ఇంట్లో గాని, వీధిలో గాని, ఊరులో గాని ఫైలేరియా వ్యాధిగ్రస్తులు ఉంటే చుట్టుపక్కల వారికి వచ్చే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఈ వ్యాధి ప్రబలంగా ఉంది. కాబట్టి సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ బోద వ్యాధి గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఫైలేరియా వ్యాధి లక్షణాలు : 1. శరీరంలో ఫైలేరియా క్రిములు ప్రవేశించిన తర్వాత వ్యాధి లక్షణాలు కనబడడానికి 8 నుండి 16 నెలలు పట్టవచ్చు. 2. తొలిదశలో కొద్దిపాటి జ్వరం, ఆయాసం రావడం, తలనొప్పి వణుకు, 3. శోషనాళాలు పాడైపోయి, లింఫ్‌ ప్రసరణ ఆగిపోయి కాళ్లు, చేతులు వాయడం, 4. వాచిన చోట నొక్కితే సొట్ట పడడం, 5. చర్మంపై మచ్చలు, పుండ్లు, కాయలు, దురద పెట్టడం, రసి కారడం, 6. వరి బీజము (బుడ్డ) మర్మావయాలు పాడవడం, 7. గజ్జల్లో, చంకల్లో బిళ్లలు కట్టడం మొదలైనవి.

వ్యాధి సంక్రమించే ఇతర శరీర భాగాలు : శరీరంలో ఏ భాగానికైనా ఫైలేరియా వ్యాధి రావచ్చును. ఈ బోద సమస్య ముఖ్యంగా కాళ్లు, చేతులు, జననాంగాలకు ఎక్కువ. పురుషులలో వృషణాల తిత్తికి (హైడ్రోసిల్‌), పురుషాంగానికి, స్త్రీలలో రొమ్ము యోని పెదవులకు రావచ్చు కానీ మొత్తం మీద ఈ సమస్య కాళ్లకే ఎక్కువ.

వ్యాధి నిర్ధారణ : ఈ వ్యాధి నిర్ధారణకు రాత్రిపూట రక్తపరీక్ష చేయించుకొని ఫైలేరియా క్రిములు ఉన్నదీ లేనిదీ తెలుసుకోవాలి. వీలైతే రోగిని అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్న సమయంలో లేపి రక్తపరీక్ష చేయించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ రక్త పరీక్షలో ఫైలేరియా క్రిములు కనబడకపోతే కాలువాపు వస్తే దానికి ఇతరత్రా కిడ్నీ వ్యాధులు, గుండె వైఫల్యం, లివర్‌ వైఫల్యం, థైరాయిడ్‌ సమస్యల వంటివి ఏమీ లేవని నిర్ధారించుకొని లక్షణాల ఆధారంగా చికిత్స ఆరంభించవలసి ఉంటుంది.

చికిత్స : ఫైలేరియా వ్యాధి ప్రాణాంతకమైంది కానప్పటికీ ఈ వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించే పద్ధతులు లేనప్పటికీ ఈ వ్యాధి తీవ్రత పెరగకుండా నియంత్రించడానికి మందుల్లో ఫైలేరియా సూక్ష్మక్రిములను నాశనం చేసేందుకు ఆల్బెండజోల్‌, ఐవర్‌ మెక్టిన్‌, డైఇథైల్‌ కార్బమజైన్‌ (DEC) -(హెట్రజన్‌), ఫ్లోరాసిడ్‌ మొదలైనవి ప్రసరణ మెరుగు పరిచేందుకు ''కౌమరిన్‌ డెరివేటివ్స్‌'' వంటి మందులను తొలిదశలో క్రమం తప్పకుండా తగిన మోతాదులో వైద్యుల పర్యవేక్షణలో కొంతకాలం తీసుకోవడం చాలా అవసరం. ఈ మందులతో పాటు నిత్యం కాళ్లకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చాలాకాలం పాటు సైజు పెరగకుండా చూసుకోవచ్చు. మరీ కొండలా పెరిగితే మాత్రం సర్జరీ చేసి సైజును తగ్గించవచ్చును. ఈ సర్జరీ పద్ధతుల్లో మాత్రం ఇటీవలి కాలంలో గణనీయమైన పురోగతి వచ్చింది. సైజు తగ్గించే విషయంలో ఒకప్పటికంటే ఇప్పుడు ఫలితాలు చాలామెరుగ్గా ఉంటున్నాయి. బోద సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో '' డిఇసి '' మాత్రలు ఉచితంగా - మింగు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నవంబర్‌ రెండవ వారంలో పెద్ద ఎత్తున అమలు పరచుచున్నారు. వయస్సుబట్టి 100 మి.గ్రా. నుండి 300 మి.గ్రాముల మోతాదు మాత్రలు మింగవలసి ఉంటుంది. మనిషికి మరియు దోమకు మధ్యగల జీవిత చక్రాన్ని తెంచుట ద్వారా వ్యాధి సంక్రమణను నిలుపుదల చేయుటయే డిఇసి చికిత్స ప్రధాన లక్ష్యం. ఈ డిఇసి మాత్రలు సంవత్సరానికి ఒకసారి ''ఎమ్‌డిఎ'' కార్యక్రమంలో తప్పకుండా 5 -7 సంవత్సరాలపాటు అర్హులైన వారందరూ మింగడం ఎంతో శ్రేయస్కరం. ఈ డిఇసి మాత్రలు రెండేళ్లలోపు పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు తీవ్రమైన అనారోగ్యానికి గురైన వారికి ఇవ్వరాదు. ఖాళీ కడుపుతో డిఇసి మాత్రలు మింగరాదు. మరియు ప్రతి సంవత్సరం తేది 11 నవంబర్‌ జాతీయ ఫైలేరియా నివారణా దినంగా పాటిస్తున్నారు. (-జాతీయ బోదవ్యాధి నివారణ కార్యక్రమం)

