Tuesday, May 31, 2011

ఎనీమియా , రక్తహీనత,Anaemia




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఎనీమియా , రక్తహీనత,Anaemia- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


రక్త హీనత అంటే ఏమిటి?

మన శరీరంలోని రక్తం ఎర్రగా ఉండడానికి కారణం అందులోని హీమోగ్లోబిన్ అనే పదార్థం. ఇది తయారవడానికి మాంసకృత్తులతో పాటు ఇనుము అనే పోషక పదార్థం ముఖ్యంగా అవసరం. మన శరీరంలో హీమోగ్లోబిన్ పరిమాణం ఒక మోతాదులో (16 mg%) ఉంటుంది. ఉదాహరణకు మగవారిలో ప్రతి 100 గ్రాముల రక్తంలో 13 గ్రాములు, ఆడవారిలో 12 గ్రాములు, 6 సంవత్సరంలోపు పిల్లల్లో 11 గ్రాములు, గర్భిణీ స్త్రీలలో 11 గ్రాములు, బాలింతలలో 12 గ్రాములు, 6 నుండి 12 సం.ల లోపు పిల్లలో్ల 12 గ్రాములు ఉండాలి. ఒక వేళ హీమోగ్లోబిన్ మోతాదు ఈ విలువల కన్నా తగ్గితే రక్త హీనతతో వారు బాధపడుతున్నట్లు పరిగణించవచ్చు. రక్తహీనతకు (అనీమియా) గురైన వ్యక్తి శరీ రంలో ఎర్ర రక్త కణాలు (రెడ్‌బ్లడ్‌సెల్స్‌- ఆర్‌ బిసి- లేదా ఎరిత్రోసైట్స్‌) సంఖ్య తగ్గిపోతుంది. రక్త పరీక్షలో ఆర్‌బిసి కౌంట్‌ ద్వారా రోగి రక్తంలో ఎన్ని ఎర్రరక్తకణాలున్నాయనే విష యాన్ని తెలుసుకోవచ్చు. రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య 38 శాతం నుంచి 48 శాతం వరకూ ఉంటుంది. ఆర్‌బిసి లో ఆక్సిజన్‌ను తీసుకునివెళ్లే కణాలను హీమో గ్లోబిన్‌ అంటారు.

ఆరోగ్యవంతుల్లో హీమోగ్లోబిన్‌ ఒక డెసి లీటర్‌కు 12 గ్రాములుంచి 16 గ్రాముల మధ్య ఉంటుంది. ఆర్‌బిసి కౌంట్‌ ఒక మైక్రోలీటర్‌కు 4.4నుంచి 5.8 మిలియన్ల వరకూ ఉంటుంది. ఆర్‌బిసిలోని హీమోగ్లోబిన్‌ ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని భాగాలకు తీసుకువెళుతుంది. ఆక్సిజన్‌ రవాణా వ్యవస్థగా ఎర్ర కణాలు ఉపకరిస్తాయి. ఆక్సిజన్‌ శరీరానికి ఇంధనంగా ఉపయోగపడుతుంది.

రక్తహీనతకు గురైన వ్యక్తిలో అవసరమైన స్థాయిలో ఎర్ర రక్త కణాలు ఉండవు. ఫలితంగా శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ అందదు. రోగి ఎంతో అలసట పొందడం, చివరకు శ్వాస తీసు కోవడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది. రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తులు తమలో శక్తి పూర్తిగా నశించిపోయినట్లు భావిస్తారు . ఆర్‌బిసి లలో ఉన్న హీమోగ్లోబిన్‌ కణాల నుంచి కార్బన్‌ డై ఆక్సైడ్‌ అనే వ్యర్థ పదార్థాన్ని సేకరించి, ఊపిరితిత్తులకు అందజేస్తుంది. ఊపిరితిత్తులు ఈ వ్యర్థపదార్థాన్ని విసర్జిస్తాయి.

శరీరంలో ఉండే ఎరిత్రోప్రోటీన్‌ అనే హార్మోన్‌ బోన్‌ మారోను ఉత్తేజపరిచి, ఎర్ర రక్తకణాల సంఖ్యను నియంత్రించేలా చేస్తుంది. శరీరంలో ఉండే దాదాపు మొత్తం ఎరిత్రోప్రోటీన్‌ను మూత్రపిండాలు ఉత్పత్తి చేస్తాయి. అక్కడినుంచి ఎరిత్రోప్రోటీన్‌ బోన్‌మారోకు చేరుతుంది. ఇక్కడే ఎర్ర రక్తకణాలు తయారవుతాయి. ఒక వ్యక్తి మూత్రపిండాల వ్యాధికి గురైన ప్పుడు మూత్రపిండాలు అవసరమైన స్థాయిలో ఎరిత్రోప్రోటీన్‌ను ఉత్పత్తి చేయలేవు. ఎరిత్రోప్రోటీన్‌ లేకుండా, బోన్‌మారో తగి నంత సంఖ్యలో ఎర్ర రక్తకణాలను తయారు చేయలేవు. ఫలితంగా శరీరావసరాలకు సరిపో యేంత ఆక్సిజన్‌ అందదు.మూత్రపిండాలు విషపదార్థాలను, ద్రవాలను శరీరంనుంచి తొలగిస్తాయి. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వారిలో ఈ పని డయాలిసిస్‌ ద్వారా కొంత జరుగుతుంది.కాని, ఎరిత్రోప్రోటీన్‌ను తయారు చేయడం మాత్రం మూత్రపిండాల వ్యాధికి గురైన ప్పుడు సంభవం కాదు.

కారణాలు : స్త్రీలలో, పిల్లల్లో కనపడే ముఖ్యమైన బలహీనత – రక్తం తక్కువగా ఉండడం ఇది ముఖ్యంగా మూడు కారణాల వలన వచ్చును.
1.పౌష్టికాహార లోపం – ఐరన్ (ఇనుము ధాతువు) కలిగిన ఆకుకూరలు (తోటకూర, గోంగూర) బెల్లం, మాంసాహారంలోను ఎక్కువ నిలువలుండును. ఇవి గలిగిన ఆహారం సమతుల్యంతో తీసుకోకపోవడం.
2.రక్తం నష్టపోవడం – స్త్రీలు ఋతుస్రావం ద్వారా, పిల్లలు కడుపులో పొట్టపురుగులు ద్వారా, క్రమేపి రక్తాన్ని కోల్పోయి, రక్తహీనతకి గురి అవుతారు.
3.రక్తం తయారీలో అవరోధం – జబ్బుల వలన ఉదా. మలేరియా, రక్తంలోని ఎర్ర కణాలు ధ్వంసం అయి మరల పెరగవు...దీంతో రక్తం తయారవక రక్తహీనత కనపడుతుంది.

లక్షణాలు :
బలహీనం, నిరాశక్తత, సాధారణ పనులకే ఆయాసం రావడం.
1) నాలుక, కనురెప్పలలోపలి భాగాలు పాలిపోవడం, 2) అలసట, 3) చికాకు, 4) ఆకలి లేకపోవడం, 5) మైకం, కళ్ళు తిరగడం, 6) అరచేతుల్లో చెమట, 7) చేతుల గోళ్ళు వంగి గుంటలు పడడం 8) పాదాలలో నీరు చేరడం, 9) చిన్న పిల్లల్లో అయితే చదువులో అశ్రద్ధ, ఆటల్లో అనాసక్తి, నీరసం.

రక్త హీనత ఎవరిలో ఎక్కువగా కనబడుతుంద?

గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 15-45 సం.వయస్సు గల స్త్రీలు, 11 సం.ల లోపు పిల్లలలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. అయితే మగవారిలో కూడా రక్తహీనత చోటుచేసుకోవడం అసాధారణం కాదు.

రక్త హీనత వల్ల కలిగే దుష్పరిణామాలు
బలహీనత, గర్భస్రావం, తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం, పుట్టిన బిడ్డ లేదా తల్లి చనిపోవడం, పనిచేసే సామర్థ్యం తగ్గుదల, రోగాలు తేలికగా వెంటవెంటనే రావడం, చదువులో వెనుకపడడం, ఎక్కువసేపు పనిచేయలేకపోవడం, ఆటలు ఆడలేకపోవడం మైదలైనవి.

రక్త హీనతను నివారించడం ఎలా

చికిత్సా విధానం : చిన్న పిల్లలకి పొట్టపురుగుల మందు ఇవ్వాలి. మల విసర్జన తరువాత చేతులు సబ్బుతో తోముకునేలా అలవాటు చేయించాలి. ఇనుము ఎక్కువగా ఉండే ఆహారం (ఆకుకూరలు, పొట్టుతోటి ధాన్యాలు, మాంసాహారం) తీసుకునేట్లు చేయాలి. యుక్త వయస్సు నుండి సంతానం పొందు వయసు మధ్యలో గల స్త్రీలందరికి ఎ.ఎన్.ఎం. సహాయంతో ఉచితంగా లభ్యం అయ్యే ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వాలి.

రక్త హీనతను నివారించడానికి భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఒక ప్రజారోగ్య కార్యక్రమాన్ని చేపట్టింది. రక్త హీనతకు తేలికగా గురికాగల గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా ఉపకేంద్రం ద్వారా ఇనుమున్న ఎర్రగోలీలు (ఐరన్, ఫోలిక్ ఆసిడ్ మాత్రలు) ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. ఈ గోలీలను గర్భిణీ స్త్రీలయితే 6వ నెల మొదటి నుండి 100 రోజుల పాటు, బాలింతలు చనుబాలు యిస్తున్నంత కాలం లేదా 100 రోజుల పాటు, 11 సం. వయస్సులోపున్న రక్త హీనతగల పిల్లలు సంవత్సరంలో కనీసం 100 రోజులపాటు క్రమం తప్పకుండా రోజుకొక్కగోలీ చొప్పున తీసుకోవడం వల్ల వారి శరీరానికి పూర్తి రక్తపుష్టి చేకూరుతుంది.
ఈ మాత్రలు తీసుకొనేవారి మలం నల్లబడడం, వికారం కల్గడం సహజం. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు.

ఆకుకూరలు రక్త హీనత నివారణకు సులభమైన ఉపాయం --- ఇనుము ఎక్కువగా వుండి, సులభంగా లభించి, చవకగా అందరికీ అందుబాటులో ఉండే అన్ని రకాల తాజా ఆకుకూరలు అంటే తోటకూర, పుంటికూర, పాలకూర, మెంతి కూర, బచ్చలి కూర, గంగబాయిల కూర రోజు తీసుకోవడం వల్ల రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు. ఇవేగాక ఖరీదైన ఎండినపండ్లు, అంటే బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూర్, మాంసం, కాలేయం వంటి పదార్థాల్లో కూడా యినుము పుష్కలంగా లభిస్తుంది. వీటితోపాటు, రోజూ తీసుకొనే ఆహారంలో మొలకెత్తిన పప్పుధాన్యాలు విటమిన్ సి ఎక్కువగా వుండి నిమ్మ, ఉసిరి, జామ లాంటివి కలిపి తీసుకోవడం ద్వారా రక్త హీనత రాకుండా చూసుకోవచ్చు.

రక్త హీనత నివారణకు నూతన పద్ధతి : దేశ ప్రజలలో అధికశాతం రక్తహీనతకు గురి అవుతున్నారు. కాబట్టి రక్తహీనత నివారణకు మనం మామూలుగా తీసుకొనే ఉప్పులో ఇనుమును కలిపే శాస్త్రీయ పద్ధతిని జాతీయ పోషకాహార సంస్థ వారు కనుగొన్నారు. మామూలు ఉప్పు బదులుగా క్రొత్తగా తయారుచేసిన ఇనుము కలిపిన ఉప్పును రోజూ వంటలో వాడడం ద్వారా ఇనుము లోపం వలన వచ్చే రక్త హీనతను నివారించవచ్చును. ఈ ఇనుము కలిపిన ఉప్పు ప్రస్తుతం కొన్ని పట్టణ ప్రాంతాల్లో లభ్యం అవుతోంది.

రక్త హీనతను అశ్రద్ధ చేయకండి. అది నీరసానికి బలహీనతకు మాత్రమే దారితీయదు. ప్రాణాహానిని కూడా కల్గించవచ్చు. రక్తహీనతను దరిచేరనీయకండి. ఇనుము పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలు రోజూ తీసుకోండి. రక్తహీనత ఉన్నవారు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలను క్రమం తప్పకుండా వందరోజులు తీసుకోండి. మీ గ్రామ ప్రభుత్వ ఆరోగ్య సిబ్బందిని గాని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గాని, ప్రభుత్వ ఆసుపత్రిలోగాని సంప్రదించి దీనిని నివారించే పద్ధతుల వివరాలను విపులంగా తెలుసుకొని పాటించండి.

మంచి ఆహారంతో ఎనీమియాకు దూరం...
--ప్రస్తుతం మహిళలను వేధిస్తోన్న సమస్య ఎనీమియా (రక్తహీనత). లేచింది మొదలు గొడ్డు చాకిరీ చేసే మహిళలకు రోజంతా... పనితోనే సరిపోతుంటే ఇక తినేందుకు సమయమెక్కడ ఉంటుంది చెప్పండి. ఒకవేళ ఉన్నా ఆ... ఏం తింటాలే... అని ఊరుకునే మహిళలు ఎంతమందో..! దీని ఫలితమే రక్తహీనత.

విటమిన్ బి12 తప్పనిసరి..!

తాజా కూరగాయలలో పాలకూర, క్యారట్, ముల్లంగి, బీట్‌రూట్, టమోటాలలోనూ.... ఇక పండ్ల విషయానికొస్తే... అరటిపండు, యాపిల్, ద్రాక్ష, ఆప్రికాట్‌లలోనూ ఐరన్ అధికంగా లభిస్తుంది. అరటిలో ఉండే ఫోలిక్ ఆసిడ్, బి12 విటమిన్‌లు రక్తహీనత నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుంది...

అంతేగాకుండా వారు తీసుకునే ఆహారంలో పోషక విలువలు తగ్గిపోవడం వల్ల, రుతుసమయంలో అధిక రక్తస్రావం వల్ల, ఫైల్స్ సమస్య వల్ల కూడా రక్తహీనత వస్తుంది. దీనివల్ల రక్తంలో ఎర్రకణాల సంఖ్య తగ్గిపోయి శారీరక బలహీనత ఏర్పడుతుంది. దీని కారణంగా ఒంట్లో నీరసంగా ఉండటం, కళ్ళు తిరగటం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, తలనొప్పి తదితర సమస్యలు కలుగుతాయి.

