Tuesday, March 2, 2010

సైనసైటిస్ ,Sinusitis




కొంచం దూరం నడిస్తే ఆయాసం రావడం , ముక్కు పట్టేయడం , తరచూ జలుబు , నిద్ర పట్టకపోవడం , తలనొప్పి వంటి లక్షణాలు తో భాదపడుతుంటే అది సైనసైటిస్ కావచ్చును .

కపాలంలో గాలితో నిండిన కేవటీలను సైనస్ అంటారు . సైనస్ మ్యూకస్ మెంబ్రేన్ అనబడే మెత్తటి పొరతో కప్పబడి ఉంటాయి. ఈ మ్యూకస్ మెంబ్ర్రేన్ అనే పలుచటి ద్రవపదార్ధాన్ని తయరుచేస్తుంది .ఇవి ముఖ్యంగా ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరంలోకి ప్రవేశించిన గాలికి సరైన ఉష్టోగ్రత మరియు తేమ కల్పించడానికి తయారు చేయబడ్డాయి. అందువల్ల ఆర్బిట్ మరియు క్రేనియంలోని వివిధ భాగాలు ఉష్టోగ్రతలోని తేడాల వల్ల దెబ్బతినకుండా వాటికి తగిన ఉష్టోగ్రత కల్పించడానికి తోడ్పడతాయి. సైనస్ లు కపాలంలో ఎముకలలో గాలిని ఉంచడంవల్ల వాటి బరువును తగ్గిస్తాయి .ఇవి మాట్లాడేప్పుడు తగిన శబ్ధం రావడానికి కూడా తోడ్పడతాయి .అన్ని రకాల శ్వాసకోశ అంటువ్యాధులు సైనస్ ల పైన ప్రభావం చూపుతాయి. ఒక వేళ సైనస్ లు ఎటువంటి అడ్డులేకుండా ముక్కు రంధ్రాలలోనికి తెరుచుకున్నట్లైతే అంటు త్వరగా తగ్గిపొతుంది. కాని సైనస్ ల నుండి స్రవించు స్రావాలు వాటి మార్గంలో అడ్దువల్ల అంటు (infection) వ్యాప్తి చెందవచ్చు .దీనినే సైనసైటిస్ అంటారు. కొన్ని సార్లు ఈ అంటు చాలా ప్రమాదకరంగా కూడా మారవచ్చు

అక్యూట్ సైనసైటిస్ లక్షణాలు:

    -    సైనస్ లు ఉన్న భాగాల్లో నొప్పి మరియు ఒత్తిడి.
    -    చీముతో కూడిన స్రావాలు ముక్కు నుండి బయటకు వచ్చుట.
    -    ముక్కు దిబ్బడ.


కారణములు

    ముక్కులో వచ్చే ఇన్ ఫెక్షన్స్ : సైనస్ ను కప్పబడిన మ్యూకస్ మెంబ్రేన్ ముక్కులోని మ్యూకస్ మెంబ్రేన్ తో సంబంధం కలిగి ఉంటుంది. అందువలన ఎటువంటి అంటు అయినా ముక్కు నుండి చాల సులభంగా సైనస్లకు చేరుతుంది. ఈ సైనస్లు ముక్కు రంధ్రాల లోకి తెరుచుకొని ఉంటే అంటు త్వరగా తగ్గిపోతుంది . ఒక వేళ వాటిలో ఏదైనా అడ్డు ఉంటే అంటు త్వరగా తగ్గిపోదు. ఇది ముఖ్యంగా వైరస్ వల్ల వస్తుంది.

    ఈతకొట్టడం: ఒక్కొక్క సారి సూక్ష్మజీవులు ఎక్కువగా ఉన్న నీళ్ళలో ఈత కొట్టడం వల్ల ఆ నీళ్ళు సైనస్ లలోకి ప్రవేశించి వ్యాధిని కలుగ చేస్తాయి. స్విమ్మింగ్ పూల్స్ లో క్లోరిన్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఆ  గ్యాస్ ముక్కు రంధ్రాల ద్వారా సైనస్ లలోని చేరి సైనస్ల లోకి మ్యూకస్ మెంబ్రేన్ వాచేటట్లు చేస్తుంది.అది క్రమంగా సైనసైటిస్ ను కలుగచేస్తుంది.

    ట్రోమా:ఒక్కొక్కసారి సైనస్ లను తయారు చేసిన ఎముకలు విరగడం వల్ల వాటికి అంటు చేరి సైనస్ మ్యూకోసాకు అంటును కలుగచేస్తుంది.
    దంతాలలో వచ్చే ఇన్ ఫెక్షన్:మోలార్ మరియు ప్రీ మోలార్ దంతాలలో ఇన్ ఫెక్షన్ కలుగచేయవచ్చు.
    ఇతర కారణాలు:
    1. సైనస్ లో సరైన వెంటిలేషను లేకపోవడం మరియు సైనస్ లలో అడ్డు: సాధారణంగా సైనస్ లలో బాగా వెంటిలేట్ అయి ఉంటాయి సైనస్ ను కప్పి ఉంచిన మ్యూకోసా మ్యూకస్ ద్రవాలను ఉత్పత్తి చేస్తుంది.ఈ ద్రవాలు సీలియరీ మూమెంట్ వల్ల సైనస్ ఆస్టియాను చేరి అక్కడ నుండి ముక్కురంద్రాలలోకి చేరుతాయి. ఒక వేళ ఇలా జరగడానికి సైనస్లలో ఏదైన అడ్డుకుంటే సైనస్ లో తయారయ్యే పదార్ధాలు అక్కడే నిలవ ఉండి సైనస్లో విధులకు ఆటంకం కలిగిస్తాయి.ముఖ్యంగా సైనస్ లో నాసల్ పేకింగ్, స్ఫుటం యొక్క నిర్మాణంలో తేడా రావడం, మేలిగ్నెంట్/నియొప్లాసం వల్ల అడ్డు ఏర్పడుతుంది.

    2. నాసల్ కేవిటిలో ద్రవాలు నిలువ ఉండటం: ఒక్కొక్క సారి ముక్కులోని ద్రవాల చిక్కదనం వల్ల లేదా ఏదైనా అడ్డు ఉండటం వల్ల  నాసోఫారింగ్స్ లోకి వెళ్ళకుండా ఉండి అవి అంటు కలగజేస్తాయి.
    3. పూర్వం వచ్చిన సైనసైటిస్ అటాక్స్:ఎక్కువసార్లు సైనసైటిస్ రావటం వల్ల సైనస్ మ్యూకోసా దెబ్బతిని ఉండటం వల్ల మళ్ళీ సైనసైటిస్ వచ్చేటట్లు చేస్తుంది.
    4. వాతావరణం: వాతావరణం తేమగా మరియు చల్లగా ఉన్నప్పుడు సైనసైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ.
    5. ఇతర అంటువ్యాధులు: పుష్టికరమైన ఆహారం తీసుకోకపోవటం, మీసిల్స్, చికెన్ పాక్స్, కోరింత దగ్గు వంటి అంటువ్యాధులతో బాధపడటం మరియు డయాబెటిస్ వంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నప్పుడు సైనసైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
    6. సూక్ష్మజీవులు: చాలా కేసుల్లో సైనసైటిస్ వైరల్ ఇన్ ఫెక్షన్   లా ప్రారంభమవుతుంది.తరువాత నెమ్మదిగా బాక్టీరియా చేరి సైనసైటిస్ వస్తుంది.ఈ హానికర సూక్ష్మజీవులలో స్ట్రెప్టోకోకస్ న్యూమోనియ,హీమోఫిలస్ ఇంప్లూయంజా,స్టెఫైలోకోకస్ ఆర్.ఇ.యస్ .ముఖ్యమైనవి.
     సైనసైటిస్ వలన సైనస్ లను కప్పి ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ ఇన్ ఫ్ల మేషన్ కు గురవుతుంది.దాని వల్ల అవి ఎక్కువగా ద్రవాలను ఉత్పత్తి చేయడమే కాకుండా పాలీమార్పో న్యూక్లియర్ కణాలను కూడా తయారుచేస్తాయి.సైనస్ ఆస్టియమ్ ఈ విధంగా తయారైన ద్రవాలను బయటకు పంపించగలిగి,శరీరానికి తగిన వ్యాధి నిరోధక శక్తి ఉన్నప్పుడు వ్యాధి త్వరగా తగ్గిపోతుంది.అలాకానప్పుడు అంటు అధికమై మ్యూకోసల్ మెంబ్రేన్ మరియు సైనస్ ఎముకల మీద కూడా ప్రభావం కనబడుతుంది.దంతాలకు అంటు ఉన్నట్లయితే అది చాలా సులభంగా సైనస్లకు వ్యాపించి సైనసైటిస్ లను కల్పించవచ్చు.అందువల్ల దంతాలలోకి అంటును ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవాలి.

వ్యాధి నిర్ధారణ

    వ్యాధి లక్షణాలను పూర్తిగా తెలుసుకొనుట వలన మరియు సైనస్ ఎక్స్-రే ద్వార ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.

చికిత్స

        వైద్యుని సహకారంతో అమాక్సిసిల్లిన్ లేదా ఆంపిసిల్లీన్ మందులు యివ్వవచ్చు.
        పెన్సిలిన్ మందులకు రోగి అలర్జీ కలిగి ఉన్నట్లైతే ట్రైమితోప్రిం లేదా సల్ఫోమితాక్సజోల్  మందులు యివ్వచ్చు.
        ఓరల్ డ్రిక్సోరాల్ మరియు డిమెటాప్ యివ్వవచ్చ.
        సెలైన్ యిరిగేషన్ వలన గట్టిగా ఉన్న స్రావాలు మెత్తబడి  బయటకు స్రవించే అవకాశం ఉంది.
        స్టీమ్ పీల్చుకొనుట ద్వారా మరియు ఎక్కువ ద్రవాలను లేదా పానీయాలను సేవించుట  ద్వారా మరియు లోకల్ హీట్ (వేడి తడి బట్టలను సైనస్ల మీద ఉంచటం)ను కలిగించుట ద్వారా ముక్కు నుండి స్రావాలు బయటకు వచ్చి రోగికి ఉపశమాన్ని కలిగిస్తుంది.
        నేసల్ స్ప్రేలు రోగికి కోంత ఉపశమనాన్ని కలిగిస్తాయి.కాని నేసల్ స్ప్రేలు అవసరం కంటే ఎక్కువ మోతాదులో ఉపయోగించినట్లయితే ముక్కు దిబ్బడ కలిగే ప్రమాదమున్నది కాబట్టి రోగి జాగ్రత్తగా ఉపయోగించవలెను.
        సాధారణంగా సైనసైటిస్ మందుల ద్వారా తగ్గుతుంది. కాని కొన్నిసార్లు మందులకు తగ్గనప్పుడు శస్త్రచికిత్స ద్వారా ఈ వ్యాధిని తగ్గిస్తారు.

నివారణ

    (ఎ)ఎలర్జీ కలిగించే వస్తువులకు దూరంగా ఉంచాలి.

    (బి) తగిన పోషకాహారం తీసుకోవడం,వ్యాయామం చేయటం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవాలి.

    (సి) శ్వాసకోశ అంటువ్యాధులతో బాధపడుతూ ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి.

    (డి) శ్వాసకోశ వెలుపలి భాగాల్లో అంటు 7 - 10 రోజుల కంటే ఎక్కువ కాలము ఉన్నట్లయితే వైద్యుని సలహా పాటించవలెను.

    (ఇ) సైనస్ లలో నొప్పి ఉన్న, ముక్కు నుండి వచ్చు స్రవాల రంగు మారిన లేదా చెడువాసన వస్తున్నా, వెంటనే వైద్యుని సంప్రదించాలి.

    సైనస్ వ్యాధి మరియు టాన్సిలైటిస్ తో బాదపడుతున్నవారికి ఇ.ఎన్.టి (చెవి, ముక్కు,గొంతు) నిపుణుల ఆసుపత్రి హైదరాబాదులో ఉంది.
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, March 1, 2010

సర్వైకల్‌ క్యాన్సర్‌ , Cervical Cancer






ప్రతి ఏడు నిమిషాలకు ఒకరు... ఏటా డెబ్భై ఐదు వేల మంది మహిళలు... మనదేశంలో సర్వైకల్‌ క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మిగిలిన దేశాలతో పోలిస్తే..దీని బారిన పడుతున్న వారిలో భారతీయులే అత్యధికం అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. స్త్రీలను ఇంతలా మరణానికి చేరువ చేసే ఈ క్యాన్సర్‌ కబళించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

  • ఎందుకువస్తుంది..
ఒక్కమాటలో చెప్పాలంటే.. హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ) ఇన్‌ఫెక్షన్‌ ఈ వ్యాధికి అసలు కారణం. ఈ వైరస్‌ దాదాపు వందరకాలున్నా 15-20 రకాలు మాత్రమే క్యాన్సర్‌కు దారితీస్తాయి. వీటిలో ఎక్కువగా 16, 18 రకాల వల్ల 70 శాతం క్యాన్సర్లు, 45, 31, 33, 52, 58, 35, రకాల కారణంగా మిగిలిన 30 శాతం క్యాన్సర్లు వస్తాయి. ఈ హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్‌ ఒకరి నుంచి మరొకరికి నేరుగా.. చర్మం ద్వారా గానీ మ్యూకస్‌ పొరల వల్ల గానీ వ్యాపిస్తుంది.

ఈ హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్‌ లైంగిక సంపర్కంతో వస్తుంది. చాలా అరుదుగా మాత్రమే ఇతరత్రా కారణాల వల్ల వ్యాపించవచ్చు. అయితే 90 శాతం మందికి మాత్రం ఎలాంటి ప్రమాదం ఉండదు. వారిలోని వ్యాధినిరోధక శక్తి సమర్థంగా పనిచేసి ఈ వైరస్‌ను నిర్మూలిస్తుంది. అదీ ఏడాది లోపలే. 5-10 శాతం స్త్రీలల్లో మాత్రం ఈ వైరస్‌ సర్విక్స్‌లోని కణజాలంలో చొచ్చుకుపోయి క్యాన్సర్‌కు దారితీస్తుంది. అదీ మూడేళ్ల వ్యవధిలో. ఈ ఇన్‌ఫెక్షన్‌ 25 ఏళ్లలోపు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అధ్యయనాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 630 మిలియన్ల మంది హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్‌ కలిగి ఉన్నారు. అదీ లైంగిక సంపర్కంలో పాల్గొనడం మొదలుపెట్టాక నాలుగింట మూడొంతుల మంది స్త్రీ పురుషులకు కనీసం ఒకరకం హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది.