  • ఫైలేరియా వ్యాధి ఉన్నవారు నిత్య జీవితంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
ఈ వ్యాధిగ్రస్తులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొంత ప్రయోజనం ఉంటుంది. స్వచ్ఛమైన నీటిని ఎక్కువగా తాగాలి. ముఖ్యంగా వ్యాధి సోకిన భాగాలను కాళ్లను తరచుగా మంచినీటితో శుభ్రంగా సబ్బుతో కడుక్కొని, పొడి బట్టతో శుభ్రంగా తుడుచుకొని ఏదైనా యాంటీసెప్టిక్‌ ఆయింట్‌మెంట్‌ పూయాలి. రోజూ క్రమం తప్పకుండా కాళ్లకు సంబంధించిన వ్యాయామం చేయాలి. కాలిని గోకడం, గీరటం వంటివేవీ చేయకూడదు. గోళ్ళను శరీరానికి సమంగా కత్తిరించాలి. పాదాలను పైకిఎత్తడం, దింపడం చేస్తూ ఉండాలి. రోజులో ఎక్కువ భాగం నిలబడకుండా కాళ్ళను పైకి పెట్టుకొని కూర్చోవాలి. కింద బాగా బిగువుగా పైన కొంత వదులుగా ఉండేలా కాళ్లకు రెండుపూటలా క్రేప్‌ బ్యాండేజ్‌ కడుతుండాలి. రాత్రిపూట బ్యాండేజ్‌ తీసేసి కాలిని ఎత్తులో పెట్టుకొని పడుకోవాలి. ఇటువంటి వ్యాయామాలు చేసేవారికి జ్వరం ఉండకూడదు. గుండె జబ్బులు ఉన్నవారు ఇటువంటి వ్యాయామాలు చేసేటప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. కాళ్లకు సరైన చెప్పులు వాడాలి.