మరి దీనికి పరిష్కారమే లేదా..? అంటే ఉందని చెప్పాలి. అదేంటంటే... మందులకన్నా... ప్రతిరోజూ వీరు తీసుకునే ఆహారంలో ఐరన్ అధికంగా లభించే వాటినే తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా కాయగూరలు, పండ్లలో ఉంటుంది.

రక్తహీనత బారినపడొద్దు-ముందే జాగ్రత్త పడటం :
--మనదేశంలో రక్తహీనతతో బాధపడుతున్న స్త్రీలు, పిల్లలు ఎంతోమంది. దీని బారినపడ్డవారి రక్తంలో ఎర్రకణాలు తగ్గిపోతాయి. దీంతో శరీరంలోని ఇతర భాగాలకు ఆక్సిజన్‌ సరిగా అందదు. రక్తహీనత తీవ్రతను బట్టి.. నిస్సత్తువ, పనులు చేస్తున్నప్పుడు శ్వాస కష్టంగా ఉండటం, మగతగా అనిపించటం, తలనొప్పి, నిద్ర పట్టకపోవటం, చర్మం పాలిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆకలి తగ్గటం, గుండె సరిగా కొట్టుకోకపోవటం వంటివీ ఉండొచ్చు. కాబట్టి రక్తహీనత బారిన పడకుండా ముందే జాగ్రత్త పడటం ఎంతో ఉత్తమం. అందుకు ఆహరంలో తగు మార్పులు చేసుకుంటే సరి.

* ఇనుముతో నిండిన యాపిళ్లు, అరటిపండ్లు, ఆకుకూరల వంటివి ఎక్కువగా తినాలి. మాంసం, ముడిధాన్యాలు కూడా మంచివే.

* సి విటమిన్‌ ఇనుమును ఎక్కువగా గ్రహించుకునేలా చేస్తుంది. అందువల్ల బత్తాయి, నిమ్మ, ఉసిరి వంటి సి విటమిన్‌ గల పదార్థాలు, పానీయాలు కూడా అధికంగా తీసుకోవాలి.

* భోజనం చేసిన వెంటనే కాఫీ, టీలు తాగటం మానెయ్యాలి. ఇవి ఇనుమును గ్రహించుకోకుండా అడ్డుకుంటాయి. ఫోలిక్‌యాసిడ్‌, విటమిన్‌ బి12తో నిండిన పాలకూర వంటి ఆకుకూరలు, కాలేయం, ముడిధాన్యాలు తగినంత మోతాదులో ఉండేలా చూసుకోవాలి. కిస్‌మిస్‌ వంటి ఎండు ఫలాల్లోనూ ఇనుము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని కూడా ఆహారంలో విధిగా చేర్చుకోవాలి.





మన ఆరోగ్యాన్ని మనమే కాపాడు కోవాలి. ఎవరో వస్తారు ఏవోచేస్తారు ... అన్నింటికీ దేవుడే ఉన్నాడులే అని అనుకోకూడదు. -- డా.శేషగిరిరావు (శ్రీకాకుళం).
  • ==============================
Visit my website - > Dr.Seshagirirao.com/

అరోమా థెరిపీ,aromatherapy-with oils,పరిమళ వైద్యం



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -అరోమా థెరిపీ,aromatherapy-oils- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


రుచికరమైన ఆహారాన్ని వండడానికి మాత్రమే కాదు మేని సౌందర్యాన్ని పెంచడానికి నూనెలు ఎంతగానే దోహదంచేస్తాయి. అరోమా, సుగంధ నూనెలతోపాటు, మనం రోజూ వాడుకునే నూనెలను కూడా సౌందర్య సాధనాలుగా వాడుకోవచ్చు. చర్మం నిగారింపు తగ్గ కుండా, మృదుత్వాన్ని కోల్పోకుండా నూనెలు ఉపయోగపడతాయి. అయితే ఏ నూనెను ఏలాంటి వాతావరణంలో, ఏ రకం చర్మం ఉన్నవారు ఏలా వాడాలో తెలుసుకుంటే అందం మీ సొంతమే.

పూర్వ కాలము నుండి పరిమళభరితమైన కొన్ని నూనెలను వైద్యపరంగా ఉపయోగించడం పరిపాటి . మెదడు, చర్మం, మొత్తంగా శరీరానికే స్వస్థత చేకూర్చే ప్రత్యామ్నాయ వైద్య పద్ధతిగా ''అరోమా థెరపీ'' ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పొందింది. చెట్లు, పూల నుంచి తీసిన సారంతో తయారయ్యే ఈ నూనెలను ఎక్కువగా సౌందర్య పద్ధతులలో వాడుతున్నప్పటికీ డిప్రెషన్‌ తగ్గించేందుకు, ఉత్సాహాన్ని పెంచేందుకు, సంపూర్ణ ఆరోగ్యం కోసం వీటిని ఉపయోగించవ్చనని అరోమా థెరపీ ప్రాక్టిషనర్లు చెప్తున్నారు. ఆరోమా థెరపీ ఎప్పుడు పుట్టింది అనేది నిర్ధిష్టంగా ఎక్కడా నమోదు కానప్పటికీ ఈజిప్షియన్లు మృతి చెందిన వారి శరీరాలకు పూతగా ఉపయోగించేందుకు కొన్ని మొక్కల నుంచి తైలాన్ని తీసి ఉపయోగించారని తెలుస్తోంది. ఇక ఉత్సాహాన్ని పెంచేందుకు అరోమా ఆయిల్స్‌ను చైనాలో ఎక్కువగా ఉపయోగించేవారట.

వైద్య పితామహుడిగా భావించే హిప్పోక్రేట్స్‌ కూడా స్వస్థత కోసం అరోమా థెరపీ ఉపయోగించారుట. అయితే ''అరోమా థెరపీ'' అనే పదాన్ని తొలిసారిగా ప్రయోగించింది ఫ్రెంచి కెమిస్ట్‌ 'రినె మారిస్‌ గట్టెఫోసె'. లావెండర్‌ నూనె తనకు అయిన కాలిన గాయాన్ని మాన్పడాన్ని గమనించిన ఫ్రెంచ్‌ సర్జెన్‌ జీన్‌ వాల్నెట్‌ రెండవ ప్రపంచ యుద్ధంలో సైనికుల గాయాలకు పూతగా ఈ నూనెలను వాడటం ప్రారంభించాడు.

వివిధ మొక్కల ఆకులు, బెరడు, పూలు, కాండం, వేర్లు ఇలా ప్రతి ఉపయుక్తమయ్యే ప్రతిభాగం నుంచీ సారాన్ని సేకరించే ఈ తైలాలను ''ఎస్సెన్షియల్‌ ఆయిల్స్‌'' అంటారు. అన్నింటిలోకీ ప్రాచుర్యం పొందింది లావెండర్‌ ఆయిల్‌. ఇది ఒత్తిడిని తగ్గిస్తుందని రుజువైంది. అలాగే పిప్పరమెంట్‌ సహజ శక్తిని పెంచేదిగా తేలింది. అనేక తైలాలు అందుబాటులో ఉన్నప్పటికీ అవి ఎందుకు ఉపయుక్తమో తెలుసుకునే వాటిని కొనుగోలు చేయడం మంచిది.

బెర్గామాట్ ‌: 


 ఇది నిమ్మ వాసన కలిగిన నూనె. దీనిని సిట్రస్‌ బెరాగమియా చెట్టు నుంచి గ్రహిస్తారు. ఈ చెట్లు ఆగ్నేయ ఆసియాలో ఎక్కువగా కనుపిస్తాయి. దీనిని మసాజ్‌ ఆయిల్‌లో కలుపుకునో లేక స్నానం చేసే నీళ్ళలో కలుపుకునో ఉపయోగించవచ్చు. ఈ నూనెను ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్‌, సొరియాసిస్‌, ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులకు, అనెరెగ్జియాకు చికిత్సగా ఉపయోగిస్తారు. అయితే దీనికి చర్మానికి మంటపుట్టించే గుణం ఉన్నందున నేరుగా చర్మానికి రాసుకోకూడదు. అలాగే ఈ నూనె ఉపయోగించేటప్పుడు ఎండలో తిరగరాదు.

మల్లె : 


 మల్లెపూల వాసన ఎంత ఘాటుగా, ఎంత రొమాంటిక్‌గా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. దీని నూనెను డిప్రెషన్‌ను తగ్గించేందుకు, మనస్సును ఉత్తేజితం చేసేందుకు ఉపయోగిస్తారు. ఇది మంచి యాంటీ సెప్టిక్‌, డిస్‌ఇన్ఫెక్టెంట్‌ అని కూడా తేలింది. అయితే గర్భిణీలు దీనిని వాడకపోవడం మంచిది.

సెడార్‌ వుడ్ ‌:

ఇది ఉత్తర అమెరికాకు చెందిన వృక్షం. దీనిని కూడా ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు ఉపయోగిస్తారు. అలాగే శ్వాస సంబంధమైన సమస్యలు, చర్మ సమస్యలను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. మూత్రకోశ ఇన్ఫెక్షన్లను కూడా ఇది తగ్గిస్తుంది. దీనిని వేరే మసాజ్‌ ఆయిల్‌లో కలిపి ఉపయోగించాలి. అలాగే గర్భం ధరించిఉన్న సమయంలో దీనిని ఉపయోగించరాదు.

కేమొమైల్ ‌: 
  •  


 దీనిని మసాజ్‌ ఆయిల్స్‌తో కలిపి తీసుకోవడం లేదా స్వేదన చికిత్సలో ఉపయోగించవచ్చు. ఇందులో లభించే రోమన్‌ రకం కేమొమైల్‌ను మౌత్‌ వాష్‌గా ఉపయోగించవచ్చు. ఇది చాలా ప్రశాంతత కలిగించే గుణాలు కలిగినది. దీనితో పాటుగా యాంటీ బయాటిక్‌, యాంటీసెప్టిక్‌, యాంటీ డిప్రెసెంట్‌గా ఉపయోగించవచ్చు. అలాగే మొటిమలు తగ్గించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనిని గర్భం ధరించిన సమయంలో ఉపయోగించరాదు.

యూకలిప్టస్- Eucalyptus ‌:


  శ్వాసకు సంబంధించిన వ్యాధులను తగ్గించడంలో, ఏకాగ్రత పెంచడంలో దీనికి సామర్ధ్యం ఉందని తెలుస్తోంది. వీటితో పాటుగా దీనిని యాంటీసెప్టిక్‌గా, నొప్పులకు, ముక్కులు బ్లాక్‌ అయినప్పుడు, మైగ్రైన్లు, జ్వరాలు, కండరాల నొప్పులు, ఇతర నొప్పులకు ఉపయోగించవచ్చు. అయితే పిల్లలకు పాలు ఇచ్చే స్ర్తీలు, మూర్ఛ రోగం ఉన్నవారు దీనిని ఉపయోగించరాదు.

భారత దేశంలో ఖ్యాతిగాంచిన నీలగిరి కొండలు అందరకూ బాగా తెలుసు. ఎందుకంటే అక్కడ ‘యూకలిప్టస్’ మొక్కలు అధికం. యూకలిప్టస్ ( Eucalyptus) ఒక పెద్ద చెట్టు. దీని ఆకుల నుండి నీలగిరి తైలం తీస్తారు.యూకలిప్టస్ ఆయిల్ శరీరానికి ఎన్నో ప్రయోజనాలనిచ్చే ఘాటైన నూనె. యూకలిప్టస్ నూనెను చర్మం చాలా అధికంగాను వేగంగాను పీల్చేసుకుంటుంది. ఎంతో తాజాదనాన్ని ఇస్తూ, శరీరాన్ని చల్లబరచి బాక్టీరియా, ఇతర క్రిములను నశింపజేస్తుంది. యూకలిప్టస్ నూనె శరీర మర్దనకు మంచి నూనె. చర్మం మంటలు, పురుగులు కుట్టిన నొప్పులు, లేదా బొబ్బలు మొదలైనవి రెండు చుక్కలు వేస్తే చాలు నయమైపోతాయి. ఆరోగ్యరీత్యా చాలా మంచిది. దీనికిగల మరికొన్ని ప్రయోజనాలను చూద్దాం-

1. యూకలిప్టస్ ఆయిలో సహజ సువాసన కలది. చర్మంపై వచ్చే అనేక వ్యాధులను, మ్యూకస్ విడుదల, పుండ్లు, యోని సంబంధిత ఇతర వ్యాధులు నయం చేస్తుంది. చర్మం సెప్టిక్ అయినా, లేదా చీము పట్టినా దీని వాడకం మంచి ఫలితాన్నిస్తుంది.

2. నొప్పుల నివారణకు సహజ ఔషధం. శారీరక, కీళ్ళ నొప్పులు తగ్గించి మైండ్ కు రిలాక్సేషన్ ఇస్తుంది. బకెట్ వేడి నీటిలో కొద్ది చుక్కలు వేసి స్నానం చేస్తే ఎంతో హాయిగా వుంటుంది. మరిన్ని మంచి ఫలితాలు కావాలంటే దీనితో లవెండర్ కలపండి.

3. ఈ నూనె రాస్తే చర్మం నునుపు రావటం, చర్మంపై మచ్చలు పోవడం జరుగుతుంది. భుజాలు, వీపు భాగాలకు విటమిన్ ఇ ఆయిల్ తో కలిపి రాస్తే మంచి ఫలితాలుంటాయి.

4. చర్మ సంబంధిత వ్యాధులకు లేదా పురుషులు వారి షేవ్ తర్వాత ఆఫ్టర్ షేవ్ లోషన్ గాను వాడవచ్చు.

5. యూకలిప్టస్ ఆయిల్ ను శనగపిండి లేదా ముల్తాని మిట్టితో కలిపి రాస్తే చర్మం పొడిబారకుండా వుండి మెత్తగాను, ఎంతో అందంగాను కనపడుతుంది.

నిమ్మ నూనె : 

 చర్మ సమస్యల నుంచి జీర్ణ సంబంధ సమస్యల వరకూ అనేకానికి ఉపశమనం కలిగించగల గుణం నిమ్మ నూనెకు ఉంది. కొవ్వు తగ్గించడంలో, ఇమ్యూనిటీని పెంచడంలో ఇది సహాయపడుతుంది. తలనొప్పులు, జ్వరానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. దీనిని కూడా వేరే మసాజ్‌ నూనెలలో కలిపి వాడడం మంచిది తప్ప నేరుగా వాడరాదు. అలాగే ఎండలోకి వెళ్ళేటప్పుడు దీనిని ఉపయోగించరాదు.

రోజ్‌ (గులాబి):


మహిళలకు సంబంధించిన అనేక స మస్యలను తగ్గించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. డిప్రెషన్‌, ఒత్తిడి, జీర్ణం కోశ సమస్యలు, గుండెకు, రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు, శ్వాసకోశ ఇబ్బం దులు వంటి ఎన్నింటి నుంచో ఇది కాపాడుతుంది. అలాగే చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే దీనిని గర్భధారణ సమయంలో ఉపయోగించరాదు.