హెచ్‌పీవీ కారణంగా క్యాన్సర్‌తోపాటు వచ్చే ఇతర వ్యాధులు
* జననేంద్రియాలపై పులిపిరులు (వార్ట్స్‌), పాపిలోమాలు
* ఇతర క్యాన్సర్లు.. అంటే.. టాన్సిల్స్‌, లారింక్స్‌, మూత్రనాళాల క్యాన్సర్లు..
* అరుదుగా వచ్చే చర్మం, కంటి క్యాన్సర్లు.. ఎక్కువమందితో విశృంఖలమైన లైంగిక సంబంధాలు (హైరిస్క్‌ సెక్సువల్‌ బిహేవియర్‌) కలిగినవారిలో ఇవి రావచ్చు.
* లైంగికంగా సంక్రమించే ఇతర ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు, పొగతాగేవారికి హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ఆస్కారమెక్కువ.
* చిత్రమేంటంటే, ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లను సమర్థంగా నిరోధించే కండోమ్‌ ఈ హెచ్‌పీవీని మాత్రం ఆపలేదు.

  • హెచ్పీవీ వ్యాక్సిన్లు
‌గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని మూడు విడతలుగా ఇవ్వాలి.

12-16 ఏళ్లలోపు అమ్మాయిలకు (సెక్సులో పాల్గొనడం మొదలుపెట్టని) ఇవ్వడం మంచిది. ఈ వ్యాక్సిన్లలో ఒకటి (బైవాలెండ్‌) 10-45 ఏళ్లలోపువారికి, రెండోది (క్వాడ్రివాలెండ్‌) 9-26 సంవత్సరాలలోపు యువతలకూ ఇవ్వొచ్చు. వ్యాక్సిన్‌ తీసుకునేముందు హెచ్‌పీవీ పరీక్ష అవసరంలేదు. లైంగిక జీవితం ఆరంభించిన స్త్రీలకు ఈ వ్యాక్సిన్‌ ఇస్తే ఒకరకం హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్‌ ఇప్పటికే ఉన్నా మిగిలినవి రాకుండా చూడవచ్చు. ఇవి ఇన్‌ఫెక్షన్‌ రాకుండా కాపాడేందుకు ఇచ్చేవి మాత్రమే. అప్పటికే ఉన్న వాటిని నయం చేయడానికి పనికి రావు. వ్యాక్సిన్‌ తీసుకున్నాం కదాని.. పాప్‌ స్మియర్‌ పరీక్షలను నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పటికప్పుడు చేయించుకుంటూనే ఉండాలి.

  • Image courtesy with Vaartha newspaper.

  • మరిన్ని జాగ్రత్తలు...
* వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. నెలసరి సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
* శరీరంలో ఏ చిన్న ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా.. తేలిగ్గా తీసుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* ముప్ఫై ఏళ్లు దాటినప్పటి నుంచీ.. క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోవడం మంచిది.
* వ్యాక్సిన్‌ తీసుకునే విషయంలో సందేహాలుంటే.. నిరభ్యంతరంగా వెల్లడించాలి.

మరికొంత సమాచారము :
సెర్విక్స్‌కి వచ్చే క్యాన్సర్‌నే గర్భాశయపు ముఖద్వార క్యాన్సర్‌ అంటారు. మహిళ ల్లో ప్రధానంగా వచ్చే క్యాన్సర్‌లలో ఇది ఒకటి. 25 నుంచి 65 ఏళ్ల వయసు వరకు ఎప్పుడైనా రావచ్చు. భారత్‌లో 1లక్ష 35 వేల మంది ప్రతి ఏటా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ప్రతి సం వత్సరం 74 వేల మంది చనిపోతున్నారని వైద్యరీత్యా నిర్ధారణ అయింది. సెరె్వైకల్‌ క్యాన్సర్‌ బాగా ముదిరిపోయేంతవరకు ఎలాం టి లక్షణాలు కనబడదు. దీంతో ఎక్కువ మంది ఈ క్యాన్సర్‌ బారి న పడుతున్నారు. ఈ క్యాన్సర్‌ వంశపారంపర్యంగా రాదు. పట్ట ణాల్లోని వారికంటే, గ్రామీణ ప్రాంతంలోని వారికి ఎక్కువగా వస్తుంది. దేశం మొత్తం మీద 2-3 శాతం మందికి సరె్వైకల్‌ క్యాన్సర్‌ బారిన పడుతున్నారు.

కారణాలు: ఈ క్యాన్సర్‌ రావడానికి ప్రత్యేకమైన కారణాలు తెలియవు. కొంతమంది పేద మహిళల్లో శరీరం పట్ల శుభ్రత తక్కువగా ఉంటుంది. అటువంటి వారిలో ఈ క్యాన్సర్‌ రావడా నికి అవకాశాలు ఎక్కువ. ఇంకా... చిన్న మయసులోనే రసజ్వల కావడం, 20 సంవత్సరాల కంటే తక్కువ వయసులో పెళ్లి చేయ డం, లేత వయసులోనే పిల్లలు పుట్టడం.

ఎక్కువ మంది పిల్లలు పుట్టడం, ఎక్కువమందితో సెక్స్‌లో పాల్గొనడం వంటి వాటిని ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. సుఖవ్యాధులు ఉన్నవారిలో అధికంగా వచ్చేందుకు ఆస్కారం ఉంది. హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌(హెచ్‌వీపీ)ద్వారా ఎక్కువమందిలో ఈ క్యాన్సర్‌ వస్తుంది. ఈ వైరస్‌లో ముఖ్యంగా 16,18, 31, 35 రకాలలో ఇది వస్తుం ది. హెర్పిస్‌ టైప్‌ వైరస్‌ వల్ల వచ్చేందుకు కూడా ఆస్కారం ఉంది. డీబీస్‌ వంటి కొన్ని ఔషధాలను గర్భం దాల్చినప్పుడు స్ర్తీలు తీసు కుంటే, వారికి పుట్టబోయే అమ్మాయిలకు ఈ క్యాన్సర్‌ రావచ్చు. పొగతాగే వారిలో వచ్చే అవకాశం ఉంది.

హెచ్‌పీవీ లాంటి వైరస్‌ వల్ల సెర్విక్స్‌లో దీర్ఘకాలంలో మార్పులు వచ్చి క్యాన్సర్‌కు దారితీస్తాయన్న విషయం ఆందోళన కలిగిం చవచ్చు. అయితే సెర్విక్స్‌ క్యాన్సర్‌ ముందుగా వచ్చే ప్రీ- క్యాన్సర్‌ దశ చాలా కాలం (దాదాపు ఎనిమిది నుంచి పదేళ్లు) కొనసాగు తుంది. అంటే అది పూర్తి క్యాన్సర్‌గా రూపొందడానికి సాగే ముం దస్తు దశ ఇంత సుదీర్ఘకాలం కొనసాగుతుంది. కాబట్టి అక్కడ వచ్చే మార్పులను ముందుగానే పసిగడితే అది క్యాన్సర్‌ కాకముందే లేజర్‌, ఎల్‌.ఎల్‌.ఈ.టీ.జడ్‌ వంటి విధానాలతో చికిత్స చేయడం సాధ్యపడుతుంది. తొందరగా తెలుసుకుంటే చికిత్స సులభంగా ఉంటుంది.

వ్యాధి నిర్ధారణ ఎలా చేయాలి?
గర్భాశయపు ముఖద్వార క్యాన్సర్‌ను గుర్తించేందుకు ప్రధానంగా మూడు పరీక్షలున్నాయి.
  • 1. పాప్‌ స్మియర్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ : ఎంతో సులువుగా, తక్కువ ఖర్చుతో చేయగల పరీక్ష ఇది. దీంతో సెర్వి క్స్‌ క్యాన్సర్‌ను ప్రీ క్యాన్సర్‌ దశలోనే గమనించి సమ ర్థంగా చికిత్స చేయడం సాధ్యపడుతుంది. ఇందులో గర్భాశయ ముఖద్వారం వద్ద వైట్‌ డిశ్చార్జ్‌ కణాలను స్లైడ్‌ మీద వేసి హిస్టో పెథాలజీకి పంపిస్తారు. ఈ పరీక్ష చేయించుకున్న వెంటనే ఇంటికి వెళ్లవచ్చు. 20 సంవత్సరాలకు పైబడిన వారు రెండు సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటే మంచిది. కనీసం ఐదు సంవత్సరాలకు చేయించుకోవడం అవసరం.

ఇంట్లోనే హెచ్‌పీవీ పరీక్ష!
  • గర్భాశయ ముఖద్వార (సర్వైకల్‌) క్యాన్సర్‌ను పాప్‌స్మియర్‌ పరీక్ష ద్వారా గుర్తిస్తుండటం తెలిసిందే. అయితే ఈ పరీక్షను ల్యాబ్‌లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఎంతోమంది.. ముఖ్యంగా పేద దేశాల మహళలు ఈ పరీక్షను చేయించుకోవటంపై అంతగా ఆసక్తి చూపటం లేదు. దీంతో చాలామందిలో సర్వైకల్‌ క్యాన్సర్‌ ముదిరిన తర్వాతే బయటపడుతోంది. ఇలాంటి బెడద నుంచి తప్పించుకోవటానికి ఇంట్లోనే ఎవరికివారు యోని స్రావాలను తీసి పరీక్షించుకునే విధానం (వజైనల్‌ హెచ్‌పీవీ టెస్ట్‌).. పాప్‌స్మియర్‌కు ప్రత్యామ్నాయం చూపగలదని పరిశోధకులు భావిస్తున్నారు. హెచ్‌పీవీ పరీక్ష ఫలితాలపై అమెరికాలో ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు. ఇందులో 20 వేల మంది పేద మహిళలు పాల్గొన్నారు. వీరికి పాప్‌స్మియర్‌ పరీక్ష చేయించుకోవటం గానీ వజైనల్‌ హెచ్‌పీవీ పరీక్ష గానీ చేసుకోవాలని సూచించారు. పాప్‌స్మియర్‌ కన్నా హెచ్‌పీవీ పరీక్ష నాలుగు రెట్లు ఎక్కువగా క్యాన్సర్‌ కేసులను గుర్తించింది. అంటే ప్రతి 10వేల మందిలో ఏడుగురికి వ్యాధి ఉన్నట్టు పాప్‌స్మియర్‌ తేల్చగా.. హెచ్‌పీవీ పరీక్ష 30 మందిని గుర్తించింది. ఈ పరీక్షలో ఫాల్స్‌ పాజిటివ్‌ రేటు (వ్యాధి లేకపోయినా ఉన్నట్టు గుర్తించటం) ఎక్కువగా ఉంటోందని ప్రయోగశాలల నిర్వాహకులు చెబుతున్నప్పటికీ.. పేద దేశాల్లో ఇదెంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. తప్పుగా వచ్చిన ఫలితాలు కూడా క్యాన్సర్‌ లక్షణాలకు దగ్గరగానే ఉంటున్నాయని వివరిస్తున్నారు. పాప్‌స్మియర్‌ చేయించుకోవటానికి వెనకాడే ప్రాంతాల్లో ఇంట్లో చేసుకునే హెచ్‌పీవీ పరీక్షతో మంచి ఫలితం ఉంటుందని భావిస్తున్నారు.

2. కాల్పోస్కోపీ : ప్రత్యేక పరికరం ద్వారా సెర్వెక్‌ ప్రాం తాన్ని పరీక్షిస్తారు.వాపు, పుండు, ఒరుపు వంటి వాటిని గమనిస్తారు. అసాధారణంగా ఉన్న ప్రదేశాన్ని పరిశీలి స్తారు. అవసరమైతే ముఖ పరీక్ష చేస్తారు.

3. సెర్వికల్‌ బయాప్సీ : క్యాన్సర్‌ అని అనుమానం వచ్చినప్పుడు సర్విక్స్‌లోని కొంత భాగాన్ని తీసి పరీక్షిస్తా రు. ఈ పరీక్షల ద్వారా ఏ రకం క్యాన్సరో, ఏ దశలో ఉందో గుర్తించవచ్చు.ఈ క్యాన్సర్‌ ముదిరిపోతే రక్తపరీక్ష, హిమోగ్లోబిన్‌ టోటల్‌ కౌంట్‌, బ్లడ్‌ సుగర్‌, బ్లడ్‌ గ్రూప్‌, బ్లడ్‌ యూరి యా, యూరిన్‌ ఎగ్జామినేషన్‌లు చేయించాలి. కొంత మందిలో అవసరమైతే సీటీ, ఎంఆర్‌ఐ స్కాన్‌ చేసి వ్యాధి తీవ్రతను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

లక్షణాలు: ప్రారంభ దశలో ఏ లక్షణాలు ఉండవు. పరీక్షల ద్వారా కనుక్కోవచ్చు.
తొలి దశ క్యాన్సర్‌ : ఈ సమయంలో పాప్‌ స్పియర్‌, కాల్పోస్కోపీ ద్వారా గుర్తించవచ్చు. ఇందులో మెల్ట్‌, మోడరేట్‌, సివియర్‌ అని మూడు రకాలుంటాయి. ఈ దశలో చిన్న పద్ధతుల్లో ఈ వ్యాధిని నయం చేయవచ్చు. క్రయో, లేజర్‌, లూప్‌ ఎక్సేషన్‌, కొనైజేషన్‌ ద్వారా నయం చేయవచ్చు. భవిష్యత్తులో పాప్‌ స్మియర్‌ ద్వారా పరీక్ష చేయించుకుంటూ ఉండాలి.