అన్నిరకాల దోమలను కింది చర్యల ద్వారా అరికట్టవచ్చు :
  • మానవ నివాసాలకు పందులను ఊరికి కనీసం 5 కిలోమీటర్ల దూరంలో ఉండాలి.
  • దోమ గుడ్లను తినివేయి గప్పీ, గంబుషియా చేపలను బావులు, కొలనులు, పెద్ద పెద్ద నీటి గుంటల లోనికి వదలడం, పెంచడం,
  • దోమతెరలు వాడాలి.
  • ఇంట్లోకి దోమలు రాకుండా కిటికీలకు, తలుపులకు సన్నని జాలి బిగించుకోవాలి.
  • సంపూర్ణ వస్త్రధారణ,
  • ఓడామాస్‌ లాంటి ఆయింట్‌మెంట్లను, వేపనూనెను శరీరానికి పూసుకొని నిద్రించాలి.
  • ఇంట్లో జెట్‌, ఆల్‌ అవుట్‌, మస్కిటో కాయిల్‌ గాని ఉపయోగించాలి. సాయంత్రం వేళ కుంపట్లో గుప్పెడు వేపాకు పొగ వేసుకోవాలి,
  • సెప్టిక్‌ ట్యాంక్‌ గొట్టాలకు ఇనుప జాలీ బిగించడం.
  • ఇంటిలోపల, బయట పరిసర ప్రాంతాలలో నీరు నిల్వ లేకుండా చూడడం, ఫ్లవర్‌వాజ్‌లో నీటిని ఎప్పటికప్పుడు మార్చడం, నీటి తొట్టెలను వారానికి ఒకసారి ఖాళీ చేసి మరలా నింపుకోవడం, (వారానికి ఒకరోజు డ్రై దినంగా పాటించాలి).
  • ఇంటిపైన ఓవర్‌హెడ్‌ ట్యాంకులు మొదలగు వాటిపై మూతలు ఉంచడం,
  • ఇంటి చుట్టుపక్కల మురికి నీరు నిల్వ ఉన్నట్లయితే ఆ నీటిలో ఆబేటు, బేటెక్స్‌, ''లార్విసైడ్‌'' మందులను స్ప్రే చేయాలి. లేదా కిరోసిన్‌, వేస్ట్‌ ఇంజన్‌ ఆయిల్‌ వేయాలి.
  • ఇళ్లలోని ఎయిర్‌ కూలర్స్‌, డ్రమ్ములు, కుండలు, రోళ్ళు, పూల కుండీలు, అలంకరణకై ఉపయోగించే మొక్కల కుండీలలో నీరు నిల్వ లేకుండా జాగ్రత్త వహించాలి.
  • పక్షులు స్నానం కోసం వాడే నీటి పళ్ళాలు ఎప్పటికప్పుడు ఖాళీచేసి ఆరబెట్టడం,
  • త్రాగి పారవేసిన కొబ్బరి బొండాలు, కొబ్బరి చిప్పలు, ఖాళీ ప్లాస్టిక్‌ డబ్బాలు, పగిలిన సీసాలు, వాడి పడవేసిన పాత టైర్లు చెత్త కుండీలలో వేయాలి.
  • ఇళ్ళలో గోడలపై డిడిటి, మలాథియాన్‌, సింథటిక్‌ పైరత్రాయిడ్‌ పిచికారి (స్ప్రే) చేయించడం,
  • సాయంత్రంపూట పైరథ్రమ్‌ ఫాగింగ్‌ (పొగవదలడం) చేయాలి.
  • అన్నిటికంటే పరిసరాల పారిశుధ్యాన్ని పాటించడం చాలా ముఖ్యం. ఈ పారిశుద్ధ్యం విషయంలో చెత్త నివారణ, మురికి నీరు, డ్రైనేజీ, పరిసరాల పరిశుభ్రత పాటించడంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రత్యేక చర్యలను చేపట్టాలి. పై మందులు చాలాప్రమాదకరమైనవి. ఆహార పదార్థాలపై ఈ మందులు పడకుండా జాగ్రత్త వహించాలి. చిన్న పిల్లలకు అందుబాటులో లేకుండా జాగ్రత్తగా భద్రపరచాలి. తాగునీటిలో ఈ మందులు చల్లరాదు. ఈ మందులు కలిపేటప్పుడు, చల్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.






  • ============================================

Visit my website - > Dr.Seshagirirao.com/

ముఖము పై మచ్చలు , spots on the Face



ముఖంపై ఎలాంటి మచ్చలు లేకుంటే... అందంగాను చూసేందుకు బాగుంటుంది. కాని ఏవైనా మచ్చలు ఏర్పడుతుంటే నలుగురిలో తిరిగేందుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముఖముపై మచ్చలు లేనివారంటూ ఉండరు. చంద్రబింబానికైనా మచ్చలు తప్పలేదు. మన ముఖచర్మ రంగుకి భిన్నముగా ఉన్న ఏవిదమైన రంగు అయినా మచ్చగానే కనిపింస్తుంది.

ముఖము మీద తెల్లని మచ్చలకు ఖచ్చితమైన కారణము తెలియదు కాని సున్నిత చర్మము గలవారికి ఇది సహజము .
  • విటమిన్క్ష్ ' ఎ ' లోపమువల్ల ,
  • సూర్యుని కిరణాలు లోని అతినీలలోహిత కిరణాల ఎలర్జీ వలన ,
  • బొల్లి అనే చర్మవ్యాధి వలన ,
  • పిటిరియాసిస్ అల్బా అనే ప్రక్రియ వల్లా ................................... తెల్లని మచ్చలు కలుగవచ్చును.
రకాలు

మచ్చలు పలురకాలు - నల్లమచ్చలు, తెల్లమచ్చలు, గోధుమరంగులో వున్నసోభి మచ్చలు ముఖ్యమైనవి. పుట్టుకతో వచ్చిన కొన్ని రంగు మచ్చలను పుట్టుమచ్చలు అంటాము - ఇవి చాలా తక్కువగా ముఖముపై ఉంటాయి.