ఇవే కాకుండా మార్జోరాం, పచౌలీ, పెప్పర్‌మింట్‌, రోజ్‌ మేరీ, శాండల్‌ వుడ్‌ తదితర ఎన్నో నూనెలు లభ్యమవుతాయి.

అరోమా థెరపీ ప్రారంభించాలనుకునేవారి కోసం కొన్ని సలహాలు, సూచనలు:

- మార్కెట్‌లో మనకు చాలా రకాల తైలాలు దొరుకుతాయి. చాలావరకు పరిమళ తైలాలు ఎసెన్షియల్‌ ఆయిల్స్‌లాగే ఉన్నా... అవి వైద్యపరమైన లాభాలను పూర్తిగా అందజేయవు. ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ కొనేముందు ఒకటికి రెండుసార్లు పరీక్షించుకోవడం మంచిది.
- సువాసన కోసం జీవనశైలిలో అరోమా థెరెపీని వాడాలని భావించినా మనం అఘ్రాణించే ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ చికిత్సాపరమైన లాభాలు సమకూరుస్తాయి. ఈ లాభాలు పరిమళ తైలాలు వాడినందువల్ల ఒనగూరవు.
- రబ్బర్‌ గ్లాస్‌ డ్రాపర్‌ టాప్స్‌ ఉండే ఎస్సెన్షియల్‌ ఆయిల్స్‌ కొనవద్దు. ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ ఎంతో చిక్కనైనవి. రబ్బరును జిగురుగా మార్చేస్తాయి. ఫలితంగా నూనె పనికిరాకుండా పోతుంది.
- అరోమా థెరెపీ గురించి సాధ్యమైనంత మేరకు చదవండి. అరోమా థెరెపీ మొదలు పెట్టడం ఎంతో సులభం. కానీ భద్రతకు సంబంధించిన విషయాలు గుర్తుంచుకోవాలి.

- ఈ థెరపీ గురించి ప్రస్తుతం అనేక పుస్తకాలు కూడా మార్కెట్‌లో లభిస్తున్నాయి. వాటిలో కొన్ని ప్రముఖ పుస్తకాలు చూడండి.

- ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ను ఎంపిక చేసుకుని కొనండి. వీటి నాణ్యత విషయంలో కంపెనీకి కంపెనీకి మధ్య తేడాలుంటాయి. పైగా, కొన్ని కంపెనీలు తమ తైలాలు మాత్రమే కల్తీలేనివని, శుద్ధమైనవనీ బూటకపు ప్రచారం చేసుకుంటాయి.
- ఆయిల్స్‌ కొనేప్పుడు నిజమైనవి పసిగట్టడం నేర్చుకోండి. అనిస్‌, ల్యావెండర్‌, బే, సెడార్‌వుడ్‌, యూకిలిప్టస్‌ ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ తయారుచేయడానికి వాడే మొక్కల సాధారణ పేర్లు. కానీ ఈ మొక్కల్లో విభిన్న రకాలైనవి ఉన్నాయి. ఈ వైవిధ్యాన్ని గర్తించడానికి వాటి బొటానికల్‌ పేరు లేక లాటిన్‌ పేరును చెప్పండి.
- ఉదాహరణకు రెండు వేర్వేరు ఆయిల్స్‌ను బే ఎసెన్షియల్‌ ఆయిల్‌గా పిలుస్తారు. కానీ ఈ రెండు వేర్వేరు మొక్కలకు చెందినవి. వీటి ధరల్లాగే వీటి గుణాలు, పరిమళాలు భిన్నంగా ఉంటాయి. కనుక బొటానికల్‌ పేరుపై శ్రద్ధ వహించాలి.
- ఆయిల్‌ ఏ దేశానికి చెందినదో తెలుసుకోవడం కూడా మంచిది. నాణ్యమైన ఎసెన్షియల్‌ ఆయిల్‌ అమ్మకందారులు ఆయిల్‌ బాటిల్స్‌పై వాటి బొటానికల్‌ పేరు, అది ఏదేశానికి చెందినదీ అనే సమాచారం ఉంటుంది.
- ఈ కెంపెనీలు అమ్ముతున్న ఆయిల్స్‌ సహజసిద్ధమైనవా, తయారుచేసివా లేక స్థానికంగా అందుబాటులో ఉన్న సహజవనరులతో చేసినవా అన్న విషయం కూడా గమనించాలి.
- వీధిలో పెట్టుకుని అమ్మే వారి దగ్గర, ప్రదర్శనల్లో, తక్కువ కాలపు సందర్భాల్లో ఆయిల్స్‌ కొనకుండా ఉండడం మంచిది. కానీ కొత్తగా ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ వాడడం ప్రారంభించినవారు తరువాత దశలో కూడా తమ దగ్గరకు వస్తారని వీరికి తెలుసు. ఇలాంటి సందర్భాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన కంపెనీలు కూడా ఆయిల్స్‌ అమ్మవని అనడంలేదు. కానీ అంతగా నాణ్యతను పసిగట్టలేని వారికి ఇది హెచ్చరిక మాత్రమే.
- మెయిల్‌ ఆర్డర్‌ ద్వారా తక్కువ ధరకు ఉన్నతస్థాయి నాణ్యత కలిగిన ఆయిల్స్‌ కంపెనీలు పంపుతాయి. స్థానికంగా ఆరోగ్య, ఆహారపదార్థాల షాపు నుంచి కొనడం కంటే ఇది మంచిది, ఖర్చు తక్కువ. కానీ కంపెనీ కంపెనీకి, షాపుకీ షాపుకీ తైలాల నాణ్యతలో వ్యత్యాసం వుంటుంది.
- బిజినెస్‌ ప్లాజా వారి వెండర్‌ పెవిలియన్‌ ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ అరోమాథెరెపీ ఉత్పత్తులమ్మే వివిధ కంపెనీల జాబితా రూపొందించింది.
- మీ అరోమా థెరెపీ తైలాలను నల్లటి గ్లాసులో నింపి చల్లటి చీకటి ప్రదేశంలో భద్రపరచండి. ఖాదీభండార్‌లో చక్క బాక్సులు కొనండి. వాటిలో ఆయిల్స్‌ను భద్రపరచండి. ఇలా అయితే ఇంట్లో ఒకచోటునుంచి మరొక చోటికి సులవుగా వీటిని తరలించవచ్చు.
- అన్ని ఎసెన్షియల్‌ ఆయిల్స్‌తో పాటు ఇచ్చే భద్రతాపరమైన సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి. ఆరోగ్యపరమైన సమస్యలున్నవారు, గర్భిణులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.


కొబ్బరి నూనె , Coconut Oil
ప్రకృతి మనకి అందించిన ఎన్నో గొప్ప వస్తు వుల్లో కొబ్బరి కూడా ఒకటి. దీనిలోని పోషక విలువలు అపారం. కొబ్బరి నీళ్లు, కొబ్బరిపాలు అన్నిటికంటే కొబ్బరినూనె ఎన్నో సుగుణాలను కలిగి వుంది. ఆడవారి కురుల పోషణలో కొబ్బరినూనె పాత్ర ఎంతైనా వుంది. పరిశుభ్రమైన కొబ్బరి నూనె ప్రతిరోజూ నాలుగు చెంచాలు, సలాడ్లు లేదా గ్రీన్ టీ లేదా మీరు ఇష్టంగా తినే ఇతర పదార్ధాలలో కలిపి తింటే ఆరోగ్యవంతమైన నిగనిగలాడే చర్మం, దానితో పాటు దట్టమైన నల్లని జుత్తు వద్దన్నా మీకు వచ్చేస్తుంది .
కొబ్బరి చెట్టును జీవితమంతా పనికి వచ్చే చెట్టు అంటారు. మన దేశంలో శతాబ్దాలపాటు కొబ్బరి సంబంధిత పదార్ధాలను తినేటందుకు, వివిధ ఔషధాల తయారీకి వినియోగించటం అందరకూ తెలిసిందే. కొబ్బరినూనె వంటలకు, వంటికి ఎంతో మంచిదని అందరికి సాధారణంగా తెలిసిందే. ఇదే విషయం ఆయుర్వేదం లో కూడా పేర్కొన్నారు. శరీరంపై ఏర్పడే పుండ్లు, గడ్డలు లేదా ఇతర వైరల్ ఇన్ ఫెక్షన్స్ లో కూడా కొబ్బరి నూనె వాడతారు.

ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కేవలం కొబ్బరినూనెతోనే వంటలు చేయడం నడుస్తోంది. కేరళ ఇందుకు ప్రధాన ఉదాహరణ. హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ ప్రయో గాలద్వారా నిరూపితమైందేమంటే కొబ్బరినూనె గుండెకు నేస్తం లాంటిదని. వంటనూనె సరైన దైనప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. అందుకు కొబ్బరినూనె శ్రేష్ఠమైనదని శాస్త్రవేత్తలంటున్నారు. ఒత్తిడినుంచి ఉపశమనం ఇచ్చేందుకు, కొలె స్ట్రాల్‌ను అదుపులో ఉంచేందుకు, బరువు తగ్గ డానికి, రోగనిరోధక శక్తి పెంచేందుకు, జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడానికి, మెటబాలిజమ్‌ సమర్థవంతంగా వుండేందుకు, కిడ్నీ సమ స్యలకు, బిపిని నియంత్రించడానికి, డయా బెటిస్‌ను తగ్గించేందుకు, ఎముకల గట్టిదనానికి, దంతాల పటిష్టతకు కొబ్బరినూనె అద్భుతంగా పనిచేస్తుంది.

కొబ్బరినూనె ప్రతిరోజూ వాడితే చర్మం చక్కటి తేమ కలిగి నిగ నిగ లాడుతుందని చర్మ నిపుణులు చెపుతున్నారు. అయితే, కొబ్బరినూనెలో శాచ్చ్యురేటెడ్ కొవ్వులు అధికంగా వుండటంతో కొబ్బరినూనె ఆహారంగా వాడటం శ్రేయస్కరం కాదంటున్నారు పోషకాహార నిపుణులు. కనుక ఆహారంగా కాకపోయినా దీనిని ప్రతిరోజూ చర్మానికి, జుత్తుకు పట్టిస్తే మహిళల సౌందర్యం రెట్టిపు అవటంలో కొబ్బరినూనె ఎంతో సహకరిస్తుందనటంలో సందేహం లేదు.

వేప నూనె,Neem Oil :
విత్తనంల నుండి తీసిన నూనె ముదురు ఎరుపుగా లేదా పచ్చని ఛాయ వున్నబ్రౌనురంగులో కాని వుండి, ఘాటైన వాసన కల్గివుండును. వేపనూనెలో సంతృప్త కొవ్వుఆమ్లాలైన మిరిస్టిక్‌, పామిటిక్, స్టియరిక్‌ ఆసిడులు, అసంతృప్త కొవ్వు ఆమ్లాలైన ఒలిక్‌, లినొలిక్‌ ఆసిడులున్నాయి. నూనెలో వున్న అజాడిరిక్తిన్ కారణంగా వంటనూనెగా ఉపయుక్తం కాదు.వేపనూనెలో ఇంకను స్టెరొలులు (sterols), టెర్పొనొయిడులు (terpenoids), అల్కలైడు (alkalniods)లు, ఫ్లవొనొయిడులు (flavonoids) మరియు గ్లైకొసిడులు (glycosids) వున్నాయి.
* ఐయోడిన్‌విలువ :ప్రయోగశాలలో 100 గ్రాములనూనెచే శోషింపబడిన(గ్రహింపబడిన)ఐయోడిన్ గ్రాముల సంఖ్య.ప్రయోగసమయంలో నూనెలోని,ఫ్యాటి ఆమ్లంల ద్విబంధంవున్న కార్బనులతో ఐయోడిన్ సంయోగం చెంది,ద్విబంధాలను తొలగించును.ఐయోడిన్‌విలువ నూనెలోని అసంతృప్త కొవ్వుఆమ్లం ల వునికిని తెలుపును.నూనె ఐయోడిన్‌విలువ పెరుగు కొలది,నూనెలోని అసంతృప్త కొవ్వుఆమ్లంల శాతం పెరుగును.

* సపొనిఫికెసన్‌విలువ:ఒక గ్రాము నూనెలో వున్న కొవ్వుఆమ్లాలన్నింటిని సబ్బుగా(సపొనిఫికెసను)మార్చుటకు అవసరమగు పొటాషియం హైడ్రాక్సైడు,మి.గ్రాములలోఉన్నాయి .
* అన్‌సపొనిఫియబుల్ మేటరు: నూనెలో వుండియు,పోటాషియంహైడ్రాక్సైడ్‌తో చర్యచెందని పదార్థములు.ఇవి అలిఫాటిక్‌ఆల్కహల్‌లు,స్టెరొలులు(sterols),వర్ణకారకములు(pigments),హైడ్రోకార్బనులు,మరియు రెసినస్(resinous)పదార్థములు.

వేప నూనె ఉపయోగాలు
* వేపనూనెకున్న ఓషదగుణం కారణంగా, సబ్బుల తయారిలో విరివిగా వాడుచున్నారు. వేపనూనెతో చేసిన సబ్బునురుగ ఎక్కువగా ఇచ్చును.
* వేపనూనె, సబ్బుద్రవం, నీటి మిశ్రమాన్నిమొక్కల చీడ, పీడల నీవారిణిగా పిచికారి చేసి వాడెదరు.
* ఆయుర్వేద, యునాని మందుల తయారిలో ఉపయోగిస్తారు.
* కీళ్ళనొప్పుల నివారణకు మర్ధననూనెగా వాడెదరు.
* రాత్రి తల వెంట్రుకలకు వేపనూనెను దట్టంగా పట్టించి, గాలి అందకుండగా గట్టిగా వస్త్రాన్నిచుట్టి వుదయం వరకు వుంచిన తలలోని పేలు చనిపోవును.
* నేలలోపాతు కర్ర భాగానికి, ఇంటిలోని దూలలకు,వాసాలకు, గుమ్మాలకు వేపనూనెను రాసిన చెదపట్టదు.
* నూనె తీసిన వేపచెక్క (oil cake) ఎరువుగా రసాయనిక ఎరువులతో కలిపి చల్లెదరు. నూనె తీసిన చెక్కలో5.2-5.6 వరకు నత్రజని వున్నది. భాస్వరం 1.9%, పోటాషియం 1.5% వున్నది .