లక్షణాలు: క్యాన్సర్‌గా మారిన తర్వాత ఈ కింది లక్షణాలుంటాయి.అధిక రక్తస్రావం, నెల మధ్యలో రక్తస్రావం కాకుండా లేదా అప్పుడప్పుడు రక్తస్రావం అవుతుంది. దంపతుల కలయిక తరువాత రక్తస్రావం జరుగుతుంది. నెలలు ఆగిన తరువాత (మెనోపాజ్‌) రక్తస్రావం రావడం. వైట్‌ డిశ్చార్జ్‌ కావడం. రక్తంతో కలిసి వైట్‌ డిశ్చార్జ్‌, వాసనతో కూడిని వైట్‌ డిశ్చార్జి కావచ్చు.

ముదిరిన తరువాత : బరువు తగ్గిపోవడం, ఆకలి మంద గించడం, రక్తహీనత, బలహీనత, తలనొప్పి. కడుపునొప్పి. యూరిన్‌ పోసేటప్పుడు నొప్పి, మోషన్‌కు వెళ్లినప్పుడు నొప్పి వంటి సమస్యలుంటాయి. కొందరిలో కిడ్నీ సమస్యలు రావచ్చు. దీంతో కిడ్నీ పూర్తిగా దెబ్బతిని చనిపోయేందుకు ఆస్కారం ఉంది.

రెండు రకాలుగా: క్యాన్సర్‌లో గ్రోత్‌, అల్సర్‌గా రెండు రకా లుంటాయి. ఇది వైద్యుల పరీక్షలో తెలుస్తుంది.

గ్రోత్‌ : ఈ రకమైన క్యాన్సర్‌లో బ్లీడింగ్‌ ఎక్కువగా ఉంటుంది. రక్తంలో ముక్కలు, ముక్కలుగా వస్తుంటుంది. గర్భాశయం చుట్టు ప్రదేశాల్లోని అవయవాలు, కండరాల కదలిక తగ్గిపోతుం టుంది. అల్సర్‌ రకంగా పుండు మాదిరిగా ఉంటుంది.

నాలుగు దశల్లో ఉంటుంది : మొదటి దశలో క్యాన్సర్‌ గర్భాశయ ముఖద్వారం వద్దే ఉంటుంది. రెండవ దశలో గర్భాశయానికి పాకుతుంది. మూడో దశ గర్భాశయం చుట్టు పక్కల ప్రాం తాలకు చేరుతుంది.

నాల్గో దశలో శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది.

చికిత్స మూడు రకాలు : 1. ఆపరేషన్‌, 2. రేడియో థెరఫీ 3. కీమోథెరపీ 4. కంబైడ్‌గా చేస్తారు.ఈ క్యాన్సర్‌ను మొగ్గ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు.

వ్యాక్సిన్‌: వ్యాక్సిన్‌ ద్వారా ముందుగానే హ్యుమన్‌ పాపిలోమా వైరస్‌ వల్ల వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చు. పది సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. దీనిని మూడు డోస్‌లలో ఇస్తారు. ఒకటో నెల, తరువాత రెండవ నెల, ఆ తరువాత ఆరవ మాసంలో టీకాలు తీసుకోవాలి. చిన్నపిల్లలకు అయితే పాప్‌ స్మియర్‌ పరీక్ష చేయకుండా వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చు. పెద్దవారైతే పాప్‌ స్మియర్‌ పరీక్ష చేసుకుని టీకాలు తీసుకోవడం మంచిది. ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడం చాలా సులభం. కనుక పరీక్షలు చేయించు కుంటూ ఉండాలి. తొలి దశలో గుర్తిస్తే వెంటనే చికిత్స తీసు కుని అందరిలా జీవితాన్ని కొనసాగించవచ్చు.

జాగ్రత్తలు

* పాప్‌ ిస్మియర్‌ పరీక్షలు 2,3 ఏళ్లకు ఒకసారి చేయించుకోవాలి.
* 20 సంవత్సరాలు నిండిన తరువాత పెళ్లి చేసుకోవాలి. ముందుగా పెళ్లి చేసుకున్నా 20 ఏళ్ల వయసు వచ్చిన తరువాతనే పిల్లల్ని కనాలి.
* శరీర పరిశుభ్రతపై దృష్టి సారించాలి
* సుఖ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలి.
* నెలసరి ఆగిన వారిలో బ్లీడింగ్‌ అయితే వెంటనే చెకప్‌ చేసుకోవాలి.
* గర్భ సంచి తొలిగించినప్పుడు ఆ సమ యంలో కొన్ని కారణాల వల్ల ముఖద్వారాన్ని తీయలేక పోవచ్చు. వారిలో కూడా క్యాన్సర్‌ రావచ్చు. అశ్రద్ధ చేయకుండా చెకప్‌ చేయించు కోవాలి.



  • =================================================

Visit my website - > Dr.Seshagirirao.com/

చెవిలో చీము , Ear Pus discharge(Otitis Media)




చిన్న పిల్లలలో చెవిలోంచి చీము కారడం చాలా సాధారణంగా చూసే వ్యాధి లక్షణం. చెవిలో చీమేగా...! చిన్నపిల్లల్లో ఇవన్నీ మామూలే అనుకుంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. ప్రతి చిన్న విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. చెవిలోని కర్ణభేరి పగిలి అక్కడ సూక్ష్మక్రిములు చేరి చీము తయారు చేస్తాయి. ఇది సరిగా చికిత్స చేయకపోతే పూర్తిగా చెముడు, అప్పుడప్పుడు మెదడుకు పాకి మెదడు వాపు వ్యాధి లక్షణాలు కలుగుతాయి.

పిల్లలకు ఏం పనులు చేయాలో, ఏం పనులు చేయకూడదో తెలియదు. ముఖ్యంగా స్నానం చేసినపుడు చెవిలో నీరు పోయినా, లేదా చెవిలో ఏదైనా చీమో, దోమో దూరినా వారికి తెలియదు కాబట్టి చెవిలో నొప్పి అని ఏడుస్తారు తప్పితే కారణాన్ని చెప్పలేరు.

చిన్నపిల్లల్లో చెవి సంబంధ వ్యాధులు ప్రధానంగా మధ్య చెవిలో ఇన్‌ఫెక్షన్స్‌ కారణంగా వస్తాయి. చెవి ఇన్‌ఫెక్షన్లు జలుబు చేయడం వలన, మధ్య చెవిలో నీరు ఉండిపోవడం వల్ల (సరిగ్గా స్నానం చేయన ప్పుడు), చల్లగాలిలో చిన్న పిల్లలను పడుకో బెట్టడం వల్ల వస్తాయి. కొన్నిసార్లు టాన్సిల్స్‌ ఇన్‌ఫెక్షన్‌ వలన, పంటి నొప్పి వలన కూడా చెవిపోటు రావచ్చు.
లక్షణాలు
చెవి నొప్పి రాత్రిపూట ఎక్కువగా వస్తుంది. పాలు తాగలేరు. ఏడుస్తారు. చెవిలోపల ఎర్ర బడి, ముట్టుకుంటే నొప్పిగా ఉంటుంది. చాలా సార్లు నొప్పి ఎక్కడ ఉందో తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు జ్వరం కూడా రావచ్చును. మీజిల్స్‌, డిఫ్తీరియా వ్యాధులతో పాటు చెవి బాధలు రావచ్చును. మెడ దగ్గర సర్వైకల్‌ గ్రంథులు పెద్దవవుతాయి. తలనొప్పి, గొంతు నొప్పి ఉండవచ్చును. అక్యూట్‌ కేసుల్లో తరువాత చెవినుండి చీము కారవచ్చును. సరైన సమయంలో తగిన చికిత్స చేస్తే ఒటైటిస్‌ మీడియాను పూర్తిగా నయం చేయవచ్చును. క్రానిక్‌ కాటరల్‌ ఇన్‌ఫ్లమేషన్‌లో చెవుడు వస్తుంది. నొప్పి ఉండదు. చెవిలో చీము ఉండదు. జలుబు చేసినప్పుడు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చెవిలో వినికిడి తగ్గుతుంది. చెవిలో శబ్దాలు వస్తాయి.
గుటక వేస్తే చెవిలో శబ్దం వస్తుంది. మాట్లాడుతూ ఉంటే ప్రతిధ్వని వినిపిస్తుంది. కొన్నిసార్లు చెవిలోపల దురదగా ఉంటుంది. కొంతమందిలో చెవిలో నీరు ఎండిపోయినట్లు ఉంటుంది. ఇటువంటి కేసులు చికిత్సకు తొందరగా స్పందించవు. కుటుంబంలో పెద్దవారికి ఇటువంటి సమస్య ఉంటే, వారికి కూడా కొంతకాలం తరువాత పూర్తిగా చెవుడు వస్తుంది. ఈ రోగుల చెవులను ద్రవరూపంలోని మందులతో శుభ్రం చేయకూడదు. కొన్నిసార్లు అది ఉపయోగం కంటే నష్టమే ఎక్కువగా కలుగజేస్తుంది.


టాన్సిల్‌ సమస్యకు సరైన చికిత్స చేయించకపోతే, గొంతులోని ఇన్‌ఫెక్షన్లు, చెవిలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. దీనివల్ల చెవిలో నొప్పి, వినిపించకపోవడంతో పాటు కొందరిలో చెవిలో చీము కూడా రావచ్చు. గ్రహణ పెదవి (మొర్రి) వలన తరచూ చెవిలో చీము కారడం ఇన్ఫెక్షన్ వలన జరుగుతూ ఉంటుంది .

చెవిలో చీము కారడం (OtitisMedia) : మూడు రకాలు --
Acute otitis media (AOM),
Otitis media with effusion (OME)
Chronic suppurative otitis media


వ్యాధి లక్షణాలు :
  • ఒక చెవి లేదా రెండు చెవులలోంచి చీము,
  • నీరు, దుర్వాసనతో చీము వస్తుంటాయి.
  • జలుబు చేసినపుడు ఎక్కవగుతుంటుంది.
  • చెవినొప్పి, పోటు, జ్వరం కూడా రావచ్చును.

జాగ్రత్తలు :
  • నీరు చెవిలో పోనివ్వకూడదు.
  • దూదిపెట్టి స్నానం చేయించాలి. ఈదనివ్వకూడదు.
  • చిన్నపుల్లకి దూదిచుట్టి కనిపించినంత మేరకు చీము తుడిచి శుభ్రం చేయాలి.
  • నూనె, పసర్లు పోయనివ్వకూడదు.
  • డాక్టర్ల సలహాపై చెవిలో మందులు వేయాలి.

మూడు సంవత్సరాలలోపు పిల్లలకు రెండు చెవుల్లోనూ చీము కారడంతో మధ్య చెవి, లోపలి చెవి దెబ్బతిని శాశ్వతంగా మాటలు రాని, వినికిడి లేనివారుగా తయారవుతారు. అందుకని చిన్న పిల్లలకు చెవిలో చీము కారుతూ ఉంటే జాగ్రత్తగా ఉండాలి.

ట్రీట్మెంట్ : డాక్టర్ల సలహాపై చెవిలో మందులు వేయాలి

Drep ear drops --- రెండు చుక్కలు ఉదయం , సాయంత్రం వేయాలి .
నొప్పి తగ్గడానికి -- combiflam మాత్రలు ఒక్కొక్కటి ఉదయం , సాయంత్రం తీసుకోవాలి ,
ఇన్ఫెక్షన్ తగ్గడానికి - Oflaxin 200 మగ్ రోజుకి రెండు చొప్పునన 5-7 రోజులు వాడాలి
ఎలర్జీ తగ్గడానికి ... సిట్రజిన్ ట్యాబు రోజుకొకటి వాడాలి .
చిన్నపిల్లలకు పై మందులు సిరప్ రూపం లో దొరుకును .

చెవిపోటు వచ్చినపుడు తమలపాకులను మెత్తగా నూరి శుభ్రమైన తడి వస్త్రంలో ఆ ముద్దను వేయాలి. తర్వాత ఆ గుడ్డను పిండి అలా వచ్చిన రసాన్ని చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది.


  • ======================================

Visit my website - > Dr.Seshagirirao.com/

ముక్కునుండి రక్తం కారుట , Epistaxis




ముక్కునుండి రక్తం కారుట : రెండు రకాలు , 1 ముందునుండి కారుట , 2 వెనకనుండి కారుట .

కారణాలు:-
1. ఏదైనా బలమైనది ముక్కుపైన తగిలినప్పుడు.
2. బలమైన పని చేసినా.
3. రక్తపోటు ఎక్కువ అయినా.
4. ఎత్తైన ప్రదేశములో ఉన్నా.
5. ఎక్కువ వత్తిడి తో ముక్కును చీదినా.

ముక్కునుండి రక్తం కారితే ఏమి చెయ్యాలి?

1) ప్రశాంతంగా కూర్చోవాలి.
2) కొంచెం ముందుకు వంగాలి,కారుతున్న రక్తం గొంతులోనికి పోకుండా చూసుకోవాలి.
3) ఒక సైడు ముక్కునుండి రక్తం వస్తుంటే,ఆ ముక్కు నరానికి పైభాగంలో గట్టిగా వత్తిపట్టుకోవాలి.
4) ఐస్ గాని లేక తడి(చల్లటి) బట్టను ముక్కుపై ఉంచాలి.దీని ద్వారా ముక్కుకు సంబధించిన రక్తనాళాలు సంకోచించటం జరుగుతుంది.
5) రెండు ముక్కు రంధ్రాల నుండి రక్తం వస్తున్నచో ముక్కులు రెండింటినీ గట్టిగా నొక్కి పట్టుకోవాలి,కనీసం 10 నిమిషాల పాటు పట్టుకొని ఉంచాలి.ఇంకనూ రక్తప్రసరణ ఉన్నచో,ఇంకా 10 నిమిషాల పాటు నొక్కి పట్టి ఉంచాలి.
6) ముక్కుకు బలమైన గాయం అయినచో చాలా సున్నితంగా పట్టి ఉంచాలి.
7) రక్తస్రావం ఎక్కువగా గాని లేక మరలా మరలా రక్తం కారుతున్నా వెంటనే డాక్టర్ ని కలవ వలసి ఉంటుంది.