కారణాలు

* 1. వయసు కురుపులు (మొటిమలు)
* 2. మశూచి ( smallpox & chickenpox)
* 3. నల్లసోభి (melanin pigmentation)
* 4. బొల్లి మచ్చలు (Vitiligo)
* 5. కాలిన మచ్చలు (Burn scars)
* 6. గంట్లు (cuts
* 7. గాయాలు (wounds) మొదలగునవి( etc.)
* 8. కాన్సర్ (Cancer)

ముఖముపై మచ్చలున్నంత మాత్రాన శరీర-ఆరోగ్యానికి నష్టము లేకపోయినా అందముగా లేమేమోనన్న మానషిక బాధ ఉంటుంది. వైద్య నిర్వచనములో ఇది కూడా ఒక రుగ్మత కిందే లెక్క. -- తీసికోవలసిన జాగ్రత్తలు, ట్రీట్మెంటు కారణాన్ని బట్టి ఉంటుంది. ఆయా కారణాలు చూడండి
చికిత్స :
  • పడ్కునే సమయం లో తెల్ల మచ్చలపై ' హైడ్రో కార్టిసన్ ' 1% ఉండే క్రీము రాయండి ,
  • పగటి వేళ " ఎం.పి.ఎఫ్-30 " సన్ స్క్రీన్ ప్రతి మూదు గంటలకు ఒకసారి రాయండి .
  • విటమిం ' ఎ ' ఎక్కువ ఉన్న ఆకుకూరలు , క్యారెట్ , పాలు , గ్రుడ్లు , ఆహారముతో తీసుకోవాలి .

///డా.శేషగిరిరావు -శ్రీకాకుళం ///
  • ====================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, May 8, 2010

వడ దెబ్బ , Sun Stroke






హీట్ స్ట్రొక్ అనగా, శరీరము అధిక ఉష్ణోగ్రత కి గురి అయినప్పుడు, ఆ అధిక ఉష్ణోగ్రత వలన మన శరీరము లో శారీరక పరమైన, నాడీ వ్యవస్త పరమైన వ్యాధి లక్షనాలు కనపడటం..
సాధారణం గా మన శరీరం లో జరుగు రసాయన చర్యల వలన (మెటబాలిజం) హీట్ జెనెరెట్ అవుతుంది.. అలా వుత్పత్తి అయిన “వేడి” మన శరీరం లో ని ఉష్ణ సమతుల్యత ని కాపాడె అవయవాలు అయిన చర్మము ద్వారా చెమట(స్వెట్) వలన గాని బయటకు పంపబడుతుంది..కాని మన శరీరము అధిక ఉష్ణొగ్రత ల కి కాని, డీహైడ్రేషన్ కి కాని గురి ఐనప్పుదు, పైన చెప్పబడిన రక్షణ మార్గాలు(చర్మము , ఊపిరి తిత్తులు) సరిగా పని చెయవు..అందువలన మన శరీరపు ఉష్ణోగ్రత ఒక్కసారి గా 43″ డిగ్రీ సెంటి కి చేరుకుంటుంది.. ఇదే హీట్ స్ట్రోక్ .

సాధారణం గా హీట్ స్ట్రోక్ కి గురి అయ్యె అవకాశం యెక్కువ గా వుండే వాళ్ళు- చిన్న పిల్లలు (2 సం”ల లోపు), బాగా పెద్ద వాళ్ళు, క్రీడాకారులు, ఎక్కువగా ఒపెన్ స్తలాల లో పని చేస్తు ప్రత్యక్షం గా సూర్యరస్మి కి గురి అయ్యె వారు..

వ్యాది లక్షణాలు-
1. అధిక శరీర ఉష్ణోగ్రత, శరీరం పొడి బారటం, దప్పిక ఎక్కువ అవ్వడం,
2. వాంతులు అవ్వడము,
3. నీరసం,
4. దడ, ఆయాసము, గుండె వేగంగా కొట్టుకోవడము,
5. కనఫ్యూజన్, చిరాకు, స్థలము-సమయం తెలియక పోవడం,
6. బ్రమల తో కూడుకున్న అలోచనలు కలగడము,
7. చివరి గా స్పృహ కోల్పోవడము. (తెలివి తప్పిపోవడం)…