ఆవ నూనె ( Mustard oil) :
ఆవాల గింజల నుంచి తయారయిన మూడు రకాల నూనెలకి ఆవాల నూనె లేదా ఆవ నూనె అనే పదాన్ని ఉపయోగిస్తారు:
* విత్తనాలను దంచడం ద్వారా వచ్చే క్రొవ్వుతో కూడిన స్థావర నూనె (ఉద్భిజ్జ తైలం),
* విత్తనాలను రుబ్బి, నీటితో కలిపి, స్వేదన ప్రక్రియ ద్వారా ఆవశ్యక నూనెని గ్రహిచడం వంటి పద్ధతుల ద్వారా లభించే సుగంధ తైలం.
* ఆవాల గింజల లభ్యాన్ని సోయాబీన్ నూనె వంటి వేరే స్థావర నూనెతో కలపడం ద్వారా చేసే నూనె.

ఆరోగ్యం మీద ప్రభావాలు
తినదగిన నునెల నుంచి తయారయిన యురిసిక్ ఆమ్లపు ప్రభావాలు మానవుల మీద వివాదాస్పదం. అయితే మానవుల మీద ప్రతికూల ప్రభావాలు మాత్రం ఎప్పుడూ నమోదు కాలేదు. ఒకటి-లో-నాలుగో వంతు యురిసిక్ ఆమ్ల మరియు ఒలియక్ ఆమ్లం కలిపి లోరెంజో ఆమ్లం; అతి అరుదైన అడ్రెనోలేయుకోడిస్ట్రోపి అనే నాడిజీవశాస్త్ర వ్యాధికి ఇది ప్రయోగాత్మక చికిత్స.

ఎక్కువ మోతాదులో యురిసిక్ ఆమ్లాన్ని కలిగి ఉండడంవలన యునైటెడ్ స్టేట్స్, కెనడా మరియు ఐరోపాలలో ఒకప్పుడు ఆవాల ఆమ్లాన్ని మానవుల వాడడానికి పనికిరాదని భావించేవారు. ఎలుకల మీద చేసిన పూర్వ అధ్యయనాల వలన ఇలా భావించేవారు. ఎలుకల మీద అధ్యయనాలు అవి మనుషులు, పందుల కంటే తక్కువగా కూరగాయల క్రొవ్వులని (అవి యురిసిక్ ఆమ్లం కలిగి ఉన్నా లేకపోయినా) అరిగించుకుంటాయని చూపించాయి. చారిటోన్ ఎట్ ఆల్.సూచనల ప్రకారం ఎలుకలలో: "యురిసిక్ ఆమ్లపు నుండి యురిసిల్-CoA అప్రభావవంత చర్య మరియు ట్రైగ్లిసరైడ్ లైపేజ్ల నిమ్న స్థాయి చర్యలు, యురిసిక్ ఆమ్లంకోసం బేటాక్సిడేషన్ ఎంజైమ్ లు కార్డియాక్ లిపిడ్ పోగుపడడానికి, నిలబడడానికి దోహదమవవచ్చు. ఈచర్య పూర్తిగా అర్థం అవ్వకముందు యురిసిక్ ఆమ్లం మరియు ఆవాల నూనె రెండూ మనిషికి అతి విషపూరితమైనవన్న నమ్మకానికి దారితీసాయి.

ఎపిడెమియోలాజికల్ అధ్యయనాలు ఇప్పటికీ ఆవాల నూనెని సాంప్రదాయ రీతిలో ఉపయోగిస్తున్న ప్రాంతాలలో, ఆవాల నూనె గుండె సంబంధిత వ్యాధులని ఎదుర్కోవడంలో రక్షణగా ఉపయోగపడుతుందని సూచిస్తున్నాయి. ఈసందర్భంలో "సంప్రదాయం" అంటే నూనెని తాజాగా కూరగాయల క్రొవ్వులు మొత్తం కాలరీలలో అతి తక్కువ శతం ఉండడం. ఈప్రభావం యురిసిక్ ఆమ్ల శాత స్వభావమైన రక్త బింబాణువుల జిడ్డుతనాన్ని తక్కువ చేయడం వలన లేదా α-లినోలేనిక్ ఆమ్ల అధికశాత ప్రదర్శన లేదా తాజా శుద్ధి చేయని నూనె సమ్మేళన లక్షణాలా అనేవి ఖచ్చితంగా తెలియదు. ఫలితాలను తారుమారు చేసే మరణాల అవకాశాన్ని తొలగించడానికి ఇటువంటి ఎపిడెమియోలాజికల్ అధ్యయనాల గురించి తగిన శ్రద్ధ తీసుకోవాలి. నిజమేమిటంటే పూర్వ అసింప్టోమాటిక్ కరోనరీ వ్యాధిని పోస్ట్ మార్టంలో వెంటనే గుర్తించవచ్చు, ఇది ఆవాలనూనె పటాలంలో కనిపించదు, ఎందుకంటే ఇది ఆవాలనూనె సురక్షితం అన్న ఊహకి ఆధారాన్నిస్తుంది. సాంప్రదాయ సమాజాలలో ఆవాలనూనెని చిన్నపిల్లల మర్దనకి ఉపయోగించడం వారి చర్మ సరళతని మరియు పారగామ్యత పోయే ప్రమాదముంది.
ఖాద్య లైలము గా పేరు పొందిన ఆవనూనె బహుళ ఉపకారి. చర్మ సౌందర్యానికి ఇది సహకరిస్తుంది . మాడుకు రక్త ప్రసరణ బాగా జరగడము వ్ల్లఅ అవనూనె జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది .

నువ్వుల నూనె (Sesame oil or gingelly oil or til oil): నూనె గింజలైన నువ్వులు నుండి తయారౌతుంది. నువ్వులు శాస్త్రీయ నామం : సెసమమ్ ఇండికమ్ (sesamum indicum L) ఇది పెడాలియేసి (Pedaliacae) కుటుంబంలో సెసమమ్ (Sesamum) ప్రజాతికి చెందినది. నువ్వులను సంస్కృతంలో 'తిల '(Til) అందురు.
చరిత్ర
సింధు లోయ నాగరికత (hindu valley civilization) కాలం నాటికి అప్పటి ప్రజలు నువ్వుల నూనెను వాడేవారు. మానవుడు మొదటగా నువ్వుల నుండె నూనెను తీసి వాడటం ప్రారంబించినట్లు తెలుస్తున్నది. వేదాలలో కూడ నువ్వుల ప్రస్తావన వున్నది. నువ్వుల నుండి గానుగ ద్వారా నూనెను తీయువారు తిలకల వాళ్లు గా పిలవబడి కాలక్రమేన తెలికల వాళ్ళు గా మారారు. తెలికల కులానికి చెందిన వారు గానుగల ద్వారా నూనెను తీయటం తమ వృత్తిగా అక్కడక్కడ గ్రామాలలో వున్నారు. క్రీ. పూ. 600 నాటికి సింథులోయ నుండి మెసొపొటొమియా కు వ్యాప్తిచెందినది. సింథులోయ ప్రాంతం నుండే నువ్వులు మిగతా ప్రాంతాలకు వ్యాప్తి చెందినది.

ఉపయోగాలు
నువ్వులనూనెను కేవలం వంటనూనెగానే కాకుండ దేహ మర్ధన తైలంగా, ఆయూర్వేద మందులలో, కాస్మాటిక్స్‌తరారిలో వాడెదరు. పసిబిడ్దకు (నెలల పిల్లలు) మొదట నువ్వుల నూనెతో మర్ధన ఛెసి ఆ తరువాత స్నానం చెయ్య డం ఇప్పటికి గామాలలో చూడ వచ్చును. ఆంతేకాదు, ప్రసవానంతరం,15-20 రోజుల వరకు బాలింతరాలికి నువ్వుల నూనె, నువ్వులతో చేసిన పథార్దంలు ఆహరంగా యిచ్చెవారు. పుస్కర సమయంలో, కర్మక్రియలలో, గ్రహ దోష నివారణ పూజలు చేసినప్పుడు బ్రహ్మణులకు నువ్వులను దానంగా యిస్తారు. దేవాలయాలలో, ముఖ్యంగా శనేస్వర ఆలయంలో నువ్వులనూనెతో దీపారాధన చెయ్యడం ఆచారం.

నువ్వులనూనెలో సెసమొల్ (sesamol), మరియు సెసమిన్ (sesamin) వున్నాయు. సెసమిల్ "రక్త వత్తిడి" (Blood pressure)ని తగ్గించును. వనస్పతి (డాల్డా)లో తప్పని సరిగా 10% వరకు నువ్వుల నూనెను ఉపయోగించాలని ప్రభుత్వ నూనెల-వనస్పతి శాఖ-కల్తి నిరోధక విభాగం నిభందన వున్నది. నువ్వుల నూనెను ఎదైన నూనెలో కల్తి చేసిన బౌవడిన్ టెస్ట్‌ (Baudouin test) ద్వారా గుర్తించవచ్చును.వనస్పతిని నెయ్యిలో కల్తి చేసిన ,ఈ బౌడిన్ టెస్ట్‌వలన గుర్తించవచ్చును. నువ్వులనూనె తో మర్ధన చేస్తే శరీర ఉష్ణోగ్రత క్రమపరచబడుతుంది .

పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు -శక్తి 880 kcal 3700 kJ-పిండిపదార్థాలు 0.00 g-కొవ్వు పదార్థాలు 100.00 g-- సంతృప్త 14.200 g- ఏకసంతృప్త 39.700 g -- బహుసంతృప్త 41.700 g -మాంసకృత్తులు 0.00 g-విటమిన్ సి 0.0 mg 0%-విటమిన్ ఇ 1.40 mg 9%-విటమిన్ కె 13.6 μg 13%
కాల్షియమ్ 0 mg 0%-ఇనుము 0.00 mg 0%-మెగ్నీషియమ్ 0 mg 0% -భాస్వరం 0 mg 0%-పొటాషియం 0 mg 0%-సోడియం 0 mg 0%శాతములు, అమెరికా వయోజనులకు సూచించబడిన వాటికి సాపేక్షంగా Source: USDA పోషక విలువల డేటాబేసు.

ఆముదపు నూనె (Castor Oil):

ఆముదపు గింజల నుండి తీయు నూనె ఖాద్యతైలం కాదు.కాని పారీశ్రామిక రంగంలో దీని వాడకం విసృతంగా కలదు. శాస్త్రీయనామము రిసినస్ కమ్మినిస్ (Ricinus communis), యుపెర్బెసియె కుటుంబానికి చెందినది. ఆముదపు మొక్కలను కేవలం నూనె గింజల ఉత్పత్తికై సాగుచేయుదురు. తూర్పుఆఫ్రికాలోని యిథోఫియా అముదం మొక్క ఆవిర్భవ స్దానం. అముదపు మొక్క ఏపుగా, ఎత్తుగా పెరగడం వలన ఆముదపు చెట్టు అని కూడా అంటారు.
నూనెను తయారుచేయడం

విత్తనంలనుండి నూనెను 'ఎక్సుపెల్లరు'లనబడునూనెతీయుయంత్రాలద్వారా తీయుదురు.40-50 సంవత్సరంలక్రితం,ఆముదంను కేశనూనెగా వాడుటకై 'వంటాముదం'పేరుతో నూనెను ప్రత్యేకంగా చేసెవారు.ఆముదంగింజలకు కొద్దిగానీరును కలిపి మెత్తగా దంచి,ఇకపెద్దపాత్రలోవేసి,తగినంతగా నీరుచేసిబాగా వేడిచేయుదురు,వేడికి నీటిపైభాగంలో ఆముదంచేరును.ఆలాపైకితేరిన నూనెను వేరేపాత్రలో వేసి,తేర్చెవారు.విత్తనంపై పెంకును తొలగించిలేదా,విత్తానాన్ని యదావిధిగా యంత్రాలలో ఆడించి నూనెను తీయుదురు.కేకులో వుండిపోయిన నూనెను సాల్వెంట్‌ప్లాంట్‌ ద్వారా తీయుదురు.

ఆముదపునూనె లేతపసుపు రంగులో వుండును.ఒకరకమైన ప్రత్యేకమైన వాసన వుండి,'ఆముదపువాసన'అనే జననానుడి వచ్చినది.ఆముదంలో వున్నకొవ్వుఆమ్లాలలో 75-85% వరకు రిసినొలిక్‌కొవ్వు ఆమ్లమున్నది.ఈ కొవ్వు ఆమ్లం ఒలిక్‌ఆసిడ్‌వలె ఎకద్విబంధంను 9-వకార్బను వద్దకల్గివుండి,18కార్బనులను కల్గివున్నప్పటికి,12-వకార్బను వద్ద అదనంగా ఒక హైడ్రొక్షిల్(OH)ను కలిగివుండటం వలన దానిభౌతిక,రసాయనిక ధర్మాలలో వత్యాసం వచ్చినది.రిసినొలిక్‌ఆసిడ్‌జీవవిషగుణం(toxic)మనుషులమీదచూపించును.తక్కువమోతాదులో రిసినొలిక్‌ఆసిడ్‌ను ఆహారంగా తీసుకున్న జీర్ణవ్యవస్ద మీద ప్రతికూల ప్రభావంచూపించి,విరోచనాలు కల్గును.ఎక్కువ ప్రామాణంలోతీసుకున్నదేహంలో నిర్జలీకరణ్ జరిగి సృహతప్పె ప్రమాదముంది.విరేచనాలకై పిల్లలకు ఆముదంను త్రాగించడం ప్రమాదకరం.శాకతైలంలలో ఎక్కువ సాంద్రత,స్నిగ్థత వున్ననూనె ఆముదం.అముదంను పలుపారీశ్రామిక ఉత్పత్తులలో విరివిగా వుపయోగిస్తున్నారు.
ఆముదం నూనె ఉపయోగాలు
* అముదంనూనెను ఆనాదిగా బళ్లచక్రాల ఇరుసుకు కందెనగా వాడకంలో వున్నది.అలాగే కండారాలబెణకునొప్పులకు ఆముదం నూనెతో మర్దన చెయ్యడం ఇప్పటికి గ్రామీణ ప్రాంతాలలో కొనసాగుచున్నది.అలాగే కేశతైలంగా కూడా వినియోగించెదరు.
* విద్యుతులేని గ్రామాలలో దీపాలను వెలిగించుటకు వాడెదరు.ఆముదం నూనె ఎకువ స్నిగ్థత కలిగి వున్నందువలన నెమ్మదిగా ఎక్కువ సమయం వెలుగును.
* పారిశ్రామికంగా పలు పరిశ్రమలలో ఆముదంను వాడెదరు.ద్రవ మరియు ఘనకందెనలు చేయుటకు,ముద్రణ సీరాలను,సబ్బులను చేయుటకు(లైఫ్‌బాయ్‌సబ్బులవంటివి),ఔషద తయారిలో(ఆయింట్‌మెంట్‌లలో బేస్‌గా హైడ్రొజెనెటెడ్‌ ఆయిల్)ఉపయోగిస్తారు.
* మెచిన్‌కటింగ్‌ఆయిల్స్‌,రంగులతయారి(paints&dyes),వస్తువులను అతికించు జిగురుల(adhesives),రబ్బరు,వస్త్రపరిశ్రమలలొ వినియోగిస్తారు.
* నైలాన్,ప్లాస్టిక్‌పరిశ్రమలోను,
* హైడ్రాలిక్‌ఫ్లుయిడ్స్‌లలో,విమాన యంత్రాలలో కందెనగా వినియోగిస్తారు.
ఆముదం నూనెను చర్మానికి పైపూతగా ఉపయోగి స్తారు. చర్మంపై ఏర్పడే పులి పిరులు, చెమట పొక్కులు, పాదాలకు ఏర్పడే అనెలకు లోతైన గాయాల తాలూకు మచ్చలను పోగొట్టడానికి కాస్ట్రా యిల్‌ దివ్యౌషధంగా పని చేస్తుంది. శిరోజాల ఆరోగ్యానికి రక్షణగా పనిచేస్తుంది. కనుబొమల వెంట్రుకలు పెరగడానికి కనురెప్పల సౌందర్యానికి ప్రతిరోజూ నూనెను రాయడం మంచిది. కేశాలు నల్లగా నిగనిగలాడటానికి తోడ్పడుతుంది. శిరోజాలకు ఉపయోగించే సౌందర్య సాధనాల తయారీలో కాస్ట్రాయిల్‌ వాడుతున్నారు.