దోహదం చేసే కారణాలు :

ఎలర్జీ ,
ఇన్ఫెక్షన్ (CommonCold),
రక్తపోటు ,

కొన్ని రకాల మందులు వాడడం వల్ల :
  • Aspirin,
  • Fexofenadine/Allegra/Telfast,
  • warfarin,
  • ibuprofen,
  • clopidogrel,
  • isotretinoin,
  • desmopressin,
  • ginseng
  • బాగా సారా త్రాగడము వలన
  • రక్తహీనత ఉన్న కొంతమందిలోను ,
  • కీళ్ళ సంభందిత వ్యాదులతో భాదపడుతున్న వారిలోనూ ,
  • కొన్ని రకాల రక్త కాన్సర్లు లోను ,
  • గుండె జబ్బులున్నవారిలోను (HeartFailure),
  • కొంతమంది గర్భిణీ స్త్రీలలోను ,
  • కొన్ని రక్తనాల వ్యాధులలోను ,
  • విటమిన్ ' సి' , విటమిన్ ' కే ' లోపమున్నవారిలోను , ఈ యవాది కనిపించును ,

ఏవిదం గా ముక్కు నుండి రక్తం కారును :
నాసికా రంద్రం పైబాగం లో చిన్న చిన్న రక్తనాళాలు ఒకేచోట గుమి కుడి ఉంటాయి . ఇలా ఉండటాన్ని " కిసేల్స్ బాచ్ ప్లెక్షెస్ (KiesselbachsPlexus)" ఈ ప్రదేశాన్ని లిటిల్స్ ఏరియా (LittlesArea) అని అంటారు . సాదారనము గా ఈ ప్రదేశం లో చిన్న దెబ్బ తగిలినా , వత్తిడికి లోనైనా రక్తనాళాలు పగిలి రక్తస్రావము జరుగును . ఈ ప్రదేశం ప్రమాదకరమైనది .
చికిత్స :


1) ప్రశాంతంగా కూర్చోవాలి.
2) కొంచెం ముందుకు వంగాలి,కారుతున్న రక్తం గొంతులోనికి పోకుండా చూసుకోవాలి.
3) ఒక సైడు ముక్కునుండి రక్తం వస్తుంటే,ఆ ముక్కు నరానికి పైభాగంలో గట్టిగా వత్తిపట్టుకోవాలి.
4) ఐస్ గాని లేక తడి(చల్లటి) బట్టను ముక్కుపై ఉంచాలి.దీని ద్వారా ముక్కుకు సంబధించిన రక్తనాళాలు సంకోచించటం జరుగుతుంది.
5) రెండు ముక్కు రంధ్రాల నుండి రక్తం వస్తున్నచో ముక్కులు రెండింటినీ గట్టిగా నొక్కి పట్టుకోవాలి,కనీసం 10 నిమిషాల పాటు పట్టుకొని ఉంచాలి.ఇంకనూ రక్తప్రసరణ ఉన్నచో,ఇంకా 10 నిమిషాల పాటు నొక్కి పట్టి ఉంచాలి.
6) ముక్కుకు బలమైన గాయం అయినచో చాలా సున్నితంగా పట్టి ఉంచాలి.
7) రక్తస్రావం ఎక్కువగా గాని లేక మరలా మరలా రక్తం కారుతున్నా వెంటనే డాక్టర్ ని కలవ వలసి ఉంటుంది.


  • ===============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

కండ్లకలక , Conjunctivitis






కండ్లకలక ( Conjunctivitis) ఒక రకమైన కంటికి సంబంధించిన అంటువ్యాధి.

వ్యాధి లక్షణాలు

వ్యాధిగ్రస్తుల కళ్ళు ఎరుపెక్కి, నీరు కారుతూ ఉంటాయి. కంటిరెప్పలు ఉబ్బి ఉండవచ్చును. కళ్ళలొ మంట, నొప్పి, కొద్దిపాటి దురద ఉంటాయి. వెలుతురు చూడటం కష్టం. కళ్ళలో పుసులు పడతాయి. ఈ లక్షణాలు ఒక కంటిలో ప్రారంభమై రెండవ కంటికి వ్యాపించవచ్చును. నిద్ర తరువాత కళ్ళరెప్పలు అంటుకొని తెరవడం కష్టమౌతుంది. ఈ వ్యాధి త్వరగా వ్యాప్తి చెంది ఎపిడెమిక్ రూపం దాలుస్తుంది. పొంగు వ్యాధిలోను, సుఖవ్యాధులతోను బాధపడే గర్భవతులకు పుట్టిన బిడ్డలకు కూడా కండ్లకలక సోకే అవకాశాలున్నాయి.

జాగ్రత్తలు

* కండ్ల నుండి కారే నీటిని, స్రావాన్ని శుభ్రమైన తడిబట్టతో శుభ్రపరచాలి.
* రోగి వాడే బట్టలు, పక్క బట్టలు, తువ్వాళ్ళు మొదలైన వాటికి కళ్ళ రసి అంటి వాటిని ఇతరులు వాడితే వ్యాధి వారికి సోకుతుంది. కనుక రోగి బట్టలను ప్రతిరోజు నీటితో ఉడికించి క్రిమిరహితం చెయ్యాలి.
* రోగి కళ్ళను శుభ్రపరచిన దూది లేక బట్ట ముక్కలను వేరే పోగుచేసి కాల్చివేయడం మంచిది.

కండ్ల కలక ముఖ్యంగా వైరస్ ద్వారా, బాక్టీరియా ద్వారా కళ్ళకి కలిగే ఇన్ ఫెక్షన్. ఇది ఒక అంటువ్యాధి, చేతి రుమాలు, తువ్వాలు ఒకళ్ళు వాడినవి ఇంకొకళ్ళు వాడడం వలన, వ్యాధి సోకిన వారు ఇతరులతో చాలా దగ్గరగా ఉండడం వలన తొందరగా వస్తుంది.

చికిత్స :
వ్యాధి సోకిన వాళ్ళు గోరువెచ్చని నీళ్ళతో తరచూ కళ్ళు కడగాలి. వీలైతే నల్లటి కళ్ళజోడు ధరించాలి. చేతి రుమాలు తుండుగుడ్డ ఇతరులని వాడనీయకూడదు. డాక్టరు సలహాపై కళ్ళలో మందు చుక్కలు వాడాలి.

  • ఒఫ్లక్షాసిన్ కంటి చుక్కల మందును 4 - 5 రోజులు వాడాలి .
  • సిట్రజిన్ (Tab-Cetzine) 10mg రోజుకి ఒకట చొ. దురద తగ్గినా వరకు 4-5 రోజులు వాడాలి .
  • జ్వరము , నొప్పి తగ్గడానికి నిమ్సులిడ్ మాత్రలు (Nimulid) 100 మగ్ రోజుకి రెండు చొప్పున్న 4-5 రోజులు వాడాలి .
  • ఇన్ఫెక్షన్ తగ్గడానికి యాంటి బయోటిక్ మాత్రలు (Megapen) 250/500 మగ్ రోజుకి మూడు సార్లు 4-5 రోలులువాడాలి


  • ===================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

స్త్రీ ఆరోగ్యము , Woman Health





స్త్రీ లేదా మహిళ (Woman) అనగా ఆడ మనిషి. ఈ పదం సాధారణంగా పెద్దవారికి మాత్రమే ఉపయోగిస్తారు. యుక్తవయసు వచ్చేంతవరకు ఆడపిల్లలను బాలికలు అనడం సాంప్రదాయం. మహిళా హక్కులు (Woman Rights) మొదలైన కొన్ని సందర్భాలలో దీనిని వయస్సుతో సంబంధం లేకుండా వాడతారు.

pUrti vivaraalakosam -> స్త్రీ ఆరోగ్యము

  • ===========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

తలనొప్పి , Headach






ప్రస్తుత తరుణంలో క్షణం తీరిక లేక యంత్రాలతో పరుగెడుతూ, నిద్రాహారాలు లేక, తీవ్ర మానసిక ఒత్తిడికి గురై వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి ఒత్తిడి వల్ల వచ్చే వ్యాధుల్లో ముఖ్యమైనది తలనొప్పి. తలనొప్పితో బాధపడేవారిలో అధికం స్త్రీలే. దీనికి కారణం - అంతర్గత మానసిక ఒత్తిడితోపాటు అధిక పనిభారం. తలనొప్పి వల్ల ఏ పని సరిగ్గా చేయలేక, ఎవరికి చెప్పుకోలేక అంతర్గతంగా మథనపడి, మానసిక వ్యాధులకు గురి అవుతున్నారు.

దాదాపుగా ప్రతిఒక్కరూ తలనొప్పి తో ఏదో ఒక సందర్భంలో బాధపడతారు, కానీ కొన్ని చాలా అసౌకర్యం కలిగిస్తాయి. అయితే ఇవి ఎక్కువ తాత్కాలి కమైన ఇబ్బందులే. సాధారణంగా తలనొప్పులు తాత్కాలికం, అవి వాటంతటవే పోతుంటాయి. అయితే, నొప్పి ఇబ్బంది కలిగిస్తూ ఉంటే మాత్రం వైద్యుడిని సంప్రదించటానికి సిగ్గు పడకూడదు. వైద్యుడు తలనొప్పి తీవ్రంగా ఉన్నా, మరల -మరల వస్తున్నా లేదా జ్వరంతో పాటువస్తున్నదేమో పరీక్షించాలి.

మనిషికి ... మరే ఇతర సమస్యా . . తలనొప్పంత ఇబ్బందికరం కాదంటే అతిశయోక్తి కాదేమో. అత్యధికంగా వైద్యుడిని సంప్రదించేందుకు కారణమయ్యే సమస్యలను ఒక పట్టికగా తయారు చేస్తే అందులో తలనొప్పిదే అగ్రస్థానం. తలనొప్పి కారణంగా వైద్యుడిని సంప్రదించే రోగులు మొత్తం రోగుల్లో 40 శాతం ఉంటారని అంచనా. ఒక సంవత్సరంలో సుమారు 90 శాతం మంది పురుషులు, 95 శాతం మంది స్త్రీలు తలనొప్పికి గురవుతారు. 99 శాతం మంది వ్యక్తులు జీవితకాలంలో కనీసం ఒకసారైనా తలనొప్పికి గురవుతారు.

తలనొప్పి కలవారిలో అధిక శాతం 'స్వయం చికిత్స చేసుకుంటూ ఉంటారు. అయితే మనం వాడే వాడే నొప్పి మాత్రలు (నాన్‌ స్టీరాయిడల్‌ యాంటి ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌ -NSAIDS ఔషధాలు. ఉదాహరణకు - ఇండోమెథాసిన్‌, అసిటామిన్‌ , డైక్లోఫెనాక్ , అసిక్లొఫెనాక్ , మొదలైనవి) కూడా తలనొప్పిని కలుగజేస్తాయి.

తలనొప్పి గురించిన కొన్ని అపోహలు ఈ కింది విధంగా ఉన్నాయి.
1) అన్ని తీవ్రమైన తలనొప్పులకూ మెదడులో కంతులు కారణమా?.కాదు .
2) సైనస్‌ లేదా కంటి సమస్య తరచుగా కలిగే తలనొప్పికి ముఖ్యమైన కారణం. అవును .

లక్షణాలు
తలనొప్పి ఉన్నప్పుడు చిరాకు, కోపం ఎక్కువగా ఉంటాయి. తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు శబ్దాలు భరించలేకపోవడం, వెలుతురును చూడలేకపోవడం, చూపు మసకబారి వాంతి వచ్చినట్లు ఉండటం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.
తలనొప్పి తలలో ఏదో ఒక వైపునే అధికంగా ఉంటే పార్శ్వ నొప్పి (మైగ్రేన్‌)గా భావించాలి.
పార్శ్వనొప్పి క్రమంగా పెరిగి క్రమంగా తగ్గుతుంది. నొప్పి భరించలేకుండా ఉండి, తల దిమ్ముగా ఉంటుంది.

ప్రతి తలనొప్పికీ వైద్యమక్కరలేదు. కొన్ని తలనొప్పులు భోజనం సరియైన సమయంలో తీసుకోక పోవడంలో వల్లా లేదా కండరాల ఉద్రిక్తతవల్ల కలుగుతాయి, వాటికి తగుజాగ్రత్తలు ఇంటిదగ్గర తీసుకుంటే సరిపోతుంది. మరికొన్ని తలనొప్పులు ఏదో తీవ్రమైన స్ధితికి సంకేతాలు మరియు వాటికి తక్షణం వైద్యసాయం అవసరమవుతుంది.

మీరు ఈ క్రింది తలనొప్పి లక్షణాలను కనుక అనుభవిస్తుంటే మీకు అత్యవసరంగా వైద్య సహాయం అవసరం:

* తీవ్రమైన, ఆకస్మికంగా తలనొప్పి వేగంగా, చెప్పలేని విధంగా వచ్చి "ఇది నా జీవితము లో దారుణమైన తలనొప్పి" అనిపించేది
* స్పృహతప్పటం, గందరగోళం, కంటి చూపులో మార్పులు లేదా యితర శారీరక బలహీనతలతో కూడిన తలనొప్పి
* మెడ బిగుసుకుపోవటం మరియు జ్వరంతో కూడిన తలనొప్పి

మీరు ఈ క్రిందితలనొప్పి లక్షణాలను కనుక అనుభవిస్తుంటే మీరు వైద్య సహాయం అవసరం:

* నిద్ర నుంచి మిమ్మల్ని మేలు కొలిపే తలనొప్పి
* తలనొప్పి స్వభావములో గానీ లేదా తరచూ ఎందుకొస్తుందో వివరించలేని మార్పులు
* మీ తల నొప్పి స్వభావం గురించి మీకు స్పష్టత లేనట్లైతే వైద్యుడిని సంప్రదించటం ఉత్తమం.