చికిథ్స-
వడ దెబ్బ అనేది ఒక మెడికల్ ఎమెర్జెన్సి..అత్యవసరం గా చికిథ్స చేయవలసి వుంటుంది, లేకపోతె ఒక్కొసారి ప్రాణాల కే ప్రమదాం..కాని కొద్ది పాటి జాగ్రత్త లతో కూడుకున్న ప్రధమ -చికిత్సకే చాలా త్వరగా కోలుకుంటారు..
1. మొదటిగా పేషంట్ని చల్లపరచాలి.. బట్టలు తీసి, చల్లని నీటి ఆవిరిని కాని, నీరు కాని మొత్తం శరీరం అంతా సమం గా అప్లై చేయాలి..చల్లని నీరు ఆవిరి రూపం లో ఐతె శరీరం అంతా సమం గా వుంటుంది..
2. చల్లని ఐస్ వాటర్ లో తడిపిన వస్తరాలు కప్పాలి..
3. భుజాలు కింద (ఆక్జిల్ల), గజ్జల్లో ను చల్లని ఐస్ ముక్కలు వుంచాలి..
4. యివి చేస్తూ 108 సర్వీస్ కి కాని, దగ్గర లో వున్న హాస్పిటల్ కి కాని తీసుకు వెల్లాలి..
5. అక్కడ యేమన్న కాంప్లికేషన్స్ వుంటె వారు తగురీతి లో స్పందిస్తారు అవసరాన్ని బట్టి ..
నివారణ మార్గాలు-
  •  
  •  
వడ దెబ్బకి గురి కాకుండా తగు నివారణోపయాలు తీసుకుంటె చాలా మంచిది.. అవి ఏమిటి అంటే...
1. తరచుగా చల్లని నీరు త్రాగడం,
2. బయట పని చేసే వళ్ళు అప్పుడప్పుడు విరామం తీసుకోవడం…
3. సాధ్యమైన వరకు మిట్ట మద్యాహ్నం ఎండలో తిరగ కూడదు .
4. వేసవిలో తెల్లని వదులైన కాటన్క్ష్ దుస్తులు ధరించాలి .
5. మధ్యం సేవించకూడదు .
6. గదుల ఉష్ణోగ్రత తగ్గించే చర్యలు తీసుకోవాలి .


  • ========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, May 2, 2010

పిల్లల్లో పక్క తడిపే అలవాటు, Nocternal Enuresis




పిల్లలో చాలా మందికి పగటిపూట మూత్ర విసర్జన మీద నియంత్రణ రెండు మూడు సంవత్సరాల మధ్య వచ్చే స్తుంది. రాత్రి సమయాల్లో మూత్రాన్ని అదుపు చేసుకోగలిగే శక్తి రెండు నుంచి అయిదు సంవత్సరాల మధ్య వస్తుంది.

అయిదో సంవత్సరం వచ్చే సరికల్లా 85 శాతం మందికి, పదవ సంవత్సరం వచ్చేసరికల్లా 95 శాతం మందికీ మూత్ర కోశం మీద నియంత్రణ - ముఖ్యంగా రాత్రి సమయాల్లో - వస్తుంది. దీనికి భిన్నంగా పాపాయి పక్క తడుపుతుంటే, ప్రధానంగా నరాల జబ్బులు, మూత్ర వ్యవస్థకు సంబంధిం చిన సమస్యలేవీ లేకపోయినప్పటికీ పక్కలో మూత్రం పోస్తున్నట్లయితే ఆ స్థితిని శయ్యామూత్రం లేదా నాక్టర్నల్‌ ఎన్యూరిసిస్‌ అంటారు.

కొంతమంది పిల్లలు పక్క తడపటం కొన్ని నెలలపాటు మానేసి తిరిగి మొదలు పెడుతుంటారు. అటువంటి స్థితిని సెకండరీ ఎన్యూరిసిస్‌ అంటారు. సాధారణంగా ఇలాంటి దానికి ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఉండే అవకాశం ఉంది.

శయ్యామూత్రం కొన్ని కుటుంబాలలో ఆనువంశికంగా నడుస్తుంటుంది. అంటే తల్లిదండ్రుల్లో ఎవరికైనా చిన్నప్పుడు నిద్రలో పక్క తడిపిన అలవాటు ఉంటే అదే లక్షణం పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది.

పిల్లల్లో కనిపించే ఈ పక్క తడిపే అలవాటు ప్రాథమి కమా? ద్వితీయకమా? ఉపేక్షించదగినదా? కాదా? అనేది సమగ్రంగా విశ్లేషించడం అవసరం. దానికి ఈ కింది అంశాలు దోహదపడుతాయి.

ప్రతిరోజూ రాత్రిపూట పక్క తడుపు తూనే ఉన్నారా?