ఆలివ్‌నూనె(Olive Oil) : చర్మాన్ని మృదువుగా ఉంచడంలో ఆలివ్‌ నూనెది ప్రత్యేక స్థానం. చిన్నారులకు మర్ధన చేయడానికి ఎక్కువగా ఈనూనెను ఉపయోగిస్తారు. చర్మానికి వాడే మందులు, ఆయింట్‌మెంట్స్‌ తయారీ లో నూ దీనిని ఎక్కువగా వాడుతారు. ఈ నూనెతో చర్మాన్ని మసాజ్‌ చేసి 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే చర్మం మృదువుగా, కాంతిగానూ మారుతుంది. చలికాలంలో డ్రై చర్మం కలవారు ఆలివ్‌ ఆయిల్‌ను చర్మానికి ప్రతిరోజూ రాస్తుంటే, చర్మం పగలకుండా ఉంటుంది. చర్మంపై పుండ్లు గాయాల కారణంగా ఏర్పడిన మచ్చలను పోగొట్టి చర్మం సహజ రంగుతో నిగారింపుగా ఉండేలా చేస్తుంది. చిన్న పిల్లలకు ఆలివ్‌ ఆయిల్‌ పట్టించి శరీరానికి మసాజ్‌ చేస్తే వారి చర్మం మృదువుగా ఉండి అందంగా తయారవుతారు. పీలగా ఉన్న పాపాయిలకు ఆలివ్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేస్తే బొద్దుగా అందంగా అవుతారు. గ్రీస్‌కు చెందిన మహిళలయితే.. ఆలివ్‌నూనెను మించిన పరిష్కారం లేదంటూ సూచిస్తారు. రోజు స్నానానికి ముందు కొద్దిగా ఆలివ్‌నూనె రాసుకుంటే చాలు.. చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. దాంతోపాటు.. స్నానపు నీటిలో నాలుగైదు చుక్కల ఆలివ్‌నూనెనూ వేసుకుంటారు వీరు. ఇక కొద్దిగా ఆలివ్‌నూనె రాసుకుని.. ఆ తర్వాత పంచదారతో రుద్దుకుంటే.. ముడతలు దరిచేరవని వీరి నమ్మకం.
నాలుగు చెంచాల ఓట్‌మీల్ పొడిలో మూడు చెంచాల ఆలివ్‌నూనె కలిపి పాదాలకు మర్థన చేసి అరగంటయ్యాక చల్లటినీళ్లతో కడిగేస్తే మృతకణాలి తొలగిపోయి పాదాలు మృదువుగా తయారవుతాయి.

వంటకాల్ని రుచిగా మాత్రమే కాదు.. పోషకాలు తగ్గిపోకుండా వండటం.. కూడా తెలిసుండాలి. అందుకు ఏం చేయాలంటే.. ఆకుకూరలు ఉడికించే నీళ్లలో కొద్దిగా ఆలివ్‌నూనె లేదా నిమ్మరసం వేస్తే పోషక విలువలు పోకుండా తగ్గకుండా ఉంటాయి.

జుట్టు పొడిబారకుండా ఉండాలంటే కొబ్బరి నూనె, ఆలివ్‌నూనె, ఆముదాలను సమపాళ్ళలో తీసుకుని బాగా కలపాలి. తలస్నానం చేయడానికి ఒక గంట ముందు తలకు బాగా పట్టించి తరువాత తలస్నానం చేయాలి.

బరకగా మారిన మోచేతులకు కొద్దిగా ఆలివ్‌నూనె రాసి మర్దన చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే మార్పు ఉంటుంది

చెంచా గ్లిజరిన్‌, కొద్దిగా రోజ్‌వాటర్‌, రెండుచెంచాల ఆలివ్‌నూనె, కాస్త నిమ్మరసం, గుడ్డులోని తెల్లసొన కలిపి చేతులకు పూతలా వేసుకోవచ్చు. ఆరాక కడిగేసుకుంటే చాలు... చేతులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి.

నాలుగుచుక్కల అల్లంరసంలో కొద్దిగా ఆలివ్‌నూనె చేర్చి జుట్టు కుదళ్లకు పట్టించాలి. గంటయ్యాక తలస్నానం చేయాలి. కుదుళ్లు దృఢమవుతాయి.
ఆముదం, ఆలివ్‌నూనె వేడిచేసి చేతులను వేళ్లను ముంచి పావుగంటయ్యాక బయటకు తీసి మర్దన చేయడం వల్ల చక్కటి పోషణ అందుతుంది.చక్కగా పెరుగుతాయి.

సంపెంగ, సంపంగి లేదా చంపకం (Michelia):
దీని గాఢమైన వాసన మంచి శృంగారప్రేరితం. ఒత్తిడి చేత్తో తీసినట్లుగా పోతుంది. జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. అధిక రక్తపోటునీ తలనొప్పినీ తగ్గిస్తుంది.

మరువం-Marjorana hortensis:
  •  
  • హైపర్‌ యాక్టివ్‌గా వుండే పిల్లలకు స్నానంలో రెండుచుక్కలు నూనె కలిపితే కాస్త స్థిరత్వం వస్తుంది. మలబద్ధకాన్ని పోగోడతుంది. ఈ నూనెని మర్దన చేస్తే తలనొప్పి, టెన్షన్‌ దూరంగా పారిపోతాయి. నీళ్ళలో వేసుకుని ఆవిరిపట్టడం వల్ల ఆస్థమా, సైనసైటిస్‌ వంటి సమస్యలన్నీ హుష్‌ కాకి.
చందనం-Sandal wood :
  •  

  •  
యోగా చేసేవాళ్ళకి చాలా మంచిది. మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. అలసటనీ తగ్గిస్తుంది.

లావెండర్‌-Lavender :
  •  

  •  
అత్యంత అధికంగా వాడుకలో వున్న ఈ నూనె వాడితే ఒత్తిడి పరార్‌. జలుబు, మైగ్రైయిన్‌ వంటి వాటిని తగ్గిస్తుంది. స్నానం చేసేటప్పుడు నీళ్ళలో ఒకటి రెండు చుక్కలు కలుపుకుంటే తాజాగా వుంటుంది. దిండుమీద రెండుచుక్కలు వేసుకుంటే హాయిగా నిద్రపడుతుంది. మంచి డియోడరెంట్‌, యాంటిసెప్టిక్‌ కూడా. అందుకే సబ్బులు, ఇతర లోషన్లలోనూ దీన్ని ఎక్కువగా వాడతారు.



Source : Text book of Natural Medicaments for BAMA students.
  • ============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, May 30, 2011

ఎపిసియోటమీ - అవగాహన,Episiotomy awareness



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఎపిసియోటమీ - అవగాహన,Episiotomy awareness- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

సహజకాన్పే కానీ.. ప్రసవ సమయంలో చిన్న కోత పెట్టి.. బిడ్డను బయటకు తీయాల్సి వచ్చిందని చెబుతుంటారు కొందరు. సిజేరియన్‌ కాని ఈ పరిస్థితి ఎందుకు, ఎప్పుడు ఎదురవుతుంది.. ఆ తరవాత దృష్టి సారించాల్సిన అంశాలపై అవగాహన పెంచుకోవడం కాబోయే తల్లులకి ఎంతైనా అవసరం.

ప్రసవం తేలికగా జరగాలని కోరుకున్నా.. కొన్నిసందర్భాల్లో చివరి సమయంలో బిడ్డ వెలుపలికి రావడంలో కొన్ని అవాంతరాలు ఏర్పడవచ్చు. అలాంటప్పుడు యోనిముఖ ద్వారం దగ్గర చిన్న కోత పెట్టి.. ఆ మార్గాన్ని సులువు చేస్తారు. ఎపిసియోటమీగా పరిగణించే దీన్ని ఎప్పుడు చేస్తారంటే..

  • ఈ సమయంలో గర్భాశయ ముఖద్వారం శిశువు బయటకు వచ్చేందుకు అనువుగా తెరచుకుంటుంది. అయితే ఆ తరవాత ఎక్కువ సమయం దాకా బిడ్డ బయటకు రాకపోవడం..

  • బిడ్డ ఒత్తిడికి లోనుకావడం... బయటకు తీయడానికి ఫోర్సెప్స్‌ లాంటివి వాడాల్సి రావడం.. కవలలు లేదా ముగ్గురు శిశువులు ఉన్నప్పుడు..

  • పుట్టబోయే బిడ్డ అధిక బరువుండటం.. తలకిందులుగా ఉండటం.. తల్లికి గతంలో కటివలయ భాగంలో శస్త్రచికిత్స చేసిన సందర్భాలున్నా.. ఎపిసియోటమీ చేయాల్సి రావచ్చు.

ఎలా చేస్తారు..
చాలా తేలిక ప్రక్రియ ఇది. వెన్నెముక లేదా ఆ ప్రాంతంలో మత్తుమందు ఇచ్చి యోని ముఖ ద్వారం దగ్గర చిన్న కోత పెట్టి బిడ్డ సులువుగా వచ్చేలా చేస్తారు. ప్రసవానంతరం మళ్లీ కుట్లు వేస్తారు. చికిత్స తరవాత ప్రసవం సులువుగా అయినా.. ఆ తరవాత కొన్ని సమస్యలు బాధించవచ్చు. ముఖ్యంగా..

కుట్లు వేసేటప్పుడు మత్తుమందు ఇచ్చినా కూడా.. ఆ తరవాత కొద్దిగా నొప్పి ఉంటుంది. అది మరీ ఎక్కువగా ఉంటే.. వైద్యులు మందులు సూచిస్తారు.

ప్రసవానంతరం ఈ సమస్య సాధారణంగా ఉంటుంది. ముఖ్యంగా పాలిచ్చే తల్లుల్లో అధికంగా కనిపిస్తుంది. అయితే తరచూ మూత్రవిసర్జనకు వెళ్లడం వల్ల కుట్లు విడిపోతాయనే భయం కొందరిలో ఉంటుంది. అలాంటప్పుడు మలబద్ధకం సమస్య మరింత పెరుగుతుంది. దీన్ని నివారించడానికి మంచినీళ్లు ఎక్కువగా తాగాలి.

కూర్చునేటప్పుడు అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. ఆ ఇబ్బందిని తగ్గించడానికి కుషన్‌లాంటి దాన్ని వేసుకుని కూర్చుంటే సరిపోతుంది. అలాగే కలయిక సమయంలో కూడా నొప్పిగా ఉంటోందని కొందరు చెబుతుంటారు. ఈ సమస్య ఎపిసియోటమీ చేసిన వారికే కాదు.. మిగిలినవారికీ తప్పదు. మరీ ఇబ్బందిగా అనిపిస్తే.. వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

కోత పెట్టిన ప్రాంతంలో కొన్నిసార్లు మచ్చతో పాటు.. గాటులా కూడా పడుతుంది. మరీ ఇబ్బంది అనిపిస్తుంటే.. కాన్పు అయిన ఆరునెలలకు చిన్న శస్త్రచికిత్స రూపంలో తగ్గిస్తారు.
.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
* ప్రసవమైన తరవాత మొదటి ఇరవైనాలుగ్గంటల్లో ఆ ప్రాంతంలో ఐస్‌ప్యాక్‌ ప్రయత్నిస్తే నొప్పి నుంచి సాంత్వన ఉంటుంది. వాపు రాకుండా కూడా ఉంటుంది.

* వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ఆస్కారం ఉంటుంది. ప్రసవానంతరం వాడే న్యాప్‌కిన్లను ప్రతి మూడుగంటలకోసారి తప్పనిసరిగా మార్చుకోవాలి.

ఒకవేళ ఇన్‌ఫెక్షన్‌ ఎదురైతే.. యాంటీసెప్టిక్‌ లోషన్‌ వాడితే ఉపశమనం ఉంటుంది. సమస్య మరీ ఎక్కువగా ఉంటే.. వైద్యులు యాంటీబయాటిక్స్‌ సిఫారసు చేస్తారు.

* కుట్లు వేసిన తరవాత కొద్దిగా నొప్పి బాధిస్తుంది. అయినా కూడా సాధ్యమైనంత త్వరగా నడవడానికి ప్రయత్నించాలి. దీనివల్ల రక్తప్రసరణ క్రమబద్ధమవుతుంది. చాలా త్వరగా తగ్గుతుంది.

* మలబద్ధకాన్ని నివారించడానికి మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. అదే సమయంలో పీచుశాతం సమృద్ధిగా ఉండే పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకోవాలి.

చిన్నదైనా సరే.. ఈ శస్త్రచికిత్స వద్దనుకుంటే.. ప్రసవానికి ముందే పెరీనియల్‌ మసాజ్‌ ప్రయత్నిస్తే మంచిది. వైద్యుల్ని అడిగితే దీని గురించి చెబుతారు.


perineal massage

There are several methods for doing perineal massage. Two are given here.
First of all, wash your hands. Then find a private place and sit or lean back in a comfortable position. Put a lubricant such as KY jelly, cocoa butter, olive oil, vitamin E oil or pure vegetable oil on your thumbs and around the perineum.