  • ఆందోళన తలనొప్పి , 
  • క్లస్టర్ తలనెప్పి, 
  • పార్శ్వశూల ,
అనేవి తలనెప్పులలోని రకాలు. తల పగిలిపోయేంత, పార్శ్వశూల అనేవి రక్తనాళాలకు సంబంధించిన తలనొప్పులు. ఈ రక్తనాళాలకు సంబంధించిన తలనొప్పులలో భౌతిక శ్రమ . . తలనొప్పి బాధను అధికం చేస్తుంది. తలచుట్టూ ఉండే కణజాలములోని రక్తనాళాలు ఉబ్బుతాయి లేదా వాస్తాయి, దానివల్ల తల నెప్పితో బాధపడతాము. తల పగిలిపోయేంత (క్లస్టర్) తలనెప్పి పార్శ్వశూల తలనెప్పి కన్నా తక్కువగానే వస్తుంది, ఇది రక్తనాళాలకు సంబంధించిన తలనొప్పులలో సాధారణమైనది.
క్లస్టర్ తలనెప్పి వరుసగా అతివేగంగా వస్తుంది-వారాలు లేదా నెలలపాటు ఉంటుంది. క్లస్టర్ తలనెప్పి ఎక్కువగా మగవారికి వస్తుంది మరియు భరించరానంత బాధాకరమైనది.

కారణాలు
- అధిక మానసిక ఒత్తిడి వల్ల మెదడులో కొన్ని రసాయనిక మార్పులు జరిగి తలనొప్పి వస్తుంది.
- మెదడు కణాల్లో కంతులు ఏర్పడటం వల్ల కూడా తలనొప్పి వస్తుంది.
- తలకు బలమైన దెబ్బ తగలడం వల్ల కాని, కొన్ని సందర్భాల్లో మెదడులో వచ్చే ఇన్‌ఫెక్షన్ల వల్ల కాని తలనొప్పి వస్తుంది.
- కంటికి సంబంధించిన వ్యాధులను నిర్లక్ష్యం చేయడం వల్ల తలనొప్పికి గురి కావడం జరుగుతుంది.
- రక్తపోటు అధికంయ్యేతపుడు (BP) ముందుగా కొందరికి తలనొప్పి ఉంటుంది .

జాగ్రత్తలు
మొదటగా మానసిక ఒత్తిడి నివారణకు ప్రతిరోజు యోగా, ప్రాణాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించి తలనొప్పి తీవ్రత తగ్గుతుంది.
తలనొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు శబ్దాలు లేని గదిలో, చీకటి గదిలో విశ్రాంతి తీసుకోవడం వల్ల నొప్పినుండి ఉపశమనం లభిస్తుంది.
పౌష్టికాహారం తీసుకోవాలి. ఫాస్ట్‌ఫుడ్స్‌, ఆయిల్‌ ఫుడ్స్‌కు స్వస్తి చెప్పాలి.
ఆకు కూరలు, కాయగూరలు, తాజా పండ్లు తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
నీరు అధికంగా తీసుకోవాలి. వేళకు నిద్ర, ఆహారంపట్ల శ్రద్ధ చూపాలి.
సాయంత్రం ఆలస్యంగా తినడం, టి.వి. చూస్తూ ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించడం మానుకోవాలి.
ప్రతిరోజు 45 నిముషాలు ఉదయం నడవటం, లేదా ఇతర వ్యాయామాలు ఏమైన చేయడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరిగి తలనొప్పి తగ్గుతుంది.


వ్యాధి నిర్ధారణ

అధికభాగం తలనెప్పులు తీవ్రస్థితిలో కలిగేవి కావు మరియు దుకాణాలలో దొరికే మందులతో చికిత్స చెయ్యవచ్చు. పార్శ్వశూల తలనెప్పి మరియు యితర తీవ్రమైన తల నెప్పులకు వైద్య పర్యవేక్షణ మరియు ఔషధచీటి అవసరమవ్వవచ్చు.


ఆందోళనవల్ల కలిగే తలనెప్పి(Tension headach):

* ఆందోళన వల్ల లేదా కండరం ముడుచుకోవటం వల్ల కలిగే తలనెప్పి అన్నది అత్యంత సాధారణమైన తలనెప్పి, మరియు అవి వత్తిడి పెరిగే దశలతో తరచూ ముడిపడి ఉంటాయి.
* ఆందోళన వల్ల కలిగే తలనెప్పి అన్నది స్థిరంగా మరియు మందంగా ఉండిమరియు నుదురు, కణతలు మరియు మెడవెనుక భాగం లో లోనవుతాము.
* ఆందోళన వల్ల కలిగే తలనెప్పి అన్నదాన్ని తలచుట్టూ గట్టిగా కట్టివేసినట్లుంటుందని ప్రజలు తరచూ వర్ణిస్తారు.
* ఆందోళన వల్ల కలిగే తలనెప్పి దీర్ఘకాలం ఉండవచ్చు కానీ వత్తిడి తగ్గగానే సాధారణముగా మాయమవుతాయి.
* ఆందోళన వల్ల కలిగే తలనెప్పి కి మరేయితరలక్షణాలతో సంబంధం లేదు మరియు పార్శ్వశూలతలనెప్పిలాగా తలనెప్పికి ముందు వ్యాధిలక్షణాలు ఏవీ కనిపించవు. అన్నిరకాల తలనెప్పులలో ఆందోళన వల్ల కలిగే తలనొప్పులు 90శాతము.



సరణి(సైనస్)తలనొప్పులు

సరణి(సైనస్)తలనొప్పులకు సరణి సంక్రమణం(అంటువ్యాధి) లేదా సహించకపోవటం(ఎలర్జీ) వల్ల కలుగుతాయి. జలుబు లేదా ఫ్లూ జ్వరము తరువాత ముక్కు ఎముకలకు ఎగువన, దిగువున ఉండే గాలి కుహరాలు సరణి మార్గాలు మంటకుగురికావడం, సరణితలనెప్పు కలుగుతుంది.ఈ సరణి చిక్కబడటం లేదా క్రిమిపూరితం అయినా తలకు నెప్పి కలిగించేకారణమవుతుంది. ఈ నెప్పి తీవ్రంగా,కొనసాగుతూ ఉంటుంది,ఉదయాన్నే మొదలవుతుంది మరియు ముందుకు వంగితే మరింతదారుణంగా మారుతుంది.

సరణి(సైనస్)తలనొప్పుల సాధారణ లక్షణాలు:

* చెక్కిళ్ళమీదుగా మరియు నుదుటిపై,కళ్ళచుట్టూ నెప్పి మరియు వత్తిడి,
* పైపళ్ళు నెప్పిగా ఉన్న భావన,
* జ్వరము మరియు వణుకు,
* ముఖం వాయటం,

సరణి(సైనస్)తలనొప్పులలో వచ్చే ముఖం నెప్పులకు వేడిద్వారా మరియు  మంచుద్వారాఉపశమనం కలిగిస్తారు.

మైగ్రేన్

తరచూ వచ్చే ఒక రకమైన తలనొప్పిని మైగ్రేన్ అని అంటారు. పార్శ్వ తల నొప్పి(మైగ్రేన్)ఇతర తలనొప్పులకు భిన్నంగా వుంటుంది. మైగ్రేన్ లక్షణాలు మనిషికి మనిషికి  వేరు వేరు విధాలుగా ఉంటాయి. ఇది నరాల వ్యవస్దకు సంబంధించిన సాధారణమైన జబ్బు.

లక్షణాలు
మైగ్రేన్ లక్షణాలు సాధారణంగా ఉదయం నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు వస్తుంటాయి. తేలిక పాటి తల నొప్పి తో ప్రారంభమై తీవ్రమైన తలనొప్పి వస్తుంది. కొందరిలో వాంతి వస్తున్నట్లుగాను మరికొందరిలో వాంతులతో కూడిన తలనొప్పి వుంటుంది. అధిక వెలుతురును  శబ్దాలను భరించలేరు. కళ్ళముందు వెలుతురు చుక్కలాగా కనిపించవచ్చు.

* ఈ లక్షణాలు మొదలైన కొన్ని నిముషాలకు ముఖములో ఒక భాగములో కాని, ఒక చేయి కాని , ఒక కాలు కాని తిమ్మిర పట్టడము. సూదులతో గుచ్చినట్లు అనుభూతి కల్గడం జరుగుతుంది.
* కళ్ళు తిరగడం , బలహీనత, మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడడం జరగవచ్చు. ఈ లక్షణాలు తీవ్రమైన లేక తగ్గుదల కనిపించిన తరువాత విపరీతమైన తలనొప్పి సుత్తి తో బాదినట్లు వస్తుంది.
  • ఆకలి మందగిస్తుంది.
  • ఈ లక్షణాలు సాధారణంగా 6 గం నుండి 8 గం వరకు వుంటుంది.
  • స్త్రీలకు బహిస్టు సమయంలో మైగ్రేన్ తల నొప్పి వస్తుంటాయి.

కారణాలు

* మానసిక వత్తిడి – తలనొప్పి,
* అధిక శ్రమ,
* ప్రకాశవంతమైన వెలుతురు కళ్ళ మీద పడినప్పుడు,
* రుతు క్రమములో తేడాలు.
* కొందరిలో గర్బనిరోధక మాత్రలు మైగ్రేన్ ను ప్రేరేపించే అవకాశం ఉంది.
* మత్తుపానీయాలు – పొగత్రాగుట,

 మైగ్రేన్ లక్షణాలు తలకు ఒక వైపు వెళ్ళే నరాలు అకస్మాతుగా కుచించుకు పోవడం వలన ప్రారంభమవుతుంది. ఇవే నరాలు ఒక్కసారిగా వ్యాకోచించడం వలన అక్కడికి అధిక రక్తం ప్రవహించుట వల్ల ... తలనొప్పి వస్తుంది.

మెదడుకు నొప్పి తెలియదు
శరీరంలో ఏ భాగానికి నొప్పి కలిగినా ఆ సంకేతాలు మెదడుకే చేరుతున్నా, నిజానికి మెదడుకు నొప్పి అంటే ఏమిటో తెలియదు. మెదడు (బ్రెయిన్‌ పారంకైమా) నొప్పిని గ్రహించలేదు. అయితే మెదడుపై ఉన్న రక్షణ కవచాలు (డ్యూరా), 5, 7, 9, 10 క్రేనియల్‌ నరాలు, రక్తనాళాలు, తల చర్మం, మెడ కండరాలు, సైనస్‌లలోని మ్యూకోసా, దంతాలు మొదలైనవి నొప్పిని గ్రహించ గలవు.

మైగ్రేన్‌ రకాలు :
మొత్తం జనాభాలో 10 శాతం మంది మైగ్రేన్‌ సమస్యతో బాధపడుతున్నారు. మళ్లీ మళ్లీ కలిగే తీవ్రమైన తలనొప్పులకు మైగ్రేన్‌ సమస్య ఒక ప్రధాన కారణం. మైగ్రేన్‌ను రెండు ముఖ్యమైన రకాలుగా విభజించవచ్చు. అవి - క్లాసికల్‌ మైగ్రేన్‌, కామన్‌ మైగ్రేన్‌.

క్లాసికల్‌ మైగ్రేన్‌ : ఈ రకం ఏ వయస్సులోని వారికైనా కలుగవచ్చు. స్త్రీ, పురుషులకు సమానంగా కలుగుతుంది. తలనొప్పి ఒక పక్క చెవిపైన మొదలై మొత్తం సగభాగానికి పాకుతుంది. ఒకసారి కుడివైపు కలిగితే మరొకసారి ఎడమపక్క కలుగవచ్చు. ఈ తలనొప్పిని 'థ్రాబింగ్‌, పల్సేటివ్‌, పౌండింగ్‌ తలనొప్పిగా వర్ణిస్తారు.ఎక్కువగా పల్సేటివ్‌ తలనొప్పి కనిపిస్తుంటుంది. మద్యం, ఒత్తిడి, వాతావరణంలో మార్పులు తలనొప్పికి కారణం అవుతాయి. విశ్రాంతి, నిద్ర, చీకటి గదిలో పడుకోవడం వల్ల నొప్పికి ఉపశమనం కలుగుతుంది. సుమారు 20 శాతం మందిలో ఆరా(Aura) కనిపిస్తుంది. కంటి ముందు మెరుపులు, కొంతభాగంలో చూపు కోల్పోవడం, అడ్డదిడ్డంగా మెరిసే రంగురంగుల కాంతులు కనిపించడం, చేతులు, కాళ్లు, ముఖం, నాలుక, పెదవులు మొదలైనవాటికి తిమ్మిర్లు పట్టడం వంటివి సంభవించవచ్చు.

కామన్‌ మైగ్రేన్‌ : సాధారంగా కనిపించే మైగ్రేన్‌ రకం ఇది. మధ్యవయస్కుల్లో, స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. ఫ్రాంటల్‌, టెంపొరల్‌, ఆక్సిపిటల్‌, ఆర్బిటాల్‌ భాగాల్లో ఎక్కడైనా ఈ తలనొప్పి కలుగవచ్చు. తరచూ రెండువైపులా ఈ రకమైన తలనొప్పి కలుగుతుంది. నొప్పి మంద్రంగా, కళ్లలో సూదులతో గుచ్చుతున్నట్లు నొప్పి ఉంటుంది. ఎక్కువగా కంటి వెనుక భాగంలో ఈ నొప్పి ఉంటుంది.

మైగ్రేన్‌ ట్రిగ్గర్స్‌ : కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మైగ్రేన్‌ కలిగే అవకాశం అధికంగా ఉంటుంది. మైగ్రేన్‌తో బాధపడుతున్న 85 శాతం మందిలో ఈ ట్రిగ్గర్స్‌ కారణంగా మైగ్రేన్‌ కలగడం చూస్తుంటాం. అధిక ఒత్తిడి (49శాతం), మద్యం, బహిష్టు కావడం, ఒకపూట తినకపోవడం ప్రకాశవంతమైన కాంతి, పెద్ద చప్పుళ్లు, ఎత్తైన ప్రదేశాలు, బలమైన వాసనలు, తేమ అధికంగా ఉండే వాతా వరణం, నిద్రలేమి, కొన్ని రకాల మందులు, తలకు స్వల్పంగా గాయం కావడం, చాలా అరుదుగా కొన్ని రకాల ఆహార పదార్థాలు (వాటికి ఎలర్జీ ఉన్నప్పుడు) అవి ట్రిగ్గర్స్‌గా పని చేసి మైగ్రేన్‌ వస్తుంది. పెద్దల్లో మైగ్రేన్‌ తలనొప్పి 4 నుంచి 72 గంటల పాటు ఉంటుంది. పిల్లల్లో 2 గంటలకంటే తక్కువ సమయం ఉండవచ్చు.

