ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - క్యాన్సర్ అంటు వ్యాధా? వంశపారంపర్యమా?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
మానవులలో క్యాన్సర్ ఒక భయంకరమైన వ్యాధి . క్యాన్సర్ కు కారణము ఖచ్చితముగా ఇది అని తెలియదు . . . కాని ఎన్నో కారణాల కలయిక అని చెప్పుకోవచ్చు . వారి జీన్స్ , వాటికి తోడు పర్యావరణ పరిస్థితులు , ఇంకా స్మోకింగ్ , ఆల్కహాల్ వంటి అలవాట్లు తోడవ్వడము తీవ్యమయిన మానసీక ఒత్తిడికి గురూవుతూ ఉండడము , వయసు పైబడాడము ,శరీరములో సహజమైన హార్మోన్లు దీర్ఘకాలముగా ఉండడము , లేదా దీర్ఘకాలముగా కృత్రిమమైన హార్మోన్లు తీసుకోవడము , పొగాకు , పొగాకు ఉత్పత్తులు , రబ్బరు , ఆస్ బెస్తాస్ వంటి కంపినీ లలో పనిచేయడము , వృత్తిపరం గా లేదా ఇతర కారనాలవలన రేడియేషన్ కు గురికావడము ... అలా ఎన్నో కారణాలలో ఒకటి లేదా రెండు తోడయితే క్యాన్సర్ రావచ్చు . కాని భాధాకరమైన విషయమేమిటంటే ఆరోగ్యము గా ఉంటూ , మంచి జీవన శైలి కలిగి ఉండి , చిన్న వయసూ వారైనా ఎతువంటి రిస్కు ఫ్యాక్టర్ లేకపోయినా ఈ మహమ్మారి బారిన పడవచ్చు . అందుకనే ఈ వ్యాధికి గురైన వారు కాని ... వారి కుటుంబ సబ్యులుఎవ్వరైనా లేక పర్స్థితులనో నిందిస్తూ కుంగిపోవడము కంటే దైర్యము గా అవగాహన పెందుకుని ఎదుర్కోవడము మంచిది. క్యాన్సర్ కి జవాబు కావాలంటే మనము చేయగలిగించల్లా తొలిదశలో కనుక్కోవడమే ... అంటే కణితి 1 సెం.మీ కంటే చిన్నదిగా ఉండి వచ్చిన భాగానికి మాత్రమే పరిమితమై శరీరము లో ఇతర భాగాలకు వ్యాప్తిచెందని దశ అన్న మాట .
క్యాన్సర్ వంశపారంపర్యమా ? ....
కానేకాదని చెప్పలేము .మరి ముఖ్యము గా స్త్రీలలో రక్త సంబంధీకులలో ఇద్దరి ముగ్గురు లో రొమ్ము క్యాన్సర్ బయట పడిందంటే వారి కుటుంబాలలో ఆ జీన్స్ ఉండే ప్రమాదము ఎక్కువ అని గుర్తిందుకోవాలి . ముందే తెలుసుకోవాలంటే BRCA1 ,BRCA2 వంటి జీన్ మ్యుటేషన్ పర్ర్క్షలు చేయిందుకోవాల్సి ఉంటుంది .ఈ పరీ్క్షలు పాజిటివ్ గా వచ్చాయంటే ఆ అమ్మాయిలలో రొమ్ము క్యాన్సర్ కణము ఉన్నట్టు గా పరిగణించాలి .వీరికి చాలా కౌనంసలింగ్ అవసరముంటుంది .క్యాస్్సర్ కి గురికాక ముందే రొమ్ములను మాస్టెక్టమీ చేసి తీసివేసి .. ప్లాస్టిక్ సర్జన్ సహారము తో కుత్రిమ రొమ్ములను యేర్పాటు చేయించుకోవడము ఒక పద్దతి... లేదా వారికి స్వయముగా ఎలా పరీచించుకోవాలో తెలియచేయడము తో పాటు క్రమము తప్పకుండా అల్త్రాసౌండ్ స్కానింగ్ , మామోగ్రఫీ వంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండమని , ఏ మాత్రము కణితి ఉన్నట్లు అనుమానము వచ్చినా బయాప్సి చేయించుకోమని సలహా లివ్వమని చెప్పాలి.
క్యాన్సర్ అంటువ్యాధా? ... ?
కానేకాదు. క్యాన్సర్ అంటువ్యాధి అస్సలు కాదు. ఏ రకమైన క్యాన్సర్ అయినా అంటువ్యాధి కాదు. వారి తుమ్ములు , దగ్గులు ద్వారా లేదా ఆవ్యక్తికి దగ్గరగా ఉండి సేవలు చేయడం ద్వారా ఈ వ్యాధి సోకే అవకాశమే లేదు . అయితే కొన్ని ర్కాల వైరస్ లకు గురి అయితే కొన్ని క్యాన్సర్లు వచ్చే ప్రమాదము ఎక్కువ. ఒకరి నుండి ఒకరికి ఆ వైరస్ లు శారీరక సంబంధాలు అంటే శ్రంగారము ద్వారా లేదా రక్త మార్పిడి ద్వారా సోకుతాయి. HIV , , HPV , , Hepatitis -B , , and Hepatitis-C వలన బిడ్డసంచి ముఖద్వార క్యాన్‌సర్ , లివర్ క్యాన్‌సర్ , వచ్చే అవకాశాలు ఎక్కువే.
- ================================ .
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.