Place your thumbs about 1 to 1.5 inches (three to four centimeters) inside your vagina. Press downward and to the sides at the same time. Gently and firmly keep stretching until you feel a slight burning, tingling or stinging sensation. With your thumbs, hold the pressure steady for about two minutes or until the area becomes a little numb and you don't feel the tingling as much.

As you keep pressing with your thumbs, slowly and gently massage back and forth over the lower half of your vagina, working the lubricant into the tissues. Keep this up for three to four minutes. Remember to avoid the urinary opening.

As you massage, pull gently outward (and forward) on the lower part of the vagina with your thumbs hooked inside. This helps stretch the skin much in the same way that the baby's head will stretch it during birth.

Do this massage once or twice per day, starting around the 34th week of pregnancy till delivery. After about a week, you should notice an increase in flexibility and stretchiness.

Several research studies have shown this technique to be helpful in preventing lacerations and episiotomy. In 1999, there was an article in the American Journal of Ob/Gyn by Labrecque that evaluated the effectiveness of perineal massage during pregnancy for the prevention of perineal trauma at birth. Women in the experimental groups were requested to perform a 10 minute perineal massage daily from the 34th or 35th week of pregnancy until delivery. The massage consisted of introducing one or two fingers three to four centimeters into the vagina and applying and maintaining pressure -- first downward for two minutes and then for two minutes to each side of the vaginal entrance. Women were given a bottle of sweet almond oil to use for lubrication.


--Dr.Pranathi Reddy -- Uro-Gyenaecologist , ph:9848051052
  • ============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, May 26, 2011

Coxodynia , తోక ఎముక నొప్పి , కాక్షోడినియా

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - తోక ఎముక నొప్పి(Coxodynia-కాక్షోడినియా)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
మనిషికి తోక ఉండదు కాని తోకలాంటి భాగము వెన్నేముక వెన్నెముకలో ఉంటుంది . వెన్నెముక చివర త్రిభుజాకారం లో అంతమయ్యే ఎముక అది . దాని నొప్పితో కొంతమంది బాధపడడుతుంటారు . ఎక్కువ సేపు కూర్చొని పనిచేస్తే శరీర బరువు ప్రభావము ఆ ఎముకవీద పడి బాధిస్తుంది . వైద్యభాషలో దీనిని " కాక్సీడినియా" అంటారు . ఇప్పుడు చాలా మంది ఉద్యోగాలు కుర్చీలో కూర్చొని చేస్తున్నవే .

వీపు చిట్టచివర కాళ్ళు రెండుగా చీలేచోట వేలుపెట్టి నొక్కినప్పుడు బాధ అనిపించినా , మూత్రవిసర్జన సమయం లో లేదా ఆ తర్వాత లేచి నిలుచుంటున్నప్పుడు ఆ భాగము లో నొప్పి అనిపించినా మీలో ఇబ్బంది మొదలైందని గుర్తించంది . ఈ నొప్పి తొడలలోకి , కొన్ని సమయాలలో పురజాలలోకి ప్రాకవచ్చును .

శరీర బరువు అధికంగా క్లవారికి ఈ ఇబ్బంది అధికం ,
ఎక్కువ దూరము డ్రైవింగ్ చేసే వాళ్ళలోనూ ఇది కనిపిస్తుంది .
కొన్ని రకాలమందులు వాడడం వల్ల నూ ఇది రావచ్చును .
ఎక్కువకాలము మలబద్దకం తో బాధపడే వారు కొంద్రిని ఇది నొప్పిగా ఉండవచ్చును .
కాక్సిక్స్ ఎముక కు దెబ్బలు తగిలిన దాని చుట్టు ఉన్న నెర్వస్ ఇర్రిటేషన్‌ వలన కలుగ వచ్చును .

చికిత్స :
  • కూర్చున్న పొజిషన్‌ నుండి పడుకునే పొజిషన్‌ కి మారడం వలన నొప్పి తగ్గును ,
  • విరోచనం మందం అవకుండ పీచుపదార్ధాలు తీసుకోవాలి ,
  • కూర్చునే కుర్చీ మెత్తగా ఉండే టట్లు చూసుకోవాలి ,
  • డ్రైవింగ్ లో కొన్ని మెలకువలు పాటించాలి ,
నొప్పి నివారణకు :
  • Butaproxyvon gel /ointment నొప్పిదగ్గర రాయాలి .
  • Tab . Trim (tramadol + paracetamol ) రోజుకి 2 చొ.. వారం రోజులు వాడాలి ,
  • వేడి నీళ్ళ కాపడం పెట్టవచ్చును ... నొప్పి తగ్గుతుంది .
మంచి వైద్యుని సంప్రదించి తగిన వైద్యం తీసుకోవాలి .


  • ==================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, May 25, 2011

Skipping as Exercise, స్కిప్పింగ్ మంచి వ్యాయామము



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -స్కిప్పింగ్ వ్యాయామము- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

వ్యాయామం (Exercise) మంచి ఆరోగ్య పరిరక్షణ కోసం చాలా అవసరం. ఇది ఎక్కువగా కండరాలను, రక్త ప్రసరణ వ్యవస్థను ధృఢపరచడానికి, క్రీడలలో మంచి ప్రావీణ్యత సాధించడానికి ఉపయోగిస్తారు. దైనందిక వ్యాయామం వలన మన శరీరపు వ్యాధినిరోధక శక్తి వృద్ధిచెందుతుంది, గుండెకు సంబంధించిన వ్యాధులు, స్థూలకాయం, మధుమేహం వంటి వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది. కొన్ని రకాల మానసిక వ్యాధుల నివారణ కు తోడ్పడుతుంది.

స్కూల్ లో పిల్లలకి తప్పకుండా నేర్పించే ఆట స్కిప్పింగ్. ఇది చాలా సింపుల్ గా కనిపించే ఆట. నిజానికి అది ఒక ఆట కాదు... వెలకట్టలేని వ్యాయామము. ఒక గంటసేపు స్కిప్పింగ్ చేస్తే 1000 క్యాలరీల శక్తి కరిగించబడుతుంది . దీనికి కావల్సింది స్కిప్పింగ్ తాడు మాత్రమే . ఏ సమయములోనైనా ఎక్కడైనా ఎంతో సులభము గా చేయవచ్చును . దీనివల్ల కాళ్ళు, చేతులు , పాదాలన్నిటికీ వ్యాయామము లభిస్తుంది.

ఆరోగ్యరీత్యా అందరూ అనేక రకాల వ్యాయామాలు, వాకింగ్‌, జాగింగ్‌ చేస్తుంటారు. అలాగే అందం, ఆరోగ్యం కలకాలం నిలవాలంటే చేయగలిగినవాళ్ళు స్కిప్పింగ్‌ చేస్తే చాలా సుగుణాలు కనిపిస్తాయి. ఇది చేస్తున్నప్పుడు శరీరాన్ని నిటారుగా వుంచాలి. రిలాక్సింగ్‌గానూ వుండాలి. చూపులు నిటారుగా ముందుకే వుండాలి. కాళ్ళవైపు చూడకూడదు. స్కిప్పింగ్‌ చేసే సమయంలో శరీర బరువునంతా పాదాల ముందుభాగంలోనే నిలపాలి. మడమల మీద పడకూడదు. స్కిప్పింగ్‌ను గట్టిగా వుండే నేలమీద కాకుండా మెత్తటి తివాచీ మీద చేయాలి. లేదా చాపమీదకానీ, ఇంటి బయట పచ్చికలోకానీ చేస్తే వీలుగా వుంటుంది. స్కిప్పింగ్‌ చేయడం మొదలుపెట్టిన కొత్తలో కొంత అలసటగా వుంటుంది. అయినా క్రమం తప్పకుండా రోజూ కొంతసమయం చేస్తే క్రమక్రమంగా ఎక్కువ సమయం చేయగలుగుతారు. స్కిప్పింగ్‌ చేయడానికి ప్రత్యేకమైన దుస్తులు అవసరంలేదు కానీ బాగా వదులుగా వుండాలి. దీనిని సాధారణంగా ఉదయాన్నే చేస్తే మంచిది. భోజనం ముందుకానీ, భోజనం అయిన రెండు గంటల తర్వాతకానీ స్కిప్పింగ్‌ చేయవచ్చు. మహిళలు తమ శరీరాకృతిని అందంగా మలచుకోవడంతోపాటు బరువును కూడా నియంత్రించేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. కాని సులభమైన పద్దతితో శరీరంలోని బరువును, కొవ్వును కరగదీయవచ్చంటున్నారు ఆరోగ్యనిపుణులు. దీనికి చేయాల్సిందల్లా ఒక్కటే... స్కిప్పింగ్ చేయడం.

మీరు ఎంచుకునే తాడు మీ ఎత్తుకు తగ్గట్టు ఉండాలి. స్కిప్పింగ్ ఎలా చేయాలంటే... మీ ఎత్తుకు తగ్గ తాడును రెండింతలుగా ఉండేలా చూసుకోవాలి. దానిని మీ పాదాలతో అదిమి పట్టి రెండు అంచులను మీ ఎత్తుకు సమానంగా ఇరువైపులా చూసుకుని మీ చేతులతో తిప్పాలి.

స్కిప్పింగ్ వలన రక్త సరఫరా మెరుగవుతుంది. కంటికి, పాదాలకు, చేతులకు సమన్వయం పెరిగి మనుషులు సురుకుగా స్పందించ గలుగురారు . క్రమము తప్పకుండా స్కిప్పింగ్ చేస్తే శరీరక బలం పెరుగుతుంది. ఎముకలు బలపడతాయి. సుగరు, బి.పి వ్యాదులు అదుపులోకి వస్తాయి . స్కిప్పింగ్ ప్రారంభించినపుడు తక్కువ సమ్యము తో ఆరంభించి ... క్రమముగా సమ్యాన్ని పెంచుకోవాలి.

స్కిప్పింగ్‌ వల్ల లాభాలు:

  • స్కిప్పింగ్‌ చేయడం వల్ల గుండెకు మంచి వ్యాయామం చేకూరుతుంది.
  • శరీరంలో వుండే అధిక కొవ్వును తొలగించుకోవచ్చు.
  • దీనిని చేయడం వల్ల మనస్సు, శరీరం చురుకుదనాన్ని పొందుతాయి.
  • రోజూ స్కిప్పింగ్‌ చేయడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు.
  • చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు.
  • ఊబకాయాన్ని నియంత్రించేందుకు స్కిప్పింగ్ చేయాలి .
  • పొట్టపై పేరుకుపోయిన కొవ్వును సులభంగా కరిగించవచ్చు. ఇక్కడ డైటింగ్ చేయకుండానే శరీరంలోని కొవ్వును కరిగించేయవచ్చును .
  • స్కిప్పింగ్‌ చేసిన తరువాత త్వరత్వరగా శ్వాస తీసుకోవాల్సివుంటుంది. దీంతో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. కాళ్ళు తొడల వద్దనున్న కండరాలు బలిష్టంగా తయారవుతుంది.
  • స్కిప్పింగ్‌ చేయడంతో ఉదరభాగం లోపలికి-బయటకు వెళుతుంది. దీంతో ఉదరభాగంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కరిగిపోతుంది.
  • స్కిప్పింగ్‌ చేయడంతో తరుచూ భుజాలు తిరుగుతుంటారు. దీంతో భుజాలు గుండ్రంగా తయారవుతాయి.
  • చేతి మడమలు తిప్పుతుండటంతో వేళ్ళకు మరింతగా బలం చేకూరుతుంది. రచయితలకు, కళాకారులకు ఇది ఎంతో ఉపయుక్తంగా వుంటుంది.
  • చిన్న వయసువారు స్కిపింగ్‌ అలవాటు చేసుకుంటే మంచిది. మెదడు విశ్రాంతిగా ఉంటుంది. స్కిప్పింగ్‌ చేయడం వలన శరీరం దృఢంగా తయారవుతుంది.

స్కిప్పింగ్‌ ఎవరెవరు చేయకూడదంటే:

  • అధిక రక్తపోటు వారు ఈ వ్యాయామం చేయకూడదు.
  • సిజేరియన్‌ ఆపరేషన్‌ చేయించుకున్న మహిళలు ఏ మాత్రం చేయకూడదు. పూర్తిగా కొలుకున్నాము అనుకున్న తరువాత మాత్రమే స్కిపింగ్‌ చేయాలి. లేదా
  • మూడు నెలలు తరువాత వైద్యుల సలహా మేరకు స్కిప్పింగ్‌ చేయవచ్చు.
  • హెర్నియా రోగులు స్కిప్పింగ్‌ చేయకూడదు.
  • గుండె సంబంధిత జబ్బులతో బాధపడేవారు ఈ వ్యాయామం చేయకూడదు.

  • =========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, May 23, 2011

బాలింతల ఆహారం పై ఆంక్షలు-అవగాహన,Food restrictions of milk-feeding mothers




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -బాలింతల ఆహారం పై ఆంక్షలు-అవగాహన(Food restrictions of milk-feeding mothers)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



--గర్భిణిగా ఉండగా కోరిన ఆహారాన్ని తినే అవకాశం ఉంటుంది. కానీ ప్రసవం అయిన తర్వాత ఒక్కసారిగా ఆహారంపై ఆంక్షలు మొదలు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బాలింతలకి ఈ పరిస్థితి ఎదురవుతుంది. కారణం తీసుకొనే ఆహారంపై ఉండే అపనమ్మకాలే. అపనమ్మకాల కారణంగా ప్రసవానంతరం వారు సరైన ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత తీసుకొనే ఆహారంపై అవగాహన పెంచుకొంటే తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారంటున్నారు

పెరుగు తింటే జలుబు చేస్తుందా?
పాలిచ్చే తల్లులు పెరుగు, నారింజ, నిమ్మ వంటి పండ్లరసాలు తీసుకోవడం వల్ల బిడ్డకు జలుబు చేస్తుందని చాలామందిలో నమ్మకం. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు. బిడ్డ కొత్త వాతావరణానికి అలవాటు పడే క్రమంలో జలుబు రావడానికి ఆస్కారం ఉంది. వాస్తవానికి పండ్లు, పండ్ల రసాలు తీసుకోవడం వల్ల తల్లిపాలలో విటమిన్‌ 'సి' స్థాయులు తగినంతగా ఉంటాయి. ఫలితంగా బిడ్డకు వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

పప్పులతో కడుపునొప్పా..
రాజ్‌మా సెనగపుప్పు, మొలకలు వంటి వాటిని పాలిచ్చే తల్లులు తినడం వల్ల బిడ్డకు కడుపు నొప్పి వస్తుందని చాలా మంది అనుకొంటారు. అందువల్లే వీటితో చేసిన పదార్థాలని బాలింతలకి దూరంగా ఉంచుతారు. ఈ నమ్మకంలో ఏ మాత్రం వాస్తవం లేదు. బాలింతలకి చక్కని పోషకాహారం అంటే ఈ రకం తృణధాన్యాలతో చేసిన పదార్థాలే. వీటిల్లో
మాంసకృత్తులు, జింక్‌, ఇనుము పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బిడ్డకు కడుపునొప్పి, ఉబ్బరం వస్తాయనడం సరికాదు. కాబట్టి నిస్సందేహంగా పప్పుధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకోవచ్చు.
అలాగే బాలింతలు చల్లని నీటిని తాకకూడదని.. వేడివేడి నీటిని తాగిస్తారు. ఇక్కడ వేడినీళ్లు చన్నీళ్లు అని కాదు. ఆ నీరు పరిశుభ్రంగా ఉందా లేదా అన్నదే ముఖ్యం. నీటిని కాచి వడకట్టి.. చల్లార్చి తాగినా ఏం కాదు. వేడినీటినే తాగాలనేది ఒక అపనమ్మకం మాత్రమే. అలాగే నీటిని అతిగా తాగడం వల్ల పాలు పలుచన అవుతాయని, అతిగా తాగొద్దని పెద్దలు సలహాలు ఇస్తుంటారు. ఇందులో కూడా నిజం లేదు. నీటిని బాగా తాగడం వల్ల బిడ్డకు తగినన్ని అంటే 600 నుంచి 800 ఎమ్‌.ఎల్‌ పాలు అందుతాయి. ఆపైన నీరు మూత్రం రూపంలో బయటకు పోతుంది. అంతేకానీ తల్లి నీటిని తాగడం వల్ల బిడ్డకందే పాలపై ఎటువంటి ప్రభావం ఉండదు.