మూత్ర విసర్జన మీద నియంత్రణ నరాల వ్యవస్థ అభివృద్ధి చెందే విధానం లేదా వేగం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతవరకూ అనువంశికత మీద కూడా ఆధారపడి ఉంటుంది.వయస్సు అయిదు సంవత్సరాలు దాటడం, రాత్రిపూట రోజూ పక్క తడుపుతుండటం, ఇతరత్రా ఆరోగ్యంగానే ఉండటం, శారీరక సమస్యలేవీ లేకపోవడం - ఇవన్నీ ఉన్నట్లయితే సమస్య ప్రాథమికమని (ప్రైమరీ ఎన్యూరిసిస్‌) అర్థం. ఈ సమస్య ఎదురైనప్పుడు తల్లిదండ్రులు కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది.
పక్క తడిపారనే కారణంగా పిల్లలను కొట్టకూడదు. తిట్ట కూడదు. పక్క తడిపే సమయంలో పిల్లలు గాఢ నిద్రలో ఉంటారు కనుక వారిని అదిలించినా ప్రయోజనం ఉండదు.
పిల్లలు తమ సమస్య గురించి తామే ఆందోళన చెందు తుంటారు కనుక వారికి వారి అలవాటునుంచి బైటపడేందుకు అవకాశాన్ని, సహకారాన్ని ఇవ్వాలి. సమస్యను అర్థం చేసుకుని వారికి ధైర్యాన్నీ, నమ్మకాన్నీ కలిగించాలి.
పక్క తడపని రోజును గుర్తించి మెచ్చుకోవాలి. వీలైతే స్టార్‌ను ప్రదానం చేయాలి. ఇలా మూడు స్టార్‌లు వచ్చిన తరువాత ప్రోత్సాహపూర్వకమైన బహుమతినివ్వాలి. ఈ పద్ధతిని పిల్లలు ఇష్టపడతారు.
కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను మంచినీళ్లు తాగ కుండా కట్టడి చేస్తుంటారు. దీనిని పిల్లలు ఒక శిక్షగా భావించి మరింత ఒత్తిడికి గురవుతారు. లేదా దప్పికకు, అలవాటుకూ మధ్య ఉండే వ్యత్యాసాన్ని గుర్తించలేని విధంగా తయా రవుతారు.

పాపాయి ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తుందా?
ఇంతకు ముందు పక్క తడపకుండా ప్రస్తుతం పక్క తడు పుతూ, ఇతర సమయాల్లో ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తుంటే మూత్ర విసర్జనకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్‌ గురించి ఆలోచించాలి.
ఇలా మగపిల్లలలో కంటే ఆడపిల్లలలో ఎక్కువగా జరుగు తుంటుంది. మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లలకు మూత్రనాళం (యురెత్రా) తక్కువ పొడవు ఉండటమూ, తదనుగుణంగా ఇన్‌ఫెక్షన్లు వేగంగా లోపలకు వ్యాపించడమూ దీనికి కారణం.
ఇతర లక్షణాల విషయానికి వస్తే మూత్రం పోసుకునేట ప్పుడు మంట, నొప్పి వంటివి ఉంటాయి. ఐతే మొట్టమొద టగా కనిపించే లక్షణం మాత్రం శయ్యామూత్రమే. కొన్ని సార్లు తీవ్రమైన జ్వరం, నడుము నొప్పి వంటివి సైతం కని పించే అవకాశం ఉంది. ఈ కారణం చేతనే ఐదు సంవత్స రాల వయస్సు దాటిన పిల్లలలో శయ్యామూత్రం ఉన్నప్పుడు మూత్ర మార్గానికి సంబంధించిన ఇన్‌ఫెక్షన్ల గురించి పరీక్షించాలి.

మలబద్ధకం ఉందా?

మలబద్ధకం ఉండే పిల్లలలో పెద్దప్రేవు చివరనుండే పురీష నాళం (రెక్టం) పూర్తిగా మలంతో నిండిపోయి దాని ముందు భాగంలో ఉండే మూత్రకోశం మీద ఒత్తిడిని కలిగిస్తుంది. దీనితో మూత్రకోశం వాల్వ్‌ వదులై శయ్యామూత్రమ వుతుంది.

ఎప్పుడూ ఆందోళనగా కనిపిస్తారా?

పిల్లలకు ఏ మాత్రం భయం, ఆందోళనలు కలిగినా వెంటనే పక్క తడిపేస్తారు. మానసిక వత్తిడి, భయాల వలన మూత్రకోశపు కండరాలతో సహా శరీరంలోని కండరాలన్నీ అసంకల్పితంగా బిగుసుకుంటాయి. దీనితో పక్కలో మూత్రం పోస్తారు. రాత్రిపూట భయం కలిగించే కథలు, సినిమాలు, టీవీ కార్యక్రమాలనుంచి పిల్లలను దూరంగా ఉంచాలి.

ఎప్పుడూ దాహంగా ఉంటుందా? అకారణంగా బరువు తగ్గుతున్నారా?