60 శాతం తలలో ఒకపక్క, 40 శాతం తలలో రెండుపక్కలా తలనొప్పి కలుగు తుంది. చిన్నపిల్లల్లో 60 శాతం మేరకు తలలో రెండుపక్కలా తలనొప్పి కలుగుతుంది. వికారం, వాంతులు, భావోద్వేగాల్లో మార్పులు కలుగవచ్చు. విశ్రాంతి, చీకటి గదిలో పడుకోవడం, మందులు వాడటం మొదలైన వాటి వల్ల ఉపశమనం కలుగుతుంది. బహిష్టు సమయంలో మైగ్రేన్‌ కలగడం, పెరగడం సంభవించవచ్చు. బహిష్టులు ఆగిపోయే దశలో కొందరిలో మెరుగుపడటం జరుగు తుంది. మరికొందరిలో తల నొప్పి కలుగుతుంది. గర్భ ధారణ సమయంలో సుమారు 60 శాతం మందిలో తల నొప్పి తగ్గుతుంది. 20 శాతం మందిలో ఎక్కువ అవుతుంది. మరొక 20 శాతం మందిలో మార్పు ఉండదు. ప్రసవం తరువాత కొందరిలో తీవ్రమైన తలనొప్పి కలుగుతుంది.

క్లస్టర్‌ హెడేక్‌
ఇది 30 - 50 సంవత్సరాల వయస్కుల్లో, ముఖ్యంగా పురుషుల్లో అధికంగా కనిపిస్తుంది. తలనొప్పి 30 నిముషాలనుంచి రెండు గంటలపాటు ఉంటుంది. రాత్రిపూట అధికంగా ఉంటుంది. కంటి లోపలా, కంటి చుట్టూ తీవ్రమైన నొప్పి ఉంటుంది. కన్ను ఎరుపుగా మారి నీరు కారుతుంది. ముక్కు కూడా మూసుకుపోయి నీరు కారుతుంది. మద్యం తీసుకునే వారిలో ఈ సమస్య కలిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ తలనొప్పి వరుసగా 6 నుంచి 12 వారాలు కలుగుతుంది. ప్రతియేటా ఒకే సమయంలో వస్తుంది. కనురెప్ప తెరవడం కష్టమవుతుంది.

టెన్షన్‌ హెడేక్‌
స్త్రీ, పురుషులిద్దరికీ ఏ వయస్సులోని వారికైనా కలుగవచ్చు. తలచుట్టూ లేదా తలపైన వెర్టెక్స్‌ భాగంలో నొక్కుతున్నట్లు నొప్పి ఉంటుంది. తలచుట్టూ ఏదో గట్టిగా కట్టిన భావన కలుగుతుంది. ఒత్తిడి సమయంలో తలనొప్పి ఎక్కువ అవుతుంది. సాయంత్రం, లేదా రాత్రి సమయంలో అధికమవుతుంది. తలలో కంతులున్నాయేమోననే భయం నొప్పిని అధికం చేస్తుంది. ఇతర ఆందోళనా లక్షణాలు కనిపిస్తాయి. తల, మెడ భాగంలో ఉన్న కండరాలు బిగుసుకుపోవడం (స్పాజమ్‌) ఈ నొప్పికి కారణమని భావిస్తారు.

సైకోటిక్‌ హెడేక్‌
మధ్య వయస్కుల్లో, స్త్రీ, పురుషులకు సమానంగా కలుగుతుంది. నొప్పి ఒక స్థలంలో ఉందని చెబుతారు. ఏదో నొక్కుతున్న, లేదా బరువు పెట్టిన భావన ఉంటుంది. అన్ని సమయాల్లోనూ తలనొప్పి ఉంటుంది. ఏ పనీ చేయనివ్వదు. నొప్పి తగ్గడమంటూ ఉండదని బాధితులు చెబుతారు. నిద్రలేమి, తరచుగా ఏడవడం, బరువు తగ్గడం, ఏకాగ్రత కుదరకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. వాస్తవానికి వీరికి సైకోసిస్‌ ఉండదు.

రోగి తన నొప్పిని ఒక వేలితో చూపిస్తాడు. తలలో గడ్డ తగులుతున్నదని, క్రిములు తిరుగుతున్నాయని చెబుతారు. వీరికి అక్కడ ఏమీ లేదని చెప్పినా ధైర్యం కలగదు. వీరు తమకు స్కానింగ్‌ వంటి పరీక్షలు చేయాలని వైద్యులపై ఒత్తిడి తెస్తారు. పరీక్షల్లో ఏమీ తేలకున్నా వీరికి నమ్మకం ఉండదు.

క్రేనియల్‌ ఆర్టిరైటిస్‌
అరవై సంవత్సరాల వయస్సు పైబడిన వారిలో తలనొప్పి కలిగినప్పుడు ముందుగా ఈ స్థితి గురించి పరీక్షించాలి. టెంపొరల్‌ లేదా ఇతర క్రేనియల్‌ ఆర్టరీస్‌ ఉన్న భాగంలో వాపు, ఎరుపుదనం, తాకితే నొప్పి ఉంటాయి. తల మొత్తం నొప్పిగా ఉండవచ్చు. ఇ.ఎస్‌.ఆర్‌., సి.ఆర్‌.పి. (సి-రియాక్టివ్‌ ప్రోటీన్‌) అధికంగా ఉంటాయి. ఈ పరీక్షల్లో వీటి పరిమాణం పెరిగినట్లు ఉంటే వెంటనే స్టీరాయిడ్స్‌ ఆరంభించాలి. లేనిపక్షంలో ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో 50 శాతం మందికి చూపు పోయే అవకాశాలుంటాయి.

నివారణ

* ఉద్వేగము కలిగించే జీవనశైలి నుండి స్వల్ప మార్పుల తో సాధారణ జీవిత విధానాన్ని అలవరచుకోవాలి
* ఇంటిలో వున్నప్పుడు చీకటి రూములో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి.
* ద్రవ పదార్దాలు నీళ్ళు ఎక్కువ మోతాదుల లో తాగాలి.
* నీటిలో తడచిన బట్టను తల మీద వేసుకొని విశ్రాంతి తీసుకొన్న కొంత ఉపశమన ఉంటుంది.
* ఏ మాత్రము సందేహము వున్నా గర్బ నిరోధక మాత్రలు తీసుకోకూడదు. ఇతర కుటుంబ నియంత్రణ పద్దతులు పాటించాలి.
* కొందరు స్త్రీ ల లో మెనోపాజ్ వయస్సు రాగానే మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది.
* డాక్టరు ను సంప్రదించి మాత్రమే వైద్యం చేయించుకోవాలి.

పార్శ్వనొప్పికి బొటాక్స్‌
తలనొప్పుల్లో పార్శ్వనొప్పి (మైగ్రేన్‌) తీరే వేరు. మాటిమాటికీ వేధించి జీవితాన్నే అస్తవ్యస్తం చేసేస్తుంది. కాబట్టే దీనికి కొత్త చికిత్సలు అందుబాటులోకి రావాలని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ఎఫ్‌డీఐ ఇటీవల పెద్దవారిలో పార్శ్వనొప్పిని నివారించేందుకు బొటాక్స్‌ (బొటులినుమ్‌టాక్సినా) వాడకానికి అనుమతించింది. ఈ చికిత్సలో మున్ముందు తలనొప్పి రాకుండా బొటాక్స్‌ ఇంజెక్షన్లను 12 వారాలకు ఒకసారి తల, మెడ చుట్టూ ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి బొటాక్స్‌ను ముఖం మీది మడతల చికిత్సలో ఉపయోగిస్తుంటారు. అయితే దీనిని తీసుకున్నవారిలో విచిత్రంగా పార్శ్వనొప్పి లక్షణాలు కూడా తగ్గుముఖం పడుతుండటంతో ఈ కొత్త చికిత్స రూపుదిద్దుకుంది.



తలనొప్పికి చికిత్స :
  • తగినంత విశ్రాంతి తీసుకోవాలి ,
  • పారాసిటమాల్ + ఇబుఫ్రోఫెన్ కలిసిఉన్న మాత్రలు (Combiflam) ఒక మాత్ర ఉదయము , ఒకమాత్ర సాయంత్రముతీసుకోవాలి .
  • దైక్లోఫెనాక్ + పారసేతమాల్ కలిసిఉన్న మాత్రలు (Dipal-F) ఉదయము , సాయంత్రము తీసుకోవాలి
పై మాత్రలు భాదనివారనకే పనిజేస్తాయి , ఇలా మూడు రోజులు వాడినా తగ్గక పోతే డాక్టర్ని సంప్రదించాలి .


వేసవిలో తలనొప్పా?
వేసవిలో పెరిగే ఉష్ణోగ్రత కారణంగా కొందరికి విపరీతమైన తలనొప్పి వస్తుంటుంది. దీని నుంచి తప్పించుకోవటానికి ఏం చేయాలి?

* 3 లీటర్ల నీరు: ఒంట్లో నీటిశాతం తగ్గిపోకుండా చూసుకోవటం ప్రధానం. ఇందుకు రోజుకి 2-3 లీటర్ల నీరు తాగాలి. పండ్ల రసాలు, కొబ్బరినీరు వంటి వాటితోనూ డీహైడ్రేషన్‌ ఏర్పడకుండా చూసుకోవచ్చు. అయితే కెఫీన్‌ ఎక్కువగా ఉండే పానీయాల జోలికి వెళ్లకపోవటమే మంచిది.
* నియమిత వ్యాయామం: వేసవిలోనూ వ్యాయామాన్ని మానరాదు. అయితే వ్యాయామం చేసినపుడు చెమట ఎక్కువగా పడుతుంది కాబట్టి, డీ హైడ్రేషన్‌ ఏర్పడకుండా ఆ సమయంలో తగు మోతాదులో నీరు తాగటం మరవరాదు.
* మసాలాలకు దూరం: మసాలాలతో నిండిన ఆహారంతో తలనొప్పి మరింత పెరగొచ్చు. సాధ్యమైనంతవరకు మసాలాలు, నూనెతో చేసిన పదార్థాలకు దూరంగా ఉండటమే మేలు. అలాగే మరీ చల్లగా ఉండే ఐస్‌క్రీమ్‌ల వంటి వాటికి అలవడటానికి శరీరం కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి అలాంటివీ మానెయ్యాలి
  • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, February 27, 2010

నంజుపోక్కులు , Aphthus Ulcers,నోటిలో పొక్కులు





నంజు అంతే ... భోజనము చేసేటపుడు తినే రుచికరమైన కూర పదార్ధము ... సాధారణము గా కారము , మసాల తో తయారుచేసిన పదార్ధము . మరియొక అర్ధము ... ఒకరకమైన పౌష్టికాహార లోపమువల్ల కలిగే వ్యాధి ... ఉబ్బునంజు , కట్టే నంజు అని రెండురకాలు . ఇక్కడ నేను నన్జుపోక్కులగురించే వివరించడం జరిగినది .

నంజుపోక్కులు (OphthusUlcers) :- మనశరీరము లో చర్మము , మ్యూకస్ పొర కలిసేచోట , మ్యూకస్ పోరాపైనా ఏర్పడే పొక్కులు లాంటి పుండ్లు . ఇవి చాలా నొప్పిని కలుగజేస్తాయి . కారము , మసాలా , వగరు , పులుపు కూరలను తినడానికి చాలా భాధగా ఉటుంది . ఈ పోక్కులతో నోటిపూత (Stomatitis)కుడా ఒక్కొక్క సారి ఉండవచ్చును . ఇవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి . జనాభా లో సుమారు 10% వరకు దీని బారిన పడుతుంటారు . పురుషులు కంటే స్త్రీలలో ఎక్కువ . ఈ వ్యాధి ఉన్నవారు 30% - 40% కుటుంబ చరిత్ర (FamilyHistory) కలిగిఉంటారు .
  • రకాలు :
చిన్న రకము(MinorUlceratio) - వీటిలో పొక్కులు పరిమాణము ౩ మిల్లీమీటర్లు నుండి ౧౦ మి.మీ. వరకు ఉంటాయి. మ్యూకస్ పొర పైన పసుపు , బూడిద రంగులో ఉండి ఎక్కువగా పెదాలపైన ఉంటాయి .

పెద్ద రకము (MajorUlceration) - ఈ పొక్కులు ౧౦ మి.మీ కంటే ఎక్కువ పరిమాణము(Size) కలిఉంది కోపముగా ఉన్నట్లు ఎరుపు , బూడిద రానుగులలో ఉంటాయి . నొప్పి ఎక్కువ నోటిలో బుక్కలలోపల , పెదాలపైన ఉండి పెదాలు వాపును కలిగిస్తాయి . చిన్నపాటి జ్వరము వస్తుంది . ఉమ్మిని మిన్గాదానికు కుడా కష్టం గా ఉంటుంది . రోజువారి పనులు చేసుకోవడానికి చిరాకుగా ఉంటుంది .

మహమ్మారి నంజుపోక్కులు (HerpetiformUlceration)- ఇవి బాగా బాధ పెట్టే నంజుపోక్కులు . చిన్న చిన్న చాలా ఎక్కువ పొక్కులు , అల్సర్లు సుమారు 1 నుండి 3 మి.మీ. పరిమాణము కలిగి ఉంటాయి , ఇవి కొన్ని వైరల్ ఇంఫెక్సన్ అనగా హీర్పీస్ సిమ్ప్లెక్ష్ ని పోలిఉంటుంది .

  • నంజుపోక్కుల వ్యాధి లక్షణాలు :
ఇవి మొదట నోటిలో మంట , దురద ఉన్న చిన్న ప్రదేశం గా మొదలై ...పొక్కు గా తయారై పుండు గా మారుతోంది. పసుపు , ఎరుపు పోక్కుగా నొప్పు పెట్టే అల్సర్ గా మారి భాద పెడుతుంది . దవడ కింద గడవ బిళ్ళలు (LymphNodes) వాపు , నొప్పి ఉండును . ఏదీ తినడానికి వీలుపడదు ... మంట నొప్పి ఉండును . సుమారు ఒక నెల రోజులలో తగ్గిపోవును ... ఇవే మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాయి .
వీటి పుట్టుకకు సరియైన కారణము తెలియదు .