నెయ్యి మంచిదేనా
పూర్వపు రోజుల్లో అమ్మాయిలకి చాలా చిన్న వయసులో పెళ్లిళ్లు అయ్యేవి. ఆ వయసులోనే వారు పిల్లలకు జన్మనిచ్చేవారు. ఫలితంగా తీవ్రమైన పోషకాహార లేమి. ఆ సమయంలో నెయ్యిని ఆహారంలో చేర్చడం వల్ల కొంతవరకు శరీరానికి మేలు జరిగేది. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. పైగా నెయ్యిలో అధిక కెలొరీలు ఉంటాయి. దీనివల్ల అతిగా బరువు పెరిగిపోవడానికి ఆస్కారం ఉంది. తప్పనిసరిగా నెయ్యిని తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే బిడ్డ పుట్టుకతో పచ్చకామెర్లతో బాధపడుతుంటే తల్లి గుడ్డు, మాంసాహారం భుజించకూడదని అనుకొంటారు. నిజానికి మామూలు కామెర్లకు.. పుట్టకతో వచ్చే నియోనేటల్‌ జాండిస్‌కి పోలిక లేదు. తల్లి తినే ఆహారం బిడ్డపై ఎలాంటి ప్రభావం చూపించదు. కాబట్టి గుడ్డు ఇతరత్రా పోషకాహారంతోపాటు ఎండు ఫలాలు మితంగా తీసుకోవచ్చు. వీటిలో అధిక కెలొరీలు ఉంటాయి కాబట్టి ఆ మితం పాటించాలి.

పోషకాహారంతో.. పాలు
బిడ్డ మెదడు పనితీరు చురుగ్గా చలాకీగా ఉండాలన్నా, తగినంత బరువు ఉండాలన్నా, ఐక్యూ స్థాయిలు బాగుండాలన్నా తల్లిపాలే కీలకం. ఆరునెల్ల వరకు తప్పనిసరిగా అందించాల్సిన తల్లిపాలు పోషకభరితం కావాలంటే అమ్మ తీసుకొనే ఆహారంలో పోషకాలు ఉండాలి. పోషకాహారం అంటే.. మాంసకృత్తులు, ఆవశ్యక ఫ్యాటీ ఆమ్లాలు, ఇనుము, క్యాల్షియం, ఫోలిక్‌ ఆమ్లం, బి కాంప్లెక్స్‌ విటమిన్లు, విటమిన్‌ సి ఆహారంలో ఉండాలి. ప్రతి మూడు గంటలకి
ఆహారాన్ని తీసుకోవాలి. అలాని కెలొరీలు మాత్రమే ఉండే చాక్లెట్లు, శీతల పానీయాలను తీసుకోకూడదు. మాంసకృత్తులు అధికంగా ఉండే పాలు, గుడ్లు.. పెరుగు, చీజ్‌, చిక్కుడు జాతి గింజలు, సోయా పాలు, చేపలు, పండ్లు, మొలకలు తినాలి. ఇనుము అధికంగా ఉండే.. ఎండు ఫలాలు, ఆకుకూరలు, చేపలు తీసుకోవాలి. అలాగే విటమిన్‌ సి పుష్కలంగా లభించే జామ, టమాటాలు, నిమ్మ, ఉసిరి, దోస వంటివి ఎంచుకోవచ్చు. బిడ్డకు మేలు చేసే ఫొలేట్‌ లభ్యమయ్యే పదార్థాలు.. ఆకుకూరలు.. తోటకూర, పుదీనా, పాలకూర, కొత్తిమీర, గింజలు, చిక్కుడు జాతి గింజలు రోజువారీ ఆహారంలో ఉండాలి. వీటి నుంచి బీటాకెరటిన్‌ సమృద్ధిగా అందుతుంది. పాలు, పెరుగు, టోఫు, చీజ్‌, వెన్నల నుంచి క్యాల్షియం బాగా పొందవచ్చు. అలాగే తృణధాన్యాలు, పుచ్చకాయ, కర్బూజా, స్ట్రాబెర్రీలు, బొప్పాయి, అంజూర, యాపిల్‌ వంటి పండ్ల వల్ల.. రాగి, జొన్నలు, గోధుమలు, దంపుడు బియ్యంతో చేసిన పదార్థాలను ఉదయం అల్పాహారంగా తీసుకోవడం వల్ల పీచు అందుతుంది. వీటితో పాటు మూడు లీటర్లకి తక్కువ కాకుండా నీటిని తాగాలి.

పచ్చళ్లకు దూరం..
పచ్చళ్లు, మైదా ఉత్పత్తులు.. బయట అమ్మేవాటికి దూరంగా ఉండాలి. పంచదార, తేనె, జామ్‌, కేకులు, పేస్ట్రీలు, బిస్కట్లు, పఫ్‌లు తినడం వల్ల బరువు పెరిగిపోతారు. టీ, కాఫీలు అతిగా తీసుకోవడం వల్ల శరీరానికి ఇనుము అందదు.


సంప్రదించాల్సిన వైద్యనిపుణులు .......... డా. జానకీ శ్రీనాథ్ ‌-- ఫోన్‌: 040 66637920

  • ================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, May 22, 2011

నెలల పిల్లలకు ఆహారం ఇలా,Feeding habits for months babies,Weaning for babies



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -నెలల పిల్లలకు ఆహారం ఇలా(Feeding habits for months babies,Weaning for babies)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



మనదేశంలో ఎక్కువశాతం పిల్లలు 6నెలల వరకు తల్లిపాల మీదే ఆధారపడి ఉంటారు. వారి పెరుగుదల కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే 6నెలల తరువాత నుంచి తల్లిపాలు మాత్రమే సరిపోవు వారి పోషణకు. 6నెలల నుంచి వారి పెరుగుదలకు కావలసిన కాలరీలు, ప్రోటీన్ల ఆవశ్యకత పెరుగుతుంది. ఆ అవసరాలను తల్లిపాలు మాత్రమే తీర్చడం కుదరదు. అందుచేత 6 నెలల తరువాత నుంచి పిల్లలకు తల్లిపాలతో పాటు, పోతపాలు లేదా ఇతర ఆహార పదార్థాలను ద్రవరూపంలో గాని, గణరూపంలో అలవాటు చేసే పద్ధతిని వీనింగ్‌ అని అంటారు.

పిల్లలను క్రమంగా తల్లిపాలతో పాటు ఇతర ఆహారానికి అలవాటు చేసే ఆహార పదార్థాలను వీనింగ్‌ ఫుడ్స్‌ అని అంటారు. పాలలో విటమిన్‌ సి చాలా తక్కువగా లభ్యం అవుతుంది. ఈ విటమిన్‌ సిని అందివ్వడానికి పిల్లలకు 6నెలల నుండి పండ్ల రసాలను ఇవ్వాలి. తల్లిగర్భంలో ఉన్నప్పుడు ఏర్పడిన ఐరన్‌ నిల్వలు లివర్‌లో ఉంటాయి. ఇవి పుట్టినప్పటి నుండి 4-6 నెలల వరకు సరిపోతాయి. తరువాత నుండి ఐరన్‌ ఆహారం ద్వారా వారికి లభించాలి.

పాలలో విటమిన్‌ డి కూడా తక్కువగా లభిస్తుంది. పిల్లలు అనుకున్న రీతిలో ఆరోగ్యంగా, పెరగాలి అంటే సప్లిమెంటరీ ఫీడింగ్‌ 6నెలల నుండి ఆరంభించాలి. లేకపోతే పిల్లల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది.

6-12 నెలల పిల్లలు ప్రతిరోజూ తీసుకోవలసిన ఆహారం
పప్పులు-15గ్రాములు, గోధుమలు 30-45గ్రాములు, పాలు 200-500మిల్లీ గ్రాములు(తల్లిపాలు ఇస్తుంటే, 200మిల్లీ లీటర్ల పై పాలు సరిపోతాయి), దుంపలు- 50గ్రాములు, ఆకుకూరలు-50గ్రాములు ఇతర కూర గాయలు 25గ్రాములు, పండ్లు -100గ్రాములు, చక్కెర -25గ్రాములు, వెన్న-10గ్రాములు, 6-12నెలల పిల్లలు 8.6కేజీల వరకు బరువు ఉండాలి. వీనింగ్‌ ఫుడ్స్‌ లేదా సప్లిమెంటరీ ఫుడ్స్‌ 3రకాలుగా చెప్పవచ్చు
లిక్విడ్‌ సప్లిమెంట్స్‌
ఈ ఆహారం 6నెలల నుండి స్టార్ట్‌ చేయాలి. ముఖ్యంగా పాలు 6నెలల నుండి తల్లిపాలు 3-4సార్లు మాత్రమే ఇస్తూ, ఆవుపాలు కాని, గేదెపాలు కాని అలవాటు చేయాలి. ఈ పోతపాలలో పోషకాలు తల్లిపాలతో పోలిస్తే వేరుగా ఉండటం చేత, పిల్లలు అలవాటుపడటానికి పాలలో కాచి చల్లార్చిన నీళ్ళను పంచదార కలిపి తాగించాలి. పాలు, నీళ్ల శాతం 2ః1గా ఉండాలి. చక్కెరల వల్ల కాలరీలు పెరుగుతాయి.

తాజా పండ్ల రసాలు
ఆరంజ్‌, టమాటో, ద్రాక్ష, వంటి పండ్లు మంచి పోషకాలు కలిగి ఉంటాయి. వీటిలో లభ్యమయ్యే పోషకాలు పాలలో దొరకవు. అందుచేత ఈ పండ్ల రసాలను పిల్లలకు కాచి చల్లార్చిన నీళ్లు కలిపి స్టార్ట్‌ చేయొచ్చు. నీరు, జ్యూస్‌ శాతం 1:1గా ఉండాలి. జ్యూస్‌ను వడకట్టి తాగించాలి. క్రమంగా జ్యూస్‌ మోతాదు పెంచుతూ, నీటిశాతం తగ్గించాలి.

కూరగాయలతో తయారుచేసిన సూపులు
పండ్లు దొరకని పక్షంలో ప్రత్యామ్నాయంగా ఆకుకూరల రసాన్ని సూప్‌గా చేసి ఇవ్వాలి. దీనిని వడకట్టి తాగించాలి. తరువాత మెల్లగా వడకట్టకుండా అలవాటు చేయాలి. వీటితో పాటు ఫిష్‌ లివర్‌ ఆయిల్‌ కొన్నిచుక్కలు నుండి అర టేబుల్‌స్పూన్‌ కొన్ని పాలలో కలిపి ఇవ్వటం వల్ల విటమిన్‌ ఎ, విటమిన్‌ డి లభ్యమవుతుంది. పిల్లలకు పట్టేముందు జ్యూస్‌లను బాగా కలపాలి. జ్యూస్‌, సూపులు నుండి మెత్తని ఆహారాన్ని 7లేదా 8వ నెలలో ఆరంభించవచ్చు.

పెరుగుతున్న కాలరీస్‌, ప్రొటీన్ల ఆవశ్యకత వల్ల వాటిని సరైన రీతిలో అందించడానికి, బాగా ఉడికించి, మెత్తగా చేసిన తృణధాన్యాలను పాలు, చక్కెర కలిపి పెట్టాలి. క్యాలరీస్‌ ఎక్కువగా లభ్యమయ్యే మాల్టెడ్‌ వీట్‌, రాగిని ఈ ఆహారంలో చేర్చాలి. మాల్టెడ్‌ తృణధాన్యాలు అంటే వాటిని రాత్రంతా నానబెట్టి, ఒక బట్టలో మూటకట్టి, మొలకలు వచ్చిన తరువాత ఎండలో ఎండబెట్టి, ఎర్రగా వేయించుకోవాలి. తరువాత మొలకలను తీసేసి పౌడర్‌ చేసుకోవాలి. ఎక్కువగా ఆలుగడ్డ, ఆకుకూరలు, కేరట్స్‌ను ఇవ్వవచ్చు. ఈ కూరగాయల వల్ల విటమిన్స్‌, ఖనిజాలు లభ్యమవుతాయి. అలాగే ఈ ఆహారపదార్థాల వల్ల పిల్లలు కలర్‌ఫుడ్‌కి అలవాటు పడతారు.

పండ్లు

అన్ని రకాల పండ్లు ఉడకబెట్టి, వడకట్టి తినిపించాలి. అవసరం అనిపిస్తే కొంచెం షుగర్‌ కలుపుకోవచ్చు. అరటిపండును మాత్రం ఉడికించవలసిన అవసరం లేదు. మెత్తగా చేసి తినిపించవచ్చు

గుడ్డు
ఉడికించిన గుడ్డు పచ్చసొన కొంచెం తినిపించాలి. దానివల్ల ఎలాంటి అలర్జీ ఉండదు. పిల్లలు తినగలుగు తున్నారు అని నిర్ధారించుకున్న తర్వాత క్రమంగా మోతాదు పెంచుతూ మొత్తం పచ్చసొన తినిపించవచ్చు. గుడ్డులోని యోక్‌లో విటమిన్‌, ఐరన్‌, ప్రోటీన్లు ఎక్కువగా లభ్యమవు తాయి. గుడ్డు తెల్లసొన మాత్రం సంవత్సరం తర్వాతనే పెట్టాలి. ఎందుకంటే దీనివల్ల పిల్లలకు అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది.