కొంతమంది పిల్లలలో మధుమేహం (జువనైల్‌ డయాబె టిస్‌) శయ్యామూత్రంతోమొదలవుతుంది. ఇన్సులిన్‌ హార్మోన్‌ లోపం వలన శారీరక కణజాలాలు రక్తంలోని చక్కెరను సమర్థవంతంగా గ్రహించలేవు. ఫలితంగా రక్తంలోని చక్కెర రక్తంలోనే పెరిగిపోతుంటుంది.ఇలా పెరగడం ప్రమాదకరం కాబట్టి మూత్రపిండాలు మూత్రాన్ని పెద్ద మొత్తాల్లో తయారు చేస్తూ చక్కెరను విసర్జించే ప్రయత్నం చేస్తాయి. ఈ నేపథ్యంలో మూత్రకోశపు పరిమాణానికి మించి మూత్రం తయారవుతుంది కాబట్టి నిద్రలో అసంకల్పితంగా విడుదలవుతుంది. శరీరంనుంచి బైటకు వెళ్లిపోయిన నీరు తిరిగి భర్తీ కావాలి కనుక అధికంగా దప్పిక అవుతుంది. ఈ స్థితులన్నీ ఒకదానిని అనుసరించి మరొకటిజరుగుతుంటాయి. సరైన వ్యాయామం, సక్రమమైన ఆహారం, సమర్థవంతమైన ఔషధాలతో ఈ స్థితికి చికిత్స చేయాలి.

చికిత్స :
  1. మానషికం గా పిల్లలను తయారు చేయాలి . మంచిగా నచ్చజెప్పి వారి దృక్పదం లో మార్పు తేవాలి .
  2. రాత్రి భోజనకు తొందరగా అంటే 7-8 గంటలకే పెట్టాలి .
  3. రాత్రి పడికునే ముందు నీరుడు పోయించి నిద్రకు వెళ్ళమనాలి .
  4. మంచి పోషకాహారము ఇవ్వాలి .
మందులు :
Tab . Tryptomer (emitryptalin Hel) వయసును బట్టి 10 - 20 మి.గ్రా .రోజూ రాత్రి ఇవ్వాలి .
Anti spasmadics eg. diclomine Hel ( colimex ) తగు మోతాదులో ఇవ్వవచ్చును .
ఆయుర్వేదిక్ -- tab . Neo వయసును బట్టి రోజుకి 2- 3 మాత్రలు 3- 4 మాసాలు ఇస్తే మంచి ఫలితం ఉండును .

యూరినరీ ఇంఫెక్షన్‌ ఉన్నట్లయితే డాకటర్ని సంప్రదించి తగు వైద్యం తీసుకోవాలి .

update : 

Nocturnal enuresis (bedwetting),ఇంకా పక్కతడుపుతున్నారా?------
చిన్నపిల్లలలో చాలామంది 3-4 సంవత్సరాలు వయస్సుకు చేరుకునే సరి రాత్రిళ్లు పక్క తడపడం మానేస్తారు. తర్వాత అడపాదడపా ఎప్పుడో గాని తడపరు.

కొంతమంది మాత్రం తర్వాతా పక్క తడుపుతుండొచ్చు. దీనికి ప్రధాన కారణం మూత్రాశయం మూత్రంతో నిండిపోయినా దానినుండి వెలువడిన సంకేతాలు మెదడుకు చేరకపోవటమే. మూత్ర విసర్జనలో కేంద్రీయ నాడీమండలం, స్వయంచాలక నాడీమండలాల నియంత్రణ లోపమే దీనికి మూలం. దీని మూలంగానే పక్క తడపడంలో పిల్లల్లో వ్యత్యాసం కనపడుతుంది.

ఇన్పెక్షన్‌ కావచ్చు, చక్కెర వ్యాధి కావచ్చు, మూత్ర వ్యవస్థలో లోపాలు కావచ్చు... ఇలా కొన్ని వ్యాధుల మూలంగా కూడా పక్కతడిపే అవకాశముంది. కాబట్టి 4-5 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత కూడా పక్కతడుపుతున్నా లేక కొంతకాలంపాటు పక్క తడపడం మాని, తర్వాత తిరిగి పక్క తడపడం మొదలుపెట్టినా వైద్యుని సంప్రదించడం సముచితం.

నిశితంగా పరిశీలించినట్లయితే 3 సంవత్సరాల వయస్సు పిల్లల్లో నూటికి 50 మంది, 4 సంవత్సరాలు వయస్సున్న పిల్లలలో నూటికి 25 మంది, 5 సంవత్సరాలు వయస్సులో గూడా నూటికి ఐదుగురు పక్క తడుపుతున్నట్లు గుర్తించడం జరిగింది. ఆ వయస్సులో పిల్లలు పక్కతడుపుతుంటే తల్లిదండ్రులు చికాకుపడతారు. పిల్లల్లో కూడా ఆత్మన్యూనతా భావం చోటుచేసుకొంటుంది.