ఈ కింద కొన్ని కారణాలు ఈ వ్యాది రావడానికి దోహదపడతాయి.
  • నిమ్మ జాతికి చెందినా కొన్ని పండ్లు --- నిమ్మ , నారింజ మున్నగునవి ,
  • ఎక్కువ రోజులు చాలినంత నిద్ర లేకపోవడము ,
  • మ్యుకస్ పొరకు రఫ్ గా గాయము తగలడము ... బ్రష్ చేయడం లో ను , గట్టి పదార్దములు తినడంలోను ,
  • హార్మోనుల మార్పుల వలన ,
  • కొన్ని ఆహారపదార్ధాల వల్ల కలిగే అలెర్జీ ,
  • వ్యాదినిరోధక వ్యవస్థ లో కలిగే కొన్ని అవాంచిత మార్పులు (ImmuneSystemReactions),
  • విటమిన్ b12 , ఐరన్ , ఫోలిక్ ఆసిడ్ లోపము వల్ల ,
  • ఆవుపాల అలెర్జీ రియాక్షన్ వల్ల ,
  • మలబద్దకం , ఆహారపదార్ధాల లోపము , ఎలార్గీ ల వల్లా రావచును ,

చికిత్స(Treatment) :
  • నోటిలో పొక్కులు ఉన్నాపుడు వాటి ఏవిధమైన రాపిడి , వత్తిడి , దెబ్బలు తగలకుండా చూసుకోవాలి ,
  • ఏమైనా కట్టుడు పళ్ళు , దేన్చార్లు ఉన్నచో వాటిని తీసివేయాలి ,
  • ఏదైనా మంచి మౌత్ వాష్ .. ఉదా - TANTUM mouth wash , betaadin mouth wash , తో పుక్కలించాలి ,
  • బ12 , ఫోలిక్ ఆసిడ్ తో కూడుకున్న మల్తివిటమిన్లు వాడాలి ,(SupradynTab)రోజు ఒకటి , Folera 5 యం.జి. రోజు ఒకట తీసుకోవాలి ,
  • TESS mouth ఆయింట్మెంట్ పుల్లు పై రాయాలి ,
  • Sensodyne tooth paste తో బ్రుష్ చేసుకోవాలి ,
  • తేనే లేదా ఆవునేయ్యిని ఆ పొక్కుల మీద రాస్తే తగ్గుతాయి .
  • ఉసిరి ,చెక్క వేసిన తాంబూలము నమిలిన ఉపసయనం కలుగును ,

  • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, February 19, 2010

ఎత్తు ఎదిగేందుకు వ్యాయామము ,Exercises to increage height




ఎత్తుగా ఉంటే అందం గా ఉంటామన్న విషయం లో ఏ సందేహాలు అవసరం లేదు . ఎత్తువల్ల అందమే కాదు , మానసికం గా ప్రయోజనము లేకపోలేదు . పర్సనాలిటీ అందించే ఆత్మవిశ్వాసం తో విజయాలు సాధించే అవకాశం ఏర్పడుతుంది . ముఖ్యం గా ఎత్తుపెరగడం అనేది వంశపారంపర్యం గా వస్తుంది . మనిషి సాధన , వ్యాయామము , ఆసనాలు వేయడం వలన కొంత వరకు ఎత్తుపెరిగే అవకాసము లేకపోలేదు .

కొన్ని వ్యాయమ పద్దతులు కోసం -> ఇక్కడ క్లిక్ చేయండి .

  • ============================================

Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, February 2, 2010

ఐస్‌ థెరపీ, ice theraphy






మేని సౌందర్యాన్ని పెంపొందించడానికి... వేధించే మొటిమలను తొలగించడానికి... 'ఐస్‌ థెరపీ' మంచిదంటున్నారు సౌందర్యనిపుణులు.. అదెలానో చూద్దాం..

ఒక్కోసారి మొటిమలు, వాటి తాలూకు మచ్చలు అమ్మాయిలను తీవ్రంగా వేధిస్తుంటాయి. ఈ సమస్యకు ఐస్‌ ముక్కలతో చెక్‌ పెట్టవచ్చు. మొదట ఐస్‌ను శుభ్రమైన వస్త్రంలో తీసుకోవాలి. చుబుకం మీద వలయాకారంలో మెల్లిగా రుద్దుతూ పోవాలి. మద్యమధ్యలో కాసేపు విరామమిస్తూ నెమ్మదిగా ముఖమంతా అప్త్లె చేయాలి. మొటిమలున్న ప్రాంతంలో నెమ్మదిగా ఒత్తిపెడుతూ ఐస్‌ ఉంచాలి. ఇలా ఓ క్రమపద్ధతిలో చేస్తే కొన్ని రోజులకు మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. అంతే కాదండోయ్‌ చర్మానికి ఇది మంచి యాంటీఏజింగ్‌ కారకంలా పనిచేస్తుందని సూచిస్తున్నారు సౌందర్యనిపుణులు. ఐస్‌ను రుద్దడం వల్ల ముఖం శుభ్రపడి... కాంతిమంతంగా కనిపిస్తుంది.

ఒత్తిడికి ఉపశమనం.. ఒత్తిడితో తలనొప్పిగా ఉంటే ఐస్‌ను ముక్కలుగా చేసి వస్త్రంలో వేసి నుదురుమీద ఉంచాలి. కనురెప్పల మీదా కాసేపు ఉంచితే శరీరం, మనసు ఉత్తేజితమవుతాయి. ఈ ప్రక్రియనే 'ఐస్‌ థెరపీ' అంటారు. అయితే పదిహేను నిమిషాలకంటే ఎక్కువ సేపు ఈ థెరపీని చేయకూడదు. ముఖం పొడి బారాక తడి తువాలుతో సున్నితంగా తుడవాలి. రాత్రి పడుకోవడానికి ముందు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

రుతుక్రమము లో కడుపు నొప్పి తగ్గదానికి ఐస్ తో పొత్తికడుపు ఒత్తాలి . నివారణ అవుతుంది .

ఐస్‌ సిద్ధమిలా.. సౌందర్య పోషణలో వాడే ఐస్‌ను ప్రత్యేకంగా తయారుచేసుకుంటే మేలు. ఇందుకోసం శుభ్రమైన ఓ మోస్తరు స్టీలుగిన్నె తీసుకోవాలి. దాన్నిండా నీరు నింపి ఫ్రిజ్‌లో పెట్టండి. స్టీలుపాత్రలో తీసిన ఐస్‌ పెద్దగా ఉంటుంది కాబట్టి తొందరగా కరిగిపోయే సమస్య ఉండదు. గిన్నెలో ఉన్న ఐస్‌ను ట్యాప్‌కింద పెట్టి తొలగించి ఓ సారి శుభ్రం చేసిన తర్వాత ఉపయోగించడం మేలు. ఇలా శుభ్రపరిచిన ఐస్‌ను చిన్న ముక్కలుగా వాడాలి. ఐస్‌ను నేరుగా ముఖం మీద రుద్దితే చర్మం కంది ఎర్రగా అయ్యే ప్రమాదం ఉంది. దూదిలోగానీ, మెత్తని వస్త్రంలోగానీ ఉంచి రుద్దాలి.


  • ==============================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

నడక వ్యాయామము , Walking as Exercise





వ్యాయామంలో భాగంగా నడక.. శరీరానికెంతో మేలు చేస్తుంది. అయితే.. యథాలాపంగా కాకుండా.. నడకపైనే దృష్టి కేంద్రీకరించగలిగితే... మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు అధ్యయనకర్తలు.

ఉదయం పూట చాలామంది మార్నింగ్ వాక్ అంటూ తమదైన శైలిలో తిరిగేస్తుంటారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు వాకింగ్ చేయడం ఎంతో లాభదాయకం, కాని కొన్ని నియమాలు పాటిస్తుంటే మరింత ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

నిపుణుల ప్రకారం, ఆరోగ్యం కోసం నడక అత్యంత సులువైన వ్యాయామ మార్గం. కెలొరీలు ఖర్చవడమే కాదు.. మానసిక సాంత్వనా లభిస్తుంది. ఇదంతా మామూలుగా రోజూ కాసేపు నడవడం వల్ల కలిగే లాభం. ఇదే నడకకు... ధ్యానాన్ని జత చేయగలిగితే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఒత్తిడి దూరం అవుతుంది. శరీరానికి సాంత్వన లభిస్తుంది. 'విపాసన నడకగా' పరిగణించే ఈ విధానం వందల ఏళ్లుగా ఆచరణలో ఉన్నదే. తలకాస్త పైకెత్తి... కళ్లు మాత్రం నేలపైనే ఉంచి... ఒక్కో అడుగును గమనించుకుంటూ సాగడమే 'విపాసన నడక' .

ప్రస్తుత యాంత్రిక జీవన విధానం గమనిస్తే.. పూర్తిగా హడావుడే. ఒకే సమయంలో ఎన్నోరకాల పనులు. దాని వల్ల చెప్పలేనంత ఒత్తిడి. ప్రశాంతతతో పాటు.. ఆరోగ్యం సొంతం కావాలంటే.. ఈ తరహా విధానం సరైన ఆలోచన. దీనిపై హార్వర్డ్‌కు చెందిన మైండ్‌బాడీ మెడికల్‌ఇనిస్టిట్యూట్‌ నిర్వహించిన అధ్యయనమూ ఇంచుమించు ఈ విషయాలనే తెలిపింది.

ధ్యానంతో కూడిన నడకతో ఒత్తిడి, కంగారు దూరమవుతాయి. మనసుకి లభించే సాంత్వన దీర్ఘకాలం ఉంటుంది. అధిక రక్తపోటు అదుపులో ఉండటం... శ్వాస సంబంధిత సమస్యలు, దీర్ఘకాల నొప్పులుతగ్గడం... సంతాన సాఫల్యం వృద్ధి చెందడం.. లాంటి మరిన్ని ప్రయోజనాలూ సిద్ధిస్తాయి. చేస్తున్న పనిపై ఏకాగ్రతా పెరుగుతుంది. నిటారైన ఆకృతి... కండరాల దృఢత్వం... భుజాలు, కాళ్లకు విశ్రాంతి.. లభిస్తాయి.



ఆరోగ్యంగా ఉండాలంటే మార్నింగ్ వాక్ ఎంతో ఉపయోగకరమైంది, సులభతరమైనదీను. ఉదయం నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని నడక ప్రారంభించడం ఎంతో ఉత్తమం. ఎందుకంటే ఉదయంపూట స్వచ్ఛమైన వాతావరణం ఉంటుంది. సూర్యోదయపు నులివెచ్చటి కిరణాలు శరీరానికి తగులుతుంటే ఆహ్లాదంగా ఉంటుంది.


లాభాలుః

* ప్రతి రోజు క్రమం తప్పకుండా మార్నింగ్ వాక్ చేస్తుంటే శరీరంలోని కండరాలు బలిష్టంగా తయారవుతాయి. శరీరంలో పేరుకుపోయిన పనికిరాని కొవ్వు కరిగిపోతుంది. ఎంత ఎక్కువగా నడక సాగిస్తుంటే అంత ఎక్కువగా శరీరంలోని క్యాలరీలు కరిగి, ఊబకాయం తగ్గుతుంది.


* ప్రాతఃకాలంలో వచ్చే స్వచ్ఛమైన గాలి ఊపిరితిత్తుల్లో రక్తాన్ని శుభ్రపరిచేందుకు దోహదపడుతుంది. దీంతో శరీరంలో ఆక్సీహిమోగ్లోబిన్ తయారవుతుంది. శరీరంలో ఆక్సీహిమోగ్లోబిన్ తయారవ్వడం వలన రక్తనాళాలకు స్వచ్ఛమైన ప్రాణవాయువు లభిస్తుంది.

* గుండె, రక్తపోటు, మధుమేహం తదితర రోగులు ఉదయంపూట నడవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

* ఉదయంపూట నడవడం వలన ఎముకలు పటిష్టంగా తయారవుతాయి.

* మార్నింగ్ వాక్ చేయడం వలన శారీరక, మానసకిపరమైన ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉంటారు.

* ప్రతి రోజు కనీసం మూడు కిలోమీటర్ల మేరకు నడవాలి. వారానికి ఐదు రోజులపాటు ఖచ్చితంగా నడిస్తే మరీ బాగుంటుంది.


గుర్తుంచుకోవాల్సిన విషయాలుః

* మార్నింగ్ వాక్ చేసే సమయంలో సౌకర్యవంతమైన చెప్పులు ధరించండి.

* ప్రశాంతమైన వాతావరణంలో నడవండి. చుట్టూ తోట, ఉద్యానవనం లేదా ఖాళీ స్థలం ఉన్న ప్రాంతాల్లో నడిచేందుకు ప్రయత్నించండి.

* నడిచే సమయంలో తేలికపాటి శ్వాస దీర్ఘంగా తీసుకునేందుకు ప్రయత్నించండి. మనసులో ఎలాంటి ఆలోచనలకు తావీయకండి.

* శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించుకునేందుకు తగు మోతాదులో నీటిని సేవిస్తుండండి. మార్నింగ్ వాక్ చేసే ముందు, తర్వాత ఒక గ్లాసు నీటిని తప్పకుండా సేవించండి.

* మార్నింగ్ వాక్ చేసే సందర్భంలో ఎలాంటి ఒత్తిడికి గురికాకండి.

* నడిచే సమయంలో మీ చేతులను చక్కగా నిటారుగా ఉంచి క్రమంగా వెనకకు, ముందుకు కదిలిస్తూ నడవండి. దీంతో చేతులకు మంచి వ్యాయామం కలుగుతుంది.

* గుండె జబ్బులున్నవారు, రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారు లేదా ఇతర జబ్బులతో సతమతమౌతున్నవారు వాకింగ్ చేయాలంటే వైద్యుల సలహా తీసుకోవాల్సివుంటుంది.