పప్పుధాన్యాలు
బాగా ఉడికించిన పప్పులు, తృణధాన్యాలతో కలిపి తినిపించవచ్చు. ఉదా: కిచిడి, పొంగలు, పెసరపాయసం వంటివి. వీటిని పలుచగా కానీ లేదా కొద్దిగా సెమీ సాలిడ్‌గా కానీ పెట్టవచ్చు. పప్పుధాన్యాలు ఇచ్చినరోజు గుడ్డు, మాంసం ఇవ్వవలసిన అవసరం లేదు. అవి మరొక రోజు ఇస్తే పిల్లలకు కావలసిన శక్తి లభిస్తుంది. పిల్లలు చేతితో తీసుకొని కొరికి తినే సమయం అంటే 10-12 నెలల సమయంలో ఇలాంటి ఆహారం అందించాలి. బాగా ఉడికించిన తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, కూర గాయలు, మాంసం, పండ్లు (ఉడికించినవి కాని పచ్చివి కాని) పెట్టాలి. ఇడ్లీ, ఇడియాప్పం, ఉప్మా, బ్రెడ్‌, చపాతి, అన్నం, పప్పు వంటివి అలవాటు చేయాలి.

చిన్నగా కట్‌చేసిన పండ్లు, కూరగాయాలలో గింజలు ఉంటే అవి తీసేసినవి ఇవ్వాలి. వీటివ్ల దవడలకు మంచి ఎక్సర్‌సైజ్‌ లభిస్తుంది. ఎందుకంటే పిల్లలు నమిలి తింటారు. కాబట్టి ఎక్కువగా పండ్లు తీసుకోవటం వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. పిల్లల ఆహార విషయంలో ఎక్కువగా శ్రద్ధ చూపించే తల్లి, ఎక్కువగా ఇంట్లో చేసిన వీనింగ్‌ ఫుడ్స్‌నే ఇవ్వాలి. వీటిని తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, పంచదార, బెల్లం, పాలతో ఇంట్లోనే తయారుచేసుకోవాలి. వీటివల్ల కేలరీలు, ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం, ఐరన్‌, ఖనిజాలు తగు మోతాదులో అందించవచ్చు. మంచి పరిశుభ్రమైన ఆహారం కూడా అవుతుంది.

వీటితో ఆకుకూరలను కూడా ఉపయోగించాలి. ఒక్కోసారి ఒకరకమైన ఆహారాన్ని ఇవ్వాలి. ఒక ఆహార పదార్థానికి అలవాటుపడ్డ తర్వాత ఇంకో రకం ఆహారం ఇవ్వాలి. ఏదైనా కొత్త ఆహార పదార్థం అలవాటు చేస్తున్నపుడు ముందుగా ఒక టేబుల్‌ స్పూన్‌ పట్టి ఆగాలి. అది సరిపడితే కంటిన్యూ చేయాలి. లేకపోతే మానేయాలి.ద్రవపదార్థాలు అలవాడు చేసేటప్పుడు అవి చాలా మెత్తగా ఉండేలా చూడాలి. పిల్లలు ఏదైన ఆహారం తినడం ఇష్టపడకపోతే, కొన్నిరోజులు దాన్ని ఆపి మళ్లీ పెట్టాలి.

అప్పుడు కూడా తినకపోతే ఆ ఆహారం పెట్టటం ఆపేయాలి. మొదట శుభ్రపర్చిన పండ్లు, కూరగాయలు ఇవ్వాలి. పిల్లలు బాగా నమిలి ఆహారం తీసుకోగలుగుతుంది అని అనిపించినప్పుడు చిన్న ముక్కలుగా చేసిన తరిగిన పండ్లు, కూరగాయముక్కలు ముఖ్యంగా 8 లేదా 9వనెలలో ఇవ్వచ్చు. కూరగాయలు ముక్కల రూపంలో తినలేక పోతుంటే వాటిని సూప్స్‌లాగా తయారుచేసి పట్టాలి. వేడిగా ఉన్న ఆహారాన్నే పిల్లలకు ఇవ్వాలి. పండ్లరసాలను గ్లాసులతో కాని, కప్పులతో కాని తాగించాలి. బాటిల్‌ వాడడం మంచిది కాదు.

పైన చెప్పిన పద్దతులన్నీ పాటించినట్లైతే ఒకసంవత్సరం వచ్చేసరికి పిల్లలు ఇంట్లో వండే ఆహారానికి అలవాటు పడతారు. అందరూ తినే ఆహారాన్ని చిన్నచిన్న మోతాదులలో పాలలో కలిపి అలవాటు చేయాలి. గొంతులో ఇరుక్కునే అవకాశం ఉన్న పప్పుదినుసులు, ఎండుద్రాక్ష, పచ్చి యాపిల్‌, కూరగాయాలు, పాప్‌కార్న్‌ వంటివి దూరంగా ఉంచాలి. ఎందుకంటే గొంతులో ఇరుక్కుని వీటివల్ల శ్వాస సంబంధమైన ఇబ్బంది వస్తుంది.

ఉద్యోగాలు , వ్యాపారాలు చేసే కుటుంబాలు , ఎప్పుడు తీరికలేని వారికి ... బజారు లో అనేక రెడీమేడ్ వీనింగ్ ఫుడ్స్ దొరుకుతాయి . మంచి బ్రాండ్ ని ఎన్నికొని వాడవచ్చును .
  • ============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, May 5, 2011

cycling as exercise -సైకిల్ తొక్కడము




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -cycling as exercise -సైకిల్ తొక్కడము - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

వ్యాయామం మంచి ఆరోగ్య పరిరక్షణ కోసం చాలా అవసరం. ఇది ఎక్కువగా కండరాలను, రక్త ప్రసరణ వ్యవస్థను ధృఢపరచడానికి, క్రీడలలో మంచి ప్రావీణ్యత సాధించడానికి ఉపయోగిస్తారు. దైనందిక వ్యాయామం వలన అధిక రక్తపోటు, స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం, నిద్రలేమి, మానసిక రోగాల వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా నివారించవచ్చును.

ప్రయాణ సాధనాల్లో అన్నిటికన్నా అద్భుతమైనది బైసికిల్ అంటే అతిశయోక్తి కాదు. అది కేవలం ప్రయాణ సాధనమే కాదు అతి తక్కువ ఖర్చుతో శరీరానికి అవసరమైన వ్యాయామాన్ని అందించే సాధనం కూడా! రక్తపోటు, నరాలు లాగడం, వెన్ను నొప్పి, పాదాలు, మడమల నొప్పి, కీళ్ల నొప్పులు, మెడనొప్పి, మానసిక వ్యాకులత లాంటి లెక్కలేనన్ని శారీరక, మానసిక వ్యాధులను అడ్రసు లేకుండా తరిమి కొట్టి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చే దివ్యౌషధం ఈ వాహనం. ఇది అత్యంత సురక్షితమైనది కూడా.
సురక్షితంగా లేని సైకిల్ తొక్కే పరిస్థితులు :

  • ప్రతికూల వాతావరణం-గాలి ,వాన , దూళి , దుమ్మి .,
  • వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడం-ప్రమాదాలు సంభవించే అవకాశాలు ,
  • ఎత్తుపల్లాలు-,
  • గోతులతో ఉండే రోడ్లు,
  • ఇరుకైన వీధులు,
  • అపాయకారి గల్లీలు,
  • స్టార్‌లయితే జనం పెట్టే ఇబ్బందులు ,
  • ముప్ఫై ఏళ్ల పైబడిన గృహిణులు సైకిల్ తొక్కడాన్ని వంకర దృష్టితో చూసే వాళ్లు ,
  • కారు ఉండే సంపన్నులు సైకిల్ తొక్కాలంటే నామోషీగా ఫీలవడం..................................ఇలాంటి వాటిలో కొన్ని.

హెల్త్ బైసికిల్ :
అయితే సైకిల్ తొక్కడం చక్కటి వ్యాయామమే కాక సర్వరోగ నివారణి కూడా. వ్యాయామం కోసమో, లేదా ఆరోగ్య దృష్టితోనో, బాడీ ఫిట్‌నెస్‌కోసమో సైకిల్‌ను ఉపయోగించే వారు బయట తొక్కే సైకిల్‌నే వాడాల్సిన పని లేదు. ఇలాంటి వారికోసం ఇంట్లోనే కదలకుండా ఉంచి సైకిల్‌లాగా తొక్కే బైసికిల్ వచ్చింది. అదే హెల్త్ బైసికిల్. దీన్ని సులభంగా ఇంటి గదిలోపల ఉంచి ఎలాంటి ఇబ్బందీ లేకుండా తొక్కవచ్చు.ఎలా మొదలెట్టాలి?...ఈ హెల్త్ బైసికిల్‌ను ప్రారంభంలో నెమ్మదిగా తొక్కడం ప్రారంభించి క్రమంగా వేగం పెంచుకోవచ్చు. అయితే దీన్ని ఉపయోగించడానికి ముందు ఎవరైనా వైద్య నిపుణుడి సలహా తీసుకోవడం తప్పనిసరి. వ్యాధులు, వాంతులు, జలుబు, విరేచనాలు, జ్వరం, మూలశంక లాంటి వ్యాధులతో బాధపడే వారు సైక్లింగ్ చేయరాదు. సైకిల్ తొక్కడానికి ముందు తేలికగా టిఫిన్ చేయాలి. డీహైడ్రేషన్ కాకుండా ఉండడానికి కావలినంతగా నీళ్లు తాగవచ్చు. ఫ్యాన్ వేసుకోవచ్చు కానీ ఎసి వద్దు. ఎదురుగా టీవీ ఉంటే బోర్ కొట్టకుండా ఉంటుంది.

సైకిల్ తొక్కడానికి ముందు జాగ్రత్తలు /సూచనలు :

  • ఎలాంటి మానసిక ఒత్తిడి, ఆదుర్దా లేకుండా ప్రశాంతంగా సైకిల్ తొక్కడం ప్రారంభించాలి.
  • ఇరవై నిమిషాల సైక్లింగ్ చాలు. గంటకు 15 కిలోమీటర్ల వేగం ఉంటే సరిపోతుంది.
  • ఒకే సారి సైకిల్ తొక్కడాన్ని నిలిపివేయరాదు. నెమ్మదిగా వేగాన్ని తగ్గిస్తూ రావాలి.
  • లూజ్‌గా ఉండే దుస్తులు వేసుకోవాలి.
  • నాలుగు రోజులు చేసి వదిలిపెట్టి మళ్లీ ప్రారంభించడం లాంటివి చేయకూడదు.
  • క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి.
  • మనసుకు ఆహ్లాదంగా ఉండే మ్యూజిక్ లేదా సినిమా పాటలు లాంటివి వింటూ కూడా సైక్లింగ్ చేయవచ్చు.
  • ఇక సైక్లింగ్ ప్రారంభించడానికి ముందు మీ ఎత్తుకు తగినట్లుగా సీట్‌ను అడ్జెస్ట్ చేసుకోండి.
  • 15 నిమిషాల పాటు ఆపకుండా సైక్లింగ్ చేయాలి. చెమట ఎక్కువగా ఉంటే ఆపి చెమట తుడుచుకుని మళ్లీ ప్రారంభించవచ్చు.
  • హ్యాండిల్ బార్‌పై చెయ్యి ఉంచి వంగరాదు.
  • వీపు, నడుము నిటారుగా ఉంచాలి.
  • ప్రతిసారీ పెడల్ తొక్కేటప్పుడు కాళ్లను నేరుగా చేస్తుండాలి.

ఉపయోగాలు
  • గుండె కొట్టుకోవడాన్ని సక్రమంగా ఉంచడంతో పాటు హృద్రోగాలకు దూరంగా ఉంచుతుంది.
  • రక్తపు పోటు, బిపిలను అదుపులో ఉంచడంలో జాగింగ్‌కన్నా కూడా ఎక్కువ పరిణామకారి. దీనివల్ల కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పడదు.
  • పొట్ట సైజు, కొవ్వును తగ్గించుకోవడానికి, బరువు తగ్గించుకోవడానికి మంచి సాధనం.
  • శరీరం కింది భాగానికి ఎక్కువ వ్యాయామం లభించి కాళ్లు దృఢంగా తయారవుతాయి.
  • ఈ సైక్లింగ్ వల్ల అరగంటలో 330 కేలరీలు ఖర్చవుతాయి. అందువల్ల నడకకన్నా కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది.
  • దీని వల్ల కూర్చోవడం, లేవడం, నడవడం, నిలబడ్డం లాంటి అనేక శారీరక ప్రక్రియలు సులభమవుతాయి.
  • అజీర్ణం లాంటి సమస్యలు దూరమవుతాయి.
  • మనిషిలో నిరాశను తొలగించి నూతన ఉత్సాహాన్ని నింపుతుంది.
  • స్ర్తిలలో బహిష్టుకు ముందు వచ్చే నొప్పి, ఇబ్బందులను దూరం చేస్తుంది.
  • ఉత్తమ ఆరోగ్యం, ఆకర్షణీయమైన శరీరాకృతి ఇచ్చే ఈ హెల్త్ బైసికిల్ 30 ఏళ్లకే లావుగా తయారయి పోతున్న నేటి ఆధునిక మధ్య వయసు మహిళలకు అద్భుత వ్యాయామ సాధనం .
  • వెన్నెముక సక్రమంగా ఉంటుంది.
  • బాడీ షేప్ కూడా ఆకర్షణీయంగా తయారవుతుంది.

నష్టాలు /కష్టాలు :
  • మధుమేహం సమస్య ఉన్న వారికి ఈ సైక్లింగ్ నిషిద్ధం-వీరికి నడక వ్యాయామము మంచిది .
  • ఒకే చోట సైక్లింగ్ చేయడం బోర్ కొట్టవచ్చు.
  • శరీరం పైభాగానికి వ్యాయామం లేక పోవడం వల్ల ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు.
  • హెల్త్ బైసికిల్ ధర ఎక్కువ అయినందున దిగువ, మధ్యతరగతి వారికి భారం కావచ్చు.
  • తెల్లవారుజామునే లేచి వాకింగ్, జాగింగ్ లాంటివి చేయలేని వారు, బిజీ రోడ్లపై న, గతుకుల రోడ్లపైన సైకిల్ తొక్కడం కష్టం.
  • అన్ని వయసుల వారూ సీటుపై కూర్చుని ఎలాంటి కష్టమూ లేకుండా సైక్లింగ్ చేసే వీలుండదు .
  • =============================================
Visit my website - > Dr.Seshagirirao.com/