రాత్రిళ్ళు పక్కతడిపే పిల్లల్లో నూటికి పది మంది పగటి పూట కూడా నియంత్రణ లేకుండా మూత్ర విసర్జన చేయడం కద్దు. రాత్రిళ్ళు పక్క తడపకుండా పగలు మాత్రమే కంట్రోలు లేకుండా మూత్రవిసర్జన చేస్తుంటే మూత్రావయవాలలో గాని, నాడీమండలంలోగాని లోపాలున్నట్లు భావించనవసరం లేదు.

కంట్రోలు లేకుండా మూత్ర విసర్జన చేస్తుంటే దాన్ని వ్యాధుల పరంగా విశ్లేషించాల్సివుంటుంది. ఈ సమస్యను 'ఇన్యూరిసిస్‌' అని నిర్థారిస్తారు. మూత్రావయవాల ఇన్ఫెక్షన్‌, నాడీమండల వ్యాధులు, మూర్ఛలు, మానసిక ఎదుగుదల లోపాలు, వెన్నునాడుల లోపాల వంటివీ ఈ సమస్యకు కారణం కావచ్చు.

5 సంవత్సరాల వయస్సు తర్వాత పక్కతడుపుతుంటే మాత్రం, సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. ఈ సందర్భంలో వారసత్వం, వ్యాధి పరమైన కారణాలూ గుర్తుంచుకోవాల్సిందే.

ఈ పక్క తడిపే సమస్యను ప్రధానంగా ప్రభావితం చేసే అంశాలు మూడు. అవి- గాఢ నిద్ర, కలలు, పక్కతడుపుతున్న సమయం. కొంతమంది మొద్దు నిద్రలో మూత్ర విసర్జన చేసేస్తారు. కొంతమంది మూత్రవిసర్జన చేస్తున్నట్లుగా కలలుగంటూ మూత్రవిసర్జన చేస్తారు. కొందరు సమయాన్నిబట్టి, అంటే నిద్రపోవటం మొదలుపెట్టగానే మూత్ర విసర్జన చేయడం, లేదా మరి కొంతమంది వేకువజామున మూత్ర విసర్జనచేయటం కూడా జరుగుతుంటుంది.

Types of enuresis include:

    Nocturnal enuresis (bedwetting)
    Diurnal enuresis
    Mixed enuresis - Includes a combination of nocturnal and diurnal type. Therefore, urine is passed during both waking and sleeping hours.

  • ========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Snake Bite , పాము కాటు




సాదారణం గా పాములు సంతానోత్పత్తి కోసం వేసవి కాలం లో జత కడతాయి . తరువాత వర్షాకాలం లో గుడ్లలను పొదుగుతాయి . ఆయాసమయాల్లో అవి చాలా చిరాకుగా ఉండి తీవ్రం గా స్పందిస్తాయి . ఈ కారణం గానే వేసవి , వర్షాకాలం లో పశువులతో పాటు మనుషులు అధికంగా పాముకాటుకు గురిఅవుతారు .

ప్రపంచం మొత్తం లో 240 జాతులకు చెందిన పాములుండగా .. వీటిలో కేవలం 10 జాతులకు చెందిన 52 రకాల పాములు మాత్రమే విషపూరితమైనవి . పాములన్నిటిలో అత్యంత విషపూరితమైనది " కింగ్ కోబ్రా " దీని కాటుకు ఏనిగు సైతం నిముషాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోతుంది .

పాములకు చెవులుండవు , భూమిపై ఏర్పడే ప్రకంపనల ద్వారా శబ్దాలను గర్హిస్తాయి . కనుకనే వేడిరక్తం ప్రవహించే మనుషులు , ఇతర జంతువుల ఉనికిని సులువుగా గుర్తిస్తాయి . సాధారణం గా చల్లని ప్రదేశాల్లో ఉండేందుకు పాములు ఇస్టపడతాయి . పంటపొలాలు , కాలువలు , చెట్లు ,పొదలు , గడ్డివాములు , పాడుబడిన భవనాలు , రాళ్ళుగుట్టలు , కట్టెలు పేర్చిఉన్న పరదేశాలు , లలొ స్థిరనివాసము ఏర్పచుకుంటాయి .

ఇంకా మరికొన్ని విషయాలకోసం ఇది చూడండి - snake bite
  • ==============================================
Visit my website - > Dr.Seshagirirao.com/