* ప్రతి వ్యక్తి తమ తమ వయసుకు తగ్గట్టు, వారి సామర్థ్యం మేరకు నడవాల్సివుంటుంది.

* నడకసాగించే ముందు, నడక ముగించే ముందు మీ నడక వేగాన్ని నియంత్రించుకోండి. అలాగే ఉదయం అల్పాహారం తీసుకోవడం మరవవద్దు.

ప్రస్తుతం ఉరుకులపరుగులమయమైన జీవితంలో కనీసం 20-25 నిమిషాలను మీ ఆరోగ్యం కోసం కేటాయించుకోండి. కాలుష్య రహిత వాతావరణంలో ఉదయంపూట స్వచ్ఛమైన గాలిని మీ శరీరానికి అందించండి.


విశిష్ట వ్యాయామం నడక,Power walking

ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపటానికి చేపట్టే వ్యాయామ ప్రక్రియల్లో నడక ఒక విశిష్టమైన ప్రక్రియ. దీనిని మన శరీర స్థితిగతులనుబట్టి అనేక విధాలుగా నిర్వహించి, ఆశించిన ఫలితాలను పొందవచ్చు. నడకకు చెందిన ప్రక్రియల్లో పవర్‌ వాకింగ్‌ అనే పద్ధతిని ఒక ప్రత్యేక ప్రక్రియగా పేర్కొనవచ్చు. పవర్‌ వాకింగ్‌ వలన శరీరంలో నడుము పైభాగంలోని కండర సముదాయాలకు ఎయిరోబిక్‌ ప్రక్రియల సౌలభ్యం కలుగుతుంది.


ఒక వ్యక్తి పరుగు పెట్టే ప్రక్రియలు నిర్వహించిన ప్పుడు వినిమయమయ్యే కేలరీల శక్తికి సమానంగా పవర్‌ వాకింగ్‌లో శక్తి వినియోగమవుతుంది. మరొక ముఖ్యమైన అంశమేమిటంటే పవర్‌ వాకింగ్‌ను పరుగు ప్రక్రియ కంటే తేలికగా నిర్వహించవచ్చు.
అతిజోరుగాసాగే నడక కంటే పవర్‌ వాకింగ్‌లో అత్యధిక పరిమాణంలో కండరాలు వ్యాయామ ప్రక్రియలకు గురవుతాయి. తద్వారా కేలరీల వినిమయ శక్తి కూడా అధికంగానే ఉంటుంది.

పవర్‌ వాకింగ్‌ చేసే వ్యక్తులు 12 నిముషాల్లో ఒక మైలు దూరాన్ని అంటే 1.6 కిలోమీటర్ల దూరాన్ని నడ వగల సామర్థ్యం కలిగి ఉంటారు. సాధారణంగా ఈ సామర్థ్యాన్ని ఒక వారం రోజుల్లో సాధించవచ్చు.

పవర్‌ వాకింగ్‌కు సూచనలు
నడిచేప్పుడు శరీరాన్ని నిటారుగా ఉంచాలి. నడు స్తున్నప్పుడు సూటిగా 20 అడుగుల దూరం వరకూ చూస్తూ నడక కొనసాగించాలి. అంతేకాని, కిందకు, ప్రక్కలకు చూస్తూనడువరాదు. గడ్డం భాగం నిటారుగా ఉండటం, తల నిటారుగా ఉండటం అవసరం. భుజాలు రెండూ సరి సమానంగా ఎగుడు దిగుడు లేకుండా ఉండాలి. వీపు భాగం నిటారుగా, వదులుగా ఉండాలి. వీపు భాగంలోని కండరాలను బిగబట్టి నడువకూడదు.

ఛాతి భాగం నిటారుగా సాగి ఉండాలి. పిరుదులు, నడుముభాగం బిగబట్టి గట్టిగా ఉంచుతూ నడక కొనసాగించాలి. వెనుక నడుము భాగాన్ని సమంగా ఉంచి, పొత్తి కడుపు చుట్టూ ఉండే కండరాలను కొంచెం ముందుకు వంచి నడకను సాగించాలి. నడిచేప్పుడు భూమి మీద ఒక గీతను ఊహించుకుని, ఆ గీతపై తిన్నగా నడుస్తున్నట్లు ఉండాలి.

చేతులను 90 డిగ్రీల కంటే తక్కువగా వంచుతూ, వదులుగా పిడికిలి బిగించి నడవాలి. చేతులను ముందుకు వెనుకకు నిటారుగా ఊపుతూ నడవాలి. మోచేయి ఛెస్ట్‌ బోన్‌ను దాటి పైకి రాకూడదు. నడిచే ప్పుడు చేతులనుముందుకు, వెనుకకు వేగంగా ఊపడం వలన పాదాలు దానికి అనుగుణంగా సాగుతాయి.

అడుగులు వేసేప్పుడు ముందు కాలి మడమను భూమిని తాకించి, తరువాత పాదం ముందు భాగం భూమిని తాకేలా వేయాలి.
అడుగులను దూరదూరంగా వేస్తూ నడక సాగించి, త్వరగా ముగించాలనే ఆలోచనను మనస్సులోనికి రానీయకూడదు. వేగంగా నడకను కొనసాగించడానికి చిన్న చిన్న అడుగులను ఎక్కువగా వేయడం మంచిది.

ఊపిరిని మామూలు స్థాయిలోనే తీసుకోవాలి. బాగా అలసిపోయేంత తీవ్రస్థాయిలో వ్యాయామం చేయకూ డదు. ఈ ప్రక్రియ చేపట్టే సమయంలో చేతుల్లో ఎలాంటి బరువులు ఉండకూడదు. ఈ జాగ్రత్తలను పాటిస్తే పవర్‌ వాకింగ్‌ వలన ఆశించిన ఫలితాలను సాధించడం ఎంతో సులభమవుతుంది.

నడక మెలకువలు :
ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి వ్యాయమం ఎంతో చక్కని మార్గం. ఇందుకు పెద్దగా ఖర్చు కూడా కాదు. ముఖ్యంగా నడక అందరూ చేయదగిన మంచి వ్యాయామం. దీంతో ఎన్నో లాభాలున్నాయి. దీనికి కావలసిందల్లా..
1. పొద్దున్నే నడవాలనే దృఢ నిశ్చయం. ఇది చాలా ముఖ్యమైంది.
2. తేలికపాటి కాన్వాస్‌ బూట్లు
3. టీ షర్టు, పొట్టి నిక్కరు. మామూలు దుస్తులతోనూ చేయొచ్చు.

ఆరంభించేముందు..
నడక ఆరంభించటానికి ముందు 45 ఏళ్లు పైబడినవారిలో.. నడిస్తే ఆయాసం రావటం, ఛాతీనొప్పి వంటివి ఉంటే ముందుగా వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవటం మంచిది. ఇక 45 లోపు వారికి ఎలాంటి పరీక్షలు అవసరం లేకుండా నడక ఆరంభించొచ్చు.
  •  


లాభాలేంటి?
1. గుండె సమర్థవంతంగా పనిచేస్తుంది.
2. గుండెపోటు బారినపడకుండా చూస్తుంది.
3. రక్తపోటు తగ్గుతుంది.
4. రక్తంలో మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) తగ్గుతుంది.
5. రక్తంలో చక్కెర శాతం తగ్గుతుంది. వ్యాధి తేలికగా అదుపులోకి వస్తుంది.
6. శరీర బరువు తగ్గుతుంది.
7. కుంగుబాటు (డిప్రెషన్‌), ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి.
8. హాయిగా నిద్రపడుతుంది.
9. వ్యాయామం వల్ల పెద్దపేగు క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌ వంటివి వచ్చే అవకాశాలు తక్కువని శాస్త్రీయ అధ్యయనాల్లో తేలింది.
10. అన్నింటికన్నా ముఖ్యంగా ఆత్మ విశ్వాసం, శారీరక సామర్థ్యం పెరుగుతుంది.
11. కీళ్లనొప్పులు లేకుండా, ఎముకలు దృఢంగా ఉంటాయి.
12. నీరసం, అలసట, నిస్సత్తువ, నిస్పృహ తగ్గుతాయి.

కొన్ని జాగ్రత్తలు
50 ఏళ్ల వ్యక్తి గుండె ఒక నిమిషంలో 170 సార్ల వరకు శ్రమ లేకుండా కొట్టుకోగలదు .

2. లక్షిత గుండె వేగం
గరిష్ఠ గుండె వేగంలో 50% నుంచి 75% వరకు గుండె కొట్టుకునేలా వ్యాయామం చేయాలి. ఉదాహరణకు 50 ఏళ్ల వ్యక్తి గరిష్ఠ గుండె వేగం 170 కాబట్టి అందులో 50-75 శాతం అంటే.. 85 నుంచి 125 సార్ల వరకు గుండె కొట్టుకునేలా వ్యాయామం చేయాలన్నమాట.

3. ఎలా చూడాలి?
మణికట్టు వద్ద బొటనవేలు దిగువన వేళ్లతో నొక్కి పట్టి చూస్తే నాడీ ద్వారా గుండె కొట్టుకునే వేగం తెలుస్తుంది.
* నడిచేటప్పుడు పక్కవారితో సునాయాసంగా మాట్లాడగలుగుతుంటే మనం అంత తీవ్రంగా వ్యాయామం చేయటం లేదని, వేగం మరికాస్త పెంచవచ్చని గుర్తించాలి.

అతి ముఖ్యమైన విషయం
* ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొద్దునే నడవటం వల్ల ఎంతో లాభం ఉంటుంది. చాలామంది కొద్దిరోజులు నడక సాగించి మానేస్తుంటారు. మరికొందరు రెండు మూడు రోజులు నడిచి తర్వాత విరామం తీసుకుంటూ ఉంటారు. కొందరు బరువు తగ్గాలనే ఆలోచనతో కొద్దిరోజుల పాటు వేగంగా నడుస్తుంటారు. ఇలా చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. రెండు మూడు రోజులు హడావిడిగా చాలా ఎక్కువ శ్రమపడి మానివేయటం కన్నా కొంచెం సేపైనా రోజూ నడవటం మంచిది.

ఎలా నడవాలి?
* ముందు 5 నిమిషాల సేపు నెమ్మదిగా నడవాలి. దీంతో శరీరం నడకకు అనుకూలంగా సిద్ధమవుతుంది. అనంతరం 30 నిమిషాల సేపు వేగంగా నడవాలి. నడకలో వేగం వల్ల ఆయాసం వంటివి రాకుండా చూసుకోవాలి. వేగంగా నడచిన తర్వాత వెంటనే ఒకేసారి ముగించకూడదు. నెమ్మదిగా వేగం తగ్గించుకుంటూ రావాలి. అలా 5 నిమిషాల సేపు నడిచిన తర్వాత నడకను ఆపేయాలి.

హెచ్చరికలు
* నడుస్తున్నప్పుడు గుండెలో నొప్పి, ఆయాసం, అతిగా చెమట పట్టటం, అతి నీరసం, అలసట, కళ్లు తిరగటం, తూలి పోవటం, పక్కల్లో నొప్పి.. ఇలాంటి లక్షణాలు కనబడితే వెంటనే వ్యాయామాన్ని ఆపేసి వైద్యుడిని సంప్రదించాలి. అశ్రద్ధ పనికిరాదు.


    రోజూ వ్యాయామం చేయాలనుకునే వారు పరుగెత్తడమో, ట్రెడ్‌మిల్‌ మీద నడవడమో చేస్తారు. అయితే దానికి ముందూ పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి.

పరుగెత్తడాన్ని వ్యాయామంగా ఎంచుకోవాలనుకునే వారు ముందుగా వైద్యుల్ని సంప్రదించాలి. నలభై ఏళ్లు దాటిన వారూ, స్థూలకాయులూ, కొన్ని రకాల అనారోగ్యాలతో కొన్నేళ్లపాటు వ్యాయామం చేయని వారూ ఈ జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకేసారి వేగంగా పరుగెత్తకూడదు. ముందు శరీరాన్నంతా వేగంగా కదిలిస్తూ కనీసం అరగంట నడవాలి. అలా ఒకటి రెండు నెలలు గడిచాక నెమ్మదిగా పరుగెత్తాలి. అప్పుడు కూడా మధ్యమధ్య నడవడం చాలా అవసరం. పరుగెత్తే ముందు తప్పనిసరిగా వార్మప్‌, స్ట్రెచింగ్‌ వ్యాయామాల్లాంటివి అవసరం. పరుగెత్తి వచ్చాక కూడా కొన్ని నిమిషాలు విశ్రాంతి తీసుకుని తరవాత ఒకసారి స్ట్రెచింగ్‌ వ్యాయామాలు చేసి అప్పుడు మిగిలిన పనుల్లో పడాలి.

వెంట ఓ మంచినీళ్ల సీసా తీసుకెళ్లడం తప్పనిసరి. దాహం వేసినప్పుడల్లా మరీ ఎక్కువగా కాదు కానీ కొద్దిగా నీళ్లు తాగితే మంచిది. వారంలో కనీసం రెండు రోజులు ఎలాంటి పరుగు లేదా నడక లేకుండా విశ్రాంతి తీసుకోవడం వల్ల అలసట అనేది ఉండదు. రోడ్లపై కాకుండా ఖాళీగా ఉన్న మైదానాల్లో పరుగెత్తాలి. దానివల్ల వాహనాల కాలుష్యం బారిన పడకుండా ఉండొచ్చు. ఎప్పుడుపడితే అప్పుడు కాకుండా మరీ పొద్దున, లేదంటే సాయంత్రం చల్లబడ్డాక పరుగెత్తడం మంచిది. సాధ్యమైనంత వరకూ వదులుగా ఉన్న దుస్తుల్ని ఎంచుకోవాలి. దానివల్ల చెమట పట్టినా ఎలాంటి అసౌకర్యం ఉండదు. సౌకర్యంగా ఉన్న బూట్లను ఎంచుకోవడం కూడా చాలా అవసరం.
  • ===================================================

Visit my website - > Dr.Seshagirirao.com/